![Ajith Kumar Fan Hanged Himself for Not Allow into Theatre in Chennai - Sakshi](/styles/webp/s3/article_images/2023/01/21/ajith_0.jpg.webp?itok=lvDSwQFi)
తమిళసినిమా: నటులపై హద్దులు మీరిన అభిమానం ప్రాణాలను బలిగొంటోంది. పొంగల్ సందర్భంగా విజయ్ నటించిన వారిసు, అజిత్ నటించిన తుణివు చిత్రాలు ఒకేసారి విడుదలైన విషయం తెలిసిందే. అవి ఆ హీరోల అభిమానుల్లో పోటీ తత్వాన్ని పెంచేశాయి. దీంతో ఆ చిత్రాలు విడుదలైన థియేటర్ల వద్ద తోపులాటలు, వాగ్వాదాలు, గొడవలు అంటూ రచ్చరచ్చ చేశారు. భరత్ అనే అజిత్ అభిమాని ఒకరు లారీపైకి ఎక్కి డాన్స్ చేస్తూ కిందపడి ప్రాణాలు పోగొట్టుకున్న విషయం తెలిసిందే. ఆ దుర్ఘటన జరిగిన కొద్ది రోజులకే మరో విషాదం చోటుచేసుకుంది. తాజాగా అజిత్ మరో అభిమాని ఆత్మహత్య చేసుకున్నాడు.
వివరాలు చూస్తే తూత్తుక్కుడికి చెందిన వీరబాహు అనే వ్యక్తి అజిత్ వీరాభిమాని. ఇతను గురువారం తుణివు చిత్రాన్ని తన కుటుంబసభ్యులతో కలిసి చూడడానికి థియేటర్‌కు వెళ్లాడు. అయితే ఇతను మద్యం తాగి ఉండటంతో థియేటర్ సిబ్బంది అతన్ని థియేటర్లోకి అనుమతించలేదు. మద్యం తాగాడని అవమానకరంగా మాట్లాడి కుటుంబసభ్యులను మాత్రమే థియేటర్‌లోకి అనుమతించారు. తనను చిత్రాన్ని చూడడానికి అనుమతించకపోగా తన కుటుంబసభ్యుల ముందే అవమానించడాన్ని భరించలేక వీరబాహు ఇంటికి వెళ్లి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment