సాక్షి, హైదరాబాద్: టాలీవుడ్‌లో మోస్ట్ రొమాంటిక్ కపుల్ లిస్ట్‌లో అక్కినేని నాగచైతన్య-సమంత ముందు వరుసలో ఉంటారు. కెరీర్‌ని, లైఫ్‌ని బలేగా బ్యాలెన్స్ చేసుకుంటారు ఈ దంపతులు. ఇక ఏ మాత్రం టైం దొరికినా.. విదేశాలకు చెక్కేసి సేదదీరుతుంటారు. సిటీలో వీరిద్దరు జంటగా కనిపించడం చాలా అరుదు. ఒకవేళ అలా కనిపిస్తే.. ఇక ఫ్యాన్స్ పండగ చేసుకుంటారు.
తాజాగా శుక్రవారం ఈ సీన్ చోటు చేసుకుంది. వీరిద్దరూ లగ్జరీ బెంజ్ కారులో సిటీలో షికారుకెళ్లారు. చై-సామ్ కారులో కార్లో వెళ్తోన్న ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరలవుతోన్నాయి. ఇక ఫోటోలను చూస్తే కొత్త కారు అనిపిస్తోంది. ‘‘కార్ సూపర్‌గా ఉంది.. కంగ్రాట్స్ చై-సామ్’’ అంటూ కామెంట్ చేస్తున్నారు నెటిజనులు.
ఇక సినిమాల విషయానికి వస్తే నాగచైతన్య ప్రస్తుతం శేఖర్ కమ్ముల దర్వకత్వంలో తెరకెక్కుతున్న ‘‘లవ్‌స్టోరీ’’తో బిజిగా ఉన్నారు. ఈ చిత్రం తర్వాత ఆయన తరణ్ భాస్కర్ దర్వకత్వంలో మరో సినిమా చేయనున్నట్లు సమాచారం. ఇక సమంత నటించిన ఫ్యామిలీ మాన్2 వెబ్ సిరీస్ విడుదల వేసవికి వాయిదా పడింది. ప్రస్తుతం సమంత విగ్నేష్ శివన్ దర్వకత్వంలో తెరకెక్కుతున్న కాతు వాకుల రెండు కాదల్ చిత్రంలో నటిస్తున్నారు. దీనిలో నయనతార, విజయ్ సేతుపతి కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment