తమిళ స్టార్ హీరో అజిత్ కథానాయకుడిగా నటించిన యాక్షన్ ఎంటర్‌టైనర్ తునివు. జీ సినిమా సంస్థతో కలిసి బాలీవుడ్ నిర్మాత బోనీ కపూర్ ఈ చిత్రాన్ని నిర్మించారు. టాలీవుడ్‌లో తెగింపు పేరుతో విడుదలైంది. సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా కోలీవుడ్‌లో హిట్ టాక్ తెచ్చుకుంది. తాజాగా ఈ చిత్రం ఓటీటీ రిలీజ్‌కు సిద్ధమైంది. ఫిబ్రవరి 8 నుంచి అన్ని భాషల్లో విడుదల కానుందని చిత్రబృందం ప్రకటించింది.
అసలు కథేంటంటే..
బ్యాంకు దోపిడి ఇతివృత్తంగా ‘తెగింపు’సినిమా కథనం సాగుతుంది. విశాఖపట్నంలోని ‘యువర్ బ్యాంక్’లో రూ.1000 కోట్ల మాత్రమే నిల్వ ఉంచడానికి అనుమతి ఉండగా.. నిబంధనలకు విరుద్దంగా మరో 500 కోట్లను డిపాజిట్ చేస్తారు. ఆ 500 కోట్ల రూపాయలను కొట్టేయడానికి ఏసీపీ ప్రవీణ్(అజయ్) ప్లాన్ చేస్తాడు. అతని మనుషులు బ్యాంక్‌లోకి వెళ్లగా..అక్కడ అప్పటికే డార్క్ డెవిల్ చీఫ్(అజిత్) ఉంటాడు. అతను కూడా తన టీమ్‌తో కలిసి డబ్బును కొట్టేసేందుకు బ్యాంకుకు వస్తాడు. అతని టీమ్‌లో మొత్తం ఐదుగురు ఉంటారు. వారిలో రమణి(మంజు వారియర్) ఒకరు. ఆమె బయట ఉండి టెక్నాలజీ సాయంతో అజిత్‌కు అన్ని విషయాలు చేరవేస్తుంది. అసలు డార్క్ డెవిల్ గ్యాంగ్ యువర్ బ్యాంకుని ఎందుకు టార్గెట్ చేసింది? డబ్బులను కొట్టేయాలనే ప్లాన్ ఎవరిది? ఏసీపీ ప్రవీణ్ వెనుక ఉన్నదెవరు? బ్యాంకు యజమాని క్రిష్ (జాన్ కొక్కెన్) అధినేతగా ఉన్న యువర్ బ్యాంక్‌లోకి రూ.25000 కోట్ల రూపాయలు ఎలా వచ్చి చేరాయి? ఈ స్కామ్‌లో ఉన్నదెవరు? చివరకు అజిత్ టీమ్ ఇచ్చిన ట్విస్ట్ ఏంటి? అనేది తెలియాలంటే థియేటర్స్‌లో ‘తెగింపు’ సినిమా చూడాల్సిందే. ' థియేటర్లలో చూడడం మిస్సయినా వారు ఎంచక్కా ఓటీటీలో చూసేయండి.
It is time for the explosions to begin because Ajith Kumar is finally here! 🤯💥🤯💥
— Netflix India South (@Netflix_INSouth) February 3, 2023
Thunivu is coming to Netflix on Feb 8th in Tamil, Telugu, Malayalam, Kannada and Hindi and we cannot stay CHILLA CHILLA! 🤩 #ThunivuOnNetflix #NoGutsNoGlory pic.twitter.com/og49yHrRAF
Comments
Please login to add a commentAdd a comment