
ప్రతీకాత్మక చిత్రం
టీ.నగర్/చెన్నై: తెన్‌కాశిలో భర్తను హతమార్చి ఇంట్లో పాతిపెట్టిన కేసులో రెండున్నరేళ్ల తర్వాత భార్య ప్రియుడిని శనివారం పోలీసులు అరెస్ట్ చేశారు. తెన్‌కాశి సమీపంలోని గుత్తుకల్‌వలసు ప్రాంతానికి చెందిన తంగరాజ్ భార్య అభిరామి (33) బ్యూటీపార్లర్ నడుపుతోంది. వీరికి కుమారుడు, కుమార్తె ఉన్నారు. నాలుగేళ్ల క్రితం అనారోగ్యంతో తంగరాజ్ మృతిచెందాడు. ఇలావుండగా అభిరామి తెన్‌కాశి అరుణాచలపురానికి చెందిన కన్నన్ కుమారుడు కాళిరాజ్ (23)ను వివాహమాడింది. అయితే, 2018 సెప్టెంబరులో కాళిరాజ్ హఠాత్తుగా మాయమయ్యాడు. ఈ విషయమై కాళిరాజ్ తల్లి ఉమ అభిరామిని ప్రశ్నించగా, అతడు విదేశానికి వెళ్లినట్లు చెప్పడంతో అనుమానం వచ్చి, ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది.
ఈ క్రమంలో రెండున్నరేళ్ల తర్వాత ఈ కేసు మలుపు తిరిగింది. అభిరామి వ్యవహారంపై అనుమానం వచ్చిన పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకుని విచారణ జరపగా కాళిరాజ్‌ను హత్య చేసినట్లు ఒప్పుకుంది. అదే ప్రాంతంలో వర్కుషాపు నడుపుతున్న మారిముత్తు (23) అనే ప్రియుడితో కలిసి భర్తను హతమార్చినట్లు గుర్తించారు. అంతేకాకుండా మృతదేహాన్ని ఇంట్లోనే పాతిపెట్టినట్లు తెలిసింది. దీంతో అస్థిపంజరాన్ని పోలీసులు స్వాధీనం చేసుకుని ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపారు. దీనికి సంబంధించి అభిరామి, మారిముత్తుతోపాటు సహకరించిన మురుగేశన్‌ను పోలీసులు అరెస్టు చేశారు.
నవవధువు హత్య
తెన్‌కాశి పులియకరైలో కస్తూరి (23) అనే నవవధువును కన్నన్ (33) శనివారం హతమార్చాడు. అభిప్రాయభేదాల కారణంగా ఈ హత్య జరిగినట్లు సమాచారం. పులియరై పోలీసులు విచారణ జరుపుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment