Handloom cloths
-
హాయ్.. 'హ్యాండ్'లూమ్! చేనేత కళాకారుల కలల సాకారం కోసం..
సాక్షి, సిటీబ్యూరో: జీవితాన్ని కాచివడబోసి మరెందరి జీవితాలనో తీర్చిదిద్దుతున్న లైఫ్ కోచ్ ఒకరు.. పల్లెటూరు నుంచి వచ్చినా ప్రముఖులకు సైతం డ్రెస్సింగ్ నేర్పుతున్న సెలబ్రిటీ డిజైనర్ మరొకరు... జెండర్ మార్చుకున్న వండర్ ఉమెన్ ఒకరైతే... ఆర్గానిక్ ప్రపంచంలో తనదైన ముద్ర వేశారు మరొకరు... క్యాట్‌వాక్ చేసేవారిని మోడల్స్ అంటారు. కానీ, క్వీన్ వాక్ చేసేవారిని విజేతలు అంటారు.. చేనేత కళాకారుల కలల సాకారం కోసం ఇలా కాంతలంతా... విజయకాంతులై కళకళలాడారు.. వీరి విజయాలెంత ఉన్నతమైనవో.. వీరి నడక వెనుక చేనేతలకు చేయూతనివ్వాలనే లక్ష్యం అంతే సమున్నతమైనది. ‘హ్యాండ్లూమ్ సోయిరీ’ ఈవెంట్ నగర శివార్లలోని కోకాపేట్లో ఉన్న కేసీయార్ కన్వెన్షన్‌లో జరిగింది. ఈ సందర్భంగా నిర్వాహకుల తరపున శాంతికృష్ణ తదితరులు ‘సాక్షి’తో తమ ఆలోచనలను పంచుకున్నారు. అవి వారి మాటల్లో...చేనేత.. చేయూత.. గతంలో దేశవ్యాప్తంగా ఉన్న ఒక శారీ లవర్స్ గ్రూప్‌లో మేం సభ్యులుగా ఉండేవాళ్లం. ఆన్ లైన్ వేదికగా నడిచే ఆ సంస్థ ద్వారా వైవిధ్యభరితమైన చీరకట్టుతో పాటు ఆలోచనలు కూడా పంచుకునేవాళ్లం. ఆ క్రమంలోనే నగరానికి చెందిన కొందరం కలిసి, చేనేత, హస్త కళాకారుల పరిస్థితులపై చర్చించాం. వారికి ఏదో విధంగా అండగా ఉండాలని, దీన్ని ఒక సొసైటీగా మార్చాలని అనుకున్నాం. 16 మంది కమిటీ మెంబర్స్, ముగ్గురు అపెక్స్ మెంబర్స్‌తో హ్యాండ్లూమ్కి సాయం అందించే సొసైటీగా ఏర్పడాలని భావించాం. ఈ కార్యక్రమాలను ప్రకటించడం కోసమే ఈ ఈవెంట్ నిర్వహించాం.ఈ సొసైటీలోని సభ్యులు అంతా తలా కొంతడబ్బు వేసుకోవడంతో పాటు విభిన్న రకాల ఈవెంట్ల నిర్వహణ ద్వారా నిధి సేకరించాలని నిర్ణయించుకున్నాం. ఆ నిధితో చేనేత హస్తకళాకారుల మరమగ్గాలు, ఇతర పరికరాల మరమ్మతుకు చేయూత అందించడం, స్కిల్ డెవలప్మెంట్లో భాగంగా కోర్సులు తయారు చేయించడం, కార్పొరేట్ కంపెనీల సామాజిక బాధ్యత (సీఎస్ఆర్)తో నిర్వహించే కార్యక్రమాలకు వీటిని అనుసంధానించడం, చేనేత కళాకారుల పిల్లలు ఎవరైనా తమ కళలో శిక్షణ పొందాలంటే స్కాలర్íÙప్లు అందించడం వంటివి చేపట్టాలని నిర్ణయించుకున్నాం.నిధి.. సేవకు పెన్నిధి..తరచూ మెంబర్స్ మీట్స్, గెట్ టు గెదర్స్ నిర్వహించడం కూడా ఈ సొసైటీ కార్యక్రమాల్లో భాగమే. అందులో పాల్గొన్నవారు చేనేత చీరలు ధరించి ర్యాంప్ వాక్ చేయడంతో పాటు రోజంతా ఆటపాటలు, నృత్యాలతో సందడి చేస్తారు. ఇది విభిన్న వృత్తులు, వ్యాపకాల్లో బిజీబిజీగా గడిపే మహిళలకు ఆటవిడుపుగా ఉండటంతోపాటు దీని ద్వారా సేకరించిన నిధులను ఓ మంచి సేవా కార్యక్రమానికి వినియోగించాలనేదే మా ఆలోచన.కళ.. కళకళలాడాలనే... మా జీవితాలతో చేనేత చీరలు, దుస్తులది విడదీయలేని అనుబంధం. ఆయా రంగాల్లో మేం ముందడుగు వేసే క్రమంలో అవి హుందాతనాన్ని అందిస్తూ, సంప్రదాయ వైభవాన్ని పెంచాయి. అలాంటి చేనేత కళ భావితరాలకు సైతం అందాలనే ఆలోచనతోనే ఈ సొసైటీకి రూపకల్పన చేశాం. ఈ ఫస్ట్ ఈవెంట్ సక్సెస్ అవడం మాకు సంతోషాన్ని ఇచి్చంది. ఇకపై కూడా వీలున్నన్ని ఈవెంట్స్ నిర్వహించి చేనేత కళాకారులకు చేయూత అందిస్తాం. మాతో చేతులు కలపాలని అనుకునేవారిని ఆహా్వనిస్తున్నాం. – శాంతికృష్ణ, నిర్వాహకురాలు -
జీరో వేస్ట్ : పల్లె నుంచి పట్నానికి ఫ్యాషన్ (ఫోటోలు)
-
హైదరాబాద్ : వస్త్ర ప్రదర్శనలో మెరిసిన నటి రాశి (ఫొటోలు)
-
APCO: కేరళ కుట్టిలకు ఆంధ్రా వస్త్రాలు
సాక్షి, అమరావతి: మలయాళీ సీమలో ఆంధ్రా చేనేత వస్త్రాల విక్రయానికి రంగం సిద్ధమైంది. ఇందుకు సంబంధించి ఆప్కోతో కేరళ స్టేట్ హ్యాండ్లూమ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (హ్యాండ్ వీవ్) ఒప్పందం కుదుర్చుకుంది. ఆ సంస్థ చైర్మన్ గోవిందన్, మేనేజింగ్ డైరెక్టర్ అరుణాచలం సుకుమార్, మార్కెటింగ్ మేనేజర్ సందీప్ రెండు రోజుల క్రితం ఏపీలో పర్యటించి చేనేత వస్త్రాల తయారీ, ఆప్కో ద్వారా విక్రయాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆప్కో చైర్మన్ చిల్లపల్లి వెంకట నాగమోహనరావు, వీసీ అండ్ ఎండీ చదలవాడ నాగరాణితో చర్చించారు. ఏపీలో చేనేత వస్త్రాలు, వాటి డిజైన్లు, నాణ్యత బాగున్నాయని, వాటిని కేరళలోని స్టాల్స్‌లో విక్రయిస్తామని వెల్లడించారు. ఈ ఒప్పందంలో భాగంగా కేరళ ప్రభుత్వం చేనేత సొసైటీల కోసం నిర్వహిస్తున్న 30 అధికారిక స్టాల్స్‌లో ఏపీ చేనేత వస్త్రాలను విక్రయించనున్నారు. ఏపీలో చేనేతకు బ్రాండ్ ఇమేజ్ తెచ్చిపెడుతున్న పొందూరు, ఉప్పాడ, పెడన, మంగళగిరి, ధర్మవరం, వెంకటగిరి తదితర ప్రాంతాలకు చెందిన వస్త్రాలను కేరళలోని స్టాల్స్‌లో విక్రయాలకు ఉంచనున్నారు. ప్రధానంగా కేరళలో ఘనంగా నిర్వహించే ఓనం, క్రిస్మస్, రంజాన్ మాసాల్లో ఏపీ చేనేత వస్త్రాలను అత్యధికంగా విక్రయించేలా ఆప్కో కార్యాచరణ చేపట్టింది. కలంకారీ వస్త్రాలను కొనుగోలు చేసిన హెన్‌టెక్స్ కాగా, కేరళ రాష్ట్రానికి చెందిన హెన్‌టెక్స్ (కేరళ స్టేట్ హ్యాండ్లూమ్ వీవర్స్ కో–ఆపరేటివ్ సొసైటీ లిమిటెడ్) ఇప్పటికే ఏపీ చేనేత వస్త్రాలను కొనుగోలు చేసి తీసుకెళ్లింది. నాలుగు రోజుల క్రితం పెడనలో పర్యటించిన హెన్‌టెక్స్ బృందం కలంకారీ వస్త్రాలపై అమితాసక్తి చూపించింది. పెడన కలంకారీ డిజైన్లతో కూడిన రూ.29.50 లక్షల విలువైన వస్త్రాలను కొనుగోలు చేయడం గమనార్హం. చేనేతకు ఊతమివ్వడమే లక్ష్యం రాష్ట్రంలోని చేనేత పరిశ్రమకు ఊతమిచ్చేందుకు అనేక చర్యలు చేపడుతున్నాం. ఇందులో భాగంగానే కేరళలోని ప్రభుత్వ అధికారిక స్టాల్స్‌లో ఏపీ చేనేత విక్రయాలు జరిపేలా చర్యలు తీసుకున్నాం. ఏపీ చేనేత సొసైటీల ప్రతినిధులు కేరళలోని స్టాల్స్‌కు వస్త్రాలు సరఫరా చేసి, నెలలోపులోనే విక్రయాలకు సంబంధించిన మొత్తాలను తిరిగి పొందేలా చర్యలు తీసుకుంటున్నాం. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు చేసినందుకు ఆప్కోకు కేవలం 2 శాతం సర్వీస్ రుసుం వసూలు చేస్తాం. – చిల్లపల్లి వెంకట నాగమోహనరావు, ఆప్కో చైర్మన్ చదవండి: ఆలయాలకు 'ప్రకృతి' ఉత్పత్తులు -
చేనేత చీరల్లో ప్రస్తుతం వేటికి డిమాండ్ ఉంది?
చేనేత చీరలు, డ్రెస్సులు ఏ సీజన్‌కైనా వన్నె తెస్తాయి. సౌకర్యంతో పాటు కళను కూడా కళ్ల ముందు కట్టిపడేస్తాయి. అందుకే, చేనేత చీరలకు ఎప్పుడూ మార్కెట్లో మంచి డిమాండ్ ఉంటుంది. హైదరాబాద్‌లో ఉంటున్న ఫ్యాషన్ డిజైనర్ హేమంత్‌శ్రీ లాక్డౌన్ తర్వాత చేసిన చేనేత డిజైన్స్ గురించి ఇలా వివరించారు. లాక్డౌన్లో చేసిన డిజైన్స్‌కి మార్కెట్ ఎలా ఉంది? సోషల్ మీడియాలో కొత్త కొత్త డిజైన్స్ గురించి వెతికే వారి శాతం పెరిగింది. ఇంటి నుంచే ఆర్డర్స్ కూడా పెరుగుతున్నాయి. ఈ వర్క్ మాకు చాలా ఈజీ గానూ, ఛాలెంజింగ్‌గానూ ఉంటుంది. యంగ్‌స్టర్స్ పెరిగారు. వారిని దృష్టిలో పెట్టుకునే జర్కిన్స్, ఓవర్ కోట్స్ మీద ప్రింట్స్..వంటివి చేశాను. లాక్డౌన్ తర్వాత స్పెషల్‌గా చేసిన కృషి? లాక్డౌన్ తర్వాత చేనేతకారుల దగ్గరకు వెళ్లాను. లాక్డౌన్ కారణంగా వాళ్లదగ్గర చాలా స్టాక్ ఉండిపోయింది. నారాయణ్‌పేట, ఇక్కత్, పోచంపల్లి, గుజరాతీ పటోల శారీస్.. చేనేతకారులను విడివిడిగా కలిశాను. వాళ్ల దగ్గర నుంచి మెటీరియల్ తీసుకొని, రీ డిజైనింగ్ చేశాను. దీంతో పాటు వాళ్ల అమ్మాయలనే మోడల్స్‌గా తీసుకున్నాను. ఫొటో షూట్‌కి మినిమిమ్ 30 వేల రూపాయలు ఖర్చు అవుతుంది. ఒక డిజైనర్‌ను, మోడల్‌ను పెట్టి స్టైలిష్‌గా ఫొటోలు తీయించడం అనేది వారికి కష్టం. ఇప్పుడీ ప్రయోగం వల్ల చేనేతలకు మంచి మార్కెట్ అవుతోంది. అమ్మాయిలకీ మోడలింగ్ అవకాశాలు వస్తున్నాయి. చేనేత చీరలకు ప్రాముఖ్యత, కళ మరింత స్పష్టంగా రావడానికి బ్యాక్‌గ్రౌండ్ యాంబియన్స్ పట్ల కూడా ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నాను. బ్యాక్ గ్రౌండ్ యాంటిక్ లుక్‌కి వస్తు సేకరణ? ఇది కొంచెం కష్టంతో కూడుకున్న పనే. పందిరిమంచాలు, తంజావూర్ పెయింటింగ్స్, అల్మారాలు, టేబుళ్లు, బ్రాస్ ఫ్లవర్వేజ్లు.. ఒకటేమిటి యాంటిక్ లుక్ రావడానికి ఇతర రాష్ట్రాల నుంచి కూడా వస్తువులను సేకరించాను. చేనేతలకు మరింత గ్రాండ్ లుక్ తీసుకురావడానికి చేసిన ప్రయత్నిమిది. చేనేత చీరల్లో ప్రస్తుతం వేటికి డిమాండ్ బాగుంది? చేనేతలకు ఎప్పుడూ డిమాండ్ ఉంటుంది. అయితే, ఈసారి గుజరాత్ పటోలాకి వరల్డ్ వైడ్ మార్కెట్ బాగుంది. నార్త్ ఇండియా వారినీ ఈ డిజైన్స్ బాగా ఆకట్టుకున్నాయి. నారాయణ్‌పేట్, గద్వాల, కలంకారీ, పోచంపల్లి.. శారీస్కూ మంచి రెస్పాన్స్ వచ్చింది. చేనేతలతో కాకుండా ఇతరత్రా చేస్తున్న డిజైన్స్? సోషల్ మీడియాలో యువత ఎక్కువ టైమ్ కేటాయిస్తుంది. లాక్డౌన్ తర్వాత కొత్త కొత్త ఫ్యాషన్లు ఏవి పుట్టుకొస్తున్నాయనేదానిమీద సెర్చింగ్ పెరిగింది. అందుకని పార్టీవేర్ తగ్గించి, క్యాజువల్స్కి డిజైన్ చేయాలనుకుంటున్నాను. ఈ సందర్భంగా లెనిన్ క్లాత్‌తో స్ట్రీట్ డిజైన్స్ చేస్తున్నాను. ఇందుకు కొంతమంది టీనేజర్స్‌ని కలుస్తున్నాను. కరోనా కారణంగా వీళ్లు ఇంట్లో ఎక్కువ టైమ్ స్పెండ్ చేస్తున్నారు. కంఫర్ట్‌వేర్ కావాలనుకుంటున్నారు. ఆ తర్వాత ఆర్గంజ మెటీరియల్‌తో డిజైన్స్ చేయాలనుకుంటున్నాను. ఇవి కూడా యంగ్‌స్టర్స్ కోసమే చేయాలన్నది నా ప్లాన్. -హేమంత్‌శ్రీ, ఫ్యాషన్ డిజైనర్ -
భరత్ అనే ఇతడు
సవ్యసాచి అర్జునుడు. రెండు చేతులతో బాణాలను సంధించాడు! చేతిలో మంత్రమున్న నేతకారుడు భరత్. రెండు వైపుల డిజైన్‌తో దుపట్టాను నేశాడు! మగ్గంపై ప్రయోగాలు చేస్తున్నాడు. వెండితెరపై ఆర్ట్ డైరెక్షన్ ఇస్తున్నాడు. అర్జునుడు.. మత్స్యయంత్రాన్ని ఛేదించాడు. భరత్ ‘ఇకత్ ’లో నైపుణ్యాన్ని సాధించాడు. మన జాతీయ పతాకంతో పాటు చేనేతను కాన్వాస్‌గా చేసుకుని అనేకమంది నాయకులను ఆవిష్కరించినప్పుడు తొలిసారిగా భరత్ ఎవరో, భరత్ ఏమిటో రెండు తెలుగు రాష్ట్రాల్లో తెలిసింది. దేశపటంలో మహాత్మాగాంధీ, నాలుగు సింహాల జాతీయ చిహ్నం, భగత్‌సింగ్, నేతాజీ సుభాష్ చంద్రబోస్, స్వామి వివేకానంద, నరేంద్రమోదీ చిత్రాలను నేశారు. అలాగే మదర్‌థెరిసా, సచిన్ టెండుల్కర్, నెల్సన్ మండేలా, చెగువేరాలకు కూడా యధాతథంగా రూపమిచ్చారు. వచ్చే ఏడాది జూన్‌లో మాజీ ప్రధాని పీవీ నరసింహారావు శతజయంతి ఉత్సవాల ముగింపు నాటికి ఆయన చిత్రాన్ని ఇకత్లో తీసుకురావడానికి ఇప్పటి నుంచే నేతలో నిమగ్నమయ్యారు భరత్. ఒక వ్యక్తి ఫొటోను రూపురేఖలు మారకుండా మగ్గం మీద ఆవిష్కరించడానికి కనీసం నెల రోజులు పడుతుంది. ఆ తరువాత రవివర్మ చిత్రాలను పట్టు వస్త్రం మీద ఇకత్ నేతలో రూపొందించాలనేది భరత్ లక్ష్యం. ఆ లక్ష్యాన్ని సాధించడానికి కనీసంగా రెండేళ్లయినా శ్రమించాలి. భరత్ ఇలాగే ఒక ప్రయోగం పూర్తయిన తర్వాత మరో ప్రయోగానికి సిద్ధమవుతుంటారు. తన ప్రయోగాల కోసం చిన్న మగ్గాన్ని కూడా తయారు చేసుకున్నారు. డిజైన్లు మారుస్తుండాలి చేనేతలో ప్రముఖుల చిత్రాలను ఆవిష్కరించడమే కాదు, చేనేతకారుల జీవితాలను తెరకెక్కించడంలోనూ భరత్ చొరవ తీసుకుంటున్నారు. ‘మల్లేశం’ సినిమాతోపాటు ‘తమసోమా జ్యోతిర్గమయ’ సినిమాకు ఆర్ట్ డైరెక్టర్‌గా పని చేశారు. ఈ సినిమాల్లో మహిళలు ధరించిన చీరలను భరతే డిజైన్ చేశారు. ప్రపంచంలోని ప్రధానమైన ఉపాధి రంగాల్లో వస్త్రపరిశ్రమ ముఖ్యమైందని, ఈ రంగాన్ని అర్థం చేసుకోలేకపోవడంతోనే ఇతర ఉపాధి మార్గాల వైపు మరలిపోతున్నారని చెప్పారు భరత్. ఇక ఆయన చీరల మీద చేస్తున్న ప్రయోగాలకు వస్తే... రాజ్‌కోట్– పటోలా కలయిక, జాకార్డ్, బ్రొకేడ్, ట్విల్ డిజైన్లను ఇకత్ మీదకు తెచ్చారు. అహింసా సిల్క్‌తో కూడా పని చేస్తున్నారు. నల్లి, కంకటాల, బ్రాండ్ మందిర్ వంటి ప్రముఖ వస్త్ర దుకాణాలలో ఇవన్నీ దర్శనమిస్తాయి. ‘‘గతంలో హ్యాండ్లూమ్ విలువ పెద్దగా తెలిసేది కాదు, కానీ ఇప్పుడు తెలుసుకున్నారు. హ్యాండ్లూమ్ వస్త్రాలు హుందాగా ఉంటాయి. ఈ వస్త్రధారణ వల్ల హోదా పెరుగుతుంది. మా పోచంపల్లిలో నాలుగేళ్ల కిందట ఐదువందల చేనేత మగ్గాలుండేవి, ఇప్పుడు పదిహేను వందలకు పెరిగాయి. ఇప్పుడు మార్కెట్ బాగుందని ఇక సృజనకు పని చెప్పకుండా ఇదే డిజైన్లతో కొనసాగించేయవచ్చనుకుంటే పరిశ్రమ తిరిగి మాంద్యంలోకి వెళ్లిపోతుంది. మూడేళ్లకోసారి పూర్తి భిన్నత్వం కనిపించాలి. హ్యాండ్లూమ్ మీద ఎంత ఇష్టం ఉన్నా సరే... తన బీరువాలో ఉన్న డిజైన్ చీరనే మళ్లీ కొనడానికి ఇష్టపడరు కదా’’ అన్నారు భరత్. ‘కొండంత నేత బాపూజీ ఇరవై ఏడేళ్ల భరత్ సివిల్ ఇంజనీరింగ్‌లో పోస్ట్‌గ్రాడ్యుయేట్. ఒక ప్రైవేట్ విద్యాసంస్థలో అసిస్టెంట్ ప్రొఫెసర్. ఉద్యోగం చేస్తూనే ఇన్ని ప్రయోగాలు చేస్తున్నారు. చేతినిండా డబ్బుంటే ఇకత్ చేనేతలో అద్భుతాలు సృష్టించగలనని, భారతదేశం చేనేత కళ విశిష్టత ప్రపంచవేదిక మీద ప్రదర్శితం చేయాలనేదే తన ఆకాంక్ష అనీ అన్నారు భరత్. ‘‘మా నాన్న నాకు, మా అన్నకు పదేళ్ల వయసు నుంచి మగ్గం మీద పని చేయడం నేర్పించాడు. అన్నకు తపాలా శాఖలో ఉద్యోగం. ఇద్దరమూ ఉద్యోగం చేస్తూ మాకు సాధ్యమైనంత సమయం ఇకత్ ప్రయోగాలకే కేటాయిస్తున్నాం. ఇక్కడ మీరు చూస్తున్న ఇకత్ దుపట్టాను జాతీయ అవార్డుకు పంపించాను. అయితే నా వయసు ముప్పై ఏళ్లు లేని కారణంగా యంగ్ డిజైనర్ కేటగిరీలో అప్లయ్ చేశాను. కోవిడ్ కారణంగా పరిశీలన, ఎంపిక ప్రక్రియ వాయిదా పడింది’’ అని చెప్పారు భరత్. తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్, లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్, వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్ అందుకున్న భరత్‌ను ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధులు కొండా లక్ష్మణ్ బాపూజీ ప్రత్యేకంగా ప్రశంసించారు. భరత్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నుంచి ‘శ్రీ ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ’ పురస్కారాన్ని కూడా అందుకున్నారు. లక్ష్మణ్ బాపూజీతో ఉన్న ఫొటోను, ఆయన తదనంతరం ఆయన పేరు మీద అవార్డు అందుకుంటున్న ఫొటోను చూస్తూ ‘‘నా జీవితంలో అత్యంత సంతోషకరమైన క్షణాలవి. ఎప్పటికీ మర్చిపోలేని జ్ఞాపకం కూడా’’ అన్నారు భరత్. ఆగిపోకూడదు ఇకత్ నేత పూర్తిగా సృజనతో కూడిన కళ. నిరంతర ప్రయోగాలతో కొత్త ఆవిష్కరణలను తీసుకువస్తూ ఉండాలి. అప్పుడే ఈ ఉపాధిరంగం మనుగడలో ఉంటుంది. మా నేతకారులు ఆ దశాబ్దాలపాటు ఒకేరకమైన డిజైన్లకు పరిమితం అవడంతో ఈ చీరలకు ఆదరణ తగ్గిపోయింది. ఇప్పటికి మేము ప్రయోగాలకు సిద్ధమయ్యాం. ఇది ఎలాంటిదంటే... ఒక సినిమా హిట్ అయిందని అదే మూసలో వరుసగా అనేక సినిమాలు వస్తే ప్రేక్షకులు ఆదరించరు. ప్రతి సినిమాలోనూ ఏదో ఒక కొత్తదనం కనిపించాలి. అలాగే ఇకత్ దుస్తులు కూడా. – సాయిని భరత్, నేత కళాకారుడు -
ఆ జ్ఞాపకాలు షేర్ చేసిన అనసూయ
ప్రముఖ యాంకర్, నటి అనసూయ భరద్వాజ్ సొంతూరిలో సందడి చేసిన జ్ఞాపకాలను అభిమానులతో పంచుకున్నారు. ఇటీవల అనసూయ తన తల్లి అనురాధతో కలిసి వారి సొంతూరైన యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్ పోచంపల్లికి వెళ్లారు. లాక్డౌన్ వల్ల చేనేత కార్మికులు తయారుచేసిన స్టాక్ అంతా పేరుకుపోయిందని.. వారికి అండగా నిలవాలని అనసూయ తన అభిమానులను, సన్నిహితులను కోరారు. అదే విధంగా గ్రామంలో పలువురికి నిత్యావసరాలు పంపిణీ చేశారు. తాజాగా ఇందుకు సంబంధించిన ఫొటోలను అనసూయ తన ఇన్స్టాగ్రామ్ ద్వారా అభిమానులతో పంచుకున్నారు. గ్రామంలోని పలు అందమైన ప్రదేశాల్లో అనసూయ ఫొటోలు దిగారు. తన తల్లితో కలిసి సరాదాగా గడిపారు. తను ఎక్కువగా చేనేత దుస్తులే ధరిస్తానని.. చేనేతలు మన ఆస్తులు అని అనసూయ పేర్కొన్నారు. వారికి తోడుగా ఉంటానని చెప్పారు. కాగా, అనసూయ షేర్ చేసిన ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. గతంలో కూడా అనసూయ భూదాన్ పోచంపల్లిలో పర్యటించిన సంగతి తెలిసిందే.(చదవండి : షూటింగ్‌లు స్టార్ట్.. యాంకర్స్ సందడి) View this post on Instagram Days like these are >>> #BhoodaanPochampally #VisitToMyNative #MyPeople #WeAreAllInThisTogether #LetsLookOutForEachOther #IWearHandloom #ILoveHandloom #IAmWithTheWeavers #WeaversAreOurAssets 💓 A post shared by Anasuya Bharadwaj (@itsme_anasuya) on Jun 22, 2020 at 11:22pm PDT -
మన ఫ్యాషన్ మెచ్చెన్ నేషన్
తెలుగు తెరపై సావిత్రి కట్టూబొట్టూ.. ఆహార్యమూ అన్నీ అప్పట్లో యువతులకు, మహిళలందరికీ అనుసరణీయాలే. ఆ దిగ్గజ నటిని మరోసారి తెరపై పరిచయం చేసిన ‘మహానటి’ సినిమాలో ఆ పాత్రకు తగిన జీవం పోశారు నగరానికి చెందిన కాస్ట్యూమ్ డిజైనర్లు గౌరంగ్‌షా, అర్చనారావులు. ఇటీవల ప్రకటించిన సినీ జాతీయ అవార్డుల్లో కాస్ట్యూమ్ డిజైనర్‌కి కూడా పురస్కారం లభించడంతో సిటీ ఫ్యాషన్ రంగానికి ఓ ప్రత్యేకతను సంతరించుకుంది. ఎందుకంటే సిటీ ఫ్యాషన్ రంగానికి ఈ ఘనత దక్కడం ఇదే తొలిసారి. గౌరంగ్ షాతో పాటు నగరానికే చెందిన అర్చనారావు, కోల్‌కతా స్టైలిస్ట్ ఇంద్రాక్షి పట్నాయక్‌లు ఈ కీర్తిని సాధించడం గమనార్హం. సాక్షి, సిటీబ్యూరో :టాక్ ఆఫ్ ది సినీ కంట్రీ అనిపించుకున్న దేవదాస్, పద్మావతి వంటి బాలీవుడ్ సినిమాల్లో తారల వస్త్రధారణ తీర్చిదిద్దిన డిజైనర్లు కొంతకాలం పాటు వార్తల్లో వ్యక్తులుగా నిలిచేవారు. అలాంటి ఘనత ఇప్పటిదాకా నగరానికి చెందిన ఏ డిజైనర్‌కూ దక్కలేదు. భారీ చిత్రాలకు కాస్ట్యూమ్స్ ఇచ్చిన దాఖలాలతో పాటు సదరు చిత్రాల ద్వారా పేరు తెచ్చుకున్న సందర్భాలూ అరుదే. ఈ నేపథ్యంలో నగరానికి చెందిన డిజైనర్ గౌరంగ్ షా.. మరో ఇద్దరితో కలిసి మహానటి సినిమాకు అందించిన కాస్ట్యూమ్స్‌కు ఇటీవల ప్రకటించిన జాతీయ పురస్కారాల్లో చోటు దక్కడం విశేషం. దీని ద్వారా మన డిజైన్లు టాక్ ఆఫ్ ది నేషన్‌గా మారారు. జామ్దానీని ఉపయోగించి వైవిధ్యభరితమైన ఫ్యాబ్రిక్స్, టెక్చర్స్ల మేళవింపు దుస్తులు ముఖ్యంగా చీరల సృష్టికి చిరునామాగా నిలిచే ఈ డిజైనర్.. వింటేజ్ ఫ్యాషన్ ట్రెండ్స్‌కు తెరలేపారు. షర్మిలా ఠాగూర్లతో పాటు మరెంతో మందికి డిజైన్ చేసిన ఇదే గౌరంగ్ తొలి సినీ రంగప్రవేశం కావడం విశేషం. చేనేతలకు దక్కిన గౌరవం ఎంతో మంది బాలీవుడ్, టాలీవుడ్ సినీ తారలకు డిజైన్లు అందించినా, ఒక కాస్ట్యూమ్ డిజైనర్‌గా పూర్తి సినిమాకు పనిచేయడం ఇదే తొలిసారి. ఈ సినిమా నిర్మాత స్వప్నాదత్, దర్శకుడు నాగ్‌అశ్విన్‌లు మాకు అవకాశం ఇవ్వడం, తొలిసారిగా పూర్తి స్థాయిలో మా సృజనాత్మకతను వెండితెరపై ఆవిష్కరించగలగడం.. అది కూడా సావిత్రి వంటి మహానటి బయోపిక్కు డిజైన్ వర్క్ చేయడం.. దీనికి జాతీయ అవార్డు లభించడం.. అన్నీ అద్భుతాలే. ఇది అనూహ్యమైన అనుభూతి. – గౌరంగ్ షా,ఫ్యాషన్ డిజైనర్ ఏడాదిన్నర కృషి ఫలితం.. అలనాటి సావిత్రి దుస్తులన్నీ సింప్లిసిటీకి, హుందాకు ప్రతీకలుగా అనిపిస్తాయి. అందుకే ఆమె లుక్ గురించి పరిశోధనలో భాగంగా సినీ పరిశ్రమ పెద్దలతో కూడా సంప్రదించారు గౌరంగ్. అలనాటి టెక్స్టైల్స్ పునఃసృష్టి కోసం తరచూ మ్యూజియంలను కూడా ఆయన బృందం సందర్శించింది. నాటి టెక్స్టైల్, డిజైన్, టెక్చర్, కలర్లలోని ప్రతి విశేషాన్ని క్షుణ్ణంగా పరిశీలించి దాని ప్రకారం నేత కళాకారులకు మార్గదర్శకత్వం వహించింది. ఆర్నెళ్లకుపైగా రీసెర్చ్, ఏడాదిపైగా వీవింగ్‌కు, టెక్చరింగ్, కలరింగ్లకు కేటాయించాల్సి వచ్చింది. నటి సావిత్రి నిజజీవిత ఆహార్యాన్ని తెరపై మెరిపించేందుకు తీవ్రంగా శ్రమించాం అంటున్న గౌరంగ్.. కనీసం 100కిపైగా చేనేత కళాకారులు నిర్విరామంగా ఈ చిత్రంలోని కాస్ట్యూమ్స్ కోసం పని చేశారన్నారు. మొత్తంగా ఏడాదిన్నర సమయం వెచ్చించామన్నారు. దేశంలోని కాంచీపురం, బెనారస్ తదితర ప్రాంతాల నుంచి భారీ పట్టు ఫ్యాబ్రిక్స్‌ను సేకరించి కోట, మంగళగిరి, బ్లాక్ ప్రింట్స్‌లతో లూమ్స్‌లో అదనపు సొబగులు అద్దారు. శ్రద్ధగా.. భక్తిగా.. నాటి మహిళ వ్యక్తిత్వాన్ని ప్రతిబింబించేలా ఆనాటి రంగులతో వీటిని బ్యాలెన్స్ చేశారు. చిన్నతనం నుంచి చివరి దశ దాకా ఆమె జీవన ప్రయాణంలోని ప్రతి సందర్భాన్నీ దృష్టిలో పెట్టుకుని వస్త్రధారణను తీర్చిదిద్దారు. ఎదిగే వయసులోని సావిత్రి కోసం మంగళగిరి, కోటా ప్రింట్స్‌ను స్వర్ణయుగంలాంటి సినీ దశ కోసం హెవీ బ్రొకేడ్స్, సిల్క్స్, ఆర్గంజా, చేతితో నేసిన శాటిన్స్, షిఫాన్స్లను వినియోగించారు. అలాగే చరమాంకానికి తగ్గట్టూ ఏర్చికూర్చారు. ‘సినిమాలో కొన్ని ప్రత్యేకమైన సీన్ల కోసం నన్ను శాటిన్స్ను అందించమన్నారు. ఆమె లుక్స్ పూర్తిగా స్వచ్ఛమైన చేనేతలతోనే ఉండాలని కోరుకున్నాను. భారీ కాంజీవరమ్ లెహంగా, బ్లౌజ్, ఆర్గంజా దుపట్టాతో ఉండే ‘మాయాబజార్’లోని సావిత్రి లుక్ కోసం 3 నెలలు పట్టింది’ అని చెప్పారు గౌరంగ్ షా. జీవితంలో మరిచిపోను.. జాతీయ అవార్డు గెలుపొందడం ప్రపంచాన్ని జయించినంత ఆనందంగా ఉంది. ఎంతో రిసెర్చ్ చేసి, ఎంతో కష్టపడి ఈ సినిమాకు పనిచేశాం. దర్శకుడు నాగ్అశ్విన్ నాపై ఉంచిన నమ్మకం నన్ను మరింతగా ఆ చిత్రంతో మమేకమయ్యేలా చేసింది. దుల్కర్ సల్మాన్, సమంత, విజయ్ దేవరకొండలతో పనిచేయడం చాలా సంతోషకరమైన విషయం. మన సృజన వెండితెర మీద ప్రత్యక్షం అవడం కన్నా గొప్ప విషయం మరొకటి ఉండదు. మహానటికి పనిచేసిన రోజుల్ని జీవితంలో మర్చిపోలేను. – అర్చనారావు, డిజైనర్ -
చేనేత అధ్యయన కేంద్రంగా పోచంపల్లి
సాక్షి, భూదాన్‌పోచంపల్లి: పోచంపల్లి ఇక్కత్ అంటే ఒక బ్రాండ్ ఇమేజ్. నేడు అంతర్జాయ మార్కెట్లో పోచంపల్లి ఇక్కత్ వస్త్రాలకు మంచి ఆదరణ, గుర్తింపు ఉంది. అమెజాన్, వీవ్‌మార్ట్ లాంటి బహుళజాతీయ కంపెనీలు ఇక్కత్ వస్త్రాలను ఆన్లైన్లో విక్రయిస్తున్నాయి. దీంతో ప్రపంచవ్యాప్తంగా అన్ని వర్గాలు, దేశాల ప్రజలకు పోచంపల్లి ఇక్కత్ వస్త్రాలు మరింత చేరువయ్యాయి. సినిమాలు, సీరియల్స్‌లో హీరో, హీరోయిన్లు, యాంకర్లు, పారిశ్రామిక వేత్తలు పోచంపల్లి చేనేత వస్త్రాలను అమితంగా ఇష్టపడుతున్నారు. వెండితెరపై కూడా చేనేత వస్త్రాలు కనువిందు చేస్తున్నాయి. ఇటీవల కాలంలో చేనేతలకు మంచి క్రేజ్ పెరిగింది. అధ్యయన కేంద్రంగా.... ఇక్కత్ వస్త్రాలకు ప్రపంచ వ్యాప్తంగా పేరుగాంచిన పోచంపల్లి దేశ, విదేశీయులకు అధ్యయన కేంద్రంగా మారింది. ప్రపంచం నలుమూలల నుంచి విదేశీయులు చేనేత వస్త్ర తయారీ తీరు తెన్నులు తెలుసుకోవడానికి నిత్యం వస్తుంటారు. అంతేకాక ముంబాయి, హైదరాబాద్, ఢిల్లీ, కోల్కత్తా, బెంగుళూరు రాష్ట్రాలకు చెందిన నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ (నిఫ్ట్), బిజినెస్ స్కూల్ ఆఫ్ ఇండియా, పలు ఫ్యాషన్ టెక్నాలజీ ఆఫ్ ఇనిస్టిట్యూట్స్ స్టడీటూర్‌లో భాగంగా ఇక్కడికి వచ్చి చేనేతపై అధ్యయనం చేస్తుంటారు. అదేవిధంగా చేనేతను పాఠ్యాంశంగా చేర్చడంతో రాష్ట్రం నలుమూలల నుంచి విద్యార్థులు అధ్యయన నిమిత్తం ఇక్కడి వస్తుంటారు. అధ్యయన అంశాలు ఇవే... అమెరికా, జర్మనీ దేశాల అధ్యక్ష భవనాలలో పోచంపల్లి కర్టెన్స్‌ను వాడుతున్నారంటే ఇక్కడి చేనేత కార్మికుల కళా నైపుణ్యం తెలుస్తోంది. ముఖ్యంగా పలు దేశాల ప్రజలు ఇక్కత్ చేనేత వస్త్రాలైన డ్రెస్ మెటీరియల్స్, డోర్ కర్టెన్స్, బెడ్ షీట్స్‌ను ఎక్కువ కొనుగోలు చేస్తుంటారు. ముస్లిం దేశాల్లో స్టోల్స్‌ను ఎక్కువ కొనుగోలు చేస్తుంటారు. పోచంపల్లి హ్యాండ్లూమ్ పార్క్ తమ వస్త్ర ఉత్పత్తులను విదేశాలకు ఎగుమతి చేస్తూ ప్రతిఏటా కోట్ల రూపాయల టర్నోవర్ సాధిస్తుంది. అంతేకాక పలువురు ఔత్సాహిక యువకులు ఆన్లైన్ వస్త్ర వ్యాపారాలు సాగిస్తున్నారు. ఇదిలా ఉంటే ఇక్కత్ వస్త్ర విశిష్టతను తెలుసుకోవడానికి వచ్చే విదేశీయులు చేనేత గృహాలు, చేనేత సహకార సంఘం, హ్యాండ్లూమ్ పార్క్‌ను సందర్శించి అక్కడ నూలు వడికే విధానం, చిటికి కట్టడం, గ్రాఫ్‌పై డిజైన్లు వేయడం, అచ్చు అతకడం, రంగుల అద్దకం, మగ్గాలు, వస్త్రాలు నేసే విధానం, మార్కెటింగ్, చేనేత కళాకారుల జీవన స్థితిగతులు, కూలీ, ఇక్కడి ఆచార, వ్యవహారాలను అధ్యయనం చేస్తుంటారు. ఫ్యాషన్ డిజైనింగ్ చదివిన విద్యార్థులు మాత్రం నూతన డిజైన్లను అధ్యయనం చేస్తుంటారు. పోచంపల్లి బాట పట్టిన 100కు పైగా దేశాలు.. చేనేతతో పాటు భూదానోద్యమానికి పురుడుపోసుకున్న పోచంపల్లిని ఇప్పటివరకు 100కు పైగా దేశాలు, వేలాది మంది విదేశీ ప్రతినిధులు, అధికారులు, స్వచ్ఛంద సంస్థలు, వీఐపీలు సందర్శించడంతో ప్రపంచపటంలో పోచంపల్లికి తగిన గుర్తింపు వచ్చిం ది. అంతేకాక వివిధ రా ష్ట్రాల మంత్రులు, ఐఏఎస్ అధికారులు, ఫ్యాషన్, సినీరంగ ప్రముఖులు సందర్శించి చేనేతను అధ్యనం చేసి ఇక్కడి వస్త్రాలను కొనుగోలు చేశారు. ముఖ్యంగా జాతీయ గ్రామీణాభివృద్ధి సంస్థ(నిర్డ్), జాతీయ సూక్ష్మ, లఘు, మధ్య పరిశ్రమల సంస్థ (నిమెస్మీ), నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ (నిఫ్ట్), గ్రామీణాభివృద్ధి జాతీయ మండలి (ఎన్సీఆర్డీ), కపార్డ్, ఆర్కిటెక్ట్, అడ్మినిస్ట్రేటీవ్ స్టాఫ్ కాలేజీ ఆఫ్ ఇండియా(ఆస్కీ), టూరిజం శాఖ, జాతీయ సస్య రక్షణ శిక్షణ సంస్థ, ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ (ఐఎస్బి), అపార్డ్, గ్లోబల్ పీస్ ఆర్గనైజేషన్ తదితర సంస్థల ఆధ్వర్యంలో దేశ, విదేశాలకు చెందిన ప్రతినిధులు సందర్శించారు. ముఖ్యంగా అమెరికా, జర్మనీ, ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా, ఈజిప్ట్, ఇటలీ, డెన్మార్క్, ఇండోనేషియా, హాలెండ్, దక్షిణాఫ్రికా, మలేషియా, బోట్స్వానా, టునీషియా, మంగోలియా, ఇథియోఫియా, ఘనా, లావోస్, అఫ్ఘనిస్థాన్, పాకిస్థాన్, థాయ్‌లాండ్, సిరియా ఉజ్భకిస్థాన్, మయన్మార్, నేపాల్, సూడాన్, ఉగాండా, ఐర్లాండ్, కజకిస్థాన్, పెరూ, డర్భన్, నైజీరియా, జింబాంబ్వే, హంగరీ, టాంజానియా, ఐలాండ్, సోలోమన్, ఈక్విడార్, యెమన్, ఇరాన్, శ్రీలంక, బంగ్లాదేశ్, చిలీ, వియత్నాం, లిబియా, స్విడ్జర్లాండ్, జోర్ధాన్, కాంగో, పోర్సుగీస్ మొదలగు దేశాల వారున్నారు. చేనేత కళ గొప్పది.. ఇండియాకు మొదటిసారి వచ్చా. ప్రాచీన చేనేత కళను తెలుసుకోవడానికి పోచంపల్లిని సందర్శించడం గొప్ప అనుభూతినిచ్చి ంది. ఇక్కడి చేనేత కళాకారులు రూపొందిస్తున్న చేనేత వస్త్రాలు చాలా బాగున్నాయి. అయితే ఇంటిల్లిపాది కలిసి పని చేయడం, సమష్టిగా బాధ్యతలు పంచుకోవడం ఎంతో నచ్చింది. నూతన ప్రయోగాలతో చేనేత కళను కాపాడుకోవాలి. – మిల్లిహట్టన్, కెనడా మంచి ఆదరణ ఉంది ప్రస్తుతం పోచంపల్లి ఇక్కత్ వస్త్రాలకు మంచి ఆదరణ ఉంది. నిత్యం దేశ, విదేశాల నుంచి హ్యాండ్లూమ్ పార్క్‌ను సందర్శిస్తుంటారు. ఇక్కడ వస్త్ర తయారీ ప్రక్రియలను అధ్యయనం చేస్తుంటారు. గత యాభై ఏళ్లుగా చేనేత కళాకారులు అనేక మార్పులు, వినూత్న ప్రయోగాలు చేస్తూ విజయం సా«ధిస్తున్నారు. చేనేతను ఉపా«ధి కేంద్రంగా గుర్తించి ప్రోత్సహిస్తే చేనేత పరిశ్రమ నిలదొక్కుకుంటుంది. – భారత లవకుమార్, హ్యాండ్లూమ్ పార్క్ డైరెక్టర్, పోచంపల్లి -
శ్రీవాణి.. చేనేత రారాణి
అంబర్‌పేట: సంప్రదాయ చేనేత వస్త్రాలతో ఫ్యాషన్ రంగంలో తనదైన ప్రత్యేకత చాటుకుంటున్నారు నగరంలోని నల్లకుంటకు చెందిన శ్రీవాణి. చేనేత కార్మికులు నేసిన వస్త్రాలతో ఆధునిక ఫ్యాషన్ రంగంలో వస్తున్న వస్త్రాలకు దీటుగా విభిన్నమైన డిజైన్లను రూపొందిస్తున్నారు. ఫ్యాషన్ డిజైనింగ్ కోర్సు పూర్తి చేసిన శ్రీవాణి ఆ తర్వాత కొంతకాలం ఉద్యోగం చేశారు. వివాహానంతరం ఉద్యోగానికి గుడ్‌బై చెప్పి ఐదేళ్లుగా ఫ్యాషన్ రంగంలో రాణిస్తున్నారు. నెలలో 2 నుంచి 3 వరకు వివిధ ఎగ్జిబిషన్లలో పాల్గొని చేనేత గొప్పదనాన్ని చాటుతున్నారు. పలు డిజైన్ వస్త్రాల ప్రదర్శనలతో ఆకట్టుకుంటున్నారు. చేనేత వస్త్రాలతో ఫ్యాషన్ డిజైనింగ్ రూపొందించడం ఖరీదైనప్పటికీ వాటితోనే డిజైనర్‌గా రాణిస్తున్నారామె. తనతో పాటు మరో నలుగురికి ఉపాధి పొందుతూ మహిళలకు ఆదర్శంగా నిలుస్తున్నారు శ్రీవాణి. ఎన్నో రాష్ట్రస్థాయి వేదికలపై ఫ్యాషన్ డిజైన్లను ప్రదర్శించిన ఆమె.. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని.. మహిళలు తమదైన ప్రత్యేకతను చాటుకోవాలని ఆకాంక్షించారు. డెంట్‌గా శ్రీకాంత్, వైస్ ప్రెసిడెంట్లుగా బెనర్జీ, ఎస్వీ కృష్ణారెడ్డి, జనరల్ సెక్రెటరీగా రఘుబాబు, జాయింట్ సెక్రెటరీలుగా బ్రహ్మాజీ, నాగినీడు, కోశాధికారిగా రాజీవ్ కనకాల, ఎగ్జిక్యూటివ్ మెంబర్లుగా తనీష్, ఉత్తేజ్, అనితాచౌదరి, బాలాజీ, పృథ్విరాజ్, భూపాల్‌రాజు, సి.వెంకటగోవిందరావు, డి.రాజారవీంద్ర, డి.రవిప్రకాశ్, ఏడిద శ్రీరామ్, జయలక్ష్మి, వేణు మాధవ్, కొండేటి సురేష్, పి.సాయికుమార్, రాజ్‌తరుణ్, సమీర్, తనికెళ్ల భరణి తదితరులు పోటీపడుతున్నారు. -
వస్త్రాలతో ఆత్మవిశ్వాసం
జూబ్లీహిల్స్: ఆత్మవిశ్వాసం పెంపొందించడంలో వస్త్రాలు, ఫ్యాషన్ కీలకపాత్ర పోషిస్తాయని, మన ఔన్నత్యాన్ని మరింతగా పెంచుతాయని ప్రముఖ సినీనటి సమంత అక్కినేని అన్నారు. బంజారాహిల్స్‌లోని ‘అండ్ స్టోర్’ (బోటిక్ )ను మంగళవారం ఆమె సందర్శించారు. ఈ స్టోర్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ‘అండ్ రైస్ మూవ్మెంట్’ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ప్రపంచమంతా మన చేనేతను, ఇక్కత్‌ను గుర్తించి ధరిస్తోందని, మనం మాత్రం చిన్నచూపు చూడటం మానుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. చేనేతలను మరింత ప్రాచుర్యం కల్పించడానికి తనవంతుగా ప్రచారం చేస్తున్నానని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ చేనేత వస్త్రాలు ధరిస్తే లక్షలాదిమంది కార్మికుల జీవనోపాధికి ఎంతో దోహదం చేసినవారమవుతామని చెప్పారు. చేనేత అంటే చీరలు మాత్రమే కాదని, పురుషులకు కూడా పలు రకాల డిజైన్ దుస్తులు చేనేతలో ఉన్నాయన్నారు. కార్యక్రమంలో బోటిక్ నిర్వాహకురాలు అనితా డోంగ్రే తదితరులు పాల్గొన్నారు. -
చేనేత ప్రచారకర్తగా కేటీఆర్..
-
చేనేత ప్రచారకర్తగా కేటీఆర్..
ఆ వస్త్రాలు ధరించి సచివాలయానికి వచ్చిన మంత్రి సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర పరిశ్రమలు, చేనేత మంత్రి కె.తారకరామారావు చేనేత ప్రచారకర్తగా మారారు. చేనేత దస్తులు ధరించి వచ్చి సోమవారం సచివాలయంలో సందడి చేశారు. చేనేత కార్మికులకు చేయూతనిచ్చేందుకు ప్రతి ఒక్కరూ వారంలో ఓ రోజు చేనేత వస్త్రాలు ధరిం చాలని పిలుపునిచ్చిన మంత్రి.. సోమవారం స్వయంగా ఆ వస్త్రాలు ధరించి వచ్చారు. మంత్రి పిలుపు మేరకు ఆయన కార్యాలయం అధికారులు, సిబ్బంది కూడా ఆ దుస్తులే ధరించి రావడంతో ప్రత్యేకత సంతరిం చుకుంది. ఇక నుంచి ప్రతి సోమవారం చేనేత వస్త్రాలను ధరిస్తానని మంత్రి తెలిపారు. దీని ద్వారా చేనేత వస్త్రాల ప్రాముఖ్యత, ప్రాశస్త్యాన్ని ప్రజల్లోకి మరింతగా తీసుకువెళ్తామన్నారు. చేనేత కార్మికుల ఉత్పత్తులకు ప్రచారం కల్పిం చేందుకు తెలంగాణ చేనేత శాఖ (టెస్కో) ద్వారా మరిన్ని కార్యక్రమాలను చేపట్టనున్నామన్నారు. ఈ మేరకు చర్యలు తీసుకోవాలని టెస్కో డైరెక్టర్ శైలజా రామయ్యర్‌కు ఆదేశాలు జారీ చేశారు. మంత్రి పిలుపుతో ఇప్పటికే జిల్లా కలెక్టర్లు, మున్సిపల్ కమి షనర్లు, ఇతర శాఖల అధికారులు సోమవారం చేనేత వస్త్రాలను ధరిస్తున్నారని మంత్రి కార్యాలయం తెలిపింది. పరిశ్రమలు, ఐటీ, పురపాలక, చేనేత శాఖల విభాగాధిపతులు, ఉద్యో గులు సైతం చేనేత దుస్తుల్లో వచ్చి మంత్రి కేటీఆర్‌కు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఢిల్లీలో తెలంగాణ భవన్ రెసిడెంట్ కమిషనర్ అరవింద్ కుమార్, ఐటీ కార్యదర్శి జయేశ్ రంజన్, జల మండలి ఎండీ దానకిశోర్, టెస్కో డైరెక్టర్ శైలజా రామయ్యర్ తదితరులు తమ ఉద్యోగుల బృందంతో మంత్రిని కలిశారు. ప్రతి సోమవారం చేనేత వస్త్రాలు ధరిస్తామని మంత్రికి మాట ఇచ్చారు.