సృజన్
ఎంబ్రైడరీ వర్క్స్‌లో చేయి తిరిగిన గుజరాత్ కళాకారుల ఉత్పత్తులు నగరంలో కొలువుదీరాయి. ఆరీ, అహిర్, చోపాడ్, గొటావ్ వంటి ఫేమస్ నార్త్ ఇండియన్ వర్క్స్‌తో బుధవారం బంజారాహిల్స్ వీవ్స్ బొటిక్‌లో ప్రారంభమైన ‘సృజన్ కచ్చీ హ్యాండ్ ఎంబ్రైడరీ’ ఎగ్జిబిషన్ మహిళల మనసు దోస్తోంది. చేతి వృత్తులు చేసుకొనే గ్రామీణ మహిళలను ప్రోత్సహించే ఎన్జీవో సంస్థ ‘సృజన్' ఈ ప్రదర్శన ఏర్పాటు చేసింది.
దేశవ్యాప్తంగా 120 గ్రామాల్లో 3000 మంది చేతివృత్తి పనివారికి ఆర్థికంగా చేయూతనిస్తూ, వారి సంప్రదాయ వృత్తులను దశదిశలా వ్యాప్తి చేయడానికి కృషి చేస్తోంది. షరాఫ్, స్వాతి దలాల్, హరిత కపూర్ వంటి ప్రముఖ డిజైనర్ల వర్క్స్ ఈ ప్రదర్శనలో 16 రకాల ఎంబ్రైడరీ వస్త్ర ఉత్పత్తులు ఆకర్షణీయంగా ఉన్నాయి. శారీస్, సిల్క్ అండ్ కాటన్ హ్యాండ్‌లూమ్ ఉత్పత్తులు, దుపట్టాస్, షాల్స్, టాప్స్, మఫ్లర్స్, హోమ్ ఫర్నీచర్స్ వంటివెన్నో ఇక్కడ అందుబాటులో ఉన్నాయని సృజన్ ట్రస్టీ హిరాల్ దయాల్ చెప్పారు. వచ్చే నెల 1 వరకు ప్రదర్శనలో నటి మిత్ర హొయలొలికించింది.
సాక్షి, సిటీ ప్లస్, ఫొటో: ఠాకూర్