మిసెస్ మిలమిల | Ms. Silk Mark 2014: women wears silk sarees with cat walk | Sakshi
Sakshi News home page

మిసెస్ మిలమిల

Published Sat, Sep 20 2014 4:27 AM | Last Updated on Sat, Sep 2 2017 1:39 PM

మిసెస్ మిలమిల

మిసెస్ మిలమిల

శ్రీమతులు సంప్రదాయ సిరులొలికించారు. పట్టు చీరలు ధరించి ర్యాంప్‌పై హొయలు పోయారు. ‘సిల్క్ మార్క్ ఆర్గనైజేషన్ ఆఫ్ ఇండియా’ మాదాపూర్ శిల్పకళావేదికలో శుక్రవారం నిర్వహించిన ‘శ్రీమతి సిల్క్ మార్క్ 2014’లో క్యాట్ వాక్‌లతో కేక పుట్టించారు. ఎవరికెవరూ తీసిపోనంతగా కలర్‌ఫుల్ శారీస్‌లో కనువిందు చేశారు. పట్టు వస్త్రాల ప్రేమికుల అభిలాషకు అనుగుణంగా... చేనేతను నమ్ముకొని జీవించే వారిని ప్రోత్సహించేలా ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్టు నిర్వాహకులు తెలిపారు. మొత్తం 60 మంది సిల్క్ లవర్స్ ఇందులో పాల్గొన్నారు. ఇదే వేదికపై ఈ నెల 25న జరిగే ‘గ్రాండ్ ఫినాలే’కు వీరిలో నుంచి 20 మందిని ఎంపిక చేశారు.
 -  సిరి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement