Selam
-
హీరో జీవాకు రోడ్డు ప్రమాదం
కోలీవుడ్ హీరో జీవా రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. ఆయన ప్రయాణిస్తున్న కారు రోడ్డు మధ్యలోని డివైడర్‌ను ఢీ కొట్టినట్లు తెలుస్తోంది. ఈ ప్రమాదంలో కారు నుజ్జునుజ్జు కాగా.. హీరో, అతని భార్య క్షేమంగా బయటపడినట్లు సమాచారం. చెన్నై నుంచి సేలం వెళ్తుండగా కన్నియమూర్ వద్ద ఈ ప్రమాదం జరిగింది. ఎదురుగా వస్తున్న బైక్‌ను తప్పించబోయేందుకు యత్నించగా ఈ ఘటన చోటు చేసుకుంది. ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.కాగా.. రంగం సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యాడు జీవా. ఆ తర్వాత తెలుగులో యాత్ర-2 సినిమాలో ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్ పాత్రలో ప్రేక్షకులను మెప్పించారు. అంతేకాకుండా 1983 ప్రపంచకప్ నేపథ్యంలో బాలీవుడ్లో తెరకెక్కించిన మూవీలో కృష్ణమాచారి శ్రీకాంత్ పాత్రలో జీవా మెరిశారు. ప్రస్తుతం కోలీవుడ్‌లో సినిమాలతో బిజీగా ఆయన ఉన్నారు. (ఇది చదవండి: భార్యకు స్పెషల్‌గా విష్ చేసిన రంగం హీరో.. పోస్ట్ వైరల్!) #BREAKING | கார் விபத்தில் சிக்கிய நடிகர் ஜீவா!#SunNews | #Jiiva | #CarAccident | #Kallakurichi | @JiivaOfficial pic.twitter.com/yW2JWEllID— Sun News (@sunnewstamil) September 11, 2024 -
కల నెరవేరింది... గతేడాది అలా.. ఈ ఏడాది ఇలా: సంతోషంలో నటరాజన్
చెన్నై: టీమిండియా ఫాస్ట్‌బౌలర్, తమిళనాడు క్రికెటర్ టి. నటరాజన్ కల ఎట్టకేలకు నెరవేరింది. తన పేరిట క్రికెట్ మైదానం నెలకొల్పాన్న ఆశయం తీరింది. స్థానిక ఆటగాళ్లను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో తమ గ్రామంలో నటరాజన్ క్రికెట్ గ్రౌండ్(ఎన్సీజీ) స్థాపించినట్లు నటరాజన్ సోషల్ మీడియా వేదికగా వెల్లడించాడు. ఈ మేరకు... ‘‘సకల సౌకర్యాలతో మా గ్రామంలో కొత్త క్రికెట్ గ్రౌండ్... నటరాజన్ క్రికెట్ గ్రౌండ్(ఎన్సీజీ).. నా కల నెరవేరింది. గతేడాది డిసెంబరులో టీమిండియా తరఫున అరంగేట్రం చేశాను. ఈ ఏడాది డిసెంబరులో క్రికెట్ గ్రౌండ్ ఏర్పాటు.. ఆ దేవుడికి ఎల్లప్పుడూ కృతజ్ఞుడినై ఉంటాను’’ అని నటరాజన్ ట్వీట్ చేశాడు. కాగా గతేడాది టీమిండియా ఆస్ట్రేలియా పర్యటనలో భాగంగా నెట్‌బౌలర్‌గా ఎంపికైన నటరాజన్... ఆ టూర్లోనే ఏకంగా మూడు ఫార్మాట్లలో అరంగేట్రం చేశాడు. ఇక ఇప్పటి వరకు ఒక టెస్టు, రెండు వన్డేలు, 4 టీ20 మ్యాచ్‌లలో నటరాజన్ 13 వికెట్లు పడగొట్టాడు. కాగా తమిళనాడులోని సేలం సమీపంలో గల చిన్నపంపట్టి గ్రామానికి చెందిన నటరాజన్ 1991లో నిరుపేద కుటుంబంలో జన్మించాడు. అతడి తండ్రి చీరల తయారీ కర్మాగారంలో రోజూవారీ కూలీ. తల్లి రోడ్డుపక్కన చిరుతిళ్లు అమ్ముతూ కుటుంబ పోషణలో తన వంతు సాయం అందించేవారు. ఐదుగురు సంతానంలో పెద్దవాడైన నటరాజన్ కుటుంబానికి చేదోడువాదోడుగా ఉంటూనే క్రికెటర్ కావాలని చిన్ననాటి నుంచి కలలు కనేవాడు. పేదరికం వెక్కిరిస్తున్నా క్రికెట్ మీద ఉన్న ప్రేమను చంపుకోలేక, 20 ఏళ్లు వచ్చేదాకా టెన్నిస్ బాల్తోనే ప్రాక్టీసు చేశాడు. జయప్రకాశ్ అనే వ్యక్తి అండతో అంచెలంచెలుగా ఎదుగుతూ.. టీమిండియా క్రికెటర్ స్థాయికి ఎదిగాడు. మూలాలను మర్చిపోకుండా తనలా పేదరికం కారణంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఔత్సాహిక క్రికెటర్లను ప్రోత్సహించే విధంగా ముందుకు సాగుతున్నాడు. చదవండి: India Tour of South Africa: దక్షిణాఫ్రికాకు బయల్దేరిన టీమిండియా.. ఈసారైనా కల నెరవేరేనా? Happy to Announce that am setting up a new cricket ground with all the facilities in my village, Will be named as *NATARAJAN CRICKET GROUND(NCG)❤️ * #DreamsDoComeTrue🎈Last year December I Made my debut for India, This year (December) am setting up a cricket ground💥❤️ #ThankGod pic.twitter.com/OdCO7AeEsZ — Natarajan (@Natarajan_91) December 15, 2021 -
ఘోర రోడ్డు ప్రమాదం.. మహిళా డాక్టర్ సహా ముగ్గురి దుర్మరణం
సేలం (చెన్నై) : లారీని కారు ఢీకొన్న ప్రమాదంలో మహిళా డాక్టర్ సహా ముగ్గురు దుర్మణం చెందారు. ఈ ఘటన గురువారం రాత్రి మెచ్చేరిలో చోటుచేసుకుంది. సేలం జిల్లా మెచ్చేరి సమీపంలోని ఉడయనూర్‌కు చెందిన ఎం.దేవనాథన్ (53) ప్రైవేటు సంస్థ మేనేజర్. ఈయన భార్య ఇంద్రాణి (51) వనవాసి ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో డాక్టర్‌గా పని చేస్తున్నారు. గురువారం రాత్రి కోవై నుంచి కారులో మేట్టూర్‌కు వస్తున్నారు. వీరితో పాటు దేవనాథన్‌తో పని చేస్తున్న ఉద్యోగి ఆర్.సత్యశీలన్ (24) కూడా ఉన్నారు. రాత్రి 10.30 గంటలకు భవాని–మేట్టూర్ సాలై మార్గంలోని కాట్టప్పనల్లూర్ మలుపు వద్ద ఎదురుగా వచ్చిన లారీని కారు ఢీకొంది. ఈ ప్రమాదంలో కారులోని ముగ్గురూ అక్కడికక్కడే మృతిచెందారు. భవాని పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని కారులో చిక్కుకున్న మృతదేహాలను అతి కష్టంపై బయటకు తీసుకొచ్చారు. కేసు నమోదు చేసి విచారిణ చేస్తున్నారు. -
భర్త మరణించిన ఒక్కరోజు వ్యవధిలోనే భార్య కూడా
సేలం: వృద్ధాప్యం వల్ల భర్త మృతి చెందడంతో వృద్ధురాలు ఆత్మహత్య చేసుకుని మృతి చెందిన ఘటన గురువారం సేలంలో చోటు చేసుకుంది. సేలం పాత సూరమంగళం వెల్లై కవునర్ వీధికి చెందిన వృద్ధుడు పెరియన్నన్ (98). ఇతని భార్య అన్నమ్మ (90). వీరికి గణేశన్, సుందరం, రాము అనే ముగ్గురు కుమారులు, కుమార్తె కలైసెల్వి ఉన్నారు. వీరిలో గణేశన్, సుందరానికి మాత్రమే వివాహం అయ్యింది. రాము, కలై సెల్విలకు వివాహం చేసుకోలేదు. అయితే, ముగ్గురు కుమారులు, కుమార్తె గత కొన్నేళ్ల క్రితం మృతి చెందారు. గణేశన్, సుందరం వారివారి కుటుంబాలతో వేరు వేరుగా జీవిస్తూ వస్తున్నారు. దీంతో పెరియన్నన్, అన్నమ్మాల్ తోటలోని ఇంట్లో విడిగా నివసిస్తూ వచ్చారు. ఇక్కడ పొలం పండిస్తూ, పశువులను మేపుతూ పాలు విక్రయిస్తూ జీవిస్తున్నారు. ఈ స్థితిలో గత కొన్ని నెలలుగా పెరియన్నన్ అనారోగ్యానికి గురై మంచం పట్టాడు. ఆయనకు అన్నమ్మాల్ సేవలందించారు. ఈ స్థితిలో బుధవారం రాత్రి పెరియన్నన్ మృతి చెందాడు. రాత్రంతా భర్త పెరియన్నన్ మృతదేహం వద్ద ఒంటరిగా ఏడుస్తూ కూర్చున్న అన్నమ్మాల్ తీవ్ర ఆవేదనతో గురువారం వేకువజామున ఇంట్లోని దూలానికి ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. గురువారం ఉదయం ఎంత సేపటికి అన్నమ్మాల్ బయటకు రాకపోవడంతో ఇరుగు పొరు గు వారు వెళ్లి చూడగా పెరియన్నన్ మంచంపై శవంగాను, దూలానికి అన్నమ్మాల్ మృతదేహంగాను వేలాడుతుండడం చూసి సూరమంగళం పోలీసులకు సమాచారమిచ్చారు. వారు అన్నమ్మాల్ మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం సేలం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పెరియన్నన్ మృతదేహాన్ని బంధువులకు అప్పగించారు. -
భార్య భర్తల మధ్య గొడవ.. మామపై లారీ ఎక్కించి..
సాక్షి, సేలం(తమిళనాడు): భార్యభర్తల మధ్య గొడవకు బంధువు బలయ్యాడు. వివరాలు.. సేలం గాంధీనగర్ చోలపల్లానికి చెందిన సుబ్రమణి (32) లారీ డ్రైవర్. భార్య జీవిత. ఇద్దరి మధ్య మనస్పర్థలు రావడంతో జీవిత పుట్టింటికి వెళ్లింది. ఆదివారం రాత్రి సుబ్రమణి అత్తారింటికి వెళ్లి భార్యను కాపురానికి రావాలని కోరాడు. అదే సమయంలో ఇద్దరి మధ్య వాగ్వాదం ఏర్పడింది. ఆగ్రహించిన సుబ్రమణి కంటైనర్ లారీతో మామను గుద్దడానికి యత్నించాడు. ఆయన్ను తప్పించే ప్రయత్నంలో జీవిత అత్త కుమారుడు జీవా (26)పై లారీ ఎక్కింది. తీవ్రంగా గాయపడిన జీవాను సేలం ప్రభుత్వాస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతిచెందాడు. స్థానికు లు సుబ్రమణికి దేహశుద్ధి చేశారు. దీంతో అదే ఆస్పత్రిలో చేరాడు. పోలీసులు కేసు విచారణ చేస్తున్నారు. -
మమతా బెనర్జీ, సోషలిజం పెళ్లి చేసుకుంటున్నారు
రేపు ఆ పెళ్లి మంటపంలో వామపక్ష వాదాలన్నీ మనుషుల రూపంలో తిరగనున్నాయి. అవును. మమతా బెనర్జీ అనే అమ్మాయిని సోషలిజం అనే అబ్బాయి రేపు పెళ్లి చేసుకుంటున్నాడు. కమ్యూనిజం, లెనినిజం అనే ఇద్దరు బావగార్లు ఈ పెళ్లికి పెద్దలు. ‘మార్క్సిజం’ అనే పేరున్న బుజ్జి మనవడు కూడా ఈ పెళ్లిలో హల్చల్ చేయనున్నాడు. తమిళనాడు సేలంలో జరగనున్న ఈ పెళ్లి భారీగా వార్తల్లో ఉంది. ‘మా ఇంట్లో ఇప్పటి వరకూ ఆడపిల్ల పుట్టలేదు. పుడితే ‘క్యూబాయిజం’ అని పేరు పెట్టడానికి రెడీగా ఉన్నా’ అని అంటాడు మోహన్. భుజం పై ఎర్ర కండువా వేసుకొని రేపు (జూన్ 13)న తన ఇంట జరగనున్న పెళ్లి పనుల హడావిడిలో ఉంటూనే అతడు పత్రికల వారికి టెలిఫోన్ ఇంటర్వ్యూలు ఇస్తున్నాడు. ఏంటి విశేషం అంటే? అతని ఇంట్లో ఆ పేర్లే విశేషం. ముగ్గురు కొడుకులు తమిళనాడు సేలంలో నివాసం ఉండే మోహన్ ఆ జిల్లా సిపిఐ సమితి కార్యదర్శి. ‘నేనే కాదు మా ఇళ్లల్లో నేను నివాసం ఉండే చోట మేమందరం దాదాపు 70 ఏళ్లుగా కమ్యూనిస్టులం’ అంటాడు మోహన్. ఇతనికి ముగ్గురు కొడుకులు. వాళ్ల పేర్లు కమ్యూనిజం, లెనినిజం, సోషలిజం అని పెట్టాడు. ‘1990ల కాలంలో సోవియెట్ కుప్పకూలడం నాకు బాధ కలిగించింది. కమ్యూనిజం అమలు విఫలమైందేమోగాని సిద్ధాంతంగా అదెప్పుడూ విఫలం కాలేదు. పెళ్లికాక ముందు నుంచే నేను గట్టిగా అనుకున్నాను నా పిల్లలకు వామపక్ష పేర్లు పెట్టాలని. అలాగే పెట్టాను’ అంటాడు మోహన్. ‘మా ఇంట్లోనే కాదు... సేలంలో మేము నివాసం ఉన్నచోట చెకోస్లావేకియా, వియత్నాం వంటి పేర్లున్న మనుషులు కనిపిస్తారు. పెరియార్ రష్యా వెళ్లి వచ్చాక తన పిల్లలకు మాస్కో, రష్యా అనే పేర్లు పెట్టడం కూడా ఒక స్ఫూర్తే’ అంటాడు మోహన్. మమతా బెనర్జీతో పెళ్లి సేలంలో వామపక్ష అభిమానులు నివాసం ఉన్న చోటే కాంగ్రెస్ అభిమానుల నివాసాలు కూడా ఉన్నాయి. అలాంటి ఒక కాంగ్రెస్ అభిమాని కుమార్తెనే ఇప్పుడు మోహన్ తన కోడలిగా చేసుకోబోతున్నాడు. ఆ అమ్మాయి పేరు మమతా బెనర్జీ. ‘ఈ పెళ్లికి సిపిఎం రాష్ట్ర కార్యదర్శి ముత్తరాసన్, అదే పార్టీ ఉపకార్యదర్శి– పార్లమెంటు సభ్యుడు అయిన సుబ్బరాయన్ హాజరవుతున్నారు’ అని సంతోషంగా చెప్పాడు మోహన్. అతని పెద్దకొడుకు కమ్యూనిజంకు పెళ్లయ్యింది. కొడుకు పుట్టాడు. వాడి పేరు మార్క్సిజం. ‘నా కొడుకులు వాళ్లకు పెట్టిన పేర్ల వల్ల ఎప్పుడూ ఇబ్బంది పడలేదు. పైగా ప్రత్యేక గుర్తింపు పొందారు. నా పెద్దకొడుకు లాయర్. వాడి పేరు కమ్యూనిజం కావడంతో జడ్జిలు ప్రత్యేకంగా చూస్తారు’ అన్నాడు మోహన్. ‘నా ముగ్గురు పిల్లల్ని కమ్యూనిస్టు భావాలతోనే పెంచాను. వాళ్లకు ప్రజల పక్షం ఉండటం తెలుసు’ అన్నాడు మోహన్. సేలంలో జరగనున్న ఈ పెళ్లి కార్డు బయటకు రాగానే సోషల్ మీడియాలో హోరెత్తింది. ఆ పెళ్లి కార్డులో ఉన్న పేర్లకు ఏదో ఒక మేరకు ఆదర్శం, ధిక్కారం ఉన్నాయి. అందుకే ఆ హోరు. శతకోటి మందిలో ఒకరుగా ఉండటం కంటే భిన్నంగా, ఆదర్శంగా ఉండటమూ లేదా ఆదర్శభావాన్ని కలిగి ఉండటం ఎప్పుడూ సమాజంలో గుర్తింపు కలిగే పనే. అందుకే ఈ పెళ్లికి అంత గుర్తింపు. అన్నట్టు ఈ పెళ్లిలో అక్షింతలు ఉండకపోవచ్చు. షేక్ హ్యాండ్ ఇచ్చి శుభాభినందనలు తెలపడమే. విష్ యూ హ్యాపీ మేరీడ్ లైఫ్ మమతా బెనర్జీ అండ్ సోషలిజం. -
కంటైనర్‌లో రూ.36 కోట్ల బంగారం..
సాక్షి, చెన్నై: ఎన్నికల తనిఖీలు విస్తృతంగా సాగుతున్నాయి. సేలం సమీపంలో ఓ కంటైనర్‌లో రూ.36 కోట్ల విలువగల బంగారు ఆభరణాలను అధికారులు సీజ్ చేశారు. ఎన్నికల్లో నగదు బట్వాడా అడ్డుకట్ట లక్ష్యంగా విస్తృత తనిఖీలు సాగుతున్నాయి. ఈ పరిస్థితుల్లో శుక్రవారం అర్ధరాత్రి సేలం వైపుగా వచ్చిన ఓ మినీ కంటైనర్‌ను అధికారులు తనిఖీ చేశారు. అందులో రూ.36.5 కోట్ల విలువ చేసే బంగారు ఆభరణాలు బయటపడ్డాయి. సరైన రసీదులు లేని దృష్ట్యా, ఆ మినీ కంటైనర్‌ను భద్రత నడుమ గంగవళ్లి తహసీల్దార్ కార్యాలయం వద్ద ఉంచారు. గిండి నుంచి సేలంలోని నగల షోరూమ్‌కు ఆభరణాలు తరలిస్తున్నట్టు విచారణలో తేలింది. ఎవరి సొమ్మో.. తంజావూరులోని నగరాభివృద్ధి శాఖకు చెందిన ఓ అధికారి లాకర్లో రూ.3.39 కోట్ల నగదు, రూ. 174 సవర్ల నగలు ఉన్నట్టు ఏసీబీకి సమాచారం అందింది. దీంతో శుక్రవారం రాత్రి ఏసీబీ వర్గాలు ఆ లాకర్‌ను తెరిచి చూడగా, నగదు, నగలు బయటపడ్డాయి. చెన్నై తిరుప్పోరూర్– కేలంబాక్కం మార్గంలో ఓ వాహనంలో రూ. 24 లక్షలు అధికారులు పట్టుకున్నారు. అది ఏటీఎంకు తరలిస్తున్న నగదుగా వివరణ ఇచ్చుకున్నా ఫలితం శూన్యం. కోవిల్ పట్టిలో మంత్రి కడంబూరురాజు వాహనాన్ని సైతం ఫ్లయింగ్ స్క్వాడ్ తనిఖీలు చేసింది. స్వతంత్ర అభ్యర్థులా మజాకా.. చెన్నై తిరువొత్తియూరు నుంచి హైకోర్టు న్యాయవాది జాకీర్‌హుస్సేన్ (47) స్వతంత్ర అభ్యర్థిగా శుక్రవారం నామినేషన్ దాఖలు చేశారు. నగల డిపాజిట్‌కు సంబంధించి ధర్నా చేసి ఎన్నికల అధికారి దేవేంద్రన్‌కు ఆయన ముచ్చెమటలు పట్టించారు. విల్లివాక్కంలో స్వతంత్ర అభ్యర్థి కంద స్వామి రూ. పది వేల నగదుకుగాను 18 కేజీల చిల్లరను అధికారులకు సమర్పించి ముచ్చెమటలు పట్టించడం గమనార్హం. -
వివాహేతర సంబంధం.. చెరువులో శవాలుగా
టీ.నగర్: సేలం సమీపంలో ఆదివారం వివాహేతర జంట ఆత్మహత్య చేసుకుంది.సేలం సమీపం ఎస్.పాపరపట్టి చెరువులో ఆదివారం మహిళ, పురుషుడి మృతదేహాలు తేలుతూ కనిపించాయి. పోలీసుల విచారణలో ఇరువురూ సేలం జిల్లా, మకుటంజావడి సమీపంగల కూడలూరు గ్రామానికి చెందిన శేఖర్ (26), నామక్కల్ జిల్లా తిరుచెంగోడు ప్రాంతానికి చెందిన గోపాల్ భార్య గోమతి (30) అని తెలిసింది. వీరిద్దరు చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్నట్టు తెలిసింది. శేఖర్‌కు ఇదివరకే సుమతి అనే మహిళతో వివాహమై ఇద్దరు పిల్లలున్నారు. పెట్రోలు బంకులో ఉద్యోగిగా పనిచేస్తూ వచ్చాడు. ఆ సమయంలో గోమతితో పరిచయం ఏర్పడింది. దీంతో ఇరు కుటుంబాలలో గొడవలు చెలరేగడంతో వీరు మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకున్నట్లు తెలిసింది. చదవండి: నగ్న వీడియోలు: వ్యాపారవేత్తను ఇంటికి పిలిచి.. -
మహిళా కాటికాపరికి శ్మశానంలో విశ్రాంతి గది
సేలం : శ్మశాన వాటికలో మృతదేహాలను ఖననం చేస్తూ నిలువ నీడలేని మహిళా కాటికాపరికి సామాజిక కార్యకర్తలు విశ్రాంతి గదిని నిర్మించి ఇచ్చి తమ ఔదార్యం చాటుకున్నారు. సేలంలోని టీవీఎస్ ప్రాంతంలోని శ్మశానవాటికలో సీత కాటికాపరిగా పనిచేస్తోంది. ఆమె కుటుంబసమస్యలు, పేదరికం, తల్లిదండ్రుల మరణం కారణంగా చిన్నతనం నుంచే మృతదేహాలను పూడ్చిపెట్టే పనిచేస్తోంది. నిత్యం అక్కడికి వచ్చే శవాలను ఒంటరిగా నిలబడి సమాధులు తవ్వడం, ఆయా శవాల తాలూకు చెందిన వారి సంప్రదాయలను పాటించడం, తర్వాత ఖననం చేస్తూ వస్తోంది. అయితే ఆమె విశ్రాంతి తీసుకోవడానికి గది కూడా లేకపోవడంతో ఇబ్బందులు ఎదుర్కొంటోంది. ఇది చూసి ఆ ప్రాంతానికి చెందిన కొందరు సామాజిక సేవకులు కలిసి ఆమెకు విశ్రాంతి గదిని నిర్మించారు. ఆ గదిని గురువారం సీతకు అప్పగించారు. ఈ సందర్భంగా వారందరికి సీత కృతజ్ఞతలు తెలుపుకుంది. -
షార్ట్ సర్క్యూట్‌తో రూ. 6 లక్షలు బుగ్గిపాలు
సాక్షి, సేలం: విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా జరిగిన అగ్ని ప్రమాదంలో రూ. 6 లక్షల నగదు బుగ్గిపాలైంది. ఈరోడ్ జిల్లా గోపిచెట్టి పాళ్యం, భారతి వీధికి చెందిన వ్యక్తి మొహ్మద్ ఇలియాస్. ఈయన సమీపంలోని మార్కెట్ ప్రాంతంలో కిరాణా దుకాణం నడుపుతున్నాడు. ఈయనకు 13 ఏళ్ల కుమారుడు ఉన్నాడు. ఎప్పటిలానే మంగళవారం ఉదయం కుమారుడిని ఇంటిలో ఉంచి భార్య, భర్త ఇద్దరూ వ్యాపారానికి వెళ్లారు. ఆ సమయంలో ఇంటి నుంచి కేకలు వినిపిండంతో స్థానికులు తలుపు తెరచి చూడగా ఇంట్లో అగ్ని ప్రమాదం జరిగింది. మొహ్మద్ ఇలియాస్ కుమారుడిని రక్షించారు. సమాచారం అందుకున్న గోపిచెట్టి పాళ్యం అగ్ని మాపక సిబ్బంది గంట పాటు పోరాడి మంటలను అదుపు చేశారు. ఈ ప్రమాదంలో రూ. 6 లక్షల నగదు, నగలు మొత్తం రూ. 10 లక్షల ఆస్తి నష్టం జరిగినట్లు బాధితుడు వాపోయాడు. పోలీసుల విచారణలో ఏసీ పేలిపోయి అగ్ని ప్రమాదం సంభవించినట్టు తెలిసింది. చదవండి: ఆయనే లేకుంటే రక్తం ఏరులై పారేది.. -
ఆయిల్ ట్యాంక్ పగలడంతో..
చెన్నై : తమిళనాడులో ఓ ట్యాంకర్ ప్రమాదానికి గురవడంతో.. వేల లీటర్ల రిఫైండ్ ఆయిల్ రోడ్డుపాలయింది. చెన్నై నుండి సేలం జిల్లా అత్తూర్‌కు ఆయిల్ లోడ్‌తో వెళ్తున్న ట్యాంకర్ కామరాజనగర్లో ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో ఆయిల్ ట్యాంక్ పగిలిపోయింది. దీంతో వేలలీటర్ల ఆయిల్ వృథాగా పోయింది. స్థానికులు గిన్నెలు, బిందెలతో ఆయిల్‌ను పట్టుకునేందుకు పోటీ పడ్డారు. -
ప్రసవం కోసం 10 కి.మీ నడక
తమిళనాడు, సేలం: పురిటి నొప్పులతో అల్లాడుతున్న మహిళను గ్రామస్తులు డోలిలో ఆరు కిలో మీటర్ల దూరం నడుచుకుంటూ తీసుకెళ్లారు. తర్వాత లారీలో ఆస్పత్రికి తరలిస్తుండగా అందులోనే పండంటి మగబిడ్డకు జన్మనిచ్చిన సంఘటన మంగళవారం ఉదయం అందియూర్ కొండ ప్రాంతంలో చోటుచేసుకుంది. ఈ రోడ్ జిల్లా అందియూర్‌లో బర్గూర్ వద్ద కొండ ప్రాంతం ఉంది. ఈ కొండపై సుండాపూర్ గ్రామ ఉంది. ఈ గ్రామానికి రోడ్డు సౌకర్యం లేదు. బస్సు కూడా లేదు. ఈ గ్రామం నుంచి బయటకు వెళ్లాలంటే 10 కిలోమీటర్ల దూరం కాలినడకన తామరైకరై వరకు నడిచి వచ్చి, తర్వాత అక్కడి నుంచి వాహనాల ద్వారా వెళ్లాల్సి ఉంది. ఈ స్థితిలో సుండాపూర్ గ్రామానికి చెందిన మాదేశ్, అతని భార్య కుమారి (23) ఇద్దరు కూలీ కార్మికులు. వీరికి ఇది వరకే ఐదేళ్ల కుమారుడు ఉన్నాడు. మళ్లీ గర్భవతి అయిన కుమారికి సోమవారం ఉదయం పురిటి నొప్పులు ఏర్పడ్డాయి. బస్సు సౌకర్యం లేకపోవడంతో నొప్పులతో అల్లాడుతున్న ఆమెను డోలి కట్టి అందులో ఆస్పత్రికి తరలించడానికి గ్రామస్తులు సిద్ధమయ్యారు. ఇప్పటికే రెండు మూడు రోజులుగా భారీ వర్షాలతో మట్టి రోడ్డు అతలాకుతలంగా ఉంది. అయినా అధిక శ్రమకోర్చి తీసుకువచ్చారు. ఆరు కిలో మీటర్లు దూరం నడచి రాగా, అప్పుడు అక్కడికి వచ్చిన ఒక మినీ లారీలో కుమారిని ఎక్కించారు. నొప్పులు ఎక్కువ కావడంతో మాదేశ్తల్లి కన్నియమ్మాల్ తన కోడలు కుమారికి ప్రసవం చేసింది. కుమారికి పండంటి మగ బిడ్డ జన్మించాడు. తర్వాత అదే లారీలోనే తామరైకరై ప్రాథమిక వైద్యశాలకు తరలించారు. తల్లీబిడ్డ క్షేమంగా ఉన్నారు. ఇకనైనా అధికారులు తాము మనుషులమేనని, తమ అవసరాలను గుర్తించి గ్రామానికి రోడ్డు సౌకర్యం, బస్సు సౌకర్యాలు కల్పించాలని గ్రామస్తులు వేడుకుంటున్నారు. -
అమ్మో పులి..
చెన్నై, సేలం: గ్రామంలోకి చొరబడిన ఒక పులి మేకను అడవిలోకి ఊడ్చుకెళ్లిన సంఘటన గురువారం గ్రామస్తులను భయాందోళనకు గురిచేసింది. ఈరోడ్ జిల్లా భవాని సాగర్ సమీపంలో పసువంపాళయం గ్రామానికి చెందిన సుబ్రమణి (50) కార్మికుడు. ఇతను అయిదు మేకలను పెంచుతున్నాడు. వీటిని రోజూ మేత కోసం సమీపంలోని అడవిలోకి తీసుకెళ్లి, సాయంత్రం తిరిగి ఇంటికి తీసుకు వచ్చి కట్టేస్తాడు. ఎప్పటిలానే బుధవారం ఇంటికి వచ్చి మేకలను కట్టేసి నిద్రించాడు. గురువారం వేకువజామున అకస్మాత్తుగా మేకలు పెద్దగా అరుస్తున్నట్టు వినిపించింది. సుబ్రమణితో పాటు ఇరుగుపొరుగు వారు కూడా మేల్కొన్నారు. వారంతా అక్కడికి వచ్చి చూడగా మేకలను ఒక పులి తింటూ కనిపించింది. జనం అరవడంతో పులి ఒక మేక మెడను నోటికి కరుచుకుని అడవిలోకి పరారైంది. అక్కడ మరో మేక చనిపోగా, ఇతర మేకలు గాయాలయ్యాయి. ఈ సంఘటన చుట్టు ప్రాంతాలకు దావానంలా వ్యాపించింది. ఆ గ్రామాలకు చెందిన వారు గురువారం ఉదయం అక్కడికి చేరుకున్నారు. దీనిపై గ్రామస్తులు భవానిసాగర్ పోలీసులకు సమాచారం ఇచ్చారు. పులిని పట్టుకోవాలని డిమాండ్ చేశారు. పోలీసులు ఆదిశగా చర్యలు తీసుకుంటున్నారు. -
కన్నీటి పర్యంతమైన మహిళా కలెక్టర్!
సాక్షి, చెన్నై : సేలం జిల్లా ప్రజల మనసులో సుస్థిర స్థానం సంపాదించుకున్న జిల్లా కలెక్టర్ రోహిణీ బాజీ భగారే బదిలీ అయ్యారు. రెండేళ్ల క్రితం తొలి మహిళా కలెక్టర్‌గా సేలంకు వచ్చిన రోహిణీ.. రైతులకు పలు పథకాలను ప్రకటించడంతో పాటుగా ప్రజలకు విశిష్ట సేవలు అందించారు. 2017లో విధులు చేపట్టిన వెంటనే తొలి సమావేశం రైతుల వినతుల స్వీకరణ సమావేశం నిర్వహించారు. అదే విధంగా 20 నెలల పాటు అక్కడ విధులు నిర్వహించిన రోహిణీ రైతులు, దివ్యాంగులు, విద్యార్థులు, మహిళలు, శిశువులు సహా అన్ని వర్గాల వారికి సేవలు అందించి వారి మనస్సులో మంచి స్థానం సంపాదించుకున్నారు. కలెక్టర్‌గా రోహిణీ చేపట్టిన పలు పథకాలు, తీసుకున్న ఆకస్మిక నిర్ణయాలతో రాష్ట్ర వ్యాప్తంగా ఆమె పేరు సంచలనంగా మారింది. సామాజిక మాధ్యమాల్లో ఆమె పేరు మారుమ్రోగింది. ఈ క్రమంలో గురువారం రాత్రి సేలంతో పాటు నాలుగు జిల్లాల కలెక్టర్లను బదిలీ చేస్తు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇదిలా ఉండగా... శుక్రవారం సేలంలో జరిగిన రైతుల గ్రీవెన్స్‌డే కార్యక్రమంలో కలెక్టర్ రోహిణీ పాల్గొన్నారు. అప్పుడు పలువురు రైతులు రోహిణీకి శాలువలు కప్పి మనసారా అభినందించారు. ఆమె చేసిన సేవలకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ నేపథ్యంలో కలెక్టర్ రోహిణీ మాట్లాడుతూ.. గతంలో తనకు ఎన్నో సందర్భాల్లో ఎంతో మంది శాలువలు కప్పారని, అయితే ఇప్పుడు రైతులు కప్పిన శాలువా తనకెంతో గొప్పగా భావిస్తున్నట్టు తెలిపారు. తన వల్ల వీలైనంత మేరకు రైతులకు సేవ చేశానని ఆమె తెలిపారు. తాను సేలంకు వచ్చినప్పుడు తొలి సమావేశం రైతులదేనని, ఇప్పుడు వెళుతున్న సమయంలో చివరి సమావేశం రైతులదేనని గుర్తు చేసుకున్నారు. కలెక్టరేట్లో ఒక వైపు రైతులు, ప్రజలు కలెక్టర్‌ను ప్రశంసలతో ముంచేస్తుంటే, మరో వైపు కన్నీటి పర్యంతమైన కలెక్టర్ రోహిణీ రైతులకు వీడ్కోలు పలకడం ఒక్కసారిగా నిశ్శబ్దం అలముకుంది. కాగా, రోహిణీ స్థానంలో వేలూరు జిల్లా కలెక్టర్ రామన్ సేలంకు బదలి అయ్యారని అధికారులు వెల్లడించారు. అన్నట్లు రోహిణి కూడా రైతుబిడ్డే. -
అత్తారింటికి వెళుతూ.. అనంత లోకాలకు..
సేలం: అత్తారింటికి కారులో వెళుతుండగా జరిగిన రోడ్డు ప్రమాదంలో తండ్రి, పెద్దకూతురు మృతిచెందారు. ప్రమాదంలో తల్లీ, చిన్నకూతురు గాయపడ్డారు. ఈ సంఘటన ఆత్తూరు సమీపంలో శనివారం జరిగింది. వివరాలు.. చెన్నై ముగప్పేర్ ప్రాంతానికి చెందిన పార్తిబన్ (49) దుబాయ్‌లో పనిచేస్తున్నాడు. గతవారం క్రితమే సెలవులకు వచ్చాడు. పార్తిబన్‌కు భార్య కవిత (42), పెద్ద కుమార్తె దర్శిని (19), చిన్న కుమార్తె దీక్ష (14). కవిత, ఇద్దరు కుమార్తెలతో చెన్నై నుంచి సేలంలో ఉన్న అత్తగారింటికి కారులో బయలుదేరారు. కారును పార్తిబన్ నడిపాడు. కారు శనివారం మధ్యాహ్నం 2.30 గంటల సమయంలో సేలం జిల్లా ఆత్తూరు సమీపంలోని పులుక్కానూర్ వద్ద వస్తోంది. అప్పుడు జాతీయ రహదారిపై ఉన్న వంతెను ఎక్కబోయి అదుపు తప్పి గోడను ఢీకొంది. దీంతో కారులో మంటలు చెలరేగాయి. సమాచారంతో ఆత్తూరు అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు అక్కడికి చేరుకున్నారు. అప్పటికే పార్తిబన్, పెద్ద కుమార్తే దర్శిని సంఘటన స్థలంలోనే మృతిచెందారు. తీవ్రంగా గాయపడిన కవిత, దీక్షలను సేలం జీహెచ్‌కు తరలించారు. అనంతరం పోలీసులు మృత దేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆత్తూరు జీహెచ్‌కు తరలించారు. కేసు నమోదు చేసుకుని విచారణ చేస్తున్నారు. -
ఘోర రోడ్డు ప్రమాదం.. 8మంది మృతి
సాక్షి, చెన్నై: తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. సేలం సమీపంలో మామందూరు వద్ద బెంగళూరు జాతీయ రహదారిపై రెండు బస్సులు ఢీకొన్నాయి. ఈ ఘటనలో 8 మంది మృతి చెందగా, 30 మందికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను వెంటనే సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. బెంగళూరు జాతీయ రహదారిపై ఎదురుగా వస్తున్న లారీని తప్పించబోవడంతో ఈ ప్రమాదం జరిగింది. మృతుల్లో నలుగురు కేరళ కు చెందినవారు, ముగ్గురు కర్ణాటకకు,ఒక్కరు తమిళనాడుకు చెందిన వారు ఉన్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. -
తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం
-
మరోసారి తమిళనాట రణరంగం ?
-
ఎనిమిది మందిని అడ్డంగా నరుకుతా..
తమిళనాడు, పెరంబూరు: సేలం–చెన్నై మధ్య 8వే ఏర్పాటు చేస్తే ఎనిమిది మందిని అడ్డంగా నరుకుతానని నటుడు మన్సూర్ అలీఖాన్ హెచ్చరించారు. ఆయన గురువారం సెలం విమానాశ్రయం విస్తరణ కారణంగా బాధింపునకు గురవుతున్న వ్యవసాయ భూములను పర్యవేక్షించడానికి కాడయాంపట్టికి వెళ్లారు. పొట్టియపురం, తంబిపాడి, సికణం పాడి గ్రామస్తులను కలిసి మద్దతు తెలిపారు. అనంతరం మన్సూర్‌అలీఖాన్ విలేకరులతో మాట్లాడుతూ సేలంలో ఇప్పటికే విమానాశ్రయం ఉందని, అక్కడి ప్రజలు విమానయానం చేసేందుకు ఆసక్తి చూపడం లేదన్నారు. ఇక్కడ విమాన పరికరాలను తయారు చేయడానికి విమానాశ్రయాలు నెలకొల్పుతున్నారా? లేక పారిశ్రామికవేత్తల కోసం ఏర్పాటు చేస్తున్నారా? అని ప్రశ్నించారు. చెన్నై–సేలం మధ్య 8వే ఏర్పాటు చేస్తే ఎనిమిది మందిని అడ్డంగా నరుకుతానని నటుడు మన్సూర్ అలీఖాన్ ఆవేశపూరితంగా మాట్లాడారు. వనాలు, పంట భూములు, కొండలను కరిగించి రోడ్లను కార్పొరేట్ సంస్థల కోసం ఏర్పాటు చేయడం ఖండించదగ్గదని ఆయన వ్యాఖ్యానించారు. -
ప్రకృతి ఒడిలో పెళ్లి!
హంగుఆర్భాటాలను ఇష్టపడేవాళ్లు ఫంక్షన్ హాళ్లలో.. భాజాభజంత్రీల మధ్య ఘనంగా పెళ్లి చేసుకుంటారు. అలాంటప్పుడు ప్రకృతిని ఇష్టపడేవాళ్లు ప్రకృతి ఒడిలో కాకుండా వేరే చోట పెళ్లెలా చేసుకుంటారు...? అంటూ ప్రశ్నిస్తున్నాడు అరవింద్. అయితే అరవింద్ ఇలా ప్రశ్నించడాన్ని చాలామంది సమర్థిస్తున్నారు. అతని ‘మొక్క’వోని దీక్ష చూసి ముచ్చట పడుతున్నారు. ఇంతకీ అరవింద్ ఏం చేశాడో తెలుసా.. సేలం: నేచర్ లవర్స్ అయిన ఓ జంట వినూత్నంగా పెళ్లి చేసుకొని వార్తల్లోకెక్కింది. సరస్సు మధ్యలో తాము స్వయంగా ఏర్పాటుచేసుకున్న ఓ చిన్న లంకలో పెళ్లి చేసుకొని అందరి దృష్టిని తమవైపు తిప్పుకున్నారు. వీరిద్దరి పెళ్లి ప్రత్యేకంగా జరగడానికి ఓ కారణముంది. అదేంటంటే.. ఇద్దరూ ప్రకృతి ప్రేమికులే! పెళ్లి తర్వాత కూడా దంపతులిద్దరూ కలిసి మొక్కలను నాటారు. పెళ్లికి వచ్చిన వారితోనూ మొక్కలు నాటించారు. ఆ జంటే తమిళనాడు సేలం ప్రాంతానికి చెందిన పూవిళీ, అరవింద్. ధర్మపురికి చెందిన పూవిళికి చిన్నతనం నుంచి మొక్కలంటే ఇష్టం. ఏ మాత్రం అవకాశం వచ్చినా పచ్చని మొక్కల మధ్యే కాలక్షేపం చేసేది. ఆమెకు కొన్నాళ్లక్రితం అరవింద్ పరిచయమయ్యాడు. అతను పెద్దగా చదువుకోలేదు. కానీ సేలంలో 53 ఎకరాల మూకనేరి సరస్సును స్థానికులు కలుషితం చేస్తుంటే మరికొందరి యువకులతో కలిసి అడ్డుపడేవాడు. వీళ్లంతా కలిసి శుభ్రం చేస్తున్నా గ్రామస్థుల్లో మార్పు రాకపోవడంతో 2010 నుంచి ఈ సరస్సులో అక్కడక్కడా చిన్నచిన్న మట్టిలంకలను ఏర్పాటు చేసి మొక్కలను నాటడం ప్రారంభించాడు. ఈ ఆరేళ్లలో 46 దీవులను తయారుచేశాడు. ఇప్పటివరకూ ఆ దీవుల్లో 12 వేల మొక్కలు నాటారు. ఆ క్రమంలోనే పూవిళి, అరవింద్ మధ్య పరిచయం ఏర్పడింది. ఇద్దరూ పెళ్లిచేసుకోవాలని నిర్ణయించుకున్నారు. పెద్దలను ఒప్పించి ఆ సరస్సు మధ్యలోనే పెళ్లి చేసుకోవాలనుకున్నారు. సేలంలోని మూకనేరి సరస్సులో 47వ దీవిని రూపొందించి అందులోనే ఇద్దరూ ఒకటయ్యారు. తరవాత ఇద్దరూ మొక్కను నాటడమే కాదు, వాళ్లకు కానుకలుగా వచ్చిన ఎనభై రెండు వేల రూపాయల్ని ముకనేరి సరస్సు పరిరక్షణకు అందించారు. దాంతోపాటూ మరో వెయ్యి మొక్కల్ని నాటేందుకు సిద్ధమయ్యారు. అంతేనా.. పెళ్లికి వచ్చిన ప్రతి అతిథితోనూ తలా ఓ మొక్క నాటించారు. పెళ్లంతా అయ్యాక గ్రామంలో విందు ఏర్పాటు చేశారు. -
ప్రాణం తీసిన సెల్ఫీ సరదా..
సాక్షి, చెన్నై: సెల్ఫీ మోజుతో యువత ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. ప్రమాదకర ప్రదేశాల్లో సెల్ఫీలు దిగటానికి ఏమాత్రం వెనుకకాడటం లేదు. తాజాగా తమిళనాడులోని సేలం సమీపాన ఆదివారం కొండపై సెల్ఫీ తీసుకుంటూ లోయలో జారిపడి ఓ యువకుడు ప్రాణాలు కోల్పోయిన సంఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. సేలంలోని కిచ్చిపాళయం అప్పర్ వీధికి చెందిన గణేశన్(25) ప్రైవేటు సంస్థలో మార్కెటింగ్ మేనేజర్‌గా పనిచేస్తున్నాడు. ఆదివారం సెలవు దినం కావడంతో గణేశన్ తన స్నేహితులు రాజ్‌కుమార్ (21), అభిషేక్ (25), జగన్ (21)లతో ఊత్తుమలై కొండపై ఉన్న మురుగన్ ఆలయానికి వెళ్లాడు. అక్కడ దర్శనం ముగించుకుని కొండపై నుంచి సేలం నగరపు అందాలను తిలకించారు. అనంతరం ఒకరి తర్వాత మరొకరు సెల్‌ఫోన్‌తో ఫోటోలు తీసుకున్నారు. తర్వాత సమీపాన ఉన్న ఒక బండపై గణేశన్ నిలుచుని సెల్ఫీ తీసుకుంటున్నాడు. ఆ సమయంలో ప్రమాదవశాత్తూ కాలు జారి 50 అడుగుల లోయలో జారిపడ్డాడు. దీంతో తలపై తీవ్రగాయం తగిలి గణేశన్ అక్కడికక్కడే మృతిచెందాడు. పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. -
‘నిర్భయ’ ఘటనలో మరో కండక్టర్ అరెస్ట్
నిందితులు సెంట్రల్ జైలుకు తరలింపు చెన్నై: తమిళనాడు సేలం సమీపంలో బస్సులో విద్యార్థిని అత్యాచారానికి గురైన ఘటనలో మరో బస్ కండక్టర్ విజయన్ (22)ను పోలీసులు అరెస్టు చేశారు. నిందితులు నలుగురినీ పోలీసులు బుధవారం సేలం మహిళా ఫాస్ట్‌ట్రాక్ కోర్టులో హాజరుపరిచారు. అనంతరం సెంట్రల్ జైలుకి తరలించారు. వీరానం ప్రాంతానికి చెందిన విజయన్ పాత బస్టాండు నుంచి జంక్షన్ వరకు వెళ్లే బస్సులో కండక్టర్‌గా ఉన్నాడు. ఇతనికి బాలికతో పరిచయం ఉన్నట్లు సమాచారం. ముఖ్య నిందితుడిగా ఉన్న పెరుమాళ్‌కు బాలికను విజయనే పరిచయం చేసినట్లు పోలీసులు తెలిపారు. సేలం పేర్లాండ్స్ ప్రాంతానికి చెందిన 15 ఏళ్ల విద్యార్థినిపై సోమవారం రాత్రి 10 గంటల సమయంలో బస్సు డ్రైవర్ మణిమన్నన్ (33), రెండో డ్రైవర్ అధికారిపట్టి మురుగన్ (35), కండక్టర్ పెరుమాళ్ (22)లు బస్సులో అత్యాచారం జరిపిన విషయం తెలిసిందే. ఆ సమయంలో విద్యార్థిని కేకలతో స్థానికులు ముగ్గురికి దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. విద్యార్థినిని పోలీసులు సేలం ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్చి, వైద్య పరీక్షలు నిర్వహించారు. -
సేలం, నామక్కల్‌లో నేడే రీపోలింగ్
- అధికార పార్టీ అసంతృప్తి - రీపోలింగ్ అవసరం ఎందుకు వచ్చిందని ప్రశ్న చెన్నై, సాక్షి ప్రతినిధి: లోక్‌సభ ఎన్నికలకు సంబంధించి సేలం, నామక్కల్ నియోజకవర్గాల్లోని రెండు పోలింగ్ కేంద్రాల్లో శనివారం రీపోలింగ్ నిర్వహించనున్నారు. రాష్ట్రంలోని 39, పుదుచ్చేరిలోని ఒక లోక్‌సభ నియోజకవర్గానికి గత నెల 24వ తేదీన పోలింగ్ జరిగింది. పోలింగ్ ప్రశాంతంగా ముగిసిందని రాష్ట్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ ప్రవీణ్‌కుమార్ ప్రకటించారు. నాలుగు రోజుల తర్వాత రెండు పోలింగ్ కేంద్రాల్లో రీపోలింగ్ అనివార్యమైందని ప్రకటించారు. దీనిపై అధికార అన్నాడీఎంకే ఆగ్రహం, అనుమానం వ్యక్తం చేసింది. సజావుగా జరిగిందని నిర్ణయించిన తర్వాత రీపోలింగ్ అవసరం ఎందుకు వచ్చిందని ప్రశ్నించింది. ఈసీ మాత్రం తనపాటికి తాను రీపోలింగ్ ఏర్పాట్లు పూర్తి చేసింది. సేలం ఉత్తర లోక్‌సభ నియోజకవర్గ పరిధిలో సెంగలనై రోడ్డులోని మున్సిపల్ ప్రాథమిక పాఠశాలలోని పోలింగ్ బూత్ నెంబర్ 213లో ఈవీఎంలు మొరాయించాయని ఈసీ పేర్కొంది. అలాగే నామక్కల్ లోక్‌సభ నియోజకవర్గంలోని కొట్టపాలయం పంచాయతీ ప్రాథమిక పాఠశాలలో పోలింగ్ బూత్ నెంబరు 37లో పోలింగ్ సజావుగా పూర్తయి నా ఈవీఎంలను మూసివేయడంలో సాంకేతిక ఇబ్బందులు తలెత్తాయని వెల్లడించింది. దీంతో ఈ కేంద్రాల్లో రీపోలింగ్ అవసరమైందని ఈసీ పేర్కొం ది. రీపోలింగ్ కారణంగా అన్ని పార్టీల వారు మరోసారి ఎన్నికల ప్రచారంలో మునిగిపోయారు. శనివా రం ఉదయం 7 నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ నిర్వహించనున్నారు. పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటుచేశారు -
స్వాధీనం చేసుకున్న సొమ్ము నొక్కేసిన ఎస్ఐలు
చెన్నై : ఎన్నికల నేపథ్యంలో వాహనాలు తనిఖీ చేసే సందర్భంగా స్వాధీనం చేసుకున్న సొమ్మును ఇద్దరు ఎస్ఐలు స్వాహా చేశారు. వారిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఏర్కాడుకు చెందిన ఎం.కుప్పుస్వామి కారును సేలం కుప్పనూర్ చెక్‌పోస్టు వద్ద సోమవారం రాత్రి పోలీసులు ఆపారు. ఎన్నికల సందర్భంగా నియమితులైన ప్రత్యేక ఎస్ఐలు సుబ్రమణియన్, గోవిందన్ ఆ కారులో తనిఖీ చేశారు. కారు లోపల రెండు సంచుల్లో ఉన్న నగదును స్వాధీనం చేసుకున్నారు. ఆ నగదుకు సంబంధించి డాక్యుమెంట్లు లేకపోవడంతో సదరు సొమ్మును ఎన్నికల సహాయ అధికారి ముత్తురామలింగానికి అప్పగించారు. తాను 35 లక్షల రూపాయలు తెచ్చానని, ఇందులో 26.75 లక్షల రూపాయలు మాత్రమే ఉందంటూ బాధితుడు కుప్పుస్వామి ఎన్నికల అధికారికి ఫిర్యాదు చేశారు. సేలం డీఐజీ అమర్‌రాజా, ఎస్పీ శక్తివేల్ విచారించగా స్వాధీనం చేసుకున్న సొమ్ము నుంచి 8.25 లక్షల రూపాయలు ఇద్దరు ఎస్ఐలు నొక్కేసినట్లు తేలింది. దాంతో ఎస్ఐలను అరెస్ట్ చేసి జైలుకు తరలించారు.