fan died
-
'దేవర' చూస్తూ ఎన్టీఆర్ అభిమాని మృతి
ఎన్టీఆర్ 'దేవర' సినిమా చేస్తూ అభిమాని మృతి చెందాడు. కడపలో ఈ సంఘటన చోటుచేసుకుంది. మృతుడు సీకే దీన్నె మండలం జమాల్‌పల్లికి చెందిన మస్తాన్ వలిగా గుర్తించారు. 'దేవర' రిలీజ్ సందర్భంగా కడపలోని అప్సర థియేటర్లో అభిమానుల కోసం స్పెషల్ షో వేశారు. దీనికి వచ్చిన మస్తాన్.. మూవీ చూస్తూ కేకలు వేస్తూ ఎంజాయ్ చేశాడు. ఊహించని విధంగా ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. వెంటనే దగ్గరలోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. కానీ అప్పటికే మృతి చెందినట్లు డాక్టర్లు ధ్రువకరించారు. దీంతో ఎన్టీఆర్ అభిమానుల మధ్య విషాదఛాయలు అలుముకున్నాయి.(ఇదీ చదవండి: ‘దేవర’ మూవీ రివ్యూ)ఇక కడపలోనే పాత బస్టాండ్ దగ్గరున్న రాజా థియేటర్లో అర్ధరాత్రి ఫ్యాన్స్-యాజమాన్యం మధ్య గొడవ జరిగింది. చాలామంది టిక్కెట్లు లేకుండా థియేటర్ లోపలికి ప్రవేశించడంతో పూర్తిగా హాలు పూర్తిగా నిండిపోయింది. ఈ క్రమంలో కొందరు ఫ్యాన్స్, సిబ్బందిని చితకబాదారు. అలానే తెర ముందు కూడా పలవురు యువకులు ఒకరిపై ఒకరు దాడులు చేసుకున్నారు.పోలీసులు రంగ ప్రవేశం చేసి టికెట్ లేని వారిని బయటికి పంపించడంతో గొడవ సద్దుమణిగింది. ఈ క్రమంలోనే చాలామంది యువకులకు గాయాలయ్యాయి. వీళ్ల వల్ల సినిమా చూడటానికి వచ్చిన మిగిలిన ప్రేక్షకులు బెదిరిపోయారు. యువకుల తీరుతో షో ఆలస్యంగా నడవడమే కాకుండా అర్ధాంతరంగా మధ్యలోనే షోను కాసేపు నిలిపేశారు.(ఇదీ చదవండి: 'దేవర' రెమ్యునరేషన్స్.. ఎవరికి ఎంత ఇచ్చారు?) #NTR fans crushed the theater staffAfter an argument between NTR fans and #RajaTheater staff in #Kadapa during #Devara Movie Screening, some fans crushed the staff.An argument broke out as fans rushed into the theater without tickets, and the organizers stopped the show.… pic.twitter.com/XhqlGC36Qb— BNN Channel (@Bavazir_network) September 27, 2024 -
షాకింగ్.. అజిత్ అభిమాని ఆత్మహత్య , థియేటర్లోకి అనుమతించలేదనే..!
తమిళసినిమా: నటులపై హద్దులు మీరిన అభిమానం ప్రాణాలను బలిగొంటోంది. పొంగల్ సందర్భంగా విజయ్ నటించిన వారిసు, అజిత్ నటించిన తుణివు చిత్రాలు ఒకేసారి విడుదలైన విషయం తెలిసిందే. అవి ఆ హీరోల అభిమానుల్లో పోటీ తత్వాన్ని పెంచేశాయి. దీంతో ఆ చిత్రాలు విడుదలైన థియేటర్ల వద్ద తోపులాటలు, వాగ్వాదాలు, గొడవలు అంటూ రచ్చరచ్చ చేశారు. భరత్ అనే అజిత్ అభిమాని ఒకరు లారీపైకి ఎక్కి డాన్స్ చేస్తూ కిందపడి ప్రాణాలు పోగొట్టుకున్న విషయం తెలిసిందే. ఆ దుర్ఘటన జరిగిన కొద్ది రోజులకే మరో విషాదం చోటుచేసుకుంది. తాజాగా అజిత్ మరో అభిమాని ఆత్మహత్య చేసుకున్నాడు. వివరాలు చూస్తే తూత్తుక్కుడికి చెందిన వీరబాహు అనే వ్యక్తి అజిత్ వీరాభిమాని. ఇతను గురువారం తుణివు చిత్రాన్ని తన కుటుంబసభ్యులతో కలిసి చూడడానికి థియేటర్‌కు వెళ్లాడు. అయితే ఇతను మద్యం తాగి ఉండటంతో థియేటర్ సిబ్బంది అతన్ని థియేటర్లోకి అనుమతించలేదు. మద్యం తాగాడని అవమానకరంగా మాట్లాడి కుటుంబసభ్యులను మాత్రమే థియేటర్లోకి అనుమతించారు. తనను చిత్రాన్ని చూడడానికి అనుమతించకపోగా తన కుటుంబసభ్యుల ముందే అవమానించడాన్ని భరించలేక వీరబాహు ఇంటికి వెళ్లి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
‘తునివి’ థియేటర్ వద్ద అపశ్రుతి, అజిత్ ఫ్యాన్ మృతి
తమిళ స్టార్ అజిత్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తమిళనాట ఆయనకు విపరీతమైన ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఉంది. ఇక ఆయన సినిమా రిలీజ్ అంటే థియేటర్ల ముందు అభిమానులు చేసే హంగామా అంతాఇంత కాదు. ఆయన తాజా చిత్రం తునివు(తెలుగులో తెగింపు) బుధవారం(జనవరి 11న) థియేటర్లోకి వచ్చింది. ఈ సందర్భంగా ఓ వీరాభిమాని అజిత్ భారీ కటౌట్ కోసం ఏకంగా రూ. 70 లక్షలు ఖర్చు చేశాడు. ఇదిలా ఉంటే తాజాగా తునివు మూవీ ఆడుతున్న థియేటర్ వద్ద అపశ్రుతి చోటుచేసుకుంది. చదవండి: ఆర్యన్ ఖాన్‌తో డేటింగ్! క్లారిటీ ఇచ్చిన పాకిస్తాన్ నటి ఈ రోజు తెల్లావారు జామున వేసిన స్పెషల్ షోలో అత్యుత్సాహంతో ఓ అభిమానికి ప్రాణాలు కోల్పొయాడు. వివరాలు.. తునివు స్పెషల్ షో ఈ రోజు ఉదయం తెల్లావారు జామున ఒంటి గంటలకు వేశారు. ఈ షో చూసేందుకు భారీ అభిమానులు థియేటర్‌కు వచ్చారు. అందులో భరత్ కుమార్(19) అనే అజిత్ వీరాభిమాని చెన్నైలోని కోయంబేడ్ రోహిణి థియేటర్‌కు తన మిత్రులతో కలిసి వెళ్లాడు. ఇక షో అయిపోయాకు అభిమానులంతా థియేటర్ ముందు కేకలు వేస్తూ అల్లరి చేయడం మొదలు పెట్టారు. చదవండి: అజిత్, విజయ్ చిత్రాలకు తమిళనాడు ప్రభుత్వం షాక్ అలా ఫ్యాన్స్ అంతా రోడ్డు పైకికు అజిత్ పేరు అరుస్తూ రచ్చ రచ్చ చేశారు. ఈ క్రమంలో అక్కడ ట్రాఫిక్ జామ్ అయ్యింది. అత్యుత్సాహంతో ఉన్న భరత్ అక్కడ మెల్లిగా కదులుతున్న నీళ్ల ట్యాంకర్ లారీ ఎక్కాడు. దానిపైకి ఎక్కి అజిత్ పేరు గట్టిగా అరుస్తూ డాన్స్ చేశాడు. ఈ క్రమంలో పట్టు తప్పడంతో అతడు లారీ మీద నుంచి కింద పడ్డాడు. అతడి శరీరాం నేలకు గట్టిగా తగడంలో భరత్ తీవ్రంగా గాయపడ్డాడు. దీంతో అతడి స్నేహితులు హుటాహుటిన భరత్ కుమార్ ఆస్పత్రికి తరలించారు. వైద్యులు చికిత్స అందిస్తుండగా భరత్ మృతి చెందాడు. -
కన్నీళ్లు తెప్పించే ఘటన.. ‘సినీ గాడ్‌ఫాదర్’ను కళ్లారా చూడాలని.. ఇంతలోనే
అనంతపురం సప్తగిరి సర్కిల్: మెగాస్టార్ చిరంజీవి అంటే నిలువెల్లా ఆ యువకుడికి అభిమానం. కళ్లారా చూడాలన్న తాపత్రయం. సినీ గాడ్‌ఫాదర్‌ను హైదరాబాద్ వెళ్లి చూసే అవకాశం ఎలాగూ ఉండదు. బుధవారం అనంతపురం వస్తున్నారని తెలిసి.. మిత్రుడిని వెంటబెట్టుకొని గుత్తి నుంచి ద్విచక్ర వాహనంపై ఆత్రంగా బయల్దేరాడు. మరో పదినిమిషాల్లో సభా ప్రాంగణానికి చేరుకుంటాడు. అంతలోనే గార్లదిన్నె వద్ద మృత్యువు అతన్ని ప్రమాద రూపంలో కబళించింది. చదవండి: గాడ్‌ఫాదర్ ఈవెంట్.. ఎస్పీకి ఫిర్యాదులు.. అసలు ఏం జరిగిందంటే? అయితేనేం అభిమానం “చిరంజీవి’గా వెలుగునివ్వాలని అతని కుటుంబ సభ్యులు భావించారు. నేత్రాలను దానం చేస్తే.. మరో ఇద్దరి జీవితాల్లో వెలుగునిస్తాడని భావించారు. అనుకున్నదే తడవుగా నేత్రాలను దానం చేశారు. గుత్తి పట్టణానికి చెందిన రాజశేఖర్ (22) కళ్లను అతని కుటుంబ సభ్యులు సాయిట్రస్ట్ ఆధ్వర్యంలో ఎల్వీ ప్రసాద్ కంటి ఆస్పత్రి ద్వారా నేత్రాలను గురువారం సేకరించారు. కళ్లను సేకరించిన వారిలో సాయిట్రస్ట్ సభ్యులు విజయసాయి, నారాయణ, ఎల్వీ ప్రసాద్ ఆస్పత్రి టెక్నీషియన్ రాఘవేంద్ర తదితరులు పాల్గొన్నారు. -
‘బింబిసార’ ఈవెంట్లో విషాదం, ఎన్టీఆర్ ఫ్యాన్ అనుమానాస్పద మృతి
బింబిసార ప్రిరిలీజ్ ఈవెంట్లో విషాదం చోటుచేసుకుంది. ఈ కార్యక్రమంలో ఎన్టీఆర్ అభిమాని అనుమానస్పద స్థితిలో మృతి చెందాడు. కాగా నందమూరి హీరో కల్యాణ్ రామ్ చాలా గ్యాప్ తర్వాత నటించిన చిత్రం ‘బింబిసార’. ఈ మూవీ ప్రిరిలీజ్ వేడుక నిన్న(శుక్రవారం) శిల్పకళా వేదికలో జరిగిన సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమానికి జూనియర్ ఎన్టీఆర్ ముఖ్యఅతిథిగా వచ్చాడు. ఈ సందర్భంగా నందమూరి హీరోలను చూసేందుకు నందమూరి అభిమానులు హైదరాబాద్‌కు శిల్పకళావేదికకు తరలి వచ్చారు. చదవండి: స్టార్ హీరో షూటింగ్ సెట్లో భారీ అగ్ని ప్రమాదం, ఒకరు మృతి ఈ క్రమంలో సాయిరాం అనే అభిమాని అనుమానస్పద స్థితిలో మృతి చెందారు. అతడిని వెంటనే ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఈ విషయం ఆలస్యంగా వెలుగు చూసింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి విచారిస్తున్నారు. కాగా మృతుడి పూర్తి పేరు పుట్టా సాయిరాం అని అతడు తాడేపల్లిగూడెనికి చెందిన వ్యక్తి అని తెలిసింది. హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ సంస్థలో జాబ్ చేస్తున్నట్లు పోలీసులు నిర్ధారించారు. ప్రస్తుతం సాయిరాం మృతదేహం ఉస్మానియా ఆస్పత్రిలోనే ఉందని, ఈ ఘటనపై విచారిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. -
'ఆర్ఆర్ఆర్' విషాదం.. సినిమా చూస్తూ అభిమాని మృతి
యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్‌లు ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం 'ఆర్ఆర్ఆర్ (రౌద్రం రణం రుధిరం)'. దర్శదీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఈ చిత్రం ఈ రోజు ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. బెనిఫిట్ షోలు చూసేందుకు పలు ప్రాంతాల్లో అభిమానులు ఎగబడ్డారు. ఇదిలా ఉండగా ఆర్ఆర్ఆర్ సినిమా చూస్తూ ఓ అభిమాని ప్రాణాలు కోల్పోయాడు. అనంతపురానికి చెందిన ఓబులేసు(30) అనే వ్యక్తి బెనిఫిట్ షో చూస్తుండగా గుండెపోటుకు గురయ్యాడు. సమీపంలోని ఆసుపత్రికి తరలించేలోపు మార్గమధ్యలోనే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. తమ అభిమాన హీరో సినిమా దృశ్యాలను చిత్రీకరిస్తూ ఓబులేసు కుప్పకూలిపోయినట్లు అతడి స్నేహితులు తెలిపారు. -
విషాదం... అఖండ మూవీ చూస్తూ బాలయ్య అభిమాని మృతి
Hero Balakrishna Fan Died While Watching Akhanda Movie: ప్రస్తుతం ఎక్కడ చూసిన అఖండ మానియ కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో మూవీ బ్లాక్‌బస్టర్ హిట్ టాక్ తెచ్చుకుంటూ విజయం వైపు దూసుకెళుతోంది. దీంతో అఖండ మూవీకి వస్తున్న రెస్పాన్స్ చూసి ఫుల్ జోష్‌లో ఉన్న హీరో బాలకృష్ణకు చేదు అనుభవం ఎదురైంది. అఖండ సినిమా చూస్తున్న ఆయన అభిమాని ఒకరు మృతి చెందారు. బాలయ్య వీరాభిమాని, ఈస్ట్ గోదావరి జిల్లా ఎగ్జిబిటర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు జాస్తి రామకృష్ణ అఖండ సినిమా చూస్తూ హఠాన్మరణం చెందాడు. స్థానిక శ్యామల థియేటర్లో ఆయన అఖండ సినిమా చూస్తూ అకస్మాత్తుగా అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయారు. చదవండి: సిరివెన్నెల అంత్యక్రియల్లో కనిపించని మంచు ఫ్యామిలీ, ఎందుకో తెలుసా? అది గమనించిన థియేటర్ యాజమాన్యం ఆయనను వెంటనే ఆస్పత్రికి తరలించారు. కానీ అప్పటికే ఆయన మరణించినట్లు వైద్యులు స్పష్టం చేశారు. సినిమా చూస్తున్న సమయంలో బ్రెయిన్ స్ట్రోక్ రావడంతో జాస్తి రామకృష్ణ మరణించినట్లు ఆయన సన్నిహితులు తెలిపారు. రాజమండ్రి సమీపంలోని నామవరం వీఎస్ మహల్ థియేటర్ దగ్గర నుంచి ఆయన కెరీర్ ప్రారంభించి.. అంచెలంచెలుగా ఎదిగి జిల్లా ఎగ్జిబిటర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు అయ్యారు జాస్తి రామకృష్ణ. ఆయన మరణంపై జిల్లాలోని ఇతర ఎగ్జిబిటర్లు సంతాపం తెలిపారు. రామకృష్ణ మరణం జిల్లాకు తీరని లోటు అని అన్నారు. రామకృష్ణ మరణంపై బాలయ్య అభిమానులు విచారం వ్యక్తం చేస్తున్నారు. చదవండి: Anasuya Bhardwaj-Pushpa Movie: నోట్లో బ్లేడ్‌తో అనసూయ.. భయపెట్టిస్తోన్న లుక్ -
'మెగా' హీరో మంచి మనసు..అభిమాని కుటుంబానికి సాయం
మెగా హీరో వరుణ్ తేజ్ మరోసారి గొప్ప మనసు చాటుకున్నారు. కరోనా కారణంగా మరణించిన అభిమాని కుటుంబానికి సాయం అందించారు. వివరాల ప్రకారం..కరీంనగర్‌కు చెందిన శేఖర్ అనే అభిమాని ఇటీవలె కన్నుమూశారు. ఈ విషయం తెలుసుకున్న వరుణ్‌తేజ్ ఆ కుటుంబానికి 2లక్షల రూపాయల ఆర్థిక సహాయం అందించారు. ఈ మేరకు శేఖర్ తల్లికి కరీంనగర్ జిల్లా మెగాఫ్యామిలీ ఫ్యాన్స్ జిల్లా అధ్యక్షుడు వేల్పుల వెంకటేశ్ చెక్కును అందజేశారు. ఈ సందర్భంగా శేఖర్ కుటుంబం వరుణ్‌తేజ్‌కు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. ఇక సినిమాల విషయానికి వస్తే..ప్రస్తుతం వరుణ్‌తేజ్ ఎఫ్3, గని చిత్రాల్లో నటిస్తున్నారు. ఈ రెండు చిత్రాల షూటింగుల్లో వరుణ్ బిజీగా ఉన్నారు. గని చిత్రంలో వరుణ్ బాక్సర్‌గా కనిపించనున్నారు. -
అభిమాని కుటుంబానికి అండగా యంగ్ హీరో!
హీరోలకు, అభిమానులకు మధ్య ఉండే అనుబంధమే వేరు. ముఖ్యంగా తెలుగు హీరోలు వారి అభిమానులపై చూపే ప్రేమకు ఫ్యాన్స్ ఫిదా అవుతుంటారు. వారి కోసమే ప్రత్యేకించి సినిమాలను చేస్తూ ఉంటారు హీరోలు. అభిమానులే దేవుళ్లు అంటూ సినిమా ఫంక్షన్లలో హీరోలు వారి గురించి చెబుతూ ఉంటారు. అలాంటి ఓ అభిమాని చనిపోవడంతో.. యంగ్ హీరో సందీప్ కిషన్ అతని కుటుంబానికి అండగా నిలిచి మంచి మనసును చాటుకున్నారు. సందీప్‌కిషన్ తొలి చిత్రం `ప్రస్థానం` నుండి అభిమాని అయిన కడప శ్రీను ఈరోజు ప్రొద్దుటూరులో గుండెపోటుతో కన్నుమూశారు. ఈ విషయం తెలుసుకున్న సందీప్ కిషన్ కడప శ్రీను దహన సంస్కారాలకయ్యే డబ్బులు ఇచ్చారు. అంతే కాకుండా ఆయన తల్లికి నెలకు ఏడువేల రూపాయల ఆర్ధిక సాయాన్ని అందించనున్నట్లు తెలియజేశారు. `నాకు అన్ని సందర్భాల్లో అండగా నిలబడ్బ నా అభిమాని, నా తొలి అభిమానిని కోల్పోవడం బాధాకరం. చిన్న వయసులోనే నా సోదరుడు దూరం కావడం బాధాకరం. నీ కుటుంబానికి ఎప్పటికీ రుణపడి ఉంటాను శ్రీను. నీ కుటుంబ బాధ్యత నాది. లవ్ యు శ్రీను.. నీ ఆత్మకు శాంతి కలగాలి` అంటూ హీరో సందీప్ కిషన్ తన ట్విట్టర్ ద్వారా సంతాపాన్ని ప్రకటించారు. -
అభిమాని మృతితో నటుడు సుదీప్ కంటతడి
బొమ్మనహళ్లి: తనను అభిమానించే అభిమాని ఇక లేరని తెలసుకొని కన్నట నటుడు కిచ్చ సుదీప్ కంటతడి పెట్టారు. వివరాలు.. బెంగళూరుకు చెందిన వినూత అనే యువతి సుదీప్ అభిమాని. ఆమె కొంత కాలంగా కేన్సర్‌తో బాధపడుతోంది. ఓ వైపు వ్యాధి తీవ్రంగా ఉన్నా ఎలాగైనా తన అభిమాన నటుడు సుదీప్‌ను కలవాలని తపించేది. అభిమాన సంఘం సభ్యుల ద్వారా విషయం తెలుసుకున్న నటుడు సుదీప్ వినూతను జేపీ నగరలో ఉన్న తమ నివాసానికి పిలిపించి ఆమె క్షేమ సమాచారాన్ని అడిగి తెలుసుకున్నారు. వ్యాధితో కుంగిపోవద్దని, ధైర్యంగా ఉండాలని చెప్పాడు. అంతేగాకుండా ఆమెతో కలిసి సెల్ఫీ కూడా తీసుకున్నారు. అయితే కేన్సర్ చివరి దశకు చేరడంతో మంగళవారం సాయంత్రం వినూత మృతి చెందింది. ఈ విషయాన్ని అభిమాన సంఘం సభ్యులు సుదీప్ దృష్టికి తీసుకెళ్లారు. దీంతో సుదీప్ కంటతడి పెట్టారు. తన చిన్నారి చిన్నారి చెల్లెలు వినూత ఆత్మకు శాంతి కలగాలని ట్విట్టర్లో పోస్ట్ చేశాడు. గతంలో వినూతతో దిగిన ఫొటోలను సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేశాడు. -
పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకల్లో అపశ్రుతి
చినగంజాం : అభిమానం నిండు ప్రాణాలు కోల్పోయేలా చేసింది. హీరో పవన్ కళ్యాణ్ జన్మిదిన వేడుకల్లో మంగళవారం అపశ్రుతి చోటుచేసుకుంది. ప్రకాశం జిల్లా చినగంజాంలో పవన్ బర్త్‌డే సందర్భంగా ఫ్లెక్సీ కడుతుండగా ప్రమాదవశాత్తూ విద్యుత్ షాక్‌తో గోనినేని రమేష్ అనే అభిమాని మృతి చెందాడు. ఈ ఘటనలో మరో ముగ్గురు గాయపడ్డారు. వారిని చికిత్స నిమిత్తం సమీప ఆస్పత్రికి తరలించారు. కాగా పవన్ కళ్యాణ్ నేడు 43వ పుట్టినరోజు సందర్భంగా అతని అభిమానులు వేడుకలు జరుపుకుంటున్నారు.