నటుడు మన్సూర్ అలీఖాన్
తమిళనాడు, పెరంబూరు: సేలం–చెన్నై మధ్య 8వే ఏర్పాటు చేస్తే ఎనిమిది మందిని అడ్డంగా నరుకుతానని నటుడు మన్సూర్ అలీఖాన్ హెచ్చరించారు. ఆయన గురువారం సెలం విమానాశ్రయం విస్తరణ కారణంగా బాధింపునకు గురవుతున్న వ్యవసాయ భూములను పర్యవేక్షించడానికి కాడయాంపట్టికి వెళ్లారు. పొట్టియపురం, తంబిపాడి, సికణం పాడి గ్రామస్తులను కలిసి మద్దతు తెలిపారు. అనంతరం మన్సూర్‌అలీఖాన్ విలేకరులతో మాట్లాడుతూ సేలంలో ఇప్పటికే విమానాశ్రయం ఉందని, అక్కడి ప్రజలు విమానయానం చేసేందుకు ఆసక్తి చూపడం లేదన్నారు.
ఇక్కడ విమాన పరికరాలను తయారు చేయడానికి విమానాశ్రయాలు నెలకొల్పుతున్నారా? లేక పారిశ్రామికవేత్తల కోసం ఏర్పాటు చేస్తున్నారా? అని ప్రశ్నించారు. చెన్నై–సేలం మధ్య 8వే ఏర్పాటు చేస్తే ఎనిమిది మందిని అడ్డంగా నరుకుతానని నటుడు మన్సూర్ అలీఖాన్ ఆవేశపూరితంగా మాట్లాడారు. వనాలు, పంట భూములు, కొండలను కరిగించి రోడ్లను కార్పొరేట్ సంస్థల కోసం ఏర్పాటు చేయడం ఖండించదగ్గదని ఆయన వ్యాఖ్యానించారు.
Comments
Please login to add a commentAdd a comment