Ariyalur
-
వివాహేతర సంబంధం... ఇంట్లో చొరబడి చంపేశారు
తిరువొత్తియూరు/తమిళనాడు: అరియలూరు జిల్లాలో వేర్వేరు చోట్ల ఇద్దరు హత్యకు గురయ్యారు. చెన్నై, తండయారుపేట జ్యోతినగర్ ఐదవ వీధికి చెందిన రాజేంద్రన్ కుమారుడు తంగరాజ్ (29) పెయింటర్. శనివారం మధ్యాహ్నం మహిళ సహా నలుగురు వ్యక్తులు తంగరాజ్ ఇంట్లోకి చొరబడి కత్తులతో తంగరాజ్పై దాడి చేశారు. తీవ్ర గాయాలపాలైన అతడు మృతిచెందాడు. కాగా తంగరాజ్ హత్యకు వివాహేతర సంబంధమే కారణమని పోలీసులు తెలిపారు. కుమారుడిని కడతేర్చిన తండ్రి అరియలూరు జిల్లా ఉడయార్చాలెం అన్నానగర్‌కు చెందిన రాజేంద్రన్ కుమారుడు చిన్నరాజు (30) కూలీ. ఇతని భార్య మోహనప్రియ. శుక్రవారం రాత్రి మద్యం తాగి వచ్చి చిన్నరాజు ఇంట్లో గొడవపడ్డాడు. ఆగ్రహించిన రాజేంద్రన్ గునపంతో చిన్నరాజుపై దాడి చేశాడు. దాడిలో చిన్నరాజు మృతి చెందాడు. పోలీసులు శనివారం రాజేంద్రన్‌ను అరెస్టు చేశారు. -
వైరల్: టిక్‌టాక్ చేసిన కరోనా పేషెంట్
చెన్నై: పిచ్చి ముదిరి పాకాన పడటమంటే ఇదేనేమో కాబోలు. ఓవైపు ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ తనకు సోకిందన్న విషయాన్ని పక్కపెట్టి మరీ టిక్‌టాక్ వీడియో చేసిందో మహిళ. ఈ అరుదైన ఘటన తమిళనాడులో చోటు చేసుకుంది. అరియలూర్‌కు చెందిన ఓ యువతి షాపింగ్ మాల్లో పని చేస్తుండేది. ఆమెకు టిక్‌టాక్ అంటే పిచ్చి. ఎప్పుడూ ఏదో ఒక వీడియో చేస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ చేసి సంతోషిస్తుండేది. అయితే ఈ మధ్యే ఆమె జ్వరం, దగ్గు లక్షణాలతో జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో చేరింది. అక్కడ ఆమెకు పరీక్షలు నిర్వహించగా మార్చి 26న కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్న సమయంలోనూ ఆమె టిక్‌టాక్‌ను వదల్లేదు. సోమవారం ఓ బాధాకరమైన పాటతో తన భావోద్వేగాలను తెలుపుతూ ఐసోలేషన్ వార్డులోని ముగ్గురు సిబ్బందితో కలిసి టిక్‌టాక్ వీడియో చేసింది. (కరోనాను ఇలా జయించండి..) "నేను తీవ్రమైన గొంతు నొప్పి, జలుబుతో బాధపడుతున్నాను. మాట్లాడాలంటే కూడా చాలా కష్టంగా ఉంది. ఇక్కడ నాకు రోజూ ఫ్రూట్స్, గుడ్లు ఇస్తున్నారు. కానీ తినడానికి నా గొంతు సహకరించడం లేదు. మార్చి 30 నుంచి నా పరిస్థితి ఇలాగే ఉంది" అని ఆ వీడియోలో చెప్పుకొచ్చింది. కానీ ఎడతెరిపి లేకుండా వస్తున్న దగ్గు వల్ల ఆమె 30 సెకండ్ల కన్నా ఎక్కువ సేపు మాట్లాడలేకపోయింది. అయితే ఈ వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. ఇది అక్కడి అధికారులను ఆగ్రహానికి గురి చేయగా ఆమెకు సహకరించిన ముగ్గురు సిబ్బందిని విధుల నుంచి తొలగించారు. (క్షణాల్లో ముఖం మార్చేస్తారు!) -
అతివేగం మింగేసింది!
సాక్షి, చెన్నై : ప్రభుత్వ, ప్రైవేటు బస్సుల అతి వేగం ప్రయాణికుల భద్రతను ప్రశ్నార్థకం చేస్తోంది. శుక్రవారం మధ్యాహ్నం అరియలూరు నుంచి చెందురైకు బయలుదేరిన ప్రభుత్వ టౌన్ బస్సు ప్రమాదానికి గురైంది. సరిగ్గా మూడున్నర గంటల సమయంలో ఒట్టన్ కోవిల్ సమీపంలో సిమెంట్ మిక్స్డ్ కంకర లోడ్‌తో వస్తున్న లారీని ఢీ కొంది. బస్సు, లారీ డ్రైవ ర్లు అతివేగంగా నడిపి, ఢీ కొనే సమయంలో కిందకు దూకేసినట్టుగా సమాచారం వెలుగు చూసింది. ఆ ఇద్దరు కిందకు దూకడంతో లారీ, బస్సు అదుపు తప్పి అతి వేగంగా ఢీ కొట్టాయి. బస్సు కుడి వైపు భాగం పూర్తిగా దెబ్బ తింది. ప్రయాణికులు కూర్చు న్న సీట్లు సైతం ముక్కలు ముక్కలు కావడం బట్టి చూస్తే, ప్రమాద తీవ్రత ఏ పాటితో అర్థం చేసుకోవచ్చు.పెరిగిన మృతుల సంఖ్య: సంఘటన జరిగిన ప్ర దేశం, ఆ రోడ్డు మార్గం అంతా రక్త సిక్తం అయింది. బస్సుల్లో 60 మంది ప్రయాణికులు ఉండగా అంద రూ గాయపడ్డారు. అయితే, సంఘటనా స్థలంలోనే పొయ్యనల్లూరుకు చెందిన అలమేలు, వడయార్ పాళయంకు చెందిన ఆనంది, నగల్‌కు చెందిన సురేష్, శరవణన్, జయంతి, సేదవాడికి చెందిన కనగవేల్, ఆదికుడికి చెందిన చెల్లమలై, వీరాణంకు చెందిన కవిత విగత జీవులయ్యారు. రోడ్డుపై చెల్లాచెదరుగా పడి ఉన్న మృతదేహాలను చూసిన ఆ పరిసరవాసుల గుండెలు బరువెక్కాయి. తీవ్ర గాయాలతో పడి ఉన్న వారిని అరియలూరు, తంజావూరు ఆస్పత్రులకు ఆగమేఘాలపై తరలించారు. వీరిలో అరియలూరు ఆస్పత్రిలో నల్ల పాళయూనికి చెందిన జయలక్ష్మి, శాంతి, సీత చికిత్స పొందుతూ మృతి చెందారు. తంజావూరు ఆస్పత్రికి తరలిస్తున్న సమయంలో ఇలవరసన్, రాజవేల్, బొజమ్మాల్, 8 నెలల అభినేషన్లు మృత్యువాత పడ్డారు. మృతుల్లో అత్యధికంగా స్త్రీలు ఉన్నారు. తీవ్రంగా గాయపడ్డ 29 మందిలో 8 మంది అరియలూరులో, 21 మంది తంజావూరు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. వీరిలో పలువురి పరిస్థితి విషమంగా ఉండడంతో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. స్వల్పంగా గాయపడ్డ వారిని ప్రథమ చికిత్స అనంతరం డిశ్చార్జ్ చేశారు. ఈ ఘటనతో శనివారం అరియలూరు, తంజావూరు ఆస్పత్రులు మృతుల కుటుంబాల ఆర్తనాదాలతో దద్ధరిల్లారుు. మృత దేహాలను పోస్టుమార్టం అనంతరం కుటుంబీకులకు అప్పగించారు. సమాచారం అందుకున్న మంత్రి వైద్యలింగం, ఎమ్మెల్యే దురైమునియప్పన్లు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న వారిని పరామర్శించారు. బాధిత కుటుంబాలకు సానుభూతి తెలియజేశారు. లక్ష ఎక్స్‌గ్రేషియా: ఈ ప్రమాద సమాచారంతో రాష్ట్ర ముఖ్యమంత్రి జయలలిత దిగ్భ్రాంతికి గురయ్యారు. విచారణకు ఆదేశిస్తూ, మృతుల కుటుంబాలకు తన సానుభూతి తెలియజేశారు. మృతుల కుటుంబాలకు లక్ష చొప్పున ఎక్స్‌గ్రేషియో ప్రకటించారు. తీవ్రంగా గాయపడ్డ వారికి రూ.25 వేలు, స్వల్పంగా గాయపడ్డ వారికి రూ.పది వేలు చొప్పున ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు.