చేనేత చీరల్లో ప్రస్తుతం వేటికి డిమాండ్‌ ఉంది? | Handloom Saree Market Demand Fashion Special Story | Sakshi
Sakshi News home page

చేనేత చీరల్లో ప్రస్తుతం వేటికి డిమాండ్‌ ఉంది?

Published Sat, Mar 20 2021 7:44 PM | Last Updated on Sat, Mar 20 2021 7:50 PM

Handloom Saree Market Demand Fashion Special Story - Sakshi

చేనేత చీరలు, డ్రెస్సులు ఏ సీజన్‌కైనా వన్నె తెస్తాయి. సౌకర్యంతో పాటు కళను కూడా కళ్ల ముందు కట్టిపడేస్తాయి. అందుకే, చేనేత చీరలకు ఎప్పుడూ మార్కెట్‌లో మంచి డిమాండ్‌ ఉంటుంది. హైదరాబాద్‌లో ఉంటున్న ఫ్యాషన్‌ డిజైనర్‌ హేమంత్‌శ్రీ లాక్‌డౌన్‌ తర్వాత చేసిన చేనేత డిజైన్స్‌ గురించి ఇలా వివరించారు. 

లాక్‌డౌన్‌లో చేసిన డిజైన్స్‌కి మార్కెట్‌ ఎలా ఉంది?
సోషల్‌ మీడియాలో కొత్త కొత్త డిజైన్స్‌ గురించి వెతికే వారి శాతం పెరిగింది. ఇంటి నుంచే ఆర్డర్స్‌ కూడా పెరుగుతున్నాయి. ఈ వర్క్‌ మాకు చాలా ఈజీ గానూ, ఛాలెంజింగ్‌గానూ ఉంటుంది. యంగ్‌స్టర్స్‌ పెరిగారు. వారిని దృష్టిలో పెట్టుకునే జర్కిన్స్, ఓవర్‌ కోట్స్‌ మీద ప్రింట్స్‌..వంటివి చేశాను. 

లాక్‌డౌన్‌ తర్వాత స్పెషల్‌గా చేసిన కృషి?  
లాక్‌డౌన్‌ తర్వాత చేనేతకారుల దగ్గరకు వెళ్లాను. లాక్‌డౌన్‌ కారణంగా వాళ్లదగ్గర చాలా స్టాక్‌ ఉండిపోయింది. నారాయణ్‌పేట, ఇక్కత్, పోచంపల్లి, గుజరాతీ పటోల శారీస్‌.. చేనేతకారులను విడివిడిగా కలిశాను. వాళ్ల దగ్గర నుంచి మెటీరియల్‌ తీసుకొని, రీ డిజైనింగ్‌ చేశాను. దీంతో పాటు వాళ్ల అమ్మాయలనే మోడల్స్‌గా తీసుకున్నాను. ఫొటో షూట్‌కి మినిమిమ్‌ 30 వేల రూపాయలు ఖర్చు అవుతుంది. ఒక డిజైనర్‌ను, మోడల్‌ను పెట్టి స్టైలిష్‌గా ఫొటోలు తీయించడం అనేది వారికి కష్టం. ఇప్పుడీ ప్రయోగం వల్ల చేనేతలకు మంచి మార్కెట్‌ అవుతోంది. అమ్మాయిలకీ మోడలింగ్‌ అవకాశాలు వస్తున్నాయి. చేనేత చీరలకు ప్రాముఖ్యత, కళ మరింత స్పష్టంగా రావడానికి బ్యాక్‌గ్రౌండ్‌ యాంబియన్స్‌ పట్ల కూడా ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నాను. 

బ్యాక్‌ గ్రౌండ్‌ యాంటిక్‌ లుక్‌కి వస్తు సేకరణ?
ఇది కొంచెం కష్టంతో కూడుకున్న పనే. పందిరిమంచాలు, తంజావూర్‌ పెయింటింగ్స్, అల్మారాలు, టేబుళ్లు, బ్రాస్‌ ఫ్లవర్‌వేజ్‌లు.. ఒకటేమిటి యాంటిక్‌ లుక్‌ రావడానికి ఇతర రాష్ట్రాల నుంచి కూడా వస్తువులను సేకరించాను. చేనేతలకు మరింత గ్రాండ్‌ లుక్‌ తీసుకురావడానికి చేసిన ప్రయత్నిమిది. 

చేనేత చీరల్లో ప్రస్తుతం వేటికి డిమాండ్‌ బాగుంది?  
చేనేతలకు ఎప్పుడూ డిమాండ్‌ ఉంటుంది. అయితే, ఈసారి గుజరాత్‌ పటోలాకి వరల్డ్‌ వైడ్‌ మార్కెట్‌ బాగుంది. నార్త్‌ ఇండియా వారినీ ఈ డిజైన్స్‌ బాగా ఆకట్టుకున్నాయి. నారాయణ్‌పేట్, గద్వాల, కలంకారీ, పోచంపల్లి.. శారీస్‌కూ మంచి రెస్పాన్స్‌ వచ్చింది. 

చేనేతలతో కాకుండా ఇతరత్రా చేస్తున్న డిజైన్స్‌?
సోషల్‌ మీడియాలో యువత ఎక్కువ టైమ్‌ కేటాయిస్తుంది. లాక్‌డౌన్‌ తర్వాత కొత్త కొత్త ఫ్యాషన్లు ఏవి పుట్టుకొస్తున్నాయనేదానిమీద సెర్చింగ్‌ పెరిగింది. అందుకని   పార్టీవేర్‌ తగ్గించి, క్యాజువల్స్‌కి డిజైన్‌ చేయాలనుకుంటున్నాను. ఈ సందర్భంగా లెనిన్‌ క్లాత్‌తో స్ట్రీట్‌ డిజైన్స్‌ చేస్తున్నాను. ఇందుకు కొంతమంది టీనేజర్స్‌ని కలుస్తున్నాను. కరోనా కారణంగా వీళ్లు ఇంట్లో ఎక్కువ టైమ్‌ స్పెండ్‌ చేస్తున్నారు. కంఫర్ట్‌వేర్‌ కావాలనుకుంటున్నారు.  ఆ తర్వాత ఆర్గంజ మెటీరియల్‌తో డిజైన్స్‌ చేయాలనుకుంటున్నాను. ఇవి కూడా యంగ్‌స్టర్స్‌ కోసమే చేయాలన్నది నా ప్లాన్‌. 
-హేమంత్‌శ్రీ, ఫ్యాషన్‌ డిజైనర్‌
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement