
చెన్నై: రాష్ట్ర సమాచార శాఖ మంత్రి వెల్లై కోవిల్ స్వామినాథన్‌ను తమిళ నిర్మాతల మండలి కార్యవర్గం బుధవారం కలిసింది. ఈ సందర్భంగా నిర్మాతల సంక్షేమం కోసం డిమాండ్లతో కూడిన కూడిన వినతిపత్రాన్ని మంత్రికి అందించినట్లు మండలి అధ్యక్షుడు మురళి రామనారాయణన్ తెలిపారు. సమాచారశాఖ మంత్రిని కలిసిన వారిలో ఆయనతో పాటు.. కార్యదర్శులు ఆర్.రాధాకృష్ణన్, మన్నన్, ఇతర కార్యవర్గం సభ్యులు సౌందరరాజన్, విజయమురళి తదితరులు ఉన్నారు.