multistarrer
-
స్టార్ హీరోయిన్లు ఒకే సినిమాలో.. పెద్ద ప్లానింగే!
మల్టీస్టారర్ సినిమాలంటే ఎక్కువగా హీరోలే చేస్తుంటారు. కానీ జస్ట్ ఫర్ ఏ చేంజ్... హిందీలో ఉమెన్ మల్టీస్టారర్ ఫిలింస్ తెరకెక్కుతున్నాయి. 2018లో వచ్చిన లేడీ మల్టీస్టారర్ ఫిల్మ్ ‘వీరే ది వెడ్డింగ్’ రూ. వంద కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. ఆ తర్వాత కథానాయిక ప్రాధాన్యంగా సాగే మల్టీ లేడీ స్టారర్ (ఒకే సినిమాలో ఎక్కువమంది కథానాయికలు నటించడం) చిత్రాలు పెద్దగా రాలేదు. ఇప్పుడు ఆ తరహా చిత్రాలు కొన్ని రూపొంతున్నాయి. ఆ ‘మల్టీ లేడీ స్టారర్’ చిత్రాల గురించి తెలుసుకుందాం. జర ఆలస్యంగా జీ లే జరా బాలీవుడ్ అగ్ర తారలు ప్రియాంకా చోప్రా కత్రినా కైప్, ఆలియా భట్ కలిసి రోడ్ ట్రిప్ బ్యాక్‌డ్రాప్‌లో ‘జీ లే జరా’ అనే సినిమాలో నటించనున్నారు. 2021లోనే దర్శకుడు ఫర్హాన్ అక్తర్ ఈ సినిమాను ప్రకటించినా ఇంకా సెట్స్‌పైకి వెళ్లలేదు. ఈలోపు హాలీవుడ్ కమిట్ మెంట్స్ కారణంగా ‘జీ లే జరా’ చిత్రం నుంచి ప్రియాంకా చో్ప్రా కాల్షీట్స్ సర్దుబాటు చేయలేక కత్రినా కైఫ్ తప్పుకున్నారనే టాక్ వినిపించింది. ఓ దశలో ఈ సినిమా క్యాన్సిల్ అయిందనే ప్రచారం కూడా జరిగింది. అయితే ‘జీ లే జరా’ చిత్రం ఉందని, వచ్చే ఏడాది ఈ సినిమాను సెట్స్‌పైకి తీసుకుని వెళ్తామని ఈ చిత్రనిర్మాతల్లో ఒకరైన రీమా కగ్తి ఇటీవల పేర్కొన్నారు. జోయా అక్తర్ ఈ సినిమాకు మరో నిర్మాత. కాగా ఇటీవల రణ్వీర్ సింగ్ హీరోగా ‘డాన్ 3’ని ప్రకటించారు ఫర్హాన్ అక్తర్. సో.. ఈ సినిమా షూటింగ్ ఓ కొలిక్కి వచ్చిన తర్వాత జర ఆలస్యంగా ‘జీ లే జరా’ చిత్రం సెట్స్‌పైకి వెళ్తుందనే టాక్ వినిపిస్తోంది. ఆకాశంలో... కరీనా కపూర్, టబు, కృతీ సనన్ ఎయిర్‌లైన్ ఇండస్ట్రీలో ఉద్యోగాలు చేస్తున్నారు. ఈ బ్యూటీలు ఈ డ్యూటీ చేస్తున్నది ‘ది క్రూ’ సినిమా కోసం. రాజేష్ క్రిష్ణన్ దర్శకత్వం వహిస్తున్నారు. ముంబై, అబుదాబి లొకేషన్స్‌లో ఈ సినిమా షూటింగ్ జరుగుతోంది. ఎయిర్ లైన్స్ ఇండస్ట్రీలో ఉద్యోగాలు చేస్తున్న ముగ్గురు మహిళల జీవితాలు ఊహించని ఘటనల కారణంగా ఏ విధంగా ప్రభావితం అయ్యాయి? అన్నదే ఈ చిత్రకథ. ఈ సినిమా వచ్చే ఏడాది మార్చిలో రిలీజ్ కానుంది. అన్వేషణ విభిన్నమైన మనస్తత్వాలు, వయసు రీత్యా వ్యత్యాసం ఉన్న నలుగురు మహిళలు బైక్‌పై రోడ్ ట్రిప్ చేసి, ఆ అనుభవాలతో తమ జీవితాలను తాము కొత్తగా ఏ విధంగా మార్చుకున్నారు? అనే కథాంశంతో రూ΄÷ందుతున్న చిత్రం ‘ధక్ ధక్’. ఫాతిమా సనా షేక్, రత్నా ΄ాతక్, సంజన, దియా మీర్జా లీడ్ రోల్స్ చేస్తున్నారు. తరుణ్ డుడేజా దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రానికి తాప్సీ ఓ నిర్మాత. ‘ధక్ ధక్’ వచ్చే ఏడాది విడుదల కానుంది. రైజ్.. రెబల్.. రిపీట్ భూమి పెడ్నేకర్, షెహనాజ్ గిల్, డాలీ సింగ్, కుషా కపిల, షిబానీ బేడీ వంటి తారలు లీడ్ రోల్స్ చేసిన చిత్రం ‘థ్యాంక్యూ ఫర్ కమింగ్’.. ‘రైజ్.. రెబల్.. రిపీట్’ అనేది ఈ సినిమాకు ఉపశీర్షిక. కరణ్ బూలానీఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. 30 ఏళ్లు దాటిన ఓ అమ్మాయి వివాహం చేసుకోదు. దీంతో జీవితంలో ఏదో కోల్పోయిన భావన. తన ఫ్రెండ్స్‌ను కలవాలనుకుంటుంది. స్నేహితులు ఓ ΄ార్టీని ΄్లాన్ చేస్తారు. ఈ క్రమంలో ఎటువంటి ఘటనలు చోటు చేసుకున్నాయి? అనే నేపథ్యంలో ఈ సినిమా కథనం సాగుతుందని బాలీవుడ్ టాక్. అక్టోబరులో ఈ సినిమా విడుదల కానుంది. అలాగే ‘టొరంటో ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్– 2023’లో ‘థ్యాంక్యూ ఫర్ కమింగ్’ చిత్రం ప్రదర్శనకు ఎంపికైందని, టీమ్ అంతా సంతోషంగా ఉన్నామని ఈ చిత్రనిర్మాతల్లో ఒకరైన రేఖా కపూర్ పేర్కొన్నారు. లేడీ మల్టీస్టారర్ ట్రెండ్ వెబ్ సిరీస్‌లోనూ కనిపిస్తోంది. బాలీవుడ్ అగ్రదర్శకుల్లో ఒకరైన సంజయ్ లీలా భన్సాలీ తెరెకెక్కిస్తున్న తాజా సిరీస్ ‘హీరా మండి’. మనీషా కోయిరాల, అదితీరావ్ హైదరి, సోనాక్షీ సిన్హా, రీచా చద్దా, షర్మిన్ సెగల్, సంజీదా షేక్‌లు లీడ్ రోల్స్ చేశారు. ప్రేమ, ద్రోహం, వారసత్వం, రాజకీయం వంటి అంశాలతో రూ΄÷ందిన ఈæ సిరీస్ 1940 బ్యాక్‌డ్రాప్‌లో సాగుతుంది. హీరా మండి ్ర΄ాంతంలోని వేశ్యల జీవితాల నేపథ్యంలో ఈ సిరీస్ తెరకెక్కింది. త్వరలో ఈ సిరీస్ స్ట్రీమింగ్ కానుంది. -
మల్టీ హంగామా.. ఆ సినిమాలపై ఓ లుక్ వేయండి!
ఈ ఏడాది మల్టీస్టారర్ ట్రెండ్ తెలుగులో బాగా కనిపించింది. ‘ఆర్ఆర్ఆర్’, ‘భీమ్లానాయక్’, ‘బంగార్రాజు, ‘ఆచార్య’ వంటి మల్టీస్టారర్ సినిమాలు వచ్చాయి. ఇద్దరు స్టార్ హీరోలు కనిపించిన ఈ ‘మల్టీ హంగామా’లను ప్రేక్షకులు బాగా ఎంజాయ్ చేశారు. వచ్చే ఏడాది మరికొన్ని మల్టీస్టారర్ ఫిల్మ్స్ రానున్నాయి. ప్రస్తుతం సెట్స్‌లో ఉన్న ఆ సినిమాలపై ఓ లుక్ వేయండి. దాదాపు ఇరవైరెండు సంవత్సరాల తర్వాత హీరో చిరంజీవి, రవితేజ స్క్రీన్ షేర్ చేసుకుంటున్నారు. కేఎస్ రవీంద్ర (బాబీ) దర్శకత్వంలో రూపొందుతున్న ‘వాల్తేరు వీరయ్య’ (ప్రచారంలో ఉన్న టైటిల్) సినిమాలోనే స్క్రీన్ షేర్ చేసుకుంటున్నారు చిరంజీవి, రవితేజ. ఇంతకుముందు ఈ ఇద్దరూ కలిసి ‘అన్నయ్య’ (2000) సినిమా చేశారు. ఆ చిత్రంలో చిరంజీవి తమ్ముడు పాత్ర చేశారు రవితేజ. ఇప్పుడు వాల్తేరు వీరయ్య’ చిత్రంలో కూడా చిరంజీవి, రవితేజ బ్రదర్స్‌గానే కనిపిస్తారనే టాక్ ఫిల్మ్ నగర్లో వినిపిస్తోంది. ఇందులో రవితేజ పోలీసాఫీసర్ పాత్రలో నటిస్తున్నారని సమాచారం. చిరంజీవి, రవితేజల కాంబినేషన్ సీన్స్ చిత్రీకరణ కూడా ఇటీవల వైజాగ్‌లో జరిగింది. ఇక అప్పుడు ‘అన్నయ్య’ చిత్రం జనవరిలో సంక్రాంతి పండక్కి రిలీజ్ కాగా, ఇప్పుడు ‘వాల్తేరు వీరయ్య’ సినిమా కూడా సంక్రాంతి సందర్భంగానే రిలీజ్ కానుండటం విశేషం. మైత్రీ మూవీమేకర్స్ పతాకంపై నవీన్ ఎర్నేని, వై.రవిశంకర్ నిర్మిస్తున్న ఈ సినిమాలో శ్రుతీహాసన్ హీరోయిన్గా నటిస్తున్నారు. ఇక వెంకటేష్, సల్మాన్ ఖాన్, రామ్‌చరణ్‌లు కలిసి సిల్వర్ స్క్రీన్‌పై ఒకేసారి కనిపిస్తే వారి అభిమానులు విజిల్స్ వేయాల్సిందే. ఈ ముగ్గురూ కలిసి హిందీ చిత్రం ‘కిసీ కీ భాయ్ కీసీ కీ జాన్’ అనే సినిమాలో స్క్రీన్ షేర్ చేసుకున్నారు. సల్మాన్ ఖాన్, వెంకటేశ్ లీడ్ హీరోలుగా నటిస్తున్న ఈ చిత్రంలో రామ్‌చరణ్‌ది అతిథి పాత్ర. ఓ పాటలో మాత్రమే చరణ్ కనిపిస్తారు. ఫర్హాద్ సామ్జీ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో పూజా హెగ్డే, జగపతిబాబు ఇతర లీడ్ రోల్స్ చేస్తున్నారు. ఈ సినిమాను వచ్చే ఏడాది రంజాన్‌కి రిలీజ్ చేయాలనుకుంటున్నారు. మరోవైపు ‘మనం’, ‘బంగార్రాజు’ చిత్రాల్లో పెద్ద కుమారుడు నాగచైతన్యతో కలిసి నటించిన నాగార్జున ఇప్పుడు చిన్న కుమారుడు అఖిల్‌తో ఓ సినిమా చేయనున్నారు. అక్కినేని నాగేశ్వరరావు–నాగార్జున– నాగచైతన్య నటించిన ‘మనం’లో అఖిల్ ఓ గెస్ట్ రోల్లో కనిపించిన విషయం తెలిసిందే. ఇప్పుడు నాగార్జున, అఖిల్ హీరోలుగా మోహన్‌రాజా దర్శకత్వంలో ఓ భారీ మల్టీస్టారర్ ఫిల్మ్ తెరకెక్కనుంది. ఇంకోవైపు ‘అగ్ని నక్షత్రం’ కోసం తొలిసారి స్క్రీన్ షేర్ చేసుకుంటున్నారు తండ్రీకూతురు మంచు మోహన్ బాబు, మంచు లక్ష్మి. ప్రతీక్ ప్రజోష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో విశ్వంత్, చిత్రా శుక్లా, మలయాళ నటుడు సిద్ధిఖ్ ఇతర లీడ్ రోల్స్ చేస్తున్నారు. శ్రీ లక్ష్మీ ప్రసన్న పిక్చర్స్, మంచు ఎంటర్టైన్ మెంట్‌పై ఈ చిత్రం రూపొందుతోంది. మలయాళ హిట్ ‘ఆండ్రాయిడ్ కుంజప్పన్ వెర్షన్ 5.25’ తెలుగు రీమేక్ హక్కులను హీరో– నిర్మాత విష్ణు మంచు దక్కించు కున్నారని తెలిసింది. ఈ సినిమాలో తండ్రి పాత్రలో మోహన్‌బాబు నటించనున్నారు. తనయుడు పాత్రలో టాలీవుడ్‌లోని ఓ యంగ్ హీరో కనిపిస్తారట. ఒకవేళ మంచు విష్ణుయే ఈ పాత్రనూ చేస్తే అది మరో మల్టీస్టారర్ అవుతుంది. ఇంకోవైపు మేనమామ... మేనల్లుడు పవన్ కల్యాణ్– సాయిధరమ్ తేజ్‌లు స్క్రీన్ షేర్ చేసుకోనున్నారనే వార్తలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. తమిళంలో విజయం సాధించిన ‘వినోదాయ సిత్తమ్’ తెలుగులో రీమేక్ కానుందని, ఈ చిత్రంలోనే పవన్ కల్యాణ్, సాయిధరమ్ నటించనున్నారన్నది ఫిల్మ్ నగర్ టాక్. సముద్రఖని ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తారట. ఇంకోవైపు మీడియమ్ రేంజ్ హీరోల మల్టీస్టారర్ మూవీస్ కూడా రానున్నాయి. హీరో సత్య దేవ్, డాలీ ధనంజయ (‘పుష్ప’ సినిమాలో యాక్ట్ చేశారు) కలిసి ఓ మల్టీస్టారర్ ఫిల్మ్ చేస్తున్నారు. ఈ సినిమాకు ఈశ్వర్కార్తీక్ దర్శకుడు. అలాగే రాజ్ తరుణ్, ‘జార్జిరెడి’్డ ఫేమ్ సందీప్ మాధవ్ ‘మాస్ మహా రాజు’ అనే సినిమా చేస్తున్నారు. ఇవేకాదు.. మరికొన్ని మల్టీస్టారర్ ఫిల్మ్స్‌కి కాంబినేషన్ సెట్ అవుతోందని తెలిసింది. -
బాబాయ్.. అబ్బాయ్.. ఓ మల్టీస్టారర్
తెలుగు చిత్రపరిశ్రమలో మల్టీస్టారర్స్‌కు క్రేజ్ తీసుకొచ్చిన హీరోల్లో వెంకటేశ్ ఒకరు. ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ సినిమాలో మహేశ్‌బాబుతో, ‘గోపాల గోపాల’ చిత్రంలో పవన్ కల్యాణ్‌తో కలిసి నటించారాయన. గత ఏడాది మేనల్లుడు నాగచైతన్యతో ‘వెంకీ మామ’ సినిమా చేశారు. ఇప్పుడు అన్న సురేశ్‌బాబు కొడుకు రానాతో సినిమా చేయనున్నారని టాక్. తమిళంలో ఘనవిజయం సాధించిన ఓ చిత్రానికి ఇది తెలుగు రీమేక్ అని, తెలుగుకి అనుగుణంగా కథని మార్చి, పక్కా స్క్రిప్ట్ రెడీ చేశారనే మాటలు వినిపిస్తున్నాయి. ఈ చిత్రానికి వీరూ పోట్ల దర్శకత్వం వహిస్తారని సమాచారం. డిసెంబర్ 13న వెంకటేశ్ పుట్టినరోజు సందర్భంగా బాబాయ్–అబ్బాయ్ సినిమా ప్రకటన వెలువడే అవకాశం ఉందట. కాగా క్రిష్ దర్శకత్వంలో రానా హీరోగా తెరకెక్కిన ‘కృష్ణం వందే జగద్గురుం’ సినిమాలో ‘బళ్లారి బావ..’ పాటలో రానాతో కలసి వెంకటేశ్ సందడి చేసిన విషయం గుర్తుండే ఉంటుంది. ఇప్పుడు ఫుల్ సినిమాలో ఇద్దరూ కనిపిస్తే సందడి డబుల్ అనొచ్చు. రియాలిటీ షోలో.. మల్టీస్టారర్ సినిమా కంటే ముందు వెంకటేశ్–రానా ఓ రియాలిటీ షో చేయనున్నట్లు టాక్. ఇటీవల రానా ఓ యూట్యూబ్ ఛానెల్ ప్రారంభించారు. దానికోసం ఈ ఇద్దరూ ఓ షో చేయనున్నారట. అలాగే ఓ ఎంటర్టైన్మెంట్ చానల్ వీరి కాంబినేషన్లో ఓ రియాలిటీ షోకు సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. -
మల్టీస్టారర్ లేదట
షారుక్ ఖాన్, సల్మాన్ ఖాన్‌ను పూర్తి స్థాయి మల్టీస్టారర్ చిత్రంలో చూపించడానికి దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ ప్లాన్ చేస్తున్నట్లు ఆ మధ్య వార్తలు వినిపించాయి. 1952లో వచ్చిన ఓ సూపర్ హిట్ చిత్రానికిది రీమేక్ అని కూడా ప్రచారం జరిగింది. ఈ వార్త విని షారుక్, సల్మాన్ అభిమానులు ఖుష్ అయిపోయారు. లేటెస్ట్ అప్డేట్ ఏంటంటే భన్సాలీ లేటెస్ట్ చిత్రం మల్టీస్టారర్ కాదట. అందులో సల్మాన్ ఖాన్ సోలో హీరోగా నటిస్తారట. ఇది ఏ సినిమాకీ రీమేక్ కాదని, లేటెస్ట్ ట్రెండ్‌కు తగ్గట్టు మోడ్రన్ లవ్‌స్టోరీగా ఉండబోతోందని టాక్. అలాగే ఈ సినిమాకు ‘హమ్ దిల్ దే చుకే సనమ్ 2’ (భన్సాలీ – సల్మాన్ చిత్రాల్లో ఒకటి)ను వర్కింగ్ టైటిల్‌గా ఉంచాలని చిత్రబృందం ప్లాన్ చేస్తోందని సమాచారం. -
రామ్ చరణ్ మల్టీ స్టారర్.. ఫేక్ న్యూస్
ప్రస్తుతం బోయపాటి శ్రీను దర్శకత్వంలో నటిస్తున్న మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ త్వరలో ఎన్టీఆర్‌తో కలిసి ఓ భారీ మల్టీ స్టారర్ సినిమా చేసేందుకు రెడీ అవుతున్నాడు. ఈ సినిమా సెట్స్ మీదకు రాకముందే మరో క్రేజీ మల్టీస్టారర్‌కు రామ్ చరణ్ అంగీకరించినట్టుగా వార్తలు వస్తున్నాయి. మహానటి సినిమాలో జెమినీ గణేషన్ పాత్రలో ఆకట్టుకున్న దుల్కర్ సల్మాన్‌తో కలిసి చరణ్ ఓ సినిమా చేయనున్నాడన్న వార్త సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. అంతేకాదు తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి తెరకెక్కుతున్న ఈ సినిమాకు కే చక్రవర్తి కథ అందిస్తుండగా కే యస్ రవిచంద్ర దర్శకత్వం వహిస్తారన్న టాక్ వినిపిస్తోంది. అయితే ఈ వార్తలపై దుల్కర్ సల్మాన్ సన్నిహితులు స్పందించారు. దుల్కర్ ఏ మల్టీ స్టారర్ సినిమాకు అంగీకరించలేదని తెలిపారు. ప్రస్తుతం తన బాలీవుడ్ డెబ్యూ కర్వాన్ పనుల్లో బిజీగా ఉన్న దుల్కర్, తరువాత ఇప్పటికే అంగీకరించిన మలయాళ చిత్రాలు పూర్తి చేయనున్నారు. -
రాజమౌళి ఆ ‘ఆర్’ పై క్లారిటీ
బాహుబలి లాంటి భారీ చిత్రం తరువాత రాజమౌళి ఓ మల్టీ స్టారర్ సినిమాను తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవల ఆర్ ఆర్ ఆర్ అనే టీజర్ తో రామ్ చరణ్, ఎన్టీఆర్ ల కాంబినేషన్లో తానో మల్టీ స్టారర్ చేయబోతున్నట్టుగా ప్రకటించారు రాజమౌళి. అధికారిక ప్రకటనకు ముందు నుంచే ఈ సినిమాపై రకరకాల వార్తలు వినిపించాయి. సినిమా నటీనటుల నుంచి పాత్రల వరకు చాలా రూమర్స్ టాలీవుడ్ లో చక్కర్లు కొట్టాయి. అదే బాటలో ఈ సినిమాలో విలన్‌గా యాంగ్రీ హీరో రాజశేఖర్ నటించనున్నాట్టుగా వార్తలు వినిపించాయి. అయితే ఈ విషయంపై రాజశేఖర్ భార్య జీవితా రాజశేఖర్ క్లారిటీ ఇచ్చారు. ఓ ఆంగ్ల పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ‘తమ కూతురు శివానీ హీరోయిన్ గా తెరకెక్కుతున్న 2 స్టేట్స్ సినిమా ప్రారంభోత్స కార్యక్రమానికి ఆహ్వానించేందుకు మాత్రమే రాజమౌళిని కలిసాం. మల్టీ స్టారర్‌కు సంబంధించి రాజమౌళి గారు తమను సంప్రదించలేదన్నారు’ దీంతో రాజమౌళి మల్టీ స్టారర్లో రాజశేఖర్ విలన్ అంటూ వస్తున్న వార్తలకు తెరపడింది. అంతేకాదు సినిమాలో నటీనటుల ఎంపికకు రాజమౌళి ఆర్ సెంటిమెంట్‌ను ఫాలో అవుతున్నారన్న వార్తలు నిజంగా కాదని తేలిపోయింది. -
యంగ్ డైరెక్టర్‌తో నాగ్, నాని..?
టాలీవుడ్ తెరపై మరో ఇంట్రస్టింగ్ ప్రాజెక్ట్ కు రంగం సిద్ధమవుతుందన్న టాక్ వినిపిస్తోంది. యంగ్ హీరోలు సత్తా చాటుతుండటంతో సీనియర్ హీరోలు మల్టీ స్టారర్ సినిమాల వైపు మొగ్గుచూపుతున్నారు. ప్రస్తుతం రాజుగారి గది 2 షూటింగ్ తో పాటు అఖిల్ రెండో సినిమా నిర్మాణం, నాగచైతన్య సమంతల పెళ్లి పనుల్లో బిజీగా ఉన్నారు సీనియర్ హీరో నాగార్జున. ఈ పనులన్ని పూర్తయ్యాక ఓ మల్టీ స్టారర్ సినిమాకు రెడీ అవుతున్నారట. తాజా సమాచారం ప్రకారం.. నాని, సీనియర్ హీరో నాగ్‌తో కలిసి ఓ మల్టీ స్టారర్ సినిమా చేయనున్నాడట. చాలా రోజులుగా ఈ టాక్ వినిపిస్తున్నా.. నాగ్ నుంచి గాని, నాని నుంచి గాని ఎలాంటి అధికారిక ప్రకటనా రాలేదు. భలే మంచి రోజు, శమంతకమణి చిత్రాలతో ఆకట్టుకున్న శ్రీరామ్ ఆదిత్య ఈ కాంబినేషన్ లో సినిమాను తెరకెక్కించేందుకు రెడీ అవుతున్నాడు. ప్రస్తుతం నాని.. ఎంసీఏ, కృష్ణార్జున యుద్ధం సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఈ రెండు సినిమాలు పూర్తయిన తరువాత నాగ్, నానిల కాంబినేషన్ పై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. -
తేజ దర్శకత్వంలో మెగా మల్టీ స్టారర్..?
చాలా కాలం తరువాత నేనే రాజు నేనే మంత్రి సినిమాతో సక్సెస్ ట్రాక్ లోకి వచ్చిన దర్శకుడు తేజ, ఇప్పుడు మరో ఇంట్రస్టింగ్ సినిమాకు రెడీ అవుతున్నాడన్న టాక్ వినిపిస్తోంది. ఇప్పటికే యంగ్ హీరోలతో ఓ మల్టీ స్టారర్ సినిమా చేసే ఆలోచన ఉన్నట్టుగా తేజ ప్రకటించాడు. అయితే ఆ హీరోలు ఎవరన్నది మాత్రం వెల్లడించలేదు. తాజాగా తేజ దర్శకత్వంలో మల్టీ స్టారర్ సినిమా చేయబోయే హీరోలకు సంబంధించి ఆసక్తికరమైన వార్త ఒకటి టాలీవుడ్ సర్కిల్స్ లో హల్ చల్ చేస్తోంది. బిగ్ హిట్ కోసం ఎదురుచూస్తున్న మెగా హీరోలు సాయి ధరమ్ తేజ్, వరుణ్ తేజ్ లు తేజ దర్శకత్వంలో కలిసి నటించనున్నారట. ఈ సినిమా యునైటెడ్ మూవీస్ బ్యానర్ లో తెరకెక్కనుంది. అయితే ఈ మెగా మల్టీ స్టారర్ కు సంబంధించి అఫీషియల్ గా మాత్రం ఎలాంటి కన్ఫర్మేషన్ రాలేదు. అయితే చిత్రయూనిట్ ఈ వార్తలను ఖండించకపోవటంతో అభిమానులు మెగా మల్టీ స్టారర్ సెట్స్ మీదకు రావటం ఖాయం అని భావిస్తున్నారు. -
మెగా-నందమూరి మల్టీస్టారర్..?
-
మెగా-నందమూరి మల్టీస్టారర్..?
మెగా, నందమూరి హీరోల కాంబినేషన్లో త్వరలో ఓ మల్టీస్టారర్ తెరకెక్కనుంది. ఇటు మెగాస్టార్ ఫ్యామిలీ నుంచి, అటు నందమూరి ఫ్యామిలీ నుంచి చాలామంది స్టార్లు ఉన్నప్పటికీ ఇప్పటివరకు వీరి కాంబినేషన్లో మల్టీస్టారర్ రాలేదు. తాజాగా నందమూరి కల్యాణ్ రామ్, మెగా హీరో సాయి ధరమ్ తేజ్‌లు కలిసి ఓ సినిమాలో నటించనున్నారని టాక్. స్వయంగా కల్యాణ్ రామే.. ధరమ్ తేజ్ పేరుని సూచించారని తెలుస్తోంది. ధరమ్ తేజ్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ప్రాజెక్టు పట్టాలకెక్కే అవకాశాలున్నట్లు సమాచారం. ఏ.ఎస్.రవికుమార్ చౌదరి ఈ సినిమాను తెరకెక్కించనున్నారు. ప్రస్తుతం ఇద్దరు వేరు వేరు సినిమాల షూటింగుల్లో బిజీగా ఉండటంతో ఆ ప్రాజెక్టులు పూర్తవ్వగానే ఈ మల్టీస్టారర్‌ను మొదలుపెట్టాలని చూస్తున్నారు. అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.1981లో ఎన్టీఆర్, చిరంజీవిలు కలిసి నటించిన 'తిరుగులేని మనిషి' సినిమా తర్వాత.. ఇన్నాళ్లకు ఇరు కుటుంబాలకు చెందిన తారలు ఒకే సినిమాలో కనిపించడం ఇదే తొలిసారి అవుతుంది. -
క్రేజీ కాంబినేషన్!
మామూలుగా స్టార్ హీరో నటించే ఏ సినిమా అయినా ప్రేక్షకులకు ఆసక్తికరమే. ఇక మల్టీస్టారర్ అయితే ఆ క్రేజ్ అంబరాన్నంటుతుంది. నాగార్జున, కార్తి కాంబినేషన్లో ఓ సినిమా రూపొందనుందనే వార్త గత కొంతకాలంగా మీడియాలో హల్చల్ చేస్తోంది. ఈ విషయాన్ని పీవీపీ సంస్థ అధినేత పొట్లూరి వి. ప్రసాద్ శనివారం అధికారికంగా ప్రకటించారు. అత్యంత భారీ నిర్మాణ వ్యయంతో ఈ చిత్రాన్ని రూపొందించనున్నామని ఆయన చెప్పారు. ‘మున్నా’ వంటి యాక్షన్ ఎంటర్టైనర్, ‘బృందావనం’ వంటి కుటుంబ కథా చిత్రం, ‘ఎవడు’ వంటి మాస్ ఎంటర్టైనర్ని తెరకెక్కించి, ప్రతిభ నిరూపించుకున్న వంశీ పైడిపల్లి ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నారు. తెలుగు, తమిళ భాషల్లో ఈ చిత్రం రూపొందనుంది.