గుమ్మం ముందు రంగవల్లిక సంప్రదాయ చీర కట్టుపైన మెరుస్తోంది. చీరకు అందాన్ని పెంచే జాకెట్టు పైన కొలువుదీరుతోంది. ఆ ముగ్గు ఈ ధనుర్మాసాన సరికొత్తగా ముస్తాబు అవుతోంది. ముంగిట ముగ్గుల అలంకరణే కాదు ముచ్చట గొలిపే ఆ ముగ్గు డిజైన్లతో ఉన్న చీరలను కట్టండి. ముగ్గులే కట్టారా అనిపించండి.
ప్లెయిన్ కాటన్ చీర మీద ముగ్గుల ప్రింటు, ఆ చీరను కట్టుకున్నవారిని చూస్తే ముగ్గు కొత్త భాష్యం చెబుతున్నట్టుగా ఉంటుంది.
►తెలుగింటి ముగ్గు పట్టు చీర బ్లౌజ్‌కు ఎంబ్రాయిడరీగా అమరితే వేడుకలో ప్రత్యేకంగా ఆకట్టుకుంటుంది.
►కొత్తగా ముగ్గు డిజైన్ వేయించుకోవాలనుకునే ప్లెయిన్ చీర, బ్లౌజ్, డ్రెస్సులను ఎంచుకోవచ్చు. ఈ డిజైన్ బాగుండాలంటే చుక్కల ముగ్గునే ప్రింట్‌గా వేయించుకోవాలి. లేదా చేతి కుట్టుతో అందంగా రూపుకట్టాలి. అప్పుడే అల్లిక స్పష్టంగా తెలిసి అందంగా కనపడుతుంది. ముగ్గు డిజైన్ కావాలనుకుని సాధారణ డిజైన్‌ని ఎంచుకుంటే ఎలాంటి ప్రత్యేకతా ఉండదు
►చలికాలం తెలుగునాట ముగ్గుల కాలం కూడా కాబట్టి ఇప్పటికే ఇలాంటి డిజైన్స్‌తో ఉన్న చీరలను, డ్రెస్సులను ధరిస్తే సంప్రదాయానికి చిరునామాగా, కళగా కనపడతారు.
ముగ్గులు కట్టండి
Published Fri, Dec 20 2019 12:09 AM | Last Updated on Fri, Dec 20 2019 12:09 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment