యంగ్ డైరెక్టర్తో నాగ్, నాని..? | Nag And Nani To Team Up For A Multistarrer | Sakshi
Sakshi News home page

యంగ్ డైరెక్టర్తో నాగ్, నాని..?

Published Mon, Sep 11 2017 10:47 AM | Last Updated on Mon, Jul 15 2019 9:21 PM

Nag And Nani To Team Up For A Multistarrer

టాలీవుడ్ తెరపై మరో ఇంట్రస్టింగ్ ప్రాజెక్ట్ కు రంగం సిద్ధమవుతుందన్న టాక్ వినిపిస్తోంది. యంగ్ హీరోలు సత్తా చాటుతుండటంతో సీనియర్ హీరోలు మల్టీ స్టారర్ సినిమాల వైపు మొగ్గుచూపుతున్నారు. ప్రస్తుతం రాజుగారి గది 2 షూటింగ్ తో పాటు అఖిల్ రెండో సినిమా నిర్మాణం, నాగచైతన్య సమంతల పెళ్లి పనుల్లో బిజీగా ఉన్నారు సీనియర్ హీరో నాగార్జున. ఈ పనులన్ని పూర్తయ్యాక ఓ మల్టీ స్టారర్ సినిమాకు రెడీ అవుతున్నారట.

తాజా సమాచారం ప్రకారం.. నాని, సీనియర్ హీరో నాగ్తో కలిసి ఓ మల్టీ స్టారర్ సినిమా చేయనున్నాడట. చాలా రోజులుగా ఈ టాక్ వినిపిస్తున్నా.. నాగ్ నుంచి గాని, నాని నుంచి గాని ఎలాంటి అధికారిక ప్రకటనా రాలేదు. భలే మంచి రోజు, శమంతకమణి చిత్రాలతో ఆకట్టుకున్న శ్రీరామ్ ఆదిత్య ఈ కాంబినేషన్ లో సినిమాను తెరకెక్కించేందుకు రెడీ అవుతున్నాడు. ప్రస్తుతం నాని.. ఎంసీఏ, కృష్ణార్జున యుద్ధం సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఈ రెండు సినిమాలు పూర్తయిన తరువాత నాగ్, నానిల కాంబినేషన్ పై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement