సౌందర్యానికి మించిన దీపం లేదు.అందమైన ఆహార్యానికి మించిన కళ లేదు.పండగ వేళ ఇంట్లో కాంతి పూలు పూయాలి.నేత వస్త్రాలతో వెలుగులు చిందించాలి.ఈ దీపావళిని చేనేతమయం చేయండి.అందంతో పాటు రక్షణ కూడా పొందండి.
►ఇక్కత్ కాటన్, ప్లెయిన్ కాటన్ ఆఫ్ అండ్ ఆఫ్ శారీగా డిజైన్ చేసుకోవచ్చు. దీనికి మోడ్రన్ లుక్ రావడానికి స్లీవ్‌లెస్ క్రాప్‌టాప్ ధరించాలి.
►బెంగాలీ కాటన్ శారీస్‌కు కడ్డీ బార్డర్స్ వస్తుంటాయి. ఇవి పండగ వేళ దీప కళతో పోటీ పడుతుంటాయి.
►కాటన్ సిల్క్ శారీ ఇది. ‘కాటన్ చీరలు ఎలా కట్టుకున్నా బొద్దుగా కనిపిస్తాం, కుచ్చిళ్లు సరిగ్గా ఉండవు’ అని పెదవి విరిచేవారికి కాటన్ సిల్క్ మిక్స్‌తో వచ్చిన చీరలు, డ్రెస్సులను ఎంపిక చేసుకోవచ్చు. ఆధునిక పద్ధతుల్లో కట్టుకుంటే స్టైలిష్‌గా కనిపిస్తారు.
►చీరకట్టుకోలేం అని డ్రెస్సుల వైపు చూసే నవతరం అమ్మాయిలు పండగ వేళ కళకళలాడుతూ ఉండాలంటే.. పాత పట్టు చీరను లాంగ్ గౌన్‌గానూ, ఫ్లోర్ లెంగ్త్ అనార్కలీగానూ మార్చేయవచ్చు. ఇలా అందంగా ధరించవచ్చు.
►టీనేజర్స్ ముచ్చటపడి కోరుకునే చీరకట్టు. కాటన్ శారీస్‌తో ఇలా మోడ్రన్ లుక్‌తో వెలిగిపోవచ్చు.
► బీజ్ కాటన్ చీరలు బూడిద, పసుపు రంగుల కాంబినేషన్‌తో ఉంటాయి. పండగకు కళను వెయ్యింతలు చేస్తాయి.
►ఖాదీ కాటన్ చీరలనువయోవృద్ధులు కట్టుకుంటారు అనిపెదవి విరిచే అమ్మాయిలు లేటెస్ట్ బ్లౌజ్ డిజైన్లతో ఇలాఆకర్షణీయంగా రెడీ అవ్వచ్చు.
– కీర్తికా గుప్తా డిజైనర్
నిర్వహణ ఎన్.ఆర్.
Comments
Please login to add a commentAdd a comment