![Sundeep Kishan Fan Seenu Died And Hero Helped His family - Sakshi](/styles/webp/s3/article_images/2019/01/18/sundeep.jpg.webp?itok=XksEZu_R)
హీరోలకు, అభిమానులకు మధ్య ఉండే అనుబంధమే వేరు. ముఖ్యంగా తెలుగు హీరోలు వారి అభిమానులపై చూపే ప్రేమకు ఫ్యాన్స్ ఫిదా అవుతుంటారు. వారి కోసమే ప్రత్యేకించి సినిమాలను చేస్తూ ఉంటారు హీరోలు. అభిమానులే దేవుళ్లు అంటూ సినిమా ఫంక్షన్లలో హీరోలు వారి గురించి చెబుతూ ఉంటారు. అలాంటి ఓ అభిమాని చనిపోవడంతో.. యంగ్ హీరో సందీప్ కిషన్ అతని కుటుంబానికి అండగా నిలిచి మంచి మనసును చాటుకున్నారు.
సందీప్‌కిషన్ తొలి చిత్రం `ప్రస్థానం` నుండి అభిమాని అయిన కడప శ్రీను ఈరోజు ప్రొద్దుటూరులో గుండెపోటుతో కన్నుమూశారు. ఈ విషయం తెలుసుకున్న సందీప్ కిషన్ కడప శ్రీను దహన సంస్కారాలకయ్యే డబ్బులు ఇచ్చారు. అంతే కాకుండా ఆయన తల్లికి నెలకు ఏడువేల రూపాయల ఆర్ధిక సాయాన్ని అందించనున్నట్లు తెలియజేశారు. `నాకు అన్ని సందర్భాల్లో అండగా నిలబడ్బ నా అభిమాని, నా తొలి అభిమానిని కోల్పోవడం బాధాకరం. చిన్న వయసులోనే నా సోదరుడు దూరం కావడం బాధాకరం. నీ కుటుంబానికి ఎప్పటికీ రుణపడి ఉంటాను శ్రీను. నీ కుటుంబ బాధ్యత నాది. లవ్ యు శ్రీను.. నీ ఆత్మకు శాంతి కలగాలి` అంటూ హీరో సందీప్ కిషన్ తన ట్విట్టర్ ద్వారా సంతాపాన్ని ప్రకటించారు.
Comments
Please login to add a commentAdd a comment