మల్టీస్టారర్ సినిమాలంటే ఎక్కువగా హీరోలే చేస్తుంటారు. కానీ జస్ట్ ఫర్ ఏ చేంజ్... హిందీలో ఉమెన్ మల్టీస్టారర్ ఫిలింస్ తెరకెక్కుతున్నాయి. 2018లో వచ్చిన లేడీ మల్టీస్టారర్ ఫిల్మ్ ‘వీరే ది వెడ్డింగ్’ రూ. వంద కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. ఆ తర్వాత కథానాయిక ప్రాధాన్యంగా సాగే మల్టీ లేడీ స్టారర్ (ఒకే సినిమాలో ఎక్కువమంది కథానాయికలు నటించడం) చిత్రాలు పెద్దగా రాలేదు. ఇప్పుడు ఆ తరహా చిత్రాలు కొన్ని రూపొంతున్నాయి. ఆ ‘మల్టీ లేడీ స్టారర్’ చిత్రాల గురించి తెలుసుకుందాం.
జర ఆలస్యంగా జీ లే జరా
బాలీవుడ్ అగ్ర తారలు ప్రియాంకా చోప్రా కత్రినా కైప్, ఆలియా భట్ కలిసి రోడ్ ట్రిప్ బ్యాక్‌డ్రాప్‌లో ‘జీ లే జరా’ అనే సినిమాలో నటించనున్నారు. 2021లోనే దర్శకుడు ఫర్హాన్ అక్తర్ ఈ సినిమాను ప్రకటించినా ఇంకా సెట్స్‌పైకి వెళ్లలేదు. ఈలోపు హాలీవుడ్ కమిట్ మెంట్స్ కారణంగా ‘జీ లే జరా’ చిత్రం నుంచి ప్రియాంకా చో్ప్రా కాల్షీట్స్ సర్దుబాటు చేయలేక కత్రినా కైఫ్ తప్పుకున్నారనే టాక్ వినిపించింది.
ఓ దశలో ఈ సినిమా క్యాన్సిల్ అయిందనే ప్రచారం కూడా జరిగింది. అయితే ‘జీ లే జరా’ చిత్రం ఉందని, వచ్చే ఏడాది ఈ సినిమాను సెట్స్‌పైకి తీసుకుని వెళ్తామని ఈ చిత్రనిర్మాతల్లో ఒకరైన రీమా కగ్తి ఇటీవల పేర్కొన్నారు. జోయా అక్తర్ ఈ సినిమాకు మరో నిర్మాత. కాగా ఇటీవల రణ్‌వీర్ సింగ్ హీరోగా ‘డాన్ 3’ని ప్రకటించారు ఫర్హాన్ అక్తర్. సో.. ఈ సినిమా షూటింగ్ ఓ కొలిక్కి వచ్చిన తర్వాత జర ఆలస్యంగా ‘జీ లే జరా’ చిత్రం సెట్స్‌పైకి వెళ్తుందనే టాక్ వినిపిస్తోంది.
ఆకాశంలో...
కరీనా కపూర్, టబు, కృతీ సనన్ ఎయిర్‌లైన్ ఇండస్ట్రీలో ఉద్యోగాలు చేస్తున్నారు. ఈ బ్యూటీలు ఈ డ్యూటీ చేస్తున్నది ‘ది క్రూ’ సినిమా కోసం. రాజేష్ క్రిష్ణన్ దర్శకత్వం వహిస్తున్నారు. ముంబై, అబుదాబి లొకేషన్స్‌లో ఈ సినిమా షూటింగ్ జరుగుతోంది. ఎయిర్ లైన్స్ ఇండస్ట్రీలో ఉద్యోగాలు చేస్తున్న ముగ్గురు మహిళల జీవితాలు ఊహించని ఘటనల కారణంగా ఏ విధంగా ప్రభావితం అయ్యాయి? అన్నదే ఈ చిత్రకథ. ఈ సినిమా వచ్చే ఏడాది మార్చిలో రిలీజ్ కానుంది.
అన్వేషణ
విభిన్నమైన మనస్తత్వాలు, వయసు రీత్యా వ్యత్యాసం ఉన్న నలుగురు మహిళలు బైక్‌పై రోడ్ ట్రిప్ చేసి, ఆ అనుభవాలతో తమ జీవితాలను తాము కొత్తగా ఏ విధంగా మార్చుకున్నారు? అనే కథాంశంతో రూ΄÷ందుతున్న చిత్రం ‘ధక్ ధక్’. ఫాతిమా సనా షేక్, రత్నా ΄ాతక్, సంజన, దియా మీర్జా లీడ్ రోల్స్ చేస్తున్నారు. తరుణ్ డుడేజా దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రానికి తాప్సీ ఓ నిర్మాత. ‘ధక్ ధక్’ వచ్చే ఏడాది విడుదల కానుంది.
రైజ్.. రెబల్.. రిపీట్
భూమి పెడ్నేకర్, షెహనాజ్ గిల్, డాలీ సింగ్, కుషా కపిల, షిబానీ బేడీ వంటి తారలు లీడ్ రోల్స్ చేసిన చిత్రం ‘థ్యాంక్యూ ఫర్ కమింగ్’.. ‘రైజ్.. రెబల్.. రిపీట్’ అనేది ఈ సినిమాకు ఉపశీర్షిక. కరణ్ బూలానీఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. 30 ఏళ్లు దాటిన ఓ అమ్మాయి వివాహం చేసుకోదు. దీంతో జీవితంలో ఏదో కోల్పోయిన భావన. తన ఫ్రెండ్స్‌ను కలవాలనుకుంటుంది. స్నేహితులు ఓ ΄ార్టీని ΄్లాన్ చేస్తారు. ఈ క్రమంలో ఎటువంటి ఘటనలు చోటు చేసుకున్నాయి? అనే నేపథ్యంలో ఈ సినిమా కథనం సాగుతుందని బాలీవుడ్ టాక్. అక్టోబరులో ఈ సినిమా విడుదల కానుంది. అలాగే ‘టొరంటో ఇంటర్‌నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్– 2023’లో ‘థ్యాంక్యూ ఫర్ కమింగ్’ చిత్రం ప్రదర్శనకు ఎంపికైందని, టీమ్ అంతా సంతోషంగా ఉన్నామని ఈ చిత్రనిర్మాతల్లో ఒకరైన రేఖా కపూర్ పేర్కొన్నారు.
లేడీ మల్టీస్టారర్ ట్రెండ్ వెబ్ సిరీస్‌లోనూ కనిపిస్తోంది. బాలీవుడ్ అగ్రదర్శకుల్లో ఒకరైన సంజయ్ లీలా భన్సాలీ తెరెకెక్కిస్తున్న తాజా సిరీస్ ‘హీరా మండి’. మనీషా కోయిరాల, అదితీరావ్ హైదరి, సోనాక్షీ సిన్హా, రీచా చద్దా, షర్మిన్ సెగల్, సంజీదా షేక్‌లు లీడ్ రోల్స్ చేశారు. ప్రేమ, ద్రోహం, వారసత్వం, రాజకీయం వంటి అంశాలతో రూ΄÷ందిన ఈæ సిరీస్ 1940 బ్యాక్‌డ్రాప్‌లో సాగుతుంది. హీరా మండి ్ర΄ాంతంలోని వేశ్యల జీవితాల నేపథ్యంలో ఈ సిరీస్ తెరకెక్కింది. త్వరలో ఈ సిరీస్ స్ట్రీమింగ్ కానుంది.
Comments
Please login to add a commentAdd a comment