Shilpakala vedika
-
అత్యంత అద్భుతంగా నాట్య తోరణం (ఫోటోలు)
-
ఆరు నాట్యరీతుల అద్భుత సమాగమం
ఒకటి కాదు.. రెండు కాదు.. ఒకేసారి ఒకే వేదికపై ఆరు రకాల నృత్యరీతులను అత్యంత అద్భుతంగా ప్రదర్శించి ప్రేక్షకులను రంజింపజేసింది.. అమ్రిత కల్చరల్ ట్రస్టు వారి నాట్యతోరణం కార్యక్రమం. నగరంలోని శిల్పకళావేదికలో శనివారం సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు సాగిన ఈ కార్యక్రమానికి ప్రాంగణం సామర్థ్యాన్ని మించి ప్రేక్షకులు రావడంతో మొత్తం కిక్కిరిసిపోయింది. భరతనాట్యం, కూచిపూడి, మోహినీ అట్టం, కథక్, ఒడిస్సీ, ఆంధ్రనాట్యం లాంటి నృత్యరీతులకు చెందిన కళాకారిణులు ఒక్కో విభాగంలో 6 నుంచి 10 మంది చొప్పున తమ తమ నాట్యాలను ప్రదర్శించారు. అనంతరం మొత్తం కళాకారిణులు అందరూ కలిసి ఒకేసారి చేసిన జుగల్బందీ ప్రేక్షకులను కట్టిపడేసింది.ప్రముఖ నాట్యగురువులు కళాకృష్ణ (ఆంధ్రనాట్యం), అనితా గుహ (భరతనాట్యం), చావలి బాల త్రిపురసుందరి (కూచిపూడి), నీనా ప్రసాద్ (మోహినీ అట్టం), శామా భాటే (కథక్), బిచిత్రానంద స్వైన్ (ఒడిస్సీ), పేరిణి కుమార్ (పేరిణి నాట్యం-ఆంధ్రనాట్యం) తదితరుల సారథ్యంలో ఈ కళాకారులంతా తమ తమ ప్రదర్శనలతో అందరినీ ఆకట్టుకున్నారు. అమ్రిత కల్చరల్ ట్రస్టును పగడాల రాజేష్, భార్గవి దంపతులు ప్రారంభించారు. దీని యాజమాన్య కమిటీలో సీతా ఆనంద్ వైద్యం, రేవతి పుప్పాల, సురేంద్రనాధ్ తదితర దిగ్గజాలు ఉన్నారు.భారతీయ సంప్రదాయానికి పెద్దపీట వేస్తూ... అన్ని ప్రాంతాలకు చెందిన నృత్య కళారీతులను ప్రోత్సహించేలా ఇంత పెద్ద కార్యక్రమాన్ని ఇంత అద్భుతంగా నిర్వహించినందుకు అమ్రిత కల్చరల్ ట్రస్టును అభినందించకుండా ఉండలేకపోతున్నామని కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా పాల్గొన్న తెలంగాణ దేవాదాయ శాఖ ముఖ్య కార్యదర్శి శ్రీమతి శైలజా రామయ్యర్, మాజీ ఐఏఎస్ అధికారి తోట చంద్రశేఖర్, ఆదాయపన్ను శాఖ మాజీ ప్రిన్సిపల్ చీఫ్ కమిషనర్ పి.వి. రావు అన్నారు. నృత్య ప్రదర్శనల్లో పాల్గొన్న కళాకారిణులందరికీ ఈ రంగంలో అద్భుతమైన భవిష్యత్తు ఉంటుందని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో ప్రత్యేక అతిథులుగా రిటైర్డ్ ఐఎఫ్ఎస్ అధికారి టీవీ నరసింహారావు, పద్మశ్రీ పద్మజారెడ్డి, కోటి సూర్య ప్రభ, శిల్పారెడ్డి, టీవీ9 రజనీకాంత్, పద్మశ్రీ ఉమామహేశ్వరి, మాదాల రవి, ఆశ్రిత వేముగంటి తదితరులు పాల్గొన్నారు.(చదవండి: Mouni Roy:కథక్‌తో ఆరోగ్య ప్రయోజనాలెన్నో.. మెస్మరైజ్ చేసిన నటి) -
హైదరాబాద్ శిల్పారామంలో జానపద జాతర.. ప్రజలందరికీ ఉచిత ప్రవేశం
భారతీయ సాంస్కృతిక వారసత్వం ప్రతిబింబించేందుకు వేడుక సిద్ధమైంది. ‘లోక్ మంథన్’ పేరుతో నవంబర్ 21 నుంచి 24 వరకు మహోత్తరమైన ‘జానపద జాతర‘ హైదరాబాద్ శిల్పారామంలో కనుల విందు చేయనున్నది. ‘ప్రజ్ఞా ప్రవాహ్’ సంస్థ 2016 నుంచి ప్రతి రెండేళ్లకోసారి దేశంలోని ఒక్కో రాష్ట్రంలో లోక్ మంథన్ కార్యక్రమం నిర్వహిస్తోంది. విదేశాల నుంచి సైతం ఒక్కో తెగ, ఒక్కో జాతికి సంబంధించిన ఆచార వ్యవహారాలను ప్రతిబింబించే కళాకారులు దాదాపు 1500 మంది ఈ ‘జానపద జాతర’లో తమ కళలను ప్రదర్శిస్తారు. భిన్నత్వంలో ఏకత్వం చాటే ఈ మేళా ప్రారంభోత్సవానికి భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు హాజరవుతారు. రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ అగ్ర నేత మోహన్ భాగవత్‌తో పాటూ అనేకమంది కేంద్రమంత్రులూ వస్తున్నారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి లోక్‌మంథన్ ఆహ్వాన కమిటీ గౌరవ అధ్యక్షులుగా కార్యక్రమాన్ని పర్యవేక్షిస్తున్నారు.భారతీయ జానపద కళాకారుల సాంస్కృతిక ప్రదర్శనల ద్వారా ఈ దేశమంతా ఒకటేననే ఏకత్వాన్ని నిరూపించడమే లోక్ మంథన్ ప్రధాన లక్ష్యం. ‘జాతీయ గిరిజన గౌరవ దివస్’ పేరుతో భగవాన్ బిర్సా ముండా 150వ జయంతి పురస్కరించుకొని నిర్వహించే ఈ వేడుక మరింత ప్రాధాన్యత సంతరించుకుంది. సదస్సులు, సమావేశాల ఆధారంగా ప్రపంచంలోని వనవాసి, గిరివాసి సమస్యలను చర్చించి, వాటి పరిష్కారానికి మార్గాన్ని కూడా అన్వేషిస్తారు. సంప్రదాయ సాంస్కృతిక వాయిద్యాలు, పనిముట్లు ప్రదర్శిస్తారు. ఈ జాతరలో ప్రపంచవ్యాప్తంగా ఉన్న భారతీయ సాంస్కృతిక వారసత్వానికి చెందినవారు కూడా వచ్చి ప్రదర్శనలిస్తారు.ఇండోనేషియా కళాకారులు రామాయణం ఆధారంగా ప్రదర్శించే ‘కేచక్’ నృత్య ప్రదర్శన ఆకట్టుకుంటుంది. ప్రపంచంలో అబ్రహామిక్ మతాలకు పూర్వమున్న మతాలు, సంస్కృతుల వారు సైతం లోక్‌మంథన్‌కు హాజరవుతున్నారు. వీరిలో సిరియాలోని రోమోలు, ఆర్మేనియాలోని యజిదీలు (సూర్యపుత్రులు), లిథువేనియా వాసులు సైతం ఉన్నారు. అబ్రహామిక్ మతాల రాకకు పూర్వం ఆయా దేశాలలో అచరించిన, నేటికీ ఆచరిస్తున్న సూర్యారాధన, యజ్ఞం (అగ్నిని పూజించడం) నిర్వహణ విధానాలను వీరు హైదరాబాద్ లోక్‌మంథన్‌లో చేసి చూపిస్తారు. చదవండి: మణిపుర్ ఘర్షణలకు ముగింపెప్పుడు?ఈ సందర్భంగా జరిగే ఎగ్జిబిషన్లో తెలంగాణ, త్రిపుర, ఛత్తీస్‌గఢ్, ఉత్తరాఖండ్, మధ్యప్రదేశ్‌తో సహా 10 రాష్ట్రాలకు చెందిన విభిన్న కళలు, సంప్రదాయ ఆహారం, సంప్రదాయ గ్రామీణ క్రీడలు, సాహిత్యం, ఇతర సాంస్కృతిక అంశాలౖపై చర్చలు ఉంటాయి. భారతీయ ప్రజలు ఏ ప్రాంతంలో నివసిస్తున్నా... వారి అందరి సాంస్కృతిక పునాదులు జానపదంలోనే ఉన్నాయి. మన మూలాలను ఒకసారి అందరికీ చాటిచెప్పే లక్ష్యంతో జరుగుతున్న ఈ జాతరకు అందరూ ఆహ్వానితులే. ఉత్సవాలు జరిగే నాలుగు రోజులూ శిల్పారామంలోకి ప్రజలందరికీ ఉచిత ప్రవేశం ఉంటుంది.– పగుడాకుల బాలస్వామి; ప్రచార ప్రసార ప్రముఖ్, వీహెచ్‌పీ, తెలంగాణ రాష్ట్రం(నేటి నుంచి ‘లోక్ మంథన్’ ప్రారంభం) -
1500 కళాకారులు.. 350 ఎగ్జిబిట్స్, 100 స్పీకర్స్, 12 దేశాలు
సాక్షి, హైదరాబాద్: రెండేళ్లకోసారి ప్రతిష్టాత్మకంగా నిర్వహించే ‘లోక్ మంథన్’ వేడుకలకు సర్వం సిద్ధమైంది. భారతీయ జానపద సాంస్కృతిక ఉత్సవాలను ఈ నెల 21 నుంచి 24 వరకు నిర్వహించనున్నారు. కార్యక్రమానికి దేశం నలుమూలల నుంచి ప్రముఖులు, సుమారు 2 వేల మందికి పైగా జానపద కళాకారులు తరలి రానున్నారు. ఇప్పటికే ప్రీ లోక్ మంథన్ పేరిట అవగాహన సదస్సులను, ప్రచార కార్యక్రమాలను చేపట్టారు. దేశంలో విశిష్టమైన ప్రజాస్వామ్య వ్యవస్థ అమలులో ఉండేదని, విదేశీయుల దండయాత్రల కారణంగా గ్రామీణ ప్రజలకంటే పట్టణవాసులు ఉన్నతులుగా భావించే వివక్ష ఏర్పడిందని, ఈ నేపథ్యంలో గ్రామీణ విజ్ఞానం నిర్లక్ష్యానికి గురైందని లోక్ మంథన్ నిర్వాహకులు భావిస్తారు. అందుకే ప్రకృతి జానపదుల గొప్పతనాన్ని లోకానికి చాటిచెప్పే లక్ష్యంతోనే ‘లోక్ మంథన్’ నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. జానపదుల విశ్వాసాలు, జీవన విధానం, దృక్పథం, వేల ఏళ్లుగా సమాజాన్ని ఏలిన వ్యవస్థల వివరాలను వెలికి తీసుకురావాలనేదే లోక్‌మంథన్ ఉద్దేశం. ప్రజ్ఞా భారతి ఆధ్వర్యంలో ఈ లోక్‌మంథన్ వేడుకలు ఇప్పటి వరకు రాంచీ, భోపాల్, గువాహటి, తదితర నగరాల్లో ఘనంగా జరిగాయి. భాగ్యనగరం వేదికగా.. ఈ బృహత్తర కార్యక్రమానికి హైదరాబాద్ నగరం వేదిక కానుంది. సంగీతం, నృత్యం, కళలు, క్రీడలు, ఆహారం, ఆరోగ్యం, ఆధ్యాత్మికత తదితర అంశాలపై సమాలోచనల సమాహారమే లోక్‌మంథన్. అర్మేనియా, లూథియానా వంటి దేశాల మూల సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించే పలు కళా ప్రదర్శనలు, సమాలోచనలు చేసేందుకు వేలాది మంది తరలిరానున్నారు. బాలి నుంచి పద్మశ్రీ గ్రహీత వాయన్ దిబియా తన బృందంతో కలిసి రామాయణ ఇతిహాసం ప్రదర్శించనున్నారు.చదవండి: ఒత్తయిన జుట్టు.. ఒత్తిడితో ఫట్టునగరీకరణ కారణంగా అస్తిత్వాన్ని మరిచిపోతున్న నేటి తరానికి భారతీయ సామాజిక జీవిత మూలాలను తెలియజేసే ప్రయత్నమే లోక్ మంథన్. మన వ్యవస్థలో మొదటి నుంచి అడవి బిడ్డల సంస్కృతి, సంప్రదాయాలకు ప్రముఖ స్థానం ఉండేది. కానీ కాలక్రమేణా ఆ సంస్కృతి మరుగునపడింది. దీంతో అసలైన భారతీయతను నగర ప్రజలకు తెలియజేసేందుకు దేశంలోని వివిధ నగరాల్లో లోక్ మంథన్ నిర్వహిస్తున్నారు. హైదరాబాద్‌లో జరిగే ఈ లోక్‌మంథన్‌కు దేశ విదేశాలకు చెందిన వందలాది మంది కళాకారులు, మేధావులు, పరిశోధకులు హాజరుకానున్నారు.మనది అడవి బిడ్డల సంస్కృతి నగర ప్రజలు కెరీర్ వైపు, ఆధునికత వైపు విస్తారంగా పరుగులు తీస్తున్నారు. సమాజాన్ని ప్రభావితం చేస్తున్న ఈ సమూహానికి.. మన సమాజం మూలాలను గుర్తు చేసే ప్రయత్నమే లోకమంథన్. మన భారతీయల వ్యవస్థలో మొదటి నుంచీ అడవి బిడ్డల సంస్కృతి, సంప్రదాయాలకు ముఖ్యమైన స్థానం ఉండేది. కానీ కాలక్రమేణా అది మరుగున పడిపోయింది. అందుచేత అసలైన భారతీయతను నగర ప్రజలకు తెలియచెప్పేందుకు దేశంలోని వివిధ నగరాలలో లోక మంథన్ నిర్వహిస్తున్నాం. – నందకుమార్, ప్రజ్ఞా ప్రవాహ్ అఖిల భారతీయ కన్వీనర్ -
శిల్పకళావేదికలో మాదక ద్రవ్యా ల వ్యతిరేక దినోత్సవం కార్యక్రమం (ఫొటోలు)
-
సందడిగా ‘సాక్షి’ ప్రాపర్టీ షో (ఫొటోలు)
-
హైదరాబాద్‌లో వీర్‌దాస్ స్టాండప్ కామెడీ షో.. ఎప్పుడంటే..
సాక్షి, హైదరాబాద్: నగరానికి మరో స్టాండప్ కమెడియన్ రాక ఖాయమైంది. డెహ్రాడూన్‌కి చెందిన వీర్‌దాస్ గత కొన్నేళ్లుగా దేశవ్యాప్తంగా స్టాండప్ కామెడీ షోలకు ప్రసిద్ధి చెందారు. అయితే చాలా మంది కమెడియన్లకు భిన్నంగా ఆయన అటు కమెడియన్‌గా ఇటు నటుడిగా కూడా రాణిస్తున్నారు. గతంలో ఒకటీ అరా ఉన్నప్పటికీ ఇటీవల వరుసగా కొన్ని షోస్‌లో ఆయన హాస్యంపై సంప్రదాయవాదులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. భారత సంస్కృతి, సంప్రదాయ వ్యతిరేక వ్యాఖ్యలు చేస్తున్నారంటూ హిందూ జనజాగృతి సమితి పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదుతో ఈ నెల 10న బెంగళూరులో ఆయన ప్రదర్శన రద్దయింది. అనంతరం తమ నగరంలో ప్రదర్శన ఇవ్వాల్సిందిగా తృణమూల్ కాంగ్రెస్ ఎంపీలు ఆయనకు ఆహ్వానం పలికారు.. వీటన్నింటి నేపథ్యంలో ఆయన నిర్వహిస్తున్న వాంటెడ్ టూర్ షెడ్యూల్ ప్రకారం ఈ నెల 20న నగరానికి వచ్చి మాదాపూర్ శిల్పకళావేదికలో ప్రదర్శన ఇవ్వనున్నారు. ఇప్పటికే ఆ ప్రదర్శనకు సంబంధించిన టిక్కెట్ల బుకింగ్స్ కూడా మొదలయ్యాయి. (క్లిక్: ఊహల్లో కోటీశ్వరుడిని చేసి ఉన్నదంతా ఊడ్చేశారు!) -
‘స్వాతిముత్యం’ ప్రీ రిలీజ్ వేడుక (ఫొటోలు)
-
మునావర్ కామెడీ షో: ప్రోగ్రామ్ 5 గంటలకే ప్రారంభం.. నో సెల్ ఫోన్స్
స్టాండప్ కమెడియన్ మునావర్ ఫారూఖీ షో.. తెలంగాణలో టెన్షన్‌కు క్రియేట్ చేసింది. మునవార్ షోకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అనుమతినిచ్చిన నేపథ్యంలో బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ ఫారూఖీ షోను అడ్డుకుంటామని వార్నింగ్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో పోలీసులు అలర్ట్ అయ్యారు. షో విషయంలో కీలక నిర్ణయం తీసుకున్నారు. మునావర్ కామెడీ షోను నిర్వాహకులు శనివారం సాయంత్రం 5 గంటలకే శిల్పకళా వేదికలో ప్రారంభించారు. కాగా, శిల్పకళా వేదిక గేట్లు సాయంత్రం 4:45కే మూసివేశారు. అలాగే, మునావర్ షోకు వచ్చే వారు షో టికెట్‌తో పాటుగా తమ వెంట ఆధార్ కార్డును కూడా తీసుకు రావాలని సూచించారు. కాగా, షోకు ఆహార పదార్ధాలు, వాటర్ బాటిల్స్, సెల్ ఫోన్స్ అనుమతిని నిరాకరించారు. ఇక, శిల్పకళా వేదిక వద్ద పోలీసులతో కొందరు వాదనకు దిగడంతో వారిని అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తోంది. ఇది కూడా చదవండి: తెలంగాణలో చలాన్ల బాదుడు.. వామ్మె ఇన్ని వేల కోట్లా? -
‘బింబిసార’ ఈవెంట్లో విషాదం, ఎన్టీఆర్ ఫ్యాన్ అనుమానాస్పద మృతి
బింబిసార ప్రిరిలీజ్ ఈవెంట్లో విషాదం చోటుచేసుకుంది. ఈ కార్యక్రమంలో ఎన్టీఆర్ అభిమాని అనుమానస్పద స్థితిలో మృతి చెందాడు. కాగా నందమూరి హీరో కల్యాణ్ రామ్ చాలా గ్యాప్ తర్వాత నటించిన చిత్రం ‘బింబిసార’. ఈ మూవీ ప్రిరిలీజ్ వేడుక నిన్న(శుక్రవారం) శిల్పకళా వేదికలో జరిగిన సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమానికి జూనియర్ ఎన్టీఆర్ ముఖ్యఅతిథిగా వచ్చాడు. ఈ సందర్భంగా నందమూరి హీరోలను చూసేందుకు నందమూరి అభిమానులు హైదరాబాద్‌కు శిల్పకళావేదికకు తరలి వచ్చారు. చదవండి: స్టార్ హీరో షూటింగ్ సెట్లో భారీ అగ్ని ప్రమాదం, ఒకరు మృతి ఈ క్రమంలో సాయిరాం అనే అభిమాని అనుమానస్పద స్థితిలో మృతి చెందారు. అతడిని వెంటనే ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఈ విషయం ఆలస్యంగా వెలుగు చూసింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి విచారిస్తున్నారు. కాగా మృతుడి పూర్తి పేరు పుట్టా సాయిరాం అని అతడు తాడేపల్లిగూడెనికి చెందిన వ్యక్తి అని తెలిసింది. హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ సంస్థలో జాబ్ చేస్తున్నట్లు పోలీసులు నిర్ధారించారు. ప్రస్తుతం సాయిరాం మృతదేహం ఉస్మానియా ఆస్పత్రిలోనే ఉందని, ఈ ఘటనపై విచారిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. -
శిల్పకళావేదికలో పీవీ సింధు
-
ఫ్యాషన్ ‘షో’
-
ఫ్యాషన్ పదనిసలు
-
శిల్పకళా వేదికలో సాక్షి ప్రాపర్టీ షో
-
శిల్పకళా వేదికలో సాక్షి ప్రాపర్టీ షో
-
‘అభ్యాస’ వార్షికోత్సవ వైభవం
-
శోభాయమానం..
-
ఎక్కడైతే పరిశుభ్రత ఉంటుందో అక్కడే అభివృద్ధి
హైదరాబాద్: సమాజంలో పరిశుభ్రతకు ప్రతి ఒక్కరూ ప్రాధాన్యత ఇవ్వాలని హెచ్ఎండీఏ కమిషనర్ జనార్ధన్ రెడ్డి కోరారు. శిల్పకళా వేదికలో సోమవారం వ్యర్థ పదార్థాల నిర్వహణ జాతీయ సదస్సులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ..ఎక్కడైతే పరిశుభ్రత ఉంటుందో అక్కడ అభివృద్ధి జరుగుతుందని వ్యాఖ్యానించారు. పరిశుభ్రత మన ఇంటి వంటగది నుంచే ప్రారంభం కావాలన్నారు. పరిశుభ్రతతో పాటు కాలుష్యాన్ని అరికట్టాలని, ప్లాస్టిక్‌ను కూడా నిరోధించాలని కోరారు. విద్యార్థులలో ఈ అంశాలపై అవగాహన పెరగాలన్నారు. చేసే పనిలో చిత్తశుద్ధి ఉండాలనే అభిప్రాయం వ్యక్తం చేశారు. తడి పొడి చెత్తను గుర్తించి వేరు చేయాలని, రెండేళ్ల కిందటే ఈ సంస్కరణలను జీహెచ్ఎంసీలో ప్రారంభించామని తెలిపారు. వాటి ఫలితాలు ఇప్పుడు కనిపిస్తున్నాయని చెప్పారు. నగర వాసుల్లో కూడా చైతన్యం పెరిగిందని వ్యాఖ్యానించారు. చెత్త ఎక్కువగా ఉత్పత్తి చేసే హోటళ్లు, పంక్షన్ హాల్ నిర్వాహకులు చెత్త డీకంపోజ్ యూనిట్స్ కూడా ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. -
కాకతీయ కళా వైభవ మహోత్సవం
-
ఖేర్.. హుషార్..
-
కలర్‌ఫుల్..ఫెస్ట్
-
నా వార్తల్లో నిజాయితే నన్ను ధైర్యంగా నిలబెట్టింది
-
మహాద్భుతం.. కాకతీయం
-
నృత్యం.. విశ్వవ్యాప్తం..
-
మాదాపూర్‌లో సిల్క్ ఇండియా ఎగ్జిబిషన్