
చీరలు వాడుతున్న కొద్దీ కొన్నప్పుడూ ఉన్నట్టు కనపించవు. కలర్ తగ్గిపోయి కట్టుకున్న నలిగిపోతున్నట్లు ఉంటుంది. కొత్త ఉన్నంత షైన్‌గా కనిపించదు. దీంతో ఈ షాపు మంచిది, అది మంచిది అంటూ షాపులు మార్చుతుంటాం. ఎన్ని చోట్లకు తిరిగి కొన్నా అదే తీరులో చీరలు ఉంటాయి. అలా కాకుండా చీరలు కొన్న ప్పుడే ఏ రేంజ్‌లో మెరుస్తూ కనిపిస్తున్నాయో అలానే ఉండాలంటే కొన్న చిట్కాలు పాటిస్తే చాలు ఎప్పటికీ కొన్న వాటిలానే ఉంటాయి. ఇక్కడ చీరలు మెయింటైయిన్ చేయడమపైనే ట్రిక్ అంతా దాగి ఉంది. ఆ ట్రిక్ ఏంటంటే..
ముందుగా చీరలను ఎలా పడితే అలా మడతలు పెట్టొద్దు. అలాగే మడత పెట్టి ఎక్కువ రోజులు ఉంచొద్దు. ఇలా చేస్తే రంగు మారుతుంది. పైగా చీన ముడతలు ముడతలుగా అయిపోతుంది. ముడతలు పడకుండ మధ్యలో ఒకసారి తీసి తిరిగి మడతపెట్టాలి. వాటిని వెలుతురు పడని ప్రదేశాల్లోనే పెట్టాలి. చీరను ఉతికేటప్పుడూ కూడా జాగ్రత్త పాటించాలి. చీరలు అన్నింటిని ఒకే విధంగా ఉతికితే త్వరగా పాడవుతాయి.
వాషింగ్ మిషన్ లో చీరలన్నింటిని ఉతక్కూడదు. కొన్నింటిని మినహాయించాలి. ఎందుకంటే? కొన్ని వాషింగ్ మిషన్‌లో ఉంటే కలర్ దిగిపోయే అవకాశం చీర పాడయ్యే అవకాశాలు ఉంటాయి. అలాంటి చీరలను చేత్తో నానబెట్టకుండా ఉతుక్కోవడం మంచిది. ఇంకొన్ని చీరలను ఉతక్కుండా డ్రైక్లీనింగ్కు ఇవ్వాలి. అలాగే కొన్ని లైట్ వైట్ చీరలను కొనేటప్పుడే ఎలా ఉతకాలి ఏంటన్నది అడిగి తెలసుకోవాలి. అలాగే ఐరన్ చేయడం వల్ల చీరలకు మంచి లుక్ వస్తుంది కాబట్టి ఐరన్ తప్పనిసరి. ఎక్కువ వేడి మీద అసలు ఐరన్ చేయొద్దు. ఇలా చేస్తే తొందరగా పాడవుతాయి. సిల్క్, పట్టు చీరలు ఐరన్ చేసేటప్పుడు కాటన్ క్లాత్ వేసి ఐరన్ చేస్తే ఫ్యాబ్రిక్ దెబ్బతినకుండా ఉంటుంది కాబట్టి ఈ చిట్కాను తప్పక గుర్తించుకోవాలి
ఎంత మంచిగా మెయింటెన్ చేసినా కూడా చీరలపై మరకలు, మడతలు అలాగే ఉంటాయి. దీంతో ఎలా పడితే అలా కాకుండా.. మరకను మాత్రమే క్లీన్ చేస్తే సరిపోతుంది. ఆ తర్వాత వెనిగర్, నిమ్మరసం, సబ్బుతో క్లీన్ చేసుకుంటే సరిపోతుంది. కొన్ని చీరలకు వర్క్ మరికొన్ని చీరలకు స్టోన్స్, ముత్యాలు ఉంటాయి కాబట్టి అలాంటి వాటిని విడివిడిగా ఉతకాలి. చీర నాణ్యతను బట్టి ఉతకే విధానంలో మార్పులు చేయాలి. లేదంటే అంత కష్టబడి డబ్బులు పెట్టి మరీ చేయించుకున్న వర్క్ పాడయ్యే పోయే ప్రమాదం ఉంటుంది.
(చదవండి: ప్రపంచంలోనే బెస్ట్ డెజర్ట్‌గా భారతీయ స్వీట్! ఎన్నో స్థానంలో నిలిచిందంటే..)