
ప్రతీకాత్మక చిత్రం
సాక్షి, వేలూరు(తమిళనాడు): వివాహేతర సంబంధం ఓ ప్రాణాన్ని బలి తీసుకుంది. వివరాలు.. తిరుపత్తూరు జిల్లా వానియంబాడి తాలుకా అన్నియ అడిగలార్ నగర్‌కు చెందిన లారీ యజమాని వెంకటేశన్(35).. చిన్న వేపంబట్టు గ్రామానికి చెందిన లారీ మెకానిక్ శంకర్ మధ్య శనివారం రాత్రి గొడవ జరిగింది. ఆగ్రహించిన శంకర్ ఇనుప రాడ్డుతో వెంకటేశన్ తలపై కొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందాడు.
అనంతరం శంకర్, అతని భార్య భాగ్యలక్ష్మి ఇంటి నుంచి పరారయ్యారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఓసూరులో శంకర్, భాగ్యలక్ష్మిని అదుపులోకి తీసుకున్నారు. విచారణలో భాగ్యలక్ష్మి, వెంకటేశన్‌కు ఐదేళ్లుగా వివాహేతర సంబంధం ఉన్నట్లు.. ఈ కారణంగా వెంకటేశన్ తల్లి భాగ్యలక్ష్మి ఇంటికి వెళ్లి గొడవ పడినట్లు తెలిసింది. దీంతో ఆగ్రహించిన శంకర్ ఇనుప రాడ్డుతో వెంకటేశన్ తలపై కొట్టి హత్య చేసినట్లు ఒప్పుకున్నాడు.
Comments
Please login to add a commentAdd a comment