
ప్రతీకాత్మక చిత్రం
టీ.నగర్: సేలం సమీపంలో ఆదివారం వివాహేతర జంట ఆత్మహత్య చేసుకుంది.సేలం సమీపం ఎస్.పాపరపట్టి చెరువులో ఆదివారం మహిళ, పురుషుడి మృతదేహాలు తేలుతూ కనిపించాయి. పోలీసుల విచారణలో ఇరువురూ సేలం జిల్లా, మకుటంజావడి సమీపంగల కూడలూరు గ్రామానికి చెందిన శేఖర్ (26), నామక్కల్ జిల్లా తిరుచెంగోడు ప్రాంతానికి చెందిన గోపాల్ భార్య గోమతి (30) అని తెలిసింది.
వీరిద్దరు చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్నట్టు తెలిసింది. శేఖర్‌కు ఇదివరకే సుమతి అనే మహిళతో వివాహమై ఇద్దరు పిల్లలున్నారు. పెట్రోలు బంకులో ఉద్యోగిగా పనిచేస్తూ వచ్చాడు. ఆ సమయంలో గోమతితో పరిచయం ఏర్పడింది. దీంతో ఇరు కుటుంబాలలో గొడవలు చెలరేగడంతో వీరు మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకున్నట్లు తెలిసింది.
Comments
Please login to add a commentAdd a comment