
తిరువొత్తియూరు/తమిళనాడు: అరియలూరు జిల్లాలో వేర్వేరు చోట్ల ఇద్దరు హత్యకు గురయ్యారు. చెన్నై, తండయారుపేట జ్యోతినగర్ ఐదవ వీధికి చెందిన రాజేంద్రన్ కుమారుడు తంగరాజ్ (29) పెయింటర్. శనివారం మధ్యాహ్నం మహిళ సహా నలుగురు వ్యక్తులు తంగరాజ్ ఇంట్లోకి చొరబడి కత్తులతో తంగరాజ్‌పై దాడి చేశారు. తీవ్ర గాయాలపాలైన అతడు మృతిచెందాడు. కాగా తంగరాజ్ హత్యకు వివాహేతర సంబంధమే కారణమని పోలీసులు తెలిపారు.
కుమారుడిని కడతేర్చిన తండ్రి
అరియలూరు జిల్లా ఉడయార్చాలెం అన్నానగర్‌కు చెందిన రాజేంద్రన్ కుమారుడు చిన్నరాజు (30) కూలీ. ఇతని భార్య మోహనప్రియ. శుక్రవారం రాత్రి మద్యం తాగి వచ్చి చిన్నరాజు ఇంట్లో గొడవపడ్డాడు. ఆగ్రహించిన రాజేంద్రన్ గునపంతో చిన్నరాజుపై దాడి చేశాడు. దాడిలో చిన్నరాజు మృతి చెందాడు. పోలీసులు శనివారం రాజేంద్రన్‌ను అరెస్టు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment