grave yard
-
భారీ వరదతో కనిపించకుండాపోయిన స్మశానవాటిక
-
స్మశానంలో కూతురికి ప్రేమపెళ్లి జరిపించిన తండ్రి
పెళ్లి అనేది ప్రతి ఒక్కరి జీవితంలో ఎంతో ముఖ్యమైన ఘట్టం. అందుకే తమ వివాహ వేడుకను ఎప్పటికి గుర్తుండేలా అంగరంగ వైభవంగా జరుపుకోవాలని వధూవరులు ఆశపడుతుంటారు. కొందరు డెస్టినేషన్ వెడ్డింగ్ జరుపుకుంటే, మరికొందరు రిచ్ ప్యాలెస్‌లోనో, సముద్రానికి దగ్గరగా ఇలా ఎవరి టేస్ట్‌కి తగ్గట్లు వాళ్లుపెళ్లి వేడుకను ప్లాన్ చేస్తుంటారు. అయితే మహారాష్ట్రలో మాత్రం ఓ పెళ్లి వేడుక స్మశానంలో జరిగింది. సంప్రదాయబద్దంగా బంధువుల సమక్షంలో ఈ తంతు పూర్తైంది. పైగా ఇది ప్రేమ పెళ్లి కావడం గమనార్హం. ఇంతకీ స్మశానంలో పెళ్లి చేసుకోవడం కొత్త కాన్సెప్టా? దీని వెనుక ఇంకేమైనా కారణం ఉందా అన్నది ఇప్పుడు చూద్దాం. స్మశానంలో ప్రేమికుల పెళ్లి. వినడానికి విచిత్రంగా ఉన్నా ఇది నిజంగానే జరిగింది. మహారాష్ట్రలోని అహ్మద్‌నగర్ జిల్లా రహతా పట్టణానికి చెందిన గంగాధర్ గైక్వాడ్.. స్మశాన వాటికలో కాటికాపరిగా పనిచేస్తూ ఉండేవాడు. కుటుంబంతో కలిసి ఎన్నో ఏళ్లుగా స్మశానవాటికలోనే నివాసం ఉండేవారు. ఆయనకు మయూరి అనే కూతురు ఉంది. 12 తరగతి వరకు చదువుకున్న ఆమె ఉద్యోగం కోసం షిర్డీకి వెళ్లింది. ఈ క్రమంలో ఆమె పని చేస్తున్న సంస్థలో మనోజ్ అనే యువకుడు ఉద్యోగం చేసేవాడు. వీరిద్దరి పరిచయం స్నేహం నుంచి ప్రేమగా మారింది. వీరి ప్రేమను ఇరు కుటుంబ వర్గాలు కూడా అంగీకరించాయి. అయితే తనకు జీవనాధారాన్ని ఇచ్చిన స్మశాన వాటికలోనే కూతురి పెళ్లి చేయాలని గంగాధర్ ఎప్పట్నుంచో భావించాడట. ఈ విషయాన్నే అబ్బాయి కుటుంబసభ్యులకు తెలియజేశాడు. ఇక ఆయన కోరికను కాదనలేక మయూరి పెరిగిన స్మశానంలోనే బంధువుల సమక్షంలో సాంప్రదాయబద్దంగా పెళ్లిని జరిపించారు. ప్రస్తుతం ఈ వేడుక గురించి సోషల్ మీడియాలో తెగ చర్చ నడుస్తోంది. -
శ్మశానాల్లో దుస్తులు దొంగిలించి.. మార్కెట్లో అమ్మకం..
లక్నో : శ్మశానాలనుంచి చనిపోయినవారి దుస్తులు దొంగిలించి, వాటిని కొత్తవాటిలా మార్కెట్లో అమ్ముతున్న ఓ ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. ఆదివారం ఏడుగురు ముఠా సభ్యులను అదుపులోకి తీసుకున్నారు. ఈ సంఘటన ఉత్తర ప్రదేశ్‌లోని భగపత్ జిల్లాలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. భగపత్ జిల్లా బరౌత్ పోలీస్ స్టేషన్ పరిధికి చెందిన దుస్తుల వ్యాపారస్తుడు పవన్ జైన్ అతడి అనుచరులు దాదాపు 10 సంవత్సరాలుగా శ్మశానాల్లో చనిపోయిన వారి దుస్తులను దొంగిలిస్తున్నారు. వాటిని శుభ్రం చేసి, కంపెనీల ట్రేడ్ మార్క్ ట్యాగ్లు అతికించి మార్కెట్లో అమ్ముతున్నారు. సదరు దుస్తుల వ్యాపారస్తుడు తన అనుచరులకు రోజుకు 300 రూపాయలు చెల్లించేవాడు. పక్కా సమాచారంతో రంగంలోకి దిగిన పోలీసులు పవన్ జైన్, అతడి కుమారుడు ఆశిష్ జైన్, మేనల్లుడు రిషబ్ జైన్, అనుచరులు రాజు శర్మ, శ్రవణ్ శర్మ, బబ్లూ కష్యప్, షారుఖ్‌ఖాన్‌లను అరెస్ట్ చేశారు. వారి వద్దనుంచి 520 బెడ్ షీట్లు, 127 కుర్తాలు, 140 చొక్కాలు, 34 దోతీలు, 112 ట్రేడ్ మార్క్ స్టిక్కర్లను స్వాధీనం చేసుకున్నారు. చదవండి : లక్ష ఏళ్ల నాటి ఆదిమానవుల అవశేషాలు.. వాళ్లను చంపింది.. -
మహిళా కాటికాపరికి శ్మశానంలో విశ్రాంతి గది
సేలం : శ్మశాన వాటికలో మృతదేహాలను ఖననం చేస్తూ నిలువ నీడలేని మహిళా కాటికాపరికి సామాజిక కార్యకర్తలు విశ్రాంతి గదిని నిర్మించి ఇచ్చి తమ ఔదార్యం చాటుకున్నారు. సేలంలోని టీవీఎస్ ప్రాంతంలోని శ్మశానవాటికలో సీత కాటికాపరిగా పనిచేస్తోంది. ఆమె కుటుంబసమస్యలు, పేదరికం, తల్లిదండ్రుల మరణం కారణంగా చిన్నతనం నుంచే మృతదేహాలను పూడ్చిపెట్టే పనిచేస్తోంది. నిత్యం అక్కడికి వచ్చే శవాలను ఒంటరిగా నిలబడి సమాధులు తవ్వడం, ఆయా శవాల తాలూకు చెందిన వారి సంప్రదాయలను పాటించడం, తర్వాత ఖననం చేస్తూ వస్తోంది. అయితే ఆమె విశ్రాంతి తీసుకోవడానికి గది కూడా లేకపోవడంతో ఇబ్బందులు ఎదుర్కొంటోంది. ఇది చూసి ఆ ప్రాంతానికి చెందిన కొందరు సామాజిక సేవకులు కలిసి ఆమెకు విశ్రాంతి గదిని నిర్మించారు. ఆ గదిని గురువారం సీతకు అప్పగించారు. ఈ సందర్భంగా వారందరికి సీత కృతజ్ఞతలు తెలుపుకుంది. -
మచిలీపట్నం: కూతురి సమాధి వద్దే తండ్రి తుది శ్వాస
-
శ్మశానం.. అత్యాధునికం
దుబ్బాక : ‘పుట్టిన వాడు గిట్టక మానడు’ అన్నది భగవద్గీతలో కృష్ణుడు చెప్పే మాట. మరణం ఏ జీవికైనా తప్పదు.. అయితే చనిపోయిన తమ ఆప్తులకు కన్నీటి వీడ్కోలు చెప్పడానికి బంధువులు, మిత్రులు, శ్రేయోభిలాషులు శ్మశాన వాటిక దాకా రావడం సహజం. మరణించిన వ్యక్తులకు దహన సంస్కారాలు చేయడానికి అనువైన స్థలం కావాలి. ఈ తంతుకు వచ్చిన వారు ఆయా మత ఆచారాలు, సంప్రదాయాల ప్రకారం నడుచుకోవడం అనాదిగా వస్తున్నదే. దహన సంస్కారాలకు వచ్చిన వ్యక్తులు స్నానం చేసి వేసుకున్న బట్టలను నీళ్లల్లో పిండనిదే ఇంటికి తిరిగి వెళ్లరు. దీని కోసం నీళ్లెక్కడ దొరుకుతాయా అని వెతుకులాడతారు. మహిళలు బహిరంగ ప్రదేశాల్లో స్నానం చేయలేరు. ఇలా దహన సంస్కారాలకు వచ్చిన వారు చాలా గ్రామాల్లో నీళ్లు, బాత్రూంలు లేక ఇబ్బందులు పడుతున్నారు. ఇలాంటి ఇబ్బందులను దూరం చేసేందుకే ప్రభుత్వం శ్మశాన వాటికల్లో సకల సదుపాయాలు కల్పించేందుకు శ్రీకారం చుట్టింది. శ్మశాన వాటికకు వెళితే.. ఇది నిజంగా శ్మశాన వాటికేనా అన్నంత అందంగా వైకుంఠ ధామం పేరుతో సుందరమైన ప్రదేశాలుగా తీర్చిదిద్దుతోంది. మరణించిన తమ వారి జ్ఞాపకార్థంగా స్మృతి వనాలను నిర్మిస్తోంది. అందులో భాగంగానే రాష్ట్ర ప్రభుత్వం దుబ్బాక మున్సిపాలిటీలో వైకుంఠధామాలను అత్యాధునికమైన పద్ధతుల్లో నిర్మించడానికి భారీగానే నిధులను కేటాయిస్తోంది. వైకుంఠ ధామాల నిర్వహణ బాధ్యతను కూడా మున్సిపాలిటీ అధికారులే తీసుకున్నారు. వైకుంఠ ధామాలను ఈజీఎస్ నిధులతో నిర్మించడానికి శ్రీకారం చుడుతోంది. మున్సిపాలిటీ పరిధిలో కొన్ని కుల సంఘాలకు ప్రత్యేకంగా వైకుంఠ ధామాలు ఉన్నాయి. వీటికి ప్రభుత్వం నిధులు కేటాయించింది. వైకుంఠధామంలో బాత్రూంలు, నీటి సౌకర్యం, తాగునీరు దుబ్బాక పట్టణంలోని కుమ్మరి కుంటలో స్టేట్ ఫైనాన్స్ కమిషన్(ఎస్ఎఫ్సీ) రూ. 30 లక్షల నిధులతో శ్మశాన వాటికను అత్యాధునికమైన పద్ధతుల్లో నిర్మించారు. పట్టణానికి సమీపంలోని అనువైన స్థలంలో దీన్ని నిర్మించారు. ఇందులో మహిళలు, పురుషులకు వేర్వేరుగా స్నానాల గదులు, మరుగుదొడ్లు, మూత్ర శాలలు ఏర్పాటు చేశారు. బర్నింగ్ పాయింట్ అత్యాధునికమైన పద్ధతిలో నిర్మించారు. వీటితోపాటు నీటి సౌకర్యం కల్పించారు. తాగు నీటి కోసం మిషన్ భగీరథ కింద స్వచ్ఛమైన గోదావరి నీటిని సమకూరుస్తున్నారు. కుమ్మరి కుంటలోనే కాకుండా ఈజీఎస్ నిధులు రూ. 10 లక్షలతో ఏదులా చెరువు, దుంపలపల్లిలో ఈజీఎస్ నిధులు రూ. 10 లక్షలు, చెల్లాపూర్‌లో ఈజీఎస్ నిధులు రూ. 10 లక్షలతో వైకుంఠ ధామాలను నిర్మిస్తున్నారు. ఇవే కాకుండా దుబ్బాక పట్టణంలో కుల సంఘాల నిర్వహణలో శ్మశాన వాటికలు నడుస్తున్నాయి. ఇందులో ప్రధానంగా నీలకంఠ, పద్మశాలి సంఘాలకు సంబంధించిన వైకుంఠధామాలు అత్యాధునిక పద్ధతుల్లో నిర్మించుకున్నారు. వీటికి కూడా ప్రభుత్వం రూ. 20 లక్షల చొప్పున నిధులు కేటాయించింది. పనులు కూడా పూర్తయ్యాయి. వీటిల్లో వృద్ధులు కూర్చోవడానికి ప్రత్యేకంగా కుర్చీలను ఏర్పాటు చేశారు. సీసీ రోడ్లు, ప్రహరీలను నిర్మించారు. హరితహారం పథకం కింద నాటిన మొక్కలు ఏపుగా పెరిగాయి. ఇవి శ్మశాన వాటికల్లా కనబడవు. ఇక్కడికి వస్తే దట్టమైన అటవీ ప్రాంతంలో సంచరిస్తున్నామా అనే సందేహం కలగకమానదు. స్మృతి వనాల్లోకి వెళితే స్వచ్ఛమైన గాలితో కూడిన ఆహ్లాదకరమైన వాతావరణం కట్టిపడేస్తుంది. స్థలాభావంతో నోచుకోని వైకుంఠ ధామాలు దుబ్బాక మున్సిపాలిటీలోని లచ్చపేట, ధర్మాజీపేట, చేర్వాపూర్, మల్లాయపల్లి గ్రామాల్లో వైకుంఠ ధామాలకు స్థల కొరత తీవ్రంగా ఉంది. శ్మశాన వాటికలకు స్థలం కొరత ఉండడంతో వివిధ కారణాలతో మరణించిన వ్యక్తుల మృతదేహాలను గ్రామానికి సమీపంలో ఉన్న కుంటలు, చెరువుల్లో దహన సంస్కారాలు నిర్వహిస్తున్నారు. అక్కడ నీటి సౌకర్యం ఉండదు. స్నానాలు చేయడానికి చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇంతకుముందు ఉన్న శ్మశాన వాటికల స్థలాన్ని కొంతమంది ఆక్రమించుకున్నట్లు మున్సిపల్ అధికారులు గుర్తించారు. స్థలాన్ని ఆక్రమించుకున్న వారిపై చర్యలు తీసుకోవడానికి సిద్ధమయ్యారు. ప్రభుత్వ భూముల సేకరణలో అధికారులు నిమగ్నమయ్యారు. ప్రభుత్వ భూములపై స్పష్టత రాగానే వైకుంఠ ధామాలను నిర్మించడానికి ప్రణాళికలు రూపొందిస్తున్నారు. ప్రజలకు అందుబాటులో వైకుంఠ రథం పాడెను ఎత్తుకోవడానికి జనం ముందుకు రావడం లేదు. కనీసం పాడె కట్టెలు, మృతదేహాన్ని దహనం చేసేందుకు కట్టెలు దొరకని దుస్థితి నెలకొంది. ఈ క్రమంలో ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి ఎమ్మెల్యే నిధులతో మున్సిపాలిటీకి రూ. 10 లక్షల విలువైన వైకుంఠ రథాన్ని కొనుగోలు చేశారు. ఈ రథంలో మృతదేహాలను తరలించడానికి వాహన నిర్వహణ ఖర్చుల కింద దూరాన్ని బట్టి రూ. 500 నుంచి రూ. 1000 తీసుకుంటున్నారు. మున్సిపాలిటీ పరిధిలో ఎవరు చనిపోయినా వైకుంఠ రథంపైనే తీసుకెళ్తున్నారు. శవాలను శ్మశాన వాటికకు తీసుకెళ్లేందుకు వైకుంఠ రథం పట్టణ ప్రజలకు కూడా ఉపయోగకరంగా ఉంటోంది. ఆదర్శంగా వైకుంఠధామాలు కులం, మతం, వర్గం, పేద, ధనిక భేదాలతో నిరంతరం ఘర్షణ పడే వ్యక్తులు ఎప్పుడో ఒకప్పుడు మరణిస్తూనే ఉం టారు. మరణించిన ప్రతి వ్యక్తి ఈ మట్టిలో కలిసిపోతాడు. మరణించిన వ్యక్తులను ఒకే దగ్గర దహనం చేయడం, పూడ్చడం చేస్తే వారి ఆత్మలు శాంతిస్తాయి. రాష్ట్ర ప్రభుత్వం ప్రజల కోసం ప్రతిష్టాత్మకంగా వైకుంఠధామాలను నిర్మిస్తోంది. వీటి కోసం నిధులను కూడా భారీగానే విడుదల చేస్తోంది. మనం నిర్మించిన వైకుంఠధామాలు ఆదర్శంగా నిలుస్తున్నాయి. – ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి, దుబ్బాక వైకుంఠధామాల నిర్వహణ మున్సిపాలిటీదే రాష్ట్ర ప్రభుత్వం నిర్మిస్తోన్న వైకుంఠ ధామాల నిర్వహణ బాధ్యత మున్సిపాలిటీదే. మున్సిపాలిటీ పరిధిలో కుమ్మరి కుంటలో రూ. 30 లక్షలతో వైకుంఠధామాన్ని పూర్తి చేశాం. దుంపలపల్లి, చెల్లాపూర్ గ్రామాల్లో వైకుంఠధామాల నిర్మాణం కొనసాగుతోంది. లచ్చపేట, ధర్మాజీపేట, మల్లాయపల్లి, చేర్వాపూర్ గ్రామాల్లో స్థలా భావం ఉంది. రెవెన్యూ అధికారులతో ప్రభుత్వ భూముల సర్వే చేయిస్తున్నాం. అది పూర్తి కాగానే ఇక్కడ కూడా వైకుంఠధామాలను నిర్మిస్తాం. శ్మశాన వాటికల్లో మరుగుదొడ్లు, స్నాన ఘట్టాలు, బర్నింగ్ పాయింట్లను అత్యాధునిక పద్ధతుల్లో నిర్మించాం. తాగునీటి సౌకర్యం, ఆవరణల్లో మొక్కలు, పూల మొక్కలు నాటాం. ప్రజలు కూర్చోవడానికి ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకుంటున్నాం. – గోల్కొండ నర్సయ్య, కమిషనర్, దుబ్బాక -
శ్మశానంలో మందు కొడుతున్న యువత
-
పాతిపెట్టిన తర్వాత ఏడుపు.. బతికిన శిశువు..!
బర్వానీ: పసికందు చనిపోయాడనుకుని స్మశానంలో పాతిపెట్టారు. సమీపంలో ఆడుకునే పిల్లలు శిశువు ఏడుపు విని గ్రామస్తులకు చెప్పడంతో ఆ చిన్నారి బతికి బట్టకట్టింది. ఈ ఘటన మధ్యప్రదేశ్‌లోని బర్వానీ ప్రాంతంలో చోటు చేసుకుంది. ఘస్ గ్రామ స్మశాన వాటికలో పది రోజుల మగశిశువును అడుగు లోతు గుంతలో పాతిపెట్టి వెళ్లిపోయారు. మంగళవారం ఉదయం కొందరు పిల్లలు ఆ సమీపంలో ఆడుకుంటుండగా శిశువు రోదన వినిపించింది. దీంతో వారు వెంటనే గ్రామస్తులకు తెలిపారు. షేర్ సింగ్(32) అనే వ్యక్తి భార్య సునీతతోపాటు అక్కడికి చేరుకుని మట్టిని తొలగించి శిశువును తమ ఇంటికి తీసుకెళ్లారు. పోలీసులకు సమాచారం అందించటంతో వారు ఈ మేరకు కేసు నమోదు చేసుకున్నారు. అనంతరం చిన్నారిని ఆస్పత్రికి తీసుకెళ్లారు. పది రోజుల శిశువు చీమలు కుట్టడంతో కొద్దిగా గాయాలపాలయ్యాడని, ప్రస్తుతం జలుబుతో బాధపడుతున్నాడని.. అయితే ఎలాంటి ప్రమాదం లేదని వైద్యులు తెలిపారు. కాగా, తమకు ముగ్గురు అమ్మాయిలున్నారని, ఈ పరిస్థితుల్లో ఆ దేవుడే ఈ శిశువును తమకిచ్చాడని షేర్సింగ్ దంపతులు ఆస్పత్రి వద్దే పడిగాపులు కాస్తున్నారు. తామే పెంచుకుంటామంటూ అధికారులను ప్రాధేయపడుతున్నారు. -
ప్రపంచస్థాయి శ్మశానం నిర్మిస్తాం
- రిజర్వాయర్ కోసం శ్మశానం తొలిగిస్తే చనిపోయినవాళ్లను ఎక్కడపెట్టాలి? - ప్రత్యామ్నాయ స్థలం చూపిస్తే రాజధాని ఠీవి తగ్గట్లు గొప్ప శ్మశానం కడతాం - సీఆర్ డీఏ కు కృష్ణాయపాలెం గ్రామపంచాయతీ వినతి సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ నూతన రాజధాని అమరావతి ప్రాంతంలోని కృష్ణాయపాలెం(మంగళగిరి మండలం) గ్రామానికి ఊహించని సమస్య ఎదురైంది. ఆ ఊరికి ఉత్తరాన ఉన్న శ్మశానం.. త్వరలో నిర్మించనున్న రిజర్వాయర్ లో మునిగిపోతుందని సీఆర్ డీఏ అధికారులు ప్రకటించడమే సమస్యకు అసలు కారణం. రిజర్వాయర్ నిర్మాణానికి భూమి తీసుకుంటామన్న అధికారులు.. శ్మశానానికి ప్రత్యామ్నాయంపై మాత్రం పెదవి విప్పడంలేదు. దీంతో సీఆర్ డీఏ తీరును తప్పుపడుతూ బుధవారం సర్పంచ్ ఈపూరి కన్నయ్య అధ్యక్షతన జరిగిన పంచాయతీ సమావేశం తీర్మానాలు చేసింది. రాజధాని నిర్మాణం నిమిత్తం ప్రస్తుతం ఉన్న గ్రామాలను కదిలించబోమనే ప్రభుత్వ హామీని నమ్మి భూములు ఇచ్చామని, ఊరంతటికీ ఉపయోగపడే శ్మశానాన్ని తొలగిస్తామన్న అధికారుల నిర్ణయాన్ని గ్రామపంచాయతీ సాధారణ సమావేశం ఏకగ్రీవంగా వ్యతిరేకించింది. శ్మశానం స్థలాన్ని మినహాయించి రిజర్వాయర్ నిర్మించాలని, అలా కుదరని పక్షంలో గ్రామానికి ఉత్తరంగా ప్రత్యామ్నాయస్థలాన్ని చూపిస్తే గ్రామంలోని ప్రతి రైతూ గజానికి రూ. ఒకటి వంతున చందా వేసుకుని ప్రపంచస్థాయి శ్మశానం నిర్మించుకుంటామని, అందుకు తగిన చర్యలు చేపట్టాలని తీర్మానంలో కోరారు. తీర్మానాల ప్రతిని సీఆర్డీఏ కార్యాలయంలో గ్రామం తరపున అందచేశారు. -
శ్మశాన స్థలం కోసం ధర్నా
అనంతపురం జిల్లా పుట్టపర్తి మండలం వెంకటగారిపల్లెలో శ్మశాన స్థలం ఏర్పాటు చేయాలని శనివారం రాత్రి స్థానికులు ఆందోళన చేశారు. గ్రామంలో శ్మశాన వాటిక లేకపోవడంతో ఇబ్బందిపడుతున్నామని గ్రామ కూడలిలో ధర్నా చేశారు.