Tami Nadu
-
ఎంఎస్ఎంఈలను ప్రోత్సహిస్తోంది
కొరుక్కుపేట: సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమ(ఎంఎస్ఎంఈ)లను రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సహిస్తోందని తమిళనాడు ప్రభుత్వం ఫేమ్ టీఎన్ జాయింట్ డైరెక్టర్ ఎస్ శక్తివేల్ తెలిపారు. ఈ మేరకు ఆంధ్రా చాంబర్ ఆఫ్ కామర్స్ (ఏసీసీ), ఫ్రెడ్రిచ్ నౌమన్ ఫౌండేషన్ ఫర్ ఫ్రీడమ్ (జర్మన్ ఫౌండేషన్) సంయుక్త ఆధ్వర్యంలో ఎంపవరింగ్ ఎంఎస్ఎంఈ ఆన్ క్యాపిటల్ మార్కెట్ ఎక్స్‌పోసర్ అనే అంశంపై సదస్సును శుక్రవారం నగరంలో నిర్వహించారు. ఆంధ్రాచాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షురాలు డాక్టర్ వీఎల్ ఇందిరాదత్ మాట్లాడుతూ ఆంధ్రా చాంబర్ ఆఫ్ కామర్స్‌లో ప్రస్తుతం 1,200 మంది సభ్యులు, 25కి పైగా ట్రేడ్ అసోసియేషన్న్లు అనుబంధంగా ఉన్నాయని అన్నారు. జాయింట్ డైరెక్టర్ శక్తివేల్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఎంఎస్ఎంఈల అభ్యున్నతికి కృషిచేస్తోందని అన్నారు. ఈక్రమంలోనే అనేక పథకాలను వారికీ అందుబాటులోకి తెచ్చిందని తెలిపారు. ప్రభుత్వ అందిస్తున్న పథకాలను ఎంఎస్ఎంఈలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఎంఎస్ఎంఈ చైర్మన్ ఎంకే ఆనంద్, బీఎస్ఈ ఎంఎస్ఈ ఎక్సేంజ్ ప్లాట్‌ఫామ్–ముంబయి డిప్యూటీ జనరల్ మేనేజర్ ఆనంద్ చారి, సృజన్ ఆల్ఫా కేపిటల్ అడ్వైజర్స్ ఎల్ఎల్పి రాజత్ బైడ్, ఆంధ్రా చాంబర్ ఆఫ్ కామర్స్ సెక్రటరీ జనరల్ ఆర్ విజయలక్ష్మి, ఉపాధ్యక్షుడు సీహెచ్ వెంకటేశ్వరరావు, పబ్లిక్ రిలేషన్స్ కమిటీ చైర్మన్ కేఎన్ సురేష్‌బాబు, ఎంఎస్ఎంఈ సబ్ కమిటీ కో చైర్మన్ ప్రశాంత్ కుమార్, ఏసీసీ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ ఎంకె ముత్తువేలు పాల్గొన్నారు. -
ఎన్ఐఏ మెరుపు దాడులు.. మూడు రాష్ట్రాల్లో 60 చోట్ల సోదాలు
కేంద్ర దర్యాప్తు సంస్థ ఎన్ఐఏ బుధవారం మెరుపు దాడులు చేపట్టింది. తమిళనాడు, కేరళ, కర్ణాటక రాష్ట్రాల్లోని 60 ప్రదేశాల్లో ఏకకాలంలో సోదాలు నిర్వహిస్తోంది. గత ఏడాది కోయంబత్తూరు, మంగళూరు నగరాల్లో జరిగిన రెండు వేరువేరు పేలుళ్ల ఘటనల నేపథ్యంలో మూడు రాష్ట్రాల్లో నిషేధిత ఉగ్రవాద సంస్థ ఐఎస్ఐఎస్ సానుభూతిపరులుగా అనమానిస్తున్న వారిని అదుపులోకి తీసుకునేందుకు ఈ దాడులు చేపట్టింది. కాగా గతేడాది అక్టోబర్ 23న తమిళనాడులోని కోయంబత్తూరులో కొట్టె ఈశ్వరన్ ఆలయం ముందు కారులో సిలిండర్ పేలిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో అనుమానిత ఉగ్రవాది జమేషా మబీన్ మరణించాడు. దీనిపై అక్టోబర్ 27న ఎన్ఐఏ దర్యాప్తు ప్రారంభించగా.. ఇప్పటి వరకు ఈ కేసులో 11 మంది నిందితులను అరెస్ట్ చేసింది. జమీజా ముబీన్ తన సహచరులతో కలిసి దక్షిణ భారతదేశంలోని పలు ప్రాంతాల్లో బాంబు పేలుళ్లకు కుట్ర పన్నినట్లు ఎన్ఐఏ దర్యాప్తులో తేలింది. ఐసిస్‌తో కలిసి ఆలయ సముదాయాన్ని దెబ్బతియాలనే ఉద్ధేశంతో ఆత్మాహుతి దాడికి ప్లాన్ చేసినట్లు కేంద్ర దర్యాప్తు సంస్థ తెలిపింది. దీంతో అతనితో సంబంధాలున్న వారిని ఎన్ఐఏ దర్యాప్తు చేస్తోంది. అదే విధంగా 2022 నవంబర్ 19న కర్ణాటకలోని మంగళూరులో ఆటో రిక్షాలో ప్రెషర్ కుక్కర్ బాంబు పేలింది. ఈ పేలుడులో ఆటో డ్రైవర్‌తోపాటు ప్రెషర్ కుక్కర్ తీసుకెళ్తున్న నిందితుడు మహ్మద్ షరీక్ కూడా గాయపడ్డాడు. ఈ కేసుపై డిసెంబర్లో ఎన్ఐఏ దర్యాప్తు ప్రారంభించింది. పలు కేసుల్లో నిందితుడు షరీక్ రాష్టరాంష్ట్రంలోని కోస్తా ప్రాంతంలో మతపరమైన ఉద్రిక్తతలకు ఆజ్యం పోసేలా పెద్ద ఎత్తున దాడి చేసేందుకు ప్లాన్ చేస్తున్నాడని విచారణలో తేలింది. ఈ నేపథ్యంలోనే ఐఎస్ఐఎస్కు చెందిన అనుమానితుల కదలికలు ఈ మూడు రాష్ట్రాల్లో ఉన్నట్లు గుర్తించిన ఎన్ఐఏ ఈ దాడులు నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. చదవండి: IT Raids on BBC: బీబీసీపై ఐటీ సర్వే -
లైంగిక వేధింపులు: బాలిక ఆత్మహత్యపై దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన కమల్
లైంగిక వేధింపులతో ఆత్మహత్యకు పాల్పడిన బాలిక ఘటనపై సినీ నటుడు, మక్కల్ నీది మయ్యం నేత కమల్ హాసన్ స్పందించారు. మృతురాలు బాలిక ఆత్మహత్యకు కారకుడైన సదరు పాఠశాల ఉపాధ్యాయుడిని కఠింగా శిక్షించాలని సోషల్ మీడియా వేదికగా ఆయన డిమాండ్ చేశారు. ఈ మేరకు కమల్ ట్వీట్ చేస్తూ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. చదవండి: ఓటీటీకి ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్’, స్ట్రీమింగ్ ఎప్పుడంటే బాలిక మృతికి కారకుడైన టీజర్‌కు కఠిన శిక్ష పడేలా చర్యలు తీసుకుని, ఇలాంటి ఘటనలు పునరావుతంగా కాకుండా తమిళనాడు ప్రభుత్వం అడ్డుకట్ట వేయాలని కమల్ తన ట్వీట్లో పేర్కొన్నారు. శుక్రవారం జరిగిన ఈ ఘటన తమిళనాడులో సంచలనం రేపింది. దీనిపై పెద్ద ఎత్తున నిరసనలు చేపట్టి నిందితుడిని శిక్షించాలంటూ డిమాండ్ చేశారు. దీంతో పోలీసులు సదరు పాఠశాల ఫిజిక్స్ టీజర్ మిథున్ చక్రవర్తిని ఆర్సీపురం పోలీసులు అరెస్టు చేసి పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. అలాగే కళాశాల ప్రిన్సిపల్‌పై కూడా పోలీసులు పోక్సో కేసు నమోదు చేసినట్లు సమాచారం. చదవండి: బిగ్‌బాస్ 5: శ్రీరామ్ చంద్రకు సజ్జనార్ మద్దతు, ఏమన్నారంటే.. -
మద్యం దుకాణంలో ఎలుకల రచ్చ.. 12 వైన్ బాటిళ్లు తాగేశాయ్!
ఇంట్లో ఎలుకలు ప్రవేశించాయంటే అవి చేసే గోల అంతా ఇంతా కాదు.. వంటలు, బియ్యం.. ఇలా అన్నిట్లో నేనున్నానంటూ చేయి పెట్టి చిందర వందర చేస్తాయి. అంతేగాక ఎంతో ఇష్టంగా కొనుకున్న కొనుకున్న దుస్తులను సైతం దేనికి పనికిరాకుండా చింపి నాశనం చేస్తాయి. ఏ ఇంట్లోనైనా ఎలుకలు ఒంటరిగా ఉండవు. తమతోపాటూ...పెద్ద ఫ్యామిలీని వెంట తెస్తాయి. వాటిని ఇంట్లో నుంచి తరిమేయడం ఓ సవాలు లాంటిది. అప్పటి వరకు ప్రశాంతత ఉండదు. అయితే ఇటీవల ఎలుకల నోటికి కొత్త రుచి కావాల్సి వచ్చిందేమో. వైన్ షాప్‌లోకి దూరి ఏకంగా 12 వైన్ బాటిళ్లను ఎలుకలు ఖాళీ చేశాయి. ఈ విచిత్ర ఘటన తమిళనాడులో నీలగిరి జిల్లాలో వెలుగులోకి వచ్చింది. గుడలూర్ సమీపంలోని కదంపూజాలో ప్రభుత్వం నడుపుతున్న టాస్మాక్ మద్యం దుకాణాన్ని లాక్డౌన్ కారణంగా మూసివేశారు. తాజాగా కోవిడ్ తగ్గుముఖం పట్టడం వల్ల ప్రభుత్వం ఆంక్షలను సడలించడంతో మద్యం షాపులను ఓపెన్ చేశారు. ఈ క్రమంలో సోమవారం వైన్ షాప్ తెరిచి చూసేసరికి 12 ఖాళీ వైన్ బాటిళ్లు ఒపెన్ చేసి ఉండటంతో తమిళనాడు ఎక్సైజ్ సిబ్బంది షాక్ తిన్నారు. బాటిళ్ల మూతలపై ఎలుకలు కొరికిన ఆనవాళ్లు ఉండంటంతోపాటు.. అందులోని వైన్ ఖాళీ అయ్యింది. ఈ 12 మద్యం సీసాల మూతలను ఎలుకలే కొరికినట్టు ఎక్సైజ్ శాఖ అధికారులు గుర్తించారు. సిబ్బంది సమాచారం మేరకు టాస్మాక్ సీనియర్ అధికారులు దర్యాప్తు చేసి.. ఎలుకలే ఈ పని చేశాయని నిర్దారించారు. లాక్డౌన్ వల్ల చాలాకాలం ఈ మద్యం దుకాణం మూసివేయడంతో షాపులో ఎలుకలు తిరగడం ప్రారంభించాయని, బాటిళ్ల మూతలను కొరికి ఎలుకలు మద్యం తాగేశాయని తమిళనాడు ఎక్సైజ్ శాఖ సీనియర్ అధికారి అన్నారు. ఎలుకలు ఖాళీ చేసినవైన్ విలువ 1500 ఉంటుందని తెలిపారు. కేవలం వైన్ బాటిల్స్‌నే టార్గెట్ చేశాయని, బీర్ లేదా మిగతా మద్యం సీసాలను అసలు ముట్టుకోలేదన్నారు. ఇక ఈ విషయం తెలుసుకున్న నెటిజనులు.. ఎలుకల్లో కూడా మందుబాబులు ఉన్నారని, ఏమాత్రం కిక్కుఏక్కిందో అంటూ ఫన్నీ కామెంట్ చేస్తున్నారు. -
మంత్రితో నిర్మాతల మండలి భేటీ
చెన్నై: రాష్ట్ర సమాచార శాఖ మంత్రి వెల్లై కోవిల్ స్వామినాథన్‌ను తమిళ నిర్మాతల మండలి కార్యవర్గం బుధవారం కలిసింది. ఈ సందర్భంగా నిర్మాతల సంక్షేమం కోసం డిమాండ్లతో కూడిన కూడిన వినతిపత్రాన్ని మంత్రికి అందించినట్లు మండలి అధ్యక్షుడు మురళి రామనారాయణన్ తెలిపారు. సమాచారశాఖ మంత్రిని కలిసిన వారిలో ఆయనతో పాటు.. కార్యదర్శులు ఆర్.రాధాకృష్ణన్, మన్నన్, ఇతర కార్యవర్గం సభ్యులు సౌందరరాజన్, విజయమురళి తదితరులు ఉన్నారు. చదవండి: Jaya Prada: బంగార్రాజుకు స్నేహితురాలా? -
పదేళ్ల తర్వాత డీఎంకే.. సభా పర్వానికి సర్వం సిద్ధం
అసెంబ్లీ సమావేశాలు సోమవారం నుంచి ప్రారంభం కానున్నాయి. ముందుగా గవర్నర్ ప్రసంగం ఉంటుంది. పదేళ్లుగా అధికార పక్షంలో కూర్చున్న అన్నాడీఎంకే సభ్యులు తాజాగా ప్రతిపక్ష సీట్లలో కూర్చోనున్నారు. సాక్షి, చెన్నై: డీఎంకే సర్కారు అధికారంలోకి వచ్చిన రోజు నుంచి కరోనా నివారణ చర్యల మీద ప్రత్యేక దృష్టి సారించిన విషయం తెలిసిందే. సీఎం స్టాలిన్ నేతృత్వంలో మంత్రులు, ప్రజా ప్రతినిధులు, అధికారులు పడ్డ శ్రమకు ఫలితంగా అనేక జిల్లాల్లో కేసులు తగ్గుముఖం పట్టాయి. ఈ పరిస్థితుల్లో అసెంబ్లీ తొలి సమావేశాల నిర్వహణ అనివార్యం కావడంతో అందుకు తగిన చర్యలు చేపట్టారు. గవర్నర్ భన్వారీలాల్ పురోహిత్ సమావేశాలను ఆమోదించారు. గవర్నర్ ప్రసంగంతో.... ఈ ఏడాది గత ప్రభుత్వ హయాంలో తొలి సమావేశంలో గవర్నర్ ప్రసంగం సాగిన విషయం తెలిసిందే. తాజాగా కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దృష్ట్యా రెండో సారి సభలో గవర్నర్ ప్రసంగం సాగనుంది. సోమవారం ఉదయం పది గంటలకు కలైవానర్ అరంగం వేదికగా సభ ప్రారంభం కానుంది. స్పీకర్‌గా అప్పావు సభను నడిపించనున్నారు. గవర్నర్ ప్రసంగంలో కరోనా కట్టడిలో అందరి పాత్ర, ప్రశంసలు, రాష్ట్ర ఆర్థిక ప్రగతి బలోపేతానికి తగిన ప్రణాళిక, చెన్నైలో మల్టీసూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి నిర్మాణంతో పాటు మరికొన్ని కొత్త నిర్మాణాలు, డీఎంకే ఎన్నికల వాగ్దానాల అమలుకు సంబంధించిన పలు అంశాలు ఉండనున్నా యి. అనంతరం సభా వ్యవహారాల కమిటీ సమావే శం అవుతుంది. ఇందులో సభ ఎన్ని రోజులు నిర్వహించాలి, చర్చించాల్సిన అంశాలు, కీలక తీర్మానాల గురించి నిర్ణయం తీసుకోనున్నారు. ఇందులో సేలం గ్రీన్ వే, నీట్‌కు వ్యతిరేకంగా, రాజీవ్ హంతులకు దీర్ఘకాలిక పెరోల్ తదితర అంశాలకు సంబంధించిన తీర్మానాలు ఉండనున్నాయి. నెగిటివ్ సర్టిఫికెట్ తీసుకురావాలి సభకు హాజరయ్యే ప్రతి ఒక్కరూ కరోనా నెగిటివ్ సరి్టఫికెట్ తీసుకురావాల్సి ఉంటుంది. ఇప్పటికే ఎమ్మెల్యేలందరికీ కరోనా పరీక్షలు చేశారు. అలాగే సభ జరిగే కలైవానర్ అరంగం పరిసరాల్లో భద్రతను పెంచారు. సెయింట్ జార్జ్ కోటలోని అసెంబ్లీ సమావేశ మందిరాన్ని తలపించే విధంగా కలైవానర్ అరంగంలోనూ ఏర్పాట్లు చేశారు. గత పదేళ్లుగా అధికార పక్షంలో ఉన్న అన్నాడీఎంకే సభ్యులు తాజాగా ప్రతిపక్ష వరుసలో కూర్చోవాల్సిన పరిస్థితి. చదవండి: తమిళనాడులో మరో వారం లాక్డౌన్ పొడిగింపు -
దంతాలు కోసుకెళ్లి.. ఏనుగును చంపి దహనం చేశారు...
సాక్షి, చెన్నై: కోయంబత్తూరు జిల్లా వాల్పారై వరట్టు పారై అటవీ ప్రాంతంలో గుర్తుతెలియని వ్యక్తులు ఓ ఏనుగును హతమార్చారు. దంతాల్ని కోసి తీసుకెళ్లారు. ఎవరూ గుర్తు పట్టకుండా దహనం కూడా చేశారు. కోయంబత్తూరు జిల్లా వాల్పారై వరట్టు పారై ఎస్టేట్ కారి్మకులు అడవుల్లో కట్టెలు తెచ్చుకునేందుకు వెళ్లారు. సేలయార్ డ్యాంపై భాగంలో సురక్షిత ప్రాంతంగా ఉన్న ప్రదేశానికి వెళ్లారు. కట్టెలు కొట్టుకుని తిరుగుపయనంలో ఉండగా దుర్వాసన రావడాన్ని గుర్తించారు. ఓ చోట ఏనుగు దహనం చేసిన స్థితిలో పడి ఉండడంతో అటవీశాఖ అధికారి జయచంద్రన్కు సమాచారం అందించారు. ఆయన నేతృత్వంలోని బృందం, వైద్యులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. అక్కడ ఏనుగును ఎవరో గుర్తుతెలియని వ్యక్తులు హతమార్చి, ఆ దంతాలను కోసుకెళ్లి ఉండడం వెలుగు చూసింది. ఆధారాల్ని చెరిపేందుకు ఆ పరిసరాల్లో రసాయనం సైతం పోసి ఉండడం బయటపడింది. ఏనుగును దహనం చేసి ఉండడంతో, 90 శాతం మేరకు గుర్తు పట్టలేని పరిస్థితి. దీంతో అక్కడున్న రసాయనాలు, ఏనుగు మృతదేహంలోని కొంతభాగాన్ని పరిశోధనకు తరలించారు. ఈ కిరాతకానికి పాల్పడ్డ వారి కోసం గాలింపు ముమ్మరం చేశారు. చదవండి: జనారణ్యంలోకి ఏనుగులు రాకుండా నియంత్రణ -
వివేక్ కుటుంబానికి విజయ్ పరామర్శ
చెన్నై: ఇటీవల గుండెపోటుతో కన్నుమూసిన ప్రముఖ హాస్యనటుడు వివేక్ కుటుంబాన్ని నటుడు విజయ్ పరామర్శించారు. చిరునవ్వే ఆభరణంగా చిత్ర పరిశ్రమలో అజాతశత్రువుగా పేరు తెచ్చుకున్న నటుడు వివేక్. అలాంటి పేరున్న నటుడు ఈ నెల 17వ తేదీ ఈ లోకాన్ని విడిచిన సంగతి తెలిసిందే. ప్రధాని నరేంద్ర మోదీ నుంచి పలువురు రాజకీయ, సినీ ప్రముఖులు వివేక్ మృతికి సంతాపాన్ని వ్యక్తం చేశారు. పలువురు ఆయన భౌతిక కాయానికి నివాళులర్పించారు. కాగా నటుడు విజయ్ ఆ సమయంలో జార్జియాలో చిత్రీకరణ జరుగుతున్న తన 65 చిత్ర షూటింగ్లో ఉన్నారు. వివేక్ మరణ వార్త తెలిసినా కరోనా నిబంధనల కారణంగా ఆయన భౌతికకాయానికి నివాళులు అర్పించలేని పరిస్థితి. విజయ్ ఆరంభకాలం నుంచి వివేక్ ఆయనతో కలిసి పలు చిత్రాల్లో నటించారు. చివరిగా విజయ్ కథానాయకుడిగా నటించిన బిగిల్ చిత్రంలో వివేక్ కీలక పాత్రను పోషించారు. కాగా జార్జియాలో షూటింగ్ పూర్తి చేసుకుని ఆదివారం చెన్నై చేరుకున్న విజయ్ సోమవారం ఉదయం వివేక్ ఇంటికి వెళ్లి ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించారు. చదవండి: ‘బ్లాక్’ క్యారెక్టర్ లీడ్‌గా సాగిన చిత్రం -
‘కొడుకు పెళ్లైనప్పటి నుంచీ విడిగానే.. మాకు సంబంధం లేదు’
సాక్షి, చెన్నై : తాము విడిగా జీవిస్తున్నట్లు చెప్పి వరకట్నం కేసుల నుంచి భర్త, తల్లిదండ్రులు తప్పించుకుంటున్నట్లు హైకోర్టు ఆవేదన వ్యక్తం చేసింది. వరకట్నం చిత్రహింసలతో మహిళ ఆత్మహత్య చేసుకున్న కేసును విచారించిన కడలూరు మహిళా కోర్టు భర్త, అతని తల్లిదండ్రులకు జైలు శిక్ష విధిస్తూ తీర్పునిచ్చింది. ఈ తీర్పును వ్యతిరేకిస్తూ శిక్షకు గురైన తల్లిదండ్రులు మద్రాసు హైకోర్టులో అప్పీలు చేశారు. అందులో కుమారుడికి వివాహమైనప్పటి నుంచి తాము విడిగా జీవిస్తున్నట్లు, కోడలి ఆత్మహత్యకు తమకు సంబంధం లేదని పిటిషన్లో తెలిపారు. తమకు కింది కోర్టు విధించిన జైలు శిక్షను నిలిపివేయాలని మధ్యంతర పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై న్యాయమూర్తి పి.వేల్మురుగన్ విచారణ జరిపారు. ఆ సమయంలో కుమారుడితో కలిసి పిటిషనర్లు కోడలిని హింసించేందుకు ఆధారాలు ఉన్నాయని ప్రభుత్వ న్యాయవాది వాదించారు. దీంతో న్యాయమూర్తి తన ఉత్తర్వుల్లో వరకట్నం చిత్రహింసలతో మహిళల ఆత్మహత్యలు నానాటికీ పెరుగుతున్నాయని, మరోవైపు తాము ఒకటిగా జీవించడం లేదని, విడిగా జీవిస్తున్నట్లు భర్త తల్లిదండ్రులు వరకట్నం కేసుల నుంచి తప్పించుకుంటున్నట్లు తెలిపారు. అంతేకాకుండా వారు విడిగా జీవించినా మామగారి ఇంట్లో కారు, బైక్, నగలు, నగదు వరకట్నంగా తీసుకోవాల్సిందిగా కుమారుని రెచ్చగొడుతున్నట్లు తెలిపారు. ఇటువంటి కేసులో తాము విడిగా ఉంటున్నట్లు తెలిపి పలువురు శిక్షల నుంచి తప్పించుకునేందుకు పిటిషన్లు దాఖలు చేస్తున్నారని, కుమారులను సమాజంలో ప్రయోజకులుగా పెంచాల్సిన బాధ్యత తల్లిదండ్రులదని తెలిపారు. ఈ కేసులో తల్లిదండ్రులకు కింది కోర్టు విధించిన శిక్షను నిలిపివేయలేమని, ఈ కేసును తుది విచారణకు వాయిదా వేస్తున్నట్లు ఉత్తర్వులిచ్చారు. చదవండి: తమిళ సినిమాకు షాక్! ఆ సన్నివేశాలు తొలగించాల్సిందేనా? -
ఎన్నికల ప్రచారం: కమల్ హాసన్‌పై కేసు
పరస్పర దూషణలు, ఆరోపణలు, ప్రత్యారోపణలతో రెండు నెలలపాటు హోరాహోరీగా సాగిన అసెంబ్లీ ఎన్నికల ప్రచారం సమాప్తమైంది. చివరి రోజు ఆదివారం అన్నిపార్టీలూ సుడిగాలి ప్రచారం సాగించాయి. నేతల ఉపన్యాసాలతో హోరెత్తిన మైకులు, లౌడ్స్పీకర్లు రాత్రి 7 గంటల తరువాత ఒక్కసారిగా మూగబోయాయి. సాక్షి, చెన్నై: హిందువులు ఆరాధించే దేవుళ్లను ప్రచారంలో వాడుకున్న అభియోగంపై ఎంఎన్ఎం అధ్యక్షుడు కమల్ హాసన్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. కోయంబత్తూరు దక్షిణం నుంచి పోటీచేస్తున్న కమల్ ప్రచార వాహనంలో శ్రీరాముడు, అమ్మవారి వేషాలతో ఉన్న వ్యక్తులు కమల్ పార్టీ పతాకాన్ని పట్టుకుని ప్రయా ణించారు. వీరిద్దరూ మన దేవుళ్లే, అయితే వీరిని అడ్డుపెట్టుకుని కొందరు రాజకీయం చేస్తున్నారని విమర్శించారు. దీనిపై కొందరు ఫిర్యాదు చేయడంతో కమల్ సహా ముగ్గురిపై కాట్టూరు పోలీసులు మూడు సెక్షన్ల కింద కేసు పెట్టారు. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల సంగ్రామంలో అన్నాడీఎంకే–బీజేపీ, డీఎంకే–కాంగ్రెస్ కూటములు సర్వశక్తులూ ఒడ్డి ప్రచారం సాగించాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా బీజేపీ అగ్రనేతలు తమిళనాడుకు తరలివచ్చారు. అధికార కూటమి అభ్యర్థుల గెలుపు కోసం ప్రధాని నరేంద్రమోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్‌షా, కేంద్రమంత్రులు స్మృతీఇరానీ, నిర్మలా సీతారామన్ తీవ్రస్థాయిలో ప్రచారంలో పాల్గొన్నారు. అలాగే ప్రతిపక్ష కూటమిని బలపరుస్తూ ఏఐసీసీ మాజీ అధ్యక్షులు రాహుల్‌గాంధీ, కర్ణాటక సీనియర్ నేత వీరప్పమెయిలీ ప్రచారం చేశారు. తమిళనాడులో ఈనెల 3వ తేదీన తొలిసారి ఎన్నికల ప్రచారానికి సిద్ధమైన ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక పర్యటన రద్దయింది. ఇక స్థానికంగా అన్నాడీఎంకే రథ సారథులైన సీఎం ఎడపాడి, డిప్యూటీ సీఎం పన్నీర్‌సెల్వం తమ నియోజకవర్గాలతోపాటు ఒకరి నియోజకవర్గంలో ఒకరు ప్రచారం చేశారు. చదవండి: అలా అయితే సినిమాలు మానేస్తా: కమల్ హాసన్ కూటమి అభ్యర్థులకు మద్ధతుగా అనేక నియోజకవర్గాల్లో పర్యటించారు. డీఎంకే అధ్యక్షులు స్టాలిన్ సైతం తీవ్రస్థాయిలో ప్రచారం సాగించారు. ఎన్నికల షెడ్యూలు విడుదల కాకముందే ప్రజలను ఆకట్టుకునేందుకు ‘మీ నియోజకవర్గంలో స్టాలిన్’ పేరున సభలు నిర్వహించారు. ఐజేకే కూటమి ముఖ్యమంత్రి అభ్యర్థి, మక్కల్ నీది మయ్యం అధ్యక్షుడు కమల్‌హాసన్ అదే కూటమికి చెందిన సమత్తువ మక్కల్ కట్చి అధ్యక్షుడు శరత్‌కుమార్, ఆయన సతీమణి రాధికతో కలిసి ప్రచారం సాగించారు. కమల్ కుమార్తె అక్షర, అన్న కుమార్తె నటి సుహాసిని సైతం నడిరోడ్డుపై నృత్యంతో ప్రచారాన్ని రక్తికట్టించారు. ఇక అన్నాడీఎంకే అసంతృప్త ఓట్లపైనే ఆధారపడి బరిలోకి దిగిన అమ్మ మక్కల్ మున్నేట్ర కళగం ప్రధాన కార్యదర్శి టీటీవీ దినకరన్ పెద్ద ఎత్తున ప్రచారం సాగించారు. అన్నాడీఎంకే శ్రేయస్సును కోరి రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు జయలలిత నెచ్చెలి శశికళ ప్రకటించినా ఆమె అన్న కుమారుడు దినకరన్ పోటీకి దిగడం గమనార్హం. చదవండి: కమల్ హాసన్ కూతురితో నటి తీన్మార్ స్టెప్పులు! నేతల తుది పిలుపు అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి చివరిరోజు ఆదివారం ప్రధాన పార్టీ నేతలు ఓటర్లకు తుది పిలుపునిచ్చారు. ఎండలు మండిపోతున్నా చిరునవ్వు చిందిస్తూ ఓపెన్‌టాప్ వాహనంలో ప్రయాణించారు. బీజేపీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా కన్యాకుమారి, తిరునల్వేలి, చెన్నై జిల్లాల్లో పర్యటించారు. అన్నాడీఎంకే మళ్లీ అధికారంలోకి వచ్చేందుకు సహకరించాలని సేలంలో సీఎం ఎడపాడి అన్నారు. ఈ సందర్భంగా రైతు సంఘాల నేతలు ఎడపాడిని కలిసి మద్దతు ప్రకటించారు. రేపటి ఎన్నికల పోలింగ్‌లో ప్రజలు అన్నాడీఎంకే ప్రభుత్వానికి బుద్ధి చెప్పే విధంగా ఓటు వేస్తారని పేర్కొంటూ చెన్నైలో స్టాలిన్ ప్రచారం చేశారు. జేపీ నడ్డా ప్రచారంలో కమల్ పాట బీజేపీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా కన్యాకుమారి లో ఆదివారం ప్రచారం చేశారు. ఈ సమయంలో స్థానిక అన్నాడీఎంకే కార్యకర్తలు హిందీ పాటలను మైకుల ద్వారా ప్రసారం చేశారు. అయితే అకస్మాత్తు గా కమల్‌హాసన్ హీరోగా నటించిన పున్నగైమన్నన్ చిత్రంలోని ‘ఎన్న సత్తం ఇంద నేరం’ (ఇలాంటి సమయంలో ఏమిటీ శబ్దం) అనే పాట ప్రసారం కావడంతో అందరూ బిత్తరపోగా, బీజేపీ కార్యకర్తలు తేరుకుని వెంటనే ఆపాట ఆపండి అంటూ కేకలు వేయడంతో ఆగిపోయింది. ప్రచారం చేస్తే రెండేళ్ల జైలు: ఈసీ ప్రచార పర్వం ముగిసి ఈనెల 6వ తేదీన పోలింగ్ జరగనున్న దృష్ట్యా పార్టీ పనుల నిమిత్తం వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వారంతో స్వస్థలాలకు వెళ్లిపోవాలని ఎన్నికల కమిషన్ ఆదేశించింది. లాడ్జీలు, అతిథిగృహాలు, కల్యాణమండపాల్లో బసచేసిన ఉన్న వారు ఖాళీ చేయాలని కోరింది. గడువు ముగిసిన తరవాత ప్రచారం చేసిన వారికి రెండేళ్ల జైలు శిక్ష, జరిమానా విధిస్తామని ఈసీ హెచ్చరించింది. -
మోదీపై ట్వీట్.. హాట్ బ్యూటీపై ఫిర్యాదు
సాక్షి, చెన్నై : ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కించపరుస్తూ సోషల్ మీడియా వేదికగా హాట్ బ్యూటీ ఒవియా హెలెన్ చేసిన వ్యాఖ్యలపై బీజేపీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ఆమెపై వెంటనే పోలీసు కేసు నమోదు చేయాలని తమిళనాడు బీజేపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. ఈ మేరకు రాష్ట్ర బీజేపీ చీఫ్ డీ అలెక్స్ సుధాకర్ స్థానిక పోలీసుకు ఫిర్యాదు చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆదివారం తమిళనాడు పర్యటించిన విషయం తెలిసిందే. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. రూ.3,770 కోట్లతో పూర్తయిన చెన్నై వాషర్మెన్ పేట–విమ్కోనగర్ మధ్య మెట్రో రైలు, రూ.293 కోట్లతో పూర్తి చేసిన చెన్నై బీచ్–అత్తిపట్టు మధ్య 4వ ట్రాక్‌లో, రూ.423 కోట్లతో విద్యుద్దీకరించిన విల్లుపురం–తంజావూరు – తిరువారూర్ మార్గంలో రైలు సేవలకు జెండా ఊపారు. చెన్నై నెహ్రూ ఇండోర్ స్టేడియంలో ఆదివారం జరిగిన కార్యక్రమంలో పాల్గొన్ని ప్రసంగించారు. ఈ క్రమంలో మోదీ రాకను నిరశిస్తూ నటి ఒవియా హెలెన్ సోషల్ మీడియాలో ఓ పోస్టు చేశారు. గో బ్యాక్ మోదీ అనే హ్యాష్ ట్యాగ్‌తో చేసిన పోస్టు వివాదాస్పదంగా మారింది. ఈమె తీరుపై బీజేపీ నేతలు మండిపడుతున్నారు. దేశద్రోహం, ఐటీ చట్టం కింద ఆమెపై చర్యలు తీసుకుని అరెస్ట్ చేయాలని పోలీసులకు ఫిర్యాదు చేశారు. కాగా ఇండియన్ మోడల్ అయిన ఒవియా పేరు అందరికీ తెలియకపోయినా తమిళ, మలయాళ ప్రేక్షకులకు మాత్రం సుపరిచితురాలే.. విలక్షణ నటుడు కమల్ హాసన్ వ్యాఖ్యతగా వచ్చిన తమిళ బిగ్‌బాస్ సీజన్ 1లో ఈ కేరళ కుట్టి పాల్గొంది. బిగ్‌బాస్ షోతో ఒవియా కోలీవుడ్‌లో ఒక్కసారిగా స్టార్‌గా మారిపోయింది. తెలుగు, తమిళం, మలయాళం భాషల్లో 40కి పైగా చిత్రాల్లో ఒవియా నటించారు. వరసగా కాంట్రవర్సీ స్టేట్మెంట్స్ కూడా చేస్తుంటుంది. -
చిన్నమ్మకు కోర్టులో ఎదురుదెబ్బ
సాక్షి, చెన్నై: అక్రమాస్తుల కేసులో బెంగళూరు పరప్పన అగ్రహార జైలులో శిక్ష అనుభవిస్తున్న శశికళకు ఎదురుదెబ్బ తగిలింది. తనను జైలు నుంచి ముందస్తుగా విడుదల చేయాలని దాఖలు చేసిన పిటిషన్‌ను కోర్టు తిరస్కరించింది. దీంతో ఆమె నాలుగేళ్ల శిక్షాకాలం పూర్తి చేసుకుని 2021 జనవరి చివర్లో విడుదలయ్యే అవకాశం ఉంది. తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జె.జయలలిత సహాయకురాలు శశికళ నటరాజన్ రాష్ట్ర రాజకీయాల్లో కీలక పాత్ర పోషించారు. తమిళనాడు చిన్నమ్మగా సుపరిచితరాలు. మంచి ప్రవర్తనను చూపుతూ ఆమె బెంగళూరు జైలు నుంచి ముందస్తు విడుదల కోసం దరఖాస్తు చేసుకుంది. కానీ, కోర్టు పిటిషన్‌ను తిరస్కరించటంతో ఆమె అభిమానులు తీవ్ర నిరాశకు గురయ్యారు. ముందస్తు విడుదలకు కోర్టు అంగీకరిస్తుందనే ఆశతో.. రూ.10 కోట్ల జరిమానాను చిన్నమ్మ వర్గీయులు కోర్టుకు డిపాజిట్ చేసినట్లు సమాచారం. -
ప్రియురాలికి ‘రక్తం’ కానుక
సాక్షి, చెన్నై: తనను ప్రేమించలేదన్న వేదనతో రక్తాన్ని ప్రియురాలికి కానుకగా పంపించి ఓ ప్రియుడు ఆత్మహత్య చేసుకున్నాడు. గురువారం చెన్నై నంగనల్లూరులో ఈ ఘటన చోటుచేసుకుంది. నంగల్లూరుకు చెందిన కుమరేశ పాండి(25) కార్పెంటర్. సమీప బంధువైన యువతితో స్నేహం ప్రేమగా మారింది. మూడు రోజుల క్రితం తన ప్రేమను ఆ యువతికి వ్యక్తం చేశాడు. అయితే, ఆమె కేవలం స్నేహం మాత్రమేనని, ప్రేమించడం లేదని తేల్చిచెప్పింది. దీంతో మనస్తాపంతో పులిచ్చలూరులోని స్నేహితుడు ముత్తు వద్దకు వచ్చేశాడు. బుధవారం రాత్రి మిత్రుడితో కలిసి మద్యం తాగి కుమరేశ పాండి తన చేతిని కోసుకుని, ఆ రక్తాన్ని ఓ బాటిళ్లో నింపేశాడు. దీన్ని గుర్తించిన ముత్తు ఇరుగుపొరుగు వారి సాయంతో క్రోంపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అక్కడ తన వద్ద ఉన్న బాటిళ్‌ను ప్రియురాలికి అప్పగించాలని, తన రక్తం ఆమెకు కానుక అంటూ, వైద్యం చేయించుకునేందుకు నిరాకరించారు. వైద్యులు తీవ్రంగా ప్రయత్నించినా, చికిత్సకు పాండి సహకరించ లేదు. తీవ్ర రక్త స్త్రావం కావడంతో మృతిచెందాడు. -
ఎనిమిది మందిని అడ్డంగా నరుకుతా..
తమిళనాడు, పెరంబూరు: సేలం–చెన్నై మధ్య 8వే ఏర్పాటు చేస్తే ఎనిమిది మందిని అడ్డంగా నరుకుతానని నటుడు మన్సూర్ అలీఖాన్ హెచ్చరించారు. ఆయన గురువారం సెలం విమానాశ్రయం విస్తరణ కారణంగా బాధింపునకు గురవుతున్న వ్యవసాయ భూములను పర్యవేక్షించడానికి కాడయాంపట్టికి వెళ్లారు. పొట్టియపురం, తంబిపాడి, సికణం పాడి గ్రామస్తులను కలిసి మద్దతు తెలిపారు. అనంతరం మన్సూర్‌అలీఖాన్ విలేకరులతో మాట్లాడుతూ సేలంలో ఇప్పటికే విమానాశ్రయం ఉందని, అక్కడి ప్రజలు విమానయానం చేసేందుకు ఆసక్తి చూపడం లేదన్నారు. ఇక్కడ విమాన పరికరాలను తయారు చేయడానికి విమానాశ్రయాలు నెలకొల్పుతున్నారా? లేక పారిశ్రామికవేత్తల కోసం ఏర్పాటు చేస్తున్నారా? అని ప్రశ్నించారు. చెన్నై–సేలం మధ్య 8వే ఏర్పాటు చేస్తే ఎనిమిది మందిని అడ్డంగా నరుకుతానని నటుడు మన్సూర్ అలీఖాన్ ఆవేశపూరితంగా మాట్లాడారు. వనాలు, పంట భూములు, కొండలను కరిగించి రోడ్లను కార్పొరేట్ సంస్థల కోసం ఏర్పాటు చేయడం ఖండించదగ్గదని ఆయన వ్యాఖ్యానించారు. -
ఎస్సైపై కత్తితో దాడి.. దొంగ ఆత్మహత్యాయత్నం
టి.నగర్: తనను అరెస్టు చేసేందుకు సిబ్బందితో వచ్చిన ఎస్పైను ఓ వ్యక్తి కత్తితో పొడిచాడు.. ఆపై తాను ఆత్మహత్యకు యత్నించాడు. ఈ హఠాత్పరిణామం చెన్నై అమింజికరై అన్నానగర్ ప్రాంతంలో జరిగింది. వివరాలిలా ఉన్నాయి. ఈ ప్రాంతంలో ఒంటరిగా వెళుతున్న మహిళలు, వాహన చోదకుల నుంచి సెల్ఫోన్లు చోరీ చేస్తున్న ఘటనలు జరుగుతున్నట్లు అమింజికరై పోలీసులకు సమాచారం అందింది. అమింజికరై మార్కెట్ ప్రాంతంలో సెల్ఫోన్ల దొంగ దాగి ఉన్నట్లు ఆదివారం రాత్రి పోలీసులకు సమాచారం అందింది. దీంతో ఎస్సై శ్రీనివాసన్ తన సిబ్బందితో ఆ ప్రాంతానికి వెళ్ళాడు. అక్కడ ఒక దుకాణం వద్ద దాగి ఉన్న నిందితుడిని పోలీసులు చుట్టుముట్టారు. ఈ క్రమంలో ఎస్ఐ శ్రీనివాసన్‌పై అతడు కత్తితో దాడి జరిపాడు. దీంతో ఆయన తీవ్ర గాయాలతో కింద పడిపోయాడు. పోలీసులు ఎస్సైను వెంటనే ఆసుపత్రికి తరలించారు. అనంతరం దొంగను పోలీసులు చుట్టుముట్టగా వారిపైనా కత్తితో దాడికి యత్నించాడు. అతికష్టంమీద పోలీసులు అతనిని పట్టుకోగా గొంతు కోసుకుని ఆత్మహత్యకు యత్నించాడు. వెంటనే అతడినికూడా ఆస్పత్రికి తరలించారు. విచారణలో పట్టుబడిన వ్యక్తి మణికంఠన్ (25) అని, సెల్ఫోన్ల చోరీకి పాల్పడేవాడని తెలిసింది. అతని వద్ద ఉన్న బైక్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఎస్ఐ శ్రీనివాసన్‌ను మెరుగైన వైద్యం కోసం అమింజికరైలో గల ప్రైవేటు ఆసుపత్రిలో చేర్చి కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
‘కమలం ఇక్కడ కాలు మోపడం కష్టమే’
► జనంలోకి కెప్టెన్ ►డీఎండీకే వర్గాల్లో ఆనందం ►కమలం పాదం మోపడం కష్టమేనని వ్యాఖ్య ►ఒక ఓటు.. ముగ్గురు సీఎంలు చెన్నై: రెండు నెలల అనంతరం డీఎండీకే అధినేత విజయకాంత్ జనంలోకి వచ్చారు. ఆయన రాకతో డీఎండీకే వర్గాల్లో ఆనందం వ్యక్తం అవుతోంది. శనివారం విజయకాంత్ శివగంగైలో పర్యటించారు. తనదైన శైలిలో మీడియాతో మాట్లాడుతూ ఒక ఓటుతో ముగ్గురు సీఎంలను పదవిలో కూర్చోబెట్టిన ఘనత తమిళ ప్రజలకే దక్కిందని ఛలోక్తులు విసిరారు. డీఎండీకే అధినేత విజయకాంత్ కొంత కాలంగా తరచూ అనారోగ్య సమస్యల్ని ఎదుర్కొంటూ వస్తున్న విషయం తెలిసిందే. సింగపూర్‌లో సైతం ఆయనకు కిడ్నీ మార్పిడి శస్త్ర చికిత్స జరిగినట్టు వార్తలు వచ్చాయి. మార్చి నెల ఆయన ఆస్పత్రిలో చేరిన సమాచారం డీఎండీకే వర్గాల్లో ఆందోళన రేకెత్తించింది. పోరూర్ సమీపంలోని ఆసుపత్రిలో ఆయనకు చికిత్స అందిస్తున్నారనే సమాచారంతో పార్టీ వర్గాలు పరుగులు తీశాయి. ప్రతి ఏడాది ఆయన వైద్య పరీక్షలు, చికిత్సల్లో బాగమేనని ఆ పార్టీ కార్యాలయం వివరణ ఇచ్చింది. అంతేకాకుండా కెప్టెన్‌ను సింగపూర్‌కు తరలించేందుకు ప్రయత్నాలు జరుగుతున్న సమాచారం కార్యకర్తలను మరింత ఆందోళనలో పడేసింది. ఒక్కసారి ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ కావడం, మరీ వేంటనే ఆసుపత్రిలో చేరడం వంటి పరిణామాలనతో విజయ్‌కాంత్ కిడ్నీ మార్పు శస్త్రచికిత్స అనివార్యం అవుతున్నట్టుగా ప్రచారం ఊపందుకుంది. గత నెలలో డిశ్చార్జ్ అయి ఇంటికే పరిమితం కావడంతో తమ నాయకుడు జనంలోకి ఎప్పుడెప్పుడు వస్తారా అని పార్టీ శ్రేణులు ఎదురుచూశారు. అదే సమయంలో రకరకాల ప్రచారాలు, పుకార్లు, షికారలు చేశాయి. అయితే విజయ్‌కాంత్ పేరు మీద తరచూ డీఎండీకే కార్యాలయం ప్రజా సమస్యల మీద, ప్రభుత్వ వైఫల్యాల మీద తరచూ ప్రకటల్ని విడుదల చేస్తూ వచ్చాయి. ఈ పరిస్థితులో శనివారం కెప్టెన్ ప్రజలోలకి రావడం డీఎండీకే వర్గాలకు ఆనందమేనని చెప్పాలి. జనంలోకి విజయకాంత్- ఆరోగ్యవంతుడిగా తాను ఉన్నానని చాటుకునే విధంగా శనివారం విజయకాంత్ హఠాత్తుగా శివగంగైలో పర్యటించారు. సతీమణి ప్రేమలతతో కలిసి కేడర్ ముందుకు వచ్చారు. తనదైన శైలిలో స్పందిస్తూ పర్యటనలో ముందుకు సాగారు. ఈసందర్భంగా మీడియా ప్రశ్నలకు తనదైన హావాభావాలు, డైలాగులతో స్పందించారు. అన్నాడీఎంకే ముక్కలు కావడం, ఆ పార్టీ గొడవల గురించి తనకు తెలియదంటూ సమాధానాలు దాట వేశారు. అయితే తమిళనాడు ప్రజలు ఎంతో ఘనతను సాధించారని చమత్కరించారు. 2016 అసెంబ్లీ ఎన్నికల్లో ఒకే ఒక ఓటు వేసి ముగ్గురు సీఎంలను ఆ పదవిలో కూర్చో బెట్టారని ఎద్దేవా చేశారు. సీఎం జయలలిత అనారోగ్యంతో మరణించడం, పన్నీరు సీఎంగా దించడం, ఇప్పుడు పళని ఉన్నారని, తదుపరి ఎవరో అంటూ వ్యంగ్యాస్త్రం సంధించారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించిన మాట వాస్తవమేనని అంగీకరించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కుమ్మకై ముందుకు సాగుతున్నాయా..? వారి మధ్య ఒప్పందాలు కుదిరాయా..? అన్న విషయాలు తనకు తెలియనే తెలియదంటూ మరోమారు తనదైన శైలిలో స్పందించారు. తానొస్తున్నానన్న విషయం తెలుసుకుని, ఇక్కడ రాజకీయంగా అనేక ఎత్తుగడలు వేసి ఉన్నారని ధ్వజమెత్తారు. అనేక పథకాలను తుంగలో తొక్కేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ ఎన్ని కుట్రలు చేసినా, వ్యూహాలు రచించినా, తమిళనాడులో పాదం మోపడం మాత్రం కష్టమేనని పేర్కొన్నారు. ఎన్నికలకు ఇంకా సమయం ఉందని, పొత్తు ఎవరితో అన్నది ఇక అప్పుడే అంటూ ముందుకు సాగారు.