వస్త్రాలంకరణలో ప్రతీ అంశం అందంగా రూపుకట్టాల్సిందే అనే ఆలోచనల్లో నుంచి పుట్టుకు వచ్చిందే కొంగు డిజైన్. చీరకట్టులో కుచ్చిళ్లకు ఎంత ప్రాముఖ్యత ఉంటుందో పల్లూ డిజైనింగ్‌కీ అంతే ప్రత్యేకత ఉంటుంది. దారాల అల్లికలైనా.. అద్దాల అమరిక అయినా పూసల పనితనమైనా, ప్రింట్ల మెరుపు అయినా కొంగు కొత్తగా సింగారించుకుని వేడుకలలో బంగారంలా మెరిసి΄ోతుంది.
రంగు రంగుల ఫ్యాబ్రిక్
చీరలోని రంగులతోపోటీ పడుతూ ఉండేలా ఫ్యాబ్రిక్‌తో చేసిన టాజిల్స్ కొంగుకు ప్రధాన ఆకర్షణగా మారుతుంది.
దారపు పోగులతో..
ఊలు, సిల్క్, జరీ దారాలతో అల్లిన టాజిల్స్ కాటన్ చీరలకూ, పట్టు చీరల కొంగులకు ప్రత్యేక అందాన్ని తీసుకువస్తున్నాయి.
పూసల కొంగు..
చీర రంగు కాంబినేషన్‌లో పూసలతో కొంగును డిజైన్ చేస్తే ఆ ప్రత్యేకత గురించి చెప్పడానికి మాటలు చాలవు. అలా డిజైనర్లు తమదైన సృజనకు మెరుగుపెడుతున్నారు. వాటిని ధరించిన వారు వేడుకలలో హైలైట్‌గా నిలుస్తున్నారు.
గవ్వలు, అద్దాలు
గిరిజన అలంకరణను ఆధునికపు హంగుగా మార్చడానికి గవ్వలు, అద్దాలు, ఊలు దారాల డిజైన్లను కొంగుకు అందంగా సింగారిస్తున్నారు. ఇవి ఎక్కువగా కాటన్ శారీస్ అలంకరణలో చూడవచ్చు. క్యాజవల్ వేర్‌గా నప్పే చీరలు ఈ డిజైన్ వల్ల ప్రత్యేకంగా కనిపిస్తున్నాయి.
కుచ్చుల కొంగు
చందేరీ, నెటెడ్ మెటీరియల్‌తో చీరకు జత చేసిన కొంగు కుచ్చుల అమరికతో వెస్ట్రన్ ΄ార్టీ వేర్‌గా అలరిస్తుంది. అమ్మాయిలను అమితంగా ఈ తరహా డిజైన్స్ ఆకట్టుకుంటున్నాయి.
రెడీమేడ్..
సాదా సీదాగా కనిపించే చీర కొంగు డిజైన్‌ను మార్చాలనుకుంటే మార్కెట్లో రెడీమేడ్ పల్లూ డిజైన్స్ లభిస్తున్నాయి. హ్యాండ్ ఎంబ్రాయిడరీ, మగ్గం వర్క్, పూసలు, దారాల అల్లికలతో ఉన్న పల్లూ డిజైన్స్‌ని తెచ్చి చిన్న కుట్టుతో కొంగును కొత్తగా మెరిపించవచ్చు.
ఇవి చదవండి: ‘దేశీ థ్రిల్’ మ్యూజిక్ బ్యాండ్‌లోని ఈ ముగ్గురి పాట.. వావ్ అనాల్సిందే..!
Comments
Please login to add a commentAdd a comment