Jr NTR Fan Died In Bimbisara Movie Pre Release Event - Sakshi
Sakshi News home page

Bimbisara Pre Release Event: ‘బింబిసార’ ఈవెంట్‌లో విషాదం, ఫ్యాన్‌ అనుమానాస్పద మృతి

Published Sat, Jul 30 2022 11:17 AM | Last Updated on Sat, Jul 30 2022 12:04 PM

Jr NTR Fan Died In Bimbisara Movie Pre Release Event - Sakshi

బింబిసార ప్రిరిలీజ్‌ ఈవెంట్‌లో విషాదం చోటుచేసుకుంది. ఈ కార్యక్రమంలో ఎన్టీఆర్‌ అభిమాని అనుమానస్పద స్థితిలో మృతి చెందాడు. కాగా నందమూరి హీరో కల్యాణ్‌ రామ్‌ చాలా గ్యాప్‌ తర్వాత నటించిన చిత్రం ‘బింబిసార’. ఈ మూవీ ప్రిరిలీజ్‌ వేడుక నిన్న(శుక్రవారం) శిల్పకళా వేదికలో జరిగిన సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమానికి జూనియర్‌ ఎన్టీఆర్‌ ముఖ్యఅతిథిగా వచ్చాడు. ఈ సందర్భంగా నందమూరి హీరోలను చూసేందుకు నందమూరి అభిమానులు హైదరాబాద్‌కు శిల్పకళావేదికకు తరలి వచ్చారు.

చదవండి: స్టార్‌ హీరో షూటింగ్‌ సెట్‌లో భారీ అగ్ని ప్రమాదం, ఒకరు మృతి

ఈ క్రమంలో సాయిరాం అనే అభిమాని అనుమానస్పద స్థితిలో మృతి చెందారు. అతడిని వెంటనే ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఈ విషయం ఆలస్యంగా వెలుగు చూసింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి విచారిస్తున్నారు. కాగా మృతుడి పూర్తి పేరు పుట్టా సాయిరాం అని అతడు తాడేపల్లిగూడెనికి చెందిన వ్యక్తి అని తెలిసింది. హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్‌ సంస్థలో జాబ్‌ చేస్తున్నట్లు పోలీసులు నిర్ధారించారు. ప్రస్తుతం సాయిరాం మృతదేహం ఉస్మానియా ఆస్పత్రిలోనే ఉందని, ఈ ఘటనపై విచారిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement