Thegimpu Movie
-
ఓటీటీలోకి సంక్రాంతి బ్లాక్ బస్టర్స్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
సంక్రాతి బరిలో నిలిచి సూపర్ హిట్‌గా నిలిచిన చిత్రాలు ఓటీటీలో సందడి చేసేందుకు సిద్ధమయ్యాయి. థియేటర్లలో ప్రేక్షకులను అలరించిన ఈ చిత్రాలు ఓటీటీలోనూ అలరించనున్నాయి. బాక్సాఫీస్ వద్ద హిట్ టాక్ తెచ్చుకున్నాయి. ఇప్పటికే రెండు చిత్రాలు స్ట్రీమింగ్ అవుతుండగా.. మిగతా సినిమాలు వచ్చే వారం స్ట్రీమింగ్ కానున్నాయి. థియేటర్లలో చూడలేక మిస్సయినవారు ఎంచక్కా ఓటీటీలో చూసి ఎంజాయ్ చేయండి. వాల్తేరు వీరయ్య మెగాస్టార్ చిరంజీవి, శృతిహాసన్ జంటగా నటించిన చిత్రం‘వాల్తేరు వీరయ్య’. సంక్రాంతి కానుకగా థియేటర్లలో విడుదలైన ఈ మూవీ బాక్సాఫీస్‌ను షేక్ చేసింది. బాబీ దర్శకత్వంలో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. కేవలం మూడు రోజుల్లోనే వాల్తేరు వీరయ్య వందకోట్లు కలెక్ట్ చేసి బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. మాస్ మహారాజా రవితేజ కీలకపాత్ర పోషించారు. ఈ చిత్రం ఓటీటీ వేదికగా స్ట్రీమింగ్ అయ్యేందుకు సిద్ధమైంది. ఫిబ్రవరి 27వ తేదీ నుంచి వాల్తేరు వీరయ్య స్ట్రీమింగ్ తీసుకురానున్నట్లు నెట్‌ఫ్లిక్స్ ప్రకటించింది. ఓటీటీలో వీరసింహారెడ్డి నందమూరి బాలకృష్ణ నటించిన తాజా చిత్రం 'వీరసింహారెడ్డి'. సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ చిత్రం సూపర్ హిట్‌గా నిలిచిన సంగతి తెలిసిందే. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కిన ఆ సినిమాలో శ్రుతిహాసన్ హీరోయిన్గా నటించింది. ఫ్యాక్షన్ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కిన ఈ సినిమా బాలయ్య కెరీర్లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. ఈ నేపథ్యంలో ఫిబ్రవరి 23 నుంచి హాట్ స్టార్‌లో ఈ సినిమా స్ట్రీమింగ్ కానున్నట్లు అధికారికంగా ప్రకటించారు. కళ్యాణం కమనీయం యంగ్ హీరో సంతోష్ శోభన్ వరుస చిత్రాలతో దూసుకుపోతున్నాడు. పేపర్ బాయ్ చిత్రంతో హీరోగా పరిచయం అయిన అతడు ఏక్ మినీ కథ, మంచి రోజులు వచ్చాయి సినిమాలతో సూపర్ హిట్ అందుకున్నాడు. ఆ తర్వాత అతడు నటించిన చిత్రం ‘కళ్యాణం కమనీయం’. సంక్రాంతి సందర్భంగా జనవరి 14న థియేటర్లోకి వచ్చింది. తాజాగా ఈ ఈ సినిమా ఫిబ్రవరి 17 నుంచి ఆహాలో స్ట్రీమింగ్ అవుతోంది. తునివు తమిళ స్టార్ హీరో అజిత్ కథానాయకుడిగా నటించిన యాక్షన్ ఎంటర్టైనర్ తునివు. జీ సినిమా సంస్థతో కలిసి బాలీవుడ్ నిర్మాత బోనీ కపూర్ ఈ చిత్రాన్ని నిర్మించారు. టాలీవుడ్లో తెగింపు పేరుతో విడుదలైంది. సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా కోలీవుడ్‌లో హిట్ టాక్ తెచ్చుకుంది. తాజాగా ఈ చిత్రం ఓటీటీలో అలరిస్తుంది. ఫిబ్రవరి 8 నుంచి ప్రముఖ ఓటీటీ ఫ్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్ వేదికగా స్ట్రీమింగ్ అవుతుంది. వచ్చేస్తున్న వారసుడు దళపతి విజయ్ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం వారిసు(వారసుడు). వంశీ పైడిపల్లి దర్శకత్వం వహించిన ఈ మూవీ తెలుగు, తమిళంలో సూపర్ హిట్‌గా నిలిచింది. దిల్ రాజు నిర్మించిన ఈ చిత్రానికి తమన్ సంగీతం అందించాడు. సంక్రాంతికి రిలీజైన వారసుడు బాక్సాఫీస్ వద్ద వసూళ్ల ప్రభంజనం సృష్టించింది. తాజాగా ఈ చిత్రం ఓటీటీలోకి రాబోతోంది. అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఫిబ్రవరి 22 నుంచి అందుబాటులోకి రానుంది. -
ఓటీటీకి వచ్చేస్తున్న తెగింపు.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
తమిళ స్టార్ హీరో అజిత్ కథానాయకుడిగా నటించిన యాక్షన్ ఎంటర్టైనర్ తునివు. జీ సినిమా సంస్థతో కలిసి బాలీవుడ్ నిర్మాత బోనీ కపూర్ ఈ చిత్రాన్ని నిర్మించారు. టాలీవుడ్లో తెగింపు పేరుతో విడుదలైంది. సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా కోలీవుడ్‌లో హిట్ టాక్ తెచ్చుకుంది. తాజాగా ఈ చిత్రం ఓటీటీ రిలీజ్‌కు సిద్ధమైంది. ఫిబ్రవరి 8 నుంచి అన్ని భాషల్లో విడుదల కానుందని చిత్రబృందం ప్రకటించింది. అసలు కథేంటంటే.. బ్యాంకు దోపిడి ఇతివృత్తంగా ‘తెగింపు’సినిమా కథనం సాగుతుంది. విశాఖపట్నంలోని ‘యువర్ బ్యాంక్’లో రూ.1000 కోట్ల మాత్రమే నిల్వ ఉంచడానికి అనుమతి ఉండగా.. నిబంధనలకు విరుద్దంగా మరో 500 కోట్లను డిపాజిట్ చేస్తారు. ఆ 500 కోట్ల రూపాయలను కొట్టేయడానికి ఏసీపీ ప్రవీణ్(అజయ్) ప్లాన్ చేస్తాడు. అతని మనుషులు బ్యాంక్‌లోకి వెళ్లగా..అక్కడ అప్పటికే డార్క్ డెవిల్ చీఫ్(అజిత్) ఉంటాడు. అతను కూడా తన టీమ్‌తో కలిసి డబ్బును కొట్టేసేందుకు బ్యాంకుకు వస్తాడు. అతని టీమ్‌లో మొత్తం ఐదుగురు ఉంటారు. వారిలో రమణి(మంజు వారియర్) ఒకరు. ఆమె బయట ఉండి టెక్నాలజీ సాయంతో అజిత్‌కు అన్ని విషయాలు చేరవేస్తుంది. అసలు డార్క్ డెవిల్ గ్యాంగ్ యువర్ బ్యాంకుని ఎందుకు టార్గెట్ చేసింది? డబ్బులను కొట్టేయాలనే ప్లాన్ ఎవరిది? ఏసీపీ ప్రవీణ్ వెనుక ఉన్నదెవరు? బ్యాంకు యజమాని క్రిష్ (జాన్ కొక్కెన్) అధినేతగా ఉన్న యువర్ బ్యాంక్‌లోకి రూ.25000 కోట్ల రూపాయలు ఎలా వచ్చి చేరాయి? ఈ స్కామ్‌లో ఉన్నదెవరు? చివరకు అజిత్ టీమ్ ఇచ్చిన ట్విస్ట్ ఏంటి? అనేది తెలియాలంటే థియేటర్స్‌లో ‘తెగింపు’ సినిమా చూడాల్సిందే. ' థియేటర్లలో చూడడం మిస్సయినా వారు ఎంచక్కా ఓటీటీలో చూసేయండి. It is time for the explosions to begin because Ajith Kumar is finally here! 🤯💥🤯💥 Thunivu is coming to Netflix on Feb 8th in Tamil, Telugu, Malayalam, Kannada and Hindi and we cannot stay CHILLA CHILLA! 🤩 #ThunivuOnNetflix #NoGutsNoGlory pic.twitter.com/og49yHrRAF — Netflix India South (@Netflix_INSouth) February 3, 2023 -
వారిసు, తునివు థియేటర్ యాజమాన్యాలకు నోటీసులు
తమిళ స్టార్ హీరోలు విజయ్, అజిత్ చిత్రాల విడుదల చేసిన థియేటర్ల యాజమాన్యానికి ప్రభుత్వం షాక్ ఇచ్చింది. విజయ్ నటించిన వారిసు, అజిత్ తుణివు చిత్రాలు పొంగల్ సందర్భంగా ఈ నెల 11వ తేదీన భారీ ఎత్తున విడుదలైన విషయం తెలిసిందే. అయితే ఈ రెండు చిత్రాలు విడుదలకు ప్రభుత్వం కొన్ని నిబంధనలను విధించింది. ముఖ్యంగా 11, 12వ తేదీల్లో మాత్రమే ప్రత్యేక షోలకు అనుమతి ఇచ్చింది. చదవండి: వారి వల్లే అనసూయ జబర్దస్త్ నుంచి బయటకు వచ్చిందా? అదేవిధంగా థియేటర్ల ముందు భారీ కటౌట్లు ఏర్పాటు చేయరాదని, వాటికి పూజలు, పాలాభిషేకాలు వంటివి నిర్వహించరాదని, సినిమా టికెట్లను అధిక రేట్లకు విక్రయించకూడదని నిబంధనలు విధించింది. అయితే ఈ రెండు చిత్రాలను ప్రభుత్వ నిబంధనలను అతిక్రమిస్తూ థియేటర్ యాజమాన్యం ఈనెల 17వ తేదీ వరకు ప్రత్యేక ఆటలను ప్రదర్శించారు. అంతేకాదు టికెట్లను బ్లాక్‌లో రూ.1000, రూ.2000 వరకు విక్రయించినట్లు ప్రచారం జరిగింది. ఇకపోతే థియేటర్ల ముందు అభిమానులు రచ్చ రచ్చ చేశారు. చదవండి: అల్లు అర్జున్‌కు దుబాయ్ ప్రభుత్వం అరుదైన గౌరవం కాగా నటుడు విజయ్ నటించిన వారిసు చిత్రం ప్రపంచవ్యాప్తంగా వారం రోజుల్లోనే రూ. 210 కోట్లు వసూలు చేసినట్లు, అజిత్ నటించిన తుణివు రూ.150 కోట్లకుపైగా వసూలు చేసినట్లు నిర్మాతలు అధికారికంగా ప్రకటించారు. కాగా ఇలాంటి అన్ని విషయాలపై వివరణ కోరుతూ ప్రభుత్వం థియేటర్ల యాజమాన్యానికి నోటీసులు జారీ చేసింది. వారు సరైన వివరణ ఇవ్వకుంటే 1957లోని ప్రభుత్వం చట్టం ప్రకారం చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం హెచ్చరించింది. -
‘తునివి’ థియేటర్ వద్ద అపశ్రుతి, అజిత్ ఫ్యాన్ మృతి
తమిళ స్టార్ అజిత్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తమిళనాట ఆయనకు విపరీతమైన ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఉంది. ఇక ఆయన సినిమా రిలీజ్ అంటే థియేటర్ల ముందు అభిమానులు చేసే హంగామా అంతాఇంత కాదు. ఆయన తాజా చిత్రం తునివు(తెలుగులో తెగింపు) బుధవారం(జనవరి 11న) థియేటర్లోకి వచ్చింది. ఈ సందర్భంగా ఓ వీరాభిమాని అజిత్ భారీ కటౌట్ కోసం ఏకంగా రూ. 70 లక్షలు ఖర్చు చేశాడు. ఇదిలా ఉంటే తాజాగా తునివు మూవీ ఆడుతున్న థియేటర్ వద్ద అపశ్రుతి చోటుచేసుకుంది. చదవండి: ఆర్యన్ ఖాన్‌తో డేటింగ్! క్లారిటీ ఇచ్చిన పాకిస్తాన్ నటి ఈ రోజు తెల్లావారు జామున వేసిన స్పెషల్ షోలో అత్యుత్సాహంతో ఓ అభిమానికి ప్రాణాలు కోల్పొయాడు. వివరాలు.. తునివు స్పెషల్ షో ఈ రోజు ఉదయం తెల్లావారు జామున ఒంటి గంటలకు వేశారు. ఈ షో చూసేందుకు భారీ అభిమానులు థియేటర్‌కు వచ్చారు. అందులో భరత్ కుమార్(19) అనే అజిత్ వీరాభిమాని చెన్నైలోని కోయంబేడ్ రోహిణి థియేటర్‌కు తన మిత్రులతో కలిసి వెళ్లాడు. ఇక షో అయిపోయాకు అభిమానులంతా థియేటర్ ముందు కేకలు వేస్తూ అల్లరి చేయడం మొదలు పెట్టారు. చదవండి: అజిత్, విజయ్ చిత్రాలకు తమిళనాడు ప్రభుత్వం షాక్ అలా ఫ్యాన్స్ అంతా రోడ్డు పైకికు అజిత్ పేరు అరుస్తూ రచ్చ రచ్చ చేశారు. ఈ క్రమంలో అక్కడ ట్రాఫిక్ జామ్ అయ్యింది. అత్యుత్సాహంతో ఉన్న భరత్ అక్కడ మెల్లిగా కదులుతున్న నీళ్ల ట్యాంకర్ లారీ ఎక్కాడు. దానిపైకి ఎక్కి అజిత్ పేరు గట్టిగా అరుస్తూ డాన్స్ చేశాడు. ఈ క్రమంలో పట్టు తప్పడంతో అతడు లారీ మీద నుంచి కింద పడ్డాడు. అతడి శరీరాం నేలకు గట్టిగా తగడంలో భరత్ తీవ్రంగా గాయపడ్డాడు. దీంతో అతడి స్నేహితులు హుటాహుటిన భరత్ కుమార్ ఆస్పత్రికి తరలించారు. వైద్యులు చికిత్స అందిస్తుండగా భరత్ మృతి చెందాడు. -
Thegimpu Review: ‘తెగింపు’ మూవీ రివ్యూ
టైటిల్: తెగింపు నటీనటులు: అజిత్, మంజు వారియర్, జాన్ కొక్కెన్, యోగి బాబు, సముద్రఖని, మహానది శంకర్ తదితరులు నిర్మాత : బోనీ కపూర్ దర్శకుడు: హెచ్.వినోద్ సంగీతం: జిబ్రాన్ సినిమాటోగ్రఫీ: నిరవ్ షా విడుదల తేది: జనవరి 11, 2022 కథేంటంటే.. బ్యాంకు దోపిడి ఇతివృత్తంగా ‘తెగింపు’సినిమా కథనం సాగుతుంది. విశాఖపట్నంలోని ‘యువర్ బ్యాంక్’లో రూ.1000 కోట్ల మాత్రమే నిల్వ ఉంచడానికి అనుమతి ఉండగా.. నిబంధనలకు విరుద్దంగా మరో 500 కోట్లను డిపాజిట్ చేస్తారు. ఆ 500 కోట్ల రూపాయలను కొట్టేయడానికి ఏసీపీ ప్రవీణ్(అజయ్) ప్లాన్ చేస్తాడు. అతని మనుషులు బ్యాంక్‌లోకి వెళ్లగా..అక్కడ అప్పటికే డార్క్ డెవిల్ చీఫ్(అజిత్) ఉంటాడు. అతను కూడా తన టీమ్‌తో కలిసి డబ్బును కొట్టేసేందుకు బ్యాంకుకు వస్తాడు. అతని టీమ్‌లో మొత్తం ఐదుగురు ఉంటారు. వారిలో రమణి(మంజు వారియర్) ఒకరు. ఆమె బయట ఉండి టెక్నాలజీ సాయంతో అజిత్‌కు అన్ని విషయాలు చేరవేస్తుంది. అసలు డార్క్ డెవిల్ గ్యాంగ్ యువర్ బ్యాంకుని ఎందుకు టార్గెట్ చేసింది? డబ్బులను కొట్టేయాలనే ప్లాన్ ఎవరిది? ఏసీపీ ప్రవీణ్ వెనుక ఉన్నదెవరు? బ్యాంకు యజమాని క్రిష్ (జాన్ కొక్కెన్) అధినేతగా ఉన్న యువర్ బ్యాంక్‌లోకి రూ.25000 కోట్ల రూపాయలు ఎలా వచ్చి చేరాయి? ఈ స్కామ్‌లో ఉన్నదెవరు? చివరకు అజిత్ టీమ్ ఇచ్చిన ట్విస్ట్ ఏంటి? అనేది తెలియాలంటే థియేటర్స్‌లో ‘తెగింపు’ సినిమా చూడాల్సిందే. ఎలా ఉందంటే.. బ్యాంకు దోపిడి నేపథ్యంలో గతంలో చాలా సినిమాలే వచ్చాయి. తెగింపు కూడా ఆ కోవలోకి చెందిన సినిమానే. బ్యాంకులను అడ్డం పెట్టుకొని కొంతమంది ఎలాంటి స్కామ్‌లు చేస్తున్నారనేది ఈ సినిమాలో చూపించారు. ఈ పాయింట్‌తో ఇటీవల మహేశ్ బాబు సర్కారువారి పాట సినిమా కూడా వచ్చింది. అయితే ఈ సినిమా కథనం వేరేలా సాగుతుంది. ఫుల్ యాక్షన్ థ్రిల్లర్‌గా ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు దర్శకుడు వినోద్. ఫస్టాఫ్‌లో కథ ఏమి ఉండదు కానీ.. ఒక్కో పాత్రని ఎస్టాబ్లిష్ చేసుకుంటూ పోవడంతో అసలు బ్యాకింగ్ రాబరీ వెనక ఉన్నదెరనే క్యూరియాసిటీ ప్రేక్షకుల్లో పెరుగుతుంది. మొత్తం మూడు గ్యాంగ్‌లు బ్యాంక్ దోపిడికి ప్లాన్ చేయడం.ఒక్కో గ్యాంగ్ వెనుక ఊహించని వ్యక్తులు ఉండడంతో కథనం చాలా ఆసక్తికరంగా సాగుతుంది. అయితే ఫస్టాఫ్‌లో కథ కంటే..ఫైటింగ్ సీన్సే ఎక్కువ. బ్యాంకులోకి వెళ్లడానికి పోలీసులు ప్లాన్ చేయడం..దానిని హీరో గ్యాంగ్ తిప్పికొట్టడం..ఇలానే సాగుతుంది. ఆ ఫైటింగ్ సీన్స్ చూస్తే విజయ్ ‘బీస్ట్’ సినిమా గుర్తొస్తుంది. అక్కడ హీరో షాపింగ్‌మాల్‌లో ఫైట్ చేస్తే..ఇక్కడ బ్యాంకులో చేస్తాడు. భారీ యాక్షన్ సీన్స్‌తో ఫస్టాఫ్‌ని కొంత ఆసక్తికరంగా తీర్చిదిద్దారు.ఇక సెకండాఫ్‌లో కథ మాత్రం చాలా రోటీన్‌గా సాగుతుంది. ఫ్లాష్ బ్యాక్ సీన్స్ సినిమాకు మైనస్. ఎమోషనల్ సన్నివేశాలు కూడా వర్కౌట్ కాలేదు. క్లైమాక్స్ కూడా చాలా రొటీన్‌గా ఉంటుంది. దర్శకుడు కథను పట్టించుకోకుండా హీరోయిజంపైనే ఎక్కువ దృష్టి పెట్టినట్లు అనిపిస్తుంది. అజిత్ సినిమాలు చాలా కాలంగా కేవలం హీరోయిజాన్ని, స్టంట్ లను నమ్ముకుని తీసేస్తున్నారు. ఈ ‘తెగింపు’ కూడా అలాంటిదే. అజిత్ వీరాభిమానులకు నచ్చుతుంది. ఎవరెలా చేశారంటే.. అజిత్ ఎప్పటిలాగే యాక్షన్ సీక్వెన్స్ అదరగొట్టేశాడు. తెరపై చాలా స్టైలీష్‌గా కనిపించాడు. మంజు వారియర్‌కి మంచి పాత్ర లభించింది. డార్క్ డెవిల్ టీమ్ మెంబర్‌గా ఆమె తెరపై కనిపించేది కొద్ది నిమిషాలే అయినా..తనదైన నటనతో ఆకట్టుకుంది. యాక్షన్ సీస్స్లో అదరగొట్టేసింది. కమిషనర్ పాత్రలో సముద్రఖని ఒదిగిపోయాడు. కానీ అతని పాత్రకి సరైన జస్టిఫికేషన్ ఇవ్వకపోవడంతో సినిమాపై ఇంపాక్ట్ క్రియేట్ చేయలేదు. నెగెటివ్ షేడ్ ఉన్న ఏసీపీ ప్రవీణ్‌గా అజయ్ తనదైన నటనతో ఆకట్టుకున్నాడు.మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేరనటించారు. ఇక సాంకేతిక విషయానికి వస్తే.. జిబ్రాస్ సంగీతం సినిమాకు ప్రధాన బలం. పాటలు అంతంత మాత్రమే అయినా.. నేపథ్య సంగీతం మాత్రం అదిరిపోయింది. తనదైన బీజీఎంతో సినిమా స్థాయిని పెంచేశాడు. అలాగే నిరవ్ షా సినిమాటోగ్రఫీ కూడా సినిమాకు చాలా ప్లస్. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉన్నాయి.