కాటికాపరి సీత
సేలం : శ్మశాన వాటికలో మృతదేహాలను ఖననం చేస్తూ నిలువ నీడలేని మహిళా కాటికాపరికి సామాజిక కార్యకర్తలు విశ్రాంతి గదిని నిర్మించి ఇచ్చి తమ ఔదార్యం చాటుకున్నారు. సేలంలోని టీవీఎస్ ప్రాంతంలోని శ్మశానవాటికలో సీత కాటికాపరిగా పనిచేస్తోంది. ఆమె కుటుంబసమస్యలు, పేదరికం, తల్లిదండ్రుల మరణం కారణంగా చిన్నతనం నుంచే మృతదేహాలను పూడ్చిపెట్టే పనిచేస్తోంది. నిత్యం అక్కడికి వచ్చే శవాలను ఒంటరిగా నిలబడి సమాధులు తవ్వడం, ఆయా శవాల తాలూకు చెందిన వారి సంప్రదాయలను పాటించడం, తర్వాత ఖననం చేస్తూ వస్తోంది.
అయితే ఆమె విశ్రాంతి తీసుకోవడానికి గది కూడా లేకపోవడంతో ఇబ్బందులు ఎదుర్కొంటోంది. ఇది చూసి ఆ ప్రాంతానికి చెందిన కొందరు సామాజిక సేవకులు కలిసి ఆమెకు విశ్రాంతి గదిని నిర్మించారు. ఆ గదిని గురువారం సీతకు అప్పగించారు. ఈ సందర్భంగా వారందరికి సీత కృతజ్ఞతలు తెలుపుకుంది.
Comments
Please login to add a commentAdd a comment