శక్తివేల్‌ను సత్కరిస్తున్న డాక్టర్ ఇందిరాదత్
కొరుక్కుపేట: సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమ(ఎంఎస్‌ఎంఈ)లను రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సహిస్తోందని తమిళనాడు ప్రభుత్వం ఫేమ్ టీఎన్ జాయింట్ డైరెక్టర్ ఎస్ శక్తివేల్ తెలిపారు. ఈ మేరకు ఆంధ్రా చాంబర్ ఆఫ్ కామర్స్ (ఏసీసీ), ఫ్రెడ్రిచ్ నౌమన్ ఫౌండేషన్ ఫర్ ఫ్రీడమ్ (జర్మన్ ఫౌండేషన్) సంయుక్త ఆధ్వర్యంలో ఎంపవరింగ్ ఎంఎస్‌ఎంఈ ఆన్ క్యాపిటల్ మార్కెట్ ఎక్స్‌పోసర్ అనే అంశంపై సదస్సును శుక్రవారం నగరంలో నిర్వహించారు. ఆంధ్రాచాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షురాలు డాక్టర్ వీఎల్ ఇందిరాదత్ మాట్లాడుతూ ఆంధ్రా చాంబర్ ఆఫ్ కామర్స్‌లో ప్రస్తుతం 1,200 మంది సభ్యులు, 25కి పైగా ట్రేడ్ అసోసియేషన్‌న్‌లు అనుబంధంగా ఉన్నాయని అన్నారు. జాయింట్ డైరెక్టర్ శక్తివేల్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఎంఎస్‌ఎంఈల అభ్యున్నతికి కృషిచేస్తోందని అన్నారు.
ఈక్రమంలోనే అనేక పథకాలను వారికీ అందుబాటులోకి తెచ్చిందని తెలిపారు. ప్రభుత్వ అందిస్తున్న పథకాలను ఎంఎస్‌ఎంఈలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఎంఎస్‌ఎంఈ చైర్మన్ ఎంకే ఆనంద్, బీఎస్‌ఈ ఎంఎస్‌ఈ ఎక్సేంజ్ ప్లాట్‌ఫామ్–ముంబయి డిప్యూటీ జనరల్ మేనేజర్ ఆనంద్ చారి, సృజన్ ఆల్ఫా కేపిటల్ అడ్వైజర్స్ ఎల్‌ఎల్‌పి రాజత్ బైడ్, ఆంధ్రా చాంబర్ ఆఫ్ కామర్స్ సెక్రటరీ జనరల్ ఆర్ విజయలక్ష్మి, ఉపాధ్యక్షుడు సీహెచ్ వెంకటేశ్వరరావు, పబ్లిక్ రిలేషన్స్ కమిటీ చైర్మన్ కేఎన్ సురేష్‌బాబు, ఎంఎస్‌ఎంఈ సబ్ కమిటీ కో చైర్మన్ ప్రశాంత్ కుమార్, ఏసీసీ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ ఎంకె ముత్తువేలు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment