
తమిళ స్టార్ అజిత్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తమిళనాట ఆయనకు విపరీతమైన ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఉంది. ఇక ఆయన సినిమా రిలీజ్ అంటే థియేటర్ల ముందు అభిమానులు చేసే హంగామా అంతాఇంత కాదు. ఆయన తాజా చిత్రం తునివు(తెలుగులో తెగింపు) బుధవారం(జనవరి 11న) థియేటర్లోకి వచ్చింది. ఈ సందర్భంగా ఓ వీరాభిమాని అజిత్ భారీ కటౌట్ కోసం ఏకంగా రూ. 70 లక్షలు ఖర్చు చేశాడు. ఇదిలా ఉంటే తాజాగా తునివు మూవీ ఆడుతున్న థియేటర్ వద్ద అపశ్రుతి చోటుచేసుకుంది.
చదవండి: ఆర్యన్ ఖాన్‌తో డేటింగ్! క్లారిటీ ఇచ్చిన పాకిస్తాన్ నటి
ఈ రోజు తెల్లావారు జామున వేసిన స్పెషల్ షోలో అత్యుత్సాహంతో ఓ అభిమానికి ప్రాణాలు కోల్పొయాడు. వివరాలు.. తునివు స్పెషల్ షో ఈ రోజు ఉదయం తెల్లావారు జామున ఒంటి గంటలకు వేశారు. ఈ షో చూసేందుకు భారీ అభిమానులు థియేటర్‌కు వచ్చారు. అందులో భరత్ కుమార్(19) అనే అజిత్ వీరాభిమాని చెన్నైలోని కోయంబేడ్ రోహిణి థియేటర్‌కు తన మిత్రులతో కలిసి వెళ్లాడు. ఇక షో అయిపోయాకు అభిమానులంతా థియేటర్ ముందు కేకలు వేస్తూ అల్లరి చేయడం మొదలు పెట్టారు.
చదవండి: అజిత్, విజయ్ చిత్రాలకు తమిళనాడు ప్రభుత్వం షాక్
అలా ఫ్యాన్స్ అంతా రోడ్డు పైకికు అజిత్ పేరు అరుస్తూ రచ్చ రచ్చ చేశారు. ఈ క్రమంలో అక్కడ ట్రాఫిక్ జామ్ అయ్యింది. అత్యుత్సాహంతో ఉన్న భరత్ అక్కడ మెల్లిగా కదులుతున్న నీళ్ల ట్యాంకర్ లారీ ఎక్కాడు. దానిపైకి ఎక్కి అజిత్ పేరు గట్టిగా అరుస్తూ డాన్స్ చేశాడు. ఈ క్రమంలో పట్టు తప్పడంతో అతడు లారీ మీద నుంచి కింద పడ్డాడు. అతడి శరీరాం నేలకు గట్టిగా తగడంలో భరత్ తీవ్రంగా గాయపడ్డాడు. దీంతో అతడి స్నేహితులు హుటాహుటిన భరత్ కుమార్ ఆస్పత్రికి తరలించారు. వైద్యులు చికిత్స అందిస్తుండగా భరత్ మృతి చెందాడు.
Comments
Please login to add a commentAdd a comment