Breakdown
-
దీక్ష చేస్తే కుటుంబాన్నే అవమానించారే బాబూ..!
భార్యకు అవమానం జరిగిందంటూ చంద్రబాబునాయుడు చాలా బాధ పడుతూ వెక్కివెక్కి కన్నీరు కార్చడం టీవీల్లో చూసి చాలా ఆశ్చర్యపోయానని కాపు ఉద్యమ నేత, మాజీ ఎంపీ ముద్రగడ పద్మనాభం అన్నారు. గతంలో కాపు ఉద్యమ సమయంలో చంద్రబాబు వ్యక్తిగతంగా తన కుటుంబాన్ని అవమానించారని, మహిళలని కూడా చూడకుండా తన భార్యను, కోడలిని అసభ్య పదజాలంతో దూషిస్తూ రాక్షసానందం పొందారని పేర్కొంటూ ముద్రగడ పద్మనాభం చంద్రబాబుకు బహిరంగ లేఖ రాశారు. లేఖ ప్రతులను మంగళవారం పత్రికలకు విడుదల చేశారు. లేఖలోని అంశాలివీ... ‘‘చంద్రబాబునాయుడు గారికి... మీ ఉక్కుపాదాలతో అణచివేయబడ్డ మీ మాజీ మిత్రుడు ముద్రగడ పద్మనాభం నమస్కారాలు. మా జాతికి మీరిచ్చిన హామీ కోసం నేను దీక్ష మొదలు పెట్టిన మొదటి రోజునే తమ పుత్రరత్నం సాగించిన కార్యకలాపాలు మరిచిపోయారా? మా ఇంటి ఆవరణలో ఉన్న పోలీసు అధికారులకు తరచూ ఫోన్లు చేస్తూ, నన్ను బండబూతులతో సంబోధిస్తూ, బయటకు లాగారా లేదా అని వాకబు చేసిన మాట వాస్తవం కాదా? తలుపులు బద్దలుగొట్టి నా భార్యను, కోడలిని ‘లెగవే’ అంటూ పరుష పదజాలాన్ని ఉపయోగించి, బూటు కాళ్లతో తన్నించి ఈడ్చుకెళ్లడం గుర్తు లేదా? కొడితే మీకు ఇక్కడ దిక్కెవరని తిట్టించి, నా కుమారుడిని లాఠీలతో కొట్టుకుని తీసుకువెళ్లింది గుర్తు లేదా? ఇప్పుడు మీ నోటి వెంట ముత్యాల్లాంటి వేదాలు వస్తున్నాయి. తమరి దృష్టిలో మాది ఏ కుటుంబమనుకుంటున్నారు? మీరు, మీ భార్య దేవతలా? మీ ఆఫీసులు దేవాలయాలా? మరి మేమేంటి? మా కొంపలు ఏమిటి? దీక్షలప్పుడు ఒకసారి హెలికాప్టర్‌ను, మరోసారి సుమారు 6 వేల మంది పోలీసులను ప్రయోగించి తీహార్ జైలుకు పంపాలని, డ్రోన్ కెమెరాలతో నిత్యం నిఘా పెట్టి, కార్గిల్ యుద్ధ భూమిని తలపించేలా నా ఇంటి వద్ద భయోత్పాతం సృష్టించింది వాస్తవం కాదా? ఆ సంఘటనలు గుర్తు చేయడం కోసమే ఈ లేఖ రాస్తున్నాను. మిమ్మల్ని, మీ భార్యను అవమానించడం కోసం ఈ లేఖ రాయలేదు. ఇంకా లోతుగా రాయాలంటే పేజీలు సరిపోవు. నా గదిలో ఉన్న డబ్బులు, సెల్ఫోన్ల వంటి విలువైన వస్తువులను ఆ రోజు దొంగి లించారు. హాస్పిటల్ అనే జైలులో దుస్తులు మార్చుకోవడానికి, స్నానాలు చేయడానికి వీలు లేకుండా 14 రోజులు ఏ కారణంతో ఉంచారు? ఆ చిన్న గదిలో మా నలుగురితో పాటు మరో ఆరుగురు పోలీసులను పగలు, రాత్రుళ్లు కాపలాగా ఉంచారు. రేకు కుర్చీలతో శబ్దాలు చేయిస్తూ, ప్రతి రోజూ రాత్రి మా ముఖాలు ఎలా ఉన్నాయో తెలుసుకోవడం కోసం ఫొటోలు తీయించి పంపించమని పోలీసు అధికారులను మీరు ఆదేశించింది రాక్షసానందం కోసం కాదా? తమరు చేయించిన హింస, అవమానాలు భరించలేక వాటిని తలచుకుంటూ నిద్రలేని రాత్రులు ఎన్నో గడిపాం. నాలుగేళ్ల నా మనవరాలు అర్ధరాత్రి గుర్తుకు వచ్చి ఎలా భయపడేదో చెప్పడానికి మాటలు చాలడం లేదు. భూమి గుండ్రంగా ఉన్న సంగతి మరవద్దు బాబూ. నన్ను, నా కుటుంబాన్ని అంత దారుణంగా అణచివేయాలని ఎందుకు అని పించింది? ఆ రోజున మీ పదవికి అడ్డు జగన్మోహన్రెడ్డి మాత్రమే. నేనైతే కాదు. అయినా నాపై కట్టలు తెంచుకునే కోపాన్ని, క్రూరత్వాన్ని ఎందుకు చూపారు? నాటి అణచివేత చర్యల వెనుక మా కుటుంబం ఆత్మహత్యకు పూనుకోవాలనే ప్రయత్నం దాగి లేదా? మీరనుకున్నట్టే నేను కూడా ఆలోచన చేశాను. కానీ మనసులో ఏదో మూల నా కుటుంబాన్ని అవమానపరచిన తమరి పతనం నా కళ్లతో చూడాలనే ఉద్దేశంతో ఆత్మహత్యా ప్రయత్నం విరమించుకున్నాను. కొద్దోగొప్పో మీ కన్నా మా కుటుంబానికి చాలా చరిత్ర ఉంది. మా తాత పేరుకే కిర్లంపూడి మునసబుగా ఉన్నా జిల్లా మునసబుగా పేరు గడించారు. నా తండ్రిని ప్రజలు ప్రేమతో రెండు దఫాలు ఉమ్మడి ప్రత్తిపాడు నియోజకవర్గం నుంచి స్వతంత్ర శాసన సభ్యుడిగా అసెంబ్లీకి పంపారు. మీరు, నేను 1978లో అసెంబ్లీలోకి అడుగు పెట్టాం. మీకు పిల్లనిచ్చిన మామ ఎన్టీ రామారావు వద్ద, తరువాత మీ పిలుపుతో మీ వద్ద చాలా సంవత్సరాలు పని చేశాను. మీతో ఉన్న రోజుల్లో ఏ ఒక్క రోజూ మీకు వెన్నుపోటు పొడవాలనే ప్రయత్నం వీసమెత్తు కూడా చేయలేదు. కార్యకర్తలు, బంధువుల సానుభూతిని మీడియా ద్వారా పొందే అవకాశం తమరికి మాత్రమే వచ్చింది. ఈ రోజు తమరు పొందుతున్న సానుభూతి ఆనాడు నేను పొందకుండా ఉండడం కోసం మీడియాను కూడా నియంత్రించడం వాస్తవం కాదా? ఆ రోజు నుంచి నన్ను అనాథను చేయడం కూడా తమరి భిక్షే కదా! చంద్రబాబూ! తమరు శపథాలు చేయవద్దు. తమరికి, నాకు అవి నీటి మీద రాతలు. అటువంటి శపథం చేసిన, చేసే నైతికత అప్పటి ప్రధాని,æ సీఎంలు ఇందిరాగాంధీ, ఎన్టీఆర్, తమిళనాడు సీఎం జయలలిత, ప్రస్తుత పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీకే సొంతం. జీవితాలు, ఆస్తులు, పదవులు ఎవ్వరికీ శాశ్వతం కాదనే విషయాన్ని గుర్తించాలి. ప్రజలు బూటు కాలితో తన్నించుకోవడం కోసమో, కేసులు పెట్టించుకోవడం కోసమో తమకు ఓట్లు వేయలేదన్నది గ్రహించండి.’’ ఇట్లు మీ ముద్రగడ పద్మనాభం, మాజీ శాసనసభ్యులు -
ఇది సెల్ఫ్ గోల్ కాదా బాబూ?
ఏపీ అసెంబ్లీ తాజా ఎపిసోడ్లో ప్రతిపక్ష నేత చంద్రబాబునాయుడు తన సతీమణిని తానే బదనాం చేసుకున్నంత పనిచేయడం అత్యంత దురదృష్టకరం. ఆయన తన సతీమణి ప్రతిష్ఠను పణంగా పెట్టకుండా ఉండాల్సింది. అసెంబ్లీలో ఎవరైనా చంద్రబాబును కానీ, ఆయన కుటుంబ సభ్యులను కానీ ఉద్దేశించి అనుచిత వ్యాఖ్యలు చేసిన దాఖలా లేదు. కాదూ... అలా చేశారని ఆరోపిస్తున్నప్పుడు కనీసం దానిపై సభలోనే నిలదీయాల్సింది. అలా కాకుండా చంద్రబాబు లేచి తాను సీఎం అయ్యేదాక సభకు ఇక రాను అని చెప్పడం ద్వారా ఆత్మరక్షణలో పడే పరిస్థితిని తానే కోరి తెచ్చుకున్నట్లయింది. ప్రెస్మీట్లో విలపిస్తూ, తన భార్యను అవమానించారని చెప్పడం ద్వారా సానుభూతి రాజకీయానికి ప్రయత్నం చేసినట్లు అనిపిస్తోంది. ఏపీ ప్రతిపక్షనేత, తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడు కాస్త తొందరపడ్డారు. అసెంబ్లీలో, ఆ తర్వాత జరిగిన ఉదంతాలను పరిశీలిస్తే ఈ భావన కలుగుతుంది. తన వ్యక్తిగత విషయాన్ని మొత్తం రాష్ట్రానికి వర్తింపచేసి, తాను మళ్లీ సి.ఎమ్. అయ్యాకే సభలోకి వస్తానని చేసిన ప్రకటన, తదుపరి కాస్త సవరించుకుని ప్రజాక్షేత్రంలో తేల్చుకుని వస్తానని చేసిన ప్రకటన తొందరపాటుగా అనిపిస్తాయి. ఈ మొత్తం ఎపిసోడ్లో ఆయన తన సతీమణిని తానే బదనాం చేసుకున్నట్లుగా అవడం అత్యంత దురదృష్టకరం. డెబ్బై ఏళ్లు దాటిన ఈ వయసులో, సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న వ్యక్తి ఇలా చేయడం బాగోలేదు. ఆయన తన గౌరవాన్ని పెంచుకునే విధంగా వ్యవహరించి ఉండాల్సింది. తన సతీమణి ప్రతిష్టను పణంగా పెట్టకుండా ఉండాల్సింది. అసెంబ్లీలో వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యేలు అంబటి రాంబాబు కావచ్చు..మరొకరు కావచ్చు..ఎవరైనా చంద్రబాబును కాని, ఆయన కుటుంబ సభ్యులను కాని ఉద్దేశించి ఎవైనా అనుచిత వ్యాఖ్యలు చేసి ఉంటే కచ్చితంగా తప్పే అవుతుంది. వాటిని ఖండించాల్సిందే. కాని దానిపై చర్చ కూడా జరగకముందే చంద్రబాబు లేచి ఆవేశంగా తాను సి.ఎమ్. అయ్యేదాక సభకు ఇక రాను అని చెప్పడం ద్వారా ఆత్మరక్షణలో పడినట్లయింది. ఒకవేళ అంబటి రాంబాబు అభ్యంతరకరంగా మాట్లాడి ఉంటే, వెంటనే టీడీపీ సభ్యులంతా కలిసి అసెంబ్లీలో తేల్చుకుని ఉండాల్సింది. అంబటిపై చర్య తీసుకోవాలని కోరి ఉండాల్సింది. అలాకాకుండా చంద్రబాబు సభా బహిష్కారం ప్రకటన చేశారు. ఆ తర్వాత ప్రెస్మీట్లో విలపించడం ద్వారా తనకు అవమానం జరిగిందని, తన భార్యను అవమానించారని చెప్పడం ద్వారా సానుభూతి రాజకీయానికి ప్రయత్నం చేసినట్లు అనిపిస్తుంది. అసెంబ్లీలో ఎవరైనా చంద్రబాబు భార్యను అవమానిస్తే తప్పు. కాని నిర్దిష్ట ఆధారాలు లేకుండా తన భార్యను ఏదో అన్నారంటూ చంద్రబాబు మాట్లాడడం అంతకన్నా పెద్ద తప్పు అవుతుంది. టీడీపీ నుంచి సస్పెండ్ అయిన ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి, చంద్రబాబు కుమారుడు లోకేష్‌కు మధ్య జరిగిన ఈ న్యూసెన్స్‌ను చంద్రబాబు అసెంబ్లీకి తెచ్చి అక్కడ అందరికి పులిమే యత్నం చేయడం ఎంతవరకు సమంజసం? అలా చేయడం ద్వారా తన రాజకీయం కోసం చంద్రబాబు ఏమైనా చేస్తారన్న విమర్శలకు ఆస్కారం ఇచ్చారు. నిజంగానే వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు ఎవరైనా అనుచితంగా మాట్లాడి ఉంటే, సంబంధిత వీడియోని చంద్రబాబు మీడియా సమావేశంలో ప్రదర్శించి ఉండేవారు. అప్పుడు వైఎస్సార్సీపీ ఆత్మరక్షణలో పడేది. కానీ ఆయన అలా చేయలేదు. పైగా అంబటి రాంబాబు తాను ఎలాంటి అభ్యంతర వ్యాఖ్యలు చేయలేదని, అలా చేసి ఉంటే చెప్పుతో కొట్టవచ్చని సవాల్ చేశారు. మరి దీనికీ టీడీపీ సమాధానం చెప్పలేదు. పైగా అసెంబ్లీలో వ్యవసాయ మంత్రి కన్నబాబు వ్యవసాయరంగంపై మాట్లాడుతున్నప్పుడు టీడీపీ సభ్యులు ఆ అంశంతో సంబంధం లేని రకరకాల వ్యాఖ్యలు చేశారు. వాటికి కన్నబాబు కానీ, ఇతరులు కానీ సమాధానం ఇస్తూ వెళ్లారు. తెలుగుదేశం ఎమ్మెల్యేలు మరో అడుగు ముందుకు వేసి బాబాయి–గొడ్డలి, తల్లి, చెల్లి అంటూ రెచ్చగొట్టే విధంగా సీఎం జగన్‌ను ఉద్దేశించి వ్యాఖ్యానించసాగారు. చివరికి బాబు సైతం ఈ వ్యాఖ్యలు అన్నారు. అంటే అది సీఎం జగన్‌ను అవమానించినట్లు కాదా? తల్లికి ద్రోహం చేశారని చంద్రబాబు అనవచ్చా? ఈ క్రమంలో అంబటి లేచి ఏదో సర్దుబాటు ధోరణితో మాట్లాడాలని అనుకుని ఆ ప్రయత్నం చేశారు. కానీ ఇంతలో టీడీపీ ఎమ్మెల్యే ఎవరో రాంబాబును ఉద్దేశించి అభ్యం తరకర వ్యాఖ్య చేశారు. అది సమంజసమేనని చంద్రబాబు అంటారా? దానికి ప్రతిగా ఆయన అన్నీ మాట్లాడదాం.. అంటూ మాధవరెడ్డి అన్న పదం మాట్లాడారు. ఆ మీదట చంద్రబాబు తన భార్యను కించపరిచారంటూ, ఇది కౌరవ సభ, తాను ఇక్కడ ఉండను, మళ్లీ íసీఎం అయ్యాకే అడుగుపెడతానని శపథం చేసి వెళ్లిపోయారు. నిజానికి చంద్రబాబు మాట్లాడుతుండగా, కొంత వివాదాస్పదంగా ఉందనుకుని స్పీకర్ తమ్మినేని సీతారామ్ మైక్ కట్ చేశారు. కానీ, చంద్రబాబు మాట్లాడిన ఇతర మాటలన్నీ సోషల్ మీడియాలో వచ్చాయి. దానికి కారణం ఒక టీడీపీ ఎమ్మెల్యే తన సెల్ పోన్లో వాటిని చిత్రీకరించడమేనని తేలింది. నిజానికి ఇలా సెల్ అసెంబ్లీ లోనికి తెచ్చి చిత్రీకరించడం తప్పు. అయినా చేశారు. ఒకవేళ నిజం గానే అంబటి లేదా మరెవరైనా కనుక అభ్యంతర వ్యాఖ్యలు చేసి ఉంటే వాటిని కూడా టీడీపీ ఎమ్మెల్యే రికార్డు చేసి సోషల్ మీడియాలో వదిలేవారు. చంద్రబాబు మీడియా సమావేశంలో పెట్టి చూపేవారు. అవేవీ చేయలేదు.అంటే వారి వద్ద అలాంటి ఆధారాలూ ఏవీ లేవు. చంద్రబాబు అసంబ్లీకి రాకుండా ఉండాలనుకుంటే అందుకు అనుసరించవలసిన పద్ధతి ఇది కాదు. ఇక ఇప్పుడు చంద్రబాబు చేసిన శపధం నెరవేరాలంటే ఆయన ప్రజాక్షేత్రంలో తేల్చుకోవాలి. అంటే అసెంబ్లీ ఎన్నికలు రావాలి. అప్పటి వరకు ఆగాల్సిందే. ఆయన దానికన్నా అసెంబ్లీకి రాజీనామా చేసి సవాల్ విసిరి ఉంటే తెలుగుదేశం కార్యకర్తలలో ఒక ఉత్సాహం వచ్చేది. కాని ఆయన అలా చేయకుండా కుట్రపూరిత రాజకీయాలకే ప్రాధాన్యం ఇస్తున్నారు. కొద్దిరోజుల క్రితం ముఖ్యమంత్రి జగన్‌ను టీడీపీ నేత ఒకరు పార్టీ ఆఫీస్‌లో కూర్చుని ఎంత నీచంగా సంబోధించిందీ అందరికీ తెలుసు. అయినా చంద్రబాబు ఖండించలేదు. వైఎస్ జగన్ కుటుంబంలోని వారందరినీ గతంలో టీడీపీ ఎమ్మెల్యేలు, నేతలు అవమానిస్తున్నప్పుడు, జేసీ దివాకరరెడ్డి ఆనాటి ప్రతిపక్షనేతగా ఉన్న జగన్‌ని దారుణంగా మాట్లాడుతున్నప్పుడు చంద్రబాబు ముసిముసి నవ్వులతో కూర్చునేవారు. చంద్రబాబు, లోకేష్‌లు జగన్‌ను ఉద్దేశించి సైకో రెడ్డి అని, మరొకటని పలుమార్లు వ్యాఖ్యానించారు. గత టరమ్‌లో నగరి ఎమ్మెల్యే రోజా పట్ల టీడీపీ ఎలా వ్యవహరించింది. ఎంత ఘోరంగా అవమానించిందీ ఆమె చెబుతుంటే ఎవరికైనా బాధ కలిగిస్తుంది. జగన్ కుటుంబంపైన, ఆయన సోదరి షర్మిల పైన బాలకృష్ణకు చెందిన ఒక భవనం నుంచే అసభ్యకర మెస్సేజ్‌లు ప్రచారం అవుతుండేవన్న అభియోగం వచ్చింది. ఆమె స్వయంగా పోలీసులకు ఫిర్యాదు చేశారు. గతంలో ఎన్.టి.ఆర్ రెండో కళత్రం లక్ష్మీపార్వతిని, చంద్రబాబు వర్గం ఎన్నిరకాలుగా అప్రతిష్టపాలు చేసిందీ ఆమె ఇప్పటికీ చెబుతూనే ఉంటారు. మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం తన కుటుంబ సభ్యులకు చంద్రబాబు ప్రభుత్వం చేసిన పరాభవం గురించి ప్రశ్నిస్తున్నారు. దానికి జవాబిస్తారా? ఎన్టీఆర్‌పై చెప్పులు విసిరిన ఘట్టం, ఆయన కన్నీటి పర్యంతం అయిన ఘట్టం వంటివి జరిగినా, అప్పట్లో సొంత కుటుంబ సభ్యులు కనీసం ఆయనను పరామర్శించలేదు. ఇప్పుడు చంద్రబాబు భార్యను తాము ఒక్క మాట కూడా అనలేదని వైసీపీ వారు పదేపదే చెబుతున్నా, మీరు అన్నారు... అంటూ టీడీపీ ఎమ్మెల్యే, ఎన్టీఆర్ కుమారుడు బాలకృష్ణ, మరికొందరు కుటుంబ సభ్యులు మాట్లాడుతూ ఆమెకు తీరని అన్యాయం చేస్తున్నారు. బాబు రాజకీయాలలోకి వీరు రావడం దురదృష్టకరం. ఇలాంటి ఘటనలను పొడిగించుకుంటూ వెళ్లడం సంబంధిత మహిళకు ఎంత ఇబ్బందిగా ఉంటుందో ఆలోచించాలి. అయినా ఆమె కుటుంబ సభ్యులే ఇలా పదేపదే ఉటంకించి ఆమె గురించి ప్రచారం చేయడం బాధాకరం. రాజకీయాల ముందు ఇవేవీ కనిపించవేమో! నేను మాత్రం ఆమె గౌరవానికి భంగం కలగరాదని పేరు కూడా రాయలేదు. వ్యాసకర్త సీనియర్ పాత్రికేయులు కొమ్మినేని శ్రీనివాసరావు -
విడాకుల ఎఫెక్ట్: షూటింగ్లో కన్నీళ్లు పెట్టుకున్న సమంత
Samantha Breaks Down While Shooting: సమంత-నాగ చైతన్య విడిపోవడం ఇప్పుడు టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారిపోయింది. మోస్ట్ లవబుల్ కపుల్‌గా పేరు తెచ్చుకున్న సామ్-చై ఇక భార్యభార్తలుగా కలిసి ఉండలేమంటూ ప్రకటించడాన్ని అభిమానులు ఇంకా జీర్ణించుకోలేకపోతున్నారు. ఇక విడాకుల ప్రకటన అనంతరం ఇప్పటినుంచి తన పనులు తానే చేసుకోవాలని, బద్దకం వదిలి ముందుకు నడవాలని ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ను షేర్చేసిన సంగతి తెలిసిందే. దీన్ని బట్టి సమంత ప్రొఫెషనల్ లైఫ్‌లో మరింత బిజీ అవ్వనుందనే సంకేతాలు ఇచ్చింది. (చదవండి: Samantha: అందుకే సమంత విడాకులు తీసుకుందా?) ఇక నాగ చైతన్యతో విడిపోయిన అనంతరం సమంత తొలిసారిగా ఓ యాడ్ షూట్లో పాల్గొంది. హైదరాబాద్‌లోని ముకరంజా జూనియర్ కాలేజీలో దీనికి సంబంధించి షూటింగ్ జరిగింది. విడాకుల ప్రకటన అనంతరం అసలు సమంత షూట్‌కి వస్తుందో రాదో అన్న అనుమానాలను పటాపంచలు చేస్తూ షూటింగ్లో పాల్గొంది. ముంబైకి చెందిన యాడ్ ఫిల్మ్ మేకర్ విశేష్ వర్మ దీనికి దర్శకత్వం వహించారు. అయితే షూట్ గ్యాప్‌లో సమంత తీవ్ర భావేద్వేగానికి లోనై కంటతడి పెట్టుకున్నట్లు యూనిట్ సభ్యులు తెలిపారు. విడాకుల ప్రకటనతో సమంత కుంగిపోయినట్లు పేర్కొన్నారు. అయితే మనసులో ఎంత బాధ ఉన్నప్పటికీ కెమెరా ముందుకు రాగానే డైరెక్టర్ చెప్పినట్లు యాక్టింగ్ చేసిందట. దీంతో పని విషయంలో సమంతకున్న అంకితభావాన్ని చాటుకుంది అని యూనిట్ సభ్యులు ప్రశంసలు కురిపించారు. ( చదవండి: సమంత కట్టుకున్న పెళ్లి చీర ఎవరిదో తెలుసా?) -
సికింద్రాబాద్ లో ఆక్సిజన్ ట్యాంకర్ బ్రేక్ డౌన్
-
విశాఖ జిల్లా వ్యాప్తంగా 108వాహనాలు బ్రేక్‌డౌన్
-
రాత్రంతా అడవిలోనే..
మహబూబ్‌నగర్: పండుగల సీజన్ వస్తే చాలు ఇబ్బడి ముబ్బడిగా డబ్బులు గుంజే ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులు ప్రయాణికుల రక్షణ గురించి ఏ మాత్రం పట్టించుకోవడం లేదు. బస్సులో సాంకేతిక సమస్య తలెత్తి మార్గమధ్యలో చెడిపోయిన ప్రయాణికుల కోసం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయకుండా.. తాత్సారం చేసిన మరో ఘటన వెలుగుచూసింది. బుదవారం రాత్రి హైదరాబాద్ నుంచి చిత్తూరు జిల్లా మదనపల్లె బయలుదేరిన దిప్నా ట్రావెల్స్ బస్సు(ఏపీ 04 వై 7865) అర్ధరాత్రి ఒంటిగంట ప్రాంతంలో కొత్తకోట వద్ద చెడిపోయింది. ట్రావెల్స్ యాజమాన్యం బస్సులో ఉన్న ప్రయాణికుల కోసం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయకపోవడంతో.. అడవిలోనే రాత్రంతా గడపాల్సి వచ్చింది. దసరా సెలవులు కావడంతో.. బస్సు నిండా విద్యార్థులు, మహిళలు ఉన్నారు. రాత్రంతా రోడ్డుపైనే గడిపినా ట్రావెల్స్ యాజమాన్యం కనీసం పట్టించుకోలేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. -
కోతలపై భగ్గు
చిన్నకోడూరు: విద్యుత్ సమస్యతో పంటలకు నీరందడం లేదంటూ ఆగ్రహించిన రైతులు ఆదివారం ఆందోళనకు దిగారు. అల్లీపూర్, ఎల్లాయపల్లి, మైలారం గ్రామాలకు చెందిన రైతులు ఎల్లాయపల్లి సబ్‌స్టేషన్ ముందు ఆందోళనకు దిగారు. అధికారులు స్పందించకపోవండతో రోడ్డుపై ముళ్లకంప వేసి, సీఎం దిష్టిబొమ్మతో రాస్తారోకో నిర్వహించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం కేసీఆర్ దిష్టిబొమ్మను దహనం చేశారు. సరఫరాలో తరచూ బ్రేక్‌డౌన్ అవుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. విద్యుత్ అధికారులు వచ్చి స్పష్టమైన హామీ ఇచ్చేవరకు కదిలేది లేదని రోడ్డుపై భీష్మించుకు కూర్చున్నారు. ఇరువైపులా ట్రాఫిక్ నిలిచిపోయింది. విషయం తెలుసుకున్న ఎస్ఐ ఆనంద్‌గౌడ్, విద్యుత్ సబ్ ఇంజినీర్ కనకయ్యలు అక్కడకు చేరుకుని రైతులను శాంతింపజేసేందుకు ప్రయత్నించారు. అయినా వారు వినకపోవడంతో సమస్యను ఉన్నతాధికారులకు వివరించారు. సమస్యను త్వరలోనే పరిష్కరిస్తామని అధికారులు హామీ ఇవ్వడంతో రైతులు ఆందోళన విరమించారు. అట్టుడికిన రామాయంపేట రామాయంపేట: రాస్తారోకోలు, ఆందోళనలతో మండలం అట్టుడికిపోయింది. విద్యుత్ కోతలపై రైతులు కన్నెర్రజేశారు. మండలంలోని కోనాపూర్, లక్ష్మాపూర్, రామాయంపేట, తొనిగండ్ల, పర్వతాపూర్, ఢి.ధర్మారం గ్రామాలకు చెందిన అన్నదాతలు పెద్దసంఖ్యలో రోడ్లెక్కారు. రెండు రోజులుగా వ్యవసాయానికి రెండు గంటలపాటు కూడా సరఫరా అందడం లేదన్నారు. భారీ సంఖ్యలో వచ్చి ఆందోళన చేపట్టిన వీరిని సముదాయించడానికి పోలీసులు తీవ్ర ఇబ్బంది పడ్డారు. లక్ష్మాపూర్ సబ్ స్టేషన్‌కు చేరుకున్న కర్షకులు రాస్తారోకో చేపట్టారు. రోడ్డుపైన పడుకుని గంటకుపైగా నిరసన చేశారు. తొనిగండ్ల, ల క్ష్మాపూర్ గ్రామాలకు చెందిన రైతులు లక్ష్మాపూర్ క్రాస్ రోడ్డు వద్ద రామాయంపేట-మెదక్ రహదారిని స్తంభింపజేశారు. రెండు గంటలకుపైగా కొనసాగిన వీరి ఆందోళనతో వాహనాలు పెద్ద సంఖ్యలో నిలిచిపోయాయి. ఈ సమయంలో ప్రయాణికులు, ఆందోళనకారులకు మధ్య స్వల్ప వాగ్వా దం జరిగింది. పోలీసులు జోక్యంతో రోడ్డుపై ఆందోళన విరమించిన రైతులు సబ్‌స్టేషన్ వద్ద బైఠాయించారు. అక్కన్నపేట, రామాయంపేటకు చెందిన రైతులు స్థానిక బస్టాండ్ వద్ద రోడ్డుపై ఆందోళన నిర్వహించారు. పర్వతాపూర్‌కు రైతులు లక్ష్మాపూర్ రోడ్డు వద్ద రాస్తారోకో చేశారు. ఢి.ధర్మారం రైతులు రామాయంపేట సబ్‌స్టేషన్ వద్దకు వచ్చి నిరసన తెలిపారు. ఆదివారం సెలవు దినం కావడంతో ఆ శాఖకు చెందిన అధికారులు ఎవరూ అందుబాటులో లేకుండాపోయారు. సబ్ స్టేషన్‌లోని ఫర్నిచర్ ధ్వంసం విద్యుత్ కోతలను నిరసిస్తూ అన్నదాతలు ఆగ్రహం చెందారు. ఆదివారం దొంగలధర్మారం సబ్‌స్టేషన్‌లోని ఫర్నిచర్‌ను దహనం చేశారు. రోడ్డుకు అడ్డంగా స్తంభాలు వేసి రాస్తారోకో నిర్వహించారు. పోలీసులకు రైతులకు మధ్య తోపులాట చోటు చేసుకుంది.