embroidery works
-
పచ్చందనమే పచ్చదనమే.. పచ్చిక నవ్వుల డిజైన్స్ (ఫోటోలు)
-
ఆమె పేరే ఓ బ్రాండ్
గుజరాత్‌లోని కచ్‌లో ఒక మారుమూల గ్రామవాసి పాబిబెన్ రబారి. మేకలు, గొర్రెల పెంపకమే ప్రధాన వృత్తిగా ఉన్న పాబిబెన్ ఇప్పుడు 300 మంది మహిళలకు ఉపాధి కల్పిస్తోంది. జరీ ఎంబ్రాయిడరీ, బ్యాగుల తయారీతో ప్రపంచ వ్యాప్తంగా పేరు సంపాదించింది. హస్తకళాకారిణిగా ఆమె కృషి, సాధించిన విజయం ఎంతోమందికి స్ఫూర్తిగా నిలుస్తుంది. పాబిబెన్ బాల్యం తీవ్ర కష్టాలతో గడిచింది. ఐదేళ్ల వయసులో తండ్రిని కోల్పోవడం, తల్లి కొన్ని ఇళ్లలో పాచిపని చేస్తూ తనను, తన చెల్లెలిని పెంచిన విధానాన్ని, మేకలను, గొర్రెలను మేపుకుంటూ బతికిన రోజులను గుర్తు చేసుకుంటుంది ఆమె. ఉన్న కొద్దిపాటి సమయంలో తల్లి సంప్రదాయ ఎంబ్రాయిడరీ పని చేస్తుండేది. అక్కడి వారి కమ్యూనిటీ వివాహ వేడుకల సమయాల్లో తప్పనిసరిగా ధరించే సంప్రదాయ ఎంబ్రాయిడరీ బ్లౌజులు, దుప్పట్లను తయారు చేసేది. ఒక్కో సంప్రదాయ ఎంబ్రాయిడరీ తయారీకి ఏడాదికి పైగా సమయం పట్టేది. ఈ సంప్రదాయం కారణంగా వారి కమ్యూనిటీలో వివాహాలు ఆలస్యం అయ్యేవి. దీంతో కొన్నాళ్లకు ఈ ఎంబ్రాయిడరీని ఆ కమ్యూనిటీ పక్కనపెట్టేసింది. ఈ సమయంలోనే పాబిబెన్ ఈ సంప్రదాయ ఎంబ్రాయిడరీలో ప్రావీణ్యం సాధించింది. ఒక కళారూపం కనుమరుగు కాకుండా కాపాడాలని నిశ్చయించుకుంది. తమ కమ్యూనిటీలో సంప్రదాయ ఎంబ్రాయిడరీని ప్రతిబింబించే కొత్త రూపాన్ని కనిపెట్టింది. ఇది వేగంగా, తక్కువ శ్రమతో కూడుకున్న కళ కావడంతో అందరినీ తన వైపుకు తిప్పుకుంది. పాబిబెన్ మొదట నలుగురైదుగురు మహిళలతో కలిసి వివాహ సమయంలో ధరించే ఎంబ్రాయిడరీ బ్లౌజ్‌లను తయారు చేసేది. చదువు లేకపోయినా తమకు వచ్చిన కళను కాపాడాలని, సాటి మహిళలకు ఉపాధి కల్పించాలనుకొని కొన్ని స్వచ్ఛంద సంస్థలను కలిసింది. కళలకు సంబంధించిన ఆ సంస్థల నుండి కొన్ని ప్రాజెక్ట్ వర్క్‌లను తీసుకుంది. ‘కానీ, నన్ను ఒక ఆలోచన ఎప్పుడూ వేధిస్తూనే ఉండేది. ఈ కళ మా సొంతం. కానీ, మాకు సరైన గుర్తింపు వచ్చేది కాదు. మేం తయారు చేసిన వాటిని వేర్వేరు బ్రాండ్ల కింద అమ్మేవారు. దీనినుంచి బయటపడేందుకు, మా హస్తకళకు మేమే ప్రాచుర్యం తెచ్చుకోవాలని ఉండేది. దీంతో పెద్దస్థాయి అధికారులను కలిశాను. వారి సూచనల మేరకు మా కళకు ఒక ఇంటిని ఏర్పాటు చేశాం. చేతివృత్తుల వారికి మార్కెట్ ప్లేస్‌గా ఆ స్థలాన్ని ప్రారంభించాం. మొదట ఇది చిన్న వ్యాపారంగానే ప్రారంభమైంది కానీ, పనితో పాటు గుర్తింపు కూడా రావాలనుకున్నాను. అది ఈ ఏడేళ్ల సమయంలో సాధించగలిగాం’ అని చెబుతుంది పాబిబెన్. పాబిబెన్ మొదటి ఉత్పత్తి స్లింగ్ బ్యాగ్. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ‘పాబీ బ్యాగ్’ అని ఆమె పేరుతోనే ఆ బ్యాగ్‌ను పిలిచేటంత ఘనత సాధించింది ఈ హస్తకళాకారిణి. పాబిబెన్ బ్రాండ్‌తో ఈ కామర్స్ మార్కెట్ ప్లేస్ అయిన ‘పాబిబెన్.కామ్’ అక్కడి గ్రామీణ మహిళలకు మరిన్ని ఉపాధి అవకాశాలను తెచ్చిపెడుతోంది. -
ముగ్గులు కట్టండి
గుమ్మం ముందు రంగవల్లిక సంప్రదాయ చీర కట్టుపైన మెరుస్తోంది. చీరకు అందాన్ని పెంచే జాకెట్టు పైన కొలువుదీరుతోంది. ఆ ముగ్గు ఈ ధనుర్మాసాన సరికొత్తగా ముస్తాబు అవుతోంది. ముంగిట ముగ్గుల అలంకరణే కాదు ముచ్చట గొలిపే ఆ ముగ్గు డిజైన్లతో ఉన్న చీరలను కట్టండి. ముగ్గులే కట్టారా అనిపించండి. ప్లెయిన్ కాటన్ చీర మీద ముగ్గుల ప్రింటు, ఆ చీరను కట్టుకున్నవారిని చూస్తే ముగ్గు కొత్త భాష్యం చెబుతున్నట్టుగా ఉంటుంది. ►తెలుగింటి ముగ్గు పట్టు చీర బ్లౌజ్‌కు ఎంబ్రాయిడరీగా అమరితే వేడుకలో ప్రత్యేకంగా ఆకట్టుకుంటుంది. ►కొత్తగా ముగ్గు డిజైన్ వేయించుకోవాలనుకునే ప్లెయిన్ చీర, బ్లౌజ్, డ్రెస్సులను ఎంచుకోవచ్చు. ఈ డిజైన్ బాగుండాలంటే చుక్కల ముగ్గునే ప్రింట్‌గా వేయించుకోవాలి. లేదా చేతి కుట్టుతో అందంగా రూపుకట్టాలి. అప్పుడే అల్లిక స్పష్టంగా తెలిసి అందంగా కనపడుతుంది. ముగ్గు డిజైన్ కావాలనుకుని సాధారణ డిజైన్ని ఎంచుకుంటే ఎలాంటి ప్రత్యేకతా ఉండదు ►చలికాలం తెలుగునాట ముగ్గుల కాలం కూడా కాబట్టి ఇప్పటికే ఇలాంటి డిజైన్స్‌తో ఉన్న చీరలను, డ్రెస్సులను ధరిస్తే సంప్రదాయానికి చిరునామాగా, కళగా కనపడతారు. -
సృజన్
ఎంబ్రైడరీ వర్క్స్‌లో చేయి తిరిగిన గుజరాత్ కళాకారుల ఉత్పత్తులు నగరంలో కొలువుదీరాయి. ఆరీ, అహిర్, చోపాడ్, గొటావ్ వంటి ఫేమస్ నార్త్ ఇండియన్ వర్క్స్‌తో బుధవారం బంజారాహిల్స్ వీవ్స్ బొటిక్‌లో ప్రారంభమైన ‘సృజన్ కచ్చీ హ్యాండ్ ఎంబ్రైడరీ’ ఎగ్జిబిషన్ మహిళల మనసు దోస్తోంది. చేతి వృత్తులు చేసుకొనే గ్రామీణ మహిళలను ప్రోత్సహించే ఎన్జీవో సంస్థ ‘సృజన్' ఈ ప్రదర్శన ఏర్పాటు చేసింది. దేశవ్యాప్తంగా 120 గ్రామాల్లో 3000 మంది చేతివృత్తి పనివారికి ఆర్థికంగా చేయూతనిస్తూ, వారి సంప్రదాయ వృత్తులను దశదిశలా వ్యాప్తి చేయడానికి కృషి చేస్తోంది. షరాఫ్, స్వాతి దలాల్, హరిత కపూర్ వంటి ప్రముఖ డిజైనర్ల వర్క్స్ ఈ ప్రదర్శనలో 16 రకాల ఎంబ్రైడరీ వస్త్ర ఉత్పత్తులు ఆకర్షణీయంగా ఉన్నాయి. శారీస్, సిల్క్ అండ్ కాటన్ హ్యాండ్లూమ్ ఉత్పత్తులు, దుపట్టాస్, షాల్స్, టాప్స్, మఫ్లర్స్, హోమ్ ఫర్నీచర్స్ వంటివెన్నో ఇక్కడ అందుబాటులో ఉన్నాయని సృజన్ ట్రస్టీ హిరాల్ దయాల్ చెప్పారు. వచ్చే నెల 1 వరకు ప్రదర్శనలో నటి మిత్ర హొయలొలికించింది. సాక్షి, సిటీ ప్లస్, ఫొటో: ఠాకూర్