సీక్వెల్‌ చేయాలని ఉంది | Sriram Aditya interview about DevaDas | Sakshi
Sakshi News home page

సీక్వెల్‌ చేయాలని ఉంది

Published Sun, Sep 30 2018 5:44 AM | Last Updated on Sat, Aug 3 2019 12:30 PM

Sriram Aditya interview about DevaDas - Sakshi

శ్రీరామ్‌ ఆదిత్య

‘‘సినిమాకు వస్తోన్న రెస్పాన్స్‌ చూస్తుంటే ఆనందంగా ఉంది. హైదరాబాద్‌లోని ఓ థియేటర్‌లో  సినిమా అయిపోయాక అందరూ లేచి చప్పట్లు కొట్టారు. అది నా లైఫ్‌లో బెస్ట్‌ మూమెంట్‌’’ అని దర్శకుడు శ్రీరామ్‌ ఆదిత్య అన్నారు. నాగార్జున, నాని హీరోలుగా వైజయంతీ మూవీస్‌ బ్యానర్‌పై అశ్వినీదత్‌ నిర్మించిన చిత్రం ‘దేవదాస్‌’. శ్రీరామ్‌ ఆదిత్య దర్శకుడు. ఈ చిత్రం గురువారం రిలీజైంది. ఈ సందర్భంగా శ్రీరామ్‌ ఆదిత్య పంచుకున్న విశేషాలు.

► నాగార్జున గారు ఫస్ట్‌ కాపీ చూశాక ‘శ్రీరామ్‌ 30 మంది చూశాం. అందరూ బాగా ఎంజాయ్‌ చేశారు’ అన్నారు. హాలిడే కోసం ఫ్లైట్‌ ఎక్కేటప్పుడు కూడా నవ్వుతూనే ఉన్నారు. ఆయన అంత ఎగై్జట్‌ అయ్యారు. ∙ ఫస్ట్‌ దత్‌గారు ఈ లైన్‌ విన్నారు. నాగార్జున, నాని హీరోలుగా ఫిక్స్‌ అయ్యారు. అప్పటికి జస్ట్‌ లైన్‌ మాత్రమే ఉంది. దాని మీద రెండు మూడు నెలలు వర్క్‌ చేశాను. వైజయంతీ మూవీస్‌ సినిమాలు చూస్తూ పెరిగాను. అలాంటి బ్యానర్‌లో సినిమా చేయడం ఆనందంగా ఉంది.

► మల్టీస్టారర్‌ చేయడం బరువుగా అనిపించలేదు. ఎగై్జటింగ్‌గా అనిపించింది. షూటింగ్‌ లొకేషన్‌లో నాగ్‌సార్, నానీని మానిటర్‌లో చూస్తుంటే ఆడియన్స్‌కు ఎప్పుడు చూపించాలా అని ఆత్రుతగా ఉండేది.

► నాగార్జున గారిని, ఆయన చరిష్మాను తిరిగి ‘దేవదాస్‌’ సినిమాలో చూపించాలనుకున్నాను. నాని లుక్‌ పాత సినిమాల్లా ఉండకుండా జాగ్రత్త పడ్డాం.

► పూజ పాత్ర కోసం రష్మికా మండన్నాను అనుకున్నప్పుడు ‘గీత గోవిందం’ ఇంకా రిలీజ్‌ కాలేదు. దాదాపు 30 మందిని ఆడిషన్‌ చేసి, రష్మికను సెలెక్ట్‌ చేశాం.

► నాగార్జునగారు ఉట్టి కొట్టే సీన్‌లో డూప్‌తో చేయిద్దాం అనుకున్నాం. కానీ ఆయన నేనే చేసేస్తా అని సింగిల్‌ టేక్‌లో చేసేశారు. ఆ ఎనర్జీ చూసి అందరం షాక్‌ అయ్యాం.

► నెక్ట్స్‌ ఇంకా ఏం అనుకోలేదు. సక్సెస్‌ని ఎంజాయ్‌ చేస్తున్నాను. అందరూ మా సినిమా గురించి మంచిగా మాట్లాడుతున్నారు. హాయిగా నిద్రపోతున్నాను. అలానే నిద్రలేస్తున్నాను. కలెక్షన్స్‌ గురించి పట్టించుకోను. నచ్చితే ప్రేక్షకులే పెద్ద స్థాయికి తీసుకెళతారు.

► ఇది ఏ హాలీవుడ్‌ సినిమాకు కాపీ కాదు. హాలీవుడ్‌ మూవీలను చూసి ఆనందిస్తాను కానీ అనుకరించను. ‘దేవదాస్‌’కి సీక్వెల్‌ ఉంటే బావుంటుంది అనిపిస్తుంది. చూడాలి. అప్పుడింకా హ్యూమర్‌ యాడ్‌ చేస్తాను.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement