sarees
-
ఎస్‌హెచ్‌జీ సభ్యులకు ఒకే డిజైన్ చీరలు
సాక్షి, హైదరాబాద్: మహిళా స్వయం సహాయక సంఘాల్లో (ఎస్‌హెచ్‌జీ) సభ్యులుగా ఉన్న మహిళలకు ఒకే డిజైన్‌తో ఉండే చీరలు పంపిణీ చేసే ఆలోచనలో ప్రభుత్వం ఉంది. దీనికి సంబంధించి ఈ నెలాఖరులోగా విధి విధానాలు ఖరారు చేయా లని నిర్ణయించింది. చీరల పంపిణీ పథకాన్ని ఏ తరహాలో అమలు చేయాలనే అంశానికి సంబంధించి చేనేతశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఇటీవల సమీక్షించారు. మరో వారం రోజుల్లో సీఎం రేవంత్‌రెడ్డితో జరిగే భేటీలో పూర్తి స్థాయిలో చర్చించిన తర్వాత, చీరల పంపిణీ పథకం అమలుపై తుది నిర్ణయం తీసుకుంటారు.గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం రేషన్‌కార్డులో పేర్లు కలిగిన 18 ఏళ్లు పైబడిన యువతులు, మహిళలకు బతుకమ్మ చీరలు పంపిణీ చేసింది. అయితే రాష్ట్రంలో గ్రామీణ పేదరి క నిర్మూలన సంస్థ (సెర్ప్), మెప్మా పరిధిలోని 63 లక్షల మంది మహిళా సభ్యులకు ఈ చీరలు పంపిణీ చేయాలని ప్రస్తుత ప్రభుత్వం ప్రాథమికంగా నిర్ణయించింది. అయితే స్వయం సహాయక సంఘా ల మహిళలకు పంపిణీ చేసేది బతుకమ్మ చీరలు కాదని, రాష్ట్రమంతటా ఒకే డిజైన్ కలిగిన చీరలను పంపిణీ చేస్తామని చేనేతశాఖ వర్గాలు చెబుతున్నాయి. గత ప్రభుత్వం పంపిణీ చేసిన బతుకమ్మ చీరల్లో నాణ్యత లేదని, సరఫరాలో కుంభకోణం జరిగిందని సీఎం రేవంత్‌రెడ్డి అసెంబ్లీ సమావేశాల్లో ప్రకటించారు. ఈ నేపథ్యంలో పూర్తిగా స్థానికంగా ఉండే నేత కారి్మకులను భాగస్వాములను చేస్తూ నాణ్యత కలిగిన చీరలను ఉత్పత్తి చేసి పంపిణీ చేస్తామని అధికారులు చెబుతున్నారు. ఒక్కో మహిళకు ఒకటా.. రెండా..? స్వయం సహాయక సంఘాల మహిళలకు ఒక్కొక్కరికీ ఏటా ఎన్ని చీరలు పంపిణీ చేయాలనే అంశంపై స్పష్టత రావాల్సి ఉంది. ఎస్‌హెచ్‌జీల్లో పెరిగే సభ్యు ల సంఖ్యను కూడా దృష్టిలో పెట్టుకొని ఏటా రెండేసి చీరల చొప్పున పంపిణీ చేస్తే 1.3 కోట్ల చీరలు అవసరమవుతాయని ప్రాథమికంగా లెక్కలు వేశా రు. ఒక్కో చీర తయారీకి అయ్యే ఖర్చు, ఏటా కేటాయించాల్సిన బడ్జెట్ తదితరాలపై అధికారులు కసరత్తు చేస్తున్నారు.ఈ చీరలను పండుగ సమయా ల్లో ఇవ్వాలా, ఏదైనా ప్రత్యేక సందర్భంలో ఇవ్వా లా అకోణంలోనూ అధికారులు ఆలోచిస్తున్నారు. 2017లో బతుకమ్మ చీరల పథకం ప్రారంభంకాగా సగటున రూ.325 కోట్ల బడ్జెట్‌తో కోటి చీరలు పంపిణీ చేస్తూ వచ్చారు. గత ఏడాది 30 రకాల డిజైన్లు, 20 విభిన్న రంగుల్లో 240 వెరైటీల్లో చీరలను తయారు చేయించారు. నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ (నిఫ్ట్) డిజైనర్లతో బతుకమ్మ చీరలు డిజైన్ చేయించారు. ఎస్‌హెచ్‌జీ మహిళలకు పంపిణీ చేసే చీరల డిజైన్లను కూడా నిఫ్ట్ డిజైనర్ల సూచనలు, సలహాల ఆధారంగా ఖరారు చేస్తారు. ప్రస్తుతం సొంతంగా ఎస్‌హెచ్‌జీల కొనుగోలు ప్రస్తుతం రాష్ట్రంలోని ఎస్‌హెచ్‌జీల మహిళలకు ప్రత్యేక యూనిఫారం లేకున్నా స్థానికంగా గ్రామ, మండల సమాఖ్యలు మూకుమ్మడిగా నిర్ణయించుకొని తమకు నచ్చిన డిజైన్ చీరలను యూనిఫారాలుగా ఎంచుకుంటున్నాయి. ఎస్‌హెచ్‌జీల సమావేశాలు, ఇతర ప్రభుత్వ కార్యక్రమాలకు ఒకే డిజైన్ చీరలు ధరించి హాజరవుతున్నారు. గ్రామ, మండల సమాఖ్య నిధుల నుంచి లేదా సొంతంగా తలాకొంత మొత్తం పోగు చేసి వీటిని కొనుగోలు చేస్తున్నారు. ప్రభుత్వమే పంపిణీ చేయాలని భావిస్తున్న నేపథ్యంలో ఒకటి లేదా రెండు డిజైన్లను ఎంపిక చేసి చీరల తయారీకి ఆర్డర్ ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇప్పటి వరకు ప్రాథమికంగా పది డిజైన్లను సిద్ధం చేసిన చేనేత విభాగం త్వరలో సీఎంతో జరిగే భేటీలో ఒకటి రెండు డిజైన్లను ఖరారు చేసే అవకాశముంది. -
కంజీవరం-వెండి సీక్విన్ చీరలలో ఊర్మిళ స్టన్నింగ్ లుక్స్..!(ఫొటోలు)
-
‘రెట్రో’ చీరలతో లెహంగా.. సారా అలీఖాన్ స్టన్నింగ్ లుక్..!
ప్రముఖులు, సెలబ్రిటీలు ట్రెండ్‌కి తగ్గట్టు లగ్జరీయస్ దుస్తులు ధరిస్తారు. ముఖ్యంగా ప్రముఖ బ్రాండెడ్ దుస్తులతో ఫ్యాషన్ ప్రపంచానికి ఐకానిక్‌గా ఉంటుంది వారి డ్రెస్సింగ్ స్టైల్. అలాంటిది బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్ కుమార్తె సారా అలీఖాన్ మాత్రం ఫ్యాషన్‌కే సరికొత్త అర్థం ఇచ్చే డిజైనర్ వేర్లో తళుక్కుమంది. ఈ ముద్దుగుమ్మ దుస్తుల వేస్ట్‌కి అడ్డుకట్ట వేసేలా పర్యావరణ హిత ఫ్యాషన్ శైలిని తీసుకొచ్చింది. ఇంతకీ ఆమె ఎలాంటి ఫ్యాబ్రిక్ డ్రెస్ ధరించింది అనే కదా సందేహం..!అంబానీ ఇంట గణేష్ చతుర్థి వేడుకలో ఓ రేంజ్ జరిగిన సంగతి తెలిసిందే. ఈ వేడుకలో బాలీవుడ్ అగ్ర తారలంతా పాల్గొని సందడి చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు సారా ప్రత్యేకమైన దుస్తులను ఎంచుకుంది. డిజైనర్ మయ్యూర్ గిరోత్రా కోచర్ రూపొందించిన అందమైన లెహెంగాలో ఈ బుట్టబొమ్మ మెరిసింది. అయితే ఈ లెహంగాని డిజైనర్ 50, 60ల నాటి పాత చీరలను రీసైక్లింగ్ చేసి రూపొందిచారు. చూడటానికి ఈ లెహంగా వివిధ రంగుల చీరల కలయికతో అందంగా ఉంది. ఈ లెహంగాలో సారా స్టన్నింగ్ లుక్ చూపురులను తిప్పుకోని విధంగా ఆకర్షణీయంగా కనిపించింది. చెప్పాలంటే సారా ఎంచుకున్న డిజైనర్ వేర్ దుస్తుల వేస్ట్‌ని అరికట్టేలే ఫ్యాషన్ ట్రెండ్‌ని సరికొత్త విధంగా సెట్ చెయ్యొచ్చు అని ప్రేరణ కలిగించేలా ఉంది ఆమె మెస్మరైజ్ లుక్. ఈ మిక్స్డ్ కలర్ లెహంగాకి సారా పర్పుల్ కలర్ బ్లౌజ్‌ని జత చేసింది. ఈ బ్లౌజ్‌కి డోరీ టైస్ , గోల్డ్ బ్రోకెడ్ ఎంబ్రాయిడరీ, గొట్టా పట్టీ బార్డర్లు ఉన్నాయి. అలాగే ఈ లెహంగాకి మ్యాచ్ అయ్యేలా రాగి కలర్‌తో కలగలసిన బంగారు టిష్యు సిల్క్ దుప్పట గ్రాడ్ లుక్‌ని తెచ్చిపెట్టింది. అందుకు తగ్గట్టు మంచి ఐషాడో, మిరుమెట్లుగొలిపే ఐలైనర్, న్యూడ్ లిప్షేడ్తో చాలా సింపుల్ మేకప్‌లో మెరిసింది. హెయిర్‌ని కూడా టై చేసి వదిలేసింది. అంతేగాదు తన లెహంగాకి మ్యాచింగ్ అయ్యేలా తలలో ఊదారంగు పూలను ధరించింది. అలాగే చెవులకు జుమ్మీలు, మెడకు పోల్కీ చోకర్ నెక్లస్‌తో గ్రాండ్‌గా కనిపించింది సారా. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. మీరు కూడా ఓ లుక్కేయండి. View this post on Instagram A post shared by Mayyur Girotra Official (@mayyurgirotracouture) (చదవండి: కివీ కర్రీ..శ్రీలంక ఫేమస్ రెసిపీ..!) -
తక్కువ బడ్జెట్లో బెటర్లుక్.. హుందాగా... కంఫర్ట్‌గా!
‘‘జాబ్, స్కూల్‌కి వెళ్లే ఇద్దరు పిల్లలు, ఫ్యామిలీతో టైమ్ అసలు సరిపోదు. అయితే మనకోసం మనం కొంచెం టైమ్ అయినా ఉండేలా చూసుకోవాలి అనుకుంటాను. నలుగురిలోకి వెళ్లినప్పుడు ప్రత్యేకంగా కనిపించడానికి, అదే విధంగా నా బడ్జెట్ ప్రకారం డ్రెస్సింగ్ ఉండేలా ఎంపిక చేసుకుంటాను.వేడుకలకు, ప్రత్యేక రోజుల్లో రెడీ అవడానికి ప్రతీ ఒక్కరూ తమదైన ప్టైటల్ని డ్రెస్సింగ్‌లో చూపుతుంటారు. హైదరాబాద్ ఎల్.బినగర్లో ఉంటున్న సాఫ్ట్వేర్ ఉద్యోగిని చందనామారం తన డ్రెస్సింగ్ గురించీ, వార్డ్రోబ్ విషయాలను ఈ విధంగా షేర్ చేసుకున్నారు. హుందాగా...ఆఫీస్‌కి వెళ్లేటప్పుడు డిగ్నిఫైడ్గానూ, కంఫర్ట్గానూ ఉండేలా చూసుకుంటాను. అందుకు కుర్తీలు, జీన్స్ ఉంటాయి. వీటిలోనే మిక్స్ అండ్ మ్యాచ్‌కి ట్రై చేస్తుంటాను.డిజైనర్ శారీస్..రిసెప్షన్ వంటి వేడుకలకు డిజైనర్ శారీస్‌ను ఎంచుకుంటాను. జనరల్‌గా మార్కెట్లో వస్తున్న ట్రెండ్స్‌ను కూడా ఫాలో అవుతుంటాను. వీటిలో నాకు ఎలాంటి ఔట్ఫిట్ అయితే బాగుంటుందో చెక్ చేస్తుంటాను. స్టిచింగ్కు సంబంధించినప్పుడు ఇన్‌స్టా పేజీలు కూడా చూస్తుంటాను. అలాంటి డిజైన్స్ చేయమని బొటిక్స్లో చెబుతుంటాను. శారీకి తగినట్టు బ్లౌజ్ సెట్ చే యడానికి డిజైనర్ హెల్ప్ తీసుకుంటాను.తక్కువ బడ్జెట్లో బెటర్లుక్..పెళ్లి, ఇంట్లో పండగలు వంటి సందర్భాలలో మనదైన సంప్రదాయ కట్టునే ఇష్టపడతాను. దీనికోసం ఎక్కడైనా శారీస్ కలెక్షన్ గురించి కూడా తెలుసుకుంటాను. కొన్నిచోట్ల నచ్చినా బడ్జెట్ మించి ఉంటే తీసుకోను. అయితే, అవే మోడల్స్‌లో మరో చోట ఒకటికి బదులు రెండు చీరలు వచ్చేలా ఎంపిక చేసుకోవడం గురించి ఆలోచిస్తుంటాను. తక్కువ బడ్జెట్లో మంచి డ్రెస్సింగ్ ఉండేలా చూసుకుంటాను. సాధారణంగా ఎక్కువ డబ్బులు పెట్టి కొన్న చీరలు, డ్రెస్సులు వేసుకుంటే నలుగురిలో వెళ్లినప్పుడు మన అప్పిరియన్స్ బాగుంటుంది అనుకుంటారు. కానీ, తక్కువ బడ్జెట్లో బెటర్‌గా కనిపించేలా ΄్లాన్ చేసుకోవడం మంచిది’’ అని వివరిస్తున్నారు ఈ ఉద్యోగిని.నోట్: మీరూ మీ వార్డ్రోబ్ లేదా మీ అమ్మాయి వార్డ్రోబ్ గురించి, డ్రెస్సింగ్ విషయంలో తీసుకుంటున్న విశేషాల గురించి ఫొటోలతో సహా ‘సాక్షి’ ΄ాఠకులతో పంచుకోవచ్చు. బాగున్న వాటిని మై వార్డ్రోబ్ శీర్షికన ప్రచురిస్తాం. మా చిరునామా: మై వార్డ్రోబ్, సాక్షి ఫ్యామిలీ, సాక్షి, రోడ్ నం.1, బంజారాహిల్స్, హైదరాబాద్ –34. sakshifamily3@gmail.com -
శారీ షో రూమ్ లో తళుక్కుమన్న ఇన్‌స్టా ఇన్ఫ్లుయెన్సర్స్ (ఫొటోలు)
-
కసావు చీరలో నీతా అంబానీ స్టన్నింగ్ లుక్..తయారీకే ఏకంగా..!
నీతా అంబానీ నాటి సంప్రదాయ చీరల మేళవింపుతో సరికొత్త ఫ్యాషన్ ట్రెండ్‌ని తీసుకొచ్చింది. చేతి వృత్తుల వారిని పోత్సహించేలా కనుమరుగవుతున్న నాటి గొప్ప కళా నైపుణ్యాన్ని అందరికీ సుపరిచయ చేస్తున్నారు నీతా. ఇటీవల చిన్న కుమారుడు అనంత్ రాధికల వివాహంలో సైతం వారి ధరించే ప్రతి డిజైనర్ వేర్ చేతితో రూపొందించిన ఎంబ్రాయిడరీ డిజైన్ హైలెట్‌గా నిలిచింది. రాజస్థాన్, కాశీ పట్టణాల్లో ఉన్న పురాతన హస్తకళలను స్ఫురణకు తెచ్చేలా చేశారు. అయితే మరోసారి నీతా ముఖేష్ అంబానీ కల్చరల్ సెంటర్(ఎన్ఎంఏసీసీ)లో జరిగిన ఈవెంట్లో కేరళ సంప్రదాయాన్ని గుర్తుకు తెచ్చేలా కసావు చీరలో తళుక్కుమన్నారు. ఈ చీరను కేరళలోని ప్రతిభావంతులైన కళాకారులు ఏకంగా 20 రోజుల పాటు రూపొందించారు. ఇందులో టిష్యూ పల్లు, మెరూన్ మీనా కరి బుట్టా, అద్భతమైన తొమ్మిది అంగుళాల బంగారు అంచు మృదువైన షీన్లు ఉన్నాయి. తెలుపు బంగారు రంగులో ఉన్న ఈ కసావు చీర చరిత్ర చాలా లోతైనది. బహుళ వర్ణ ఛాయచిత్రాలు, బోల్ట్ నమునాలతో చిక్కటి కాటన్ చీరల్లా మెత్తగా ఉంటాయి.కేరళ కసవు చీరల ప్రత్యేకత..ఇవి చూసేందుకు సరళమైన క్లాసీగా ఉండే కసవు చీర జరీ, ఒక రకమైన బంగారు దారంతో విలక్షణంగా ఉంటుంది. బలరామపురుం, చెందమంగళం, కుతంపుల్లి వంటి నిర్థిష్ట భౌగోళిక సముహాల నుంచి ఉద్భవించిన ఈ చీరలు కేరళ గొప్ప చేనేత వారసత్వంలో భాగంగా ఉన్నాయి. ప్రాథమిక డిజైన్ల నుంచి దాదాపు మూడు నుంచి 5 రోజుల వరకు పట్టే విస్తృతమైన మోటిఫ్‌లు చేతితో నేయబడి ఉంటాయి. బంగారు దారంతో చుట్టూ బోర్డర్ డిజైన్ చేసి ఉంటుంది. సరసమైన కాటన్ రకాల నుంచి వివిధ రకాల చీరలను ఉత్పత్తి చేస్తారు. వీటి ధర రూ. 1.5 లక్షల నుంచి మొదలై అత్యంత ఖరీదైన ధర పలికే చీరలు కూడా ఉంటాయి. చూసేందుకు సాదాసీదా తెల్లని వస్త్రంలా ఉన్నా బార్డర్ మందం, రంగు అనేవి సందర్భానుసారం డిజైన్ చేసిన చీరలు ఉంటాయి. ఉత్సవానికి సంబంధించిన చీరలు మందమైన బంగారు అంచుతో ఎంట్రాక్టివ్గా ఉంటాయి. View this post on Instagram A post shared by Swadesh Online (@swadesh_online)(చదవండి: అనంత్ అంబానీ బూండీ జాకెట్..రియల్ గోల్డ్‌తో ఏకంగా 110 గంటలు..!) -
ఇదీ.. శారీనే! కొంచెం స్టయిల్ మారిందంతే!!
సౌకర్యంగా ఉండే ఫ్యాషనబుల్ డ్రెస్సుల కోసం నవతరం ఎప్పుడూ వెతుకుతుంటుంది. అలాగని సంప్రదాయాన్ని వదిలిపెట్టదు. ఈ విషయాలపై స్పష్టత ఉన్న డిజైనర్లు చీరను ఎన్ని హంగులుగా తీర్చిదిద్దుతున్నారో చూడాల్సిందే! డ్రెస్‌ను పోలి ఉండేలా.. శారీ అనిపించేలా ఇండోవెస్ట్రన్ లుక్‌తో ఆకట్టుకునేలా యంగ్‌స్టర్స్ ఆలోచనలకు తగినట్టుగా డిజైన్ చేస్తున్నారు.అన్ని రకాల ఫ్యాబ్రిక్..కాటన్, సిల్క్, చందేరీ... ఏ ఫ్యాబ్రిక్ శారీ అయినా ఈ డిజైన్‌కు వాడచ్చు. పల్లూను కుర్తా స్టైల్లో ధరించి, నడుము భాగంలో బెల్ట్ సెట్ చేస్తే మరో శారీ స్టైల్ మీ సొంతం అవుతుంది.ఖఫ్తాన్ శారీ..ఈ డిజైన్ శారీ లాంగ్ గౌన్‌ను తలపిస్తుంది. శారీ గౌన్లా కనిపిస్తుంది. ప్లెయిన్ శారీకి కుచ్చులు సెట్ చేసి, పల్లూ భాగాన్ని మాత్రం ఖఫ్తాన్ స్టైల్లో డిజైన్ చేయాలి. నెక్ భాగాన్ని కూడా పల్లూ డిజైన్‌లో వచ్చేలా సెట్ చేయాలి.ఆభరణాల అమరిక..హెయిర్‌స్టైల్ మోడల్స్ లేదా ఆభరణాల ఎంపిక ఈ స్టైల్ డ్రెస్‌కు అంతగా అవసరం లేదు. శారీనే న్యూ లుక్‌తో ఆకట్టుకుంటుంది కాబట్టి ఇతరత్రా అలంకరణా సింపుల్‌గా ఉంటేనే చూడముచ్చటగా ఉంటుంది.సౌకర్యంగా..భుజం మీదుగా తీసే కొంగు భాగంలో డిజైన్‌ను బట్టి హ్యాండ్ స్టైల్‌ను అమర్చుకోవచ్చు. ఇది సౌకర్యంగానూ, స్టైల్‌గానూ కనిపిస్తుంది.ఎంబ్రాయిడరీ..పల్లూ మధ్య భాగంలో ఖఫ్తాన్కి మెడ నుంచి ఎంబ్రాయిడరీ వర్క్‌తో ప్లెయిన్ శారీని కూడా మెరిపించవచ్చు. -
మా చేతిలో ఉన్న పనికి.. సాంకేతిక పరిజ్ఞానం తోడైంది..!
‘‘ఇంట్లో మగ్గం ఉంది, చేతిలో స్మార్ట్ ఫోన్ ఉంది. నా గ్రామం నుంచి విదేశాలతో అనుసంధానం కావడానికి ఇవి చాలు. నేను నేసిన చీరను ఈ కామర్స్ వేదికల ద్వారా నేనే మార్కెట్ చేసుకోగలుగుతున్నాను. నా చేతుల్లో తయారైన చీరను ధరించే వారి చేతికి చేర్చే సాంకేతిక మార్గాలను నేర్చుకున్నాను. వందల మంది మహిళలం సంఘటితమయ్యాం. మాలోని నైపుణ్యాన్ని ప్రపంచానికి చాటుతున్నాం. మేము గౌరవప్రదమైన ఉపాధిని పొందుతున్నాం’’ అంటోంది తమిళనాడుకు చెందిన ముత్తులక్ష్మి. ఆమె మాటలు అక్షరసత్యాలు.వైవిధ్యతే ఉపాధి..భాషలు, వస్త్రధారణ, ఆహారపు అలవాట్లలో మాత్రమే కాదు మనదేశంలో ఉన్న వైవిధ్యత... కళలు, కళాత్మకతల్లోనూ ఉంది. దాదాపుగా ప్రతి ఇంట్లోనూ ఆ కళాత్మకత ఉంటుంది. స్థానికంగా లభించే వస్తువులతో మహిళల చేతిలో రూపుదిద్దుకునే అనేక వస్తువులు ఇప్పుడు వారికి ఉపాధిమార్గాలవుతున్నాయి. దేశంలో దాదాపుగా ఏడు కోట్ల మంది చేతిలో కళ ఉంది. ఆ చేతుల్లో అందమైన హస్తకళాకృతులు తయారవుతున్నాయి. అందులో సగానికి పైగా మహిళలే.ఒకప్పుడు ఆ పని తమకు ఉపాధినిస్తుందని, గుర్తింపును తెస్తుందని తెలియదు వాళ్లకు. తెలిసినా సరే, మధ్య దళారుల దోపిడీకి గురవుతూ అరకొరగా లభించే రుసుముతోనే సంతృప్తి చెందేవాళ్లు. ఇప్పుడు మహిళలు చురుగ్గా ఉన్నారు. తమ ఉత్పత్తులను మార్కెట్లోకి ప్రవేశ పెట్టే మాధ్యమాల పట్ల అవగాహన పెంచుకుంటున్నారు. హస్తకళాకృతులు తయారు చేసే కుటుంబాల్లోని మగవారు మెరుగైన ఉపాధి కోసం ఆ వృత్తులను వదిలేస్తున్న తరుణంలో ఆ ఇళ్లలోని మహిళలు తమ వారసత్వ కళను కొనసాగిస్తూ తమకంటూ ప్రత్యేకమైన గౌరవాన్ని, అదే స్థాయిలో ఆదాయాన్ని ఆర్జిస్తున్నారు.ముత్తులక్ష్మి ఇంట్లో పవర్లూమ్ ఉంది. ఆ మరమగ్గం మీద ఆమె నెలకు పది చీరలను నేయగలుగుతోంది. తమిళనాడులోని అరుపోకోటాయ్ బ్లాక్ చేనేత చీరలకు ప్రసిద్ధి. అక్కడ నేసే చీరలను కూడా అదే పేరుతో అరుప్పుకోటాయ్ చీరలుగానే పిలుస్తారు. ఆమె నేసిన చీరలను ఫొటో తీసి తానే స్వsయంగా అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ వంటి ఈ కామర్స్ వెబ్సైట్లలో అప్లోడ్ చేస్తుంది. ఉత్పత్తిదారులకు– వినియోగదారులకు మధ్య మరో వ్యక్తి అవసరం లేదని, సాంకేతికతను ఒంటపట్టించుకోవడానికి పెద్ద చదువులు అక్కరలేదని నిరూపిస్తోంది. సాధికారత సాధించాం!‘‘ఒక్కో ప్రాంతంలోని మహిళల్లో ఒక్కో కళ ఉంటుంది. మా దగ్గర మహిళలు చేనేతతోపాటు తాటి, కొబ్బరి ఆకులతో బుట్టలు అల్లుతారు. కర్ణాటక, రాయచూర్ వాళ్లు అందమైన దండలు, ఊలు, క్రోషియో వైర్‌తో ఇంటి అలంకరణ వస్తువులు అల్లుతారు. గుజరాత్, దహోద్ వాళ్లు ముత్యాల ఆభరణాలతోపాటు వెదురుతో రకరకాల వస్తువులు తయారు చేయడంలో నిష్ణాతులు.వాళ్లందరికీ డిజిటల్ లిటరసీ, ఫైనాన్షియల్ లిటరసీ, ఎంటర్‌ప్రెన్యూరల్ స్కిల్స్‌తోపాటు ప్రభుత్వ పథకాల పట్ల అవగాహన కల్పిస్తే అద్భుతాలు చేయగలరని నమ్మాను. అది నిజమైంది కూడా. ఇప్పుడు మొత్తం తొమ్మిది వందల మందిమి నాస్కామ్ నిర్వహించిన పదిరోజుల నైపుణ్య శిక్షణ కార్యక్రమంలో పాల్గొని సొంతంగా అన్ని పనులూ చక్కబెట్టుకోగలుగుతున్నాం. మహిళా సాధికారత సాధనకు మా చేతిలో ఉన్న పని, సాంకేతిక పరిజ్ఞానం తోడైంది’’ అన్నది ముత్తులక్ష్మి. -
కొంగే.. సింగారమాయెనా!
వస్త్రాలంకరణలో ప్రతీ అంశం అందంగా రూపుకట్టాల్సిందే అనే ఆలోచనల్లో నుంచి పుట్టుకు వచ్చిందే కొంగు డిజైన్. చీరకట్టులో కుచ్చిళ్లకు ఎంత ప్రాముఖ్యత ఉంటుందో పల్లూ డిజైనింగ్కీ అంతే ప్రత్యేకత ఉంటుంది. దారాల అల్లికలైనా.. అద్దాల అమరిక అయినా పూసల పనితనమైనా, ప్రింట్ల మెరుపు అయినా కొంగు కొత్తగా సింగారించుకుని వేడుకలలో బంగారంలా మెరిసి΄ోతుంది.రంగు రంగుల ఫ్యాబ్రిక్చీరలోని రంగులతోపోటీ పడుతూ ఉండేలా ఫ్యాబ్రిక్‌తో చేసిన టాజిల్స్ కొంగుకు ప్రధాన ఆకర్షణగా మారుతుంది.దారపు పోగులతో..ఊలు, సిల్క్, జరీ దారాలతో అల్లిన టాజిల్స్ కాటన్ చీరలకూ, పట్టు చీరల కొంగులకు ప్రత్యేక అందాన్ని తీసుకువస్తున్నాయి.పూసల కొంగు..చీర రంగు కాంబినేషన్లో పూసలతో కొంగును డిజైన్ చేస్తే ఆ ప్రత్యేకత గురించి చెప్పడానికి మాటలు చాలవు. అలా డిజైనర్లు తమదైన సృజనకు మెరుగుపెడుతున్నారు. వాటిని ధరించిన వారు వేడుకలలో హైలైట్‌గా నిలుస్తున్నారు.గవ్వలు, అద్దాలుగిరిజన అలంకరణను ఆధునికపు హంగుగా మార్చడానికి గవ్వలు, అద్దాలు, ఊలు దారాల డిజైన్లను కొంగుకు అందంగా సింగారిస్తున్నారు. ఇవి ఎక్కువగా కాటన్ శారీస్ అలంకరణలో చూడవచ్చు. క్యాజవల్ వేర్‌గా నప్పే చీరలు ఈ డిజైన్ వల్ల ప్రత్యేకంగా కనిపిస్తున్నాయి.కుచ్చుల కొంగుచందేరీ, నెటెడ్ మెటీరియల్‌తో చీరకు జత చేసిన కొంగు కుచ్చుల అమరికతో వెస్ట్రన్ ΄ార్టీ వేర్‌గా అలరిస్తుంది. అమ్మాయిలను అమితంగా ఈ తరహా డిజైన్స్ ఆకట్టుకుంటున్నాయి.రెడీమేడ్..సాదా సీదాగా కనిపించే చీర కొంగు డిజైన్‌ను మార్చాలనుకుంటే మార్కెట్లో రెడీమేడ్ పల్లూ డిజైన్స్ లభిస్తున్నాయి. హ్యాండ్ ఎంబ్రాయిడరీ, మగ్గం వర్క్, పూసలు, దారాల అల్లికలతో ఉన్న పల్లూ డిజైన్స్‌ని తెచ్చి చిన్న కుట్టుతో కొంగును కొత్తగా మెరిపించవచ్చు.ఇవి చదవండి: ‘దేశీ థ్రిల్’ మ్యూజిక్ బ్యాండ్‌లోని ఈ ముగ్గురి పాట.. వావ్ అనాల్సిందే..! -
విమాన సిబ్బందిని చీరకట్టుకునేలా చేసింది, నేర్పించింది ఆమె!
విమాన సిబ్బందిలో మహిళలు పనిచేయాలంటే కచ్చితంగా స్కర్టులు, కోట్లు ధరించాల్సిందే. అందులోనూ లండన్‌లో అయితే కచ్చితంగా ఆ ఆహార్యంలోనే ఉండాల్సిందే. భారతీయ మహిళలైనా ఆ రూల్స్ పాటించక తపని రోజులవి. కానీ ఓ మహిళ ఆ ఎయిర్ ఇండియా రూల్స్‌నే తిరగరాసింది. చీరకట్టుతోనే పనిచేస్తామని తెగేసి చెప్పడమే గాక ఉద్యమం చేసి మరీ తను అనుకున్నది సాధించుకుంది. ఎయిర్ ఇండియాలో పనిచేసే ప్రతి సిబ్బంది చీరకట్టకునేలా చేసింది. అంతేగాదు రాజకీయాల్లోకి రావడానికి మహిళలు భయపడుతున్న రోజుల్లోనే ఆమె రాజకీయాల్లోకి వచ్చి తన గళం వినిపిస్తూ అంచెలంచెలుగా పైకొస్తూ.. మంచి రాజకీయవేత్తగా పేరు తెచ్చుకున్నారు. ఆమె నేటితరానికి, భవిష్యత్తుతరాలకు స్ఫూర్తిగా నిలిచే గొప్ప వ్యక్తి. ఎవరీమె అంటే.. ఆమె పేరు బృందా కారత్. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత సరిగ్గా రెండు నెలలకు పుట్టారు. 1947 ఆగస్టు 15న దేశానికి స్వాతంత్య్రం వస్తే ఆమె అదే ఏడాది అక్టోబర్ 17న కోల్‌కతాలో జన్మించారు. తండ్రి సూరజ్ లాల్ దాస్ పాకిస్తాన్‌లోని లాహోర్ నుంచి వలస వచ్చారు. తల్లి ఒషుకోనా మిత్ర బెంగాలి. వీళ్లది ప్రేమ పెళ్లి. పెద్దలు వ్యతిరేకించి మరీ ఓషుకోనా సూరజ్‌ని పెళ్లి చేసుకున్నారు. బృందాకు ఒక సోదరుడు, ముగ్గురు అక్కాచెల్లెళ్లు. ఐదేళ్ల వయసులో బృందా తన తల్లి ఒషుకోనా మిత్రను కోల్పోయినా తండ్రి తన పిల్లల్ని చాలా స్వేచ్ఛాయుత వాతావరణంలో పెంచారు. ఎన్.డి.టీవీ వ్యవస్థాపక ఎడిటర్ ప్రణయ్ రాయ్‌ని పెళ్లాడిన రాధిక ఆమె చెల్లెలే. బృందా ప్రాథమిక విద్య డెహ్రాడూన్‌లోని వెల్హామ్ బాలికల పాఠశాలలో పూర్తి చేశారు. ఆమె 16 ఏళ్ల వయస్సులో మిరిండా హౌస్‌లోని దర్హి విశ్వవిద్యాలయానికి అనుబంధంగా ఉన్న కళాశాల నుంచి బీఏ పట్టా తీసుకున్నారు. అప్పుడే ఆమె తండ్రి సూరజ్ లాల్ దాస్ తన కుమార్తె బందాను పిలిచి నేను చదువు చెప్పించా. ఇక నువ్వు నీ కాళ్ళపై నిలబడాలని సూచించారు. దీంతో ఆమె 1967లో లండన్ వెళ్లి ఎయిర్ ఇండియాలో చేరారు. అయితే లండన్‌లోని ఎయిర్ ఇండియా విమానయాన సంస్థలో పనిచేసే సిబ్బంది తప్పనిసరిగా స్కర్ట్ లు వేసుకోవాల్సిందే తప్ప చీరె కట్టును అనుమతించరు. అందుకు ససేమిరా అని బృందాకారత్ తెగేసి చెప్పడం జరిగింది. ఆ టైంలో లండన్ హీత్రూ విమానాశ్రయంలోని ఎయిర్ ఇండియా మేనేజర్ అలాన్. ఆయన కూడా ఏమాత్రం తగ్గేదే లే అంటూ చీర ధరించేందుకు అనమితించమని చెప్పేశారు. అయితే తాము సమ్మే చేస్తామని నిర్భయంగా చెప్పింది బృందాకారత్. చేస్కోండి! అని ఆయన కూడా తీసిపడేసినట్లుగా అన్నారు. దీంతో ఆమె చీరే కట్టుకుంటాం అనే డిమాండ్‌తో నిరవధికంగా మూడు రోజు సమ్మే చేసి మరీ ఎయిర్ ఇండియా మెడలు వంచింది బృందా. దెబ్బకి ఆ ఎయిర్ ఇండియా మేనేజర్ అలాన్ దిగి రావడమే గాక మీరే విజయం సాధించారు, పైగా ఎయిర్ ఇండియాలో ప్రతి ఒక్కరూ చీరకట్టుకునేలా చేశారు అన్నారట. కానీ బృందాకారత్ ఆ మాటలకు పొంగిపోలేదు. ఈ విజయం తనదేనని ఒప్పుకోలేదు. "సారీ, గెలిచింది నేను కాదు. శారీ జాతీయవాదం" అని చెప్పి ఎయిర్ ఇండియా అధికారిని షాక్‌కి గురయ్యేలా చేసిందట. ఆమె తన వ్యక్తిగత విజయాన్ని జాతీయ వాదంతో పోల్చి చెప్పడమేగాక ఈ విజయాన్ని తన ఖాతాలో వేసుకోవడానికి బదులు అందరికీ వర్తింపజేసేలా మాట్లాడినందుకు...ఆమెను అభినందించకుండా ఉండలేక పోయారు ఆయన. అంతేగాదు అలా ఎయిర్ ఇండియాకు సెలక్ట్ అయిన బ్రిటిష్ యువతులందరికీ చీరకట్టుకోవడం నేర్పించారు బృందాకారత్. అలా ఆమె అక్కడ కొంతకాలం పనిచేసి ఉద్యోగానికి రాజీనామా చేశారు. ఆ తర్వాత సీపీఎం అనుబంధ సంఘాలలో పని చేశారు. మహిళలు రాజకీయాల్లోకి రాని రోజుల్లో వామపక్ష రాజకీయాల వైపుకి వెళ్లారు. అరుదైన కమ్యూనిస్టు రాజకీయ వేత్తగా ఎదిగారు. నుదుట పెద్ద బొట్టు, ఆరడుగులకు పైగా ఎత్తు, చక్కని వర్చసు ఉన్న బృందా అనర్ఘళంగా హిందీ, ఇంగ్లీషు, మళయాళం, బెంగాలీ, కొన్ని తెలుగు పదాలు మాట్లాడగలరు. దేశంలో ఫెమినిస్ట్ ఉద్యమానికి ఊపిరులు వారిలో బృందా కారత్ ఒకరు. పశ్చిమ బెంగాల్ నుంచి సీపీఎం తరఫున రాజ్యసభకు 2005 నుంచి ప్రాతినిధ్యం వహించారు. 2005లో సీపీఐ (ఎం) పొలిట్‌బ్యూరోకు ఎన్నికైన తొలి మహిళ బృందా కారత్. అంతేగాదు ఆమె సీపీఎం మాజీ ప్రధాన కార్యదర్శి ప్రకాష్ కారత్ భార్య. ఇక బృందా కారత్ 1975 నాటి ఎమర్జెన్సీ మొదలు కమ్యూనిస్టు ఉద్యమం ఉజ్వలంగా సాగిన1985 వరకు తన జ్ఞాపకాలను, ఇతర వ్యాసాలను కలిపి ఓ పుస్తక రూపంలో తీసుకువచ్చారు. “యాన్ ఎడ్యుకేషన్ ఫర్ రీటా” పేరిట ఈ పుస్తకాన్ని మార్కెట్లోకి తీసుకొచ్చారు. ఇప్పుడు ఎన్నికల్లో పాల్గొనే నేటితరం యువత తెలుసుకోవాల్సిన ఎన్నో విషయాలు ఇందులో ఉన్నాయి. ఒక్కో వ్యాసం ఒక్కో ఆణిముత్యం లాంటివే. కనువిప్పు కలిగించేవే. పదేళ్ళ చరిత్రను కళ్లకు కట్టారు. తన 50 ఏళ్ల రాజకీయ జీవితంలోని పదేళ్ల కాలాన్ని గుర్తుపెట్టుకుని క్రమం తప్పకుండా రాయడమంటే మామూలు విషయం కాదు.పైగా ఈ పుస్తకంలో బ్లాక్ అండ్ వైట్ టీవీల కాలం నుంచి మొదలు పెట్టి ఢిల్లీ గల్లీలలో జరిగిన పోరాటాలను, కష్టకాలంలో జరిగిన చర్చల్ని, నాయకుల తీరు తెన్నులన్నింటిని చక్కగా వివరించారు. అయితే అందులో ఉన్న రీటీ ఎవరో కాదు బృందాయే అని పుస్తకం చదివిన తర్వాత గానీ తెలియదు. అయితే ఎన్నికల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు ఉండాలపి పోరాడిన ఆమె ప్రత్యక్ష ఎన్నికలకు దూరంగానే ఉన్నారు. ఇక తానెందుకు ప్రత్యక్ష రాజకీయాల్లోకి రాలేదని ప్రశ్నిస్తే మాత్రం బృందా..తన వయసు 70 దాటిందని, ఈ వయసులో పరిగెత్తడం సమంజసం కాదని చెబుతుంటారామె. నేటి పరిస్థితులన్ని మార్చాలంటే యువతీ యువకులే నడుం కట్టాలని చెబుతుంటారు. ఈ ఎన్నికల్లోనైనా మరింత మంది మహిళలు రాజకీయాల్లోకి వస్తారనే ఆశతో చూస్తున్నారామె. (చదవండి: సెలబ్రెటీలను సైతం పక్కకునెట్టి అంబాసిడర్ అయిన యువతి!) -
చీరలు కొన్న వాటిలానే ఉండాలంటే ఇలా చేయండి!
చీరలు వాడుతున్న కొద్దీ కొన్నప్పుడూ ఉన్నట్టు కనపించవు. కలర్ తగ్గిపోయి కట్టుకున్న నలిగిపోతున్నట్లు ఉంటుంది. కొత్త ఉన్నంత షైన్‌గా కనిపించదు. దీంతో ఈ షాపు మంచిది, అది మంచిది అంటూ షాపులు మార్చుతుంటాం. ఎన్ని చోట్లకు తిరిగి కొన్నా అదే తీరులో చీరలు ఉంటాయి. అలా కాకుండా చీరలు కొన్న ప్పుడే ఏ రేంజ్లో మెరుస్తూ కనిపిస్తున్నాయో అలానే ఉండాలంటే కొన్న చిట్కాలు పాటిస్తే చాలు ఎప్పటికీ కొన్న వాటిలానే ఉంటాయి. ఇక్కడ చీరలు మెయింటైయిన్ చేయడమపైనే ట్రిక్ అంతా దాగి ఉంది. ఆ ట్రిక్ ఏంటంటే.. ముందుగా చీరలను ఎలా పడితే అలా మడతలు పెట్టొద్దు. అలాగే మడత పెట్టి ఎక్కువ రోజులు ఉంచొద్దు. ఇలా చేస్తే రంగు మారుతుంది. పైగా చీన ముడతలు ముడతలుగా అయిపోతుంది. ముడతలు పడకుండ మధ్యలో ఒకసారి తీసి తిరిగి మడతపెట్టాలి. వాటిని వెలుతురు పడని ప్రదేశాల్లోనే పెట్టాలి. చీరను ఉతికేటప్పుడూ కూడా జాగ్రత్త పాటించాలి. చీరలు అన్నింటిని ఒకే విధంగా ఉతికితే త్వరగా పాడవుతాయి. వాషింగ్ మిషన్ లో చీరలన్నింటిని ఉతక్కూడదు. కొన్నింటిని మినహాయించాలి. ఎందుకంటే? కొన్ని వాషింగ్ మిషన్‌లో ఉంటే కలర్ దిగిపోయే అవకాశం చీర పాడయ్యే అవకాశాలు ఉంటాయి. అలాంటి చీరలను చేత్తో నానబెట్టకుండా ఉతుక్కోవడం మంచిది. ఇంకొన్ని చీరలను ఉతక్కుండా డ్రైక్లీనింగ్‌కు ఇవ్వాలి. అలాగే కొన్ని లైట్ వైట్ చీరలను కొనేటప్పుడే ఎలా ఉతకాలి ఏంటన్నది అడిగి తెలసుకోవాలి. అలాగే ఐరన్ చేయడం వల్ల చీరలకు మంచి లుక్ వస్తుంది కాబట్టి ఐరన్ తప్పనిసరి. ఎక్కువ వేడి మీద అసలు ఐరన్ చేయొద్దు. ఇలా చేస్తే తొందరగా పాడవుతాయి. సిల్క్, పట్టు చీరలు ఐరన్ చేసేటప్పుడు కాటన్ క్లాత్ వేసి ఐరన్ చేస్తే ఫ్యాబ్రిక్ దెబ్బతినకుండా ఉంటుంది కాబట్టి ఈ చిట్కాను తప్పక గుర్తించుకోవాలి ఎంత మంచిగా మెయింటెన్ చేసినా కూడా చీరలపై మరకలు, మడతలు అలాగే ఉంటాయి. దీంతో ఎలా పడితే అలా కాకుండా.. మరకను మాత్రమే క్లీన్ చేస్తే సరిపోతుంది. ఆ తర్వాత వెనిగర్, నిమ్మరసం, సబ్బుతో క్లీన్ చేసుకుంటే సరిపోతుంది. కొన్ని చీరలకు వర్క్ మరికొన్ని చీరలకు స్టోన్స్, ముత్యాలు ఉంటాయి కాబట్టి అలాంటి వాటిని విడివిడిగా ఉతకాలి. చీర నాణ్యతను బట్టి ఉతకే విధానంలో మార్పులు చేయాలి. లేదంటే అంత కష్టబడి డబ్బులు పెట్టి మరీ చేయించుకున్న వర్క్ పాడయ్యే పోయే ప్రమాదం ఉంటుంది. (చదవండి: ప్రపంచంలోనే బెస్ట్ డెజర్ట్‌గా భారతీయ స్వీట్! ఎన్నో స్థానంలో నిలిచిందంటే..) -
మన సంస్కృతికి చిహ్నం చీరకట్టు
ఖైరతాబాద్ (హైదరాబాద్): చీరకట్టు అంటే భారతదేశ సంప్రదాయం, సంస్కృతికి చిహ్నం అని...చీర అంటే సంతోషం, గౌరవానికి చిరునామా అని గవర్నర్ తమిళిసై అన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఏర్పాటుచేసిన ‘శారీ వాకథాన్’లో గవర్నర్ మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో జరుగుతున్న జాతీయ సంస్కృతి మహోత్సవాలు– 2024 వేడుకల్లో భాగంగా మంగళవారం సాయంత్రం పీపుల్స్ ప్లాజా వేదికగా నిర్వహించిన శారీ వాకథాన్‌లో వందలాది మంది మహిళలు, విద్యార్థినులు చీరలు ధరించి పాల్గొన్నారు. ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ, తాను విదేశాల్లో చదువుకునే సమయంలో ఎలాంటి స్టిచ్చింగ్ లేకుండా చీర ఎలా కడతారంటూ తన స్నేహితులు ఆశ్చర్యపోయేవారని తెలిపారు. కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి మాట్లాడుతూ, 75 సంవత్సరాల నుంచి ఎదురుచూస్తున్న మహిళా రిజర్వేషన్ బిల్లు చట్టసభలో పాసైన సందర్భంగా ప్రతి మహిళకు అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. 33 శాతం రిజర్వేషన్ ఉపయోగించుకుని అసెంబ్లీ, పార్లమెంట్లో అడుగుపెట్టబోతున్న మహిళలకు ఈ సందర్భంగా అభినందనలు తెలుపుతున్నానన్నారు. అనంతరం బెలూన్స్ ఎగురవేసి శారీ వాకథాన్‌ను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి దర్శన జర్దోష్, పద్మశ్రీ ఆనంద శంకర్, హ్యాండ్లూమ్ డెవలప్మెంట్ కమిషనర్‌తో పాటు పెద్దఎత్తున మహిళలు పాల్గొన్నారు. -
బడ్జెట్ రోజున ఆర్థిక మంత్రి సీతమ్మ స్పెషల్ చీరల్లో.. వాటి ప్రత్యేకత ఇదే!
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గురువారం (ఫిబ్రవరి 1న)వరుసగా ఆరవసారి బడ్జెట్ ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. ఈ బడ్జెట్‌తో మాజీ ప్రధాని మొరార్జీ దేశాయ్ రికార్డును సమం చేశారు నిర్మలాసీతారామన్. అంతేగాదు వరుసగా ఐదు బడ్జెట్లు సమర్పించిన ఆర్థిక మంత్రుల జాబితాలో నిర్మలా సీతారామన్ కూడా చేరిపోవడమేగాక ఈ ఏడాది ప్రవేశపెడుతున్న ఆరో బడ్జెట్‌తో సరికొత్త రికార్డుని నెలకొల్పబోతున్నారు కూడా. ఇక సీతమ్మ బడ్జెట్ అనంగానే గుర్తొచ్చేది ఆమె చీరలే. ప్రతి ఏటా సీతారామన్ ప్రవేశపెట్టే బడ్జెట్లో ఆమె ధరిస్తున్న చీరలదే ప్రత్యేక ఆకర్షణ అనే చెప్పాలి. ఈసారి 2024 బడ్జెట్ సందర్భంగానూ ఆమె ప్రత్యేక రంగు చీరలో వచ్చారు కూడా. అయితే ఇంతవరకు ఆమె ప్రతి ఏడాది ప్రవేశపెట్టిన బడ్జెట్లో ఎలాంటి చీరలు ధరించారు? వాటి విశేషాలేంటో చూద్దామా!. 2019లో.. 2019లో తొలిసారి ఆర్థిక మంత్రి హోదాలో బడ్జెట్ ప్రవేశపెట్టారు నిర్మలా సీతారామన్. ఆ సమయంలో ఆమె గులాబీ రంగు, బంగారు అంచు మంగళ గిరి చీరను ధరించారు. అలాగే ఆ ఏడాదే సంప్రదాయ బ్రీఫ్ కేస్ స్థానంలో బహీ ఖాతాను ప్రవేశపెట్టి సరికొత్త సంప్రదాయానికి తెర తీశారు ఆర్థిక మంత్రి. ఈ బహీ ఖాతా కోసం ఎరుపు రంగు సిల్క్ క్లాత్‌తో బడ్జెట్ పేపర్లను చుట్టారు. 2020లో 2020 బడ్జెట్ సమర్పణ కోసం నిర్మలా సీతారామన్ పసుపు రంగు సిల్క్ చీరతో పార్లమెంట్‌కు వచ్చారు. నీలం రంగు అంచుతో పసుపు- బంగారు రంగు చీరను ధరించారు. పసుపును సంప్రదాయానికి, సంపదకు చిహ్నంగా భావిస్తారు. చాలా మంది ప్రత్యేక రోజుల్లో ఈ రంగు చీరలను ధరిస్తుంటారు. 2021 బడ్జెట్లో.. 2021 బడ్జెట్ రోజున ఆర్థిక మంత్రి తెలంగాణలోని పోచంపల్లికి చెందిన చీరను కట్టుకున్నారు. ఎరుపు- హాఫ్ వైట్ సమ్మేళనం అయిన ఇక్కత్ సిల్క్ పోచంపల్లి చీరను ధరించారు. ఈ చీరకు పల్లు ఇక్కత్ పాటర్స్‌తో సన్నటి గ్రీన్ బార్డర్ ఉంటుంది. సిల్క్ సిటీ ఆఫ్ ఇండియాగా పేరొందిన తెలంగాణలోని భూదాన్ పోచంపల్లిలో ఈ చీర తయారైంది. 2022 బడ్జెట్లో.. 2022 బడ్జెట్ సమర్పణ సందర్బంగా బ్రౌన్ కలర్ చీర ధరించి పార్లమెంట్ కు వచ్చారు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. ఒడిశాలో ఈ చీరలు తయారవుతాయి. రస్ట్ బ్రౌన్ చీరకు మెరూన్ రంగు బార్డర్, సిర్వర్ కలర్ డిజైన్ ఉంది. బ్రౌన్ కలర్ రక్షణ, భద్రతలను సూచిస్తుంది. రెడ్ కలర్ పవర్‌ను సూచిస్తుంది. ఈ రెండింటి సమ్మేళనంతో ఉన్న చీరను ధరించి 2022 బడ్జెట్ ప్రవేశపెట్టారు. 2023లో.. 2023లో ఐదో సారి బడ్జెట్ ప్రవేశపెట్టే సందర్భంగా నిర్మలా సీతారామన్.. ఎరుపు రంగు టెంపుల్ బార్డర్ చీర ధరించారు. దీని మీద ఎరుపు, నలుపు కలర్ జరీ బార్డర్, టెంపుల్ డిజైన్ ఉంది. ఈ చీరలు ముఖ్యంగా కాటన్ లేదా సిల్క్‌లో మాత్రమే లభిస్తాయి. ప్రత్యేక సందర్భాల్లో మహిళలు వీటిని కట్టుకునేందుకు ఇష్టపడుతుంటారు. మరోవైపు.. ఇదే ఏడాది బహీ ఖాతా స్థానంలో ఎరుపు రంగు డిజిటల్ టాబ్లెట్‌తో బడ్జెట్ ప్రవేశపెట్టారు నిర్మలా సీతారామన్. 2024లో.. ఈ ఏడాది ప్రవేశపెడుతున్న మధ్యంతర బడ్జెట్ సమర్పణ కోసం ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బ్లూ కలర్ కాంతా వర్క్ టస్సార్ చీరను ధరించారు. ఈ చీర పశ్చిమ బెంగాల్లో తయారైంది. ఇక ఈ నీలం రంగు నీలం మంచి ఆరోగ్యానికి ప్రతీక. పైగా ఇది రక్షణకు, అధికారం, విశ్వాసం,మేధస్సు, ఐక్యత, స్థిరత్వలను సూచిస్తుంది. ఇక ఆర్థిక మంత్రి సీతమ్మకు చేనేత చీరలంటే మహా ఇష్టం. జనవరి 26న, నార్త్ బ్లాక్‌లో జరిగిన ప్రీ-బడ్జెట్ హల్వా వేడుకలో ఆమె ఆకుపచ్చ, పసుపు కంజీవరం చీరలో కనిపించింది. ప్రత్యేక సందర్భాల్లో ఆమె ఎక్కువగా సంబల్పురి, ఇకత్, కంజీవరం చీరలలో కనిపిస్తుంది. చాలా వరకు ఆమె నలుపు రంగుకు దూరంగా ఉంటారని సమాచారం. (చదవండి: నిర్మలమ్మ చీర ప్రత్యేకత ఇదే..) -
రిపబ్లిక్ డే వేడుకలు: ఆకట్టుకున్న 1900 చీరల ప్రదర్శన
న్యూఢిల్లీ: కర్తవ్యపథ్‌లో శుక్రవారం 75వ గణతంత్ర వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకలల్లో ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయెల్ మాక్రాన్ ముఖ్య అతిథిగా హాజరైన విషయం తెలిసిందే. ఈ వేడుకల్లో భాగంగా జరిగిన పరేడ్‌లో వీక్షకుల కోసం ఏర్పాటు చేసిన సీటింగ్ ఏరియా ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. గణతంత్ర వేడుకల్లో పాల్గొన్న వీక్షకులను ఆకట్టుకుంది. సీటింగ్ ఏరియాలో సుమారు 1900 చీరలను ప్రదర్శించారు. ‘అనంత్ సూత్ర’ పేరిట దేశవ్యాప్తంగా ఉన్న ప్రత్యేకమైన చీరలను ప్రదర్శనకు పెట్టారు. Here’s a special look at the 'Anant sutra- The Endless Thread' textile installation at #KartavyaPath as a part of the 75th #RepublicDay celebrations!#CultureUnitesAll #AmritMahotsav #BharatKiNariinSaree #RepublicDay2024 pic.twitter.com/DoFQCJuFRm — Ministry of Culture (@MinOfCultureGoI) January 26, 2024 చెక్క ఫ్రేమ్స్‌కు రంగరంగు చీరలను అమర్చి ప్రదర్శించారు. దీంతో సీటింగ్ ఏరియాలో కూర్చన్న వీక్షకులను వాటిని చూసి సందడి చేశారు. ఇక.. ఆ చిరలను ఎక్కడ నేశారో? వాటి వెరైటీ ఎంటో? చీరల ఎంబ్రైడరీకి సంబంధించిన పలు విషయాలను తెలుసుకునేందుకు వీలుగా ప్రతి చీరకు యూఆర్ కోడ్‌ను ఏర్పాటు చేయటం విశేసం. దీనికి సంబంధించిన వీడియోను మినిస్ట్రీ ఆఫ్ కల్చర్ తన ‘ఎక్స్’(ట్విటర్) ఖాతాలలో పోస్ట్ చేసింది. ఈ వీడియోను చూసిన నెటిజన్లు ఒకేసారి దేశంలో ఉన్న పలు వెరైటీ చీరలు చూడటం బాగుంది.. యూఆర్ కోడ్ ఐడియా సూపర్’ అని కామెంట్లు చేస్తున్నారు. -
Rhea Chakraborty Saree Photos: సారీలో కవ్విస్తూ, కాక పుట్టిస్తున్న ఈ బ్యూటీని చూశారా?
-
ఇక కాటన్స్తో ఆరంభం..
చలి ప్రభావం తగ్గుతూ ఎండ ప్రతాపం చూపడానికి రెడీ అవుతున్నట్టుగా ఉంది ప్రస్తుత వాతావరణం. మనం కూడా అందుకు రెడీగా ఉండకతప్పదు. ఈ రిపబ్లిక్ డే ని పురస్కరించుకొని ఫాస్ట్ ఫ్యాషన్‌ను వదిలేసి మనవైన దేశీయ కాటన్ దుస్తులతో వార్డ్రోబ్ను సిద్ధం చేసుకుంటే రాబోయే వేసవి రోజులను ఫ్యాషనబుల్‌గానూ.. హాయి హాయిగా, కులాసాగానూ గడిపేయచ్చు. సీజన్‌కి తగ్గట్టుగా మన డ్రెస్సింగ్‌ను కూడా మార్చుకుంటాం. అందులోనూ వేసవి కంఫర్ట్‌తో గడిపేయాలనుకుంటాం. కాటన్స్ అయితే డల్‌గా ఉంటాయి అనే మాటలు పక్కన పెట్టేసి మోడర్న్ లుక్స్‌తో ఆకట్టుకుంటున్న వాటిని ఎంపిక చేసుకోవచ్చు. ఎక్కడ ఉన్నా వైభవంగా వెలిగి΄ోవచ్చు. మనవైన చేనేతలు కాటన్ అనగానే మనకు ముందుగా ఖాదీ గుర్తుకు వస్తుంది. ఖాదీ చీరలు, షర్ట్లే కాదు ఇండో వెస్ట్రన్ స్టైల్స్ కూడా ఇందులో వస్తున్నాయి. దీనితో పాటు నారాయణ్‌పేట్, ఇక్కత్, గద్వాల.. వంటి చేనేతలు సంప్రదాయ వేడుకల సందర్భాల్లోనూ ధరించడానికి బాగుంటాయి. ఇండోవెస్ట్రన్ జంప్‌సూట్స్, ష్రగ్స్, గౌన్లు, లాంగ్ అండ్ షార్ట్ జాకెట్స్ డిజైన్స్ ఎన్నో ఇప్పుడు మనకు కాటన్ మెటీరియల్‌తో తయారైన డిజైన్స్ కనిపిస్తున్నాయి. క్యాజువల్ లేదా కాక్టెయిల్ పార్టీ ఏదైనా సందర్భానికి తగినట్టు వీటిని ఎంచుకోవచ్చు. ఆభరణాల ఊసు కాటన్ మెటీరియిరల్ పైగా వేసవి టైమ్ కాబట్టి ఉడెన్, టెర్రకోట జ్యువెలరీతో అలంకరణ ప్రత్యేక ఆకర్షణగా ఉంటుంది. ఎక్కువ అలంకరణ హంగామా లేకుండా సింపుల్ అండ్ ఎలిగేంట్ లుక్స్ అనిపించేలా రెడీ అవడానికి ఇప్పటి నుంచి ప్రిపేర్ అయిపోవచ్చు. బ్లాక్ ప్రింట్ గౌన్స్ కాటన్‌పై వేసిన బ్లాక్ ప్రింట్ మెటీరియల్‌తో ఏ స్టైల్ డ్రెస్ అయినా డిజైన్ చేసుకోవచ్చు. ఇవి వేసుకోవడానికి సౌకర్యంగానే కాదు, ఎంతమందిలో ఉన్నా ప్రత్యేకంగానూ కనిపిస్తాయి. ఇవి చదవండి: అకృత్యాలకు అడ్డుకట్ట కార్నర్ మీటింగ్స్ -
వన్ డిస్ట్రిక్ట్ వన్ ప్రోడక్ట్ పోటీలో మెరిసిన మంగళగిరి చీర
-
ప్రమోషన్స్‌లో చీరకట్టులోనే కనిపిస్తున్న రష్మిక..అదే కారణమా?
నేషనల్ క్రష్ రష్మిక మందన్నా క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. స్టార్ హీరోలకి మించిపోయే ఫాన్ ఫాలోయింగ్‌తో రష్మిక సోషల్ మీడియాలో ఎప్పుడూ ట్రెండ్ అవుతూ ఉంటుంది. ఇండస్ట్రీలో అడుగుపెట్టిన తక్కువ కాలంలోనే ఎంతో పాపులారిటి దక్కించుకున్న ఈ బ్యూటీ ఛలో సినిమాతో టాలీవుడ్ ప్రేక్షకులకు పరిచయమైంది. తొలి సినిమాతోనే ప్రేక్షకులకు దగ్గరైన ఈ బ్యూటీ ఆ తర్వాత వరుస హిట్స్‌తో వెనక్కి తిరిగి చూసుకోలేదు. మోస్ట్ వాంటెడ్ హీరోయిన్గా తెలుగులోనే కాదు ఇప్పుడు బాలీవుడ్‌లోను తన సత్తా చాటుతోంది. ప్రస్తుతం ఆమె నటించిన లేటెస్ట్ మూవీ యానిమల్. అర్జున్ రెడ్డి ఫేమ్ సందీప్ రెడ్డి వంగా డైరెక్షన్లో తెరకెక్కించిన ఈ చిత్రంలో రష్మిక, రణబీర్ కపూర్ జంటగా నటించారు. ఫుల్ యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కించిన ఈ సినిమా డిసెంబర్ 1న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ప్రమోషన్స్ జోరు పెంచారు మూవీ టీం. ఇందులో రష్మిక లేటెస్ట్ లుక్స్ నెట్టింట తెగ ట్రెండ్ అవుతున్నాయి. మొన్నా మధ్య రష్మిక తన ఇన్‌స్టాలో.. శారీలో ఉన్న ఫోటోను షేర్ చేస్తూ మీరంతా(అభిమానులను ఉద్దేశించి)నాకు చీరలపై ఉన్న ఇష్టాన్ని పెంచేశారు అంటూ కామెంట్స్ చేసిన సంగతి తెలిసిందే. అప్పట్నుంచి రష్మిక ఎక్కువగా చీరకట్టులోనే కనిపిస్తుంది. తాజాగా యానిమల్ ప్రమోషన్స్ అన్నింట్లో చీరల్లోనే మెస్మరైజ్ చేస్తుంది ఈ బ్యూటీ. తాజాగా హైదరాబాద్‌లో నిర్వహించిన ఓ ప్రెస్మీట్లో వైట్ శారీలో దేవకన్యలా మెరిసిపోయింది రష్మిక. 👉: (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) View this post on Instagram A post shared by Rashmika Mandanna (@rashmika_mandanna) ఆర్గాంజా శారీలో అదరహో అనిపించే అందంతో మెరిసిపోయింది. మొన్నటికి మొన్న ఓ షోకు హాజరైన రష్మిక బ్లాక్ శారీలో తళుక్కుమంది. చూడటానికి చాలా సింపుల్‌గా కనిపించిన ఈ చీర ధర అక్షరాల 80వేల రూపాయలట. ఇక రీసెంట్గా ప్రముఖ డిజైనర్ అర్పితా ఖాన్ డిజైన్ చేసిన పింక్ చీరలోనూ వయ్యారాలు ఒలికించింది. ఫ్యాషన్ ప్రపంచంలో ఎప్పుడూ ముందుండే రష్మిక చీరకట్టులోనూ మరింత అందంగా కనిపిస్తోంది. దీంతో రష్మికకు-చీరలకు ఏందో లింక్ ఉన్నట్లుంది, త్వరలోనే రివీల్ చేస్తుందేమో చూడాల్సి ఉంది నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. View this post on Instagram A post shared by Rashmika Mandanna (@rashmika_mandanna) -
మగువల మనసు దోచే చీరల ప్రదర్శన (ఫోటోలు)
-
‘వెంకటగిరి’ ఉత్పత్తులు అత్యద్భుతం
సైదాపురం/వెంకటగిరి రూరల్: వెంకటగిరి నేతన్నలు తయారు చేసిన పలు అద్భుతమైన డిజైన్లు అబ్బురపరుస్తున్నాయని ఇన్వెస్ట్ ఇండియా టీమ్ కమిటీ ప్రతినిధులు కితాబిచ్చారు. వెంకటగిరి చీరలు, చేనేత ఉత్పత్తులు, జరీ తదితర ఉత్పత్తులను మంగళవారం కేంద్ర బృందం పరిశీలించింది. ఓపెన్ ఇండియా ఒన్ ప్రొడెక్ట్ అవార్డులో భాగంగా 2023లో ప్రతిష్టాత్మకంగా జరిగే పోటీల్లో వెంకటగిరి చేనేత ఉత్పత్తులకు ప్రాధాన్యమిచ్చారు. ఈ మేరకు ఇన్వెస్ట్ ఇండియా టీమ్ కమిటీ ప్రతినిధి జగీష్ తివారిమిశ్రా, తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటరమణారెడ్డితో కలిసి వెంకటగిరిలో తయారు చేసే పలు చేనేత ఉత్పత్తులు, చీరలు, డిజైన్లను పరిశీలించారు. కేంద్ర బృందానికి వైఎస్సార్సీపీ తిరుపతి జిల్లా అధ్యక్షుడు, వెంకటగిరి నియోజకవర్గ సమన్వయకర్త నేదురుమల్లి రామ్‌కుమార్‌రెడ్డి స్వాగతం పలికారు. పట్టణంలోని సాలి కాలనీలోని టాటాట్రస్ట్ అంతరాన్ అందిస్తున్న సహకారం, నేతన్నల వృత్తిలో నైపుణ్యం వంటి అంశాలపై ఆరాతీశారు. బంగారుపేటలో రాష్ట్రపతి చేనేత అవార్డు గ్రహీతలు కూనా మల్లికార్జున్. గౌరవబత్తిన రమణయ్య నివాసాల వద్ద జందాని ట్రెడిషన్ రంగంలో తయారు చేసిన చీరలు, చీరలపై తెలుగు సంప్రదాయల కళ ఉట్టిపడేలా తయారు చేసిన డిజైన్లపై ఆరాతీశారు. వెంకటగిరి రాజా కాలంలో వెంకటగిరి జరీ చీరల ప్రత్యేకతపై వివరాలు తెలుసుకున్నారు. రాజరాజేశ్వరి చేనేత సహకారం సంఘాన్ని పరిశీలించి వివరాలు తెలుసుకున్నారు. అనంతరం వెంకటగిరిలోని ప్రముఖ వస్త్ర వ్యాపారి నక్కా వెంకటరమణయ్య అండ్ సన్స్ వద్దకు వెళ్లి తయారీ విక్రయానికి సిద్ధంగా ఉన్న పట్టు చీరలను పరిశీలించారు.అలాగే ప్రసిద్ధి చెందిన ఐఐహెచ్‌టీ (ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీ) కళాశాలను కేంద్ర బృందం ప్రతినిధి జిగీష తివారి మిశ్రా పరిశీలించారు. -
రంగులు మార్చే చీర!
సాక్షి, సిరిసిల్ల, హైదరాబాద్: చీరను కదిలిస్తే చాలు.. రంగులు మారతాయి.. బంగారు, వెండి పోగులు మెరిసిపోతాయి. వనితల దేహంపై మెరిసిపోతాయి. బంగారం, వెండి పోగులు, పట్టుదారంతో పట్టు చీర నేశాడు సిరిసిల్లకు చెందిన నేత కళాకారుడు నల్ల విజయ్‌కుమార్. నెల రోజులపాటు మగ్గంపై శ్రమించి ఈ చీరను నేశాడు. 30 గ్రాముల బంగారం, 500 గ్రాముల వెండిపోగులతోపాటు పట్టు పోగులతో రూపొందించాడు. ఈ చీర పొడవు 6.30 మీటర్లు ఉండగా.. 48 అంగుళాల వెడల్పుతో 600 గ్రాముల బరువుంటుంది. ప్రముఖ వ్యాపారి దూరపూడి విష్ణు ఆర్డర్ మేరకు రూ.2.8 లక్షలు వెచ్చించి ఈ చీరను నేసినట్లు విజయ్‌కుమార్ తెలిపారు. ఈ చీరను మంత్రి కె.తారక రామారావు సోమవారం సెక్రటేరియట్లో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా నేత కళాకారుడు నల్ల విజయ్‌కుమార్‌ను మంత్రి అభినందించారు. -
‘జీ20 సదస్సు’కు సిద్దిపేట గొల్లభామ చీరలు
సిద్దిపేట జోన్: దేశ రాజధాని ఢిల్లీలో జరిగే జీ20 శిఖరాగ్ర సదస్సు సందర్భంగా సిద్దిపేట గొల్లభామ చీరలను ప్రదర్శించే అవకాశం దక్కింది. వివిధ దేశాల ప్రధానులు, అ ధ్యక్షులు, ఇతర ముఖ్య ప్రతినిధులు హాజ రుకానున్న సదస్సు వేదిక వద్ద పలు స్టాళ్లను ఏర్పాటు చేయనున్నారు. అందులో ప్రపంచవ్యాప్తంగా ప్రాచుర్యం పొందిన సిద్దిపేట గొల్లభామ చీరలను కూడా ప్రత్యేక స్టాల్లో ప్రదర్శించనున్నారు. దీంతో సిద్దిపేట నేత న్నల నైపుణ్యం ప్రపంచానికి తెలియనుం దని స్థానికులు హర్షం వ్యక్తంచేస్తున్నారు. ఇలా రూపుదిద్దుకుంది..: కళాత్మకత ఉట్టిపడే గొల్లభామ చీరల ప్రస్థానం 70 ఏళ్ల క్రితం ప్రారంభమైంది. సిద్దిపేటకు చెందిన చేనేత కార్మికులు వీరబత్తిని సోమయ్య, రచ్చ నర్సయ్య.. ఒకరోజు తమ ఇంటి ముందునుంచి తలమీద పాలకుండ, చేతిలో పెరుగు గురిగి పట్టుకొని నడిచివెళుతున్న ఓ మహిళ నీడను చూసి.. వారిలో ‘గొల్ల భామ‘చీరల ఆలోచన పురుడు పోసుకుంది. ఆ దృశ్యాన్ని నేత పని ద్వారా చీరల మీద చిత్రించాలనుకున్నారు. అనుకున్నదే తడ వుగా ఆలోచనలకు పదును పెట్టి గొల్లభామ చీరలను నేసేందుకు ప్రత్యేకమైన సాంచాను తయారు చేసుకున్నారు. అలా ఆవిష్కృతమైన అద్భుతమే.. ‘గొల్లభామ చీర’గా ప్రశస్తి పొందింది. పట్టు, కాటన్.. రెండు రకాల్లోనూ ఈ చీరలను నేస్తారు. చీర అంచుల్లో వయ్యారంగా నడిచే గొల్లభామ చిత్రం వచ్చేలా నేయడమే వీటి ప్రత్యేకత. పెద్ద గొల్లభామ బొమ్మకు దాదాపు 400 దారపు పోగులు అవసరమైతే, చిన్న బొమ్మకు 30 నుంచి 40 పోగులు అవసరం అవుతాయి. ప్రస్తుతం ఇరవై రంగుల్లో గొల్లభామ చీరలను రూపొందిస్తున్నారు. ఒకప్పుడు గొల్లభామ చీర తయారీకి వారం నుంచి 10 రోజులు పట్టేది. ఇప్పుడు జాకార్డు మగ్గం వల్ల మూడు, నాలుగు రోజుల్లో గొల్లభామ చీర తయారు చేస్తున్నారు. మిగతా చీరలతో పోలిస్తే ఈ చీరలను నేయడం కష్టంతో కూడుకున్న పనిగా చెపుతారు. 2012లో ఈ చీరలకు జాగ్రఫికల్ ఇండికేషన్ ట్యాగ్ లభించింది. -
అందాల భామ ఆలియా ధరించిన చీర ధర తెలిస్తే నోరెళ్లబెట్టాల్సిందే!
కెరీర్ కెరీరే.. వ్యక్తిగత జీవితం వ్యక్తిగత జీవితమే! దేనినీ దేనికోసం వదులుకోవడంలేదు నేటి నటీమణులు! అందుకే గ్లామర్ ప్రపంచంలో ఒక వెలుగు వెలుగుతున్నా.. పెళ్లి.. పిల్లలు.. కుటుంబం విషయంలో కాంప్రమైజ్ కావడంలేదు. ఆ లిస్ట్‌లో చాలామందే ఉన్నా.. ఇక్కడ చెప్పుకుంటోంది మాత్రం బాలీవుడ్ స్టార్ ఆలియా భట్ గురించి.. ఇక ఆమె తన గురించి చెబుతూ.. నా మనసు చెప్పిందే వింటాను. జీవితాన్ని మనం ప్లాన్ చేయలేం. జీవితమే మనకు ప్లాన్ ఇస్తుంది అని అంటోంది ఆలియా. ఈ సందర్భంగా గ్లామర్ ప్రపంచంలో ఒకఆమె క్రియేట్ చేసిన ఫ్యాషన్ ట్రెండ్ గురించి! ఆ ట్రెండ్‌లో పార్ట్నర్స్ అయిన బ్రాండ్స్ ఏంటో చూద్దాం.. మనీష్ మల్హోత్రా.. డిజైనర్ మనీష్ మల్హోత్రా గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. బాలీవుడ్ టాప్ హీరోయిన్స్‌తో పాటు పలువురు సెలబ్రిటీలకూ దుస్తులు డిజైన్ చేస్తుంటాడాయన. బాలీవుడ్లో ఏ ఈవెంట్ జరిగినా మనీష్ మల్హోత్రా కాస్ట్యూమ్స్ ఉండాల్సిందే. ఫ్యాషన్ వరల్డ్‌కి బ్రాండ్ అంబాసిడర్‌గా మారిన ఈ డిజైనర్.. బెస్ట్ కాస్ట్యూమ్ డిజైనర్‌గా సినీపరిశ్రమలోనూ తన స్థానం పదిలం చేసుకున్నాడు. అయితే అతని డిజైన్స్‌ని సామాన్యుడు అందుకోవాలంటే మాత్రం కాస్త కష్టమే. ఏది కొనాలన్నా ధర లక్షల్లోనే ఉంటుంది. ఆన్‌లైన్‌లోనూ లభ్యం. ఇంతకీ ఆలియా ధరించిన మల్హోత్రా డిజైనర్ చీర ధర రూ. 1,35000/- ఆమ్రపాలి జ్యూలరీ రాజీవ్ అరోరా, రాజేష్ అజ్మేరా అనే మిత్రులు.. రాజపుత్రుల నుంచి గిరిపుత్రుల వరకు వారి కళను, వారు ధరించే ఆభరణాలను ఆధునిక తరానికి చూపించాలనే ఉద్దేశంతో జైపూర్‌లో ‘ఆమ్రపాలి’ పేరుతో ఓ మ్యూజియమ్‌ను స్థాపించారు. దాని సందర్శనకు వచ్చిన చాలామంది ఆ అభరణాలను ధరించేందుకు ఆసక్తి చూపడంతో అచ్చు అలాంటి వాటినే తయారుచేస్తూ, విక్రయించడం మొదలుపెట్టారు. అలా ఆమ్రపాలి బ్రాండ్ మొదలైంది. డిజైన్ మాత్రమే యాంటిక్ కాబట్టి సరసమైన ధరల్లోనే లభిస్తాయి. ఒరిజినల్ యాంటిక్ పీస్ కావాలంటే మాత్రం వేలంపాటలో లక్షలు పెట్టాల్సిందే. ఆమ్రపాలికి ఆన్లైన్ మార్కెట్టూ విస్తృతమే. (చదవండి: స్టన్నింగ్ లుక్‌తో మెరిసిపోతున్న రకుల్ ధరించిన చీర ధర ఎంతంటే..) -
అరటి నార.. అందమైన చీర
పిఠాపురం: వస్త్ర ప్రపంచంలో కాకినాడ జిల్లా కొత్తపల్లి, గొల్లప్రోలు మండలంలోని చేనేత కార్మికులు చరిత్ర సృష్టించారు. వారు నేసిన జాంధానీ చీరలు మహిళా లోకం అందాన్ని మరింత ఇనుమడింపజేసి అంతర్జాతీయ ఖ్యాతిని అందుకుంటున్నాయి. రెండువైపులా ఒకే విధంగా కనిపించడమే జాంధానీ చీరల ప్రత్యేకత. చీర తయారయినప్పుడు ఎంత విలువుంటుందో.. అది కాస్త పాడయినపుడు కూడా ఎంతో కొంత ధర పలకడం దీని విశిష్టత. మిగిలిన ఏ రకం చీరలకూ ఈ అవకాశం లేకపోవడం గమనార్హం. కుటీర పరిశ్రమగా ప్రారంభమైన జాంధానీ చీరల తయారీ నేడు ప్రపంచస్థాయి గుర్తింపునకు నాంది పలుకుతున్నాయి. ప్రతీ ఏటా కోట్ల రూపాయల జాంధానీ చీరల క్రయవిక్రయాలు జరుగుతున్నాయి. ఇటీవల ఢిల్లీలో నిర్వహించిన అంతర్జాతీయ ఎగ్జిబిషన్లో స్థానం సంపాదించి విదేశీ ఆర్డర్లు సైతం సా«ధించింది. ఈ క్రమంలో జాంధానీకి నయా ట్రెండ్‌ను జోడించి మరింత సోయగాలు అద్దడానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంది. దీంతో ‘జాంధాని’ పేటెంట్ హక్కుతో పాటు ఉప్పాడ కాటన్, సిల్క్ మాదిరిగా ఇండియన్ హేండులూమ్స్లోనూ స్థానం సంపాదించింది. ఈ క్రమంలో జాంధానీకి నయా ట్రెండ్‌ను జోడించి మరింత సోయగాలు అద్దేలా చేనేతలకు ప్రోత్సాహం కల్పించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. పర్యావరణ పరిరక్షణను దృష్టిలో పెట్టుకుని సహజసిద్ధంగా లభించే అరటి, అవిసె మొక్కల నారతో మంచి మంచి డిజైన్లతో వ్రస్తాలను తయారు చేసేలా వారికి శిక్షణ ఇస్తుంది. బనానా సిల్క్ నేతపై శిక్షణ.. మారుతున్న ట్రెండ్‌కు అనుగుణంగా వృత్తిలో నైపుణ్యం సాధించే విధంగా భారత ప్రభుత్వ జౌళి మంత్రిత్వ శాఖ చేనేత అభివృద్ధి కమిషన్ ఆధ్వర్యంలో చేనేత కార్మికులకు శిక్షణ ఇస్తుంది. ఇందుకోసం కాకినాడ జిల్లాలోని తాటిపర్తి, ప్రత్తిపాడులో రెండు శిక్షణ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఒక్కో కేంద్రంలో 20 మందికి చొప్పున కొత్త కొత్త డిజైన్లతో బనానా, లినిన్ నేతపై అధికారులు శిక్షణ ఇస్తున్నారు. బనానా దారంతో నేత అరటి బెరడులో ఉండే పీచుతో తయారు చేసిన దారంతో జాంధానీ చీరలు తయారు చేస్తారు. ఈ చీరల్లో ఉపయోగించే రంగులు కెమికల్స్‌కు స్వస్తి పలికి ఆర్గానిక్ పద్ధతిలో ప్రకృతి సిద్ధమైన బనానా దారంను ఉపయోగించడానికి చర్యలు తీసుకుంటున్నారు. సిల్క్ దారం ఎక్కువ కాలం మట్టిలో కలవకుండా ఉండడం వల్ల కాలుష్యం పెరిగే అవకాశాలు ఉండడంతో బనానా దారానికి ప్రాధాన్యతనిస్తున్నారు. మూసా ఫైబర్‌గా పిలవబడే ఇది వేడి తట్టుకోవడంతో పాటు మంచి స్పిన్నింగ్ సామర్థ్యం కలిగి అత్యధిక నాణ్యతతో ఉంటుంది. ప్రస్తుతం దీనిని కేరళ నుంచి దిగుమతి చేసుకుంటున్నారు. రానున్న కాలంలో అరటి బెరడులకు గిరాకీ పెరగనుంది. బనానా దారం తయారీకి చర్యలు .. బనానా, లినిన్ దారాలను కేరళ, తమిళనాడు, చెన్నై నుంచి దిగుమతి చేసుకుంటున్నాం. త్వరలో తయారీకి చర్యలు తీసుకుంటాం. స్కీం ఫర్ కెపాసిటీ బిల్డింగ్ ఇన్ టెక్స్టైల్స్ సెక్టార్ ద్వారా విజయవాడలోని వీవర్స్ సర్విస్ సెంటర్ ద్వారా కార్మికులకు శిక్షణ ఇస్తున్నాం. – కె.పెద్దిరాజు, చేనేత జౌళి శాఖాధికారి, కాకినాడ -
ప్రత్యేకంగా కనిపించే ప్రింటెడ్ డ్రెస్సులు.. స్టైలింగ్ అదిరిపోద్ది
ఫ్లోరల్, మల్టీకలర్ ప్రింట్స్ ఏవైనా మనసుకు ఎప్పుడూ ఆహ్లాదాన్నిస్తాయి. ఫ్యాబ్రిక్ ఏదైనా చూడముచ్చటగా ఉంటాయి. సీజన్‌తో పనిలేకుండా పార్టీ ఏదైనా ఇండోవెస్ట్రన్ లుక్‌తో టాప్ టు బాటమ్ ఎవర్గ్రీన్ లుక్‌తో ప్రింటెడ్ ఆకట్టుకుంటున్నాయి. క్యాజువల్ వేర్‌గానూ కలర్‌ఫుల్ అనిపిస్తాయి.అందుకే, డిజైనర్లు ప్రింట్ కాన్సెప్ట్‌ను ఎప్పుడూ వినూత్నంగా మన ముందుకు తీసుకు వస్తుంటారు. వాటిలో కొన్ని డిజైన్స్ ఇవి. లెహంగా శారీ, లాంగ్ కోట్, ట్రౌజర్, శారీ గౌన్, కుర్తా పైజామా.. మల్టీ కలర్ ప్రింట్లతో టాప్ టు బాటమ్ ఒకే కలర్ కాంబినేషన్‌ను ఎంచుకుంటే ఈ థీమ్‌కు సరిగ్గా నప్పుతుంది. ఈ స్టయిల్‌కి ఇతర యాక్ససరీస్ కూడా అంతగా అవసరం ఉండదు. ప్రత్యేకంగా కనిపించే ఈ ప్రింటెడ్ డ్రెస్సులు ఎక్కడ ఉన్నా అంతే ప్రత్యేకతను చాటుతాయి.