జూబ్లీహిల్స్: ఆత్మవిశ్వాసం పెంపొందించడంలో వస్త్రాలు, ఫ్యాషన్ కీలకపాత్ర పోషిస్తాయని, మన ఔన్నత్యాన్ని మరింతగా పెంచుతాయని ప్రముఖ సినీనటి సమంత అక్కినేని అన్నారు. బంజారాహిల్స్‌లోని ‘అండ్ స్టోర్’ (బోటిక్ )ను మంగళవారం ఆమె సందర్శించారు. ఈ స్టోర్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ‘అండ్ రైస్ మూవ్‌మెంట్’ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ప్రపంచమంతా మన చేనేతను, ఇక్కత్‌ను గుర్తించి ధరిస్తోందని, మనం మాత్రం చిన్నచూపు చూడటం మానుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు.
చేనేతలను మరింత ప్రాచుర్యం కల్పించడానికి తనవంతుగా ప్రచారం చేస్తున్నానని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ చేనేత వస్త్రాలు ధరిస్తే లక్షలాదిమంది కార్మికుల జీవనోపాధికి ఎంతో దోహదం చేసినవారమవుతామని చెప్పారు. చేనేత అంటే చీరలు మాత్రమే కాదని, పురుషులకు కూడా పలు రకాల డిజైన్ దుస్తులు చేనేతలో ఉన్నాయన్నారు. కార్యక్రమంలో బోటిక్ నిర్వాహకురాలు అనితా డోంగ్రే తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment