Cotton Sarees
-
కొంగే.. సింగారమాయెనా!
వస్త్రాలంకరణలో ప్రతీ అంశం అందంగా రూపుకట్టాల్సిందే అనే ఆలోచనల్లో నుంచి పుట్టుకు వచ్చిందే కొంగు డిజైన్. చీరకట్టులో కుచ్చిళ్లకు ఎంత ప్రాముఖ్యత ఉంటుందో పల్లూ డిజైనింగ్కీ అంతే ప్రత్యేకత ఉంటుంది. దారాల అల్లికలైనా.. అద్దాల అమరిక అయినా పూసల పనితనమైనా, ప్రింట్ల మెరుపు అయినా కొంగు కొత్తగా సింగారించుకుని వేడుకలలో బంగారంలా మెరిసి΄ోతుంది.రంగు రంగుల ఫ్యాబ్రిక్చీరలోని రంగులతోపోటీ పడుతూ ఉండేలా ఫ్యాబ్రిక్‌తో చేసిన టాజిల్స్ కొంగుకు ప్రధాన ఆకర్షణగా మారుతుంది.దారపు పోగులతో..ఊలు, సిల్క్, జరీ దారాలతో అల్లిన టాజిల్స్ కాటన్ చీరలకూ, పట్టు చీరల కొంగులకు ప్రత్యేక అందాన్ని తీసుకువస్తున్నాయి.పూసల కొంగు..చీర రంగు కాంబినేషన్లో పూసలతో కొంగును డిజైన్ చేస్తే ఆ ప్రత్యేకత గురించి చెప్పడానికి మాటలు చాలవు. అలా డిజైనర్లు తమదైన సృజనకు మెరుగుపెడుతున్నారు. వాటిని ధరించిన వారు వేడుకలలో హైలైట్‌గా నిలుస్తున్నారు.గవ్వలు, అద్దాలుగిరిజన అలంకరణను ఆధునికపు హంగుగా మార్చడానికి గవ్వలు, అద్దాలు, ఊలు దారాల డిజైన్లను కొంగుకు అందంగా సింగారిస్తున్నారు. ఇవి ఎక్కువగా కాటన్ శారీస్ అలంకరణలో చూడవచ్చు. క్యాజవల్ వేర్‌గా నప్పే చీరలు ఈ డిజైన్ వల్ల ప్రత్యేకంగా కనిపిస్తున్నాయి.కుచ్చుల కొంగుచందేరీ, నెటెడ్ మెటీరియల్‌తో చీరకు జత చేసిన కొంగు కుచ్చుల అమరికతో వెస్ట్రన్ ΄ార్టీ వేర్‌గా అలరిస్తుంది. అమ్మాయిలను అమితంగా ఈ తరహా డిజైన్స్ ఆకట్టుకుంటున్నాయి.రెడీమేడ్..సాదా సీదాగా కనిపించే చీర కొంగు డిజైన్‌ను మార్చాలనుకుంటే మార్కెట్లో రెడీమేడ్ పల్లూ డిజైన్స్ లభిస్తున్నాయి. హ్యాండ్ ఎంబ్రాయిడరీ, మగ్గం వర్క్, పూసలు, దారాల అల్లికలతో ఉన్న పల్లూ డిజైన్స్‌ని తెచ్చి చిన్న కుట్టుతో కొంగును కొత్తగా మెరిపించవచ్చు.ఇవి చదవండి: ‘దేశీ థ్రిల్’ మ్యూజిక్ బ్యాండ్‌లోని ఈ ముగ్గురి పాట.. వావ్ అనాల్సిందే..! -
వెంకటగిరికి జాతీయ ఖ్యాతి
తిరుపతి అర్బన్: రాష్ట్రంలోనే కాకుండా దేశంలోనే ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న వెంకటగిరి వస్త్రాలకు 150 ఏళ్ల చరిత్ర ఉంది. వెండి జరీ, ఆఫ్‌ఫైన్ జరీలను అమర్చి ప్రత్యేక శైలిలో చీరలు నేయడం ద్వారా ఇక్కడి చేనేత పరిశ్రమ జాతీయ స్థాయిలో ప్రసిద్ధి పొందింది. వెంకటగిరి చీరలను 17వ శతాబ్దంలోనే నెల్లూరుకు చెందిన వెలుగుగోటి రాజవంశీయులు ధరించేవారు. చీరకు రెండు వైపులా ఒకే డిజైన్ కనిపించే జాందనీ వర్క్‌తో నేయడంతోపాటు కాటన్ చీరలు చుట్టూ చంగావి రంగు చీరల తయారీకి వెంకటగిరి ప్రసిద్ధి. ఇక్కడ 22 సంఘాలు, 660 మంది సభ్యులు తయారుచేసిన ఉత్పత్తులను బహిరంగ మార్కెట్లో విక్రయిస్తున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్వహించే చేనేత వస్త్ర ప్రదర్శనల్లో, ఆప్కో వస్త్రాలయాల్లో ఈ చీరలకు మంచి డిమాండ్ ఉంది. చీరల తయారీ విధానం ఇలా వెంకటగిరి చేనేత కార్మికులు చీరల తయారీలో క్రమపద్ధతి పాటిస్తుంటారు. ప్రధానంగా హాంక్ (చిలప) రూపంలో పత్తి, వెండి, బంగారు జరీలు, నాప్తాల్తోపాటు పత్తి శుద్ధీకరణ చేస్తారు. మరోవైపు హాంక్ కాటన్‌ను ఉడకబెట్టి, రాత్రంతా నానబెట్టి, కడిగి, రంగులు అద్దుతారు. అంతేకాకుండా తెల్ల చీరలకు బ్లీచింగ్ టెక్నిక్‌ని వాడడం, మానవ మూలకం, గ్రాఫ్ పేపర్ డిజైన్‌తోపాటు నేసిన వాటిలో లోపాలను సరిచేయడానికి మాస్టర్ వీవర్ ద్వారా తనిఖీ చేపట్టి నాణ్యత ప్రమాణాలు తెలుసుకోవడం వీరి ప్రత్యేకత. వెంకటగిరికి ఢిల్లీ బృందం కేంద్ర ప్రభుత్వానికి అనుబంధంగా ఇన్వెస్ట్ ఇండియా కమిటీ పర్యవేక్షణలో చేతివృత్తుల్లో ప్రత్యేక నైపుణ్యత సాధించడంతోపాటు గుర్తింపు పొందిన రంగాలకు ఈ ఏడాది నుంచి జాతీయస్థాయి అవార్డులను ప్రదానం చేయాలని నిర్ణయించింది. ఈ క్రమంలో మన రాష్ట్రం నుంచి 12 రంగాలను ఎంపిక చేశారు. అందులో ముందు వరుసలో వెంకటగిరి చేనేత పరిశ్రమను జాతీయ అవార్డు పోటీలకు ఎంపిక చేశారు. ఈ నేపథ్యంలో ఇన్వెస్ట్ ఇండియా కమిటీ ప్రతినిధి జిగీష తివారీ మిశ్రా నేతృత్వంలో ఓ బృందం ఈనెల 17వ తేదీ (మంగళవారం) వెంకటగిరిలో పర్యటించనుంది. వస్త్రాల నాణ్యతా, ప్రమాణాలపై నివేదిక రూపొందించనుంది. -
ఫ్యాషన్ టాక్: వెరైటీ చీరకట్టుతో కార్పోరేట్ లుక్ (ఫోటోలు)
-
ఆఫీస్‌లకి పర్ఫెక్ట్ చీరకట్టు ఇది..స్టైల్‌తో పాటు ఫార్మల్ కూడా
కుర్తాసెట్ ధరించిన సౌకర్యం కావాలి. సంప్రదాయం కాకుండా స్టయిలిష్‌గా కనిపించాలి. క్యాజువల్ వేర్ అనిపించాలి.కార్పొరేట్ లుక్‌తో ఆకట్టుకోవాలి. ఇవన్నీ ఒకచోట కొలువుండాలంటే ఎవర్గ్రీన్ చీరకట్టును మోడర్న్‌గా మెరిపించాలి. ఫోటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి లాంగ్ బ్లౌజ్‌లు, ఓవర్‌కోట్స్, పెప్లమ్, షర్ట్ స్టైల్... ఇలాంటి వాటితో కాటన్ లేదా సిల్క్ చీరకట్టును మ్యాచ్ చేస్తే స్టయిల్ లుక్ సొంతం కాకుండా ఉండదు. కాటన్, సిల్క్, బెనారస్ డిజైనర్ టాప్స్‌తో తీసుకువచ్చే ఈ లుక్ క్యాజువల్ వేర్‌గానూ, పార్టీవేర్‌గానూ ఆకట్టుకుంటుంది. -
చీరకట్టు మారింది.. శారీకి క్రాప్‌టాప్‌తో కార్పోరేట్ లుక్
చీరకట్టు హుందాతనం మనకు సుపరిచితమే. సంప్రదాయ వేడుకలైతే డిజైనర్ బ్లౌజ్లే ఇప్పుడు హంగామ. క్యాజువల్ లుక్‌కి ప్లెయిన్ బ్లౌజ్‌తో మ్యాచింగ్ మార్పులెన్ని చేసినా శారీ డ్రేప్ సెల్యూట్ చేయిస్తుంది. క్యాజువల్‌గానూ, పార్టీవేర్‌గానూ మురిపించే శారీ టాప్స్‌తో ఇప్పుడు స్టైలిష్‌గా వెలిగిపోతోంది. చీరకట్టకు మ్యాచింగ్ బ్లవుజులు ధరించడం పాత ట్రెండ్. డిజైనర్ చీరల హవా పెరిగిన తరువాత బ్లవుజుల డిజైన్ కూడా మారిపోయింది. వెరైటీ డిజైన్లలో చీరల ధరలను కూడా తలదన్నేలా బ్లవుజులను డిజైన్ చేయించుకుంటున్నారు. రోజుకో కొత్త డిజైన్‌తో ముస్తాబై మార్కెట్లోకి వస్తున్నాయి. ఫ్రాక్ టైప్ టాప్, ఓవర్‌కోట్, పెప్లమ్, లాంగ్ అండ్ షార్ట్ స్లీవ్స్, కాలర్‌నెక్, రౌండ్‌నెక్ డిజైన్స్‌తో ఈ శారీ టాప్స్ ఆధునికపు హంగుకు అద్దమయ్యాయి. కార్పోరేట్ లుక్‌కి క్లాసిక్ మార్కులు కొట్టేస్తూ కనువిందు చేస్తున్నాయి. కాటన్ శారీస్‌కు కరెక్ట్‌గా నప్పే ఈ టాప్స్ క్యాజువల్, కార్పొరేట్ లుక్‌తో ఆకట్టుకుంటున్నాయి. ఫ్రాక్ టైప్ టాప్ పెప్లమ్ బ్లౌజ్‌కి దగ్గర పోలిక ఉంటుంది. వదులుగా ఉండటం వల్ల సౌకర్యంగానూ ఉంటుంది. -
దుబ్బాక లినెన్ చీరకు జాతీయస్థాయి గుర్తింపు
దుబ్బాకటౌన్: సిద్దిపేట జిల్లా దుబ్బాక నేతన్న ప్రతిభకు గుర్తింపు లభించింది. దుబ్బాక చేనేత కార్మికులు మగ్గంపై నేసిన లినెన్ కాటన్ చీర జాతీయస్థాయిలో మెరిసింది. స్వాతంత్య్ర వజ్రోత్సవ వేళ దేశంలోని వారసత్వ సంపదలను కాపాడాలనే ఉద్దేశంతో కేంద్ర టెక్స్టైల్స్ శాఖ విరాసత్ పేరిట ఢిల్లీలో నేటి నుంచి ఈ నెల 17 వరకు చేనేత చీరల ప్రదర్శన చేపట్టింది. దేశంలోని వివిధ ప్రాంతాల్లో చేనేత కార్మికులు నేసిన 75 రకాల చీరలను ఈ ప్రదర్శనకు ఎంపిక చేయగా, ఇందులో దుబ్బాక చీరకు స్థానం దక్కింది. చేనేత సహకార సంఘం మాజీ చైర్మన్, చేనేత రంగంలో అద్భుతాలు సృష్టించేందుకు కృషిచేస్తున్న బోడ శ్రీనివాస్ ఆధ్వర్యంలో హ్యాండ్లూమ్ ప్రొడ్యూసర్ కంపెనీలో కార్మికులు ఈ లినెన్ కాటన్ చీరను నేయడం విశేషం. దేశంలోనే గుర్తింపు పొందిన దుబ్బాక చేనేత పరిశ్రమపై క్రమేణా నిర్లక్ష్యం అలుముకుంటోంది. ఈ క్రమంలో విరాసత్ చీరల ప్రదర్శనకు ఎంపిక కావడంతో మళ్లీ దేశవ్యాప్తంగా దుబ్బాకకు గుర్తింపు లభించింది. జాతీయస్థాయిలో దుబ్బాక చేనేతలకు గుర్తింపు దక్కడం పట్ల ఈ ప్రాంత ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ‘విరాసత్ ప్రదర్శనకు దుబ్బాక లినెన్ కాటన్ చీర ఎంపిక కావడం చాలసంతోషంగా ఉంది. టై అండ్ డై విధానంతో ఇక్కత్ చీరలను తయారు చేయడం ఎక్కడ సాధ్యపడలేదని, కేవలం దుబ్బాకలోనే తయారు కావడం ఆనందంగా ఉంది’అని బోడ శ్రీనివాస్ అన్నారు. -
Sircilla Weavers: అంచు చీరలే ఆ‘దారం’
► సాంచాలపై కాటన్ చీరలను ఉత్పత్తి చేస్తున్న ఇతను వేముల వెంకట్రాజం. సిరిసిల్లలోని వెంకంపేటకు చెందిన ఆయన మూడో తరగతి చదువుకున్నారు. 16 ఏళ్ల వయసు నుంచే చేనేత మగ్గాలు నడుపుతున్నారు. ఇప్పుడు ఆరు పదుల వయసులో కాటన్ జరీ అంచు చీరలను ఉత్పత్తి చేస్తున్నారు. నిత్యం రెండు సాంచాలపై చీరలను నేస్తూ.. నెలకు రూ.8వేల నుంచి రూ.10వేలు సంపాదిస్తున్నారు. ► ఈయన సబ్బని నరేందర్. సిరిసిల్ల శివనగర్‌కు చెందిన ఇతను డిగ్రీ చదివారు. అందరిలా పవర్‌లూమ్స్(సాంచాల)పై పాలిస్టర్ బట్టను, బతుకమ్మ చీరలను ఉత్పత్తి చేయకుండా సొంతంగా కాటన్ చీరలపై దృష్టి పెట్టారు. తనకున్న ఇరవై సాంచాలపై ఇదే వస్త్రాన్ని ఉత్పత్తి చేస్తూ మరో పది మందికి పని కల్పిస్తున్నారు. నవ్యమైన, నాణ్యమైన కాటన్ చీరల ఉత్పత్తి చేస్తున్నారు. ఆ చీరలకు సొంతంగానే మార్కెటింగ్ చేస్తున్నారు. అన్ని ఖర్చులు పోను నెలకు రూ.50వేలు సంపాదిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు. సిరిసిల్ల: సిరిసిల్లలో ఇలా సొంతంగా వస్త్రం ఉత్పత్తి చేసి మార్కెటింగ్ చేస్తున్న వారు ఒక్కరిద్దరు కాదు.. సుమారు 300 సాంచాలపై 150 మంది కార్మికులు, 25 మంది యజమానులు ఉన్నారు. సొంతంగానే జరీ అంచులతో కూడిన కాటన్ చీరలను ఉత్పత్తి చేస్తూ స్వయం ఉపాధికి బాటలు వేసుకున్నారు. ప్రభుత్వ వస్త్రోత్పత్తి ఆర్డర్లు రాలేదనే బెంగలేదు.. బతుకమ్మ చీరల బిల్లులు రాలేదనే చింత లేదు. సర్కారు ఆర్డర్ల వైపు ఎదురుచూడ కుండా సొంత సాంచాలపై జరీ అంచుతో 8 మీటర్ల (18 మూరల) గోచీ చీరలను ఉత్పత్తి చేస్తున్నారు. వాటిని నిజామాబాద్, ఆదిలాబాద్, కామారెడ్డి, ఆర్మూర్, భీంగల్, నిర్మల్, భైంసా వంటి పట్టణాల్లోని వస్త్ర వ్యాపారులకు నేరుగా సరఫరా చేస్తున్నారు. ఒక్కో చీరను రూ.650 నుంచి 800 వరకు నాణ్యతను బట్టి అందిస్తున్నారు. నేరుగా నూలు కొనుగోలు చీరలకు అవసరమైన నూలును నేరుగా భీవండి నుంచి కొనుగోలు చేస్తున్నారు. నూలుకు అవసరమైన రంగులను అద్ది, బీములు పోయించుకుని, సాంచాలపై ఎక్కిస్తారు. జరీ పోగులతో చీరల అంచులను, కొంగులను డిజైన్ చేసి ఇంపైన రంగుల్లో ఉత్పత్తి చేస్తున్నారు. అంతేకాదు వారే మార్కెట్లోకి సరఫరా చేస్తున్నారు. పెరుగుతున్న నూలు ధరలతో కాస్త ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతున్నా.. వాటిని అధిగమించి వ్యాపారం చేస్తున్నారు. ప్రభుత్వం చేయూతనిస్తే.. కాటన్ చీరల ఉత్పత్తికి అవసరమైన నూలు సరఫరాకు ప్రభుత్వం స్థానికంగా నూలు డిపోను ఏర్పా టు చేస్తే రవాణా ఖర్చులు తగ్గుతాయి. కరోనా లాక్డౌన్ వంటి విపత్తులు ఎదురైనా, తట్టుకుని నేతన్నలు చీరల బట్టను ఉత్పత్తి చేసే అవకాశం ఉంది. మంత్రి కేటీఆర్ చొరవ చూపి సిరిసిల్లలో నూలు డిపో ఏర్పాటు, మార్కెటింగ్‌కు అవకాశాలు కల్పిస్తే.. మరిన్ని అద్భుతాలు సృష్టిస్తామని నేతన్నలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. -
కొత్త చీరలు కొని డొనేట్ చేస్తున్నారు.. ఎందుకంటే..
రాబోయే రోజులు పండగ కళతో ప్రభవించే రోజులు. దుర్గపూజను దృష్టిలో పెట్టుకొని కోల్‌కతాలోని ‘హ్యూమన్స్ ఆఫ్ పాటులి’ (హెచ్‌వోపీ) అనే స్వచ్ఛంద సంస్థ నిరుపేద మహిళలకు కొత్త చీరలను అందజేయడానికి ‘ఒక కొత్త కాటన్‌చీర’ పేరుతో ఫేస్బుక్ వేదికగా ప్రచారానికి శ్రీకారం చుట్టింది. రెండు మూడురోజుల్లోనే దీనికి మంచి స్పందన వచ్చింది. దాతల నుంచి వచ్చిన కొత్తచీరలను ఎప్పటికప్పుడు పేదమహిళలకు అందిస్తున్నారు. ‘పేదలకు మనకు తోచిన రీతిలో సహాయం చేయడం మన కనీసధర్మం’ అంటుంది స్వప్న అనే గృహిణి. స్వప్న కూతురు కూడా తల్లి బాటలోనే నడిచి తన పొదుపు మొత్తంలో కొంత కొత్తచీరల కోసం ఇచ్చింది. సౌత్ కోల్‌కతాలోని ఒక కాలేజీలో హిస్టరీ లెక్చరర్ అయిన శ్రేయషి దానధర్మాల గురించి వినడం తప్ప వాటి గురించి పెద్దగా ఆలోచించింది లేదు. ఫేస్బుక్లో ‘ఒక కొత్త కాటన్ చీర’ ప్రచారానికి ఆకర్షితురాలైన శ్రేయషి తన వంతుగా కొన్ని కొత్తచీరలను కొని డొనేట్ చేసింది. అక్కడితో ఆగిపోలేదు. తన మిత్రులు, బంధువుల ద్వారా ఇంకొన్ని కొత్త చీరలు డొనేట్ చేయించింది. ‘కరోనా దెబ్బతో చాలా రోజులు పనులు లేవు. అప్పులు చేయాల్సి వచ్చింది. ఇప్పుడిప్పుడే పనులు దొరుకుతున్నాయిగానీ చాలా భాగం అప్పులు కట్టడానికే సరిపోతుంది. ఈ సమయంలో పండగపూట ఒక కొత్త చీర కొనుక్కోవాలి అనే ఆలోచన చేయలేం. చేసినా కొనే పరిస్థితి లేదు. ఇలాంటి సమయంలో ఉచితంగా కొత్త చీరలు ఇస్తున్నారని తెలిసి తీసుకున్నాను. సంతోషంగా ఉంది’ అంటుంది పాటులి మురికివాడలో నివసించే రాజశ్రీ. మతసామరస్యంపై రకరకాల కార్యక్రమాలు చేపట్టే ‘హెచ్‌వోపీ’ గత సంవత్సరమే ‘ఒక కొత్త కాటన్ చీర’ కార్యక్రమాన్ని చేపట్టింది. అయితే గతంతో పోలిస్తే... ఇప్పుడు స్పందన గొప్పగా ఉందని నిర్వాహకులు చెబుతున్నారు. గత సంవత్సరం పిల్లలకు కొత్తదుస్తులు ఇప్పించడం వరకు మాత్రమే మొదట పరిమితమయ్యారు. ఆ తరువాత మహిళలను చేర్చారు. ఈసారి చెప్పుకోవాల్సిన రెండు ముఖ్య విషయాలు... 1. రిపీట్‌గా డొనేట్ చేసేవారు పెరగడం 2. తమ ఆర్థికపరిస్థితి అంతంత మాత్రంగా ఉన్నా, కొత్త చీరలు దానం చేసేవారి సంఖ్య పెరగడం. వెతుక్కుంటూ సంస్థ కార్యాలయానికి వచ్చి మరీ స్వయంగా కొత్త చీరలు అందించేవారు కొందరైతే, కొరియర్ ద్వారా పంపించేవారు కొందరు. ‘హెచ్‌వోపీ’ నినాదం...ఫెస్టివ్ జాయ్ ఫర్ ఆల్! మంచి మనసులు ఉన్న మనుషులు ఉన్నచోట అదేమంత కష్టమైన పని కాదని మరోసారి నిరూపణ అయింది. చదవండి: Sumukhi Suresh: 30 వేల జీతం.. జీవితం బాగానే సాగేది.. కానీ నవ్వించడంలో.. -
ముగ్గులు కట్టండి
గుమ్మం ముందు రంగవల్లిక సంప్రదాయ చీర కట్టుపైన మెరుస్తోంది. చీరకు అందాన్ని పెంచే జాకెట్టు పైన కొలువుదీరుతోంది. ఆ ముగ్గు ఈ ధనుర్మాసాన సరికొత్తగా ముస్తాబు అవుతోంది. ముంగిట ముగ్గుల అలంకరణే కాదు ముచ్చట గొలిపే ఆ ముగ్గు డిజైన్లతో ఉన్న చీరలను కట్టండి. ముగ్గులే కట్టారా అనిపించండి. ప్లెయిన్ కాటన్ చీర మీద ముగ్గుల ప్రింటు, ఆ చీరను కట్టుకున్నవారిని చూస్తే ముగ్గు కొత్త భాష్యం చెబుతున్నట్టుగా ఉంటుంది. ►తెలుగింటి ముగ్గు పట్టు చీర బ్లౌజ్‌కు ఎంబ్రాయిడరీగా అమరితే వేడుకలో ప్రత్యేకంగా ఆకట్టుకుంటుంది. ►కొత్తగా ముగ్గు డిజైన్ వేయించుకోవాలనుకునే ప్లెయిన్ చీర, బ్లౌజ్, డ్రెస్సులను ఎంచుకోవచ్చు. ఈ డిజైన్ బాగుండాలంటే చుక్కల ముగ్గునే ప్రింట్‌గా వేయించుకోవాలి. లేదా చేతి కుట్టుతో అందంగా రూపుకట్టాలి. అప్పుడే అల్లిక స్పష్టంగా తెలిసి అందంగా కనపడుతుంది. ముగ్గు డిజైన్ కావాలనుకుని సాధారణ డిజైన్ని ఎంచుకుంటే ఎలాంటి ప్రత్యేకతా ఉండదు ►చలికాలం తెలుగునాట ముగ్గుల కాలం కూడా కాబట్టి ఇప్పటికే ఇలాంటి డిజైన్స్‌తో ఉన్న చీరలను, డ్రెస్సులను ధరిస్తే సంప్రదాయానికి చిరునామాగా, కళగా కనపడతారు. -
నూలు విధాలు
దారాలెన్నింటినో ఒద్దికగా పేర్చితే... ఆ అల్లిక ఒక నేత చీరగా రూపుకడుతుంది. స్టైల్స్ ఎన్నింటినో పొందికగా కూర్చితే ఆ కొత్తదనం చీరంత అందమై కొలువుదీరుతుంది. నూలు దారాలన్నీ వినూత్నమై ఇలా నూలు విధాలుగా వెలుగొందుతాయి. నిన్నామొన్నటి వరకు కాటన్ చీరలు అంటే అమ్మాయిలు వాటిని ఆమడదూరం పెట్టేసేవారు. అవి పెద్దవారి జాబితా అంటూ పెదవి విరిచేవారు. ఇప్పుడు నయా స్టైల్ వచ్చింది. కంచి, ఖాదీ, లినెన్, మల్.. హ్యాండ్లూమ్ కాటన్ చీర ఏదైనా అమ్మాయిలు, అమ్మలు ఇలా కాటన్ కట్టులో కొత్తదనం తీసుకు వస్తున్నారు. ధరించే బ్లౌజ్‌తో అట్రాక్టివ్ లుక్ తీసుకువస్తున్నారు. ఈ ఇండోవెస్ట్రన్ లుక్ క్యాజువల్ వేర్‌గానే కాదు, సీజన్‌కి తగ్గట్టు పార్టీ వేర్‌గానూ హంగామా క్రియేట్ చేస్తుంది. -
నేత కాంతులు
సౌందర్యానికి మించిన దీపం లేదు.అందమైన ఆహార్యానికి మించిన కళ లేదు.పండగ వేళ ఇంట్లో కాంతి పూలు పూయాలి.నేత వస్త్రాలతో వెలుగులు చిందించాలి.ఈ దీపావళిని చేనేతమయం చేయండి.అందంతో పాటు రక్షణ కూడా పొందండి. ►ఇక్కత్ కాటన్, ప్లెయిన్ కాటన్ ఆఫ్ అండ్ ఆఫ్ శారీగా డిజైన్ చేసుకోవచ్చు. దీనికి మోడ్రన్ లుక్ రావడానికి స్లీవ్‌లెస్ క్రాప్‌టాప్ ధరించాలి. ►బెంగాలీ కాటన్ శారీస్‌కు కడ్డీ బార్డర్స్ వస్తుంటాయి. ఇవి పండగ వేళ దీప కళతో పోటీ పడుతుంటాయి. ►కాటన్ సిల్క్ శారీ ఇది. ‘కాటన్ చీరలు ఎలా కట్టుకున్నా బొద్దుగా కనిపిస్తాం, కుచ్చిళ్లు సరిగ్గా ఉండవు’ అని పెదవి విరిచేవారికి కాటన్ సిల్క్ మిక్స్‌తో వచ్చిన చీరలు, డ్రెస్సులను ఎంపిక చేసుకోవచ్చు. ఆధునిక పద్ధతుల్లో కట్టుకుంటే స్టైలిష్‌గా కనిపిస్తారు. ►చీరకట్టుకోలేం అని డ్రెస్సుల వైపు చూసే నవతరం అమ్మాయిలు పండగ వేళ కళకళలాడుతూ ఉండాలంటే.. పాత పట్టు చీరను లాంగ్ గౌన్గానూ, ఫ్లోర్ లెంగ్త్ అనార్కలీగానూ మార్చేయవచ్చు. ఇలా అందంగా ధరించవచ్చు. ►టీనేజర్స్ ముచ్చటపడి కోరుకునే చీరకట్టు. కాటన్ శారీస్‌తో ఇలా మోడ్రన్ లుక్‌తో వెలిగిపోవచ్చు. ► బీజ్ కాటన్ చీరలు బూడిద, పసుపు రంగుల కాంబినేషన్‌తో ఉంటాయి. పండగకు కళను వెయ్యింతలు చేస్తాయి. ►ఖాదీ కాటన్ చీరలనువయోవృద్ధులు కట్టుకుంటారు అనిపెదవి విరిచే అమ్మాయిలు లేటెస్ట్ బ్లౌజ్ డిజైన్లతో ఇలాఆకర్షణీయంగా రెడీ అవ్వచ్చు. – కీర్తికా గుప్తా డిజైనర్ నిర్వహణ ఎన్.ఆర్. -
దీపావళి మేళా
లేపాక్షి ఏర్పాటు చేసిన ‘దివాలీ మేళా’ విశేషంగా ఆకట్టుకుంటోంది. ఆర్టీసీ క్రాస్‌రోడ్స్ ఎక్స్పోర్ట్ ఓరియంటెడ్ షోరూమ్‌లో బుధవారం ప్రారంభమైన ఈ మేళాలో.. మహిళలు మెచ్చే జ్యువెలరీ, హ్యాండీక్రాఫ్ట్స్, హ్యాండ్లూమ్, ఇమిటేషన్ గోల్డ్ వంటి వెరైటీలెన్నో ఉన్నాయి. గద్వాల్, మంగళగిరి, వెంకటగిరి, కలంకారి, ప్రింటెడ్ కాటన్ చీరలు ఆకట్టుకుంటున్నాయి. ఈ నెల 22 వరకు ప్రదర్శన ఉంటుంది. - ముషీరాబాద్ -
కాటన్.. కాలం
‘‘ఏప్రిల్ ఆరంభంలోనే ఎండలు మండిపోతున్నాయి. రోజురోజుకూ పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో చిన్నారుల నుంచి పెద్దల వరకు అల్లాడిపోతున్నారు. బయటికెళితే చెమటతో వస్త్రాలన్నీ తడిసి చిరాకు పెడుతున్నాయి. మండు టెండలోనూ ఉత్సాహంగా ఉండాలంటే చిన్నా, పెద్దా, ఆడా మగా కాటన్ వస్త్రాలు ధరించడమే మేలు...’ వేసవి మెచ్చే ఫ్యాషన్ ఇదే.. మండు వేసవిలో చల్లదనం కోసం.. గిరాకీ పెరిగిందంటున్న వ్యాపారులు నల్లగొండ అర్బన్, న్యూస్‌లైన్ తెల్లారుతూనే భానుడు భగభగలాడుతున్న రోజులివి. కార్యాలయాలకు వెళ్లేవారు, వివిధ పనులతో పట్టణంలో తిరిగేవారు, ఇలా అందరికీ చెమటకారణంగా ఏ పని చేద్దామన్నా మనసు నిలకడగా ఉండ ని పరిస్థితి. పైగా చిరాకు, ఇలాంటి సందర్భంలో కాస్త చల్లదనం, ఉల్లాసం కలిగించే దుస్తులు ధరించడమే ఉత్తమం. ఖద్దరు, కాటన్, చేనేత దుస్తులు ధరించడం భేషుగ్గా ఉంటుంది. కాలానికి తగ్గట్టు వస్త్ర శ్రేణి మార్పు... కాలానికి తగ్గట్టుగా వస్త్రశ్రేణిని మార్చడంలో ప్రజలు ముందుంటున్నారు. ఏ సీజన్‌కు ఆ ఫ్యాషన్ పల్లవి అందుకుంటుండటంతో వాతావరణానికి అనుకూలంగా ఉండే దుస్తుల ఎంపికకు ప్రాధాన్యం పెరిగింది. జిల్లాలో సగటున 40 డిగ్రీలకుపైగా ఉష్ణోగ్రతలు నమోదవుతుండడంతో శరీరం తట్టుకోలేకపోతోంది. దీని నుంచి కొంతైనా ఉపశమనం పొందడానికి ధరించే దుస్తులూ కీలకమే. ఇప్పటికే మార్కెట్లో వేసవి దుస్తులు తెల్ల తెల్లగా మెరుస్తున్నాయి. సామాన్యుల నుంచి సంపన్నుల వరకు నచ్చేలా మీటర్ *100 నుంచి వేల రూపాయల వరకు అందుబాటులో ఉన్నాయి. కాటన్‌లోనూ ఫ్యాషన్.. కాటన్ వస్త్రాలంటే పెద్దలకే అన్న భావన ఉండేది. ఇది వరకు మహిళలకు కాటన్ చీరలు, పురుషులకు కాటన్ చొక్కాలు మాత్రమే అందుబాటులో ఉండేవి. యువతరం ఇలాంటివి ధరించేందుకు ఇష్టపడేవారు కాదు. వయస్సు పెరిగినట్లు కన్పిస్తారని మధ్య వయస్సు వారూ దూరంగా ఉండేవారు. కానీ ఇప్పుడు యువ డిజైనర్ల నైపుణ్యంతో కాటన్‌లోనూ ఫ్యాషన్ ఉట్టిపడుతోంది. ఏ వయస్సు వారికి ఎలాంటి దుస్తులు నచ్చుతాయే అలాంటి వాటిని రూపొందించి మార్కెట్లోకి వదులుతున్నారు. దీంతో యువతరం కూడా జైబోలో కాటన్ అనాల్సిందే. కాలేజీలకు వెళ్లే అమ్మాయిలు మొదలు మహిళలకు కాటన్ దుస్తులు, చీరలు, ఒకదాన్ని మించిన డిజైన్ మరొకటి అందుబాటులో ఉన్నాయి. పార్టీ వేర్‌గానూ, కాటన్ కుర్రకారును ఆకట్టుకుంటోంది. వివాహ వేడుకల్లో కాటన్ పసందు చేస్తున్నది. మహిళల కోసం కాటన్లో పలు రకాల వెరైటీ చీరలు ఆకట్టుకుంటున్నాయి. సాధారణ రోజుల్లో కూడా ధరించే విధంగా జీన్స్‌పై డిజైనర్ కుర్తా మంచిలుక్నిచ్చేలా ఉంటున్నది. తెలుపే మలుపు వేసవిలో తెలుపుకు మించిన రంగేలేదు. ఈ రంగు కాటన్, ఖద్దరు దుస్తులతో హోదాకు, ఉన్నత వ్యక్తిత్వానికి, ప్రశాంతతకు ప్రతీకగా పలు ప్రయోజనాలున్నాయి. కూల్‌కూల్‌గా ఉండేందుకు వేసవిలో తెలుపు రంగు దుస్తుల్ని వేసుకోవడం ఉత్తమం. మీటరకు 50 నుంచి 500లదాకా... ఖాదీ వస్త్రాలు ప్రస్తుతం మీటర్‌కు 50 నుంచి 500ల వరకు అందుబాటులో ఉన్నాయి. ధర ఎక్కువైనా సరే అనే వారికి *2 వేల వరకు ఖద్దరు వస్త్రాలున్నాయని వ్యాపారులు తెలిపారు. తమిళనాడు నుంచి దిగుమతయ్యే సింపూర్ ఖద్దర్ మీటర్ 60 నుంచి 2 వేల వరకు ఉంటుంది. బీహార్ నుంచి వచ్చే సిల్క్ ఖద్దరు 200ల నుంచి 1800ల దాకా ఉంది. స్థా నిక ఖద్దరు 100 నుంచి వెయ్యిదాకా విక్రయిస్తున్నారు.