![I Am Not a Killer : Hasini's alleged killer Dhashvanth - Sakshi](/styles/webp/s3/article_images/2017/12/29/Daswanth.jpg.webp?itok=LTJLjtQ1)
సాక్షి, చెన్నై : తమిళనాట సంచలనం కలిగించిన చిన్నారి హాసిని, ఆమె తల్లి సరళ హత్య కేసు కొత్త మలుపు తిరిగింది. వారిని తాను చంపలేదంటూ హంతకుడు దశ్వంత్ మాట మార్చాడు.
వివరాల్లోకి వెళ్తే.. కుండ్రత్తూరుకు చెందిన దశ్వంత్ చెన్నై మౌలివాక్కానికి చెందిన ఆరేళ్ల బాలిక హాసినిని గత ఫిబ్రవరిలో అత్యాచారం చేసి చంపేశాడు. ఈ కేసులో జైలుకెళ్లిన దశ్వంత్, బెయిల్‌పై విడుదలై ఈనెల 2న తల్లి సరళను హత్య చేసి నగలతో ముంబైకి పరారయ్యాడు. ముంబై పోలీసుల సహాకారంతో తమిళనాడు పోలీసులు హంతకుడిని అరెస్టు చేసి పుళల్ జైలులో నిర్బంధించారు.
శుక్రవారం ఈ కేసు విచారణకు వచ్చింది. భారీ భద్రత నడుమ పోలీసులు దశ్వంత్‌ను చెంగల్పట్టు మహిళా కోర్టులో హాజరుపచడానికి తీసుకువచ్చారు. ఆ సమయంలో పోలీసు వ్యాను నుంచి కిందికి దిగిన దశ్వంత్ విలేకరులతో మాట్లాడుతూ చిన్నారి హాసినిని, తన తల్లి సరళను తాను హత్య చేయలేదన్నాడు. విలేకరుల సమావేశం ఏర్పాటుచేసి పూర్తివివరాలు వెల్లడిస్తానని తెలిపాడు. తర్వాత న్యాయమూర్తి వేల్‌మురుగన్ సమక్షంలో దశ్వంత్‌ను కోర్టులో హాజరుపరిచారు.
పోలీసుల దిగ్భ్రాంతి: కొన్ని రోజుల క్రితం దశ్వంత్‌ను పోలీసులు కోర్టులో హాజరుపరచగా విచారణ అవసరం లేదని, తనకు శిక్షను విధించాలని కోరాడు. ప్రస్తుతం హాసినిని, తల్లి సరళను తాను హత్య చేయలేదని చెప్పడం పోలీసులను దిగ్భ్రాంతికి గురిచేసింది. దశ్వంత్‌కు వ్యతిరేకంగా సాక్ష్యాలను బలపరిచేందుకు, కొత్త సాక్షులను చేర్చేందుకు పోలీసులు నిర్ణయించారు.
Comments
Please login to add a commentAdd a comment