సరికొత్త ప్రేమ | sai datta art creations movie is audio recording | Sakshi
Sakshi News home page

సరికొత్త ప్రేమ

Published Mon, Mar 16 2020 5:54 AM | Last Updated on Mon, Mar 16 2020 5:54 AM

sai datta art creations movie is audio recording - Sakshi

దేవదాస్‌

దేవదాస్‌ హీరోగా చందు అజ్మీర దర్శకత్వంలో సాయిదత్తా ఆర్ట్‌ క్రియేషన్స్‌ బ్యానర్‌పై కె. శైలజ నిర్మిస్తున్న చిత్రం పాటల రికార్డింగ్‌ ప్రారంభమైంది. ఇందులో హాసిని కథానాయిక. శైలజ కె. మాట్లాడుతూ – ‘‘చందు చెప్పిన కథ బాగుంది. ప్రస్తుత పరిస్థితులకు అద్దం పట్టేలా ఉంది. దేవదాస్‌లో మంచి ప్రతిభ ఉంది. ఈ నెల చివరి వారంలో రెగ్యులర్‌ షూటింగ్‌ ఆరంభించి, రెండు షెడ్యూల్స్‌లో సినిమాని పూర్తి చేయాలనుకుంటున్నాం’’ అన్నారు. ‘‘మాస్ల్, క్లాస్‌ ఆడియన్స్‌కు నచ్చేలా ప్రేమను సరికొత్త రూపంలో చూపించబోతున్నాం. సినిమాలో నాలుగు పాటలు, ఐదు ఫైట్లు ఉన్నాయి’’ అన్నారు చందు అజ్మీర. ‘‘అవకాశం ఇచ్చిన దర్శక–నిర్మాతలకు థ్యాంక్స్‌. మంచి పాత్ర చేస్తున్నా’’ అన్నారు దేవదాస్‌. ఈ సినిమాకు సంగీతం: డేవిడ్‌ జి. పాటలు: చంద్రబోస్, సుద్ధాల అశోక్‌ తేజ.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement