Hasini
-
ఆధిపత్యం కోసమే అంతమొందించారు
నెల్లూరు (క్రైమ్): ఆధిపత్యం, పాత కక్షల నేపథ్యంతోనే హిజ్రా సంఘ నాయకురాలు మానికల హాసిని హత్య జరిగినట్లు శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ఎస్పీ జి.కృష్ణకాంత్ చెప్పారు. ఈ కేసులోని 15 మంది నిందితుల్లో 12 మందిని అరెస్ట్ చేశామని, మిగిలిన వారి కోసం గాలిస్తున్నామని తెలిపారు. నెల్లూరు ఉమేష్ చంద్ర కాన్ఫరెన్స్ హాల్లో హాసిని హత్యకు దారి తీసిన పరిస్థితులు, నిందితుల వివరాలను ఎస్పీ ఆదివారం వివరించారు.తోటపల్లిగూడూరు మండలం చిన్నచెరుకూరుకి చెందిన హాసిని దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాలతో పాటుగా కర్ణాటకలోని బళ్లారి, రాయచూర్, ధార్వాడ్, చిక్‌మగ్‌ళూరు, హుబ్లీ జిల్లాల్లోని ట్రాన్స్జెండర్లకు నాయకురాలు. నెల్లూరు జిల్లాకు చెందిన హిజ్రా సంఘ మాజీ నాయకురాలు అలేఖ్య అలియాస్ అనిల్‌కుమార్‌కు హాసిని మధ్య విభేదాలున్నాయి. ఇద్దరి మీద నెల్లూరు, తిరుపతి జిల్లాలో పలు కేసులున్నాయి. హాసినికి బోడిగాడితోటకు చెందిన షీలా, సులోచనతోనూ విబేధాలున్నాయి. ఇవి తారస్థాయికి చేరుకోవడంతో హాసినిని అంతమొందించాలని వీరందరూ నిర్ణయించుకుని సుందరయ్యకాలనీకి చెందిన రౌడీషిటర్ చింతల భూపతిని,నెల్లూరు రూరల్ మండలానికి చెందిన మరో రౌడీషిటర్‌ను సంప్రదించారు.వీరి ద్వారా కొందరిని సమీకరించుకుని సుపారీ ఇచ్చి అదను కోసం వేచి చూడసాగారు. గత నెల 26న రాత్రి హాసినిని టపాతోపు రైల్వే అండర్ బ్రిడ్జి వద్ద నిందితులు హత్య చేశారు. పోలీసులు ప్రత్యేక బృందాలుగా ఏర్పడి నిందితులను గుర్తించారు. కోవూరు అండర్ బ్రిడ్జి వద్ద కార్లలో వెళ్తున్న నిందితులైన రౌడీషిటర్ వంశీకృష్ణ అలియాస్ నాని, రాము, కార్తీక్, సుబ్రహ్మణ్యం, షేక్ మస్తాన్ వలీ అలియాస్ వలీ, వెంకటాద్రి, రాజే‹Ù, వంశీ, షీలా అలియాస్ శ్రీనివాసులు, అలేఖ్య అలియాస్ అనిల్ కుమార్, చింతల భూపతి, ఓ బాలుడిని అరెస్ట్ చేశారు. -
హిజ్రాల మధ్య గ్యాంగ్ వార్.. హాసిని హత్య వెనుక...
కొడవలూరు: మండలంలోని టపాతోపు అండర్ బ్రిడ్జి వద్ద మంగళవారం రాత్రి హత్యకు గురైన మానికల హాసిని (33) చిన్నప్రాయంలోనే తక్కువ సమయంలోనే నెల్లూరు, తిరుపతి, చిత్తూరు, కడప, కర్నూలు, నంద్యాల, చెన్నై, కర్ణాటక ప్రాంతాల్లోని సుమారు పది వేల మందికి హాసిని నాయకురాలుగా ఎదిగింది. ఆమె ఎదుగుదలను జీరి్ణంచుకోలేని హిజ్రాల్లోనే మరోవర్గం ఈ కిరాతకానికి పాల్పడినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తోటపల్లిగూడూరు మండలం చిన్నచెరుకూరు గిరిజన కాలనీకి చెందిన మానికల శ్రీనివాసులు, విజయమ్మ దంపతులకు ఇద్దరు ఆడ పిల్లలు, ఒక మగ పిల్లవాడు. మధ్య సంతానంగా మగ పిల్లవాడిగా జన్మించిన సుదీప్ మొదటి నుంచి తేడాగా ఉండేవాడు. తండ్రి టైలర్ కాగా, తల్లి విజయమ్మ వ్యవసాయ పనులకు వెళుతూ ముగ్గురు పిల్లలను చదివించారు. ఏడో తరగతి వరకు గ్రామంలోని పాఠశాలలోనే చదివిన సుదీప్ ఆ తర్వాత ఇంటి నుంచి పారిపోయారు. అప్పటికే హిజ్రా లక్షణాలు కలిగి ఉన్న సుదీప్ హిజ్రాలతో పరిచయం పెంచుకుని పూర్తిగా హిజ్రాగా మారి హాసినిగా పేరు మార్చుకున్నారు. ఆకర్షణీయంగా కనిపించే హాసిని హిజ్రాల్లో ప్రత్యేకతను చాటుకుంటూ నాయకత్వ బాధ్యతలు తీసుకుంది. ఆర్థికంగా స్థిరపడ్డాక కుటుంబాన్ని తిరుపతికి మార్చుకుంది. కోస్తా, రాయలసీమ ప్రాంతాల్లో హిజ్రాల సమస్యలపై తరచూ సమావేశాలు నిర్వహిస్తూ వాటి పరిష్కారానికి తనవంతు కృషి చేస్తూ బాగా గుర్తింపు తెచ్చుకుంది. ఆర్థికంగానూ బలపడడంతో నెల్లూరులోని మాగుంట లేఅవుట్లో ఒక ఇల్లు, రాజీవ్‌గాంధీనగర్‌లో రెండు ఇళ్లు, తిరుపతిలో ఒక ఇల్లు నిర్మించుకున్నట్లు తెలిసింది. తల్లిదండ్రులకు చిన్నచెరుకూరులో ఇల్లు నిర్మించడంతో పాటు ఆర్థికంగా అండగా ఉండేదని సమాచారం. హాసిని తల్లి స్వగ్రామం విడవలూరు మండలం పార్లపల్లిలో మహాలక్ష్మి అమ్మవారి ఆలయ నిర్మాణానికి ఆర్థిక సహకారం అందించింది. నిర్మాణం పూర్తికావడంతో సోమవారం నుంచి ఆలయ ప్రారంభోత్సవ కార్యక్రమాలు జరుగుతున్నాయి. దీంతో మంగళవారం జరిగిన అభిషేకాలు, పూజలకు హాసిని తన సహచర హిజ్రాలు 20 మందిని తీసుకెళ్లారు. అక్కడ రాత్రి 10 గంటల వరకు అభిషేకాలు, పూజల అనంతరం అక్కడి నుంచి నెల్లూరుకు బయలు దేరారు. హాసిని కారులో వస్తుండగా సహచరులు ఆటోల్లో వెనుక అనుసరించారు. టపాతోపు అండర్ పాస్ వద్ద రెండు కార్లలో కాపుకాచిన ఆరుగురు వ్యక్తులు అటకాయించి కారులో ఉన్న హాసిని మెడపై విచక్షణా రహితంగా నరికి పారిపోయారు. వెనుక ఆటోల్లో వచ్చిన సహచరులు గమనించి చూడగా హాసిని రక్తపు మడుగులో పడి ఉంది. హుటాహుటిన నెల్లూరులోని ప్రైవేట్ వైద్యశాలకు తరలించగా అప్పటికే హాసిని మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. ఎస్సై కోటిరెడ్డి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.పోలీసుల అదుపులో నిందితులు?సాక్షి, టాస్క్‌ఫోర్స్: సంచలనం రేకెత్తించిన హాసిని హత్య కేసును పోలీసులు ఛేదించినట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై కొడవలూరు ఇన్స్పెక్టర్ సురేంద్రబాబు తన సిబ్బందితో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసి దర్యాప్తు చేపట్టారు. నెల్లూరురూరల్ మండలానికి చెందిన ఓ యువకుడు ఓ హిజ్రా గ్యాంగ్‌లో ఉన్న హిజ్రా తో సహజీవనం చేస్తున్నారు. ఆ యువకుడిని హాసిని, ఆమె అనుచరులు పలుమార్లు అందరి ముందు తీవ్రంగా అవమానించినట్లు సమాచారం. దీంతో కక్ష పెంచుకున్న సదరు యువకుడు తన సహచరులతో కలిసి ఈ ఘాతుకానికి ఒడిగట్టినట్లు తెలుస్తోంది. సాంకేతికత ఆధారంగా పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకుని లోతుగా విచారిస్తున్నట్లు తెలిసింది. హాసిని ఆదిపత్యాన్ని కొందరు హిజ్రాలూ వ్యతిరేకిస్తున్నారు. వారు సోషల్ మీడియా వేదికగా హాసినిని దూషిస్తూ పోస్టులు పెట్టడం, బెదిరింపు చర్యలకు పాల్పడినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో వారి ప్రమేయం ఉందా? అనే కోణంలో పోలీసులు విచారిస్తున్నారు.కలకలం రేపిన హిజ్రా హాసిని హత్యహంతకులను తక్షణమే అరెస్ట్ చేయాలిమార్చురీ ఎదుట సహచరుల ధర్నాపోస్టుమార్టం అనంతరం అశ్రునయనాల మధ్య మృతదేహం తిరుపతికి తరలింపునెల్లూరు(క్రైమ్): జిల్లాలో మంగళవారం రాత్రి జరిగిన హిజ్రా హాసిని హత్యోదంతం కోస్తా, రాయలసీమ జిల్లాల్లో కలకలం రేకెత్తించింది. ఆమె సహచరులు కడప, చిత్తూరు, తిరుపతి, తమిళనాడు రాష్ట్రం నుంచి పెద్ద సంఖ్యలో బుధవారం తెల్లవారు జామునే నెల్లూరుకు చేరుకున్నారు. హత్యకు దారి తీసిన పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. హాసిని మృతదేహం జీజీహెచ్ మార్చురీలో ఉండడంతో కొందరు అక్కడికి వచ్చి అక్కడే బైఠాయించగా మరికొందరు నెల్లూరు రూరల్ డీఎస్పీ ఘట్టమనేని శ్రీనివాసరావును ఆయన ఇంటి వద్ద కలిశారు. తమ నాయకురాలు హత్య కేసులో నిష్పక్షపాతంగా విచారణ జరిపి నిందితులను కఠినంగా శిక్షించాలని కోరారు. చట్ట ప్రకారం విచారణ జరిపి నిందితులను శిక్షిస్తామని డీఎస్పీ వెల్లడించడంతో జీజీహెచ్‌లోని మార్చురీ వద్దకు చేరుకున్నారు. మృతదేహానికి ప్రభుత్వ వైద్యులు శవపరీక్ష నిర్వహించి బాధితులకు అప్పగించారు. అశ్రునయనాల మధ్య హాసిని మృతదేహాన్ని అంబులెన్స్‌లో తిరుపతికి తరలించారు. మార్చురీ వద్ద ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా దర్గామిట్ట ఇన్స్పెక్టర్ రోశయ్య ఆధ్వర్యంలో ఎస్ఐ రమేష్ బాబు తమ సిబ్బందితో కలిసి పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. -
అందంగా చూపిస్తారు.. అందుకే తెలుగు సినిమాలంటే ఇష్టం: హీరోయిన్ హాసినీ సుధీర్ (ఫొటోలు)
-
Miss Telangana 2018 Winner: హాసిని మళ్లీ ఆత్మహత్యాయత్నం..
కంచికచర్ల (నందిగామ): ఉరేసుకుని ఆత్మహత్యకు యత్నించిన మోడల్, మిస్ తెలంగాణ–2018 కలక భవానీ అలియాస్ హాసిని మరోసారి ఆత్మహత్యా యత్నం చేసింది. కృష్ణా జిల్లా కంచికచర్ల సమీపంలోని కీసర బ్రిడ్జి పైనుంచి మున్నేరు వాగులోకి దూకి శుక్రవారం ఆత్మహత్యకు యత్నించింది. కృష్ణా జిల్లా వీరులపాడు మండలం బోడవాడ గ్రామానికి చెందిన హాసిని హైదరాబాద్ హిమాయత్‌నగర్‌లోని ఓ అపార్ట్మెంట్లో నివసిస్తోంది. బుధవారం రాత్రి హైదరాబాద్‌లో ఇస్టాగ్రామ్‌లో లైవ్ ప్రారంభించి చున్నీతో ఉరేసుకుని చనిపోవాలని ప్రయత్నించగా, ఆమె స్నేహితుడు ఇచ్చిన సమాచారంతో పోలీసులు ఆమెను కాపాడారు. అయితే గురువారం ఆమె కుటుంబసభ్యులతో హైదరాబాద్ నుంచి బోడవాడకు వచ్చింది. శుక్రవారం మున్నేరు వాగులోకి దూకి మరోసారి ఆత్మహత్య చేసుకునేందుకు ప్రయత్నించింది. గమనించిన స్థానికులు ఆమెను రక్షించారు. నేషనల్ హైవే అంబులెన్స్‌లో నందిగామ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. (చదవండి: జియాగూడ: పెళ్లయిన నాటి నుంచి గొడవలే.. తట్టుకోలేక..) -
నాకిక ఓపిక లేదు..
హిమాయత్‌నగర్: నాకేదో చెప్పాలనిపిస్తోంది.. చెప్పలేకపోతున్నా. మమ్మీ, డాడీ క్షమించండి ఇలా చెప్పకుండా చేస్తున్నందుకు.. నాకు ఏమీ అవసరం లేదు. నాకిక ఓపిక లేదు.. యాసిడ్ అటాక్ ఫేస్ చేశా.. రేప్ ఇష్యూ ఫేస్ చేశా.. పబ్లిక్ నుంచి వచ్చే కామెంట్స్ ఫేస్ చేశా.. మా అమ్మకు అందరూ కాల్స్ చేస్తున్నారు. నాకు అవసరం లేదు. ఇన్ని డేస్ నాకు జరిగిన ఘనకార్యాలు, పురస్కారాలు చాలు. నేను నిజంగా చనిపోవాలి అనుకుంటున్నా’అంటూ ఇన్‌స్టా లైవ్‌లో ఆత్మహత్యకు ప్రయత్నించింది మిస్ తెలంగాణ–2018 విన్నర్ హాసిని. నిమిషాల వ్యవధిలో చేరుకున్న పోలీసులు కృష్ణా జిల్లాకు చెందిన కాలక నాగభవాని అలియాస్ హసిని ఆరేళ్ల కింద హైదరాబాద్ వచ్చింది. చిన్నతనం నుంచి మోడలింగ్ అంటే చాలా ఇష్టం. ఇటీవల హాసిని హిమాయత్‌నగర్‌లోని ఓ అపార్ట్మెంట్లో నివాసం ఉంటోంది. బుధవారం రాత్రి ఇన్‌స్టాగ్రామ్‌లో లైవ్ ప్రారంభించకముందే తన స్నేహితుడుకి తాను చనిపోతున్న విషయాన్ని ఫోన్లో తెలిపింది. ఫ్లాట్ తలుపులు తెరిచి ఉంచి బెడ్రూంలోని తన చున్నీతో ఫ్యాన్‌కు ముడి వేసింది. చిన్న స్టూల్ వేసుకుని ఏడుస్తూ తన ఇన్‌స్టా ఐడీలో లైవ్‌లో మాట్లాడుతూ ఆత్మహత్యకు యత్నించింది. ఈ లోపు జగిత్యాలలో నివాసం ఉండే హాసిని ఫ్రెండ్ షన్నూ డయల్ 100కు ఫోన్ చేసి వివరాలు చెప్పి అడ్రస్ తెలిపాడు. బుధవారం రాత్రి జాయింట్ సీపీ, నార్త్‌జోన్ డీసీపీ రమేశ్‌రెడ్డి సమాచారం అందుకున్నారు. వెంటనే నారాయణగూడ పోలీసులకు చెప్పడంతో వారు హుటాహుటిన అపార్ట్‌మెంట్‌కు చేరుకున్నారు. అప్పటికే స్పృహ కోల్పోయి ఉన్న హాసినిని హైదర్‌గూడ అపోలో ఆసుపత్రికి తరలిం చి చికిత్స అందించారు. ఆరోగ్య పరిస్థితి బాగానే ఉండటంతో ఉదయం ఆమె తల్లిదండ్రులు ఇంటికి తీసుకెళ్లారు. -
‘బ్యాట్ లవర్స్’..
మణి సాయితేజ, హాసినీ రాయ్ జంటగా ఎ.రాబిన్ నాయుడు దర్శకత్వం వహించిన చిత్రం ‘బ్యాట్ లవర్స్’. దీక్షిక సమర్పణలో కొండ్రాసి ఉపేందర్ నిర్మించిన ఈ సినిమా టీజర్‌ను నిర్మాత సి.కల్యాణ్ విడుదల చేశారు. ‘‘క్రికెట్ నేపథ్యంలో దర్శకుడు ఈ సినిమాను తెరకెక్కించారు’’ అన్నారు ఉపేందర్. ‘‘గ్రామీణ నేపథ్యంలో కథ ఉంటుంది’’ అన్నారు ఎ.రాబిన్ నాయుడు. మణి సాయితేజ, హాసినీ రాయ్, మ్యూజిక్ డైరెక్టర్ డేవిడ్, సినిమాటోగ్రాఫర్ సంతోశ్ తదితరులు పాల్గొన్నారు. -
ఐదు నిమిషాల్లో 346 సినిమా పేర్లు
సాక్షి, గాంధీగనర్(విజయవాడసెంట్రల్): విజయవాడ నగరానికి చెందిన మున్నంగి హాసిని వయస్సు పదేళ్లు. ఐకాన్ పబ్లిక్ స్కూల్లో ఐదో తరగతి చదువుతోంది. తన అద్భుతమైన జ్ఞాపకశక్తితో అందరినీ అబ్బురపరుస్తోంది. సూపర్ స్టార్ కృష్ణ నటించిన 346 చిత్రాల పేర్లను కేవలం 5 నిమిషాల వ్యవధిలో వరుస క్రమంలో చెబుతోంది చిన్నారి హాసిని. కృష్ణ తొలిచిత్రం ‘తేనె మనుసులు’ నుంచి చివరిచిత్రం వరకు నాన్ స్టాప్‌గా పేర్లు చెప్పి తన ప్రతిభను చాటుకుంది. సరిలేరు నీకెవ్వరు చిత్ర విజయోత్సవం సందర్భంగా ఓ టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో తన తండ్రి 350 చిత్రాల్లో నటించారని, ఆ చిత్రాల పేర్లు వరుసగా ఎవరైనా చెప్పగలరా? అనే మహేష్ మాటలతో స్ఫూర్తి పొందిన హాసిని వారం రోజుల వ్యవధిలో సినిమా పేర్లను కంఠస్తం చేసింది. అలంకార్ థియేటర్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సినిమా పేర్లు చెబుతున్న చిన్నారి హాసిని పలువురి ప్రశంసలు.. సూపర్‌స్టార్ కృష్ణ నటించిన చిత్రాలను 5 నిమిషాల వ్యవధిలో చెప్పిన చిన్నారి హాసినిని పలువురు అభినందించారు. సత్యనారాయణపురం పోలీస్‌స్టేషన్ సీఐ బాలమురళి, ఆల్ ఇండియా సూపర్‌స్టార్ కృష్ణ, మహేష్‌బాబు ఫ్యాన్స్ అసోసియేషన్ అధ్యక్షుడు సుధాస్వామి, తాడి శివ, ఏ1 రెడ్డి, టైలర్బాబు చిన్నారిని అభినందించారు. మహేష్‌బాబుకు పుట్టినరోజు కానుకగా ఇవ్వాలనే.. : హాసిని ప్రిన్స్ మహేబాబు వెయ్యిమంది చిన్నారులకు గుండె ఆపరేషన్ చేయించి కొత్త జీవితాన్ని ఇచ్చారు. వారి ముఖాల్లో చిరునవ్వులు పూయించారు. చిన్నారుల తరపున మహేష్‌బాబుకు పుట్టిన రోజు కానుకగా ఏదైనా కానుక ఇవ్వాలని భావించాను. సూపర్‌స్టార్ కృష్ణ నటించిన చిత్రాల మాలికను ఆయనకు అందిస్తున్నాను. -
సరికొత్త ప్రేమ
దేవదాస్ హీరోగా చందు అజ్మీర దర్శకత్వంలో సాయిదత్తా ఆర్ట్ క్రియేషన్స్ బ్యానర్‌పై కె. శైలజ నిర్మిస్తున్న చిత్రం పాటల రికార్డింగ్ ప్రారంభమైంది. ఇందులో హాసిని కథానాయిక. శైలజ కె. మాట్లాడుతూ – ‘‘చందు చెప్పిన కథ బాగుంది. ప్రస్తుత పరిస్థితులకు అద్దం పట్టేలా ఉంది. దేవదాస్‌లో మంచి ప్రతిభ ఉంది. ఈ నెల చివరి వారంలో రెగ్యులర్ షూటింగ్ ఆరంభించి, రెండు షెడ్యూల్స్‌లో సినిమాని పూర్తి చేయాలనుకుంటున్నాం’’ అన్నారు. ‘‘మాస్ల్, క్లాస్ ఆడియన్స్‌కు నచ్చేలా ప్రేమను సరికొత్త రూపంలో చూపించబోతున్నాం. సినిమాలో నాలుగు పాటలు, ఐదు ఫైట్లు ఉన్నాయి’’ అన్నారు చందు అజ్మీర. ‘‘అవకాశం ఇచ్చిన దర్శక–నిర్మాతలకు థ్యాంక్స్. మంచి పాత్ర చేస్తున్నా’’ అన్నారు దేవదాస్. ఈ సినిమాకు సంగీతం: డేవిడ్ జి. పాటలు: చంద్రబోస్, సుద్ధాల అశోక్ తేజ. -
హాసిని మృతితో స్ర్పింగ్ డేల్ స్కూల్ లో విషాదం
-
అయ్యో..! హాసిని.. ప్రయాణం వాయిదా వేసుంటే..
సుబ్రమణ్యం తండ్రి అస్థికలను గోదావరిలో కలిపేందుకు భార్య, కూతురితో ఈనెల 13వ తేదీ రాత్రి రాజమండ్రికి బయలుదేరారు. హాసిని చదువుతున్న పాఠశాల విద్యార్థులు 14వ తేదీ జూపార్కును సందర్శించారు. తోటి విద్యార్థులతో కలసి తాను కూడా వెళ్లాలనుకుంది. ఆ విషయం తన తండ్రితో చెప్పింది. అయితే ముందుగా రాజమండ్రికి వెళ్లాల్సిందేనని తండ్రి సుబ్రమణ్యం తేల్చి చెప్పారు. ఒకవేళ వారు ప్రయాణాన్ని వాయిదా వేసుకుని ఉంటే ఈ ఘోరం జరిగి ఉండేది కాదని ఆ పాఠశాల ఉపాధ్యాయులు చెబుతున్నారు. హాసిని లాంటి ఓ మంచి విద్యార్థినిని కోల్పోవడం బాధాకరమంటూ వారు కన్నీటిపర్యంతమయ్యారు. సాక్షి, తిరుపతి:భయపడినట్లే.. జరిగింది.. పాపికొండల ప్రయాణం ప్రాణాలు తీసింది. గోదావరి నది పడవ ప్రమాదం తిరుపతికి చెందిన సుబ్రమణ్యం కుటుంబాన్ని చిదిమేసింది. చిట్టిపొట్టి పలుకులతో, అల్లరి చేష్టలతో నిత్యం ఉత్సాహంగా ఉండే హాసిని.. నీటి ఉద్ధృతిలో కొట్టుకుపోయి కన్నుమూసింది. చిన్నారి మృతదేహాన్ని చూసి కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. పుణ్యం కోసం గోదారమ్మ ఒడ్డుకెళ్తే.. పుట్టెడు సోకం మిగిలిందంటూ.. కన్నీటి పర్యంతమయ్యారు. గోదావరి బోటు మునక ప్రమాదంలో గల్లంతైన తిరుపతికి చెందిన సుబ్రమణ్యం(45), మధులత(40) దంపతుల కుమార్తె హాసిని(12) మృతదేహాన్ని సోమవారం ఎన్డీఆర్ఎఫ్ బృందాలు వెలికితీశాయి. ఈ ఉదయం దేవీపట్నం సమీపంలోని కచ్చలూరు వద్ద నౌకాదళ, రాష్ట్ర అగ్నిమాపకశాఖ, స్థానిక మత్స్యకారులు వెతుకులాట ప్రారంభించారు. అయితే నదీ ప్రవాహవేగం, లోతు, నీటి ఉద్ధృతి ఎక్కువగా ఉండడంతో గాలింపు చర్యలకు ఆటంకం ఏర్పడింది. కాగా తిరుపతికి చెందిన సుబ్రమణ్యం తన తండ్రి అస్థికలను గోదావరిలో నిమజ్జనం చేసేందుకు భార్య మధులత, కుమార్తె హాసినితో కలసి వెళ్లారు. ఈ కార్యక్రమం అనంతరం పాపికొండల అందాలను వీక్షించేందుకు అందరూ బోటులో బయలుదేరారు. అయితే దేవీపట్నం వద్ద గోదావరిలో బోట్ బోల్తాపడింది. ఈ ప్రమాదం నుంచి మధులత బయటపడగా.. సుబ్రమణ్యం, హాసిని గల్లంతయ్యారు. ఈ క్రమంలో సోమవారం ఎన్డీఆర్ఎఫ్ బృందాలు ముమ్మరంగా గాలింపు చేపట్టగా.. హాసిని మృతదేహం బయటపడింది. సుబ్రమణ్యం వివరాలు ఇంకా వెల్లడికాలేదు. కాళ్లు పట్టుకున్నా కాపాడలేకపోయా! ‘‘పడవ బోల్తా పడిన వెంటనే నా భర్త సుబ్రమణ్యం నన్ను నీటిలో నుంచి పైకి నెట్టి కాపాడారు. అదే సమయంలో నా కాళ్లు పట్టుకుని ఉన్న నా కుమార్తె హాసినిని కూడా పైకి నెట్టి రక్షించేందుకు ఆయన తీవ్రంగా ప్రయత్నించారు. నన్ను కాపాడి నా కళ్లముందే ఆయన నీటిలో మునిగిపోయారు. నా బిడ్డ నా కాళ్లు పట్టుకున్నా.. నేను కాపాడుకోలేకపోయాను’’ – మధులత శ్రీకాళహస్తి : పుణ్యనది గోదావరిలో తండ్రి అస్థికలను నిమజ్జనం చేసి, ఆఖరి క్రతువును నిర్వహించి, తండ్రిని పున్నామ నరకం నుంచి తప్పించాలని వెళ్లిన తిరుపతికి చెందిన సుబ్ర మణ్యం కుటుంబానికి అంతులేని దుఃఖమే మిగిలింది. బోటు మునక ప్రమాదంలో ఆయన తన కుమార్తె హాసినితో పాటు గల్లవంతవగా, ఆయన భార్య మధులత ప్రమాదం నుంచి బైటపడటం విదితమే. హాసిని మృతదేహాన్ని సోమవారం వెలికితీశారు. సుబ్రమణ్యం కోసం ఇంకనూ గాలిస్తున్నారు. దుర్గం సుబ్రమణ్యం తిరుపతిలో కుటుంబంతో కలిసి వినాయకసాగర్ రాధేశ్యామ్ అపార్ట్మెంట్లో నివసిస్తున్నా రు. సుబ్రమణ్యం (45)కు శ్రీకాళహస్తి, చిత్తూరులో పెట్రోల్ బంకులున్నాయి. శ్రీకాళహస్తి పెట్రోల్ బంకు బాధ్యతలను ఆయన సతీమణి మధులత చూసేది. హాసిని (12) తిరుపతి స్ప్రింగ్‌డేల్ స్కూలులో 7వ తరగతి చదువుతోం ది. 3నెలల క్రితం కాలం చేసిన తన తండ్రి గంగిశెట్టి అస్థికలను గోదావరిలో నిమజ్జనం చేసేందుకు రెండు రోజుల క్రితం భార్య, కుమార్తెతో కలిసి సుబ్రమణ్యం రాజమహేంద్రవరం వెళ్లారు. బోటు మునక ప్రమాదంలో తండ్రీ, తనయ గల్లంతవగా, మధులత బైటపడింది. ఈ ఘటన శ్రీకాళహస్తి పెట్రోల్ బంకులో పనిచేస్తున్న సిబ్బందికి విషాదం మిగిల్చింది. వారి జ్ఞాపకాల తడితో వారి కళ్లు చెమ్మగిల్లాయి. పాప కళ్ల ముందే కదలాడుతోంది ప్రతి ఆదివారం, సెలవు దినాల్లో పాప హాసినితో మా యజమాని సుబ్రమణ్యం, మధులత వచ్చేవారు. హాసిని మాతో కాసేపు మొబైల్ వీడియో గేమ్ ఆడేది. మా యజమాని మమ్మల్ని ఎంతో ప్రేమగా చూసుకునే వారు. హాసిని మా కళ్లలోనే కదలాడుతోంది. ఆ పాప చనిపోయిందని టీవీలలో న్యూస్ వస్తూంటే దుఃఖం ఆగడం లేదు. చాలా బాధగా ఉంది.–సుమన్, పెట్రోల్ బంక్ మేనేజర్ ప్రమాద ఘటన కలిచి వేసింది గోదావరిలో బోటు మునిగి పోయిందని టీవీలో ఉదయమే చూసాను. అయితే కొంతసేపటికే దుర్వార్త వినాల్సి వస్తుందని కలలో కూడా అనుకోలేదు. మా యజమాని బంధువులు ఫోన్ చేసి మా యజమాని సుబ్రమణ్యం, పాప హాసినితో ప్రమాదంలో గల్లంతయ్యారని చెప్పగానే షాక్ గురయ్యాం. ఆయన ఫోన్ నంబర్లకు ప్రయత్నించాం. కానీ సమాధానం లేదు. కళ్లల్లో నీళ్లు తిరిగాయి.– మురళి, పెట్రోలు బంక్ క్యాషియర్ చాలా బాధ కలిగించింది రెండేళ్లుగా పనిచేస్తున్నా. మా యజమాని సుబ్రమణ్యం చాలా మంచివారు. బంకు దగ్గరికి వస్తే అందరికీ భోజనం తెప్పించేవారు. కూర్చుని అందరం కలిసి భోజనం చేసేవాళ్లం. ఆయన ప్రమాదంలో గల్లంతయ్యారని, హాసిని మృతదేహాన్ని వెలికి తీశారని టీవీలలో చూశాక దుఃఖం ఆగడం లేదు. – చెంగయ్య, పెట్రోలు బంకు ఉద్యోగి శోక సంద్రమైన స్కూలు తిరుపతి ఎడ్యుకేషన్ : ఎత్తైన కొండలు...వాటి మధ్య గలగల పారే గోదావరి. పాపికొండల్లో బోటు ప్రయాణం మధురానుభూతి. కొండకోనల అందాలను ఆస్వాదించేలోపే ఓ దుర్ఘటన. నది మధ్యలో బోటు కుదుపులకులోనై మునిగింది. అందులో ప్రయాణిస్తున్న వారిలో 37మంది గల్లంతయ్యారు. వారిలో తిరుపతిలోని స్ప్రింగ్‌డేల్ పబ్లిక్ స్కూల్లో 7వ తరగతి చదువుతున్న డి.హాసిని ఈ ప్రమాదంలో తండ్రితో పాటు గల్లంతయ్యింది. తిరిగి రాని లోకాలకు చేరుకుంది. ఆ నవ్వుల హాసిని ఇక లేదని తెలియడంతో ఆ చిన్నారి చదువుతున్న స్కూలు శోకసంద్రమైంది. ఎప్పుడూ సందడిగా ఉండే ఆ పాఠశాల ఈ విషాదంతో మూగబోయింది. ఆ పాఠశాల ప్రిన్సిపల్ కెఆర్.ఆనురాధ గోపాల్, క్లాస్ టీచర్ ఎస్.లత హాసిని జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ విచలితులయ్యారు. వారి మాటల్లోనే...‘‘ హాసిని తండ్రి సుబ్రమణ్యంకు రాచగున్నేరి వద్ద పెట్రోల్ బంకు నిర్వహిస్తున్నారు. హాసిని ఏకైక సంతానం కావడంతో తల్లిదండ్రులు సుబ్రమణ్యం, మధులత ప్రేమగా చూసుకునేవారు. చదువు, ఇతరత్రా విషయాల్లో ప్రత్యేక శ్రద్ధ వహించేవారు. రెండో తరగతిలో హాసిని స్ప్రింగ్‌డేల్ స్కూల్లో చేరింది. అప్పటి నుంచి ఇక్కడే చదువుకుంటోంది. చదువులోనూ బాగా రాణించేది. తనకు చిత్రలేఖనం, నృత్యం అంటే చాలా ఇష్టం. సాంస్కృతిక కార్యక్రమాల్లో ఎప్పుడూ ముందుంటుంది. తన మంచి తనంతో తోటి విద్యార్థులు, టీచర్లను కట్టిపడేసేది. దీంతో హాసినీ అంటే అందరికీ ఇష్టం’’. అని చెప్పారు. ఇక, హాసిని క్లోజ్ ఫ్రెండ్స్ కూడా ఎన్నో విషయాలు పంచుకున్నారు. హాసిని మరణం తమను తీవ్ర వేదనకు గురిచేసిందన్నారు. వేపనపల్లెలో విషాద ఛాయలు పూతలపట్టు (యాదమరి): గోదావరి నదిలో బోటు మునక ప్రమాదం సంఘటన పూతలపట్టు మండలం వేపనపల్లెలో విషాదం నింపింది. తిరుపతిలో నివసిస్తున్న సుబ్రమణ్యం కుటుం బాని కి గ్రామంతో సుదీర్ఘ అనుబంధం ఉం ది. వేపనపల్లె గ్రామానికి చెందిన గంగి శెట్టి, రాజమ్మలకు గ్రామంలో మూడెకరాల పొలం ఉంది. వీరికి సుబ్రమణ్యం, సురేంద్ర ఇద్దరు కుమారులు. భార్య మరణంతో గంగిశెట్టి అత్తగారిల్లు అయిన తిరుపతికి 3 దశాబ్దాల క్రితం వెళ్లిపోయారు. అక్కడే చిల్లర దుకాణం పెట్టుకుని తన కుమారుల అభ్యున్నతి కోసం శ్రమించారు. కాలక్రమంలో సుబ్రమణ్యం పెట్రోల్ బంకులు లీజుకు తీసుకుని వ్యాపారం చేస్తూ అంచెలంచెలుగా ఎదిగారు. తమ్ముడు సురేంద్ర వెల్డింగ్ వర్క్ చేసేవారు. తండ్రి అస్థికలు గోదావరిలో నిమజ్జనం చేసేందుకు భార్య, కుమార్తెతో వెళ్లిన సుబ్రమణ్యం బోటు మునకతో గల్లంతయ్యారనే వార్తలు టీవీలో రావడం చూసి గ్రామంలో విషాదం అలుముకుంది. వారి తాలూ కు బంధువర్గం హుటాహుటిన రాజమండ్రికి బయల్దేరింది. -
ఆరు భాషలలో అమీగ మ్యూజిక్ వీడియో
డాక్టర్ ఆనంద్ రచన, దర్శకత్వంలో స్కూల్స్, కాలేజ్‌లలో జరిగే ర్యాగింగ్ కథాంశంతో రూపొందిన డాన్స్ మ్యూజికల్ వీడియో అమీగ. ఈ వీడియోతో అమెరికాలో డాన్స్ ప్రదర్షణలు చేసి ఎన్నో అవార్డ్ లు సొంతం చేసుకున్న త్రిశూల్ కలాపురం తెలుగు ప్రేక్షకులకు పరిచయం అవుతున్నాడు. బిగ్ బాస్ ఫేం తారిక, మహర్షి, రాజా ది గ్రేట్ ఫేం హాసిని ప్రధాన పాత్రలతో రూపొందిన ఈ వీడియోను యన్‌యస్ నాయక్ సమర్పణలో పద్మా కలాపురం నిర్మించారు. ఆరు భాషల్లో రూపొందించిన ఈ వీడియోను ఉగాది సందర్భంగా రిలీజ్ చేశారు. విడుదలైన అన్ని భాషల్లో ఈ మ్యూజిక్ వీడియోకు మంచి రెస్సాన్స్ వస్తోంది. సూపర్ స్టార్ మహేష్ బాబు మహర్షి సినిమాలో ముఖ్యమైన పాత్రను పోషిస్తున్న బాల నటి హాసిని ఈ వీడియోలో కీలక పాత్రలో కనిపించారు. అమీగ పాటను ప్రముఖ వర్ధమాన రచయిత శ్రీనివాస మౌళి రచించగా,తెలుగులో ఇండియన్ ఐడల్ రేవంత్, ఇంగ్లీష్ లో స్వీకర్ అగస్తి పాడడం విశేషం. డాక్టర్ ఆనంద్ దర్శకత్వ రూపొందిన ఈ వీడియోకు కిరణ్ మాస్టర్ కొరియోగ్రఫి అందించారు. ఈ వీడియో ప్రముఖ మ్యూజిక్ సంస్థ లహరి మ్యూజిక్ ద్వారా విడుదలయింది. వీడియో రిలీజ్ సందర్భంగా డైరెక్టర్ ఆనంద్ మాట్లాడుతూ.. త్రిశూల్ అద్భుతంగా ఆకట్టుకుంటున్నాడని, అందమైన తారిక, హాసినిలు అదనపు ఆకర్షణగా ఈ పాటను గోవా, ఓక్రిడ్జ్ మరియు ఆంబిటస్ స్కూల్స్‌లో క్వాలిటీ విషయంలో కాంప్రమైజ్ కాకుండా రూపొందించామని, ప్రతి ఒక్కరూ ఈ వీడియోని చూసి అమీగ టీం అందరిని ఆశీర్వదించాలని కోరారు. -
అప్పీలుకు రాక్షసుడు
సాక్షి, చెన్నై : చిన్నారి అనే దయ లేకుండా ఆరేళ్ల హాసినిపై లైంగిక దాడికి పాల్పడడమే కాకుండా అతి కిరాతకంగా హతమార్చిన నరరూప రాక్షసుడు దశ్వంత్ హైకోర్టు తలుపు తట్టాడు. తనకు విధించిన ఉరి శిక్షను వ్యతిరేకిస్తూ పిటిషన్ దాఖలు చేశాడు. దీనిని హైకోర్టు విచారణకు స్వీకరించింది. నాలుగు వారాల్లోపు వివరణ ఇవ్వాలని పోలీసులకు న్యాయమూర్తులు ఆదేశాలు జారీచేశారు. చెన్నై శివారులోని కుండ్రత్తూరు సంబంధం నగర్‌కు చెందిన దశ్వంత్ (24) అనే సాఫ్ట్వేర్ ఇంజినీర్ మాంగాడు సమీపం మహాలింగం అపార్టుమెంటులో తల్లిదండ్రులతో కలిసి నివసిస్తున్న సమయంలో అఘాయిత్యానికి ఒడిగట్టిన విషయం తెలిసిందే. అదే అపార్టుమెంటులో నివసిస్తున్న బాబు కుమార్తె ఆరేళ్ల వయస్సున్న హాసిని గత ఏడాది ఫిబ్రవరి 5 వ తేదీన ఎత్తుకెళ్లాడు. ఆ చిన్నారిపై లైంగిక దాడికి పాల్పడి ఆపై సజీవంగా తగులబెట్టి హతమార్చడం వెలుగులోకి వచ్చింది. పోలీసులు అరెస్టుచేసి కటకటాల్లోకి నెట్టగా బెయిల్ మీద దర్జాగా దశ్వంత్ బయటకు వచ్చాడు. జైలు జీవితంతో మంచివాడిగా మారుతాడుకున్న వాడు మరింత కిరాతకుడయ్యాడు. జులాయిగా తిరగడం మొదలెట్టిన దశ్వంత్ ఖర్చుల కోసం డబ్బు ఇవ్వలేదన్న ఆగ్రహంతో కన్న తల్లి సరళను సైతం కడతేర్చి ఉడాయించాడు. ఈ నరరూప రాక్షసుడ్ని పట్టుకునేందుకు పోలీసులు తీవ్రంగానే శ్రమించాల్సి వచ్చింది. ఎట్టకేలకు అరెస్టుచేసి కోర్టు బోనులో నిలబెట్టారు. ఈ ఏడాది ఫిబ్రవరి 19వ తేదీన ఇతనికి ఉరి శిక్ష విధిస్తూ చెంగల్పట్టు మహిళా కోర్టు తీర్పు ఇచ్చింది. ఈ తీర్పు ఇచ్చి నెలన్నర రోజుల అనంతరం దశ్వంత్ అప్పీలుకు సిద్ధం అయ్యాడు. బుధవారం మద్రాసు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అప్పీలుకు దశ్వంత్ తనకు విధించిన ఉరి శిక్షను పిటిషన్లో వ్యతిరేకించాడు. చార్జ్ షీట్లో పేర్కొన్న అంశాలను వివరించారు. మహిళా కోర్టు విచారణ తీరును గుర్తు చేశాడు. సాక్షుల విచారణ, వాంగ్మూలం గురించి వివరించాడు. అయితే, సాక్షుల వాంగ్మూలం అంతా అసంబద్ధంగా ఉందని ఆరోపించాడు. పోలీసులు సమర్పించిన ఆధారాల గురించి వివరిస్తూ, విచారణలో అవన్నీ తారుమారయ్యాయని పేర్కొన్నాడు. అస్సలు విచారణ సమగ్రంగానే సాగలేదని హైకోర్టు దృష్టికి తెచ్చాడు. తనకు శిక్ష వి«ధించి కేసును ముగించాలన్నట్టుగానే తంతు సాగిందే గానీ సమగ్ర విచారణ జరగ లేదని ఆరోపించాడు. ఆ ఉరి శిక్షను రద్దు చేయాలని, సాక్ష్యాలు, ఆధారాలను సమగ్రంగా పరిశీలించి తుది తీర్పును ఇవ్వాలని దశ్వంత్ చేసుకున్న విజ్ఞప్తిని కోర్టు పరిగణించింది. న్యాయమూర్తులు విమల, రామతిలగం నేతృత్వంలోని డివిజన్ బెంచ్ పిటిషన్‌ను పరిశీలించిన అనంతరం విచారణకు స్వీకరించింది. అలాగే దశ్వంత్ పిటిషన్‌కు నాలుగు వారాల్లోపు వివరణ ఇవ్వాలని ఆదేశిస్తూ, విచారణను వాయిదా వేసింది. చదవండి: హాసిని అత్యాచారం కేసులో దశ్వంత్ కు ఉరి కిరాతకుడు దశ్వంత్ ముంబైలో అరెస్ట్ -
అలా ఆలోచన...
‘ఆధునిక జీవనంలో మహిళలు అమ్మతనాన్నిఆస్వాదించలేకపోతున్నారు. మానసిక ఒత్తిడితో మాతృత్వపు ఆనందాన్ని కోల్పోతున్నారు. అలాంటి వారికోసమే మా ‘ది న్యూ మామ్జ్ హబ్’’ అని చెప్పారు డాక్టర్ హాసిని యాదవ్. నవతరం తల్లులకు అండగా నిలుస్తూ... చిన్నారుల పోషణలోసలహాలు, సూచనలు అందజేస్తోంది. ఈ సంస్థ ఆధ్వర్యంలో కేర్‌టేకింగ్, పేరెంటింగ్ నేర్పిస్తోంది. బాలానగర్: డాక్టర్ హాసిని డెంటల్ డాక్టర్. హైదరాబాద్‌లోనే పుట్టి పెరిగింది. విద్యాభ్యాసమంతా ఇక్కడే కొనసాగింది. వివాహానంతరం భర్తతో కలిసి న్యూజిలాండ్ వెళ్లి బిజినెస్ అండ్ హాస్పిటలైజేషన్ కోర్సు పూర్తి చేసి ఉద్యోగం చేశారు. తాను తల్లి అవుతున్న విషయం తెలియడంతో ఓవైపు సంతోషం... మరోవైపు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలియని ఆందోళన. యూట్యూబ్, వెబ్సైట్లలో చూసి జాగ్రత్తలు తెలుసుకుంది. అలా ఆలోచన... హాసినికి నెలలు నిండగానే ఆమె తల్లి ఇండియా నుంచి న్యూజిలాండ్‌కు వెళ్లింది. బాబు పుట్టిన కొద్ది కాలానికి హాసిని అమ్మమ్మ చనిపోవడంతో తల్లి ఇండియాకు వచ్చేశారు. దీంతో బాబును ఎలా పెంచాలి? పాలు ఇచ్చేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? రాత్రి సమయంలో బాబు ఏడిస్తే ఏం చేయాలి? బాబుకు ఏం తినిపించాలి? తాను ఏం తీసుకోవాలి? ఇలా చాలా సమస్యలు హాసినికి ఎదురయ్యాయి. ఓ రోజు అర్ధరాత్రి బాబు బాగా ఏడ్చాడు. ఆమెకు ఎందుకో అర్థం కాలేదు. ఆకలి వేసి ఏడుస్తున్నాడా? లేదా ఏమైనా ఇబ్బందా? తెలియదు. ఇరుగుపొరుగు సహకారంతో ‘మామ్స్ హబ్’ ఉంటుందని తెలుసుకొని అక్కడ శిక్షణ తీసుకుంది. రెండో బాబు పుట్టిన తర్వాత హాసిని కుటుంబం ఇండియాకు తిరిగొచ్చింది. ఇక్కడ కొంతకాలం ఉద్యోగం చేసిన హాసినికి తనలా ఇబ్బందులు ఎదుర్కొంటున్న తల్లుల కోసం ఏదైనా చేయాలని ఉండేది. దీంతో ఉద్యోగానికి రాజీనామా చేసి ‘ది న్యూ మామ్జ్ హబ్’ను స్థాపించారు. ‘మాతృ సఖి’ ఫౌండేషన్ ఆధ్వర్యంలో వివిధ ప్రాంతాల్లో తల్లులకు అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నారు. ఇదేంచేస్తుంది? సుమారు 6నెలలు క్షేత్రస్థాయిలో పరిశీలన చేసిన హాసిని గైనకాలజిస్టులు, సైకాలజిస్టులు, పిల్లల డాక్టర్లను కలిసి ‘ది న్యూ మామ్జ్ హబ్’ స్థాపించారు. బాలింతలకు కౌన్సెలింగ్ ఇవ్వడంతో పాటు చిన్నారుల పోషణలో శిక్షణనిస్తోంది. 2017 జనవరిలో ఈ సంస్థ సేవలు ప్రారంభమయ్యాయి. ప్రతివారం ఒక సెషన్ ఉంటుంది. వారానికి ఒక అంశంపై నవతరం తల్లులందరితో మాట్లాడుతుంది. మానసిక ఒత్తిడిని తగ్గించేందుకు యోగాసనాలు, శారీరక శ్రమ తగ్గటానికి ఎక్సర్సైజులు చేయిస్తారు. ఇప్పటి వరకు సుమారు 100 మందికి శిక్షణనిచ్చింది. బాబుకు జన్మనిచ్చిన తర్వాత ఒంట్లో ఓపిక లేకపోవడం, ఒత్తిడి ఎక్కువగా ఉండడం తదితర కారణాలతో చాలామంది నిరాశగా ఉంటారు. మాతృత్వపు మధురానుభూతులు ఆస్వాదించలేరు. అలాంటి వారికి సలహాలు, సూచనలు అందజేస్తూ సాంత్వన చేకూర్చుతోందీ హబ్. దీనికి వీరేం చార్జి వసూల్ చేయడం లేదు. ఎవరైనా ఇస్తే మాత్రమే తీసుకుంటున్నారు. మరిన్ని వివరాలకు www.thenewmumzhub.చూడొచ్చు. స్పష్టత వచ్చింది.. పిల్లల విషయంలో ఒత్తిడిని అధిగమించడం ఎలా? అనే అంశంపై నేను డాక్టర్ హాసిని యాదవ్‌ను సంప్రదించాను. ఆమె ఇచ్చిన సలహాలు, సూచనలతో ముందుకెళ్తున్నాను. ఉద్చ్యోగాన్ని బ్యాలెన్సింగ్ చేయడం ఎలా? అని ఇంతకముందు భయపడేదాన్ని. ఇప్పుడా కంగారు లేదు. చాలా విషయాలపై స్పష్టత వచ్చింది. ఇప్పుడు నా కూతురితో ఆనందంగా గడుపుతున్నాను. – లావణ్య, డిజైనర్ ఆత్మస్థైర్యం పెరిగింది... మాది వరంగల్ జిల్లా. ఉద్యోగరీత్యా బాలానగర్‌లో ఉంటున్నాం. మేము ఇద్దరం ఉద్యోగులమే. మా అమ్మాయి పుట్టిన నెల రోజుల వరకే నాకు సెలవులు ఉన్నాయి. తర్వాత ఆఫీస్‌కు వెళ్లాల్సిన పరిస్థితి. మా అమ్మానాన్న వ్యవసాయం చేస్తారు. ఇక్కడికి వచ్చి మాతో ఉండే పరిస్థితి లేకపోవడంతో.. మా అమ్మాయికి ఎలాంటి ఆహారం అందించాలి? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? తదితర అవగాహన లేదు. ‘ది న్యూ మామ్జ్ హబ్’కి వెళ్లాక నాలో ఆత్మస్థైర్యం పెరిగింది. ఇప్పుడన్నీ తెలుసుకున్నాను. – సుమశ్రీ, బాలానగర్ -
కిరాతక టెకీ దశ్వంత్‌కు ఉరి శిక్ష
-
కిరాతకుడికి మహిళా కోర్టు మరణశిక్ష
సాక్షి ప్రతినిధి, చెన్నై: తన కన్న తల్లిని, ఆరేళ్ల చిన్నారిని అమానుషంగా హతమార్చిన సాఫ్ట్వేర్ ఇంజనీర్ దశ్వంత్ (24)కు తమిళనాడులోని మహిళా కోర్టు మరణదండన విధించింది. చిన్నారిపై అత్యాచారం చేసి సజీవంగా తగలబెట్టినట్లు, డబ్బు ఇవ్వలేదని తల్లినే హతమార్చినట్లు నేరం రుజువు కావడంతో చెంగల్పట్టు మహిళా కోర్టు నిందితునికి ఉరిశిక్ష విధిస్తున్నట్లు సోమవారం తీర్పు వెల్లడించింది. చెన్నై శివారులోని కున్రత్తూరు సంబంధం నగర్‌కు చెందిన దశ్వంత్ తల్లిదండ్రులతో కలసి ఓ అపార్ట్మెంట్లో నివసిస్తున్నాడు. అదే అపార్ట్మెంట్లో బాబు అనే వ్యక్తి కూడా ఉంటున్నారు. బాబు కుమార్తె హాసిని (6)ని దశ్వంత్ గతేడాది ఫిబ్రవరి 5న ఇంటికి సమీపంలోని మారుమూల ప్రాంతానికి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు. అనంతరం చిన్నారిని సజీవదహనం చేశాడు. చిన్నారి తండ్రి ఫిర్యాదుతో విచారణ చేపట్టిన పోలీసులు గతేడాది ఫిబ్రవరి 7న దశ్వంత్‌ను అరెస్ట్ చేశారు. గతేడాది సెప్టెంబరు 13న అతడు బెయిల్‌పై బయటకు వచ్చాడు. జులాయి తిరుగుళ్లకు అలవాటుపడ్డ దశ్వంత్ డబ్బు కోసం తల్లితో గొడవపడేవాడు. డబ్బులు ఇవ్వకపోవడంతో డిసెంబర్ 2న తల్లిని దారుణంగా హత్యచేసి ఆమె మెడలోని 25 తులాల బంగారు నగలు, బీరువాలోని రూ. 10 వేల నగదు తీసుకుని తమిళనాడు నుంచి పరారయ్యాడు. డిసెంబర్ 8న ముంబైలో తమిళనాడు పోలీసులకు పట్టుబడగా, నిందితుడిని చెంగల్పట్టు మహిళా కోర్టులో హాజరుపరిచి పుళల్ సెంట్రల్ జైలుకు పంపారు. ఈ నేపథ్యంలో దశ్వంత్ చేసిన నేరాలు సాక్ష్యాధారాలతో రుజువైనందున మరణశిక్ష విధిస్తున్నట్లు చెంగల్పట్టు మహిళా కోర్టు న్యాయమూర్తి వేల్మురుగన్ సోమవారం తీర్పు చెప్పారు. -
వారిని నేను చంపలేదు..
సాక్షి, చెన్నై : తమిళనాట సంచలనం కలిగించిన చిన్నారి హాసిని, ఆమె తల్లి సరళ హత్య కేసు కొత్త మలుపు తిరిగింది. వారిని తాను చంపలేదంటూ హంతకుడు దశ్వంత్ మాట మార్చాడు. వివరాల్లోకి వెళ్తే.. కుండ్రత్తూరుకు చెందిన దశ్వంత్ చెన్నై మౌలివాక్కానికి చెందిన ఆరేళ్ల బాలిక హాసినిని గత ఫిబ్రవరిలో అత్యాచారం చేసి చంపేశాడు. ఈ కేసులో జైలుకెళ్లిన దశ్వంత్, బెయిల్‌పై విడుదలై ఈనెల 2న తల్లి సరళను హత్య చేసి నగలతో ముంబైకి పరారయ్యాడు. ముంబై పోలీసుల సహాకారంతో తమిళనాడు పోలీసులు హంతకుడిని అరెస్టు చేసి పుళల్ జైలులో నిర్బంధించారు. శుక్రవారం ఈ కేసు విచారణకు వచ్చింది. భారీ భద్రత నడుమ పోలీసులు దశ్వంత్‌ను చెంగల్పట్టు మహిళా కోర్టులో హాజరుపచడానికి తీసుకువచ్చారు. ఆ సమయంలో పోలీసు వ్యాను నుంచి కిందికి దిగిన దశ్వంత్ విలేకరులతో మాట్లాడుతూ చిన్నారి హాసినిని, తన తల్లి సరళను తాను హత్య చేయలేదన్నాడు. విలేకరుల సమావేశం ఏర్పాటుచేసి పూర్తివివరాలు వెల్లడిస్తానని తెలిపాడు. తర్వాత న్యాయమూర్తి వేల్మురుగన్ సమక్షంలో దశ్వంత్‌ను కోర్టులో హాజరుపరిచారు. పోలీసుల దిగ్భ్రాంతి: కొన్ని రోజుల క్రితం దశ్వంత్‌ను పోలీసులు కోర్టులో హాజరుపరచగా విచారణ అవసరం లేదని, తనకు శిక్షను విధించాలని కోరాడు. ప్రస్తుతం హాసినిని, తల్లి సరళను తాను హత్య చేయలేదని చెప్పడం పోలీసులను దిగ్భ్రాంతికి గురిచేసింది. దశ్వంత్‌కు వ్యతిరేకంగా సాక్ష్యాలను బలపరిచేందుకు, కొత్త సాక్షులను చేర్చేందుకు పోలీసులు నిర్ణయించారు. -
చదువంటే బట్టీ పట్టడం కాదు
సినీ విమర్శకుడు, ఇటీవల ‘బిగ్‌బాస్’ షో ద్వారా పాపులర్ అయిన మహేశ్ కత్తి దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘ఎగిసే తారాజువ్వలు’. యశ్వంత్, హాసిని, సౌమ్యా వేణుగోపాల్, అజయ్ ఘోష్, లోహిత్, స్వప్న, అప్పాజీ అంబారిష్ఠ ముఖ్య పాత్రల్లో నటించిన ఈ చిత్రాన్ని వాణి ఇరగం సమర్పణలో నాగ మల్లారెడ్డి నిర్మించారు. ఈ చిత్రం ప్రీ–రిలీజ్ వేడుకలో ముఖ్య అతిథిగా పాల్గొన్న హీరో విజయ్ దేవరకొండ పాటలను విడుదల చేశారు. దర్శకులు తమ్మారెడ్డి భరద్వాజ్, శేఖర్ కమ్ముల, రచయిత చిన్నికృష్ణ తొలి పాటను, దర్శకుడు ఇంద్రగంటి, నిర్మాత ‘మధుర’ శ్రీధర్, గీతాకృష్ణ, శ్రీనివాస్‌రాజ్ ట్రైలర్‌ను రిలీజ్ చేశారు. ‘‘చదువంటే బట్టీ పట్టడం కాదు.. జీవితాన్ని వడేసి పట్టడం’ అనే అంశాన్ని వినోదాత్మకంగా, సున్నితంగా మా సినిమాలో చెప్పాం’’ అన్నారు మహేశ్ కత్తి. ‘‘ఈ చిత్రానికి సహాయ సహకారాలు అందించిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు’’ అన్నారు నాగ మల్లారెడ్డి. -
బెల్లంపూడి టు బూటాన్..
అంతర్జాతీయ బాక్సింగ్ పోటీలకు ఎంపికైన ‘హాసిని’ పి.గన్నవరం : మండలంలోని మారుమూల గ్రామమైన బెల్లంపూడిలో నిరుపేద కుటుంబానికి చెందిన చీకరమెల్లి హాసిని అనే ట్రిపుల్ ఐటీ విద్యార్థిని బూటాన్ దేశంలో జరిగే అంతర్జాతీయ బాలికల బాక్సింగ్ పోటీలకు ఎంపికైంది. ఈనెల 27, 28, 29 తేదీల్లో జరగనున్న రూరల్ సౌత్ ఏషియన్ బాక్సింగ్ పోటీల్లో అండర్ 17 కేటగిరీ 64 కిలోల విభాగంలో భారతదేశం తరఫున తలపడనుంది. భారతదేశం నుంచి మొత్తం 12 మంది బాలికలు బాక్సింగ్ పోటీలకు ఎంపిక కాగా, మన రాష్ట్రం నుంచి హాసినికి మాత్రమే స్థానం దక్కడం విశేషం. ఈనెల 19, 20, 21 తేదీల్లో హర్యానాలో జరిగిన జాతీయ బాక్సింగ్ పోటీల్లో గోల్డ్ మెడల్ సాధించడంతో హాసినిని అంతర్జాతీయ పోటీలకు ఎంపిక చేశారు. ఈ పోటీల్లో పాల్గొనేందుకు గాను హాసిని బుధవారం రాత్రి బూటాన్ బయల్దేరింది. ప్రస్తుతం ఆమె నూజివీడు ట్రిపుల్ ఐటీలో ద్వితీయ సంవత్సరం చదువుతోంది. తన తల్లిదండ్రులు వసంత కుమారి, కృష్ణారావు, జాతీయ బాక్సింగ్ రిఫరీ అయిన కోచ్ చిట్టూరి చంద్రశేఖర్ ప్రోత్సాహంతో తాను ఈ పోటీలకు ఎంపికైనట్టు వివరించింది. రూరల్ సౌత్ ఏషియన్ బాక్సింగ్ పోటీల్లో గోల్డు మెడల్ సాధించడమే తన లక్ష్యమని హాసిని పేర్కొంది. పతకాల పంటే.. ఇంతవరకూ పాల్గొన్న ప్రతీ పోటీలో హాసిని సత్తా చాటింది. 2014లో హైదరాబాద్‌లో జరిగిన రాష్ట్ర స్థాయి బాక్సింగ్ పోటీల్లో కాంస్య పతకాన్ని, 2015లో జరిగిన రాష్ట్ర స్థాయి స్కూల్ గేమ్స్‌లో కాంస్య పతకం, రాష్ట్ర రూరల్ గేమ్స్‌లో బంగారు పతకం, 2016లో జరిగిన రాష్ట్ర స్థాయి పోటీల్లో వెండి పతకం, ఈ ఏడాది విశాఖలో జరిగిన రాష్ట్ర స్థాయి బాక్సింగ్ పోటీల్లో బంగారు పతకాలను సాధించింది. డబ్బులు లేక చివరి వరకూ ఇబ్బంది పడ్డ హాసిని అంతర్జాతీయ బాక్సింగ్ పోటీలకు ఎంపికైన హాసిని ఇతర ఖర్చులకు సైతం డబ్బులు లేక ఇబ్బంది పడింది. విషయం తెలుసుకున్న కొందరు దాతలు సాయం అందించి ఆమెను ప్రోత్సాహించారు. పై ఖర్చుల నిమిత్తం సుమారు రూ.30 వేలు అవసరం కాగా, దాతలు కొంత సొమ్ము సమకూర్చారు. దీంతో బుధవారం రాత్రి బెల్లంపూడి నుంచి ఆమె బూటన్‌కు బయలుదేరింది. గ్రామీణ ప్రాంతాల్లో నిరుపేద కుటుంబాల్లో ఉన్న ఇటువంటి ఆణిముత్యాలను ప్రభుత్వంతో పాటు, దాతలు ప్రోత్సాహించాల్సిన అవసరం ఎంతైనాఉంది. -
జాతీయ స్థాయి రైఫిల్ పోటీలకు హాసిని
రామచంద్రపురం : పట్టణానికి చెందిన వ్యాపారవేత్త సత్తి కృష్ణ చైతన్యరెడ్డి కుమార్తె కృష్ణ హాసిని స్కూల్ గేమ్స్ ఫెడరేష¯ŒS అండర్ 14 జాతీయ స్థాయి రైఫిల్ పోటీలకు ఎంపికయ్యారు. కడప జిల్లా ప్రొద్దుటూరులో సోమవారం జరిగిన 62వ అంతర్ జిల్లాల రాష్ట్ర స్థాయి రైఫిల్ షూటింగ్ పోటీలలో ఎయిర్ పిస్టల్ 10 మీటర్ల షూటింగ్ విభాగంలో హాసిని ఉత్తమమైన ప్రతిభను కనబర్చి జాతీయ స్థాయికి ఎంపికైనట్లు జిల్లా ఏజీఎఫ్ రైఫిల్ అసోసియేష¯ŒS కార్యదర్శి సమీర్ విలేకరులకు తెలిపారు. -
నీటితొట్టెలో పడి చిన్నారి మృతి
కేఎన్‌పురం (దెందులూరు): దెందులూరు మండలం కేఎన్ పురంలోని ఉండ్రాజవరపు శ్రీను, సుజాతల కుమార్తె హాసిని (3) నీటితొట్టెలో పడి మృతిచెందింది. వివరాలు ఇలా ఉన్నాయి. ఆదివారం హాసిని స్నానం చేసేందుకు నీటితొట్టె వద్దకు వెళ్లింది. ఎంతసేపటికి తిరిగి రాకపోవడంతో తల్లిదండ్రులు నీటితొట్టె వద్దకు వెళ్లి చూడగా దానిలో పడి ఉంది. వెంటనే చిన్నారి హాసినిని భీమడోలు వైద్యశాలకు తీసుకువెళ్లారు. అప్పటికే హాసిని మృతిచెందినట్టు వైద్యులు చెప్పడంతో దంపతులిద్దరూ కన్నీరు మున్నీరయ్యారు. శ్రీను వ్యవసాయ కూలీ. ఆయనకు ఇద్దరు కుమార్తెలు. -
చిన్నారి మెడలో గొలుసు చోరీ
చాక్లెట్ కొనిస్తానని చిన్నారికి ఆశచూపిన దుండగుడు ఆమె మెడలోని గొలుసును దోచుకెళ్లాడు. ఈ ఘటన బుధవారం అంబర్‌పేట పోలీస్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఎస్ఐ మధుసూదన్ కథనం ప్రకారం... హస్తినాపురంలో నివసించే తిరుపతి రెడ్డి, ఆయన భార్య, కూతరు హాసిని(4) మంగళవారం రాత్రి పటేల్‌నగర్‌లోని ఓ ఫంక్షన్హాల్లో జరిగిన శుభకార్యానికి వచ్చారు. హాసిని బయట ఆడుకుంటుండగా ఓ గుర్తు తెలియని వ్యక్తి చాకెట్లు కొనిస్తానంటూ పక్కనే ఉన్న కిరాణం కొట్టుకు తీసుకె ళ్లాడు. ఆమెకు మాయమాటలు చెప్పి మెడలో ఉన్న తులం బంగారు గొలుసును తస్కరించుకొని పరారయ్యాడు. కొద్దిసేపటి తర్వాత కూతురు మెడలో గొలుసు లేదని గమనించిన తల్లిదండ్రులు ఆరా తీయగా అసలు విషయం తెలిసింది. దీనిపై వారు బుధవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు.