Devdas
-
డెబ్బై మూడేళ్ల బామ్మ... మాధురితో పోటీపడి డ్యాన్స్ చేసింది!
‘డ్యాన్స్ వయసు ఎరగదు’ అనే సామెత ఉందో లేదోగాని ఈ వీడియో చూస్తే ‘నిజమే సుమీ’ అనిపిస్తుంది. ప్రముఖ డ్యాన్స్ రియాలిటీ షో ‘డ్యాన్స్ దివానే’లో 73 సంవత్సరాల బామ్మ డ్యాన్స్ వైరల్ అయింది. ఛోబీ అనే బామ్మ ‘దేవదాస్’ సినిమాలోని మాధురి దీక్షిత్ పాపులర్ పాట ‘మార్ డాలా’కు అద్భుతంగా డ్యాన్స్ చేసింది. రియాల్టీ షో జడ్జీలు మాధురి దీక్షిత్, సునీల్షెట్టీలకు ఛోబీ డ్యాన్స్ బాగా నచ్చింది. ‘మనసులో ఏది అనిపిస్తే అది చేయాలి. భయం అవసరం లేదు... అని మీరు మాకు చెబుతున్నట్లుగా ఉంది’ అని బామ్మను ప్రశంసించింది మాధురి. ఆ తరువాత బామ్మతో కలిసి మాధురి దీక్షిత్ డ్యాన్స్ చేసింది. ‘మాధురి అంటే డ్యాన్స్‌కు మరో పేరు. ఆమె పాపులర్ పాటకు డ్యాన్స్ చేయాలంటే సాహసం మాత్రమే కాదు. ప్రతిభ కూడా ఉండాలి. ప్రతిభ, సాహసం మూర్తీభవించిన ఛోబీజీకి అభినందనలు’. ‘మాధురితో పోటీపడి డ్యాన్స్ చేయడం మామూలు విషయం కాదు’... ఇలాంటి కామెంట్స్ ఎన్నో సోషల్ మీడియాలో కనిపించాయి. -
దేవదా... నా నటన నచ్చిందా?
సినిమాలలోని పాపులర్ సీన్లను రీక్రియేట్ చేసి ఆనందించడం మనకు కొత్త కాదు. సంజయ్‌లీలా బన్సాలీ ‘దేవదాస్’ సినిమాలో ‘పారు’ పాత్రలోని ఐశ్వర్యారాయ్‌ని అనుకరిస్తూ కైరా ఖన్నా అనే బాలిక చేసిన వీడియో తాజాగా వైరల్ అయింది. ఐకానిక్ సినిమాలలోని పాపులర్ సీన్లను అనుకరిస్తూ కైరా చేసే వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి. ‘జిస్ వక్త్ తుమ్హారే సాథ్ హోతి హమ్ ఉస్ వక్త్ బద్నామి కా బీ డర్ నహీ లగ్తా’ ‘దస్ సాల్ పహ్లే తుమ్హరే నామ్ కా దియా జలాయ థా మైనే. ఉసే ఆజ్ తక్ బుజ్నే నహీ దియా’... ఇలా ‘దేవదాస్’ సినిమాలోని ‘పారు’ పాపులర్ డైలాగ్‌లతో ‘వావ్’ అనిపించింది కైరా ఖన్నా. ‘డైలాగుల నుంచి ఎక్స్ప్రెషన్ వరకు అద్భుతం’ ‘అద్భుతమైన యాక్టింగ్ స్కిల్స్ ఉన్న కైరాకు బాలీవుడ్లో బ్రైట్ ఫ్యూచర్ ఉంది’... అంటూ నెటిజనులు కైరా ఖన్నాపై ప్రశంసల వర్షం కురిపించారు. -
శ్రమజీవనమే పరమానందం
‘బాధే సౌఖ్యమనే భావన రానీవోయ్’ అన్నాడు దేవదాస్. బాధ సంగతేమిటోగానీ కష్టంలోనే సౌఖ్యాన్ని వెదుక్కుంది చెన్నైకి చెందిన పరమేశ్వరి. తన కుటుంబాన్ని పో షించుకోవడం కోసం గత ఇరవై సంవత్సరాలుగా రోజుకు మూడు ఉద్యోగాలు చేస్తోంది... పేద ఇంట్లో పుట్టి పెరిగింది పరమేశ్వరి. అష్టకష్టాలు పడి కూతురి పెళ్లి చేశారు తల్లిదండ్రులు. వారి సంతోషం కరిగిపో యి విషాదంగా మారడానికి ఎంతోకాలం పట్టలేదు. దీనికి కారణం... అల్లుడు. అతడు పనిచేసేవాడు కాదు. పైగా మద్యానికి బానిస. పెళ్లితో కష్టాలన్నీ తీరుతాయి అనుకున్న పరమేశ్వరి పరిస్థితి పెనం మీది నుంచి పోయ్యిలో పడ్డట్లు అయింది. ఇల్లు దాటి పని చేయాల్సిన తప్పనిసరి పరిస్థితి ఎదురైంది. కొన్ని సంవత్సరాల తరవాత చెల్లి భర్త చనిపో యాడు. ఆమె అక్క దగ్గరకి వచ్చేసింది. భర్త, పిల్లలు, తల్లి, చెల్లి, ఆమె కూతురు... వీరిని పో షించాలంటే ఒక్క ఉద్యోగం చేస్తే సరిపో దనే విషయం పరమేశ్వరికి అర్థమైంది. అలా రోజుకు మూడు ఉద్యోగాలు చేయడం మొదలుపెట్టింది. పోద్దున నాలుగు గంటలకు లేచి ఒకరి ఇంట్లో ఇంటిపనులు చేస్తుంది. ఆ తరువాత ఒక ఐటీ కంపెనీలో పని చేస్తుంది (ఉద్యోగులకు టీ, కాఫీలు అందించడం) సాయంత్రం ఒక హోటల్లో పాత్రలు శుభ్రం చేస్తుంది. పరమేశ్వరి ఇంటికి వెళ్లేసరికి రాత్రి పదకొండు అవుతుంది. తన మాటల్లోనే చెప్పాలంటే ఆమెకు వీకెండ్స్, హాలిడేలు, సన్డేలు లేవు. ‘కష్టాల మధ్య పెరిగాను. అందుకే కష్టపడడాన్ని భారంగా, బాధగా భావించడం లేదు. జీవితం అంటేనే పో రాటం. ఆ పో రాటంలో ప్రతిరోజూ కష్టపడాల్సిందే. సుఖంలోనే కాదు కష్టపడడం లోనూ సంతోషాన్ని వెదుక్కోవచ్చు’ అంటుంది చెన్నైలోని ఎంజీఆర్ నగర్‌కు చెందిన 36 సంవత్సరాల పరమేశ్వరి. పరమేశ్వరికి ఒక కల ఉంది. సొంతంగా ఒక ఇల్లు, ఒక వెహికిల్ ఉండాలి. అదృష్టం అనేది కష్టపడేవారి అడ్రస్ వెదుక్కుంటూ వస్తుంది అంటారు. పరమేశ్వరి కోసం ఏ అదృష్టం వెదుక్కుంటూ రాలేదు గానీ తన శ్రమ ఫలితమే ఇల్లుగా, వాహనంగా మారాయి. సంపాదించిన దానిలో ఎంతో కొంత దాచుకునేది. అలా ఆమె తన కలను నెరవేర్చుకుంది. ఈ సందర్భాన్ని దృష్టిలో పెట్టుకొని ‘హ్యూమన్స్ ఆఫ్ మద్రాస్’ అనే సంస్థ పరమేశ్వరి గురించి ఇన్‌స్టాగ్రామ్‌లో పో స్ట్ చేసింది. ఇది సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. పరమేశ్వరి శ్రమైక జీవనసౌందర్యాన్ని నెటిజనులు వేనోళ్ల పోగిడారు. -
షూటింగ్ సమయంలో ధోతీ జారిపోతూ ఉండేది: షారుఖ్
దేవదాస్.. బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ కెరీర్లో గుర్తుండిపోయే చిత్రం. పారూ- దేవదాస్‌ల అమర ప్రేమకు దృశ్యరూపమైన ఈ హృద్యమైన ప్రేమకథా చిత్రం ప్రేక్షకుల చేత కంటతడి పెట్టించింది. విషాదాంతంతో ముగిసే ఈ సినిమా భగ్న ప్రేమికుల హృదయానికి అద్దం పట్టింది. షారుఖ్, మాధురీదీక్షిత్(వేశ్య పాత్ర), ఐశ్వర్యారాయ్ పోటీపడి మరీ నటించి తమ తమ కెరీర్ బెస్ట్ పర్ఫామెన్స్లో ఒకటిగా ఈ మూవీని పదిలం చేసుకున్నారు. ఇక సంజల్ లీలా భన్సాలీ తెరకెక్కించిన ఈ రొమాంటిక్ డ్రామా విడుదలై 19 ఏళ్లు అవుతోంది. ఈ సందర్భంగా షారుఖ్ ఖాన్ గత జ్ఞాపకాలు గుర్తుచేసుకున్నాడు. ఈ మేరకు సోమవారం ఇన్‌స్టా వేదికగా.. ‘దేవదాస్’ సినిమా షూటింగ్ సమయం నాటి పలు ఫొటోలను షేర్ చేశాడు. ‘‘అర్ధరాత్రి వరకు షూటింగ్‌లు... పొద్దుపొద్దున్నే నిద్రలేవడం.. అబ్బో ఎన్నో కష్టాలు.. అయితే అవన్నీ మంచి అవుట్‌పుట్‌ను ఇచ్చాయి... ఇందుకు కారణం.. దిగ్గజ సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వంలో మాధురీ దీక్షిత్, ఐశ్వర్యారాయ్, జాకీ ష్రాఫ్, కిరణ్ ఖేర్... ఇంకా టీం మొత్తం కలిసికట్టుగా పనిచేయడమే... అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు’’ అని సహచర నటుల పట్ల ప్రేమను కురిపించాడు. అదే విధంగా... షూటింగ్ సమయంలో ధోతీ ఎప్పుడూ జారిపోతూ ఉండేదని, అన్నింటి కంటే తాను ఎదుర్కొన్న పెద్ద సమస్యే అదేనంటూ సరదాగా వ్యాఖ్యానించాడు. ఇక మాధురీ దీక్షిత్ సైతం.. ‘‘19 ఏళ్లు గడిచినా ఆ జ్ఞాపకాలు ఇంకా కొత్తగానే ఉన్నాయి. ఇంత మంచి అవకాశం ఇచ్చినందుకు థాంక్యూ సంజయ్’’ అని సోషల్ మీడియా వేదికగా కృతజ్ఞతలు చెప్పారు. అదే విధంగా ఇటీవల మరణించిన, ‘దేవదాస్’ దిలీప్ కుమార్(1955 నాటి సినిమా)ను ఈ సందర్భంగా మరోసారి నివాళి అర్పించారు. View this post on Instagram A post shared by Shah Rukh Khan (@iamsrk) -
సరికొత్త ప్రేమ
దేవదాస్ హీరోగా చందు అజ్మీర దర్శకత్వంలో సాయిదత్తా ఆర్ట్ క్రియేషన్స్ బ్యానర్‌పై కె. శైలజ నిర్మిస్తున్న చిత్రం పాటల రికార్డింగ్ ప్రారంభమైంది. ఇందులో హాసిని కథానాయిక. శైలజ కె. మాట్లాడుతూ – ‘‘చందు చెప్పిన కథ బాగుంది. ప్రస్తుత పరిస్థితులకు అద్దం పట్టేలా ఉంది. దేవదాస్‌లో మంచి ప్రతిభ ఉంది. ఈ నెల చివరి వారంలో రెగ్యులర్ షూటింగ్ ఆరంభించి, రెండు షెడ్యూల్స్‌లో సినిమాని పూర్తి చేయాలనుకుంటున్నాం’’ అన్నారు. ‘‘మాస్ల్, క్లాస్ ఆడియన్స్‌కు నచ్చేలా ప్రేమను సరికొత్త రూపంలో చూపించబోతున్నాం. సినిమాలో నాలుగు పాటలు, ఐదు ఫైట్లు ఉన్నాయి’’ అన్నారు చందు అజ్మీర. ‘‘అవకాశం ఇచ్చిన దర్శక–నిర్మాతలకు థ్యాంక్స్. మంచి పాత్ర చేస్తున్నా’’ అన్నారు దేవదాస్. ఈ సినిమాకు సంగీతం: డేవిడ్ జి. పాటలు: చంద్రబోస్, సుద్ధాల అశోక్ తేజ. -
దేవదాసు.. పార్వతి
దేవదాసుది సంపన్న కుటుంబం. తండ్రి పెద్ద జమిందారు. అయినప్పటికి దేవదాసు తన ఇంటి పక్కనే ఉండే పేద కుటుంబానికి చెందిన పార్వతితో చిన్నప్పటినుంచి స్నేహంగా ఉంటాడు. ఆ తర్వాత అతడు పైచదువుల నిమిత్తం లండన్ వెళతాడు. చదువు పూర్తవగానే ఇంటికి తిరిగివస్తాడు. తిరిగి వచ్చిన తరువాత దేవదాసు, పార్వతిల మధ్య ఉన్న స్నేహం.. ప్రేమగా మొగ్గతొడుగుతుంది. పెద్దవాళ్ల అంగీకారంతో పెళ్లి చేసుకోవాలనుకుంటారు. పార్వతి తండ్రి పెళ్లి విషయం మాట్లాడటానికి దేవదాసు తండ్రి దగ్గరకు వెళతాడు. అక్కడ అయితే పేదవాడైన పార్వతి తండ్రిని దేవదాసు తండ్రి తీవ్రంగా అవమానించి పంపుతాడు. విషయం తెలుసుకున్న దేవదాసు.. తండ్రిని నిలదీస్తాడు. తండ్రి రివాల్వర్ తీసి దేవదాసు చేతిలో పెట్టి, తనను చంపేసి ఆ పార్వతిని పెళ్లి చేసుకొమ్మని బెదిరిస్తాడు. దీంతో దేవదాసు మనసు ముక్కలవుతుంది. తండ్రి మాట జవదాటలేక, అక్కడ ఉండలేక పట్నం వెళ్లిపోతాడు. పార్వతి తండ్రి పంతాలకు పోయి ముసలివాడైన జమీందారుతో పార్వతి పెళ్లి జరిపిస్తాడు. పట్నంలో ఉన్న దేవదాసు పార్వతి లేకపోతే బతకలేనని తెలుసుకుని, తిరిగి పల్లెకు వస్తాడు. అప్పటికే పార్వతికి పెళ్లి అయిపోయి అత్తారింటికి వెళ్ళిపోయి ఉంటుంది. భగ్నహృదయుడైన దేవదాసు తిరిగి పట్నం వెళ్లి పోతాడు. అక్కడ పార్వతిని మరువలేక తాగుడుకు అలవాటుపడతాడు. సాని కొంపలో నృత్యంచేసే చంద్రముఖి అనే అమ్మాయితో కాలం గడుపుతుంటాడు. చంద్రముఖి కూడా మనస్ఫూర్తిగా దేవదాసును ప్రేమిస్తుంది. ఆస్తిపోయి, అనారోగ్యం పాలైన దేవదాసు కడసారి పార్వతిని చూడటానికి ఆమె ఉండే పల్లెకు వెళతాడు. అయితే పార్వతిని చూడడానికిముందే ఆమె ఇంటిముందర పడి అతడు చనిపోతాడు. తమ ఇంటి ముందు చనిపోయింది దేవదాసని పార్వతికి తెలుస్తుంది. అతడ్ని చూడాలని ఎంతో ప్రయత్నిస్తుంది. కానీ, దేవదాసును చూడకుండానే పార్వతి కూడా మరణిస్తుంది. నిజానికి దేవదాసు, పార్వతిల ప్రేమ కథ ఓ కల్పితం. అయినప్పటికి వాస్తవానికి ఏమాత్రం తీసిపోని ఆర్థ్రత ఈ కథ సొంతం. ప్రముఖ బెంగాల్ రచయిత శరత్ చంద్ర చటోపాధ్యాయ్ రాసిన ‘దేవదాస్’ నవల ఆధారంగా పలు భాషల్లో తెరకెక్కిన సినిమాలు ప్రేక్షకులను కంటతడి పెట్టించాయి. కథ విషాదాంతమైనా.. మరిచిపోలేని ఓ ప్రేమ కావ్యంలా అందరి మనసులలో చెరిగిపోని ముద్ర వేసుకున్నాయి. ఇప్పటికీ దేవదాస్ పార్వతిల ప్రేమ కథ సినిమాలా కాకుండా ఓ నిజజీవితంలా కళ్లముందు కదలాడుతుంది. -
ఆదిత్యవర్మగా ‘అర్జున్ రెడ్డి’
సాక్షి, న్యూఢిల్లీ : భారతీయ చలనచిత్ర పరిశ్రమలోనే కొత్త చరిత్రను సష్టించిన అలనాటి బెంగాలీ ‘దేవదాస్ (1935)’ చిత్రానికి, తెలుగులో వచ్చిన ఇప్పటి ‘అర్జున్ రెడ్డి’ చిత్రాలకే కాకుండా వాటిలో నటించిన దర్శక నటుడు ప్రమతేష్ చంద్ర బారువా (పీసీ బారువా)కు, విజయ దేవరకొండకు మధ్య పలు విషయాల్లో పోలికలు ఉన్నాయి. ఈ రెండు చిత్రాల్లో నటించిన హీరోలు రాత్రికి రాత్రి స్టార్ హీరోలయ్యారు. నాటి దేవదాస్, నేటి అర్జున్ రెడ్డి చిత్రాల్లో హీరోలిద్దరు భగ్న ప్రేమిక పాత్రలే. హదయాన్ని కలచివేస్తోన్న ప్రేమానుభూతులను మద్యం మత్తులో మరచిపోయేందుకు ప్రయత్నించే పాత్రలే. నాటి దేవదాస్ చిత్రంతో చలనచిత్రాలు కేవలం వినోదానికి మాత్రమే పరిమితమన్న భావన నుంచి సామాజిక స్పహ కూడా ఉంటుందన్న కొత్త భావాన్ని జనంలోకి తీసుకెళ్లింది. అలాగే అర్జున్‌రెడ్డి చిత్రానికి కూడా కాలేజీలు మన కళ్ల ముందు కనిపించే వాస్తవ పరిస్థితులకు అద్దం పట్టిందన్న ప్రశంస కూడా వచ్చింది. నాటి ‘దేవదాస్’ చిత్రంతో దాన్ని రాసిన ప్రముఖ బెంగాలీ కవి శరత్ చంద్ర చటోపాధ్యాయ్ పేరు కూడా బెంగాల్ రాష్ట్రంలో ఇంటింట తెల్సింది. అప్పటి వరకు పెద్దగా చిత్రాలను పట్టించుకోని శరత్ చంద్ర అప్పటి నుంచి దక్షిణ కోల్‌కతాలోని ‘న్యూ థియేటర్స్ స్టుడియో’కు తరచుగా వెళ్లడం ప్రారంభించారట. ఆ తర్వాత పీసీ బారువా అంటే దేవదాస్, దేవదాస్ అంటే పీసీ బారువాగా పేరు పడింది. దాంతో బారువా ఆ చిత్రాన్ని హిందీలో తీయాలనుకున్నారు. అయితే తన హిందీ ఉచ్ఛారణ బాగుండదని తలచి, అప్పటికే పాటలతో పరిచయమున్న కేఎల్ సైగల్ హీరోగా హిందీ ‘దేవదాస్’ తీశారు. అది కూడా ప్రేక్షకుల ప్రజాదరణ పొందడమే కాకుండా కమర్షియల్‌గా సక్సెస్ అయింది. ఆ తర్వాత అక్కినేని నాగేశ్వరరావు హీరోగా తెలుగులో వచ్చిన ‘దేవదాసు’ కూడా సూపర్‌డూపర్ హిట్టయింది. ఆ తర్వాత హిందీలోనే దిలీప్‌కుమార్, షారూక్ ఖాన్లు హీరోలుగా దేవదాస్ చిత్రాలు వచ్చాయి. నాటి బెంగాలీ దేవదాస్‌కు, అర్జున్‌రెడ్డి చిత్రాలకు మరో పోలిక కూడా ఉంది. అదే దేవదాస్ చిత్రం ద్వారా రచయిత శరత్ చంద్ర పేరు ఇల్లిళ్లు తెలిసిపోగా, అర్జున్‌రెడ్డి చిత్రం ద్వారా ఎవరికి తెలియని ఆ సినిమా కథా రచయిత ‘సందీప్ రెడ్డి వంగా’ గురించి తెలుగు ప్రేక్షకులకు తొలిసారి తెలిసింది. ఆయనకు అర్జున్‌రెడ్డి కథ రాయడానికి రెండేళ్లు పట్టగా, అది సినిమాగా రావడానికి మరో నాలుగేళ్లు (2017) పట్టింది. ఇప్పుడు అదే కథ ఆధారంగా హిందీలో షాహిద్ కపూర్ హీరోగా ‘కబీర్ సింగ్’ చిత్రాన్ని నిర్మించారు. ఈ సినిమా ఈనెల 21వ తేదీన విడుదలవుతోంది. మరోపక్క ఇదే కథతో ‘ఆదిత్య వర్మ’ చిత్రం తమిళంలో నిర్మాణం అవుతోంది. ఆ సినిమాలో ‘ధృవ్ విక్రమ్’ హీరోగా పరిచయం అవుతున్నారు. -
మల్టీస్టారర్ అంటే ఇగో ఉండకూడదు
‘‘దేవదాస్’ విడుదల టైమ్‌లో నేను ఇక్కడ లేను. ఫ్యామిలీతో కలిసి హాలిడే ట్రిప్‌కి వెళ్లా. ఆ ట్రిప్ చాలా సరదాగా జరిగింది. ‘శైలజారెడ్డి అల్లుడు, యూ టర్న్, దేవదాస్’ వంటి మూడు సక్సెస్ఫుల్ సినిమాలు సెప్టెంబర్‌లో విడుదలవడంతో పాటు, అఖిల్ ‘మిస్టర్ మజ్ను’ టీజర్ రిలీజ్ కావడంతో చాలా హ్యాపీగా ఉన్నాం. ఎంత సంతోషంగా హాలిడే ట్రిప్‌కి వెళ్లామో అంతే సంతోషంగా తిరిగొచ్చాం’’ అని నాగార్జున అన్నారు. నాగార్జున, నాని హీరోలుగా రష్మికా మండన్న, ఆకాంక్ష సింగ్ హీరోయిన్స్‌గా శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘దేవదాస్’. వైజయంతీ మూవీస్ పతాకంపై సి.అశ్వినీదత్ నిర్మించిన ఈ సినిమా సెప్టెంబర్ 27న విడుదలైంది. శుక్రవారం హైదరాబాద్‌లో నిర్వహించిన ప్రెస్మీట్లో నాగార్జున మాట్లాడుతూ– ‘‘దేవదాస్’ సినిమా వారానికే 41కోట్ల రూపాయల గ్రాస్ వసూలు చేసిందంటే సంతోషంగా ఉంది. కుటుంబమంతా హాయిగా నవ్వుతూ చూడదగ్గ చిత్రమిది. డాక్టర్ దాస్ పాత్రలో నాని లీనమయ్యాడు. మల్టీస్టారర్ సినిమా అంటే ఇగో ఉండకూడదు. నీ రోల్, నా రోల్ అనుకుంటే సినిమా చెడిపోద్ది. సినిమా బావుంటే మనం బాగుంటాం అనుకుని నేను, నాని చేయబట్టే మా మధ్య సన్నివేశాలు బాగా వచ్చాయి. శ్రీరామ్ ఆదిత్యకు మంచి భవిష్యత్ ఉంది. ‘ఆఖరి పోరాటం’ సినిమా చేస్తున్నప్పుడు ఇంకా గ్రాండ్‌గా ఉండాలంటూ అశ్వినీదత్‌గారు డైరెక్టర్ రాఘవేంద్రరావుగారితో పోట్లాడేవారు. ఇప్పటికీ ఆయనకు అదే ప్యాషన్ ఉంది. ఎప్పటికీ వైజయంతీ మూవీస్ పతాకం జెండా ఎగురుతూనే ఉంటుంది. ఎన్టీ రామారావుగారు శంఖం ఊదుతూనే ఉంటారు. ‘దేవదాస్’ సినిమా ఆయనకు కమ్‌బ్యాక్ మూవీ అంటున్నారు. ఆయనకు కమ్ బ్యాక్ మూవీ ఏంటండీ? ఎన్ని హిట్స్ లేవు. ‘మహానటి’ కూడా సూపర్‌హిట్టే. ‘డాన్’ దేవ పాత్రలో ప్రేక్షకులు నన్ను ఆదరించిన విధానం బాగుంది. ఇలాంటి పాత్రలు మరికొన్ని చేయొచ్చనే భరోసా ఇచ్చినందుకు ప్రేక్షకులకు థ్యాంక్స్. ‘శివ’ సినిమా విడుదలై అప్పుడే 29ఏళ్లు అయిందా? అని పొద్దున్నే అనిపించింది. ‘నిన్నే పెళ్లాడతా’ సినిమా చాలా రికార్డులు సాధించింది. ‘అల్లరి అల్లుడు’ సినిమా మాస్‌లోకి తీసుకెళ్లింది’’ అన్నారు. ‘‘భారతదేశ చలన చిత్ర చరిత్రలో అధిక మల్టీస్టారర్ చిత్రాలు చేసిన ఘనత ఎన్టీఆర్–ఏఎన్ఆర్లదే. వారితో మా బ్యానర్లో 14 సినిమాలు చేస్తే రెండు మూడు మినహా అన్నీ హిట్లే. తెలుగులో ఎక్కువ మల్టీస్టారర్ చిత్రాలు తీసిన ఘనత మాదే. కర్నాటకలో మా ‘దేవదాస్’ వారానికి 2కోట్ల 37లక్షల షేర్ రాబట్టింది’’ అన్నారు అశ్వినీదత్. ‘‘దేవదాస్’ చేసే అవకాశమిచ్చిన అశ్వినీదత్, నాగార్జున, నానిగార్లకు థ్యాంక్స్. ప్రేక్షకులతో కలిసి ఆరేడుసార్లు ఈ సినిమా చూశా. బాగా కనెక్ట్ అవుతున్నారు’’ అన్నారు శ్రీరామ్ ఆదిత్య. -
సీక్వెల్ చేయాలని ఉంది
‘‘సినిమాకు వస్తోన్న రెస్పాన్స్ చూస్తుంటే ఆనందంగా ఉంది. హైదరాబాద్‌లోని ఓ థియేటర్లో సినిమా అయిపోయాక అందరూ లేచి చప్పట్లు కొట్టారు. అది నా లైఫ్‌లో బెస్ట్ మూమెంట్’’ అని దర్శకుడు శ్రీరామ్ ఆదిత్య అన్నారు. నాగార్జున, నాని హీరోలుగా వైజయంతీ మూవీస్ బ్యానర్‌పై అశ్వినీదత్ నిర్మించిన చిత్రం ‘దేవదాస్’. శ్రీరామ్ ఆదిత్య దర్శకుడు. ఈ చిత్రం గురువారం రిలీజైంది. ఈ సందర్భంగా శ్రీరామ్ ఆదిత్య పంచుకున్న విశేషాలు. ► నాగార్జున గారు ఫస్ట్ కాపీ చూశాక ‘శ్రీరామ్ 30 మంది చూశాం. అందరూ బాగా ఎంజాయ్ చేశారు’ అన్నారు. హాలిడే కోసం ఫ్లైట్ ఎక్కేటప్పుడు కూడా నవ్వుతూనే ఉన్నారు. ఆయన అంత ఎగై్జట్ అయ్యారు. ∙ ఫస్ట్ దత్‌గారు ఈ లైన్ విన్నారు. నాగార్జున, నాని హీరోలుగా ఫిక్స్ అయ్యారు. అప్పటికి జస్ట్ లైన్ మాత్రమే ఉంది. దాని మీద రెండు మూడు నెలలు వర్క్ చేశాను. వైజయంతీ మూవీస్ సినిమాలు చూస్తూ పెరిగాను. అలాంటి బ్యానర్లో సినిమా చేయడం ఆనందంగా ఉంది. ► మల్టీస్టారర్ చేయడం బరువుగా అనిపించలేదు. ఎగై్జటింగ్‌గా అనిపించింది. షూటింగ్ లొకేషన్లో నాగ్‌సార్, నానీని మానిటర్లో చూస్తుంటే ఆడియన్స్‌కు ఎప్పుడు చూపించాలా అని ఆత్రుతగా ఉండేది. ► నాగార్జున గారిని, ఆయన చరిష్మాను తిరిగి ‘దేవదాస్’ సినిమాలో చూపించాలనుకున్నాను. నాని లుక్ పాత సినిమాల్లా ఉండకుండా జాగ్రత్త పడ్డాం. ► పూజ పాత్ర కోసం రష్మికా మండన్నాను అనుకున్నప్పుడు ‘గీత గోవిందం’ ఇంకా రిలీజ్ కాలేదు. దాదాపు 30 మందిని ఆడిషన్ చేసి, రష్మికను సెలెక్ట్ చేశాం. ► నాగార్జునగారు ఉట్టి కొట్టే సీన్లో డూప్‌తో చేయిద్దాం అనుకున్నాం. కానీ ఆయన నేనే చేసేస్తా అని సింగిల్ టేక్‌లో చేసేశారు. ఆ ఎనర్జీ చూసి అందరం షాక్ అయ్యాం. ► నెక్ట్స్ ఇంకా ఏం అనుకోలేదు. సక్సెస్‌ని ఎంజాయ్ చేస్తున్నాను. అందరూ మా సినిమా గురించి మంచిగా మాట్లాడుతున్నారు. హాయిగా నిద్రపోతున్నాను. అలానే నిద్రలేస్తున్నాను. కలెక్షన్స్ గురించి పట్టించుకోను. నచ్చితే ప్రేక్షకులే పెద్ద స్థాయికి తీసుకెళతారు. ► ఇది ఏ హాలీవుడ్ సినిమాకు కాపీ కాదు. హాలీవుడ్ మూవీలను చూసి ఆనందిస్తాను కానీ అనుకరించను. ‘దేవదాస్’కి సీక్వెల్ ఉంటే బావుంటుంది అనిపిస్తుంది. చూడాలి. అప్పుడింకా హ్యూమర్ యాడ్ చేస్తాను. -
‘బిగ్ బాస్’ నా లైఫ్‌లో మార్పు తీసుకొచ్చింది!
‘‘దేవదాస్’ సినిమా పూర్తయ్యింది. నేను హోస్ట్ చేస్తున్న ‘బిగ్ బాస్ 2’ షో పూర్తి కావొచ్చింది. ఈ రెండు విషయాల్లోనూ ‘హమ్మయ్య’ అని ఫీల్ అవుతున్నా. ఎందుకంటే... ఫస్ట్ టైమ్ నాలుగు నెలలుగా నా కెరీర్లో ఒక హాఫ్ డే కూడా బ్రేక్ లేదు. రెండు గంటలు నా కొడుకుతో గడిపే సమయమూ లేదు. ‘బిగ్ బాస్’ షో నా లైఫ్‌లో మార్పు తీసుకొచ్చింది. నా మూడున్నర నెలల ఒత్తిడికి ఈ వీకెండ్లో శుభం కార్డు పడుతుంది. నెక్ట్స్ హాలీడేకి వెళ్దాం అనుకుంటున్నా’’ అన్నారు నాని. నాగార్జున, నాని హీరోలుగా శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో అశ్వనీదత్ నిర్మించిన ‘దేవదాస్’ చిత్రం ఈ రోజు విడుదలవుతోంది. ఈ సందర్భంగా నాని చెప్పిన సంగతులు... ► ‘దేవదాస్’ సినిమాలో డాక్టర్ దాసు పాత్ర చేశా. నాగ్ సార్, నాకు సింక్ బాగా కుదరడంతో అశ్వనీదత్‌గారు ‘గుండమ్మ కథ’తో పోల్చారు. రాజ్‌కుమార్ హిరానీ సినిమా స్టైల్లో ఉంటుందని నాగార్జునగారు అన్నారు. కథలో ఉన్న పరిస్థితులు నవ్విస్తాయి కానీ డైలాగ్స్ కాదు. నా దృష్టిలో ఫన్, ఎమోషన్స్.. ఇలా అన్నీ ఉన్న కంప్లీట్ ప్యాకేజ్ మూవీ ఇది. ► ‘దేవదాస్’ సినిమా లైన్‌పై మాకు తొలుత 20 శాతం ఐడియా మాత్రమే ఉంది. దీన్ని 100 పర్సెంట్‌గా ఎవరు చేస్తారని కొందరి దర్శకుల పేర్లు అనుకున్నాం. ఒకానొక టైమ్‌లో నాగ్ సర్, నేను కుదిరినప్పుడు చేద్దాం అని వదిలేశాం. ఓసారి శ్రీరామ్‌ను పిలిపించి ఈ 20 పర్సెంట్ ఐడియాను డెవలప్ చెయ్యి.. నాకు, నాగ్ సార్‌కి నచ్చితే చేద్దాం. కుదరకపోతే నీ కష్టం వేస్ట్ అన్నాను. నేను వరంగల్‌లో ‘ఎమ్సీఏ’ సినిమా చేస్తున్నప్పుడు పూర్తి కథ చెప్పాడు. ► ‘దేవదాస్’ కథ విన్న వెంటనే నేను స్వప్నాదత్కి కాల్ చేశా. కానీ నాకు అప్పటికే కొన్ని సినిమాల కమిట్మెంట్స్ ఉన్నాయి. అయితే శ్రీరామ్ కష్టం చూసిన తర్వాత నమ్మకం కుదరింది. నో చెప్పాలనిపించలేదు. అప్పుడు నాగ్ సార్‌కి కథ చెప్పడం.. ఆయనకు నచ్చడంతో ఈ ప్రాజెక్ట్ కుదిరింది. ► నాగార్జునగారితో నేను మాట్లాడగలుగుతానా? అని మొదట్లో అనుకున్నాను. కానీ, ఫస్ట్ డే లంచ్ సమయానికే మా ఇద్దరికీ సింక్ కుదిరింది. నా ఏజ్ యాక్టర్‌తో కలిసి నటిస్తున్నానన్న ఫీలింగ్ వచ్చింది. ► నాగార్జునగారు, బాలకృష్ణగారు, చిరంజీవిగారు, వెంకటేష్‌గారు.. కాకుండా మిగిలిన హీరోలందరూ నా క్లాస్మేట్స్ అనే ఫీలింగ్ ఉంటుంది. కాకపోతే కొందరు ముందు బెంచ్ అయ్యుండొచ్చు. నేను బ్యాక్ బెంచ్ అయ్యుండొచ్చు. కానీ, అందరూ ఒకే క్లాస్‌లో ఉంటాం కదా!. కానీ వాళ్లు నలుగురూ ప్రత్యేకమే. ఎందుకంటే వాళ్ల సినిమాలు చూస్తూ పెరిగాను. ► రెండేళ్ల క్రితం ఐఫా అవార్డ్స్‌కి నాగ్ సార్, అమలగారు వచ్చారు. నాకు చాలా ఇష్టమైన యాక్టర్ నాని అని నాగార్జునగారు చెప్పారు. అప్పుడు అమలగారు నాగార్జునగారిని క్రాస్ చేసి ముందుకు వచ్చి నాని.. తెలుగు చాలా బాగా మాట్లాడతాడు. వెరీ స్వీట్ అని చెప్పారు. ఆ వీడియో క్లిప్పింగ్‌ని చూసి బాగా మురిసిపోయా. మా ఫ్యామిలీ మెంబర్స్‌కి చూపించాను. ► ‘కృష్ణార్జున యుద్ధం’ సినిమా కష్టపడి చేశా. ఆడియన్స్‌కు నచ్చలేదు. స్క్రిప్ట్ పరంగా ఇంకాస్త వర్కౌట్ చేయాల్సిందని నేను, డైరెక్టర్ మేర్లపాక గాంధీ అనుకున్నాం. ఒక రకంగా దిష్టి పోయిందనుకున్నా. చేసే ప్రతి సినిమా హిట్ కావాలని ఏం లేదుగా. ఆడియన్స్ డిసైడ్ చేస్తారు. నేను ఇమేజ్ డ్రివెన్ యాక్టర్‌ని కాదు. నా సినిమా చూసి ఎంజాయ్ చేయాలని, ప్రేక్షకులకు మంచి సినిమా ఇవ్వాలనుకుంటాను. ► ‘ఎవడే సుబ్రమణ్యం’ టైమ్‌లో అశ్వనీదత్‌గారు పెద్దగా ఇన్వాల్వ్ కాలేదు. ఆ సినిమా చూసి దత్‌గారు అభినందించారు. ఆయనకు సినిమా అంటే చాలా ప్యాషన్. ఖర్చుకు వెనకాడరు. నా సినిమాలు విడుదలైన రోజు ఆయన జెన్యూన్ ఒపీనియన్ చెబుతారు. నన్ను టాప్ హీరోలతో పోల్చి నాలో ఎనర్జీ నింపేవారు. యాక్టర్స్ అందర్నీ ఆయన ఫ్యామిలీ మెంబర్స్‌లా ట్రీట్ చేస్తారు. ► గౌతమ్ తిన్ననూరి డైరెక్షన్లో చేయనున్న ‘జెర్సీ’ సినిమాలో కొత్త నానీని చూస్తారు. ఇందులో క్రికెటర్‌గా కనిపిస్తాను. సచిన్ నా ఫేవరెట్ క్రికెటర్. ఇది కాకుండా నాలుగైదు సినిమాల గురించి చర్చలు జరుగుతున్నాయి. -
నానీకి అది అడిక్షన్.. ట్రీట్మెంట్ కూడా లేదనుకుంటా!
‘‘దేవదాసు’ అనేది మనందరికీ బాగా పరిచయం ఉన్న టైటిల్. ఈజీగా కనెక్ట్ అవుతుంది అని పెట్టాం. అలాగే ఆ ‘దేవదాసు’కి ఈ ‘దేవదాస్’కి ఓన్లీ మందు బాటిలే కామన్. మిగతా అంతా వేరే’’ అని నాగార్జున అన్నారు. నాగార్జున, నాని హీరోలుగా శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘దేవదాస్’. అశ్వనీదత్ నిర్మించారు. గురువారం ఈ చిత్రం విడుదలవుతున్న సందర్భంగా నాగార్జున పలు విశేషాలు పంచుకున్నారు. ► చాలా రోజుల తర్వాత డాన్ పాత్ర చేస్తున్నాను. కానీ డాన్ చేసే పనులేవీ చేయను. అంతా కామెడీనే. సినిమా మొత్తం నవ్వులే. నానీకి పేషెంట్లా వెళ్తాను. నాని, నేను ఫ్రెండ్స్ అవుతాం. కథ అంతా మా చుట్టూనే తిరుగుతుంది. ► నా లవ్‌స్టోరీ నానీనే సెట్ చేస్తాడు. బేసిక్‌గా దాస్ (నాని) ధైర్యవంతుడు. కానీ తను ప్రేమించిన అమ్మాయి ముందు ఏం మాట్లాడలేడు. రాజ్ కుమార్ హిరాణి ‘మున్నాభాయ్ యంబీబీయస్’ లాంటి స్టైల్లో ఈ చిత్రం ఉంటుంది. ఈ కథను బాలీవుడ్ రచయిత శ్రీధర్ రాఘవన్ రెండేళ్ల క్రితమే చెప్పాడు. అప్పుడు నుంచి అటు ఇటు తిరుగుతూ మళ్లీ నాకే వచ్చింది. ► నా పక్కన చాలా రోజుల తర్వాత హీరోయిన్ కనబడుతుంది. అందుకే మళ్లీ రొమాన్స్ అంటూ ట్వీట్ చేశాను కూడా (నవ్వుతూ). నాని పర్సనల్‌గా తెలియకపోయినా సెట్స్‌లో చాలా గ్రేట్ ఎక్స్పీరియన్స్. తన సినిమాలు చూశాను. చాలా సహజంగా నటిస్తాడు. తన సినిమాలు కూడా బ్యాలెన్స్డ్గా ఉంటాయి. నాకు రియలిస్టిక్ సినిమాలంటే అస్సలు నచ్చవు. ఆల్రెడీ రోజు చూస్తుంది అదే కదా. సినిమాల్లో కొంచెం మ్యాజిక్ ఉండాలి. ► 32 రెండేళ్లుగా సోలో హీరోగా సినిమాలు చేస్తూనే ఉన్నాను. ఇప్పుడు కూడా పని లేకుండా తిరగడం, లేదా ఉద్యోగం చేయడం, లవ్ చేయడం.. ఇలాంటి పాత్రలు ఇంకెంత కాలం చేస్తాం? అందుకే మల్టీస్టారర్ సినిమాలు వస్తే చేస్తున్నాను. ‘దేవదాస్, హిందీలో ‘బ్రహ్మాస్త్ర’ , ధనుశ్ సినిమాలు చేస్తున్నాను. ► మల్టీస్టారర్ సినిమాలు సేఫ్ అని కూడా కాదు. అలా అని ఏ పుస్తకంలోనూ లేదు. సోలో సినిమాలో ఒక్కరి మీదే ఒత్తిడి ఉంటుంది. అదే మల్టీస్టారర్‌లో ఇద్దరికీ సమానం అవుతుంది. గట్టిగా మాట్లాడితే మల్టీస్టారరే ఇంకా ప్రెషర్. ‘ఇద్దరు కలసి హిట్ కొట్టలేకపోయార్రా’’ అంటారు. ► వైజయంతీ, నాని కథ విని నా దగ్గరకు పంపారు. నలుగురైదుగురు రైటర్స్ కూర్చొని వర్క్ చేశారు. ‘దేవదాస్’ ఏ ఒక్కరి సినిమా కాదు. ఇది టీమ్ ఎఫర్ట్. శ్రీరామ్ ఆదిత్య చేసిన ‘శమంతకమణి’ సినిమా చూశాను. స్క్రీన్ ప్లే బావుంటుంది. ► నా ఏజ్ గ్రూప్ యాక్టర్స్‌తో కలసి సినిమా చేస్తే మీకే బోరింగ్‌గా ఉంటుంది. ‘ముసలోళ్లంతా కలసి సినిమాలు తీశార్రా’ అని రాస్తారు. మనం వయసు మించిపోతున్నాం అని ఆలోచించడం మొదలుపెట్టిన నిమిషం ఇంక అంతే. రోజూ నిద్ర లేవడమే యంగ్ అనే ఫీల్‌తో లేస్తాను. నా వయసు 59 కావచ్చు. మనసు మాత్రం 25. అఖిల్, చైతన్యలానే ఆలోచిస్తా కాబట్టే వాళ్లను డీల్ చేయగలుగుతున్నాను. ఏదైనా మన మనసుని బట్టే ఉంటుంది. ఎనర్జీ అంతా అక్కడి నుంచే వస్తుంది. ► మా ఫ్రెండ్స్ ఈ మధ్య నాతో ‘‘నువ్వు కొత్త ఫ్రెండ్స్‌ని చూసుకో. నీ ఏజ్ గ్రూప్ వాళ్లతో ఫ్రెండ్షిప్ చేసుకో అంటున్నారు’’ (తక్కువ వయసున్న వ్యక్తిలా కనిపించడంతో అలా అంటున్నారు). నేను 59 అని ఆలోచించను కూడా. ఇప్పటికీ చైతన్య కంటే యంగ్ అనే భావిస్తాను. ► వైజయంతీ మూవీస్‌తో నా అనుబంధం ‘ఆఖరి పోరాటం’ సినిమా నుంచి స్టార్ట్ అయింది. అప్పుడు శ్రీదేవిని తీసుకువచ్చారు. అప్పటికే ‘మిస్టర్ ఇండియా’ రిలీజై శ్రీదేవి పీక్‌లో ఉంది. నేనేమో సన్నగా ఉన్నాడు, గొంతు బాలేదు అనే కామెంట్స్‌తో ఉన్నాను. నాన్నగారి ద్వారా నన్ను ఈ సినిమాకు ఒప్పించారు దత్‌గారు. పాపులర్ వాళ్లతో యాక్ట్ చేస్తే మనం కూడా పాపులర్ అవుతాం అన్నారు. దత్గారితో ఎక్కువ సినిమాలు చేసిన హీరో నేనే. సినిమా అంటే ఆయనకు ప్యాషన్. ‘ఈ సినిమా ద్వారా కమ్‌బ్యాక్ అవుతున్నాను. మీరు చేయాలి’ అన్నారు. నా సొంత సినిమాలా భావించి చేశాను. ► నానీ ఊరికే ఫోన్ చూస్తూనే ఉంటాడు. అది అలవాటు కూడా కాదు.. అడిక్షన్. యూత్ అనే కాదు ఎవరి చేతుల్లో చూసినా సెల్‌ఫోనే. దానికి ట్రీట్మెంట్ కూడా లేదనుకుంటాను. ► ‘ఎన్టీఆర్’ బయోపిక్‌లో సుమంత్ లుక్ చూశాను. అచ్చు మా నాన్నగారిలానే ఉన్నాడు. నాన్నగారికి, సుమంత్‌కి పోలికలు దగ్గరగా ఉంటాయి. ► నెక్ట్స్ ఏంటో ఇంకా డిసైడ్ అవ్వలేదు. బంగ్రారాజు స్క్రిప్ట్ వర్క్ జరుగుతోంది. రాహుల్ రవీంద్రన్ కూడా ఓ స్క్రిప్ట్ మీద వర్క్ చేస్తున్నాడు. ‘మన్మథుడు 2’ టైటిల్ బావుంది కదా అని రిజిస్టర్ చేయించాను. రాహుల్ స్క్రిప్ట్‌కి సూట్ అయితే అదే. లేకపోతే చైతన్యకో, అఖిల్కో పనికొస్తుంది కదా. ► బాలీవుడ్లో రణ్‌బీర్ కపూర్‌తో చేస్తోన్న ‘బ్రహ్మాస్త్ర’లో ఇంకా కొన్ని రోజుల షూటింగ్ బ్యాలెన్స్ ఉంది. ధనుశ్ డైరెక్షన్లో చేయబోయేది పీరియడ్ ఫిల్మ్. 600 సంవత్సరాల క్రితం రోజుల్లో పాత్ర నాది. షూటింగ్లో ఇంకా జాయిన్ అవ్వలేదు. ► ‘ఆఫీసర్’ సినిమా చేసినందుకు రిగ్రెట్ లేదు. అది పూర్తిగా నా చాయిస్. కొన్నిసార్లు స్టార్టింగ్ స్టేజ్‌లో ఎగై్జటింగ్‌గా అనిపించొచ్చు. కానీ ఆడకపోవచ్చు. ► నెట్‌ఫ్లిక్స్ వాళ్లు ఓ బయోపిక్ కోసం అడిగారు. రాజ్యాంగాన్ని రాసిన ఒక వ్యక్తి పాత్ర అది. చాలా బావుంది స్క్రిప్ట్. కానీ డేట్స్ లేక వదులుకోవాల్సి వచ్చింది. ► సెప్టెంబర్ మా నెల. నాన్నగారి బర్త్‌డే మంత్ కావడంతో సెప్టెంబర్ మా అందరి ఫేవరెట్. ఈ నెలలోనే చైతూ బాక్సాఫీస్ స్టామినా చూపించాడు. కోడలు సమంత హిట్ కొట్టింది. అఖిల్ ‘మజ్ను’ టీజర్ చాలా బావుంది. సుమంత్ లుక్‌కి అభినందనలు వస్తున్నాయి. సో.. నాన్నగారు మా అందర్నీ బాగా చూస్తున్నారు. ► అఖిల్, కరణ్ జోహార్ బెస్ట్ ఫ్రెండ్స్. అఖిల్‌ని బాలీవుడ్‌కి పరిచయం చేస్తాను అంటుంటాడు. ఆల్రెడీ ఒకసారి చెప్పిన మాట వినకుండా ఓ సినిమా (తెలుగు) కు తొందరపడ్డాడు. తను నేర్చుకోవాల్సింది చాలా ఉంది. నేను ‘శివ’ సినిమా ద్వారానే బాలీవుడ్‌కి వెళ్లాను. రైట్ స్క్రిప్ట్, రైట్ టైమ్‌లో తనూ వెళతాడు. ‘దృశ్యం’ వంటి సినిమాలు చేస్తారా? ఇద్దరు పిల్లలకు తండ్రి పాత్ర అంటే మీకు ఓకేనా? అన్న ప్రశ్నకు – ‘‘ఇద్దరి పిల్లలకు తండ్రిగా నేనెందుకు చేయాలి? నాకు పిల్లలు లేరు, తమ్ముళ్లే ఉన్నారు (చైతూ, అఖిల్‌ని ఉద్దేశిస్తూ). నేనిప్పటికీ 25లాగే ఆలోచిస్తా’’ అని సరదాగా అన్నారు నాగార్జున. -
నేను అనుకున్నవన్నీ జరుగుతాయి
‘‘మనందరి ప్రేమాభిమానాల్లో ఏయన్నార్‌గారు ఎప్పుడూ నిలిచి ఉంటారు. ఈ సినిమా చేయడానికి మూడు కారణాలు. స్క్రిప్ట్, అశ్వనీదత్‌గారు, నాని’’ అన్నారు నాగార్జున. శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో నాగార్జున, నాని హీరోలుగా వైజయంతీ మూవీస్‌పై అశ్వనీదత్ నిర్మించిన చిత్రం ‘దేవదాస్’. మణిశర్మ స్వరకర్త. ఈ సినిమా ఈ నెల 27న రిలీజ్ కానుంది. గురువారం అక్కినేని నాగేశ్వరరావు జన్మదినం సందర్భంగా కేక్ కట్ చేసి, ఈ చిత్రం ఆడియోను రిలీజ్ చేశారు. నాగార్జున మాట్లాడుతూ– ‘‘ఒక సీత కథ’ తర్వాత అశ్వనీదత్‌గారు 24 ఏళ్ల వయసులో తెల్లవారుజామున 4 గంటలకు ఎన్టీఆర్‌గారి ఇంటి ముందు నిల్చున్నారు సినిమా కోసం. ఎన్టీఆర్‌గారు ‘ఎదురులేని మనిషి’ సినిమా చేశారు. పెద్ద హిట్ అయింది. ఆయన ఫొటోనే ఈ సంస్థ లోగోలో ఉంటుంది. సాధారణంగా నేను అనుకున్నవన్నీ జరుగుతాయి. మల్టీస్టారర్ చేస్తే నానీతో చేయాలని ఎప్పటినుంచో అనుకున్నాను. అతని డైలాగ్ డెలీవరీ చక్కగా ఉంటుంది. చాలా రోజుల తర్వాత ఓ అందమైన అమ్మాయి ఆకాంక్షను నాకు హీరోయిన్గా తీసుకువచ్చారు. రష్మికకు ఈ సినిమా హ్యాట్రిక్ అవుతుంది. శ్రీరామ్ ఆదిత్య అన్నింటినీ చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేశాడు. మణిశర్మ అద్భుతమైన సంగీతం అందించారు. సెప్టెంబర్ మన (ఫ్యాన్స్‌ను ఉద్దేశించి) నెల. నాన్నగారి బర్త్‌డే. మొగుడు పెళ్లాల సినిమాలు ఒకే రోజు రిలీజవుతాయా? అయ్యాయి. ‘శైలజా రెడ్డి అల్లుడు, యు టర్న్’ రెండూ బాగా ఆడాయి. ‘శైలజా రెడ్డి అల్లుడు’ రివ్యూస్ చూసి సమంత కంగారు పడింది. ఏం ఫర్లేదు.. సాయంత్రానికి ఓకే అవుతాయి అన్నాను. సెట్ అయింది. నా సినిమాకు కలెక్షన్స్ రావడం లేదు అంది. సండేకి సెట్ అవుతుంది అన్నాను.. అయింది. ఈ 27న వస్తున్న ‘దేవదాస్’ని కూడా నాన్నగారు చూసుకుంటారు. గణేశ్, దసరా పండగ మధ్యలో ‘దేవదాస్’ పండగ వస్తుంది. నవ్వులు.. ఓన్లీ నవ్వులే. సీక్వెల్ చేద్దామా నానీ? తప్పకుండా చేద్దాం’’ అన్నారు. నాని మాట్లాడుతూ– ‘‘సీతారామయ్యగారి మనవరాలు’ సినిమా చూసినప్పటి నుంచి తాతగారు అనే పేరు వింటే మా తాతకంటే ఏయన్నార్‌గారు కనిపిస్తారు. నాగార్జున ఇంత అందంగా ఉంటారు. రోజూ ఏం తింటున్నారో, తాగుతున్నారో కనుక్కోమని నా అసిస్టెంట్స్‌కి చెప్పాను. అది ట్రై చేసి ఆయనలా అయిపోదాం అని. కానీ మనం తినేవే తింటున్నారు సర్ అని చెప్పారు. మామూలువే తిని మామూలువే తాగితే ఆయనెందుకు అలా ఉన్నారు? మనమంతా ఇలా ఎందుకు ఉన్నాం? ఆ అందానికి కారణం సరదాగా ఉండటమే. ప్యూర్‌గా ఉండటమే. లోపల ఏం పెట్టుకోరు. అశ్వనీదత్‌గారు కెరీర్ స్టార్టింగ్‌లో నా ఆల్బమ్ చూసి ‘నీకెందుకు యాక్టింగ్ బాగా చదువుకో’ అన్నారు. ఇప్పుడు ఆయన బ్యానర్లో రెండో సినిమా చేస్తున్నాను. స్వప్నా, నేను ‘ఎవడే సుబ్రమణ్యం’ ముందు గొడవపడ్డాం. సినిమా హిట్. ఈ సినిమా స్టార్ట్ కాకముందే గొడవపడ్డాం. సినిమా బ్లాక్బాస్టర్ అవుతుంది. శ్రీరామ్ ఆదిత్య అందర్నీ బాగా హ్యాండిల్ చేశాడు. మణిగారితో మళ్లీ వర్క్ చేయడం చాలా హ్యాపీ’’ అన్నారు. ‘‘మామయ్యా మజాకా. బంగార్రాజు పాత్ర తర్వాత అంత కాన్ఫిడెంట్‌గా ఉన్నాను. నాని నా ఫేవరెట్ కోస్టార్’’ అన్నారు సమంత. ‘‘అన్నయ్య ‘శైలజా రెడ్డి అల్లుడు’ పోస్టర్ చూసి ‘ఏమున్నాడు మా అన్నయ్య’ అన్నాను. ఇప్పుడు మా నాన్నగారిని చూసి ‘ఏమున్నాడయ్యా బాబు మా నాన్న’ అనాలనిపిస్తుంది. నాని అంటే నాకిష్టం. యాక్టింగ్‌లో తన ఈజ్ కుళ్లు తెప్పిస్తోంది’’ అన్నారు అఖిల్. ‘‘వైజయంతీలో సినిమా చేయడం హానర్‌గా ఫీలవుతున్నాను. నాగార్జునగారితో అప్పట్లో ఓ ఫొటో దిగాను. బయటా హీరోలానే ఉన్నాడమ్మా అని మా అమ్మగారితో అంటే, సినిమా చేయమన్నారు. అది నెరవేరడానికి 4 ఏళ్లు పట్టింది’’ అన్నారు శ్రీరామ్ ఆదిత్య. అశ్వనీ దత్ మాట్లాడుతూ: ‘‘నా అభిమాన నటులు నాగేశ్వరరావుగారు ఒకరు. మా సంస్థలో అత్యధిక సినిమాలు చేసిన హీరో నాగార్జున. నాకు రెండో సినిమా చేస్తున్న హీరో నాని. యంగ్ డైరెక్టర్స్ అందరూ ట్రెండ్ మారుస్తున్నా రు. ఈ సంస్థను నడిపిస్తుంది రెండు మహాశక్తులు. వయాకామ్ ఒకరైతే, స్వప్నా–ప్రియాంకలు మరొకరు’’ అన్నారు. ‘‘ఈ లెగసీలో భాగమైనందుకు సంతోషంగా ఉంది’’ అని వయాకామ్ ప్రతినిథి అజిత్ అన్నారు.‘‘అక్కినేని గారి పుట్టినరోజంటే నాకు పండగే. నా గుండెల్లో ఆయన ఎప్పటికీ ఉంటాడు. తండ్రికి మించిన తనయుడు లాగా నాగార్జున కూడా నవయువకుడిలా ఉంటాడు. మనం గర్వించదగ్గ నిర్మాత అశ్వనీదత్. ఈ ‘దేవదాస్’ కూడా ఆ ‘దేవదాసు’ అంత పేరు సంపాదించాలి. నాని చేసిన సినిమాలన్నీ హిట్టే’’ అన్నారు సుబ్బిరామిరెడ్డి. ‘‘నన్ను పరిచయం చేసింది దత్గారే. నాగార్జునతో మళ్లీ సినిమా చేయడం రహ్యాపీ’’ అన్నారు మణిశర్మ. -
డీ బ్రదర్స్ జోడీ అదుర్స్
డాన్, డాక్టర్ అంటూ ఇన్ని రోజులు ‘దేవదాస్’లు నాగార్జున, నాని గురించే మాట్లాడుకున్నాం. మరి వాళ్ల జోడీ ఎలా ఉంటారో సోమవారం రివీల్ చేసింది ‘దేవదాస్’ చిత్రబృందం. నాగార్జున, నాని హీరోలుగా శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో తెరకెక్కిన మల్టీస్టారర్ ‘దేవదాస్’. అశ్వనీదత్ నిర్మించారు. ఇందులో నాగార్జున సరసన ‘మళ్ళీ రావా’ ఫేమ్ ఆకాంక్షా సింగ్, నానీకు జతగా రష్మికా మండన్నా యాక్ట్ చేసిన సంగతి తెలిసిందే. సోమవారం ఈ బ్యూటీలిద్దరి పాత్రలకు సంబంధించిన లుక్స్‌ను రిలీజ్ చేశారు. ‘జాహ్నవీ’ పాత్ర పోషించిన ఆకాంక్ష సింగ్ లుక్ రిలీజ్ చేస్తూ – ‘‘చాలా రోజుల తర్వాత నా పక్కన ఒక అందమైన అమ్మాయి. ఏయ్!! మళ్లీ రొమాన్స్’’ అని నాగార్జున పేర్కొన్నారు. ‘‘ఫస్ట్ టైమ్ మిమ్మల్ని మెట్రోలో చూసినప్పుడే.. లోపల ఏదో రింగ్ అయింది పూజగారు. మళ్లీ ఎప్పుడు?’’ అంటూ పూజా పాత్రలో రష్మికా మండన్నా లుక్‌ను నాని రిలీజ్ చేశారు. మణిశర్మ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం ‘ఆడియో పార్టీ’ ఈ నెల 20న జరగనుంది. బాలీవుడ్ ప్రొడక్షన్ హౌస్ వయాకమ్ 18 ప్రొడక్షన్లో భాగమైందని చిత్రబృందం పేర్కొంది. ఈ చిత్రం ఈ నెల 27న రిలీజ్ కానుంది. -
పదేళ్లు పూర్తయ్యాయి.. ఏమాత్రం బిడియం లేదు!!
‘ఆడించి అష్టాచమ్మా ఓడించావమ్మా... నీ పంట పండిందే ప్రేమా..’ అంటూ లావణ్యను ఆటపట్టించి మరీ ఆమె ప్రేమను గెలుపొందాడు రాంబాబు. మహేష్.. మహేష్ అంటూ కలువరించే లావణ్యను ప్రేమను పొందేందుకు రాంబాబు పడ్డ పాట్లు నవ్వు తెప్పించడంతో పాటు అతడిపై జాలి కలిగిస్తాయి. రెండు జంటల ప్రేమకథతో తెరకెక్కిన అష్టాచమ్మా సినిమా విడుదలై నేటికి సరిగ్గా పదేళ్లు. ఈ సినిమా గురించి ఎందుకీ ప్రస్తావన అనుకోకండి.. ఎందుకంటే ఈ సినిమా రూపంలోనే టాలీవుడ్‌కు నాచురల్ స్టార్ ‘నాని’ దొరికాడు. డైరెక్టర్ కావాలనుకొని ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన నవీన్ బాబు ఘంటా అలియాస్ నాని... నాచురల్ స్టార్‌గా ఎదిగి ప్రేక్షకుల మనస్సుల్లో చెరగని ముద్ర వేశారు. తన పదేళ్ల నటనా ప్రస్థానంలో ఎవరి ముందు నటించడానికైనా బిడియపడలేదని చెబుతూ ఇండస్ట్రీలో స్థిరపడిపోయాడు ఈ డబుల్ హ్యాట్రిక్ హీరో. గాడ్‌ఫాదర్ లేకుండా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన నవీన్ బాబు... పక్కింటి కుర్రాడిలా కన్పిస్తూనే... ‘హీరోగా నెగ్గడం అంటే ఇష్టంగా పనిచేయడం’ అంతే అనే లాజిక్‌తో దూసుకుపోతున్నాడు. రాంబాబు క్యారెక్టర్‌తో యువతకు దగ్గరైన ఈ సహజ నటుడు... విలక్షణమైన కథలు ఎన్నుకుంటూ తన విజయ పరంపరను, నటనా ప్రస్థానాన్ని అప్రతిహతంగా కొనసాగిస్తున్నాడు. అలా మొదలైంది ఇచ్చిన బూస్ట్‌తో.. తొలి రెండు సినిమాల్లో(అష్టాచమ్మా, రైడ్) మిగతా హీరోలతో స్క్రీన్ షేర్ చేసుకున్న నాని.. ‘స్నేహితుడా’ సినిమాతో సోలో హీరోగా ఆకట్టుకున్నాడు. ఆ తర్వాత భీమిలీ కబడ్డీ జట్టులో సూరిబాబుగా నటించి విమర్శకుల ప్రశంసలు సైతం దక్కించుకున్నాడు. 2011లో నందినీ రెడ్డి దర్శకత్వంలో తెరెక్కిన ‘అలా మొదలైంది’ మూవీతో నాని కెరీర్ ఊపందుకుంది. ఈ సినిమాలో ‘గౌతమ్’ గా నాని నటన సూపర్బ్. ప్రతీ ఇంటిలోనూ ఇలాంటి ఓ కొడుకు ఉండాలనిపించేంతగా ఉంటుంది తల్లితో గౌతమ్ అనుబంధం. బడా డైరెక్టర్లతో... పిల్ల జమీందార్‌తో హిట్ కొట్టిన ఈ యువహీరో రాజమౌళి దృష్టిలో పడటంతో ఈగ సినిమాలో నటించే చాన్స్ కొట్టేశారు. ఈగ విజయంతో బడా డైరెక్టర్ల దృష్టిని ఆకర్షించాడు. ఇక గౌతమ్ మీనన్ తెరకెక్కించిన ‘ఎటో వెళ్లిపోయింది మనసు’ నటుడిగా నానిని మరో మెట్టు ఎక్కించింది. ఈ సినిమాలో ‘వరుణ్’ గా జీవించిన నానిని నంది అవార్డు వరించింది. 2014లో విడుదలైన కృష్ణవంశీ పైసా, ఆహా కళ్యాణం, జెండాపై కపిరాజు సినిమాల ఫలితం నాని కెరీర్‌పై ఎటువంటి ప్రభావం చూపనప్పటికీ అభిమానులు మాత్రం కాస్త నిరాశ చెందారు. ఎవడే సుబ్రమణ్యంతో మళ్లీ ఫామ్‌లోకి... నాగ్ అశ్విన్ దర్శకత్వంలో రూపొందిన ఎవడే సుబ్రమణ్యం సినిమాతో నాని మళ్లీ ఫామ్‌లోకి వచ్చేశారు. ఆ తర్వాత భలే భలే మొగాడివోయ్, కృష్ణగాడి వీర ప్రేమగాథ, జెంటిల్‌మేన్, మజ్ను, నేను లోకల్, నిన్ను కోరి సినిమాలతో డబుల్ హ్యాట్రిక్ కొట్టి రికార్డు సృష్టించాడు. గతేడాది విడుదలైన ఎంసీఏ(మిడిల్ క్లాస్ అబ్బాయి) సినిమాతో సక్సెన్ స్టోరీని కంటిన్యూ చేశారు. అయితే ఈ ఏడాది విడుదలైన కృష్ణార్జున యుద్ధం సినిమా మాత్రం మిశ్రమ ఫలితాన్ని మిగిల్చింది. ప్రస్తుతం రొమాంటిక్ కింగ్ నాగార్జునతో కలిసి ‘దేవదాస్’ అనే భారీ మల్టీస్టారర్‌తో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ఇటీవలే విడుదలైన టీజర్ చూస్తుంటే నాని ఖాతాలో మరో హిట్ పడుతుందనే నమ్మకంతో ఉన్నారు ఫ్యాన్స్. బుల్లితెరపై సరికొత్త అవతారంలో.. హీరోగా బిజీగా ఉన్న నాని ఈ ఏడాది.. పాపులర్ టీవీ షో బిగ్‌బాస్ రెండో సీజన్(బిగ్‌బాస్) హోస్ట్‌గా బుల్లితెరపై ఎంట్రీ ఇచ్చాడు. పిట్ట కథతో షోను మొదలు పెడుతూ... వస్తూనే తన మార్క్‌ను చూపించాడు. తనదైన శైలిలో షోను నడిపిస్తూ ప్రేక్షకుల అంచనాలను అందుకున్నాడు. ప్రత్యేక పాత్రల్లో.. నిర్మాతగా.. కోలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చిన నాని.. పలు తమిళ సినిమాల్లో ప్రత్యేక పాత్రల్లో కూడా దర్శనమిచ్చాడు. మణిరత్నంలో సినిమాలో నటించాలనుకున్న నానికి ఇప్పటివరకైతే ఆ అవకాశం లభించలేదు కానీ ఓకే కన్మణి (ఓకే బంగారం) సినిమా తెలుగు వర్షన్లో హీరోకు డబ్బింగ్ చెప్పడం ద్వారా.. ఆయన సినిమాలో భాగమయ్యాడు. అలాగే పలు సినిమాలకు వాయిస్ ఓవర్ కూడా ఇచ్చారు. కాగా గతంలో ‘డీ ఫర్ దోపిడీ’ సినిమాకు సహ నిర్మాతగా వ్యవహరించిన నాని.. ఈ ఏడాది ‘అ!’ సినిమాతో ప్రశాంత్ వర్మ అనే కొత్త దర్శకుడిని టాలీవుడ్‌కి పరిచయం చేశారు. విభిన్న కథాంశంతో తెరకెక్కిన ఈ సినిమా విమర్శకుల ప్రశంసలు దక్కించుకుంది. స్నేహితురాలినే జీవిత భాగస్వామిగా.. తన స్నేహితురాలు అంజనాను ప్రేమించిన నాని.. 2012లో పెద్దల సమక్షంలో ఆమెను వివాహమాడాడు. 2017లో ఈ జంటకు అర్జున్ అలియాస్ జున్ను జన్మించాడు. ఇలా కెరీర్‌తో పాటు పర్సనల్ లైఫ్‌ను బ్యాలెన్స్ చేస్తూ సంతోషానికి కేరాఫ్‌గా నిలుస్తున్నాడు నాచురల్ స్టార్. తన నటనా ప్రస్థానానికి పదేళ్లు పూర్తయిన సందర్భంగా కొడుకుతో దేవదాస్ సెట్లో దిగిన ఫొటోను పోస్ట్ చేసిన నాని... ‘పదేళ్లు పూర్తయ్యాయి. కానీ ఎప్పుడూ ఎవరి ముందు నటించడానికి ఏమాత్రం బిడియపడలేదంటూ’ ట్వీట్ చేశాడు. It’s been 10 years but I have never been so nervous to perform in front of someone :) When Mr Junnu came to visit Dr Dasu on sets. pic.twitter.com/D07kt1hVUT — Nani (@NameisNani) 5 September 2018 -
దేవదాస్ టీజర్ విడుదల
-
‘దేవదాస్’ ఫస్ట్ లుక్.. నాని, నాగ్ల ట్వీట్స్ వైరల్!
టాలీవుడ్లో దేవదాస్ సినిమాకు ప్రత్యేకస్థానం ఉంటుంది. ఏఎన్నార్ నటన ఆ సినిమాకు ప్లస్. ఓ క్లాసిక్‌గా నిలిచిన ఆ సినిమా టైటిల్‌ను నాగార్జున, నాని కాంబినేషన్లో రాబోతోన్న సినిమాకు పెట్టడమంటే సాహసమే. అయితే అందుకు తగ్గట్టుగా ఈ సినిమాను రూపొందిస్తున్నట్లు సమాచారం. తాజాగా ‘దేవదాస్’ ఫస్ట్ లుక్‌ను రిలీజ్ చేశారు. ఈ లుక్‌ను రిలీజ్ చేస్తూ.. నాగ్, నానిలు చేసిన ట్వీట్స్ వైరల్ అవుతున్నాయి. ‘ నా పక్కన ఎప్పుడూ పారు ఉండాలి. కానీ ఈ సారి మాత్రం దాస్‌తో ఉండిపోయాను. ఇది సరదాగా ఉండబోతోందం’టూ ట్వీట్ చేశారు. ఇక నాని.. ‘ 1996లో నిన్నే పెళ్లాడతా సినిమా టైమ్‌లో నాగ్ సర్ తెరపై ఉన్నారు. నేను దేవి థియేటర్లో క్యూలో ఉన్నాను. 2018లో దేవ్‌దాస్‌లో మేమిద్దరం ఇలా తాగి పడుకున్నామం’టూ ట్వీట్ చేశాడు. వైజయంతీ మూవీస్ నిర్మిస్తోన్న ఈ మూవీకి శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వం వహిస్తున్నారు. 1996 - Ninne pelladtha .. Nag sir on screen .. me in the queue outside Devi 70MM 2018 - DevaDas - we both on the First Look .. drunk and sloshed 🙈#DevaDas #DDFirstLook This is going to be fun :))@iamnagarjuna @VyjayanthiFilms @SriramAdittya @iamRashmika @aakanksha_s30 pic.twitter.com/YDuFIZAdUE — Nani (@NameisNani) August 7, 2018 Usually I am used to having a PARU next to me but this time iam stuck with this DAS fellow😡 #DevaDas #DDFirstlook this is going to be fun!! 👉👉👉 pic.twitter.com/IEa8oi2XAh — Nagarjuna Akkineni (@iamnagarjuna) August 7, 2018 -
దేవదాస్‌లు వస్తున్నారు..!
కింగ్ నాగార్జున, నేచురల్ స్టార్ నానిలు హీరోలుగా తెరకెక్కుతున్న క్రేజీ మల్టీస్టారర్ మూవీ దేవదాస్. యంగ్ డైరెక్టర్ శ్రీరామ్ ఆదిత్య తెరకెక్కిస్తున్న ఈ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది. ఇటీవల రిలీజ్ చేసిన టైటిల్ లోగోకు మంచి రెస్సాన్స్ వచ్చింది. త్వరలో ఫస్ట్ లుక్ పోస్టర్‌ను కూడా రిలీజ్ చేస్తున్నట్టుగా ప్రకటించారు చిత్రయూనిట్. ఫ్రెండ్షిప్ డే సందర్భంగా అభిమానులకు శుకాంక్షలు తెలిపిన నాగార్జున, నాని ఫస్ట్ లుక్ పోస్టర్ ఆగస్టు 7 సాయత్రం 4 గంటలకు ఫస్ట్ లుక్ పోస్టర్‌ను నరిలీజ్ చేస్తున్నట్టుగా ప్రకటించారు. వైజయంతి మూవీస్ బ్యానర్‌పై అశ్వనిదత్ నిర్మిస్తున్న ఈ సినిమాకు మణిశర్మ సంగీతమందిస్తుండగా ఆకాంక్ష సింగ్, రష్మిక మందనలు హీరోయిన్లుగా నటిస్తున్నారు. -
కనెక్షన్ ఏంటి?
శాంతాభాయ్ మెమోరియల్ చారిటీ హస్పిటల్‌కు, ‘దేవదాస్’లకు ఏదో కనెక్షన్ ఉంది. ఆ కనెక్షనే ‘దేవదాసు’ల మధ్య అనుబంధాన్ని పెంచిందట. ఇందుకు గల కారణం మాత్రం వెండితెరపై చూడాల్సిందే. నాగార్జున, నాని హీరోలుగా శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో రూపొందుతోన్న మల్టీస్టారర్ మూవీ ‘దేవదాస్’. వైజయంతీ మూవీస్ పతాకంపై సి. ధర్మరాజు సమర్పణలో అశ్వనీదత్ నిర్మిస్తున్నారు. ఇందులో నాగ్‌కు జోడీగా ‘మళ్లీ రావా’ ఫేమ్ ఆకాంక్షా సింగ్ నటిస్తున్నారు. నాని సరసన రష్మికా మండన్నా కనిపిస్తారు. డాన్ దేవ పాత్రలో నాగార్జున, డాక్టర్ దాసు పాత్రలో నాని నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్‌లో జరుగుతోంది. ఈ షెడ్యూల్ మరో వారం రోజుల పాటు కొనసాగనుందని సమాచారం. మేజర్‌గా నైట్ షూట్ చేస్తారు. ప్రస్తుతం నాగార్జున, నానీలపై కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారట. 70 శాతం చిత్రీకరణ పూర్తయింది. సెప్టెంబర్ 27న ఈ చిత్రాన్ని రిలీజ్ చేయాలనుకుంటున్నారు. ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. -
డీడీ సెప్టెంబర్‌కి రెడీ
శాంతాభాయ్ మెమోరియల్ చారిటీ హాస్పిటల్‌తో దేవదాస్‌లకు సంబంధం ఉంది. ఈ లింక్ ఏంటీ? అనేది సెప్టెంబర్‌లో తెలుస్తుంది. శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో నాగార్జున, నాని హీరోలుగా సి. ధర్మరాజు సమర్పణలో వైజయంతి మూవీస్ పతాకంపై అశ్వనీదత్ నిర్మిస్తున్న మల్టీస్టారర్ మూవీకి ‘దేవదాస్’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. ‘దేవదాస్’ అనగానే ఏయన్నార్ నటించిన సినిమా గుర్తుకు రాకమానదు. కానీ ఆ ‘దేవదాసు’ వేరు. ఇది వేరు. ఈ సినిమాలో దేవదాస్ అంటే ఒకరు కాదు. నాగార్జున డాన్ దేవ. నాని డాక్టర్ దాస్. నాగార్జునకు జోడీగా ఆకాంక్షా సింగ్, నాని సరసన రష్మికా మండన్నా నటిస్తున్నారు. ‘‘దాస్, నేను సెప్టెంబర్‌లో వస్తున్నాం. డీడీ’’ అన్నారు నాగార్జున. ‘‘దేవ, నేను సెప్టెంబర్‌లో వస్తున్నాం’’ అన్నారు నాని. ఈ సినిమా చిత్రీకరణ తుది దశకు చేరుకుంది. ఈ చిత్రానికి మణిశర్మ స్వరకర్త. -
ఆ మల్టీస్టారర్‌కు క్లాసిక్ టైటిల్
నాగార్జున, నాని హీరోలుగా తెరకెక్కుతోన్న భారీ మల్టీస్టారర్‌కు ‘దేవదాస్’ అనే టైటిల్‌ను ఫిక్స్ చేసినట్లు చిత్ర యూనిట్ తెలిపింది. ‘ఓ మై ఫ్రెండ్’ ఫేం శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమా టైటిల్ పోస్టర్‌ను చిత్ర యూనిట్ గురువారం విడుదల చేసింది. ‘శాంతాబాయి మెమోరియల్ చారిటీ హాస్పిటల్’ అనే ఆస్పత్రి రసీదుపై సినిమాకు సంబంధించిన వివరాలతో పాటు.. ఓ చివర స్టెతస్కోప్, మరో చివర గన్, బుల్లెట్లతో కూడిన పోస్టర్ వినూత్నంగా ఉందంటూ’ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. వైజయంతీ మూవీస్ బ్యానర్‌పై అశ్వనీదత్ ఈ సినిమాను నిర్మిస్తున్న ఈ సినిమాలో దేవ అనే డాన్ పాత్రలో నాగార్జున, దాస్ అనే డాక్టర్ పాత్రలో నాని కనిపించనున్నారు. నాగార్జున సరసన ఆకాంక్షా సింగ్ హీరోయిన్గా నటిస్తుండగా.. ఛలో ఫేం రష్మిక మందన నానికి జోడీగా యాక్ట్ చేస్తున్నారు. 65 శాతానికి పైగా షూటింగ్ పూర్తి చేసుకున్న ‘దేవదాసు’ సెప్టెంబర్‌లో విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. -
‘దేవ్‌దాస్’ నుంచి ‘దాస్ దేవ్’ వరకు
సాక్షి, న్యూఢిల్లీ : ప్రముఖ బెంగాలీ రచయిత శరత్చంద్ర ఛటోపాధ్యాయ్ వందేళ్ల క్రితం రాసిన ‘దేవదాస్’ నవల ఎన్నో భాషల్లో సినిమా తీయడానికి ఎంతోమంది సినీ నిర్మాతలకు స్ఫూర్తినిచ్చింది. భగ్న ప్రేమికుడిగా మద్యానికి బానిసై చివరకు చావును ఆశ్రయించిన ఓ దేవదాసు విషాధభరిత ప్రేమ కథను వేదాంతం రాఘవయ్య, విజయ నిర్మల తెలుగులో, బిమల్ రాయ్, సంజయ్ లీలా బన్సాలీ, అనురాగ్ కాష్యప్లు హిందీలో, దిలీప్ రాయ్ , చాశి నజ్రుల్ ఇస్లాం, శక్తి సమంత బెంగాలీలో తెరకెక్కించగా పీసీ బార్గువా బెంగాలీలో (1935), హిందీలో (1935), అస్సామీస్లో (1937) తీశారు. అనురాగ్ కాష్యప్ 2009లో ‘దేవ్ డీ’ పేరుతో తీసిన సినిమాలో మినహా అన్ని దేవదాస్ చిత్రాల్లో విషాధాంతమే ఉంటుంది. పిరికితనంతో ప్రేయసిని దూరం చేసుకొని మద్యానికి బానిసై అంతా విధి రాతంటూ తనలో తాను కుమిలిపోతూ స్వీయసానుభూతిని కోరుకుంటూ మత్యువును కౌగిలించుకొని దేవదాసునే వీరంతా ఆవిష్కరించారు. చావు పరిష్కారం కాదంటూ ‘చంద్రముఖి’తో దేవదాస్‌కు కొత్త జీవితాన్ని ప్రసాదిస్తారు అనురాగ్ కాష్యప్ తన దేవ్ డీలో. ఇప్పుడు దేవదాస్‌ను మరో రకంగా చూపించేందుకు ముందుకు వచ్చారు ప్రముఖ హిందీ దర్శకుడు సుధీర్ మిశ్రా. ఆయన దేవదాస్ పాత్రను తనదైన శైలిలో వెనక నుంచి ముందుకు నడిపించారు. అంటే భగ్న ప్రేమికుడై మద్యం మత్తులో మునిగితేలుతున్న దేవదాస్ ఉత్తరప్రదేశ్ రాజకీయాలకు విచలితుడై రాజకీయ నాయకుడిగా ఎదగడాన్ని ఈ సినిమాలో చూపిస్తారు. అందుకనే దర్శకుడు ఈ సినిమాకు ‘దాస్ దేవ్’గా టైటిల్ పెట్టారు. రాహుల్ భట్, అదిత్ రావ్ హైదరి హీరోహోరోయిన్లుగా నటించిన ఈ సినిమా ఈ నెల 23వ తేదీన దేశవ్యాప్తంగా విడుదలవుతోంది. దేవదాస్ నవలకు సుధీర్ మిశ్రా చెప్పిన సరికొత్త భాష్యానికి, చిత్రంలోని పాటలకు ఏకంగా ఐదుగురు సంగీత దర్శకులు సంగీతాన్ని సమకూర్చారు. పీసీ బారువా నుంచి నేటి సుధీర్ మిశ్రా వరకు తీసిన అన్ని దేవదాస్ చిత్రాల్లో సినిమా దర్శకుడి తాత్వికతను ప్రతిబింబించే పాటలు ఒకటి, రెండైనా ఉన్నాయి. దాస్ దేవ్ సినిమాలో డాక్టర్ సాగర్ రాసిన అలాంటి పాట ‘సెహ్మీ హై దడ్కన్’ విపిన్ పట్వా సంగీతం సమకూర్చగా, ఆతిమ్ అస్లాం పాడారు. పీసీ బారువా 1935లో హిందీలో తీసిన దేవదాస్ చిత్రంలో ‘చూటీ ఆసీర్ తో’ కూడా అలాంటి పాటే. కేదార్నాథ్ శర్మ రాసిన ఈ పాటకు తిమిర్ బారన్ సంగీతం సమకూర్చగా పహాడి సన్యాల్ పాడారు. ఈ చిత్రంలో దేవదాస్‌గా కేఎల్ సైగల్, పార్వతిగా జమున నటించారు. వేదాంతం రాఘవయ్య 1953లో తెలుగులో తీసిన ‘దేవదాసు’లో కుడి ఎడమైతే పొరపాటు లేదోయ్’ అనే పాటను సీఆర్ సుబ్బరామన్ రాయగా, ఘంటసాల వేంకటేశ్వరరావు పాడారు. ఈ చిత్రంలో అక్కినేని నాగేశ్వరరావు, సావిత్రి నటించిన విషయం తెల్సిందే. 1955లో బిమల్ రాయ్ తీసిన హిందీ దేవదాస్‌లో ‘జైసే తూ ఖుబూల్ కర్లే’ పాటను సాహిర్ లుథియాన్వీ రాయగా, ఎస్డీ బర్మన్ సంగీత దర్శకత్వంలో లతా మంగేష్కర్ పాడారు. ఈ చిత్రంలో దేవదాస్‌గా దిలీప్ కుమార్, పార్వతిగా సుచిత్రసేన్ నటించారు. సంజయ్ లీలా బన్సాలీ 2002లో తీసిన దేవ్‌దాస్‌లో దేవదాస్ ఉడుకుతనం, కోపం వ్యక్తం వెనక దాగున్న ఆప్యాయత పట్ల పార్వతి కరుణ రసం చూపే ‘బయిరీ పియా’ పాటను నస్రత్ బదర్ రాయగా శ్రేయా గోషాల్, ఉదిత్ నారాయణ్ పాడారు. ఇస్మాయిల్ దర్బార్ సంగీతం సమకూర్చారు. ఈ చిత్రంలో షారూక్ ఖాన్, ఐశ్యర్యరాయ్లు నటించారు. ఇక అనురాగ్ కాష్యప్ తీసిన దేవ్ డీ చిత్రంలో దేవదాస్ ఎంతదూరం పరుగెత్తినా ఏదో ఒక రాజు వెనక్కి రావాల్సిందే సమస్యలను ఎదుర్కోవాల్సిందే అన్న భావంతో సాగే ‘దునియా’ పాటను షెల్లీ రాయగా, స్వీయ సంగీత దర్శకత్వంలో అమిత్ త్రివేది పాడారు. చిత్రంలో హీరోహీరోయిన్లుగా అభయ్ డియోల్, మహీ గిల్ నటించారు. ఇప్పుడు దాస్ దేవ్‌కు దర్శకత్వం వహించిన సుధీర్ మిశ్రా ఉత్తమ చిత్ర దర్శకుడిగా జాతీయ అవార్డును అందుకున్నారు. ఆయన హిందీలో తీసిన ‘హజారో క్వాయిష్ ఐసీ, ధారవి, చమేలి’ చిత్రాలు ప్రేక్షకులు, విశ్లేషకుల ప్రశంసలు అందుకున్నారు. ఆయన గతంలో కుందన్ షా దర్శకత్వంలో వచ్చిన ‘జానే భీ దో యారో’, విధు వినోద్ చోప్రా దర్శకత్వంలో వచ్చిన ‘కామోష్’ చిత్రాలకు సహాయక దర్శకులుగా పనిచేశారు. -
స్వర్గంలో దేవదాస్
స్వర్గంలోని ‘హెవెన్స్టార్ లెవెన్స్టార్ పార్క్’ అది. పార్క్‌లో ఒక మూల బెంచీపై కూర్చొని ఎత్తిన సీసా దించకుండా చాలా సిన్సియర్‌గా మందు కొడుతున్నాడు దేవదాస్. అటువైపుగా వచ్చిన పార్వతి దేవదాస్‌ను చూసింది. ‘‘దేవదాను చూసి ఎన్ని దశాబ్దాలైందో!’’ అనుకుంటూ బెంచీ వెనక్కి వెళ్లి దేవదాస్ కళ్లు మూసి... ‘‘దేవదా... నేనెవరో చెప్పుకో చూద్దాం’’ అని చిలిపిగా అడిగింది. ‘‘నువ్వెవ్వరో చెప్పుకోలేనుగానీ... నువ్వు చేపలపులుసుతో భోజనం చేశావని మాత్రం చెప్పగలను. చేతులను మంచి సోప్‌తో కడుక్కొని ఉండాల్సింది’’ అన్నాడు దేవదాస్. ‘‘నేను ఏ పులుసుతో తింటే నీకేంగానీ...నేనెవరో చెప్పుకోచూద్దాం?’’ మరోసారి అడిగింది పార్వతి. ‘‘మందు కొడితే అద్దంలో నన్ను నేనే గుర్తు పట్టలేను. అలాంటిది ఈ సమయంలో వెనక నుంచి వచ్చి కళ్లు మూస్తే ఎలా గుర్తు పట్టగలను?’’ అన్నాడు దేవదాస్. ఇక లాభం లేదనుకొని అతని ముందుకు వచ్చి నిల్చుంది పార్వతి. ‘‘పారూ...నువ్వా!!’’ ఆశ్చర్యానందాలతో అరిచాడు దేవదాస్. తమ చిన్నప్పటి విషయాలను గుర్తు తెచ్చుకొని ఇద్దరూ కాసేపు నవ్వుకున్నారు. ‘‘దేవదా... ఇంకా మందు కొడుతూనే ఉన్నావా! నన్ను మరిచిపోవడం కష్టంగా ఉందా?’’ సానుభూతిగా అడిగింది పార్వతి. ‘‘పిచ్చి పారూ....అప్పుడెప్పుడో సెవెంటీస్లోనే నిన్ను మరిచిపోయాను. కానీ మందును మాత్రం మరవలేకపోతున్నాను’’ అన్నాడు దేవదాస్. ‘‘నన్ను మరిచిపోయినందుకు బాధ పడటం లేదు. ఈ కాల కూట విషాన్ని తాగుతున్నందుకు మాత్రం బాధ పడుతున్నాను. నా కోసం మందు మానలేవా?’’ ‘‘ఈరోజు నుంచే మానేస్తున్నాను’’ ఖాళీ అయిన సీసాను ముళ్లపొదల్లోకి విసురుతూ అన్నాడు దేవదాస్.‘‘దేవదా...నేనంటే ఎంత ప్రేమ నీకు?’’ పొంగిపోయింది పార్వతి. ‘‘ ప్రేమ కాదు... మలేరియా దోమ కాదు....నీ కోసం కాదు...ఆ మేనక కోసం మానేస్తున్నాను’’ అన్నాడు దేవదాస్. ‘‘మేనక కోసమా!!!’’ నలుదిక్కులూ అదిరేలా ఆశ్చర్యపోయింది పార్వతి. ‘‘ఈ స్వర్గానికొచ్చాక తిలోత్తమతో త్రీ టైమ్స్ లవ్‌లో పడ్డాను. ఎప్పటిలాగే బ్రేకప్! ఇక పొరపాటున కూడా లవ్‌లో పడొద్దని డిసైడైపోయాను. అనుకున్నావు అని ఆగవు కొన్ని...అని ఎవరో అన్నట్లు.... విధివశాత్తు మళ్లీ ప్రేమలో పడిపోయాను. అదేలా జరిగిందంటే... ఒక రోజు నేను ఈ పార్క్‌లో కూర్చొని ఏమీ తోచక... ‘కళ్లు కళ్లు ప్లస్సు /వాళ్లు వీళ్లు మైనస్/ ఇలా ఇలా ఉంటే ఈక్వల్ టు ఇన్ఫాక్చ్వేషన్’ పాట పాడుకుంటున్నాను. అప్పుడే ఇటు వైపుగా వచ్చిన మేనక, తనను చూసే నేను పాడుతున్నట్లు టెంప్టయిపోయింది. ‘‘మీకు అంతగా నచ్చానా!’’ అంటూ నా దగ్గరకు వచ్చి సిగ్గుపడిపోయింది. ‘‘యా!’’ అని చిన్న అబద్ధం ఆడాను. అలా మేనక ప్రేమలో పడిపోయాను. ‘‘మేనూ...నన్ను పెళ్లి చేసుకుంటావా?’’ అని అడిగాను. ‘‘తప్పకుండా. కానీ మీరు ముందు ఈ మందు కొట్టడం మానేయాలి’’ అని షరతు పెట్టింది. ‘‘ఆరోజు ప్రేమ కోసమే మందు కొట్టాను. ఈరోజు ప్రేమ కోసమే మానేస్తున్నాను. ఇక ముందు నైన్టీ ఎమ్.ఎల్ కూడా తీసుకొను’’ అని మాట ఇచ్చాను. ఇదే చివరిరోజు. ఇక ఎప్పుడూ మందు ముట్టను. ఎల్లుండి వాలెంటెన్స్ డే రోజు మా పెళ్లి ఘనంగా జరగనుంది. మన పొరుగు రాష్ట్రమైన నరకం నుంచి కూడా మా పెళ్లి చూడటానికి చాలామంది వస్తున్నారు’’ ఆనందంగా అన్నాడు దేవదాస్. ‘‘ఈరోజు గొప్ప శుభవార్త విన్నాను. తప్పకుండా నీ పెళ్లికి వస్తాను’’ అని చీరకొంగుతో ఆనంద భాష్పాలు తుడుచుకుంది పార్వతి. దేవదాస్ తన చేతికి ఉన్న వాచ్ చూసుకుంటూ... ‘‘పారూ... నా పెళ్లిలో కలుద్దాం’’ అని కోటు జేబులో రెండు చేతులను దూర్చి ‘ఒక మేనక కోసం.... టక్ టక్ టక్.... తిరిగాను స్వర్గం... లక్ లక్ లక్’’ అని పాడుకుంటూ అక్కడి నుంచి వేగంగా వెళ్లిపోయాడు. ఆరోజు వాలెంటెన్స్ డే. కొత్త పట్టుచీర కట్టుకొని ‘షాన్పారేషాన్’ ఫంక్షన్‌హాల్‌కు వెళ్లింది పారు. అక్కడ ఒక పురుగు కూడా లేదు. వెంటనే అక్కడి నుంచి ‘హెవెన్స్టార్ లెవెన్స్టార్’ పార్క్‌కు వెళ్లింది. పార్క్‌లో ఒక మూల కూర్చొని మందుకొడుతున్నాడు దేవదాస్. ‘‘పెళ్లని చెప్పావు... ఇక్కడున్నావేమిటి?’’ అడిగింది పార్వతి. ‘‘ఇంకెక్కడి పెళ్లి... క్యాన్సిల్ అయింది. అంతా ఆ తండ్రీకొడుకులే చేశారు’’ ఆవేదనగా అన్నాడు దేవదాస్. ‘‘వాళ్లెవరు?’’ ఆశ్చర్యంగా అడిగింది పార్వతి.‘‘పృథ్వీరాజ్ కపూర్... ఆయన సన్ రాజ్‌కపూర్. ఏదో ఫంక్షన్లో రాజ్‌కపూర్ మేనకను చూసి పెళ్లంటూ చేసుకుంటే ఆమెనే చేసుకుంటానని పట్టుబట్టాడట. అప్పుడు పృథ్వీరాజ్‌కపూర్ మేనక తల్లి దగ్గరకు వెళ్లి ‘ఎలాగైనా సరే మీ అమ్మాయిని మా అబ్బాయికి ఇచ్చి పెళ్లి చేయాలి’ అని మ్యానేజ్ చేశాడు. ఆ మహాతల్లి ఓకే చెప్పింది. మా లవ్వులో నిప్పులు పోసింది’’ కళ్ల నీళ్లు పెట్టుకున్నాడు దేవదాస్.‘‘అసలు మేనక ఎలా ఒప్పుకుంది?’’ ఆశ్చర్యంగా అడిగింది పార్వతి.‘‘ఆరోజు నువ్వు మీ నాన్న మాట కాదనలేక...నన్ను కాదన్నావు... ఈరోజు పారు వాళ్ల అమ్మ మాట కాదనలేక నన్ను కాదనుకుంది.... అంతే తేడా.... ఒక డాడీ, ఒక మమ్మీ నా జీవితాన్ని ఖాళీసీసా చేసేశారు! వోడ్కా మీద ఒట్టేసి చెబుతున్నాను. ఇక ప్రేమ జోలికి ఎప్పుడూ వెళ్లను’’ నిర్వేదంగా అంటూ సిగరెట్ వెలిగించి పాట అందుకున్నాడు దేవదాస్...‘పారు లేదు/ పప్పు చారు లేదు/ మేను లేదు వాటర్క్యాను లేదూ/ వెలుతురే లేదు’ ఆ సమయంలోనే అటువైపుగా వస్తున్న రంభను చూసి సడన్‌గా పాట మార్చాడు దేవదాస్.‘కళ్లు కళ్లు ప్లస్సు/ వాళ్లు వీళ్లు మైనస్/ ఇలా ఇలా ఉంటే ఈక్వల్ టు ఇన్ఫాక్చ్వేషన్’... అని పాడటం మొదలు పెట్టాడు.‘‘మీకు అంతగా నచ్చానా!’’ సిగ్గుతో మెలికలు తిరిగింది రంభ.‘పిచ్చ పిచ్చగా నచ్చావు’ అన్నాడు దేవదాస్. పారు బిత్తర పోయింది. ఆ తరువాత వెనక్కి తిరిగి చూడకుండా అక్కడి నుంచి పారిపోయింది! – యాకుబ్ పాషా -
దేవదాస్ బామ్మ కన్నుమూత
సాక్షి, సినిమా : బాలీవుడ్ సీనియర్ నటి అవా ముఖర్జీ కన్నుమూశారు. 88 ఏళ్ల అవా అనారోగ్యం కారణంగానే చనిపోయినట్లు ఆమె కుటుంబ సభ్యులు వెల్లడించారు. దేవదాస్ చిత్రంలో షారూఖ్ ఖాన్ బామ్మ పాత్రలో ఆమె నటించి మెప్పించారు. రచయితగా కెరీర్‌ను ప్రారంభించిన అవా.. తర్వాత నటన వైపు మక్కువ చూపారు. 1966లో బెంగాళీ చిత్రం రామ్ ధక్కా ద్వారా ఆమె సినిమాల్లోకి అరంగ్రేటం చేశారు. దేవదాస్, ది ఫర్మ్ ల్యాండ్(2009), సిద్ధార్థ్(2009) చిత్రాలు ఆమె నటించిన వాటిలో చెప్పుకోదగినవి. రామ్ గోపాల్ వర్మ నిర్మాణంలో.. సతీష్ కౌశిక్ డైరెక్ట్ చేసిన డర్నా జరూరీ హై(2006) చిత్రంలో ఓ కీలక పాత్ర పోషించారు. ఇక ఈమె లీడ్ రోల్లో చేసిన డిటెక్టివ్ నాని చిత్రం విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఈ చిత్ర దర్శకురాలు రోమిల్లా ముఖర్జీ, అవా కూతురే కావటం మరో విశేషం. ఆమె మృతి పట్ల పలువురు బాలీవుడ్ ప్రముఖులు నివాళులర్పిస్తున్నారు. -
కొడుక్కి సినిమాలు చూపిస్తున్న హీరో
బాలీవుడ్ సూపర్ స్టార్ షారూఖ్ ఖాన్, తన వారసుడు ఆర్యన్‌ను సక్సెస్ ఫుల్ హీరోగా పరిచయం చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నాడు. త్వరలో తన కొడుకును వెండితెరకు పరిచయం చేసే ఆలోచనలో ఉన్న షారూఖ్, ఆర్యన్‌కు సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చే ముందే.. ఇంగ్లీష్, హిందీ భాషల్లో తెరకెక్కిన టాప్ క్లాసిక్ సినిమాలను చూడమని చెప్పాడట. ఆర్యన్ కోసం భారీ కలెక్షన్‌ను రెడీ చేసిన షారూఖ్, ప్రస్తుతం ద అన్‌టచబుల్స్, ఫాలింగ్ డౌన్ లాంటి హాలీవుడ్ సినిమాలను ఆర్యన్‌కు చూపిస్తున్నాడు. జానే బీదో యార్, షోలే, దేవదాస్ లాంటి బాలీవుడ్ క్లాసిక్స్‌ను సైతం ఆర్యన్‌కు చూపించేందుకు ఓ కలెక్షన్‌ను ఏర్పాటు చేశాడు. త్వరలోనే అమెరికాలోని ప్రతిష్టాత్మక ఫిలిం స్కూల్లో జాయిన్ అవుతున్న ఆర్యన్, బాలీవుడ్‌కు పరిచయం అయ్యేందుకు అన్నిరకాలుగా ట్రైన్ అవుతున్నాడు. ప్రస్తుతానికి తన వారసులు తన అడుగుజాడల్లోనే నడుస్తున్నారని తెలిపిన షారూఖ్.. ఒకవేళ వారు సినీ రంగంలోకి రాకుండా.. వేరే నిర్ణయం తీసుకున్నా తనకు ఆనందమే అని తెలిపాడు. తండ్రి హీరో అయినంత మాత్రాన కొడుకులు కూడా అదే రంగంలోకి రావాలని లేదని తెలిపాడు. -
అంతా కొత్త వాళ్లతో సినిమా!
హిందీ ‘దేవదాసు’ గురించి చర్చలు ‘‘సినిమా అంటే నాకు చాలా ప్యాషన్. కథ తయారు చేయడం మొదలుపెట్టినప్పట్నుంచీ సినిమా పూర్తయ్యేవరకూ నాకు వేరే ఆలోచనే ఉండదు’’ అని దర్శకుడు వైవీయస్ చౌదరి అన్నారు. ఇప్పుడు ఎనర్జిటిక్ స్టార్‌గా దూసుకెళుతున్న రామ్‌లో మంచి హీరో మెటీరియల్ ఉన్నాడనీ, ఆల్రెడీ ఒక దర్శకుడు రిజెక్ట్ చేసిన ఇలియానాలో మంచి హీరోయిన్ మెటీరియల్ ఉందని నమ్మి, ఇద్దర్నీ ‘దేవదాసు’ చిత్రం ద్వారా నాయకా నాయికలుగా పరిచయం చేశారాయన. అలాగే, నందమూరి హరికృష్ణ హీరోగా చేస్తారని ఎవరూ ఊహించలేదు. ఆయన టైటిల్ రోల్లో ‘సీతయ్య’ తీశారు వైవీయస్. అంతకుముందు భారీ తారాగణంతో తీసిన ‘లాహిరి లాహిరి’ చిత్రంలో హరికృష్ణతో ప్రధాన పాత్ర చేయించడంతో పాటు, ఆయన, నాగార్జున కాంబినేషన్లో ‘సీతారామరాజు’ తీశారు. సుప్రీమ్ హీరోగా మాస్లో మంచి పేరు తెచ్చుకున్న సాయిధరమ్ తేజ్‌ను గుర్తించింది కూడా వైవీయస్సే. ‘‘ఓ దర్శకుడిగా ఎదుటి వ్యక్తి బాడీ లాంగ్వేజ్, ప్రవర్తనను బట్టి వాళ్లు ఆర్టిస్టులుగా పనికొస్తారా? లేదా? అని ఆలోచించుకుంటాను. పనికొస్తారనిపిస్తే పరిచయం చేస్తాను. ఇప్పుడు కూడా కొత్తవాళ్లతో సినిమా ప్లాన్ చేస్తున్నాను’’ అని వైవీయస్ అన్నారు. బొమ్మరిల్లు వారి పతాకంపై వైవీయస్ సంగీత ప్రధానంగా సాగే మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్స్ తీశారు. నేడు ఆయన బర్త్‌డే. భవిష్యత్ ప్రణాళికల గురించి వైవీయస్ చెబుతూ - ‘‘కొత్తవాళ్లతో తీయబోతున్న చిత్రానికి కథ- స్క్రీన్‌ప్లే సమకూర్చి, దర్శకత్వం వహించడంతో పాటు నేనే నిర్మిస్తా. ‘దేవదాసు’ చిత్రం హిందీ రీమేక్ హక్కులను ఓ ప్రముఖ నిర్మాత అడిగారు. నన్నే దర్శకత్వం వహించమన్నారు. నాకు హిందీ చిత్రాలంటే ఇష్టం ఉన్నప్పటికీ తెలుగు చిత్రం ప్లాన్‌లో ఉండటంతో హిందీ రీమేక్‌కి ఇంకా మాటివ్వలేదు’’ అన్నారు. -
బాలీవుడ్ 'ట్రాజెడీ కింగ్' బర్త్ డే
రొమాంటిక్, కామిక్, హిస్టారిక్, సోషల్, ట్రాజెడీ ఇలా పాత్ర ఏదైన తనదైన హావభావాలతో రక్తి కట్టించే బాలీవుడ్ లెజెండరీ యాక్టర్ దిలీప్ కుమార్. దేవదాస్, మొగళ్ ఈ అజం, అందాజ్ లాంటి సినిమాలతో భారతీయ సినీ అభిమానుల మనసుల్లో నిలిచిపోయిన ఈ గ్రేట్ యాక్టర్ ఈ రోజు (శుక్రవారం) తన 93వ పుట్టిన రోజు జరుపుకుంటున్నారు. సౌత్ సినిమాతో కూడా విడదీయలేని అనుబందం ఉన్న ఆయన, చెన్నైలో సంభవించిన ప్రకృతి బీభత్సం కారణంగా ఈ సారి తన పుట్టినరోజు వేడకలకు దూరంగా ఉన్నారు. దిలీప్ కుమార్ 1922 డిసెంబర్ 11న ప్రస్తుత పాకిస్థాన్ లోని పెషావర్ లో జన్మించారు. చిన్ననాటి నుంచే నటన పట్ల ఆకర్షితులైన ఆయన 1944లో రిలీజ్ అయిన 'జ్వార్ భట' సినిమాతో వెండితెరకు పరిచయం అయ్యారు. అయితే ఆ పాత్రకు పెద్దగా గుర్తింపు రాలేదు. 1949లో రిలీజ్ అయిన అందాజ్ దిలీప్ కుమార్‌కు స్టార్ స్టేటస్ తీసుకువచ్చింది. ఆ తరువాత వరుసగా ఆన్, దేవదాస్, ఆజాద్, మొగళ్ ఈ అజం, గంగా జయున సినిమాలతో బాలీవుడ్ టాప్ స్టార్‌గా ఎదిగారు. దాదాపు 60 ఏళ్ల పాటు బాలీవుడ్ వెండితెరను ఏళిన ఈ గ్రేట్ యాక్టర్ 1976లో ఐదేళ్ల పాటు నటనకు విరామం ఇచ్చారు. 1981లో క్రాంతి సినిమాతో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా రీ ఎంట్రీ ఇచ్చి మరోసారి తన మార్క్ చూపించారు. 1998లో విడుదలైన క్విలా దిలీప్ కుమార్ చివరి సినిమా ఆ తరువాత వయోభారం కారణంగా ఆయన నటనకు దూరంగా ఉంటున్నారు. భారతీయ సినిమాకు చేసిన సేవలకు గాను ఎన్నో అవార్డులు రివార్డులు ఆయన్ను వరించాయి. భారతీయ చలనచిత్ర చరిత్రలో ప్రతిష్టాత్మకంగా భావించే ఫిలింఫేర్ అవార్డ్‌ను తొలిసారిగా అందుకున్న నటుడు దిలీప్ కుమార్. అంతేకాదు అత్యధికంగా ఎనిమిది సార్లు ఈ అవార్డును అందుకున్న ఏకైక నటుడు ఆయన. భారత ప్రభుత్వం అందించే పద్మ భూషణ్, దాదాసాహెబ్ ఫాల్కే, పద్మ విభూషణ్ లాంటి అవార్డులు సైతం ఆయన్ను వరించాయి. పాకిస్థాన్ లో జన్మించిన దిలీప్ కుమార్‌ను అక్కడి ప్రభుత్వం 'నిషాన్ ఈ ఇంతియాజ్' అవార్డ్‌తో గౌరవించింది. భారతీయ సినిమాకు ప్రపంచ స్థాయి కీర్తిని అందించిన లెజెండరీ యాక్టర్ దిలీప్ కుమార్ మరిన్ని పుట్టినరోజులు జరుపుకోవాలని కోరుకుంటూ పుట్టిన రోజు శుభాకాంక్షలు. -
అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నాడని...
-
అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నాడని..
పోలీస్‌స్టేషన్‌కు తీసుకొచ్చి చితకబాదిన యువతి హైదరాబాద్: వెంటపడి వేధిస్తూ అసభ్యకరంగా ప్రవర్తిస్తున్న వ్యక్తిని ఓ యువతి పోలీస్ స్టేషన్‌కు తీసుకొచ్చి పోలీసుల ముందే చితక్కొట్టింది. హైదరాబాద్‌లోని బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో మంగళవారం ఈ ఘటన చోటు చేసుకుంది. నగరంలోని ముషీరాబాద్‌లో నివసించే మల్లీశ్వరి (34) బంజారాహిల్స్ రోడ్ నం.2 లోని సాగర్ సొసైటీలో ఉద్యోగం చేస్తోంది. అదే ప్రాంతానికి చెందిన దేవదాసు (38) అనే కార్పెంటర్ వారం రోజుల నుంచి యువతి ఎక్కిన బస్సులోనే వెళ్తూ ఆమెను వేధిస్తున్నాడు. దీంతో బాధిత యువతి ఈ వేధింపుల వ్యవహారాన్ని సోదరుడి దృష్టికి తీసుకెళ్లింది. మంగళవారం ఉదయం సోదరుడు, వదినను తీసుకొని ఎప్పటిలాగే బస్సులో బంజారాహిల్స్‌కు వచ్చి సాగర్ సొసైటీ వైపు నడుచుకుంటూ వెళ్తుండగా రోజులాగే దేవదాసు కూడా ఆమెను వెంబడించాడు. దీంతో అందరూ కలసి అతడిని రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకొని బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్‌కు తీసుకొచ్చారు. పోలీసుల ముందే ఆ యువతి... ఈవ్‌టీజర్‌ను చెప్పుతో కొట్టింది. కాగా, దేవదాసుపై ఈవ్‌టీజింగ్ కేసు నమోదు చేసి అరెస్టు చేశామని బంజారాహిల్స్ పోలీసులు తెలిపారు. -
దేవదాసుకు 13 ఏళ్లు
ముంబయి: బాలీవుడ్ సంచలన విజయం సాధించిన దేవదాసు చిత్రానికి నేటికి సరిగ్గా 13 సంవత్సరాలు. ఈ సందర్భంగా బాలీవుడ్ సూపర్ స్టార్ షారుక్ ఖాన్ ఆ చిత్ర యూనిట్ మొత్తానికి ధన్యవాదాలు తెలిపారు. ఈ చిత్రం విడుదలై 13 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా దానికి సంబంధించి ఓ వీడియోను రూపొందించి పంచుకున్నారు. ఆ వీడియోలో దేవదాసు చిత్రంలోని ఓ డైలాగ్‌ను చేతిలో క్యాండిల్ పట్టుకుని ఫీలవుతూ చెప్పారు. దేవదాసు చిత్రం రావడానికి కారణమైన నవల దేవదాసు రచయిత శరత్ చంద్ర ఛటోపాధ్యాయను స్మరించారు. ఈ చిత్రానికి సంజయ్ లీలా బన్సాలీ దర్శకత్వం వహించగా పార్వతీగా ఐశ్వర్యరాయ్, చంద్రముఖిగా మాధురి దీక్షిత్ నటించారు. 2002లో విడుదలైన ఈ చిత్రంలో జాకీ ష్రాప్, కిరణ్ ఖేర్, స్మతా జయకర్ కూడా ప్రముఖ పాత్రలు పోషించారు. -
అక్కినేని బాధ చూసి... నాగ్ కాల్చుకుంటానన్నారు!
దేవదాసు, మేఘసందేశం, ప్రేమాభిషేకం... ఇలా వెండితెరపై అక్కినేని నాగేశ్వరరావు మిగిల్చిన తీపిజ్ఞాపకాలు ఎన్నో. అందుకే, ఆయన తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయినా ఇంకా ఇక్కడే ఉన్నారనే భావనతో చాలామంది ఉన్నారు. ఏ పాత్ర చేసినా, ‘ఈ పాత్రను అక్కినేని మినహా ఇంత అద్భుతంగా ఎవరూ చేయలేరు’ అనిపించుకోగలిగారాయన. నటన అంటే ఏయన్నార్‌కు అంత కమిట్మెంట్, ప్రేమ. అందుకే, ఏ ఆస్పత్రిలోనో కాకుండా షూటింగ్ లొకేషన్లోనే తుదిశ్వాస వదిలేస్తే బాగుండు అని ఆయన అనుకున్నారు. మరికొన్ని రోజుల్లో మృత్యువు ఒడిలోకి చేరడం ఖాయం అని తెలిసినా, చివరి సినిమా ‘మనం’ షూటింగ్లో ఆయన గుండె నిబ్బరంతో పాల్గొన్నారు. ఆరోగ్యం పెద్దగా సహకరించకపోయినా, ఆ చిత్రంలో నటించడంతో పాటు, తన పాత్రకు తానే డబ్బింగ్ చెప్పుకున్నారు. వృత్తిపట్ల ఏయన్నార్‌కి ఉన్న కమిట్మెంట్కి ఇది నిదర్శనం. ‘మనం’ చిత్రంలో ఆయన కాంబినేషన్లో నటించినవాళ్లందరూ, జీవితాంతం గుర్తుండే అనుభూతులు మిగిలాయంటూ ఉంటారు. తాజాగా ఓ ఆంగ్ల పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో శ్రీయ అయితే.. ‘‘మరికొన్ని రోజుల్లో చనిపోతానని తెలిసినా ఏయన్నార్‌గారు ఎంతో పాజిటివ్‌గా ఉండేవారు’’ అని పేర్కొన్నారు. ‘‘ఈ చిత్రం షూటింగ్ సమయంలో ఏయన్నార్‌గారు మాట్లాడిన ప్రతి మాటా నాకు గుర్తే. ‘మనం’ చిత్రంలో ఏయన్నార్‌గారు రోడ్డు మీద పడిపోయే సీన్ ఒకటుంటుంది. ఆ సీన్లో నా ఒడిలో ఆయన తల ఉంటుంది. ఆయనను కాపాడటానికి ప్రయత్నం చేస్తుంటాను. క్యాన్సర్ వల్ల అప్పటికే ఆయనకు ఒంట్లో అస్సలు బాగా లేదు. డాక్టర్ల అనుమతి తీసుకొని, రెండు గంటల పాటు ఎలాగోలా షూటింగ్లో పాల్గొంటున్నారు. క్యాన్సర్‌కు అప్పుడే ఆపరేషనైన ఆ పెద్దాయన, ఆ పరిస్థితుల్లో, కష్టమైనా సరే ఇష్టపడి నటిస్తుంటే నాకేమో కంగారుగా ఉంది. అప్పుడాయన, ‘ఎందుకు కంగారుపడుతున్నావ్. ఆస్పత్రిలో చనిపోయే కన్నా, ఇప్పుడు ఇక్కడే కెమెరా ముందు ప్రాణం విడిస్తేనే నాకు ఆనందంగా ఉంటుంది’ అన్నారు. మరో రెండు నెలలో చనిపోతారనగా, ఈ చిత్రంలో నటించారాయన. సెట్లో ఆయనతో, ‘సార్! ఇంత స్ట్రెయిన్. ఫరవాలేదా’ అని అడిగేదాన్ని. అప్పుడాయన ‘నా గురించి బాధపడొద్దు. నేను చాలా హ్యాపీ మ్యాన్’ని అనేవారు. ఆరోగ్యం సహకరించకపోయినా ఆయన షూటింగ్ చేయడం చూసి, నాగార్జున చాలా బాధపడేవారు. ఒకసారైతే ‘ఏదైనా గన్ ఉంటే ఇవ్వు. కాల్చుకుంటాను. నాన్నను ఇలా చూడలేకపోతున్నాను’ అని నాగార్జున ఉద్వేగానికి గురయ్యారు. వృత్తిపట్ల ఏయన్నార్‌గారికి ఉన్న అంకితభావం చూసి, నాకు ఆశ్చర్యం అనిపించేది. రాత్రిపూట షూటింగ్ అంటే మా లాంటివాళ్లం ఒక్కోసారి విసుక్కుంటుంటాం. కానీ, ఆయన ఏనాడూ అలా చేయలేదు. సినిమా అంటే ఆయనకు అంత మమకారం. సినిమాలో తన వర్క్, డబ్బింగ్‌తో సహా ముందే పూర్తి చేసేశారు. మనల్ని ఆశీర్వదించడానికి కొన్ని ఆత్మలు మన చుట్టూ ఉంటాయంటారు. అలా ‘మనం’ కోసం ఏయన్నార్ ఆత్మ ఉండి, అందరినీ ఆశీర్వదించిందని అనిపించింది’’ అని శ్రీయ చాలా ఉద్వేగంగా వివరించారు. వృత్తి పట్ల ఏయన్నార్ కమిట్మెంట్ ఏ వృత్తిలో ఉన్నవాళ్ళకైనా పెద్ద లెసన్ కదూ! -
నటులకు గీటురాయి... దేవదాసు!
మిలీనియమ్ మొదట్లో వచ్చిన పెద్ద సినిమాలలో సూపర్‌హిట్ సినిమాలు, భారీ అంచనాలు ఉన్న సినిమాలన్నీ దాదాపు తొంభై శాతం పాత కథలే. వాటికి కొత్త సాంకేతిక హంగులు, ఈతరంలో టాప్ ఆర్టిస్టులు, విజువల్ గ్రాండియర్ తోడై, మంచి పాటలతో, పంచ్ డైలాగులతో మోడరన్ సినిమా ప్రేక్షకుడికి పాత చింతకాయతో కొత్త పచ్చడి తయారుచేసినట్టయింది. 1900కి ముందు కలకత్తాలో శరత్చంద్ర రాసిన నవల మొదట బెంగాలీలో మూకీ సినిమాగా తయారై, హిట్ అయ్యి, కొన్నేళ్ల తర్వాత... 1935 ప్రాంతాల్లో పి.సి.బారువా హీరోగా నటిస్తూ దర్శకత్వం వహించిన టాకీ సినిమాగా తయారై, హిట్ అయ్యి, మళ్లీ అదే పి.సి.బారువా తన దర్శకత్వంలో కుందన్లాల్ సైగల్ హీరోగా 1950లలో బెంగాలీలో రిలీజై, హిట్ అయ్యి, తెలుగులో వేదాంతం రాఘవయ్యగారి దర్శకత్వంలో డా॥అక్కినేని హీరోగా, సావిత్రి హీరోయిన్గా తయారై, సూపర్‌హిట్ అయ్యి, ఆల్‌టైమ్ క్లాసిక్స్‌లో ఒకటిగా నిలిచి, మళ్లీ హిందీలో దిలీప్‌కుమార్ హీరోగా, మళ్లీ తెలుగులో కృష్ణగారు హీరోగా, విజయనిర్మలగారి దర్శకత్వంలో, మళ్లీ బెంగాలీలో, పాకిస్తాన్లో, బంగ్లాదేశ్‌లో, మళ్లీ ప్రతి పదేళ్ల తర్వాత బెంగాలీలో ఒకసారి కొత్త సినిమాగా తయారై, ఆ వరుసలో 2002లో షారుక్ ఖాన్, ఐశ్వర్వారాయ్, మాధురీ దీక్షిత్‌ల భారీ తారాగణంలో, సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వంలో కలర్‌ఫుల్ ప్రేమ కావ్యం అయింది - ‘దేవదాస్’. గంగావతరణం పుట్టుకని, ప్రవాహాన్ని, గంగానది ప్రయాణాన్ని తలపిస్తోంది కదూ ఈ దేవదాసు చరిత్ర. పదిహేడేళ్ల వయసులో శరత్చంద్ర రచించిన ఒక భగ్న ప్రేమికుడి విషాద గాథ దేవదాసు. ఈరోజు వరకూ ఎన్ని ప్రేమకథలు వచ్చినా, వాటిలో ‘దేవదాసు’ ప్రస్తావన గానీ, పార్వతి ప్రస్తావన గానీ, వాళ్లలాంటి సీను గాని, షాట్ గాని, డైలాగ్ గానీ పాటలో గానీ లేకుండా భారతీయ సినిమా లేదంటే అతిశయోక్తి కాదు. ‘ప్రేమ’ రెండక్షరాల్లాగే, దాని పర్యవసానం కూడా రెండే. ఒకటి సుఖాంతం, ఇంకోటి దుఃఖాంతం. పెళ్లవగానే సుఖాంతం ఏ కారణం చేతనైనా పెళ్లి చేసుకోలేకపోతే దుఃఖాంతం. కానీ దుఃఖాంతమైన ప్రేమ కథల్లో అంతులేని ఆత్మ, జీవం, ఆవేదన, ఆర్తి, లాంగింగ్నెస్ అన్నీ పరిపూర్ణంగా అనుభవించేలా రాసిన కథ దేవదాసు.పోస్టర్ చూడగానే: అక్కినేని, దిలీప్ కుమార్ లాంటి మహానటులు నటించిన పాత్రలో మోడరన్ ప్రేమికుడి పాత్రలకి పేటెంట్ అయిన షారుఖ్ ఏం నటిస్తాడు? ఇతనిలో ఆ పాత్రకి కావల్సిన డెప్త్ ఎక్కడుంది? అనిపించింది. అలాగే పార్వతి పాత్రకి ఐశ్వర్యారాయ్ చాలా మిస్ఫిట్ అని మొదటి ఫీలింగ్. చంద్రముఖి పాత్రకి మాధురీ దీక్షిత్ మాత్రమే కరెక్టని. ఆమె ‘ప్రేమాభిషేకం’లో జయసుధగారిలాగా అవలీలగా ఆ క్యారెక్టర్ని ప్లే చేయగలదని నమ్మకం. ‘హమ్ దిల్ దే చుకే సనమ్’ సినిమా వల్ల ఏ మూలో సంజయ్‌లీలా భన్సాలీ అంటే నమ్మకం. కథలో డెప్త్‌ని క్యారెక్టర్ల ద్వారా కన్వే చేయగలడని, విజువల్‌గా అద్భుతంగా అనిపించగలడని. పాటలు వినగానే సినిమా కచ్చితంగా చూడాలనిపించింది. కవితా కృష్ణమూర్తి పాడిన ‘మార్డాలా...’, శ్రేయాఘోషల్ అనే కొత్త గాయని ఇంట్రడ్యూస్ అయిన ‘మోరే పియా..’, ‘డోలారే డోలారే...’’ రెండు ట్రాక్స్. దర్శకుడు సంజయ్‌లీలా భన్సాలీ జీ సరిగమప కార్యక్రమానికి అతిథిగా వెళ్లినప్పుడు లతా మంగేష్కర్ పాట పాడిన శ్రేయాఘోషల్ని చూసి, గుర్తుపెట్టుకుని ఈ చిత్రంలో ఐశ్వర్యారాయ్ పాత్ర పార్వతి పాడే పాటలన్నింటికీ ఆమె గొంతే కావాలని ఇస్మాయిల్ దర్బార్ (సంగీత దర్శకుడు)కి చెప్పి పాడించాట్ట. ఆ చిత్రంతోనే శ్రేయాఘోషల్ హిందీ సీమకి గాయనిగా పరిచయం అవ్వడం, ఆ చిత్రంతోనే ఉత్తమ నేపథ్య గాయనిగా నేషనల్ అవార్డ్ తీసుకోవడం జరిగిపోయాయి. 2002లో 50 కోట్లు ఖర్చుపెట్టి సినిమా తీయడం పెద్ద సాహసం. అది కూడా 102 ఏళ్ల క్రితం రాసిన నవల, 16 భారతీయ, పక్క దేశాల భాషల్లో వివిధ రకాలుగా తీసేసిన కథని తీయడం మరీ సాహసం. ఆ చిత్రం భారతదేశం తరఫున బెస్ట్ ఫారెన్ ఫిల్మ్ కేటగిరీలో ఆస్కార్ నామినేషన్స్‌కి వెళ్లడం, కేన్స్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్లో ప్రదర్శితమవ్వడం, నేషనల్ అవార్డ్స్, ఫిల్మ్‌ఫేర్ అవార్డ్స్ ఎన్నింటినో గెలుచుకోవడం... అన్నింటినీ మించి భారతీయ ప్రేక్షకులు ఆ చిత్రంపై నిర్మాత భరత్షా పెట్టిన యాభై కోట్లకీ నూట రెండు కోట్లకు పైన రిటర్న్ ఇవ్వడం - ఎన్ని ఘనతలు. శరత్చంద్ర నవలలో దేవదాసు కథ దుఃఖాంతం కానీ, ‘దేవదాసు’ చిత్రంలో ఎంతమంది ఎన్నిసార్లు నటించినా, అంతకుముందు వారి మీదున్న ఇమేజ్‌ని మార్చి, వారిని మహానటీనటులుగా తీర్చిదిద్దిన గొప్పతనం ఆ పాత్రలది. పాత్రధారి ప్రతిభకి ఛాలెంజ్ విసిరే పాత్రల తీరుతెన్నులు ‘దేవదాసు’ సొంతం. దానివల్ల ఆ నటీనటుల జీవితాలు నటలోకంలో స్థిరపడి సుఖాంతం అయ్యాయి. ‘దేవదాసు’ చిత్రాలని నిర్మించిన నిర్మాతలందరికీ లాభం రావడం, ప్రేక్షకులు ఆయా కాలాల్లో ఆ చిత్రాలని ఆదరించడం, తద్వారా పనిచేసినవారికి జీతం, గుర్తింపు రావడం - ఇదీ సుఖాంతమే. సరోజ్ ఖాన్ నృత్య రీతులు, మాధురీ దీక్షిత్, ఐశ్వర్యారాయ్ నటన, కలిసి చేసిన నృత్యం, నితిన్ చక్రవర్తి ఆర్ట్ డెరైక్షన్, సంజయ్‌లీలా భన్సాలీ ఫ్రేమింగ్, గ్రాండియర్ టేకింగ్, కిరణ్ ఖేర్, జాకీష్రాఫ్, మిలింద్ గుణాజీ లాంటి సహ నటీనట వర్గం అపూర్వ నటనతో పాటు షారుఖ్, మాధురీ, ఐశ్వర్యల తారాస్థాయి నటన - ఈ 2002 హిందీ ‘దేవదాసు’కి క్లాసిక్ అప్పీలునిచ్చాయి. ‘దేవదాసు’ కథ అందరికీ తెలిసిందే అని నేను మళ్లీ రాయడం లేదు. తెలీకపోతే, ఎవరైనా అర్జెంటుగా ఆ చిత్రాన్ని రెండుసార్లు చూడండి - బ్లాక్ అండ్ వైట్‌లో అక్కినేని, సావిత్రి జీవించిన దేవదాసుని, కలర్లో సంజయ్‌లీలా భన్సాలీ రూపొందించిన దేవదాసుని - హిందీ దేవదాసులో ఒకే మార్పు మాతృకలలో లేనిది ఏమిటంటే, పార్వతి చంద్రముఖిని తిట్టి, వచ్చేయకుండా, ఆమె కూడా దేవదాసుని ప్రేమింస్తోందని నమ్మి తనింటికి ఒక ఫంక్షన్‌కి ఆహ్వానించడం - ఆమె వేశ్య అన్న సంగతిని దాచి అతిథిగా చూడటం - తన భర్త తమ్ముడు చంద్రముఖి అస్తిత్వాన్ని బైటపెట్టి, అవమానించబోతే, చంద్రముఖి ఇచ్చే జవాబు - ఇది తెరమీద చూసి తీరాల్సిన ఎపిసోడ్. అలాగే 1900 ప్రాంతంలోనే నవలలో పార్వతి మొదట నిర్భయంగా దేవదాసుని ప్రేమించినట్టు చెప్పగలుగుతుంది. కానీ, దేవదాసు చెప్పలేక కలకత్తా వెళ్లిపోతాడు. అక్కణ్నుంచి ఆమెకి ఉత్తరం రాస్తారు - మనిద్దరం స్నేహితులమే అని. ఆ సంకోచం, ఆ బిడియం, ఆ పిరికితనం, ఆ ఈగో, ఇవాళ్టికీ మగవాళ్లలో ఉంది. ఆ కచ్చితత్వం, క్లారిటీ, మనసిచ్చిన వాడి దగ్గర మాత్రం చొరవ, తెగువ చూపించగల ధైర్యం, ఆ విషయంలో ఈగో లేకపోవడం ఆనాటి నుంచి ఈవాళ్టికీ ఆడపిల్లల్లో ఉంది అని నా అభిప్రాయం. దీన్ని గమనించి, గుర్తించి రాసినందుకే దేవదాసు ఏ రోజుకైనా సమకాలీన సినిమా అవుతూ ఉండచ్చు. కాలంలో సమాంతరంగా పరిగెత్తే కాసుల మిషన్ అయి ఉండచ్చు. ఒక విపత్తు మధ్య నలిగిన ప్రేమికుల కథ ‘టైటానిక్’ గొప్ప ప్రేమకథా చిత్రం - ప్రేమికుల మధ్య ఉత్పన్నమైన భావోద్వేగాల విపత్తు నుంచి పుట్టిన విషాదగాథ ‘దేవదాసు’ అంతకంటే గొప్ప చిత్రం. హ్యాట్సాఫ్ శరత్చంద్ర - హ్యాట్సాఫ్ సంజయ్‌లీలా భన్సాలీ - హ్యాట్సాఫ్ షారుక్ - త్రీ ఛీర్స్..! మగవాళ్లలో 1900 నాటి ఆ సంకోచం, ఆ బిడియం, ఆ పిరికితనం, ఆ ఈగో ఇవాళ్టికీ ఉంది. ఆడపిల్లల్లో ఆ కచ్చితత్వం, క్లారిటీ, మనసిచ్చిన వాడి దగ్గర మాత్రం చొరవ, తెగువ చూపించగల ధైర్యం... ఆ విషయంలో ఈగో లేకపోవడం ఆనాటి నుంచి ఈవాళ్టికీ ఉంది. దీన్ని గమనించి, గుర్తించి రాసినందుకే దేవదాసు ఏ రోజుకైనా సమకాలీన సినిమా అవుతూ ఉండి ఉండవచ్చు. -
‘నటసామ్రాట్’బిరుదు అలా ఇచ్చాం!
నేడు అక్కినేని ప్రథమ వర్ధంతి ఎంతలో తిరిగివచ్చింది ఏడాది! ‘నట సామ్రాట్’ అక్కినేని మనల్ని విడనాడి దివికేగి సంవత్సరమైందా? ఆయన మన మధ్య ఉన్నట్టు, ఇంకా హైదరాబాద్ రవీంద్రభారతిలో సభలో మాట్లాడుతున్నట్టు అనిపిస్తున్నదే! అందులోనూ ఆయన పార్థివ శరీరాన్ని చూడని నాకు ఆయన తన అభిమానులతో తన అనుభవాల గురించి ముచ్చటిస్తున్నట్టే అనిపిస్తున్నది! అక్కినేని నాగేశ్వరరావు జీవితం బహువిచిత్రమైనది. అదొక అద్భుత గాథ. వ్యక్తిత్వ వికాస విద్యార్థులకు ఆదర్శ పాఠ్యగ్రంథం! లేకపోతే, ఒక సాధారణ రైతు కుమారుడు అలభ్యమైన అప్పటి మద్రాసులో చిత్రజగత్తుకు వెళ్లడమేమిటి? అక్కడ హీరోలకు హీరో కావడమేమిటి? నాల్గవ తరగతి కూడా సరిగ్గా చదవని ఆ అబ్బాయి అమెరికా ప్రభుత్వం ఆహ్వానంపై అమెరికా వెళ్లడమా? చివరికి ‘పద్మశ్రీ’, ‘పద్మభూషణ్’, ‘పద్మవిభూషణ్’లు ఆయన నట జీవితాన్ని అలంకరించడమా? అందువల్లనే, అక్కినేనిది అద్భుత చరిత్ర; ఆయన బాల్య జీవితాన్ని పరిశీలిస్తే, ప్రపంచ ప్రఖ్యాతులైన పెక్కుమంది మహామహుల బాల్య జీవితంలో కానవచ్చే విశేషాలే కానవస్తాయి! తల్లిదండ్రులకు అక్కినేని కడగొట్టు సంతానం. పుట్టిన వారి వరుసలో ఆయన తొమ్మిదవవాడు! ఆయనకు ముందు పుట్టిన బేసి సంఖ్య పిల్లలు పోవడం వల్ల ఈ తొమ్మిదో వాడేం జీవిస్తాడని అందరూ ఆశ వదులుకున్నారు! గండాలమారి దానికి తగ్గట్టే ఆ పిల్లవాడికి మెడపై కణితి లేవడం ప్రారంభించింది! ఇంకేమున్నది? ఇక లాభం లేదని వైద్యం కూడా మానేశారు. కాని, ఆ గొంతు లక్షలాది ఆంధ్ర ప్రేక్షకుల హృదయాలను భవిష్యత్తులో ఉర్రూత లూగించడం విధి విలాసమైతే, ఆ కణితి ఏమి చేస్తుంది? మందు లేకుండానే అది మానిపోయింది! చిన్నప్పుడు ఆయనకు జలగండం, అగ్ని గండం తప్పాయి. గండాలన్నీ గడిచి అక్కినేని వారి అబ్బాయి గట్టెక్కాడు! పున్నమ్మ గారికి ఆడపిల్లలు లేరు. ఈ అబ్బాయినే అమ్మాయిగా చూసుకుని సంతోషించాలని అతనికి ఆడపిల్లవలె జడవేసేది, పరికిణీలు తొడిగేది! మరి, వేష భాషలే కదా మనిషిని మార్చివేసేది! అమ్మాయి వేషం వేసే సరికి అబ్బాయి గారికి అమ్మాయిల వలె కులకడం, నడవడం అలవాటయింది. అందువల్ల, నాటకాలలో ఆడ వేషాలు వేయడం నాగేశ్వరరావుకు చిన్నప్పుడే అబ్బింది! తల్లి ఆరోగ్యం సరిగా లేనందున, ఆమెకు వంట, మిగిలిన ఇంటి పని చేసిపెట్టి, బడికి వెళ్లి చదువుకుంటూ, అది అయిన తరువాత మైలు దూరంలో ఉన్న నాటకాల రిహార్సల్ స్థలానికి వెళ్లేవాడు. ఆయన ఆడవేషం, ఆ తళుకు, ఆ బెళుకు, ఆ కులుకు చూసి కొందరు ఆ పాత్రధారి నిజంగా అమ్మాయే అనుకునేవారట! అప్పుడు ఆయన పారితోషికం మూడు రూపాయలు! ఒకసారి తెనాలిలో నాటకం వేసి, విజయవాడ మీదుగా గుడివాడ వెళదామని విజయవాడ రైలు స్టేషన్లో రైలు కోసం ఎదురు చూస్తున్న నాగేశ్వరరావును ‘ప్రతిభా పిక్చర్స్’ ఘంటసాల బలరామయ్య చూశారు! అప్పుడు తాను తీస్తున్న ‘శ్రీ సీతారామ జననం’లో శ్రీరాముడు వేషానికి ఈ కుర్రవాడు సరిపోయేట్టు ఉన్నాడని భావించి, అక్కినేని అన్నగారితో మాట్లాడి, ఆ తరువాత ఆ ఆడపాత్రధారి చేత తన చిత్రంలో మొదటిసారిగా మగ పాత్రను వేయించారు! అక్కడి నుంచి అక్కినేని వెనుదిరిగి చూడలేదు. ఇది 1944 నాటి మాట. అప్పటికి నాగేశ్వరరావు వయస్సు 19 సంవత్సరాలు. ఇక అప్పటి జానపద చిత్రాల యుగంలో ఈ నవ యువకుడే అమ్మాయిల కలల రాకుమారుడు! అలా ఆనాటి జానపద చిత్రాలలో నాగేశ్వరరావు ‘హీరో నాగేశ్వరరావు’ అయ్యాడు! అక్కినేని ‘దేవదాసు’కు అర్హుడా? 1952లో వినోదా పిక్చర్స్ వారు బెంగాలీ నవల ‘దేవదాసు’ను తెలుగులో చిత్రించదలచి అక్కినేనిని కథానాయకుడుగా నిర్ణయించి, ప్రకటించేసరికి చాలామందికి ఆశ్చర్యం కలిగింది! జానపద చిత్రాల రాకుమారుడు ఆ తాగుబోతు పాత్రకు ఏమి పనికి వస్తాడన్న విమర్శలు బయలుదేరాయి! అప్పటిలో - 1952లో - నేను ‘ప్రతిభ’ అనే తెలుగు వారపత్రికకు ఎడిటర్‌గా పని చేస్తున్నాను. ‘‘అక్కినేని దేవదాసు పాత్రకు అర్హుడా?’’ అన్న శీర్షికతో నేను నా పత్రికలో ఒక వ్యాసం రాశా. అది నాగేశ్వరరావు దృష్టికి వెళ్లింది! 1953లో ఆ చిత్రం విడుదలై, యావదాంధ్ర దేశంలో నాగేశ్వరరావు ‘దేవదాసు’ పాత్రను గురించి జనం వింతగా చర్చించుకుంటున్నారు. విజయవాడలో నాగేశ్వరరావుకు అప్పుడే సన్మానం జరిగింది. ఆ సన్మానానికి నేను కూడా వెళ్లాను. సభానంతరం అక్కినేని నా వద్దకు వచ్చి, ‘‘ఏమండీ! ‘దేవదాసు’ పాత్రకు నేను అర్హుడినా? అనర్హుడినా?’’ అని చిరునవ్వుతో అడిగేసరికి నేను కొంచెం బిడియంతో ‘‘హ్యాట్సాఫ్ టు యు’’ అని అభినందించేసరికి ఆయన ముఖంలో ఆనందం వెల్లివిరిసింది! అక్కినేనికి ముఖస్తుతి పనికిరాదు. సద్విమర్శనే ఆయన ఆహ్వానించేవారు. ‘దేవదాసు’కు తాను పనికిరానన్న విమర్శను పెద్ద సవాల్‌గా తీసుకుని, ఆ పాత్రలో మెప్పు పొందడానికి తాను అహోరాత్రులు తపనపడ్డానని ఆయన నాతో అన్నారు. ఆ తరువాత దాదాపు పది సంవత్సరాల అనంతరం నేను లక్నోలో ‘హిందీ సినీ లెజెండ్’ దిలీప్‌కుమార్‌ను కలుసుకున్నప్పుడు ఆయన ‘దేవదాసు’ పాత్రను అభినందించారు. ఆయనకు ‘ట్రాజెడీ కింగ్’ అని బిరుదు. ‘నా కంటే మీ నాగేశ్వరరావే బాగా నటించారు’’అని దిలీప్ అన్నారు. అలాగే ‘కన్నడ కంఠీరవ’ రాజ్‌కుమార్ కూడా అదే మాట అన్నారు. మొత్తం మీద ‘దేవదాసు’ పాత్రను సైడల్, బారువా, దిలీప్, షారుక్‌ఖాన్ మొదలైన మహానటులు ఎందరు పోషించినా, అక్కినేని ‘దేవదాసు’కు ఆయనే సాటి!ఆ తరువాత ఆయన నట జీవితంలో 60వ చిత్రం ‘దొంగల్లో దొర’ 1957 జూలై 19న విడుదలైంది. అది అక్కినేని నట జీవిత వజ్రోత్సవం. ఆ సందర్భంగా ఆయనను సినీ జీవితంలోకి పంపిన విజయవాడలో ఆయనకు భారీ ఎత్తున సన్మానాన్ని తలపెట్టాము. ఎలా సన్మానించాలన్న సమస్య వచ్చినప్పుడు అక్కినేనికి దీటైన సాంఘిక చిత్రాల హీరో లేడని, ఆయనకు ‘నటసామ్రాట్’ అన్ని బిరుదు అన్ని విధాల తగినదని నేను సూచించినప్పుడు ఆహ్వాన సంఘం వారు అంగీకరించారు. అక్కినేని ఎత్తిపొడుపు! 1957లో ఆగస్టులో విజయవాడలో జరిగిన అక్కినేని సన్మాన సభలో ‘నటసామ్రాట్’ బిరుదు ఇస్తూ, సన్మాన పత్రం రాసిన నేనే దాన్ని చదివి, అప్పటి ఆంధ్రప్రదేశ్ ఆర్థికమంత్రి బెజవాడ గోపాలరెడ్డితో కలిసి, అక్కినేనికి సమర్పించగా, ఆయన ‘‘ ‘నేను నటసామ్రాట్’ బిరుదుకు తగినవాడినంటారా?’’ అంటూ నా వంకకు తిరిగి నవ్వుతూ అన్నారు. నవ్వడం నా వంతు, ఏమిటో తెలియక ఆశ్చర్యపోవడం గోపాలరెడ్డిగారి వంతు అయింది! ఆ తరువాత ఆయనకు ‘పద్మశ్రీ’, ‘పద్మభూషణ్’, ‘పద్మవిభూషణ్’ - ఎన్ని అవార్డులు వచ్చినా, ‘నట సామ్రాట్’కు చాలిన బిరుదు లేదని ఆయన చాలా సందర్భాల్లో అంటూ వచ్చారు. చివరికి అంతర్జాతీయ చలన చిత్రోత్సవంలో అక్కినేని ముఖ్య అతిథిగా పాల్గొన్నప్పుడు ఆయనను అప్పటి ప్రధానమంత్రి వాజ్‌పేయి కూడా ‘నటసామ్రాట్ నాగేశ్వరరావుజీ’ అని సంబోధించారు!ఔను! నటసామ్రాట్ అంటే నాగేశ్వరరావు! నాగేశ్వరరావు అంటే నటసామ్రాట్! అందువల్లనే, తనకు ఆ బిరుదు వచ్చి, 50 ఏళ్లు అయిన సందర్భంగా 2007లో అక్కినేని నన్ను హైదరాబాద్ ఆహ్వానించి, నాకు స్వర్ణకంకణం తొడిగారు! ‘నటసామ్రాట్’ అంటే అక్కినేనికి అంత ప్రియతమ బిరుదు! -
ప్రపంచ శాంతి కోసం ప్రార్థన
ద్యాత్మిక శాంతిని పొందడానికి, ప్రపంచ శాంతి కోసం ప్రతి ఒక్కరూ ప్రార్థనలు చేయాలని బైబిల్ మిషన్ మహోత్సవాల కన్వీనర్ రెవరెండ్ జె.శామ్యూల్ కిరణ్ అన్నారు. దైవజనులు ఎం.దేవదాస్ అయ్యగారికి బయలుపరిచిన 76వ బైబిల్ మిషన్ మహోత్సవాలు బుధవారం విజయవంతంగా ముగిశాయి. ఈ సందర్భంగా రెవరెండ్ డాక్టర్ జె.శామ్యూల్ కిరణ్ మాట్లాడుతూ మహోత్సవాల ఆశీర్వాదాలను తమతో పాటు పొరుగువారికి కూడా అందించాలని సూచించారు. ప్రతి భక్తుడు దే వుని కృపకు పాత్రులై జీవించాలన్నారు. కుల,మత, వర్గ, ప్రాంత విభేదాలు లేకుండా ఒకే పందిరిలో ఇంతమంది ఐక్యతానురాగాలతో మూడు రోజుల పండుగ వాతావరణంలో పాలుపంచుకున్న ప్రతి ఒక్కరినీ అభినందించారు. మహోత్సవాలు విజయవంతం కావడానికి తోడ్పాటు నందించిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపారు. మండల పరిధిలోని ఆచార్య నాగార్జున యూనివర్సిటీ ఎదురుగా ఉన్న ప్రాంగణంలో వేసిన పందిళ్లలో గత మూడు రోజులుగా జరిగిన మహోత్సవాలకు దేశ, విదేశాల నుంచి సుమారు 10 లక్షల మంది భక్తులు హాజరయ్యారు. చివరిరోజు తెల్లవారుజామున 4 గంటలకు తిరుపతికి చెందిన డాక్టర్ డేనియల్ దినకర్ ధ్యాన ప్రార్థనలతో దినచర్యలు ప్రారంభించారు. ఒరిస్సా, తమిళనాడు, ఢిల్లీ, కర్నాటక సంఘాలకు చెందిన రెవరెండ్లు కె.శ్యాంకిషోర్, సీఎస్ఐ బిషప్, జి. దైవాశీర్వాదం, సైమన్ హక్ వాక్యోపదేశం చేశారు. పందిళ్ల ప్రాంగణం భక్త జన సంద్రంలా మారింది. బైబిల్ మిషన్ మహోత్సవాల నివేదికను వివరించారు. ప్రముఖుల రాక : బైబిల్ మిషన్ మహోత్సవాల ముగింపురోజు బుధవారం పలువురు ప్రముఖులు హాజరై దేవుని ఆశీర్వచనాలు అందుకున్నారు. కేంద్ర సహాయ మంత్రి పనబాక లక్ష్మి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు,తెనాలి మాజీ ఎంపీ వల్లభనేని బాలశౌరి, రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ, గుంటూరు -1 ఎమ్మెల్మే షేక్ మస్తాన్ వలి, పెడన ఎమ్మెల్యే జోగి రమేష్, బైబిల్ మిషన్ గవర్నింగ్ బాడీ సభ్యులు, యూత్ గాస్పెల్ టీమ్ సభ్యులు, రెవరెండ్లు, యాజకులు,సేవకులు పాల్గొనగా అధ్యక్షులు రెవరెండ్ డాక్టర్ ఎన్.సత్యానందం, కన్వీనర్ రెవరెండ్ డాక్టర్ జె.శామ్యూల్ కిరణ్, సెక్రటరీ రెవరెండ్ పీఎం శాంతిరాజు, జాయింట్ సెక్రటరీ రెవరెండ్ డాక్టర్ ఎన్.యేసురత్నం, స్త్రీల సభల కన్వీనర్ డాక్టర్ ప్రమీలా సెల్వరాజ్ దేవుని నామమున అతిథులకు ఆశీర్వచనాలు అందజేశారు.కాకాని తోటలో పోటెత్తిన భక్తులు: పెదకాకాని తోటలో మూడు రోజులుగా భక్తులు పోటెత్తారు. బైబిల్ మిషన్ మహోత్సవాలకు హాజరైన భక్తులు పెదకాకాని తోటకు చేరుకుని తోట ప్రాంగణంలో ఉన్న ఎం.దేవదాసు అయ్యగారికి, రెవరెండ్ డాక్టర్ జె.జాన్ సెల్వరాజ్ మహిమ సమాధుల వద్ద ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఆకట్టుకున్న ప్రమీలా సెల్వరాజ్ బృందం భక్తిగీతాలు దివ్య దేవుడు దీవించును గాక, భూమి చేసిన వాడు పోషించునుగాక, క్రీస్తు ప్రభువు రక్షించునుగాక అంటూ తమ మధురమైన స్వరంతో దైవ భక్తిగీతాలను స్త్రీల సభల కన్వీనర్ డాక్టర్ జె.ప్రమీల సెల్వరాజ్, రీనా శామ్యేల్ బృందం ఆలపించారు. బైబిల్ మిషన్ మహాసభల అధ్యక్షుడు రెవరెండ్ డాక్టర్ ఎన్. సత్యానందం అధ్యక్షత వహించి వాక్యోపదేశం చేశారు. సెక్రటరీ రెవరెండ్ పీఎం శాంతిరాజు పాపాలు ఒప్పుదల, బాప్తిస్మములు, అన్నప్రాస, నామకరణలు చేయగా జాయింట్ సెక్రటరీ రెవరెండ్ డాక్టర్ ఎన్.యేసురత్నం విశ్వాస ప్రమాణం, ముగింపు ప్రార్థన చే శారు. ప్రత్యేక ఏర్పాట్లు మూడు రోజుల పాటు మహోత్సవాలకు హాజరైన భక్తులు పండుగను జరుపుకుని, తిరిగి వారి గృహాలకు దేవుని దీవెనలతో అందుకుని ఆనందంతో వెనుదిరిగారు. ఆర్టీసి, రైల్వే శాఖ అధికారులు భక్తులకు ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేశారు. గుంటూరు, మంగళగిరి డిపోలకు చెందిన ఆర్టీసీ సర్వీసులను బైబిల్ మిషన్ మహోత్సవాల ప్రాంగణానికి మళ్లించారు. రైల్వే అధికారులు సమీపంలోని నాగార్జున నగర్ వద్ద తాత్కాలిక రైల్వే హాల్ట్ ఏర్పాటు చేసి రైళ్లను నడిపించారు. -
మనసున మనసై... బ్రతుకున బ్రతుకై...
తన మహోన్నత నటనతో సుదీర్ఘ తెలుగు సినీచరిత్రను ప్రభావితం చేశారు అక్కినేని. ప్రియుడిగా, భర్తగా, అన్నగా, తమ్ముడిగా, తండ్రిగా, తాతయ్యగా, కాళిదాసుగా, జయదేవుడిగా, రామకృష్ణుడిగా, అభిమన్యుడుగా, విప్రనారాయణుడిగా, తుకారాంగా, కబీరుగా ఒకటేమిటి... వందలాది పాత్రలతో తెలుగువారి గుండెల్లో గుడి కట్టుకున్న కథానాయకుడు అక్కినేని. తన అభినయ కౌశల్యంతో ప్రాణం పోసిన ఆణిముత్యాల్లాంటి పాటలెన్నో! ఆయన పాటలన్నీ మన బ్రతుకున బ్రతుకుగా, మనసున మనసుగా పెనవేసుకుపోయినవే! స్థాలీపులాక న్యాయంగా వ్యాసం, సంజాయిషీగా జాబితా... అమర ప్రేమికులైన ‘లైలా మజ్నూ’ల గాథ పలుమార్లు వెండితెరను అలంకరించినా, తెలుగులో మాత్రం ఒకే ఒక్క పర్యాయం తెరకెక్కింది. అదే ‘భరణీ’వారి ‘లైలా మజ్నూ’ (1949). సూఫీ సిద్ధాంతం ప్రకారం, లైలా మజ్నూ పరమాత్మ జీవాత్మలకి ప్రతీకలు! లైలా తనకి దూరమవుతున్నప్పుడు, ‘‘పయనమయే ప్రియతమా! నను మరిచిపోకుమా’’ అని పరితప్త హృదయంతో వీడ్కొలుపుతాడు. ఇది అతని ప్రణయోన్మాదపు ప్రాథమిక దశ! మజ్నూ ముఖంలో దైన్యం, నైరాశ్యం నిండి ఉంటాయి. అతని నేత్రాలలో నాయికారాధనతో ఏదో అలౌకికానందం ప్రతిఫలిస్తూంటుంది. నాగేశ్వరరావు ముఖంలోను, కళ్లల్లోను ఆయా భావాలను అద్భుతంగా ప్రదర్శిస్తాడు. పార్వతి, ‘దేవదాసు’(1953) కూడా అమర ప్రేమికులే! ప్రేయసి ‘పారూ’ ఎడబాటుతో తాగుబోతుగా మారిన దేవదాసు శారీరక, మానసికావస్థలను నాగేశ్వరరావు గొప్పగా ప్రేక్షకుల ముందుంచారు. లైటు స్తంభం క్రీనీడన, దారినపోయే కుక్కపిల్లను నిమురుతూ, చెత్తకుండీ పక్కన కూర్చుని, దగ్గేటప్పుడు గుండెను పట్టుకునే తీరు... ‘నాగేశ్వరరావు నట జీవితానికి ‘దేవదాసు’ పాత్ర కలికితురాయి’ అని ‘జగమే మాయ’ అనే ఒక్క పాటతోనే నిరూపించవచ్చును. 1953లోనే నాగేశ్వరరావు, సావిత్రి జంటగా ‘బ్రతుకు తెరువు’ వచ్చింది. ఒక వివాహితుడు తన ఉద్యోగార్థం, ఒక శ్రీమంతురాలిని అవివాహితునిగా మోసం చేయవలసి రావడం ఈ చిత్ర కథావస్తువు. అంతరాత్మ అంగీకరించకపోయినా, అవసరార్థం అబద్ధాల బతుకు సాగించే కథానాయకునిగా నాగేశ్వరరావు చాలా సున్నితంగా, మోతాదును మించని స్థాయిలో నటించి, విమర్శకుల ప్రశంసలను అందుకోగలిగారు. ‘అందమే ఆనందం’ పాట సందర్భాన నాగేశ్వరరావు ప్రదర్శించిన నటన అతి మనోహరం! అందం, ఆకర్షణీయమైన మగటిమి కలిగినా, నాయిక మీద వేరే దృష్టి లేని నాయకుని సంస్కారం, అతని శారీరక భాష రూపేణా ఈ పాటలో ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. ‘విప్రనారాయణ’(1954)లో శ్రీరంగనాథ స్వామి దివ్య మంగళ విగ్రహాన్ని వీక్షిస్తూ, ‘పాలించరా రంగా’ అంటూ పాడే సమయాన ప్రఫుల్లిత నేత్రాలలో తొణికిసలాడే భక్తి పారవశ్యాన్ని చూసినవారెవరైనా, ఆయన నాస్తికుడంటే నమ్మలేరు! భక్తి మనోగతమైనా, శారీరక భాష ద్వారా అది ప్రకటితమయ్యే తీరును నాగేశ్వరరావు బాగా ఆకళింపు చేసుకోగలిగారు కాబట్టే, ఆయన మహానటుడు కాగలిగారు. 1955నాటి ‘అర్ధాంగి’లో మేదకుడైన తన భర్తను ప్రయోజకునిగా తీర్చిదిద్దడం ఈ చిత్రంలో కథావస్తువు. గది బయటి ఆకర్షణలు నాయకుని వివశుని చేస్తూండగా, ‘‘వద్దురా కన్నయ్యా!’ పాటని ఆలపిస్తుంది. ముఖంలో అవివేకంతో కూడిన అమాయకత్వాన్ని ప్రదర్శిస్తూనే, కళ్లల్లో ద్వైదీ భావ సంఘర్షణను ప్రకటించిన తీరు అత్యద్భుతం! 1955లోనే వచ్చిన ‘దొంగరాముడు’లో దాదాపు సినిమా అయిపోయే సమయాన ‘చిగురాకులలో చిలకమ్మా’ యుగళ గీతం వస్తుంది. నౌకరుగా, డ్రైవరుగా ఉద్యోగాలు చేసిన రాముడు, ఈ పాట దగ్గర డాబుసరిగా సూటను ధరిస్తాడు. కూరలను అమ్ముకునే సీత అతని ప్రేయసి. సూటు అలవాటు లేనివాడు ధరించినప్పుడు, అతగాడి మేనరిజమ్స్ ఏవిధంగా ఉంటాయో, ఈ పాటలో ప్రదర్శిస్తారు. ఎంతో కష్టపడి అలవరుచుకున్న బాడీ లాంగ్వేజ్, నిలుచునే భంగిమ ఆ పాత్ర ప్రవర్తన రీతిని పట్టిచ్చే విధంగా ఉండటం విశేషం! 1956లో వచ్చిన ‘భలేరాముడు’లో కూడా నాగేశ్వరరావు దొంగ పాత్రనే ధరించారు. దొంగతనం చేసి తెచ్చిన ఆభరణాన్ని తన ప్రేయసికి అలంకరింపనెంచిన నాయకుడు, నిదురిస్తూన్న ఆమె సౌందర్యాన్ని చూసి, మంత్రముగ్ధుడై, ఈ గీతమాలపిస్తాడు. ప్రకృతిని అనుశాసించే ప్రేమ తమకాన్ని ‘ఓహో మేఘమాలా!’ పాటలో సాధించగలిగారు.1956లో విడుదలైన ‘తెనాలి రామకృష్ణ’లో వికటకవిగానే కాక, దేశభక్తి ప్రపూర్ణుడిగా రామకృష్ణుని దర్శకుడు బి.ఎస్.రంగా కొత్త కోణంలో చూపించారు. ‘‘చేసేది ఏమిటో చేసేయి సూటిగా’ అని పాడుతూ, పాదుషాని ఆకట్టుకొని, రాజ్యాన్ని రక్షించుకోగలుగుతాడు. నాగేశ్వరరావు నడిచే పద్ధతి, మాట తీరు ముసల్మానుల జీవన విధానాన్ని ప్రతిఫలించేలా ఉంటాయి. పాట పాడే సమయాన, పాదుషా వస్తున్నాడేమోనని దొంగ చూపులు చూస్తూ, మొక్కను అతను నాటే విధానం, అక్కినేని అసమాన ప్రతిభకు ప్రతీకగా నిలుస్తుంది. ‘తోడికోడళ్ళు’(1957) శరత్ రచించిన ‘నిష్కృతి’ నవల ఆధారంగా రూపొందింది. నాయకుడు చదువులో వెనుకబడి ఉన్నా, ప్రగతి భావాలలో ముందుంటాడు. ‘‘కారులో షికారుకెళ్లే’ పాటలో గాంభీర్యం మూర్తీభవించిన కవిగా కనిపిస్తారు ఏఎన్నార్.1957లోనే వచ్చిన ‘మాయాబజార్’లో అభిమన్యుడి పాత్రలో ప్రణయవశాన, వియోగ బాధలో వివశుడై, ‘నీ కోసమె నే జీవించునది’ అని విరహ గీతాన్ని ఆలపిస్తాడు. తన హావభావాల ద్వారా ఒక అసహాయ శూరుని నిస్సహాయ స్థితిని, దైన్యాన్ని చక్కగా ప్రతిఫలింపజేశాడు. 1958లో వచ్చిన ‘భూ కైలాస్’లో త్రికాలజ్ఞుడైన నారదుడు, విష్ణువును శపించిన పార్వతి పరితపిస్తూంటే, ఇతను ఆమెను అనునయిస్తూ, ‘రాముని అవతారం’ పాడతాడు. ఆలపించే సమయాన, భవిష్యద్దర్శనాన్ని చేస్తూన్న ఆ మౌని కళ్లల్లోని వింత కాంతులను, నాగేశ్వరరావు అద్భుతంగా ప్రతిఫలింపజేశారు. ఇదే ఏడాదిలో విడుదలైన ‘చెంచులక్ష్మి’లో ‘చెట్టు లెక్కగలవా ఓ నరహరి’ యుగళ గీతంలోనూ, ‘భార్యభర్తలు’ చిత్రంలో ‘ఏమని పాడెదనో’ అని పాడుతున్నప్పుడూ నాగేశ్వరరావు అభినయం అనితర సాధ్యం! ‘జయభేరి’, ‘బాటసారి’, ‘పెళ్లినాటి ప్రమాణాలు’, ‘మహాకవి కాళిదాసు’, ‘భక్త తుకారాం’ వంటి ఎన్నెన్నో గొప్ప చిత్రాలలోని పాటల్లో ఆయన మహోన్నతమైన నటనను ప్రదర్శించి, ప్రేక్షకులను ఆనంద పారవశ్యంలో ముంచెత్తారు. ఈ సంగతులన్నింటినీ సాఫల్యంగా వివరించినట్లయితే, అదో బృహద్గ్రంథం అవుతుంది. ఓపిక, తీరిక ఉన్నప్పుడు అటువంటి గ్రంథ రచనకి ఉపక్రమించడం శుభకరం! ఏయన్నార్ టాప్ సాంగ్స్ ఈ జాబితా కూడా మన ఉల్లాసం కోసమే గానీ... మిగతా పాటలు తక్కువని కాదు. మహాకవి శ్రీశ్రీ అన్నట్లు చెంచాతో సముద్రాన్ని తోడ శక్యమా? ఖుషీ ఖుషీగా నవ్వుతూ - ఇద్దరు మిత్రులు ఈ నల్లని రాలలో - అమరశిల్పి జక్కన నిన్నలేని అందమేదో - పూజాఫలం చామంతి ఏమిటే ఈ వింత - ఆత్మీయులు వాడిన పూలే వికసించెనె - మాంగల్యబలం ఓ బాటసారి నను మరువకోయి - బాటసారి నీ సుఖమే నే కోరుకున్నా - మురళీకృష్ణ కాదు సుమా కల కాదు సుమా - కీలుగుర్రం ప్రేమ యాత్రలకు బృందావనము - గుండమ్మ కథ నా కంటి పాపలో నిలిచిపోరా - వాగ్దానం కలకానిది విలువైనది - వెలుగు నీడలు మనసు పరిమళించెనే - శ్రీకృష్ణార్జున యుద్ధం కలిసె నెలరాజు కలువ చెలిని - అనార్కలి హాయిహాయిగా ఆమని సాగే - సువర్ణసుందరి ఘనా ఘన సుందరా - భక్త తుకారాం ఆకాశ దేశాన ఆషాఢ మాసాన - మేఘ సందేశం శిలలపై శిల్పాలు చెక్కినారు - మంచి మనసులు ముద్దబంతి పూవులో - మూగమనసులు చిటపట చినుకులు పడుతూ ఉంటే - ఆత్మబలం సిగలోకి విరులిచ్చి - సుమంగళి ఎవరి కోసం ఎవరి కోసం - ప్రేమనగర్ కనుగొంటిని హరిని - చక్రధారి ఉదయ కిరణ రేఖలో - శ్రీవారి ముచ్చట్లు ఆగదు ఏ నిమిషము నీ కోసము - ప్రేమాభిషేకం మల్లెపూల మారాణికి - అమరజీవి - డా॥కంపల్లె రవిచంద్రన్ -
'సుచిత్ర' అసలు సిసలు అందానికి చిరునామా
ప్రముఖ నటి సుచిత్ర సేన్ మృతి చలన చిత్ర ప్రపంచానికి తీరని లోటని ప్రముఖ ఎన్నారై పారిశ్రామికవేత్త లార్డ్ స్వరాజ్ పాల్ అన్నారు. అందాని అసలు సిసలు చిరునామా సుచిత్ర అని ఆయన అభివర్ణించారు. అత్యంత ప్రతిభ పాటవాలు ఆమె సొంతమని పేర్కొన్నారు. బెంగాలి నటి అయిన సుచిత్ర సేన్ అంతర్జాతీయ ఖ్యాతి గాంచిన నటిమణిగా పేరు ప్రఖ్యాతలు పొందారన్నారు. ప్రపంచ ప్రేక్షకుల మదిలో సుచిత్ర చిరస్థాయిగా నిలిచిపోతారన్నారు. ఆమె నటించిన దేవదాసు.. చిత్రాలు అద్భుత కళాఖండాలని కొనియాడారు. ప్రముఖ నటీ సుచిత్ర సేన్ శుక్రవారం కొల్‌కత్తాలో మరణించారు. ఆమె వయస్సు 82 సంవత్సరాలు. గత కొద్ది రోజులుగా ఆమె తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఈ నేపథ్యంలో గత మూడు వారాల క్రితం ఆమెను కుటుంబసభ్యులు ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ సుచిత్ర శుక్రవారం కన్నుమూసిన సంగతి తెలిసిందే. బెంగాలీలో అగ్నిపరీక్ష, సప్తపది, దీప జ్వాల జై, సాత్ పాకీ బందా తదితర 50 చిత్రాలకు పైగా హీరోయిన్ గా నటించించారు. అలాగే హిందీలో దేవదాసు, అందీ చిత్రాలలో నటించి ప్రేక్షకుల హృదయాలలో నిలిచిపోయారు. -
బాలీవుడ్ మొఘల్కు శుభాకాంక్షలు తెలిపిన ఆశాపరేఖ్
బాలీవుడ్ ప్రముఖ నటుడు దిలీప్ కుమార్ 91వ జన్మదినోత్సవ వేడుకులు బుధవారం ముంబయిలోని ఆయన నివాసంలో అత్యంత సాదాసీదాగా జరిగాయి. ఆ వేడుకలకు బాలీవుడ్ అలనాటి ప్రముఖ నటీ ఆశాపరేఖ్తోపాటు ధర్మేంద్ర, రాణీముఖర్జీలు తదితరులు హాజరైయ్యారు. ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అలాగే బాలీవుడ్ సినిమా రచయితలు సలీం ఖాన్, హెలెన్లు కూడా ఆ వేడుకల్లో పాల్గొన్నారు. తాను దిలీప్ కుమార్లో నటించాలని ఉందని ఆశాపరేఖ్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తన కొరికను వెల్లడించిన సంగతి తెలిసిందే. దేవదాసు, మధుమతి, మొఘల్-ఎ-అజాం చిత్రాల్లో దిలీప్ తన అద్భుతమైన నటను ప్రదర్శించిన సంగతి తెలిసిందే. దిలీప్ కుమార్ ఇటీవల తీవ్ర ఆనారోగ్యానికి గురైయ్యారు. దాంతో ఆయన ముంబయిలోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందిన సంగతి తెలిసిందే. -
అశ్రునయనాల నడుమ..
చెట్టున్నపాడు (భీమడోలు), న్యూస్‌లైన్ : భీమడోలు మండలం చెట్టున్నపాడులో చెరువు లీజు విషయమై రెండు వర్గాల మధ్య రాజుకున్న రావణకాష్టంలో బలైన ముగ్గురి మృతదేహాలకు బుధవారం అశ్రునయనాల నడుమ అంత్యక్రియలు పూర్తయ్యాయి. మృతుల కుటుంబ సభ్యులు, బంధువుల రోదనలతో చెట్టున్నపాడులో విషాదం నెలకొంది. ఈ అంత్యక్రియల్లో గ్రామస్తులు, అధికారులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఏలూరు జిల్లా ఆసుపత్రిలో పోస్టుమార్టం అనంతరం దేవదాసు లలిత్, నేతల రంగరాజు, బొంతు జయరాజు మృతదేహాలు మంగళవారం రాత్రి చెట్టున్నపాడుకు తీసుకువచ్చారు. గ్రామంలోని ఎస్సీ కమ్యూనిటీ హాల్ వద్ద మృతదేహాలను కుటుంబ సభ్యులు, బంధువుల కడసారి చూపునకు ఉంచారు. తమ వారి మృతదేహాలను చూసిన కుటుంబ సభ్యులు, బంధువులు గుండెలవిసేలా రోదించారు. వారి కన్నీరుమున్నీరు చూసి గ్రామస్తులు సైతం కంటతడి పెట్టారు. ఘనంగా అంత్యక్రియలు గ్రామానికి సమీపంలో ముగ్గురి మృతదేహాలను క్రైస్తవ సంప్రదాయంలో అంత్యక్రియలు చేశారు. వారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. అంత్యక్రియల్లో గ్రామస్తులతో పాటు చుట్టు పక్కల ప్రాంతాల నుంచి కూడా భారీగా తరలివచ్చారు. సాంఘిక సంక్షేమ శాఖ జేడీ మల్లికార్జునరావు, జిల్లా ఎన్ జీవోల అసోసియేషన్ అధ్యక్షుడు ఎల్. విద్యాసాగర్, తహసిల్దార్ బి.సోమశేఖర్, దళిత సంఘాల నేతలు నివాళులర్పించారు. నన్నెవరు చూస్తారు నాన్నా.. నువ్వు వెళ్లిపోయావు.. నన్నెవరు చూస్తారు నాన్నా.. అంటూ మృతుడు బొంతు జయరాజు కుమార్తె సౌజన్య కన్నీరుమున్నీరయ్యింది. ఆమె వికలాంగురాలు కావడంతో జయరాజు అల్లారు ముద్దుగా చూసుకునేవాడు. నాన్న ఇక లేడని తెలిసిన సౌజన్య జయరాజు మృతదేహం వద్ద మూగగా రోదించడం చూసి గ్రామస్తులు కంటనీరు పెట్టారు. శవ పేటిక వద్ద భార్య జయమణి, కుమారుడు క్రీస్తురాజు, కుమార్తె ఉషారాణి, మృతుని చెల్లెలు కుమారి రోధించారు. పెద్ద దిక్కును కోల్పోయాం చిన్న రైతుగా జీవిస్తున్న నేతల రంగరాజుకు పిల్లలంటే ఎంతో ప్రేమ. ఆయనకు ఒక కుమార్తె, కుమారుడు ఉన్నారు. తనకున్న 17 సెంట్ల భూమిని సాగు చేసుకుంటూ వ్యవసాయ కూలీగా కూడా పనిచేస్తున్నారు. కుమార్తె రత్నంకు వివాహం చేశాడు. ఇంటి పెద్దదిక్కును కోల్పోయామని రంగరాజు భార్య ధనలక్ష్మి, కుమారుడు రవి వాపోయారు. నాన్నా.. మాకు దిక్కెవ రు.. నాన్నా.. మాకు దిక్కెవరూ అంటూ దేవదాసు లలిత్ కుమారుడు శ్రీనివాసరావు గుండెలావిసేలా రోధించడం చూపరులను కలచి వేసింది. లలిత్ భార్య, కుమారులను ఓదార్చడం బంధువుల వల్ల కూడా కాలేదు. గ్రామంలో అందరికీ తలలో నాలుకగా ఉండే దేవదాసు లలిత్ మృతితో చెట్టున్నపాడు మూగబోయింది. చిన్నకారు రైతైన ఆయన గ్రామంలో అందరితో కలివిడిగా ఉండేవాడు. చెరువు లీజు పాత కమిటీ పెద్దగా ఉండి అనేక సమస్యలను పరిష్కరించడంతో దేవదాసును గ్రామస్తులు ఎంతో అభిమానించేవారు. అతడికి భార్య మరియమ్మ, ముగ్గురు కుమారులు రాజ్‌కుమార్, శ్రీనివాసరావు, బంగారు స్వాములున్నారు. తహసిల్దార్‌ను అడ్డుకున్న మృతుల బంధువులు భీమడోలు, న్యూస్‌లైన్ : చెట్టున్నపాడులో మృతదేహాలకు నివాళులర్పించేందుకు వచ్చిన తహసిల్దార్ బి.సోమశేఖర్‌ను బుధవారం మృతుల బంధువులు అడ్డుకున్నారు. గ్రామంలోని ఎస్సీ కమ్యూనిటీ హాల్ వద్ద ఉంచిన మృతదేహాలకు నివాళులర్పించేందుకు తహసిల్దార్ వెళ్లారు. బాధితుల కుటుంబ సభ్యులు ఆయనపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తమకు ప్రాణ రక్షణ కల్పించాలని కోరినా పట్టించుకోలేదని, చస్తే చూడడానికి వచ్చారా అంటూ విరుచుకుపడ్డారు. గ్రామ పెద్దలు, జోక్యం చేసుకుని వారికి సర్దిచెప్పారు. బాధిత కుటుంబాలకు అన్ని విధాలుగా న్యాయం చేస్తామని తహసిల్దార్ వారిని ఓదార్చారు. -
గీత స్మరణం
పల్లవి : పల్లెకు పోదాం పారును చూద్దాం చలో చలో (2) అల్లరి చేద్దాం చలో చలో ॥పోదాం॥ ప్రొద్దువాలే ముందుగానే ముంగిటవాలేమూ (2) ॥పోదాం॥ చరణం : 1 ఆటా పాటలందూ కవ్వించు కొంటె కోణంగీ (2) మనసేమో మక్కువేమో... (2) నగవేమో వగేమో... కనులార చూదమూ... ॥పోదాం॥ చరణం : 2 నన్నూ చూడగానే చిననాటి చనువు చూపేనో నా దరికీ దూకునో... (2) తానలిగీపోవునో...ఏమౌనో చూదమూ ॥పోదాం॥ చిత్రం : దేవదాసు (1953) రచన : సముద్రాల రాఘవాచార్య సంగీతం : సి.ఆర్.సుబ్బరామన్ గానం : ఘంటసాల నిర్వహణ: నాగేష్ -
నేడు అక్కినేని 90 పుట్టినరోజు
అక్కినేని పుట్టింది భారతీయ సినిమా పుట్టిన పదేళ్లకు. ఆయన సినీ నటునిగా పుట్టింది తెలుగు సినిమా పుట్టిన పదేళ్లకు. ఈ తీరుని బట్టి చూస్తే.. సినిమా కోసమే ఈయన్ని దేవుడు పుట్టించాడా? అనిపిస్తుంది.నేడు ఆ మహానటుడు 90వ పడిలోకి అడుగుపెడుతున్నారు -
అక్కినేని అభినయ కిరీటంలో నవరత్నాలు
అక్కినేని పుట్టింది భారతీయ సినిమా పుట్టిన పదేళ్లకు. ఆయన సినీ నటునిగా పుట్టింది తెలుగు సినిమా పుట్టిన పదేళ్లకు. ఈ తీరుని బట్టి చూస్తే.. సినిమా కోసమే ఈయన్ని దేవుడు పుట్టించాడా? అనిపిస్తుంది. కుటీర పరిశ్రమగా మొదలైన ‘సినిమా’ మహా పరిశ్రమగా ఎదగడానికి కారకులైన మహానుభావులు ఎందరో. వారిలో అక్కినేని తప్పకుండా ముందు వరుసలో ఉంటారు. సినిమాను తెలుగు ప్రేక్షకులు అమితంగా ఇష్టపడుతున్నారంటే, తెలుగు సినిమా ఈ రోజు దక్షిణాదిలోనే అత్యధిక చిత్రాలు నిర్మించే స్థాయికి ఎదిగిందంటే అందులో అక్కినేని పాత్ర ఎంతో ఉంది. అందుకే ఆయన్ను తెలుగు సినిమా తల్లి రెండు కళ్లలో ఓ కన్నుగా అభివర్ణిస్తుంటారు సినీ పండితులు. నేడు ఆ మహానటుడు 90వ పడిలోకి అడుగుపెడుతున్నారు. ఈ సందర్భంగా నటసమ్రాట్ అభినయ కిరీటంలోని నవ రత్నాలను ఒకసారి స్మరించుకుందాం. లైలామజ్ను (1949) ఈ సినిమా వచ్చే నాటికి అక్కినేని సినీ నటనానుభవం ఎనిమిదేళ్లు. కానీ వంద సినిమాల నటుడికి కూడా సాధ్యపడనంత అమోఘమైన నటన కనబరిచారు. ‘ప్రేమికుడి పాత్రను ఇంత అద్భుతంగా చేయొచ్చా?’ అని సాటి నటులు సైతం విస్తుపోయేలా నటించారు అక్కినేని. లైలాతో పెళ్లి.. నిశ్చితార్థం దాకా వచ్చి ఆగిపోయిన సన్నివేశంలో లోకులందరూ ‘మజ్ను... మజ్ను’ అంటూ రాళ్లతో కొడుతుంటే... దెబ్బలను కూడా ఖాతరు చేయకుండా ఖైస్(అక్కినేని) నవ్విన నవ్వు చరిత్రలో నిలిపోయింది. ఒక్క నవ్వుతో జనహృదయాలపై గాఢమైన ముద్రను వేశారు అక్కినేని. దేవదాసు (1953) ధనమదానికి, పెద్దరికానికీ తన ప్రేమనే బలిపెట్టిన పిరికివాడు దేవదాసు. అందుకే తనపై తనకు అసహ్యం. కావాలనే తన శరీరాన్ని హింసించుకున్నాడు. చేవ లేక, చేసేది లేక చావుకు దగ్గరయ్యాడు. ఈ పాత్రలో అక్కినేని నటన నభూతో నభవిష్యత్. మరొకరు టచ్ చేయడానికి కూడా ధైర్యం చేయని పాత్ర ఇది. దేవదాసుగా అక్కినేని నటనకు దిలీప్‌కుమార్ సైతం జోహార్లు అర్పించారు. ‘‘దేవదాసు’ అంటే అక్కినేని మాత్రమే’ అని పత్రికాముఖంగా అంగీకరించారు. ఆ పాత్ర జనాలను ఏ స్థాయిలో ప్రభావితం చేసిందంటే.. అప్పట్లో ప్రతి మద్యం దుకాణంపై అక్కినేనే కనిపించేవారట. విప్రనారాయణ (1954) ఈ సినిమాను అక్కినేని ఒప్పుకున్నప్పుడు.. ‘దేవదాసు పాత్ర చేసిన నీకు ఈ హరిదాసు పాత్ర ఎందుకయ్యా. నీవు నాస్తికుడవు. భక్తిని ఎలా పలికిస్తావ్?’ అన్నారట చక్రపాణి. ‘తాగుబోతు పాత్ర పోషించేవాడు తాగుబోతే కానవసరం లేదు. భక్తుడి పాత్ర పోషించేవాడు భక్తుడే కానవసరం లేదు. నేను పాత్ర చేసి చూపిస్తాను’ అని చక్రపాణిగారితో ఛాలెంజ్ చేసి మరీ అక్కినేని ఈ పాత్ర చేశారు. విమర్శకులను సైతం విస్తుపోయేలా చేశారు. అటు భక్తునిగా, ఇటు స్త్రీ మోహంలో చిక్కుకున్న మానసిక బలహీనుడిగా అక్కినేని నటన అదరహో. అనార్కలి (1955) ఈ కథతో బాలీవుడ్లో అప్పటికే సినిమా వచ్చింది. సలీంగా ప్రదీప్‌కుమార్ నటించారు. కానీ ఆ సలీం వేరే, ఈ సలీం వేరే. ఈ సలీంలో అమరప్రేమికుడు కనిపిస్తాడు. ప్రేమకోసం తండ్రి అక్బర్ బాదుషాని సైతం ఎదిరించే సన్నివేశంలో అయితే... వీరాధి వీరుడు అగుపిస్తాడు. అనార్కలిని జీవ సమాధి చేసే పతాక సన్నివేశంలో ‘అనార్.. అనార్..’ అంటూ అక్కినేని భావోద్వేగపూరితమైన నటన పతాకస్థాయిలో ఉంటుంది. ఇదీ మరొకరు టచ్ చేయలేని పాత్రే. తెనాలి రామకృష్ణ (1956) రామకృష్ణ కవి అలాగే బిహేవ్ చేసేవారేమో! తన పాండిత్యంతో అందరినీ అలాగే నవ్వించేవారేమో! కోపం వస్తే పండితులను సైతం అలాగే తిట్టేవారేమో! ‘తెనాలి రామకృష్ణ’లో అక్కినేనిని చూస్తే ఇలాంటి భావాలే కలుగుతాయి. కళ్లను పెద్దవిగా చేసి విచిత్రంగా వాటిని కదిలిస్తూ, ఒక రకమైన డైలాగ్ డిక్షన్‌తో, వైవిధ్యభరితమైన శారీరక భాషతో ఆ పాత్రకు ప్రాణ ప్రతిష్ట చేశారు. ‘తెనాలి రామకృష్ణ ఎలా ఉంటారు?’ అని కళ్లు మూసుకుంటే తెలుగువాళ్లకు కనిపించే రూపం అక్కినేని. మహాకవి కాళిదాసు (1960) నటునిగా అక్కినేనిని ఆకాశమంత ఎత్తులో నిలబెట్టిన సినిమా ఇది. ఇందులో ప్రథమార్ధం వెర్రిబాగులోడు. ద్వితీయార్థం మహాకవి. ఉత్తర దక్షిణ ధృవాల్లాంటి పాత్రలు. అక్కినేని లాంటి మహానటులు మాత్రమే అలాంటి పాత్రను పోషించగలరు. అమాయకుడు, అమేయ జ్ఞాన సంపన్నుడిగా మారే పరిణామ క్రమంలో అక్కినేని అభినయం అనితర సాథ్యం. బాటసారి (1961) మానసిక రుగ్మత కలిగిన మేధావి కథ ఇది. అభిప్రాయాలు, అభిమతాలు, ఇష్టాఇష్టాలు.. ఇలా ఏ భావాన్నీ ఆ పాత్ర వ్యక్తం చేయలేదు. ఈ పాత్ర పోషణ నిజంగా కత్తిమీద సామే. సినిమా మొత్తం మీద అక్కినేని డైలాగులు రెండు పేజీలకు మించవు. ఇందులో అక్కినేని ఆహార్యం భిన్నంగా ఉంటుంది. కళ్లద్దాలు, పంచ, ధోవతితో అడపాదడపా కళ్లు ఆర్పుతూ భిన్నంగా కనిపిస్తారాయన. అప్పటికే అక్కినేని సూపర్‌స్టార్‌డమ్‌ని ఎంజాయ్ చేస్తున్నారు. అలాంటి టైమ్‌లో ఈ పాత్ర చేయడానికి ఒప్పుకోవడం ఆయన తెగువకు దర్పణం. శ్రీకృష్ణార్జున యుద్ధం (1963) ఇందులోని అర్జున పాత్రను అక్కినేని చేశారు కాబట్టే ఆ సినిమాకు ఓ విలువ ఏర్పడింది. వేరే ఎవరు పోషించినా... ఎన్టీఆర్ స్టార్ స్టేటస్ ముందు తేలిపోయేవారు. ఆయన్ను తట్టుకొని ఢీ కొట్టేంత స్థాయి ఉన్న నటుడు ఒక్క ఏఎన్నార్ మాత్రమే. కాబట్టే... కేవీరెడ్డి ఆయన్ను అర్జునుడిగా ఎంచుకున్నారు. అనుకున్నట్టే ఎన్టీఆర్‌తో నువ్వా-నేనా అనే స్థాయిలో నటించారు అక్కినేని. అర్జునుడి పాత్రకు ఓ నిండుదనం తెచ్చారు. ప్రేమాభిషేకం (1981) దేవదాసు పాత్రకు పూర్తి విరుద్ధమైన పాత్ర రాజేష్ పాత్ర. దేవదాసు పిరికివాడు. రాజేష్ ధైర్యానికి మరో రూపం. దేవదాసుది త్యాగం కాదు. చేతకాని తనం. రాజేష్‌ది నిజమైన త్యాగం. ప్రియురాలి శ్రేయస్సు కోసం తనకు తాను చెడ్డవాడిగా చిత్రీకరించుకున్న త్యాగమూర్తి రాజేష్. ఆ తేడాను ఇందులో అక్కినేని అద్భుతంగా పలికించారు. దేవదాసు ధైర్యవంతుడైతే ఎలా ఉంటుందో ‘ప్రేమాభిషేకం’లోని రాజేష్ పాత్రలో చూపించారు అక్కినేని. పైగా ఈ సినిమా టైమ్‌లో అక్కినేని వయసు 58. కానీ టీనేజర్లు సైతం విస్తుపోయేంత చలాకీగా కనిపిస్తారాయన. ఈ తొమ్మిది సినిమాలు మచ్చుకు మాత్రమే. ఈ మహానటుడు నటించిన సినిమాల గురించి మాట్లాడాలంటే... ఒక గ్రంథమే అవుతుంది. అర్థాంగి, పునర్జన్మ, మూగమనసులు, మనసేమందిరం, ప్రేమనగర్, ధర్మదాత, సుడిగుండాలు, అనుబంధం, సీతారామయ్యగారి మనవరాలు... ఇలా చెప్పుకుంటే ఎన్నో ఎన్నెన్నో.. అయితే నేడు ఆయన పుట్టిన రోజు కాబట్టి చంద్రునికి ఓ నూలుపోగులా ఈ వ్యాసం. - బుర్రా నరసింహ