
ఒకప్పుడు టాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్‌గా రాణించిన సమంత ప్రస్తుతం ఎలాంటి ప్రాజెక్ట్‌లో చేయడం లేదు. తెలుగులో చివరిసారిగా విజయ్ దేవరకొండ సరసన ఖుషీ చిత్రంలో మాత్రమే కనిపించింది. ఇటీవల సినిమాల కంటే ఎక్కువగా డేటింగ్ వార్తలతో హాట్ టాపిక్‌గా మారింది. బాలీవుడ్ డైరెక్టర్ రాజ్ నిడిమోరుతో సామ్ రిలేషన్‌లో ఉన్నట్లు చాలా సార్లు రూమర్స్ వినిపించాయి. వీరిద్దరు కలిసి తరచుగా ఈవెంట్లకు హాజరు కావడంతో ఆ రూమర్స్ మరింత ఊపందుకున్నాయి.
ఇవన్నీ పక్కనపెడితే తాజాగా సోషల్ మీడియాలో సామ్ చేసిన పోస్ట్ నెట్టింట వైరల్‌గా మారింది. తాను నిర్మిస్తోన్న కొత్త మూవీకి సంబంధించిన ఫోటోలను షేర్ చేసింది. అందులో తన టీమ్‌తో ఉన్న ఫోటోలకు వరుసగా క్యాప్షన్ ఇస్తూ ఇన్‌స్టాలో పోస్ట్ చేసింది. అయితే సామ్ షేర్ చేసిన తొలి ఫోటోపైనే అందరి కళ్లు పడ్డాయి. ఎందుకంటే ఆ ఫోటోలో సామ్ చేతికి టాటూ కనిపించడమే కారణం. టాలీవుడ్ హీరో నాగ చైతన్య ప్రేమలో ఉన్నప్పుడు ఆ టాటూ వేయించుకుంది. ప్రస్తుతం ఆ టాటూను తొలగించుకున్నప్పటికీ.. కొద్ది కొద్దిగా కనిపించడంతో నెటిజన్స్ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు.
మొత్తానికి నాగచైతన్యకు గుర్తుగా వేయించుకున్న టాటూను తొలగించుకున్నారంటూ కొందరు కామెంట్స్ చేశారు. సమంత ఎట్టకేలకు చైతూ టాటూను తొలగించినట్లు కనిపిస్తోందని మరో నెటిజన్ కామెంట్ చేశాడు. ఇప్పటి నుంచి మీ స్వంత రియాలిటీని సృష్టించండి అంటూ రాసుకొచ్చారు. టాటూను తొలగించుకున్నందుకు మంచిది.. ఇకపై మీ భాగస్వామి పేరును ఎప్పుడూ టాటూలుగా వేయించుకోకండి అంటూ కొందరు సలహాలు ఇస్తున్నారు. అయితే ఈ ఫోటోలతో పాటు ఆసుపత్రి బెడ్‌పై చికిత్స పొందుతున్న పిక్‌ను కూడా సమంత పోస్ట్ చేసింది.
కాగా.. చైతూ సినిమాలో టాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చిన సమంత.. చాలా కాలం పాటు డేటింగ్‌లో ఉన్నారు. ఆ తర్వాత 2017లో పెళ్లి చేసుకున్నారు. అయితే పెళ్లయిన నాలుగేళ్లకే వీరిద్దరూ విడిపోవడం అభిమానులను షాక్‌కు గురిచేసింది. ఆ ఆ తర్వాత నాగచైతన్య హీరోయిన్ శోభితా ధూళిపాళ్లను గతేడాది డిసెంబర్‌లో పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment