multistarrer movie
-
మల్టీస్టారర్ ప్లాన్ చేస్తోన్న బాలీవుడ్ బడా నిర్మాత..?
-
అల్లు అర్జున్ - రామ్ చరణ్ కాంబోలో భారీ బడ్జెట్ తో మల్టీ స్టారర్ మూవీ..?
-
మల్టీస్టారర్ కి అడ్డాగా కోలీవుడ్..
-
ప్రభాస్ జూ ఎన్టీఆర్ మల్టీ స్టారర్ మూవీ !?
-
స్టార్ హీరోయిన్లు ఒకే సినిమాలో.. పెద్ద ప్లానింగే!
మల్టీస్టారర్ సినిమాలంటే ఎక్కువగా హీరోలే చేస్తుంటారు. కానీ జస్ట్ ఫర్ ఏ చేంజ్... హిందీలో ఉమెన్ మల్టీస్టారర్ ఫిలింస్ తెరకెక్కుతున్నాయి. 2018లో వచ్చిన లేడీ మల్టీస్టారర్ ఫిల్మ్ ‘వీరే ది వెడ్డింగ్’ రూ. వంద కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. ఆ తర్వాత కథానాయిక ప్రాధాన్యంగా సాగే మల్టీ లేడీ స్టారర్ (ఒకే సినిమాలో ఎక్కువమంది కథానాయికలు నటించడం) చిత్రాలు పెద్దగా రాలేదు. ఇప్పుడు ఆ తరహా చిత్రాలు కొన్ని రూపొంతున్నాయి. ఆ ‘మల్టీ లేడీ స్టారర్’ చిత్రాల గురించి తెలుసుకుందాం. జర ఆలస్యంగా జీ లే జరా బాలీవుడ్ అగ్ర తారలు ప్రియాంకా చోప్రా కత్రినా కైప్, ఆలియా భట్ కలిసి రోడ్ ట్రిప్ బ్యాక్‌డ్రాప్‌లో ‘జీ లే జరా’ అనే సినిమాలో నటించనున్నారు. 2021లోనే దర్శకుడు ఫర్హాన్ అక్తర్ ఈ సినిమాను ప్రకటించినా ఇంకా సెట్స్‌పైకి వెళ్లలేదు. ఈలోపు హాలీవుడ్ కమిట్ మెంట్స్ కారణంగా ‘జీ లే జరా’ చిత్రం నుంచి ప్రియాంకా చో్ప్రా కాల్షీట్స్ సర్దుబాటు చేయలేక కత్రినా కైఫ్ తప్పుకున్నారనే టాక్ వినిపించింది. ఓ దశలో ఈ సినిమా క్యాన్సిల్ అయిందనే ప్రచారం కూడా జరిగింది. అయితే ‘జీ లే జరా’ చిత్రం ఉందని, వచ్చే ఏడాది ఈ సినిమాను సెట్స్‌పైకి తీసుకుని వెళ్తామని ఈ చిత్రనిర్మాతల్లో ఒకరైన రీమా కగ్తి ఇటీవల పేర్కొన్నారు. జోయా అక్తర్ ఈ సినిమాకు మరో నిర్మాత. కాగా ఇటీవల రణ్వీర్ సింగ్ హీరోగా ‘డాన్ 3’ని ప్రకటించారు ఫర్హాన్ అక్తర్. సో.. ఈ సినిమా షూటింగ్ ఓ కొలిక్కి వచ్చిన తర్వాత జర ఆలస్యంగా ‘జీ లే జరా’ చిత్రం సెట్స్‌పైకి వెళ్తుందనే టాక్ వినిపిస్తోంది. ఆకాశంలో... కరీనా కపూర్, టబు, కృతీ సనన్ ఎయిర్‌లైన్ ఇండస్ట్రీలో ఉద్యోగాలు చేస్తున్నారు. ఈ బ్యూటీలు ఈ డ్యూటీ చేస్తున్నది ‘ది క్రూ’ సినిమా కోసం. రాజేష్ క్రిష్ణన్ దర్శకత్వం వహిస్తున్నారు. ముంబై, అబుదాబి లొకేషన్స్‌లో ఈ సినిమా షూటింగ్ జరుగుతోంది. ఎయిర్ లైన్స్ ఇండస్ట్రీలో ఉద్యోగాలు చేస్తున్న ముగ్గురు మహిళల జీవితాలు ఊహించని ఘటనల కారణంగా ఏ విధంగా ప్రభావితం అయ్యాయి? అన్నదే ఈ చిత్రకథ. ఈ సినిమా వచ్చే ఏడాది మార్చిలో రిలీజ్ కానుంది. అన్వేషణ విభిన్నమైన మనస్తత్వాలు, వయసు రీత్యా వ్యత్యాసం ఉన్న నలుగురు మహిళలు బైక్‌పై రోడ్ ట్రిప్ చేసి, ఆ అనుభవాలతో తమ జీవితాలను తాము కొత్తగా ఏ విధంగా మార్చుకున్నారు? అనే కథాంశంతో రూ΄÷ందుతున్న చిత్రం ‘ధక్ ధక్’. ఫాతిమా సనా షేక్, రత్నా ΄ాతక్, సంజన, దియా మీర్జా లీడ్ రోల్స్ చేస్తున్నారు. తరుణ్ డుడేజా దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రానికి తాప్సీ ఓ నిర్మాత. ‘ధక్ ధక్’ వచ్చే ఏడాది విడుదల కానుంది. రైజ్.. రెబల్.. రిపీట్ భూమి పెడ్నేకర్, షెహనాజ్ గిల్, డాలీ సింగ్, కుషా కపిల, షిబానీ బేడీ వంటి తారలు లీడ్ రోల్స్ చేసిన చిత్రం ‘థ్యాంక్యూ ఫర్ కమింగ్’.. ‘రైజ్.. రెబల్.. రిపీట్’ అనేది ఈ సినిమాకు ఉపశీర్షిక. కరణ్ బూలానీఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. 30 ఏళ్లు దాటిన ఓ అమ్మాయి వివాహం చేసుకోదు. దీంతో జీవితంలో ఏదో కోల్పోయిన భావన. తన ఫ్రెండ్స్‌ను కలవాలనుకుంటుంది. స్నేహితులు ఓ ΄ార్టీని ΄్లాన్ చేస్తారు. ఈ క్రమంలో ఎటువంటి ఘటనలు చోటు చేసుకున్నాయి? అనే నేపథ్యంలో ఈ సినిమా కథనం సాగుతుందని బాలీవుడ్ టాక్. అక్టోబరులో ఈ సినిమా విడుదల కానుంది. అలాగే ‘టొరంటో ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్– 2023’లో ‘థ్యాంక్యూ ఫర్ కమింగ్’ చిత్రం ప్రదర్శనకు ఎంపికైందని, టీమ్ అంతా సంతోషంగా ఉన్నామని ఈ చిత్రనిర్మాతల్లో ఒకరైన రేఖా కపూర్ పేర్కొన్నారు. లేడీ మల్టీస్టారర్ ట్రెండ్ వెబ్ సిరీస్‌లోనూ కనిపిస్తోంది. బాలీవుడ్ అగ్రదర్శకుల్లో ఒకరైన సంజయ్ లీలా భన్సాలీ తెరెకెక్కిస్తున్న తాజా సిరీస్ ‘హీరా మండి’. మనీషా కోయిరాల, అదితీరావ్ హైదరి, సోనాక్షీ సిన్హా, రీచా చద్దా, షర్మిన్ సెగల్, సంజీదా షేక్‌లు లీడ్ రోల్స్ చేశారు. ప్రేమ, ద్రోహం, వారసత్వం, రాజకీయం వంటి అంశాలతో రూ΄÷ందిన ఈæ సిరీస్ 1940 బ్యాక్‌డ్రాప్‌లో సాగుతుంది. హీరా మండి ్ర΄ాంతంలోని వేశ్యల జీవితాల నేపథ్యంలో ఈ సిరీస్ తెరకెక్కింది. త్వరలో ఈ సిరీస్ స్ట్రీమింగ్ కానుంది. -
మరో మాస్ కాంబినేషన్
-
సూర్య నెక్స్ట్ సినిమాలో గెస్ట్‌గా ప్రభాస్?
-
పాన్ వరల్డ్ సినిమా...సూర్య, ప్రభాస్ కాంబో ఆన్ సెట్స్
-
నాగార్జున, అల్లరి నరేష్ మల్టీస్టారర్ మూవీ.. లేటెస్ట్ అప్డేట్
-
చిరు, బాలయ్య మల్టీస్టారర్..?
-
మెగా- అల్లు ఫ్యాన్స్‌కి అదిరిపోయే అప్డేట్ ఇచ్చిన అల్లు అరవింద్
టాలీవుడ్ బడా నిర్మాతల్లో అల్లు అరవింద్ ముందు వరసలో ఉంటారు. గీతా ఆర్ట్స్ బ్యానర్లో ఆయన ఎన్నో బ్లాక్‌బస్టర్, హిట్ చిత్రాలను నిర్మించారు. గీతా ఆర్ట్స్ బ్యానర్లో సినిమా రిలీజ్ అంటే ఆ హీరోల పంట పండినట్టే. అలా నిర్మాతగా అల్లు అరవింద్ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారు. సక్సెస్ ఫుల్ నిర్మాతగా రాణిస్తున్న ఆయన తాజాగా ఓ టీవీ షోలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మెగా- అల్లు ఫ్యాన్స్‌కు అదిరిపోయే అప్డేట్ ఇచ్చారు. ఈ మేరకు ఆయన మాట్లాడుతూ.. పుష్ప మూవీ తనకు, తన కుమారుడు అల్లు అర్జున్ మైల్ స్టోన్ అన్నారు. చదవండి: పూరీకి ఆ విషయం తెలియకుండా మేనేజ్ చేశా: సత్యదేవ్ పుష్ప మూవీతో బన్నీ జాతీయ స్థాయిగా గుర్తింపు తెచ్చుకోవడం చాలా తృప్తిగా ఉందన్నారు. ‘మా గీతా ఆర్ట్స్ బ్యానర్లో ఎక్కువగా సినిమాలు తీసిందని మెగాస్టార్ చిరంజీవి గారే. మా బ్యానర్లో ఆయన తీసిన సినిమాలన్ని దాదాపుగా హిట్ అయ్యాయి. ఇక నిర్మాతగా నా జీవితంలో అద్భుతమైన సినిమా తీశాను అనే సంతృప్తి మగధీరతో వచ్చింది. ఈ సినిమాకు మేం పెట్టిన బడ్జెట్ కంటే మూడింతలు లాభం వచ్చింది. మొదట ఈ సినిమాకు అనుకున్న బడ్జెట్ కంటే 80 శాతం ఎక్కువ బడ్జెట్ పెట్టాల్సి వచ్చింది. దీంతో చాలా భయపడ్డాను. ఇక ఎడిటింగ్, గ్రాఫిక్స్ వర్క్ పూర్తయ్యాక సినిమా చూస్తే ఫుల్ కాన్ఫిడెన్స్ వచ్చింది. చదవండి: విడాకులు రద్దు? కొత్త ఇంటికి మారనున్న ధనుశ్-ఐశ్వర్యలు! వెంటనే డిస్ట్రిబ్యూటర్స్‌కు ఫోన్ చేసి సినిమా మొత్తం మనమే విడుదల చేస్తున్నాం అని చెప్పా. దీంతో వాళ్లంత షాక్ అయ్యారు’ అని చెప్పుకొచ్చారు. ఆ తర్వాత మాట్లాడుతూ.. చరణ్- బన్ని కాంబినేషన్లో ఓ మల్టీస్టారర్ చేయాలనేదని తన కోరిక అని వారిద్దరి కాంబోలో వచ్చే చిత్రం కోసం చరణ్- అర్జున్ అనే టైటిల్‌ను పదేళ్ల క్రితమే అనుకున్నానని తెలిపారు. అయితే ఈ మల్టిస్టారర్ కోసం కథలు వింటున్నారా అని అడగ్గా.. ఇంకా లేదని సమాధానం ఇచ్చారు. ఎప్పటికైనా తన కల నెరవేర్చుకుంటానని, వీరిద్దరితో కలిసి ఓ సినిమా చేస్తానని అల్లు అరవింద్ వ్యాఖ్యానించారు. కాగా ప్రస్తుతం బన్నీ పుష్ప 2తో బిజీగా ఉండగా, చరణ్ శంకర్ సినిమా షూటింగ్లో పాల్గొంటున్నాడు. -
మల్టీ హంగామా.. ఆ సినిమాలపై ఓ లుక్ వేయండి!
ఈ ఏడాది మల్టీస్టారర్ ట్రెండ్ తెలుగులో బాగా కనిపించింది. ‘ఆర్ఆర్ఆర్’, ‘భీమ్లానాయక్’, ‘బంగార్రాజు, ‘ఆచార్య’ వంటి మల్టీస్టారర్ సినిమాలు వచ్చాయి. ఇద్దరు స్టార్ హీరోలు కనిపించిన ఈ ‘మల్టీ హంగామా’లను ప్రేక్షకులు బాగా ఎంజాయ్ చేశారు. వచ్చే ఏడాది మరికొన్ని మల్టీస్టారర్ ఫిల్మ్స్ రానున్నాయి. ప్రస్తుతం సెట్స్‌లో ఉన్న ఆ సినిమాలపై ఓ లుక్ వేయండి. దాదాపు ఇరవైరెండు సంవత్సరాల తర్వాత హీరో చిరంజీవి, రవితేజ స్క్రీన్ షేర్ చేసుకుంటున్నారు. కేఎస్ రవీంద్ర (బాబీ) దర్శకత్వంలో రూపొందుతున్న ‘వాల్తేరు వీరయ్య’ (ప్రచారంలో ఉన్న టైటిల్) సినిమాలోనే స్క్రీన్ షేర్ చేసుకుంటున్నారు చిరంజీవి, రవితేజ. ఇంతకుముందు ఈ ఇద్దరూ కలిసి ‘అన్నయ్య’ (2000) సినిమా చేశారు. ఆ చిత్రంలో చిరంజీవి తమ్ముడు పాత్ర చేశారు రవితేజ. ఇప్పుడు వాల్తేరు వీరయ్య’ చిత్రంలో కూడా చిరంజీవి, రవితేజ బ్రదర్స్‌గానే కనిపిస్తారనే టాక్ ఫిల్మ్ నగర్లో వినిపిస్తోంది. ఇందులో రవితేజ పోలీసాఫీసర్ పాత్రలో నటిస్తున్నారని సమాచారం. చిరంజీవి, రవితేజల కాంబినేషన్ సీన్స్ చిత్రీకరణ కూడా ఇటీవల వైజాగ్‌లో జరిగింది. ఇక అప్పుడు ‘అన్నయ్య’ చిత్రం జనవరిలో సంక్రాంతి పండక్కి రిలీజ్ కాగా, ఇప్పుడు ‘వాల్తేరు వీరయ్య’ సినిమా కూడా సంక్రాంతి సందర్భంగానే రిలీజ్ కానుండటం విశేషం. మైత్రీ మూవీమేకర్స్ పతాకంపై నవీన్ ఎర్నేని, వై.రవిశంకర్ నిర్మిస్తున్న ఈ సినిమాలో శ్రుతీహాసన్ హీరోయిన్గా నటిస్తున్నారు. ఇక వెంకటేష్, సల్మాన్ ఖాన్, రామ్‌చరణ్‌లు కలిసి సిల్వర్ స్క్రీన్‌పై ఒకేసారి కనిపిస్తే వారి అభిమానులు విజిల్స్ వేయాల్సిందే. ఈ ముగ్గురూ కలిసి హిందీ చిత్రం ‘కిసీ కీ భాయ్ కీసీ కీ జాన్’ అనే సినిమాలో స్క్రీన్ షేర్ చేసుకున్నారు. సల్మాన్ ఖాన్, వెంకటేశ్ లీడ్ హీరోలుగా నటిస్తున్న ఈ చిత్రంలో రామ్‌చరణ్‌ది అతిథి పాత్ర. ఓ పాటలో మాత్రమే చరణ్ కనిపిస్తారు. ఫర్హాద్ సామ్జీ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో పూజా హెగ్డే, జగపతిబాబు ఇతర లీడ్ రోల్స్ చేస్తున్నారు. ఈ సినిమాను వచ్చే ఏడాది రంజాన్‌కి రిలీజ్ చేయాలనుకుంటున్నారు. మరోవైపు ‘మనం’, ‘బంగార్రాజు’ చిత్రాల్లో పెద్ద కుమారుడు నాగచైతన్యతో కలిసి నటించిన నాగార్జున ఇప్పుడు చిన్న కుమారుడు అఖిల్‌తో ఓ సినిమా చేయనున్నారు. అక్కినేని నాగేశ్వరరావు–నాగార్జున– నాగచైతన్య నటించిన ‘మనం’లో అఖిల్ ఓ గెస్ట్ రోల్లో కనిపించిన విషయం తెలిసిందే. ఇప్పుడు నాగార్జున, అఖిల్ హీరోలుగా మోహన్‌రాజా దర్శకత్వంలో ఓ భారీ మల్టీస్టారర్ ఫిల్మ్ తెరకెక్కనుంది. ఇంకోవైపు ‘అగ్ని నక్షత్రం’ కోసం తొలిసారి స్క్రీన్ షేర్ చేసుకుంటున్నారు తండ్రీకూతురు మంచు మోహన్ బాబు, మంచు లక్ష్మి. ప్రతీక్ ప్రజోష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో విశ్వంత్, చిత్రా శుక్లా, మలయాళ నటుడు సిద్ధిఖ్ ఇతర లీడ్ రోల్స్ చేస్తున్నారు. శ్రీ లక్ష్మీ ప్రసన్న పిక్చర్స్, మంచు ఎంటర్టైన్ మెంట్‌పై ఈ చిత్రం రూపొందుతోంది. మలయాళ హిట్ ‘ఆండ్రాయిడ్ కుంజప్పన్ వెర్షన్ 5.25’ తెలుగు రీమేక్ హక్కులను హీరో– నిర్మాత విష్ణు మంచు దక్కించు కున్నారని తెలిసింది. ఈ సినిమాలో తండ్రి పాత్రలో మోహన్‌బాబు నటించనున్నారు. తనయుడు పాత్రలో టాలీవుడ్‌లోని ఓ యంగ్ హీరో కనిపిస్తారట. ఒకవేళ మంచు విష్ణుయే ఈ పాత్రనూ చేస్తే అది మరో మల్టీస్టారర్ అవుతుంది. ఇంకోవైపు మేనమామ... మేనల్లుడు పవన్ కల్యాణ్– సాయిధరమ్ తేజ్‌లు స్క్రీన్ షేర్ చేసుకోనున్నారనే వార్తలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. తమిళంలో విజయం సాధించిన ‘వినోదాయ సిత్తమ్’ తెలుగులో రీమేక్ కానుందని, ఈ చిత్రంలోనే పవన్ కల్యాణ్, సాయిధరమ్ నటించనున్నారన్నది ఫిల్మ్ నగర్ టాక్. సముద్రఖని ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తారట. ఇంకోవైపు మీడియమ్ రేంజ్ హీరోల మల్టీస్టారర్ మూవీస్ కూడా రానున్నాయి. హీరో సత్య దేవ్, డాలీ ధనంజయ (‘పుష్ప’ సినిమాలో యాక్ట్ చేశారు) కలిసి ఓ మల్టీస్టారర్ ఫిల్మ్ చేస్తున్నారు. ఈ సినిమాకు ఈశ్వర్కార్తీక్ దర్శకుడు. అలాగే రాజ్ తరుణ్, ‘జార్జిరెడి’్డ ఫేమ్ సందీప్ మాధవ్ ‘మాస్ మహా రాజు’ అనే సినిమా చేస్తున్నారు. ఇవేకాదు.. మరికొన్ని మల్టీస్టారర్ ఫిల్మ్స్‌కి కాంబినేషన్ సెట్ అవుతోందని తెలిసింది. -
అజిత్-విజయ్‌తో మల్టీ స్టారర్.. డైరెక్టర్ ఆసక్తికర వ్యాఖ్యలు
Venkat Prabhu Says Ajith Vijay Multi Starer Movie: తమిళ స్టార్ హీరోలు అజిత్, విజయ్‌కు ఇద్దరికీ సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. అటు తమిళనాట కాకుండా తెలుగులో కూడా వీరికి సూపర్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. వీరి సినిమాలు బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్లు రాబడతాయి. అలాంటిది వీరిద్దరు కలిసి ఒకే సినిమాలో నటిస్తే. విజయ్, అజిత్ వంటి స్టార్ హీరోలతో మల్టీ స్టారర్ పడితే ఆ క్రేజ్ మాములుగా ఉండదు. అయితే వీరిద్దరితో కలిసి సినిమా తీయాలనుందని కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ వెంకట్ ప్రభు వెల్లడించారు. ఇటీవల శింబు హీరోగా మానాడు సినిమా తెరకెక్కించి సూపర్ హిట్ కొట్టారు. టాలీవుడ్ గుడ్ బాయ్ నాగ చైతన్యతో వెంకట్ ప్రభు ఓ సినిమా తీస్తున్న విషయం తెలిసిందే. అయితే తాజాగా చెన్నైలోని ఓ కాలేజ్ ఫంక్షన్లో అజిత్, విజయ్ ఇద్దరితో కలిపి మూవీ తెరకెక్కించాలని, అందుకు సరిపడా కథ సిద్ధంగా కూడా ఉందని తన మనసులోని మాట బయటపెట్టాడు వెంకట్ ప్రభు. దీంతో తమిళ సినీ పరిశ్రమలో ఒకరకమైన ఉత్సుకత ఏర్పడింది. మరీ ఈ సినిమాకు అజిత్, విజయ్ ఒప్పుకుని పట్టాలెక్కుద్దో వేచి చూడాలి. చదవండి: ‘సలాం రాఖీ భాయ్’ అంటూ ఐరా ఎంత క్యూట్‌గా పాడిందో చూడండి.. ‘గెట్ అవుట్’ అంటూ విశ్వక్ సేన్‌పై టీవీ యాంకర్ ఫైర్ #Ajithkumar Vs #ThalapathyVijay in #Mankatha2 Official Announcement 🔜💥@vp_offl Sir ❤#Beast #HBDAjithkumar #Ak61 pic.twitter.com/JWqdBPgy4U — indian Box office (@indianBoxofflce) April 30, 2022 -
RRR Movie Review: బాక్సాఫీస్ కుంభస్థలం బద్దలుగొట్టిన ఆర్ఆర్ఆర్
-
ముగ్గురు హీరోలతో మహేశ్ డైరెక్టర్ సినిమా.. భారీ మల్టీ స్టారర్ !
Director Parashuram Planning Big Multistarrer With 3 Heros: దర్శకుడు పరశురామ్ ప్రస్తుతం సూపర్ స్టార్ మహేశ్ బాబుతో సర్కారు వారి పాట సినిమాను తెరకెక్కిస్తున్నారు. కీర్తి సురేశ్ హీరోయిన్గా చేస్తున్న ఈ చిత్రం షూటింగ్ చివరి దశలో ఉంది. ఏప్రిల్ 1న ఈ సినిమా భారీ స్థాయిలో విడుదల చేయనున్నట్లు ఇప్పటికే మేకర్స్ ప్రకటించారు. ఇక ఈ సినిమా తర్వాత స్టార్ హీరోలతో భారీ మల్టీ స్టారర్‌ను ప్లాన్ చేశాడట పరశురామ్. ప్రస్తుతం ఈ టాపిక్ సోషల్ మీడియాలో గింగిరాలు తిరుగుతోంది. మళ్లీ ఈ చిత్రాన్ని పాన్ ఇండియా రేంజ్లో తెరకెక్కిస్తున్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ వార్తలు ఎంతవరకూ నిజమో వేచి చూడాలి మరి. ఇదిలా ఉంటే అక్కినేని నాగ చైతన్య హీరోగా 14 రీల్స్ సంస్థలో పరశురామ్ ఓ సినిమా చేయాల్సి ఉంది. డ్యాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ శిష్యుడిగా 'యువత' సినిమాతో వెండితెరకు డైరెక్టర్‌గా పరిచయమయ్యాడు పరశురామ్. తర్వాత ఆంజనేయులు, సోలో, సారొచ్చారు, శ్రీరస్తు శుభమస్తు వంటి చిత్రాలతో ఆకట్టుకున్నాడు. చేసింది తక్కువ సినిమాలే అయినా గీత గోవిందం చిత్రంతో రూ. 100 కోట్ల మార్క్‌కు వెళ్లాడు. పరశురామ్ ఒక డైరెక్టర్‌గా ఎంత కష్టపడతాడో సర్కారి వారి పాట సినిమా చిత్రీకరణలో నిరూపించాడు. మండుటెండలో కూర్చుని తన స్క్రిప్ట్ వర్క్ చూసుకోవడం పలువురిని ఆకట్టుకుంది. ఇది చదవండి: ‘సర్కారి వారి పాట’ సెట్లో ఎంపీ శశిథరూర్.. -
35 ఏళ్లుగా మా రెండు కుటుంబాల మధ్య పోరు ఉంది: జూ. ఎన్టీఆర్
Jr NTR Comments On Ram Charan And Multistarrer Movies In RRR Promotions: టాలీవుడ్లో మల్టీ స్టారర్స్‌కి డిమాండ్ పెరుగుతుంది. ఈ మధ్యకాలంలో యంగ్ హీరోలు సైతం మల్టీస్టారర్ల వైపు మొగ్గుచూపుతున్నారు. తాజాగా రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతున్న మోస్ట్ అవైటెడ్ మూవీ ఆర్ఆర్ఆర్ కూడా మల్టీస్టారరే. జూ. ఎన్టీఆర్, రామ్‌చరణ్ హీరోలుగా రూపొందిన ఈ భారీ పాన్ ఇండియా మూవీ వచ్చే ఏడాది జనవరి7న ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో మూవీ టీం ప్రమోషన్స్‌లో ఫుల్ బిజీగా ఉంది. పాన్ ఇండియా సినిమా కావడంతో ముంబై, చెన్నై, హైదరాబాద్, కొచ్చి, బెంగళూరు లాంటి నగరాల్లో ప్రెస్‌మీట్ నిర్వహిస్తూ అక్కడి ప్రేక్షకులకు సైతం దగ్గరవుతున్నారు. తాజాగా జరిగిన ఓ ఇంటర్వ్యూలో.. ఆర్ఆర్ఆర్ తర్వాత మరిన్ని మల్టీస్టారర్ చిత్రాలు వచ్చే అవకాశాలున్నాయి అని ప్రశ్నించగా ఎన్టీఆర్ ఆసక్తికరంగా స్పందించారు. 'ఈ విషయం ఇప్పుడు చెప్పొచ్చో లేదో తెలియదు కానీ మా రెండు కుటుంబాల మధ్య 35 సంవత్సరాలుగా పోరు నడుస్తుంది. అయినా మేమిద్దరం(నేను,రామ్‌చరణ్)మంచి స్నేహితులం. మా మధ్య పోరు ఎప్పుడూ పాజిటివ్‌గానే ఉంటుంది. ఆర్ఆర్ఆర్ తర్వాత దేశంలోని టాప్ స్టార్స్ సైతం ఒకే తాటిపైకి వస్తారని, భారీ మల్టీ స్టారర్ చిత్రాలు వస్తాయనే నమ్మకం ఉంది' అని పేర్కొన్నారు. ప్రస్తుతం ఎన్టీఆర్ చేసిన ఈ కామెంట్స్ నెట్టింట వైరల్‌గా మారాయి. -
బాలీవుడ్‌లోకి బన్నీ.. మల్టీస్టారర్‌కు గ్రీన్ సిగ్నల్!
టాలీవుడ్లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇంతవరకు మల్టీస్టారర్ మూవీ చేయలేదు. కాని బాలీవుడ్ లో మార్కెట్ కోసం సీరియస్ గా ట్రై చేస్తుండటంతో అక్కడ ఒక మల్టీస్టారర్ చేయాలనుకుంటున్నాడట. ప్రస్తుతం ఈ రూమర్ బీటౌన్ ను షేక్ చేస్తోంది. గీతా ఆర్ట్స్ బ్యానర్ లో అల్లు అర్జున్ తో హిందీ మూవీ ప్లాన్ చేస్తున్నారట. ఈ మూవీలో బన్నితో పాటు బాలీవుడ్ హీరో షాహిద్ కపూర్ నటించబోతున్నట్లు తెలుస్తోంది. షాహిద్ కపూర్ తో జెర్సీ హిందీ రీమేక్ నిర్మించాడు అల్లు అరవింద్. ఈ మూవీని డిసెంబర్ 31న వరల్డ్ వైడ్ గా గ్రాండ్ గా రిలీజ్ చేస్తున్నారు. షాహిద్ కపూర్, అల్లు అర్జున్ కాంబినేషన్ లోనే డెడ్లీ మల్టీస్టారర్ ప్లాన్ చేస్తున్నారట. రాబోయే రెండు మూడు ఏళ్లలోనే ఈ ప్రాజెక్ట్ పట్టాలెక్కనుందట. ఒక వైపు కబీర్ సింగ్ , మరోవైపు పుష్ప రాజ్ స్క్రీన్ పై ఎలాంటి సినిమాలో కనిపించనున్నారు అనేది హాట్ టాపిక్ గా మారింది. -
క్రేజీ న్యూస్.. బన్నీ, విజయ్ మల్టీస్టారర్!
టాలీవుడ్లో చాలా రోజుల తర్వాత మల్టీస్టారర్ సినిమాల జోరు పెరిగింది. గతంలో ఎప్పుడు లేనంతగా ఇటీవల దాదాపు స్టార్ హీరోలు అందరూ మరో హీరోతో స్క్రీన్ షేర్ చేసుకోవడానికి సిద్ధమయ్యారు. ఇక దర్శక, నిర్మాతలు కూడా ధైర్యంగా ఇద్దరి హీరోలతో సినిమాలు చేయడానికి ముందుకు వస్తున్నారు. ఇప్పటికే రామ్ చరణ్,ఎన్టీఆర్‌లు కలిసి ఆర్ఆర్ఆర్ మూవీ చేస్తున్న విషయం తెలిసిందే. అలాగే పవన్ కల్యాణ్, రానా కలిసి ఒక మల్టీస్టారర్ చేయబోతున్నారు. ఇదిలా ఉంటే టాలీవుడ్లో మరో క్రేజీ మల్టీస్టారర్ రాబోతుందనే ప్రచారం జోరుగా సాగుతోంది. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, సెన్సేషనల్ స్టార్ విజయ్ దేవరకొండ కలిసి ఒక మల్టీస్టారర్ చేయబోతున్నారనే వార్త టాలీవుడ్లో చక్కర్లు కొడుతోంది. ‘ఆనందో బ్రహ్మ’, ‘యాత్ర’ చిత్రాల దర్శకుడు మహి వి రాఘవ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నారని అంటున్నారు. అంతేకాదు, ఈ భారీ చిత్రాన్ని మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సమర్పించనున్నారట. మరో ప్రముఖ నిర్మాణ సంస్థతో కలిసి ఈ చిత్రాన్ని నిర్మించనున్నారని సమాచారం. త్వరలోనే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన వస్తుందంటున్నారు. బన్నీ, విజయ్‌ల మధ్య మంచి సాన్నిహిత్యం ఉంది. అల్లు అర్జున్‌ని విజయ్ ఆప్యాయంగా బన్నీ అన్న అని పిలుస్తుంటాడు. అలాగే విజయ్‌ని బన్నీ బ్రదర్ అని సంభోదిస్తాడు. విజయ్‌కు చెందిన ‘రౌడీ బ్రాండ్’ దుస్తులు ధరించి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తుంటారు. ఇంత క్లోజ్‌గా ఉండే ఇద్దరు హీరోలు కలిసి ఒక సినిమా చేస్తే అభిమానులకు పండగనే చెప్పొచ్చు. ఇక బన్నీ-రౌడీలు కలిసి స్క్రీన్ షేర్ చేసుకుంటే బాక్సాఫీస్ షేక్ అయిపోవడం ఖాయం అంటున్నారు సినీ విశ్లేషకులు. మరోవైపు విజయ్ ప్రస్తుతం పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ‘లైగర్’ అనే సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే ఈ సినిమాలో విజయ్ సరసన నటిస్తున్నారు. అల్లు అర్జున్ సుకుమార్ దర్శకత్వంలో ‘పుష్ప’ సినిమా చేస్తున్నారు. ఈ చిత్రంలో అల్లు అర్జున్ సరసన రష్మిక మందన నటిస్తోంది. -
‘ప్రభాస్-అమీర్‌లతో మల్టీస్టారర్ చిత్రం చేయాలి’
‘ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ’ సినిమాను అద్భుతంగా తెరకెక్కించి టాలెంటెడ్ దర్శకుడిగా పేరు తెచ్చుకున్నారు స్వరూప్ ఆర్ఎస్జే. తొలి సినిమాతోనే విమర్శకుల ప్రశంసలు అందుకున్నారు. ప్రస్తుతం ‘ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ’ చిత్రానికి సీక్వెల్ తీసే పనిలో ఉన్నారు. లాక్డౌన్ కారణంగా షూటింగ్‌లు రద్దు కావడంతో ఇంటికే పరిమితైమన ఈ యంగ్ టాలెంటెడ్ డైరెక్టర్ తన తదుపరి చిత్రాల స్క్రిప్ట్ పనిలో నిమగ్నమయ్యారు. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న స్వరూప్ తన డ్రీమ్ ప్రాజెక్ట్స్, ఆలోచనలను అభిమానులతో పంచుకున్నాడు. ‘నాకు మల్టీస్టారర్ చిత్రాలంటే ఇష్టం. అయితే పర్ఫెక్ట్ కాన్సెప్ట్ దొరికితే తప్పకుండా మల్టీస్టారర్ చిత్రం చేస్తా. యంగ్‌టైగర్ ఎన్టీఆర్, అల్లు అర్జున్‌లతో ఓ మల్టీస్టారర్ చిత్రం తెరకెక్కించాలనే కోరిక ఉంది. అదేవిధంగా ప్రభాస్-ఆమీర్ ఖాన్ కలయికలో పాన్ ఇండియా రేంజ్లో మరో చిత్రాన్ని తీయాలనే ఆలోచన ఉంది. ఈ హీరోల కలయికలో సినిమాలు వస్తే ట్రెండ్ సెట్టర్‌గా నిలుస్తాయి. అయితే ఇలాంటి స్టార్ హీరోలతో సినిమాలు తీయాలంటే కొంతకాలం వేచిచూడాల్సిందే. అంతేకాకుండా మెగాస్టార్ చిరంజీవి అంటే ఎంతో అభిమానం. ఆయనతో సినిమా చేయడం నా డ్రీమ్ ప్రాజెక్ట్’ అని దర్శకుడు స్వరూప్ పేర్కొన్నారు. చదవండి: అవ్రమ్‌కు హెయిర్ కట్ చేసిన విరానిక నిహారిక, యశ్‌ల డ్యాన్స్ చూశారా? var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_691245605.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
రానాతో కలిసి బాలకృష్ణ మల్టీస్టారర్ మూవీ!
టాలీవుడ్ పరిశ్రమలో ప్రస్తుతం మల్టీ స్టారర్ సినిమాల జోరు బాగానే నడుస్తోంది. అంతేగాకుండా మల్టీస్టారర్ సినిమాలు చేయడానికి టాప్ హీరోలు కూడా ఆసక్తి కనబరుస్తున్నారు. ఇప్పటికే రామ్‌చరణ్, జూనియర్ ఎన్టీఆర్ కాంబినేషన్ల్ మల్టీస్టారర్ మూవీ ఆర్ఆర్ఆర్ రూపొందుతున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం నందమూరి బాలకృష్ణ కూడా దగ్గుబాటి రానాతో కలిసి మల్టీస్టారర్ మూవీ చేయనున్నట్లు ప్రచారం జరుగుతుంది. మలయాళంలో సూపర్ హిట్ సాధించిన ‘అయ్యప్పనుమ్ కోసియుమ్' సినిమాను తెలుగు, తమిళ్ భాషల్లో రీమేక్ చేయబోతున్నారు. ఈ సినిమా తెలుగు రీమేక్ హక్కులను సితార ఎంటర్టైన్మెంట్ సంస్థ కోనుగోలు చేసింది. (కరోనా: ట్రెండింగ్‌లో ఆర్జీవీ ‘పురుగు’ పాట!) అయ్యప్పనుమ్ కోసియుమ్ సినిమా.. అయ్యప్పనుమ్ నాయర్ అనే పోలీస్ అధికారి, రిటైర్డ్ హవిల్దార్ కోషి కురియన్ మధ్య జరిగే ఈగో వార్ నేపథ్యంలో సాగే కథ. మలయాళంలో బిజు మీనన్, పృథ్వీరాజ్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా విమర్శకుల ప్రశంసలు పొంది సూపర్ హిట్‌ను సొంతం చేసుకుంది. ఈ సినిమా తెలుగు రీమేక్‌లో బిజు మీనన్ పాత్ర కోసం చిత్ర నిర్మాతలు బాలకృష్ణను సంప్రదించినట్లు, ఇందుకు బాలయ్య కూడా సుముఖంగానే ఉన్నట్లు సమాచారం. కాగా ఇప్పటికే పృథ్విరాజ్ పాత్ర కోసం రానాను సంప్రదించినట్లు తెలుస్తోంది. అయితే ఇంకా దీనికి సంబంధించి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. (బోయపాటి చిత్రంలో బాలయ్య లుక్.. అదుర్స్!) ప్రస్తుతం రానా అరణ్య, విరాట పర్వం సినిమాల్లో నటిస్తున్నారు. అలాగే బాలకృష్ణ బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు. కాగా ఇప్పటికే బాలకృష్ణ, రానాలు కలిసి ‘ఎన్టీఆర్’ జీవితం ఆధారంగా వచ్చిన ‘ఎన్టీఆర్ కథానాయకుడు’, ‘ఎన్టీఆర్ మహానాయకుడు’ సినిమాల్లో కలిసి నటించారు. అంతేకాక రానా హోస్ట్ చేసిన నెంబర్ వన్ యారీ విత్ రానా కార్యక్రమంలో కూడా బాలయ్య సందడి చేసారు. ఇపుడు మరోసారి వీళ్లిద్దరు కలిసి నటిస్తారా లేదా అనేది చూడాలి. (కరోనాతో మరో ప్రముఖ గాయకుడు మృతి) -
రీమేక్ కుమార్
ఏడాదికి మూడు సినిమాలతో హిందీ ప్రేక్షకులను పలకరిస్తారు అక్షయ్ కుమార్. దేశభక్తి, యాక్షన్, సోషల్ మెసేజ్, మల్టీస్టారర్ కామెడీ జానర్లలో ఎక్కువగా సినిమాలు చేస్తుంటారాయన. అప్పుడప్పుడు రీమేక్ సినిమాల్లోనూ మెరుస్తుంటారు. కానీ, ఇటీవల అక్షయ్ కుమార్ సినిమాల ఎంపిక చూస్తుంటే... ఆయన ఆసక్తి రీమేక్స్ మీదకు మళ్లినట్టు కనిపిస్తోంది. ప్రస్తుతం అక్షయ్ చేతిలో ఉన్న 5 సినిమాల్లో 3 రీమేక్సే కావడం విశేషం. తమిళంలో హిట్ అయిన ‘వీరమ్’ ఆధారంగా ‘బచ్చన్ పాండే’ సినిమా చేస్తున్నారు. సౌత్ ఆడియన్స్‌ను భయపెట్టిన ‘కాంచన’ను ‘లక్ష్మీబాంబ్’గా చుడుతున్నారు. తాజాగా ‘బెల్ బాటమ్’ సినిమాను ప్రకటించారు. ఈ సినిమా అధికారికంగా ‘బెల్‌బాటమ్’ చిత్రానికి రీమేక్ కాకపోయినా, ఆ సినిమా స్ఫూర్తిగా సాగనుందని టాక్. ఆ చిత్ర విశేషాలేంటో చదువుదాం. లక్ష్మీ బాంబ్ హారర్–కామెడీ సినిమాల్లో ‘కాంచన’ సిరీస్ సౌత్‌లో సూపర్ సక్సెస్ఫుల్. అన్యాయంగా హత్య చేయబడ్డ ఓ వ్యక్తి ఆత్మ రాఘవ లారెన్స్ శరీరంలోకి ప్రవేశించి తన పగను తీర్చుకోవడం అనేది ఈ సిరీస్‌లోని సినిమాల కథ. అన్యాయానికి గురై హత్య చేయబడ్డ ఓ హిజ్రా ఆత్మగా మారి ఎలా పగ తీర్చకుందనేది ‘కాంచన 2’ సినిమా కథ. ‘కాంచన’ చిత్రానికి దర్శకత్వం వహించిన రాఘవ లారెన్స్ ‘లక్ష్మీ బాంబ్’ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు. బాలీవుడ్లో లారెన్స్‌కి ఇదే తొలి సినిమా. 2020 జూన్ నెలాఖరులో ‘లక్ష్మీ బాంబ్’ థియేటర్స్‌లో పేలనుంది. వీరమ్– బచ్చన్ పాండే ఒక ఊరిలో పంచ పాండవుల్లాంటి అన్నదమ్ములు. నలుగురు తమ్ముళ్లంటే అన్నయ్యకు వల్లమాలిన ప్రేమ. పెళ్లి చేసుకుంటే అన్మదమ్ముల అనుబంధం దెబ్బతింటుందేమోనని వద్దనుకుంటాడు. తమ్ముళ్లను కూడా అదే ఫాలో అవ్వమంటాడు. అన్న చాటుగా పెరిగిన తమ్ముళ్లు అన్నకు తెలియకుండా ప్రేమ వ్యవహారాలు నడుపుతారు. తమ ప్రేమలకు గ్రీన్ సిగ్నల్ పడాలంటే అన్నయ్య కూడా ప్రేమలో పడాలని తమ్ముళ్లు ప్రయత్నాలు మొదలుపెడతారు. అందరూ కలసి అన్న మనసు మార్చారా? లేదా? తర్వాత ఏం జరిగింది? అన్నది ‘వీరమ్’ కథాంశం. అజిత్ హీరోగా శివ తెరకెక్కించిన ఈ సినిమా తమిళంలో పెద్ద హిట్‌గా నిలిచింది. తెలుగులో ‘కాటమరాయుడు’ టైటిల్‌తో పవన్ కల్యాణ్ రీమేక్ చేశారు. ఈ చిత్ర హిందీ రీమేక్ ‘బచ్చన్ పాండే’ 2020 క్రిస్మస్కు విడుదల కానుంది. బెల్ బాటమ్ జేమ్స్‌బాండ్ సినిమాలు, డిటెక్టివ్ సినిమాలు విపరీతంగా చూసి, క్రైమ్ నవలలు బాగా చదివి డిటెక్టివ్‌ల మీద ఒకలాంటి ఇష్టం ఏర్పరచుకుంటాడు హీరో. వృత్తికి కానిస్టేబుల్ అయినా డిటెక్టివ్‌గా ఫీల్ అవుతాడు. ఓ మర్డర్ మిస్టరీని అవలీలగా పరిష్కరిస్తాడు. దీంతో ఓ భారీ దొంగతనం కేసును పరిష్కరించే బాధ్యతని హీరోకి అప్పచెబుతుంది ప్రభుత్వం. ఈ కేసులో ప్రమేయం ఉన్న వాళ్లని ఎలా పట్టుకున్నాడన్నదే ‘బెల్ బాటమ్’ కథాంశం. రిషబ్ శెట్టి హీరోగా తెరకెక్కిన ఈ సినిమాను జయ తీర్థ తెరకెక్కించారు. కన్నడలో ఘన విజయం సాధించిన ఈ చిత్రాన్ని ‘బెల్ బాటమ్’ పేరుతో రీమేక్ చేస్తున్నారు అక్షయ్. 2021 జనవరిలో ఈ సినిమా థియేటర్స్‌లో సందడి చేయనుంది. బాలీవుడ్‌కు కథలు అవసరమున్నప్పుడల్లా సౌత్ ఇండస్ట్రీ సూపర్ హిట్ కథలు ఇస్తూ వస్తోంది. సల్మాన్ ఖాన్ సెకండ్ ఇన్నింగ్స్‌కు సక్సెస్‌పుల్ స్టార్ట్ (తెలుగు ‘పోకిరి’ చిత్రాన్ని ‘వాంటెడ్’గా రీమేక్ చేశారు) ఇచ్చింది రీమేకే. బాలీవుడ్‌కు తొలి వంద కోట్ల గ్రాసర్‌ని ఇచ్చింది (గజిని) సౌత్ రీమేకే. కథ కావాల్సినప్పుడల్లా బాలీవుడ్‌ను పలకరించే దక్షిణాది బంధువు రీమేకే. గత రీమేక్‌లు అక్షయ్ కుమార్ గతంలో తెలుగు ‘విక్రమార్కుడు’ సినిమాని ‘రౌడీ రాథోడ్’గా, తమిళ ‘రమణ’ చిత్రాన్ని ‘గబ్బర్ ఈజ్ బ్యాక్’గా, తమిళ ‘తుపాకి’ చిత్రాన్ని ‘హాలిడే’గా, మలయాళ ‘మణిచిత్రతాళ్’ సినిమాను ‘భూల్ బులయ్య’గా, మలయాళ ‘రామ్‌జీ రావ్ స్పీకింగ్’ను ‘హేరా ఫేరీ’గా రీమేక్ చేశారు. కత్తి పట్టనున్నారు ఏఆర్ మురగదాస్, విజయ్ కాంబినేషన్లో వచ్చిన సూపర్ హిట్ తమిళ చిత్రం ‘కత్తి’. మల్టీనేషనల్ కంపెనీల ప్రభావం సామాన్య రైతుల మీద ఎలా పడుతోంది అనే పాయింట్‌తో ఈ సినిమా తెరకెక్కింది. ఈ సినిమాను అక్షయ్ కుమార్ రీమేక్ చేస్తారని తెలిసింది. ఏఆర్ మురగదాస్ దగ్గర పనిచేసిన జగన్ శక్తి ఈ రీమేక్‌ను డైరెక్ట్ చేస్తారట. త్వరలోనే ఈ సినిమాను అధికారికంగా ప్రకటించనున్నారు. -
వారు వీరు ఓ సినిమా అంట
‘బిందాస్, రగడ’ చిత్రాలతో ప్రేక్షకులకు కావాల్సిన కామెడీ డోస్‌ను రెండింతలు వడ్డించిన దర్శకుడు వీరు పోట్ల. 2016లో వచ్చిన ‘ఈడు గోల్డ్ ఎహే’ తర్వాత వీరు ఏ సినిమా ప్లాన్ చేస్తున్నారో తెలియదు. అయితే లేటెస్ట్గా వినిపిస్తున్న సమాచారం ఏంటంటే.. వెంకటేశ్‌కు ఓ మల్టీస్టారర్ కథను వినిపించినట్లు, ఆయన కూడా ఓకే చెప్పినట్లు టాక్. 14 రీల్స్ బ్యానర్‌పై అనిల్ సుంకర ఈ చిత్రాన్ని నిర్మించనున్నారట. ఈ మల్టీస్టారర్‌లో మరో హీరోగా ఎవరు నటిస్తారన్నది ఇంకా ఖరారు కాలేదని తెలిసింది. రవితేజ ఉండొచ్చని, కాదు రానా నటిస్తారని చర్చలు జరుగుతున్నాయి. త్వరలోనే ఆ రెండో హీరో ఎవరో ఫిక్స్ చేసి, ఈ ఏడాదిలోనే ఈ సినిమాను సెట్స్ మీదకు వెళ్లే అవకాçశం ఉందట. ఈ చిత్రమే కాకుండా మరో పీరియాడికల్ కథను కూడా సిద్ధం చేసుకుని రెడీగా ఉన్నారట వీరు పోట్ల. వెంకటేశ్‌తో చేయబోయే మల్టీస్టారర్ చిత్రమా లేక పీరియాడికల్ డ్రామానా? ఏది ముందు సెట్స్ మీదకు వెళుతుందో తెలియాలి. ఏది ఏమైనా థియేటర్లో ప్రేక్షకుడిని నవ్విస్తూ సీటులోంచి ముందుకు పడేలా చేయడమో, పీరియాడికల్ మూవీతో కాలంలో వెనక్కు తీసుకెళ్లడమో కన్ఫార్మ్ అనుకోవచ్చు. -
స్క్రిప్ట్ రెడీ
తొలి సినిమాకే ‘ఆర్ఎక్స్ 100’ లాంటి బోల్డ్ స్క్రిప్ట్‌తో వచ్చి బాక్సాఫీస్ వద్ద అద్భుతమైన విజయాన్ని అందుకున్నారు దర్శకుడు అజయ్ భూపతి. మరి నెక్ట్స్ సినిమాకి ఎలాంటి స్క్రిప్ట్‌తో వస్తారో అని ఇండస్ట్రీ ఆసక్తిగా ఎదురు చూస్తోంది. ఆల్రెడీ అజయ్ భూపతి మల్టీస్టారర్ కథ సిద్ధం చేసే పనిలో ఉన్నారనే విషయం తెలిసిందే. తాజా వార్తేంటంటే ఈ సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్ పనులన్నీ పూర్తయిపోయాయట. ఇద్దరు ముగ్గురు హీరోలకు కథ కూడా వినిపించారని సమాచారం. మరికొన్ని రోజుల్లో ఈ మల్టీస్టారర్‌లో కనిపించే హీరోలెవరో అధికారిక ప్రకటన వచ్చే వీలుంది. -
మల్టీస్టారర్?
ఫస్ట్ సినిమా ‘ఆర్ఎక్స్ 100’తో సక్సెస్ అందుకున్నారు దర్శకుడు అజయ్ భూపతి. బాక్సాఫీస్ వద్ద కూడా ఈ బండి బాగానే సౌండ్ చేసిన సంగతి తెలిసిందే. తన నెక్ట్స్ ప్రాజెక్ట్‌గా మల్టీస్టారర్ చేస్తున్నట్టు ఆ మధ్య ‘సాక్షి’కి తెలిపారు అజయ్ భూపతి. లేటెస్ట్గా వినిపిస్తున్న సమాచారమేంటంటే ఈ మల్టీస్టారర్‌లో ఎనర్జిటిక్ హీరో రామ్, ‘మహానటి’తో తెలుగు ఆడియన్స్‌కు దగ్గరైన మలయాళ హీరో దుల్కర్ సల్మాన్ హీరోలుగా కనిపిస్తారట. ఈ ప్రాజెక్ట్‌ను ‘స్రవంతి’ రవికిశోర్ నిర్మించనున్నారు. ఇద్దరు భిన్న మనస్తత్వాలు కలిగి ఉన్న మనుషుల మధ్య జరిగే కథలా ఈ చిత్రం ఉండబోతోందని, అలాగే ఫస్ట్ సినిమాలానే రియలిస్టిక్‌గానే ఉంటుందని కూడా దర్శకుడు ఓ సందర్భంలో పేర్కొన్నారు. ప్రస్తుతం స్క్రిప్ట్ వర్క్ జరుగుతున్న ఈ చిత్రం ఈ ఏడాది చివర్లో సెట్స్ మీదకు వెళ్లనుందని సమాచారం. -
వెంకీ మామా ఎప్పుడొస్తావ్?
మామా అల్లుళ్లు కలిస్తే వాతావరణం అంతా సందడి సందడిగా మారిపోతుంది. అలా నవ్వులు పూయించడానికి అక్టోబర్ నుంచి అల్లుడు నాగచైతన్యతో కలిసి రెడీ అవనున్నారు మామ వెంకటేశ్. కేయస్ రవీందర్ (బాబీ) దర్శకత్వంలో వెంకటేశ్, నాగచైతన్య హీరోలుగా ఓ మల్టీస్టారర్ చిత్రం రూపొందనున్న సంగతి తెలిసిందే. సురేశ్ ప్రొడక్షన్, బ్లూ ప్లానెట్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్స్ సంయుక్తంగా నిర్మించనున్నాయి. ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ అక్టోబర్ ఫస్ట్ వీక్‌లో స్టార్ట్ కానుందని సమాచారం. ఈ చిత్రానికి ‘వెంకీ మామ’ అనే టైటిల్‌ను అనుకుంటున్నారు. సినిమాలోనూ మామా అల్లుడిగా కనిపిస్తారు వెంకీ, చైతన్య. ఈ సినిమాలో వెంకటేశ్‌కి జోడీగా హ్యూమా ఖురేషి, నాగచైతన్యకు జోడీగా రకుల్‌ప్రీత్‌సింగ్ నటించనున్నారని సమాచారం. వచ్చే ఏడాది సమ్మర్‌కి ఈ సినిమా విడుదలకు ప్లాన్ చేస్తున్నారు చిత్రబృందం.