![Samantha Breaks Down While Shooting Ad In Hyderabad After Divorce - Sakshi](/styles/webp/s3/article_images/2021/10/7/Samantha.jpg.webp?itok=4YVDknIu)
Samantha Breaks Down While Shooting: సమంత-నాగ చైతన్య విడిపోవడం ఇప్పుడు టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారిపోయింది. మోస్ట్ లవబుల్ కపుల్‌గా పేరు తెచ్చుకున్న సామ్-చై ఇక భార్యభార్తలుగా కలిసి ఉండలేమంటూ ప్రకటించడాన్ని అభిమానులు ఇంకా జీర్ణించుకోలేకపోతున్నారు. ఇక విడాకుల ప్రకటన అనంతరం ఇప్పటినుంచి తన పనులు తానే చేసుకోవాలని, బద్దకం వదిలి ముందుకు నడవాలని ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ను షేర్‌చేసిన సంగతి తెలిసిందే. దీన్ని బట్టి సమంత ప్రొఫెషనల్ లైఫ్‌లో మరింత బిజీ అవ్వనుందనే సంకేతాలు ఇచ్చింది.
(చదవండి: Samantha: అందుకే సమంత విడాకులు తీసుకుందా?)
ఇక నాగ చైతన్యతో విడిపోయిన అనంతరం సమంత తొలిసారిగా ఓ యాడ్ షూట్‌లో పాల్గొంది. హైదరాబాద్‌లోని ముకరంజా జూనియర్ కాలేజీలో దీనికి సంబంధించి షూటింగ్ జరిగింది. విడాకుల ప్రకటన అనంతరం అసలు సమంత షూట్‌కి వస్తుందో రాదో అన్న అనుమానాలను పటాపంచలు చేస్తూ షూటింగ్‌లో పాల్గొంది. ముంబైకి చెందిన యాడ్ ఫిల్మ్ మేకర్ విశేష్ వర్మ దీనికి దర్శకత్వం వహించారు.
అయితే షూట్ గ్యాప్‌లో సమంత తీవ్ర భావేద్వేగానికి లోనై కంటతడి పెట్టుకున్నట్లు యూనిట్ సభ్యులు తెలిపారు. విడాకుల ప్రకటనతో సమంత కుంగిపోయినట్లు పేర్కొన్నారు. అయితే మనసులో ఎంత బాధ ఉన్నప్పటికీ కెమెరా ముందుకు రాగానే డైరెక్టర్ చెప్పినట్లు యాక్టింగ్ చేసిందట. దీంతో పని విషయంలో సమంతకున్న అంకితభావాన్ని చాటుకుంది అని యూనిట్ సభ్యులు ప్రశంసలు కురిపించారు.
( చదవండి: సమంత కట్టుకున్న పెళ్లి చీర ఎవరిదో తెలుసా?)
Comments
Please login to add a commentAdd a comment