Design
-
నోరూరించే పాప్‌కార్న్ డ్రెస్‌లో నటి ఎమ్మా స్టోన్..!
పాప్ కార్న్‌ని ఇష్టపడనివారు ఉండరు. టైం పాస్‌గానూ, మూవీ థియోటర్లలోనూ తప్పనిసరిగా ఇది ఉండాల్సిందే. అలాంటి ఈ పాప్ కార్న్ మన తాత ముత్తాతల కాలం నుంచి నేటి ఆధునిక కాలం వరకూ బెస్ట్ స్నాక్ ఐటెంగా రాజ్యమేలుతుంది. అలాంటి పాప్ కార్న్‌తో ఫ్యాషన్ ట్రెండ్ సెట్ చేసింది హాలీవుడ్ నటి ఎమ్మా స్టోన్. అసలు పాప్‌కార్న్‌తో ఫ్యాషన్ ఏంటి అనే కదా..!. ఆమె పాప్ కార్న్‌తో డిజైన చేసిన ఎరుపు రంగు గౌనులో మెరిసింది. ఇంతకీ ఆ గౌను ఎలా ఉంటుందో తెలుసా..!.ఈ చిరుతిండితో ఫ్యాషన్‌గా ఉండొచ్చనే ఆలోచన ఆమెకు ఎలా వచ్చిందో గానీ ఆ గౌను డిజైనింగ్ మాత్రం అదుర్స్. ఎరుపు రంగుతో కూడిన క్లాసిక్ పాపకార్న్ బకెట్ మాదిరిగా ఉంది. అచ్చం మనం మూవీ థియేటర్లో కొనుగోలు చేసే పాప్ కార్న్ బకెట్ మాదిరిగా డిజైన్ చేశారు. అంతేగాదు ఆమె నడుమ వద్ద శంఖాకారం మాదిరి పాకెట్స్లలో పాప్‌కార్న్‌తో నిండి ఉన్నాయి. ఎమ్మా రెడ్ కార్పెట్ మీద వయ్యారంగా నడుస్తూ వస్తూ..చేతిలో పాప్ కార్న్ ప్యాకెట్‌తో తింటూ వచ్చింది. చెప్పాలంటే ఈ ముద్దుగుమ్మ వచ్చిన విధానం చూస్తే..ఎవ్వరికైన నోరూరడమే గాక ఇలా చిరుతిండిని స్టైల్‌గా మార్చిన క్రియేటివిటిని మెచ్చుకోకుండా ఉండలేరు.ఇక నటి ఎమ్మాస్టోన్ సాటర్డే నైట్ లైవ్ 50వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని ఇలా వెరైటీ లుక్‌లో తళుక్కుమంది. రెడ్ కార్పెట్‌పై ఏ లిస్ట్ సెలబ్రిటీల పాప్ సంస్కృతికి అద్దం పట్టేలా ఎమ్మా స్టోన్ ఇలా సరికొత్త ప్యాషన్ లుక్‌తో సందడి చేసింది. అయితే ఇలా ఆహార ప్రేరేపిత ఫ్యాషన్ స్టార్ట్ చేయడం తొలిసారి కాదు. గతంలో మైఖేల్ షానన్ పసుపు చిప్స్ బ్యాగ్‌తో రెడీ అయ్యి 2024 మెట్ గాలాకు హాజరయ్యారు. మైఖేల్ డిజైనర్ వేర్ని ప్రసిద్ధ ఫ్యాషన్ డిజైనర్ బాలెన్సియాగా రూపొందించారు. ఆ బ్రాండ్ పేరు "మ్యాక్సీ ప్యాక్". అంతేగాదు ఆ ఆహార ప్రేరేపిత డిజైనర్‌వేర్‌లో చీజ్, ఉల్లిపాయ వంటివి కూడా ఉండటం విశేషం. అయితే సోషల్ మీడియాలో ఈ డిజైనర్ వేర్ పలువురిని విశేషంగా ఆకర్షించింది. Emma Stone and Meryl Streep #SNL50 pic.twitter.com/VvsIhIjs7e— best of emma stone (@badpostestone) February 17, 2025 (చదవండి: డిజైర్ డిజైన్స్..! మధ్యతరగతి వాళ్లు కూడా కొనేలా డైమండ్స్..) -
రోల్స్‌రాయిస్‌కు రూ.90,200 కోట్ల కాంట్రాక్ట్
బ్రిటన్ జలాంతర్గాములకు ఎనర్జీ అందించే అణు రియాక్టర్ల రూపకల్పన, వాటి నిర్వహణ కాంట్రాక్ట్‌ను రోల్స్ రాయిస్ దక్కించుకుంది. 11 బిలియన్ డాలర్ల(సుమారు రూ.90,200 కోట్లు) ఈ ‘యూనిటీ’ కాంట్రాక్టు ఎనిమిదేళ్లపాటు చెల్లుబాటు అవుతుందని కంపెనీ వర్గాలు తెలిపాయి. ఈ ఒప్పందం బ్రిటన్ రాయల్ నేవీ సామర్థ్యాన్ని పెంచుతుందని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి.ఈ యూనిటీ ఒప్పందం గతంలో చేసుకున్న ఒప్పందాలను క్రమబద్ధీకరిస్తుందని అధికారులు తెలిపారు. కంపెనీ అందుకున్న కాంట్రాక్టు వల్ల లండన్‌లో పెట్టుబడులు వచ్చే అవకాశం ఉందని అభిప్రాయపడుతున్నారు. ఈ నిధులు బ్రిటిష్ వ్యాపారం, ఉద్యోగాలు, జాతీయ భద్రతకు దీర్ఘకాలిక ప్రోత్సాహాన్ని అందిస్తాయని రక్షణ మంత్రి జాన్ హీలీ నొక్కి చెప్పారు. ఈ ఒప్పందం వల్ల కనీసం 1,000 నైపుణ్యం కలిగిన ఉద్యోగులకు అవకాశాలు వస్తాయని, 4,000 మందికి పరోక్షంగా రక్షణ లభిస్తుందని భావిస్తున్నారు. ఈ సందర్భంగా సెంట్రల్ ఇంగ్లాండ్‌లో డెర్బీలో రోల్స్ రాయిస్ న్యూక్లియర్ రియాక్టర్ ఉత్పత్తి కేంద్రాన్ని బ్రిటన్ రక్షణ మంత్రి హీలీ సందర్శించారు.ఇదీ చదవండి: కాల్స్ కోసమే ప్రత్యేక ప్యాక్.. వాట్సప్‌కు ఊరటయూకే, యూఎస్, ఆస్ట్రేలియా మధ్య సైనిక సహకారాన్ని బలోపేతం చేయడానికి ఈ ఒప్పందం సహకరిస్తుందని బ్రిటన్ ప్రభుత్వం తెలిపింది. ఈ ఒప్పందంతో రక్షణ రంగంలో నూతన ఆవిష్కరణలతో అత్యాధునిక టెక్నాలజీని వినియోగించబోతున్నట్లు రోల్స్ రాయిస్ పేర్కొంది. -
ముగ్గు ఎలా వేయాలి? అందులోని రకాలు..!
ముగ్గు ఎప్పుడు ఎలా పుట్టింది అనడానికి స్పష్టమైన ఆధారాలు లేవు. కానీ వేదాలలో సూర్య ఆరాధన కోసం రకరకాల చిత్రాలు చిత్రీకరించినట్లు ఆధారాలు ఉన్నాయని చెబుతుంటారు చరిత్రకారులు. ముఖ్యంగా శీతాకాలంలో పూజకి, ఆధ్యాత్మికతకు ఈ కాలం నెలవుగా ఉండటం వలన ఈ సమయంలో ముగ్గులు వేయడం ఒక సాంప్రదాయంగా స్థిరపడింది. అందునా ధనుర్మాసం వచ్చిందంటే చాలు, ఆంధ్ర, తెలంగాణ ప్రాంతాలలో నెలగంటి ముగ్గులతో కళకళలాడుతూ దర్శనమిస్తాయి. అలాంటి ముత్యాల ముగ్గులను ఎలా పెట్టాలి? పాటించాల్సిన నియమాలు గురించి సవివరంగా తెలుసుకుందామా..!.ముగ్గు వేయడంలో కూడా కొన్ని జాగ్రత్తలు, నియమాలు తప్పనిసరిగా పాటించాలి. గడప, గేటు ముందే(వాకిలి) ముగ్గు వేయాలి. అలాగే ముగ్గు వేశాక ఖచ్చితంగా నాలుగువైపు అడ్డగీతలు వేయాలి. ఇలా అడ్డగీతలు వేయడం వల్ల దుష్టశక్తులు ఇంట్లోకి రావు. అలాగే ఇంట్లో ఉన్న లక్ష్మీదేవి బయటకు వెళ్లదని శాస్త్రం చెబుతుంది. పైగా అలా వేయడం వల్ల అక్కడ శుభకార్యాలు, మంగళకరమైన పనులు జరుగుతున్నాయనే సంకేతాన్ని సూచిస్తుంది కూడా. ముగ్గుల్లో రకాలు..ముగ్గుల్లో రకరకాల డిజైన్లు ఉంటాయి. ముఖ్యంగా పువ్వులు, కొమ్మలు, చతురస్రాకారం, త్రిభుజం, ప్రకృతి, కొండలు, దీపాలు వంటి వివిధ ఆకృతులు ముగ్గుల డిజైన్లలో కనిపిస్తుంటాయి. ఉత్తరాది, తూర్పు రాష్ట్రాల ముగ్గుల డిజైన్లలో ఎక్కువగా ప్రకృతిలో ఉండే వృక్షాలు, జంతువులూ, పక్షులు, కొండలు ప్రతిబింబిస్తాయని నిపుణులు చెబుతున్నారు. చుక్కలు, గీతలు, పువ్వులు, మెలికలు... ఇలా ముగ్గుల్లో బోలెడు రకాలు. ద్రవిడులు చుక్కల ముగ్గులేస్తే, ఆర్యులు గీతల ముగ్గులు వేసేవారట. ఈ రెండింటి సమాహారం మన తెలుగు ముగ్గులు. చుక్కల చుట్టూ ముత్యాల్లా వచ్చేవి ముత్యాల ముగ్గులు. రేఖాగణితంలోని కోణాలను తలపించేవి రత్నాల ముగ్గులు. ఇక, ముగ్గులోని డిజైన్లకు ప్రకృతే స్ఫూర్తి... హంసలు, చిలుకలు, నెమళ్లు, శంఖువులు, పువ్వులు, లతలు... ఎన్నో. సంక్రాంతి ముగ్గుల్లో సూర్యచంద్రులు, ధాన్యం, గోవుమాలక్ష్మి, చెరకు గడలు, పాలు పొంగే కుండలు గీస్తారు. ధనుర్మాసంలో వేసే మెలికల పాములు హేమంతంలో కొంకర్లు తిరిగే చలికి సంకేతం. చివరగా సంక్రాంతి ఆఖరి రోజు సూర్యుణ్ణి ఆహ్వానిస్తూ రథం ముగ్గు వేస్తారు. దాన్ని తాడుతో పక్కింటి రథానికి కలపడం అన్నది అందరూ కలిసి ఉండాలన్న సమైక్యతను చాటుతుంది. ముగ్గుల్లో వేసే లతలూ పువ్వులూ జంతువులూ పక్షులూ...ప్రకృతితో కలిసిమెలిసి జీవించాలని బోధిస్తాయి.సందర్భానుసారం వేసే ముగ్గులు..నక్షత్రం ఆకారంలో ముగ్గు వేస్తే.. భూత, ప్రేత, పిశాచాలు దరిచేరకుండా చూస్తుంది.పద్మం ముగ్గు వేయడం వల్ల మనకు హాని కలిగించే చెడు శక్తులు దరిచేరకుండా అరికడతాయి. కాబట్టి ముగ్గులు తొక్కరాదు.అమ్మవారి పూజ చేసేటప్పుడు.. విగ్రహం పెట్టే పీట మీద ఖచ్చితంగా చిన్న ముగ్గు వేసి.. చుట్టూ రెండు రెండు గీతలు వేయాలి.తులసి చెట్టు దగ్గర అష్టదళ పద్మం ముగ్గు వేసి.. పూజ చేయాలిఆలయాల్లో, అమ్మవారి ముందు, మహావిష్ణువు ముందు ముగ్గులు వేసే స్త్రీలు 7 జన్మల వరకు సుమంగళిగానే మరణిస్తుందని పురాణాలు చెబుతున్నాయి.దేవతలు ఉన్న ముగ్గులు అంటే ఓం, స్వస్తిక్, శ్రీ వంటి పవిత్ర గుర్తులతో కూడిన ముగ్గులు వేయరాదు. ఎందుకంటే వీటిని తొక్కరాదు కాబట్టి.పూర్వం సాధువులు, సన్యాసులు, బ్రహ్మచారులు ముగ్గు లేని ఇంట్లో బిక్ష అడిగేవాళ్లు కాదట. ముగ్గు లేదంటే అశుభం జరిగిందని భావించేవాళ్లట(చదవండి: ముగ్గులో దాగున్న ఆరోగ్య రహస్యం, సైన్సు ఏంటో తెలుసా..!) -
జుట్టుండాలేగానీ.. మతిపోయే స్టైల్స్ ఇదిగో ఇలా!
ప్రస్తుత ఫ్యాషన్ ప్రపంచంలో కాదేది కళకు అనర్హం. కాలి గోటి నుంచి తల వెంట్రుకల ద్వారా ప్రతీదీ స్టైలిష్‌గా ఉండాలి. ఫ్యాషన్‌లో ట్రెండ్ సెట్ చేయాలి. ఈ క్రేజీ ట్రెండ్‌కనుగుణంగా డిజైనర్లు కూడా కొత్త కొత్త డిజైన్లతో ఆకట్టుకుంటున్నారు. అయితేతాజాగా సరికొత్త హెయిర్ ఆర్ట్‌తో వారెవ్వా అనిపించుకున్నారు ఒక స్టైలిస్ట్. దీనికి సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట వైరల్‌గా మారింది. జుట్టు ఉన్న అమ్మ ఏ కొప్పు పెట్టినా అందమే అన్నట్టు ఈ వీడియోలో హెయిర్ ఆర్టిస్ట్ అతేఫ్ కాబిరి జుట్టును రకరకాలుగా కళాత్మకంగా తీర్చిద్దిద్దింది. అద్భుతమైన డిజైన్లతో అబ్బుర పోయేలా చేసింది. @రైన్మేకర్ అనే యూజర్ ఈ వీడియోను ట్వీట్ చేశారు. A compilation of the most extraordinary and complex hair artworks Atefeh Kabiri.[📹 atefe_kabiri_hairstylist]pic.twitter.com/U4IAQ1SLx8— Massimo (@Rainmaker1973) December 27, 2024 -
ప్రోటీన్లపై పరిశోధనకు నోబెల్
స్టాక్‌హోమ్: మనిషి ఆరోగ్యకరమైన జీవనానికి మూలస్తంభాలైన ప్రోటీన్ల డిజైన్లు, వాటి పనితీరుపై విశేష పరిశోధనలు చేసిన ముగ్గురు శాస్త్రవేత్తలకు ఈ సంవత్సరం రసాయనశాస్త్ర విభాగంలో నోబెల్ అవార్డ్ వరించింది. ప్రోటీన్లపై శోధనకుగాను శాస్త్రవేత్తలు డేవిడ్ బెకర్, డెమిస్ హసాబిస్, జాన్ జంపర్లకు 2024 ఏడాదికి కెమిస్ట్రీ నోబెల్ ఇస్తున్నట్లు కెమిస్ట్రీ నోబెల్ కమిటీ సారథి హెనర్ లింక్ బుధవారం ప్రకటించారు. పురస్కారంతోపాటు ఇచ్చే దాదాప రూ.8.4 కోట్ల నగదు బహుమతిలో సగం మొత్తాన్ని బేకర్‌కు అందజేయనున్నారు. మిగతా సగాన్ని హసాబిస్, జాన్ జంపర్లకు సమంగా పంచనున్నారు. జీవరసాయన శాస్త్రంలో గొప్ప మలుపు ‘‘అమైనో ఆమ్లాల క్రమానుగతి, ప్రోటీన్ల నిర్మాణం మధ్య ఉన్న అవినాభావ సంబంధాన్ని శాస్త్రవేత్తలు ఆవిష్కరించారు. వీరి పరిశోధన రసాయనరంగంలో ముఖ్యంగా జీవరసాయన శాస్త్రంలో మేలి మలుపు. ఈ ముందడుగుకు కారకులైన వారికి నోబెల్ దక్కాల్సిందే’’ అని నోబెల్ కమిటీ కొనియాడింది. అమెరికాలోని సియాటెల్‌లో ఉన్న వాషింగ్టన్ విశ్వవిద్యాలయంలో డేవిడ్ బేకర్ పనిచేస్తున్నారు. హసాబిస్, జాన్ జంపర్ లండన్‌లోని గూగుల్ సంస్థకు చెందిన డీప్‌మైండ్ విభాగంలో పనిచేస్తున్నారు. ‘‘బేకర్ 2003లో ఒక కొత్త ప్రోటీన్‌ను డిజైన్‌చేశారు. అతని పరిశోధనా బృందం ఇలా ఒకదాని తర్వాత మరొకటి కొత్త ప్రోటీన్లను సృష్టిస్తూనే ఉంది. వాటిల్లో కొన్నింటిని ప్రస్తుతం ఫార్మాసూటికల్స్, టీకాలు, నానో మెటీరియల్స్, అతి సూక్ష్మ సెన్సార్లలో వినియోగిస్తున్నారు. వీళ్ల బృందం సృష్టించిన సాంకేతికతతో వెలువడిన ఎన్నో కొత్త డిజైన్ల ప్రోటీన్లు ఇప్పుడు అందుబాటులోకి వచ్చాయి’’అని నోబెల్ కమిటీలో ప్రొఫెసర్ జొహాన్ క్విస్ట్ శ్లాఘించారు. BREAKING NEWSThe Royal Swedish Academy of Sciences has decided to award the 2024 #NobelPrize in Chemistry with one half to David Baker “for computational protein design” and the other half jointly to Demis Hassabis and John M. Jumper “for protein structure prediction.” pic.twitter.com/gYrdFFcD4T— The Nobel Prize (@NobelPrize) October 9, 2024 నిర్మాణాలను అంచనా వేసే ఏఐ మోడల్ డెమిస్ హసాబిస్, జంపర్లు సంయుక్తంగా ప్రోటీన్ల నిర్మాణాలను ఊహించగల కృత్రిమమేధ నమూనాను రూపొందించారు. దీని సాయంతో ఇప్పటిదాకా కనుగొన్న 20 కోట్ల ప్రోటీన్ల నిర్మాణాలను ముందే అంచనావేయొచ్చు. చదవండి: ఏఐ మార్గదర్శకులకు...ఫిజిక్స్ నోబెల్ -
హైదరాబాద్‌లో ‘డిజైన్ డెమోక్రసీ’ ప్రారంభం
హైదరాబాద్: ఎంతగానో ఎదురుచూస్తున్న డిజైన్ ఫెస్టివల్ ‘డిజైన్ డెమోక్రసీ 2024’ హైదరాబాద్‌లో ప్రారంభమైంది. నగరంలోని హైటెక్స్‌లో ప్రారంభమైన ఈ ప్రదర్శన అక్టోబర్ 4 నుండి 7వ తేదీ వరకు నాలుగు రోజులపాటు కొనసాగనుంది.తెలంగాణ ఐటీ, ఎలక్ట్రానిక్స్ & కమ్యూనికేషన్స్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేష్ రంజన్‌తో కలిసి బ్యాడ్మింటన్ కోచ్ పుల్లెల గోపీచంద్, ఫీక్కీ ఫ్లో మాజీ చైర్పర్సన్ పింకీ రెడ్డి, డిజైన్ డెమోక్రసీ వ్యవస్థాపకులు పల్లికా శ్రీవాస్తవ్, శైలజా పట్వారీ ప్రారంభించారు.తెలంగాణ మ్యూజియం బ్రాండ్ డైరెక్టర్ మాన్సీ నేగి, క్యూరేటర్ సుప్రజా రావుతో కలిసి డిజైన్ డెమెక్రసీ వ్యవస్థపాకులు పల్లికా శ్రీవాస్తవ్, శైలజా పట్వారీ, అర్జున్ రాఠీ నిర్వహిస్తున్న ఈ ఫెస్టివల్ అసాధారణ సృజనాత్మక ప్రతిభ, వినూత్న ప్రదర్శనల వేదికగా నిలిచింది. -
Kadali: మై వార్డ్రోబ్.. కలర్ఫుల్గా.. కడలి అలలా!
‘కొత్త డ్రెస్ వేసుకుంటే ఆ రోజంతా హుషారుగా అనిపిస్తుంటుంది. అందుకే ఉదయం లేస్తూనే ఆ రోజు వేసుకోదగిన డ్రెస్ గురించి ప్లానింగ్ చేసుకుంటాను’ అంటోంది రచయిత్రి, సాంగ్ రైటర్ కడలి. ఖమ్మం నుంచి హైదరాబాద్ వచ్చి సాహిత్యం, సినిమాల్లో కృషి చేస్తున్న కడలి పాఠకులకు పరిచితమే. ‘రైటర్ అంటే కాటన్స్ మాత్రమే వేసుకోవాలనేం ఉండదు. కంఫర్ట్‌గా ఉండే డ్రెస్సులు ఏవైనా వేసుకోవచ్చు. అందుకే నా వార్డ్‌రోబ్‌లో అన్నీ మోడ్రన్, కలర్‌ఫుల్ డ్రెస్సులు ఉంటాయి’ అంటోంది కడలి.‘‘మన వార్డ్రోబ్ మనకు ఒక అద్దం లాంటిది. ఈ విషయం చెప్పడానికి నేను రాసిన ఒక కథను పరిచయం చేయాలి. ఆ కథలో ఒక యంగ్ అమ్మాయి హీరోయిన్ అవ్వాలనుకుంటుంది. కానీ చుట్టూ రకరకాల మాటలతో డిప్రెస్ అయ్యి ఆత్మహత్య చేసుకోవాలనుకుంటుంది. రైలు పట్టాల దగ్గరకు వెళ్లి అక్కడ జరిగిన ఒక సంఘటనతో ఇంటికి తిరిగి వచ్చేస్తుంది. అద్దంలో తన ముఖం చూసుకొని అందంగా తయారవ్వాలనుకుని కళ్లకు కాటుక పెట్టుకుంటుంది. తర్వాత జీవితంపై ఆశతో స్వీయప్రేరణతో తనను మెరుగు చేసుకుంటుంది ఆ కథలో. అంటే మనం ఎలా ఉండాలో మన చుట్టూ ఉన్నవారు డిసైడ్ చేయరు. మనకు మనమే నిర్ణయించుకోవాలి.నాకు నేను ప్రేరణగా!నేను షార్ట్స్ కూడా వేసుకుంటాను. బట్టలను బట్టి ఒక అమ్మాయి వ్యక్తిత్వాన్ని ఎలా జడ్జ్ చేస్తారో ఇప్పటికీ అర్ధం కాదు. అందుకే కొన్ని సభలకు టీ షర్ట్స్, జీన్స్ వేసుకెళతాను. ఈ అమ్మాయా రైటర్ రా?! అని ఆశ్చర్యపోయేవారున్నారు. ఏది సౌకర్యంగా ఉంటుందో అది వేసుకున్నంత మాత్రాన వ్యక్తిత్వానికి మార్కులు వేయకూడదు. ఎవరైనా అలా అన్నా నేను పట్టించుకోను. మీటింగ్ సందర్భాలలో కుర్తీస్ వేసుకుంటాను. రెడీ అవ్వాలి అనిపిస్తే మాత్రం ఏ మాత్రం రాజీ పడను. కాన్ఫిడెంట్‌గా ఉండాలి..నా మనసుకు నచ్చిన డ్రెస్ వేసుకుంటాను కాబట్టి కాన్ఫిడెంట్‌గా కూడా ఉంటాను. నా స్నేహితుల జాబితాలో ఫ్యాషన్ డిజైనర్లు ఉన్నారు. వారి డిజైన్స్ నాతో ట్రై చేస్తుంటారు. వాటిలో నచ్చినవి తీసుకుంటాను.అమ్మ చీరలను కొత్తగా!అమ్మ కట్టుకునే చీరలు చూసి నాకూ అలా చీరలు కట్టుకోవాలనిపిస్తుంది. మా అమ్మకు మూడు బీరువాల చీరలున్నాయి. రెగ్యులర్ చీరలు తప్ప వాటిని కట్టుకోదు. దీంతో అమ్మ చీరలను నేను కట్టుకుంటుంటాను. ‘అంచు చీరలు నీవేం కట్టుకుంటావు, పెద్దదానిలా’ అంటుంది. కానీ, బ్లౌజ్ డిజైన్‌తో స్టైలిష్ లుక్ తీసుకువస్తాను. దీంతో అమ్మ కూడా ఆశ్చర్యపోతూ ‘చాలా బాగుంది’ అని కితాబు ఇచ్చేస్తుంది. పండగలు, కుటుంబ ఫంక్షన్లు, వేడుకలకు సందర్భానికి తగినట్టు లంగాఓణీలు, పట్టుచీరలు అన్నీ ప్రయత్నిస్తాను.భిన్నంగా ఉండాలని..రచయిత్రి అనగానే ముతక చీరలు, కళ్లద్దాలు ఉండాలని చాలా మంది అనుకునేవారు. కానీ, నా వార్డ్రోబ్ మాత్రం వాటన్నింటికన్నా భిన్నం. రచయిత్రులు అంటే ఇలాగే ఉండాలి అనే ఆలోచనల్లోనుంచి ఒక మార్పు తీసుకురావాలని బుక్ లాంచింగ్ వంటి కార్యక్రమాలకు జీన్స్, టాప్స్ ట్రై చేస్తుంటాను. ప్రతీ రోజూ కొత్తగా ఉండాలనుకుంటాను. ఏ డ్రెస్ వేసుకొని రెడీ అవుతామో ఆ రోజు ఆ డ్రెస్ ప్రభావం మన మీద ఉంటుంది.ఫ్యాషన్ షోలు..దేశ, విదేశాల్లోనూ ఫ్యాషన్ షోలు నడుస్తుంటాయి. వాటిలో ప్రసిద్ధ డిజైనర్లు సీజన్‌ని బట్టి కలర్, డిజైన్ థీమ్‌ని పరిచయం చేస్తుంటారు. వాటి కోసం ఆన్లైన్ సెర్చింగ్‌తో పాటు, ఫ్యాషన్ మ్యాగజీన్స్ కూడా చూస్తుంటాను. ఆ కలర్ డ్రెస్ కాంబినేషన్స్ నేనూ ప్రయత్నిస్తుంటాను. ఎక్కువగా మాత్రం బ్లాక్ అండ్ వైట్ కలర్స్ ఇష్టపడతాను. ఆ కాంబినేషన్ డ్రెస్సులు కూడా చాలానే ఉన్నాయి నా దగ్గర’’ అంటూ వార్డ్రోబ్ విశేషాలను షేర్ చేసుకుంది. – నిర్మలారెడ్డి -
Fashion: ఫ్యాషన్ ఇలాకా.. ట్రిపుల్ ధమాకా..
సాక్షి, సిటీబ్యూరో: ఒకేరోజున ముగ్గురు ఆల్ ఇండియా టాప్ క్లాస్ ఫ్యాషన్ డిజైనర్లు తమ డిజైన్లతో నగరాన్ని పలకరించారు. తమదైన శైలికి చెందిన అంతర్జాతీయ దుస్తుల శ్రేణిని నగరవాసులకు అందుబాటులోకి తెచ్చారు. దేశంలోనే అగ్రగామి డిజైనర్లుగా పేరొందిన ఢిల్లీకి చెందిన అబ్రహమ్, ఠాకూర్ ద్వయంతో పాటు రాహుల్ మిశ్రాలు హాజరయ్యారు.అదే విధంగా ప్రముఖ డిజైనర్ దుస్తుల బ్రాండ్ సత్యపాల్.. బంజారాహిల్స్ రోడ్ నెం1లో ఉన్న సత్వా సిగ్నేచర్ టవర్‌లో వరుసగా తమ స్టోర్స్‌ను ఏర్పాటు చేయడంతో పాటు ఒకేరోజున వాటిని ప్రారంభించారు. సిటీ ఫ్యాషన్ సర్కిల్లో సందడి నింపిన ఈ అత్యాధునిక దుస్తుల స్టోర్ల ప్రారం¿ోత్సవం, లాంచింగ్ పారీ్టలకు సినీనటులు తమన్నా, నిహారికా, శోభితా దూళిపాళ్ల, సిరత్ కపూర్‌తో పాటు నగరంలోని పలువురు సెలబ్రిటీలు హాజరై డిజైనర్లకు అభినంధనలు తెలిపారు. ఈ సందర్భంగా హాజరైన అతిథులతో డిజైనర్లు తమ కలెక్షన్స్ గురించిన విశేషాలను పంచుకున్నారు. -
నేల మీద కాకుండా.. నీటిలో తేలియాడే ఇల్లును ఎప్పుడైనా చూశారా!
నేల మీద ఇల్లు కట్టుకోవడం అంత తేలిక కాదు. ముఖ్యంగా స్థలాల ధరలు చుక్కలను తాకే నగరాల్లో ఇల్లు కట్టుకోవాలంటే, ఖర్చు తడిసి మోపెడవుతుంది. అందుకే, నేల మీద కాకుండా నీటిలో తేలియాడే ఇల్లుకు చైనీస్ ఆర్కిటెక్ట్‌లు రూపకల్పన చేశారు. బీజింగ్‌కు చెందిన ‘క్రాస్బౌండరీస్ ఆర్కిటెక్చర్ స్టూడియో’కు చెందిన నిపుణులు సాధారణమైన ఇంటికి కావలసిన అన్ని వసతులతో కూడిన పడవలాంటి ఈ ఇంటిని తయారు చేశారు.నదుల్లోను, సముద్రంలోనూ తేలుతూ ప్రయాణించేలా దీన్ని తీర్చిదిద్దారు. పడవలాంటి ఈ ఇంటికి ‘ఫాంగ్ సాంగ్’ అని పేరు పెట్టారు. పడవలు నడవాలంటే ఇంధనం కావాలి. పడవలాంటి ఈ 667 చదరపు అడుగుల ఇంటికి మాత్రం ఇంధనం అక్కర్లేదు. ఇది పూర్తిగా సౌరశక్తితో పనిచేస్తుంది. దీని పైకప్పుల మీద అమర్చిన సోలార్ ప్యానల్స్ ద్వారా ఉత్పత్తయ్యే విద్యుత్తు ఈ ఇంటి అవసరాలన్నింటికీ పూర్తిగా సరిపోతుంది. ఈ ఇంటి ధర 26 వేల డాలర్లు (రూ.21.85 లక్షలు). ఈ తేలే ఇంటిని కొనేందుకు యూరోపియన్లు సైతం ఎగబడుతుండటం విశేషం. -
Siddhita Mohanty: లాక్డౌన్ టైమ్ అనేది.. నాకు గోల్డెన్ టైమ్! ఎందుకంటే?
పిల్లల లోకంలో కార్టూన్లు, కార్టూన్ల లోకంలో పిల్లలు ఉంటారు. ఎంతోమంది పిల్లలలాగే సిద్ధిత మొహంతికి కార్టూన్లు అంటే బోలెడు ఇష్టం. ఆ ఇష్టం వినోదానికే పరిమితమై΄ోలేదు. సాంకేతిక విషయాలపై ఆసక్తికి దారి తీసింది. ఆ దారి తనను ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ దగ్గరికి తీసుకువెళ్లింది. బెంగళూరుకు చెందిన పదిహేనేళ్ల సిద్ధిత పదమూడేళ్ల వయసులోనే స్టార్టప్ మొదలు పెట్టేలా చేసింది..పదమూడు సంవత్సరాల వయసులో ‘బ్లూమ్ రిద్దీ సిద్ధీ’ స్టార్టప్‌కు శ్రీకారం చుట్టింది సిద్ధిత మొహంతి. గ్రాఫిక్ డిజైనింగ్, కంప్యూటర్ లిటరసీకి సంబంధించిన స్టార్టప్ ఇది. తల్లిదండ్రులు సిద్ధితకు లాప్టాప్ కొనివ్వడంతో అది తన ప్రయోగాలకు వేదిక అయింది. మొదట్లో యూట్యూబ్‌లో కార్టూన్ వీడియోలు మాత్రమే చూసేది. ఆ తరువాత ఆమె ఆసక్తి సాంకేతిక విషయాలపై మళ్లింది. డిజిటల్ డిజైన్ అనేది పాషన్‌గా మారింది. డిజిటల్ డిజైనింగ్ అనే కోర్సు ఉంటుందని తెలియని వయసులోనే సొంతంగా డిజైన్లు చేసి అందరూ ‘వావ్’ అనేలా చేసేది. బొమ్మలు గీయడంలోనూ సిద్ధితకు మంచి నైపుణ్యం ఉంది.బెంగళూరులోని సిద్ధిత చదివే ‘ఆర్చిడ్స్ ది ఇంటర్నేషనల్ స్కూల్’ బాగా ప్రోత్సహించింది. ‘లాక్డౌన్ టైమ్ అనేది నాకు గోల్డెన్ టైమ్’ అంటున్న సిద్ధిత ఆ ఖాళీ సమయాన్ని బాగా సద్వినియోగం చేసుకుంది. ‘నా గురించి నేను బాగా తెలుసుకోవడానికి, ఇంకా ఏం చేయవచ్చు అని ఆలోచించడానికి ఆ ఖాళీ సమయం నాకు ఉపయోగపడింది’ అంటుంది సిద్ధిత. తన స్కిల్స్‌ను మెరుగుపరుచుకోవడానికి ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్, లైఫ్ స్కిల్స్, వెబ్ డిజైన్, కోడింగ్, రొబోటిక్స్. పబ్లిక్ స్పీకింగ్, నేచురల్ లాంగ్వేజ్ప్రాసెసింగ్, స్పోకెన్ ఇంగ్లీష్....మొదలైన ఎన్నో కోర్సులు చేసింది. ఈ కోర్సులన్నీ పూర్తి చేసిన తరువాత ఏదైనా సాధించాలనే తపన సిద్ధితలో మొదలైంది.ఇప్పటి వరకు 50 యాప్స్, 1,000 త్రీడీ డిజైన్లు క్రియేట్ చేసింది. జాతీయ, అంతర్జాతీయ ఒలింపియాడ్స్‌లో పాల్గొంది. ఒక సమావేశంలో పాల్గొన్న సిద్ధితకు చిన్న వయసులోనే ఎంటర్ప్రెన్యూర్లుగా ప్రయాణంప్రారంభించిన ఎంతో మందితో మాట్లాడే అవకాశం వచ్చింది. వారి మాటల నుంచి స్ఫూర్తి ΄÷ంది తాను కూడా స్టార్టప్ మొదలు పెట్టింది. పదమూడేళ్ల వయసులో ‘గర్ల్ప్రాడిజీ ఆఫ్ ది ఇయర్’గా ఎంపికైంది. సాంకేతిక విషయాలలో ప్రతిభ చూపుతున్న సిద్ధితకు సామాజిక సేవా కార్యక్రమాలలో పాల్గొనడం అంటే ఇష్టం. గ్రాఫిక్ డిజైనింగ్‌తో పాటు రచనలు చేయడం, కరాటే, క్రికెట్ అంటే సిద్ధితకు ఇష్టం. మెడిసిన్ చదవాలనేది ఆమె కల. ‘సూపర్ సిద్ధి’ పేరుతో పుస్తకం రాసే పనిలో ఉంది.ఎడోబ్ ఎక్స్‌ప్రెస్‌లో కొత్త ఫీచర్లు..ఎడోబ్ ఎక్స్‌ప్రెస్(ఎడ్యుకేషన్)లో జనరేట్ టెక్ట్స్ ఎఫెక్ట్, జనరేట్ ఇమేజ్, జనరేటివ్ ఫిల్లాంటి ఏఐ వపర్డ్ ఫీచర్లు ఉన్నాయి. విద్యార్థులు, ఉపాధ్యాయులకు మరింత ఉపయోగపడే విధంగా ‘ఎడోబ్ ఎక్స్‌ప్రెస్’ను అప్డేట్ చేస్తున్నట్లు ప్రకటించింది ఎడోబ్. క్రియేటివిటికి ఉపయోగపడేలా ఈ ఏఐ ఫీచర్లను డిజైన్ చేశారు. వీటితో టెంప్లెట్లు, బ్రోచర్లు, ఫ్లైయర్స్, ఒరిజినల్ కలలింగ్ పేజీలు జననరేట్ చేయవచ్చు. విద్యార్థులను దృష్టిలో పెట్టుకొని యానిమేషన్ ఫీచర్లు తీసుకురానుంది ఎడోబ్. -
ఫ్యాషన్ ట్రెండ్స్‌కు హైదరాబాద్ నగరం ‘సోల్ సిటీ’.. : స్టార్ డిజైనర్ ఓస్వాల్
సాక్షి, సిటీబ్యూరో: ఫ్యాషన్ డిజైనింగ్, అధునాతన ఫ్యాషన్ ట్రెండ్స్‌కు హైదరాబాద్ నగరం ‘సోల్ సిటీ’ అని ప్రముఖ బాలీవుడ్ ఫ్యాషన్ డిజైనర్ అనిత ఓస్వాల్ తెలిపారు. దశాబ్దాల కాలం నుంచే ఇక్కడి రిచ్ కల్చర్ ప్రసిద్ధి చెందిందని, ఆ సాంస్కృతిక వారసత్వాన్ని ఇప్పటికీ కొనసాగిస్తూ సౌందర్య వాణిజ్య రంగానికి కూడా కేంద్రంగా రాజసాన్ని నిలుపుకుంటుందని ఓస్వాల్ తన అభిప్రాయాన్ని వెల్లడించారు.విశ్వసుందరి ఐశ్వర్యరాయ్‌కు జ్వువెల్లరీ డిజైన్ చేస్తున్న సమయంలో పలుమార్లు దక్షిణాది సౌందర్య సొగసుల పైన చర్చించిన సందర్భాలూ ఉన్నాయని ఆమె గుర్తు చేసుకున్నారు. అనిత ఓస్వాల్ డిజైన్ చేసిన బంగారు, వజ్రాభరణాలను నగరంలోని రూం 9 పాప్ అప్ వేదికగా ‘ఝౌహరి’ పేరుతో ప్రదర్శిస్తున్నారు. తనతో పాటు కవిత కోపార్కర్ ఆధ్వర్యంలోని అత్యంత విలువైన ప్రతా పైథానీ, బనారస్ శారీస్నూ ప్రదర్శిస్తున్న ’ఝౌహరి’ని ప్రముఖ సామాజిక వేత్త శ్రీదేవి చౌదరి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఓస్వాల్ నగరంలోని ఫ్యాషన్ హంగులను, బాలీవుడ్ తారల అభిరుచులను పంచుకున్నారు.హైదరాబాద్.. డ్రీమ్ ప్రాజెక్ట్..విలాసవంతమైన జీవితాల్లో ఆభరణాలు, జీవన శైలి ప్రధానమైన అంశాలని ఓస్వాల్ వివరించారు. 25 ఏళ్లుగా బాలీవుడ్ తారలకు జువెల్లరీ డిజైన్స్ రూపొందిస్తున్నానని, కానీ హైదరాబాద్ వేదికగా తన డిజైన్స్ ప్రదర్శించడం డ్రీమ్ ప్రాజెక్ట్‌గా పెట్టుకున్నానని అన్నారు. మాజీ మిస్ యూనివర్స్ ఐశ్వర్య రాయ్, ప్రియాంక చోప్రా, కిరన్ ఖేర్, సోనాక్షి సిన్హా, సంజయ్ లీలా భన్సాలీ వంటి స్టార్స్‌కు డిజైనర్‌గా చేశాను. ఐశ్వర్యరాయ్ భారతీయ సంస్కృతిలోని ఆభరణాల సౌందర్య వైభవాన్ని మరింత ఉన్నతంగా గ్లోబల్ వేదికపైన ప్రదర్శించడానికి ఇష్టపడేదని ఆమె అన్నారు.ఫ్యాషన్ ఐకాన్ ప్రియాంక చోప్రా అంతర్జాతీయ స్థాయి డిజైనింగ్‌ను అందిపుచ్చుకోవడంలో ఆసక్తిగా ఉంటుంది. ఎప్పటికప్పుడు న్యూ ట్రెండ్స్‌ను అనుకరిస్తూ, సృష్టిస్తూ ఫ్యాషన్‌కు కేరాఫ్‌గా నిలిచే హైదరాబాద్ ఫ్యాషన్ ఔత్సాహికులను కలవడం, వారి అభిరుచులను మరింతగా గమనించడం సంతోషాన్నిచ్చింది. సెలబ్రిటీ సీక్రెట్స్ వ్యవస్థాపకురాలు డా.మాధవి నేతృత్వంలో రిచ్ లైఫ్‌ను ప్రతిబింబించే కవిత కోపార్కర్ ప్రతా పైథానీ, బనారస్ డిజైన్లతో రూం 9 పాప్ అప్‌లో... 3 రోజుల పాటు నగర ఫ్యాషన్ ప్రేమికులకు మరో ప్రపంచాన్ని చేరువ చేయనుందని ఆమె తెలిపారు.ఇవి చదవండి: An Inch.. ఆర్ట్ పంచ్! రూపం సూక్ష్మం.. కళ అనంతం! -
రాజుల కాలం నాటి చీరలకు జీవం పోస్తున్న నందిని సింగ్!
మన పూర్వీకుల కాలంలో ఎంతో కొంత ఫ్యాషన్ ఉండేది. అయితే ఇప్పటిలా దానికి అంతలా క్రేజ్ లేకపోయినా నాటి రాజరికపు కుటుంబాలు గొప్ప గొప్ప డిజైనర్ వేర్ దుస్తులను ధరించేవారు. నాటి కాలంలో చేతిలో ఎంబ్రాయిడరీ చేసిన డిజైనర్‌వేర్ చీరలు గురించి చాలమందికి తెలియదు. నాటి కాలంలో ఎంబ్రాయిడరీ చేయడం ఉందా అనుకుంటారు. కానీ ఆ కాలంలోనే హస్తకళాకారులు నైపుణ్యం ఆశ్చర్యచకితులను చేసేలా అద్భుతంగా ఉండేది. నాటి స్మృతుల్ని మరచిపోకుండా చేసేలా మన రాజరికపు దర్పానికి గుర్తుగా అలనాటి సాంప్రదాయ దుస్తులను చక్కటి బ్రాండ్ నేమ్‌తో అందరికీ చేరువయ్యేలా చేస్తోంది నందినిసింగ్. ఎవరీ నందిని సింగ్? ఎలా అలనాటి రాజరికపు సాంప్రదాయ దుస్తులను వెలుగులోకి తీసుకొస్తోందంటే..అవద్ రాజ కుటుంబానికి చెందిన నందిని సింగ్ కరోనా మహమ్మారి సమయంలో రాజుల కాలం నాటి దుస్తులకు సంబంధించిన బ్రాండ్‌ని నెలకొల్పింది. అంతేగాదు అలనాటి సాంప్రదాయ హస్తకళాకారులను ప్రోత్సహించడమే కాకుండా నాటి సాంప్రదాయ చీరలను ప్రస్తుత జనరేషన్ తెలుసుకునేలా మంచి బ్రాండ్ నేమ్‌తో పరిచయం చేస్తోంది. ఈ రాజరికపు సంప్రదాయ దుస్తులను చాస్మీ అనే బ్రాండ్‌తో ప్రదర్శిస్తోంది. ఈ బాండ్‌కి చెందిన దుస్తులు రాయల్ ఫేబుల్స్ వెడ్డింగ్ ఎడిట్లోనూ, ప్యాలెస్ అటెలియర్స్ అండ్ డిజైన్ స్టూడియోలలో ప్రదర్శనలిచ్చింది. ఈ మేరకు నందిని తన బ్రాండ్ జర్నీ గురించి మాట్లాడుతూ..తన గ్రామంలోని ఒక ఎన్జీవోకి సంబంధించిన పనిపై..ఝూన్సీ, లక్నో వంటి మెట్రోపాలిటన్ ప్రాంతాలకు వెళ్తున్నప్పుడూ.. ఎందరో హస్తకళకారులు తన వద్దకు వచ్చి తమ సమస్యను వివరించడంతో దీనిపై దృష్టి సారించినట్లు చెప్పుకొచ్చింది. అప్పుడే వారందర్నీ ఒక కమ్యూనిటీగా చేసి..షిఫాన్లు, ఆర్గాంజస్ వంటి బట్టలపై ఎంబ్రాయిడీ చేయిస్తే ఎలా ఉంటుందనే ఆలోచన తట్టింది.. అది ఒకరకంగా వారికి పని కల్పించినట్లు అవుతుంది కూడా అని భావించింది నందిని. అందుకోసం అని హోల్‌సేల్ వ్యాపారులను సంప్రదించి మరీ హస్తకళకారులకు ఉపాధి దొరికేలా చేసింది. ఆ దుస్తులను చాస్మీ అనే బ్రాండ్‌తో మార్కెట్లోకి విడుదల చేసింది. ఈ పేరుని మహాభారతం నుంచి తీసుకుంది. ఆ పురాణ గాథలో శ్రీకృష్ణుడు అనే చా అస్మీ (నేను అన్నాను) అనే సంస్కృత పదాన్ని తన దుస్తులకు బ్రాండ్ నేమ్‌గా ఎంపిక చేసుకుంది. ఈ సంప్రదాయ డిజైన్లను మంచి బ్రాండ్ నేమ్‌తో తీసుకురావడంలో ప్రేరణ తన తల్లి, అమ్మమ్మ, అత్తలే కారణం అంటోంది. ఎందుకంటే వారు ధరించే ఎంబ్రాయిడరీ చీరలతో తనకున్న చిన్న నాటి జ్ఞాపకాలే దీన్ని ఫ్యాషన్వేర్గా తీసుకొచ్చేందుji దారితీసిందని చెబుతోంది. "ఇక ఈ చాస్మీ బ్రాండెడ్ చీరలను హస్తకళకారులు సింగిల్-థ్రెడ్ వర్క్ లేదా 'సింగిల్ టార్'తో ఎంబ్రాయిడరీ చేయడం విశేషం. అందుకోసం పట్టుదారాలను ఉపయోగిస్తారు. అయితే ఈ ఎంబ్రాయిడరీ ప్రక్రియ వేగవంతం అయ్యేలా ఎక్కువ దారాలను మిక్స్ చేయడం జరుగుతుంది. కానీ హస్తకళాకారులు మాత్రం సింగిల్ దారంతోనే ఎక్కువ సమయం కేటాయించి మరీ తీర్చిదిద్దుతారు. ఈ ప్రక్రియ చాలా క్లిష్టమైనది కూడా. అలాగే పిట్టా, జాలీ, రేషం ఎంబ్రాయిడరీతో సహా వివిద రకాల వర్క్‌లు చేస్తారు. అంతేగాదు శాలువాలు, లెహంగాలు, దుపట్టాలు, చీరలు, బ్లౌజ్‌లపై కూడా ఎంబ్రాయిడరీ చేస్తాం". అని నందిని చెప్పుకొచ్చారు. అందుకు సంబంధించిన వీడియో కూడా నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఇంకెందుకు ఆలస్యం అలనాటి రాజవంశ మహిళలు ధరించే ఎంబ్రాయిడరీ చీరలను ఎలా ఉంటాయో చూసేయండి. View this post on Instagram A post shared by Chaasmi (@chaasmiofficial) (చదవండి: కట్టడితో పిల్లలను గడప దాటేలా చెయ్యొద్దు..!) -
శరవేగంగా పరుగులు తీస్తున్న ఫ్యాషన్ : ఈ రోజు స్పెషల్ ఏంటంటే..!
ఫ్యాషన్ ప్రపంచం శరవేగంగా మారిపోతోంది. క్రియేటివ్ డిజైన్లు, ఆర్టిస్టిక్ ఫ్యాషన్ సరికొత్త స్టైల్స్ నిరంతరం మారిపోతూనే ఉంటాయి. జూలై 9న ఫ్యాషన్డే గా జరుపుకుంటారని మీకు తెలుసా? పదండి దీని కథా కమామిష్షు ఏంటో తెలుసుకుందాం.ఫ్యాషన్ ప్రభావాన్ని , ప్రాభవాన్నిఫ్యాషన్ పోకడలను అర్థం చేసుకోవడమే ఫ్యాషన్ డే ఉద్దేశం. ఫ్యాషన్ ఔత్సాహికులు, డిజైనర్లు, ఫ్యాషన్ ప్రియులందరికీ ఇది ఒక గొప్ప అవకాశాల్సి కల్పిస్తుంది. ఫ్యాషన్ సాంస్కృతిక ఔచిత్యంతో పాటు సృజనాత్మకత, సృజనాత్మకత, వాస్తవికతను గుర్తించి, డిజైనర్లు, ఫ్యాషన్ స్టయిల్స్‌ను అభినందించేందుకు ఫ్యాషన్ డే 2024ని ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటారు. పూర్వంనుంచీ మన ధరించే వస్త్రాలు ఒక స్టేటస్ సింబల్. ప్రస్తుతం ఫ్యాషన్ కళాత్మక వ్యక్తీకరణ మారింది. సామాజిక మార్పులతో పాటు ఫ్యాషన్లోకూడా విప్లవాత్మక మార్పు లొచ్చాయి. ఫ్యాషన్ అంటే కేవలం బట్టలు మాత్రమే కాదు. అలంకరణలో సృజనాత్మక వ్యక్తీకరణ ప్రతీది ఫ్యాషనే.ఫ్యాషన్ డే 2024: ధీమ్ఈ ఏడాది పర్యావరణ అనుకూల పద్ధతులను పాటిస్తూ, నైతిక, ఆలోచనాత్మక వినియోగాన్ని హైలైట్ చేసేలా 'సస్టెయినబుల్ ఎలిగాన్స్' అనే థీమ్‌తో ఫ్యాషన్ డే నిర్వహిస్తున్నారు. సుస్థిరత, ఫ్యాషన్ కలిసి జీవించే దిశగా ఫ్యాషన్ డే 2024ని జరుపుకుంటూ భూమా తరక్షణలో భాగం కావడం. -
ఇంట్లో కూర్చుని.. త్రీడీ కిటికీలు ఎప్పుడైనా చూశారా?
ఇప్పటి వరకు మనం థియేటర్లో త్రీడీ సినిమాలు చూసి ఉండొచ్చు.. కానీ ఇంట్లో కూర్చుని త్రీడీ కిటికీలు ఎప్పుడైనా చూశారా? పడక గదిలో నక్షత్ర మండలాన్ని చూశారా? అత్యాధునిక టెక్నాలజీతో ప్రస్తుతం మార్కెట్లోకి త్రీడీ కిటికీలు, తలుపులు, నక్షత్ర మండలం.. ఇలా చాలా అందుబాటులోకి వచ్చాయి. త్రీడీలో సినిమా చూసి అద్భుతమైన అనుభూతిని పొందుతాం. అదే ఇంట్లో త్రీడీ కిటికీలు ఉంటే.. తలుపులు ఉంటే.. నక్షత్రాలు బెడ్రూంలో దర్శనమిస్తే.. ఈ ఊహే మనసును ఎంతో ఉల్లాసపరిచేది ఉంటుంది. డిజిటల్ ప్రింటింగ్ అరంగ్రేటంతో ప్రతీ దృశ్యం మన కళ్ల ముందే ఉన్నట్లుగా ఉంటుంది. మనకు తెలియని కొత్తప్రపంచాన్ని పరిచయం చేస్తున్నట్లు ఉంటుంది. ఇంట్లో కూర్చుని పచ్చని అటవీ అందాలు వీక్షించవచ్చు. సొగసైన జలపాతాలు చూడవచ్చు. క్రికెట్ స్టేడియంలో ఉన్నట్లు ఫీలు కావచ్చు. గోడలపై బీచ్ రోడ్డు పక్కనే ఉన్న కొబ్బరిచెట్లూ పెరుగుతున్నట్లు అనిపించవచ్చు. – సాక్షి, సిటీ బ్యూరోనగరంలో కొత్తగా ఇల్లు కట్టుకునే వారు ప్రస్తుతం మార్కెట్లో న్యూ ట్రెండ్ ఏం నడుస్తుందని ఇంటర్నెట్లో శోధిస్తున్నారు. దేశ, విదేశాల్లో అందుబాటులో ఉన్న ఆధునిక హంగులపై ఆరా తీస్తున్నారు. తమ అభిరుచులకు తగ్గట్లు వస్తువులను ఆర్డర్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే కిటికీలు, తలుపులు, గోడలు, బెడ్రూంలో సరికొత్త డిజైన్లు దర్శనమిస్తున్నాయి. కొంత కాలంగా నచి్చన సీనరీ, చిత్రాలను గోడలకు, విండోస్‌కు స్టిక్కర్ అతికించే పద్ధతి కొనసాగుతోంది.ఇటీవల మరింత అప్‌గ్రేడ్ అయ్యారు. త్రీడీ టెక్నాలజీ ఆ స్థానాన్ని భర్తీ చేస్తోంది. కస్టమైజ్ బ్లైండ్స్, జీబ్రా బ్లైండ్స్, ఉడెన్ బ్లైండ్స్, పీవీసీ బ్లైండ్స్, రోలర్ బ్లైండ్స్ అందుబాటులోకి వచ్చాయి. స్థాయిని బట్టి కనీసం రూ.200 (ఒక అడుగు) నుంచి గరిష్టంగా రూ.500 వరకు అందుబాటులో ఉన్నాయి. సాధారణంగా ఇంట్లోకి రూమల్ బ్లైండ్స్ను ఫ్యాబ్రిక్‌తో తయారు చేస్తున్నారు. కిటికీలు, డోర్లకు పీవీసీ బ్లైండ్స్ వినియోగిస్తున్నారు. ఇంటి యజమాని అభిరుచికి తగ్గట్లు చిత్రాలతో అందుబాటులోకి తెస్తున్నారు. పెద్ద పెద్ద కార్పొరేట్ ఆఫీసుల్లో మాత్రం సంస్థ లోగో, చేసే పనికి సంబంధించిన థీం చిత్రాలను త్రీడీ టెక్నాలజీలో అనుభూతి పొందుతున్నారు.రిలాక్స్.. రిలాక్స్నగరంలో సగటు వ్యక్తులు ఉద్యోగం, వ్యాపారం, ఇతర పనులతో బిజీబిజీగా గడిపేస్తున్నారు. ఇంటికి వచ్చిన తర్వాత మనసుకు ఆహ్లాదకరమైన ప్రదేశంలో కూర్చుని అలా రిలాక్స్ అవుతున్నారు. ఒత్తిడి నుంచి ఒక్కసారిగా ప్రకృతి ఒడిలోకి ఒదిగిపోయి నట్లు ఫీల్ అవుతున్నారు. ప్రశాంతమైన వాతావరణంలో సమయం గడిపేస్తున్నారు. త్రీడీ టెక్నాలజీ ఎంత బాగుందో కదా.వేడుకల్లోనూ ఆ సోయగాలే..త్రీడీ తెరలతో చాలా మంది వేడుకల్ని సైతం సింపుల్‌గా కానిచ్చేస్తున్నారు. ముఖ్యంగా ఓ గంట ఫంక్షన్‌కి పూలు, అలంకరణ అంటే అంత ఖర్చు ఎందుకు దండగ అనుకుని త్రీడీ బ్యాక్‌డ్రాప్ స్క్రీన్స్ కొనుగోలుకు మొగ్గు చూపుతున్నారు. ఒక దఫా కొంటే తర్వాత ఎప్పుడు కావాలంటే అప్పుడు వాడుకోవచ్చు. డెకరేటర్లు చేసిన వేదికల ఫొటోలను యథాతథంగా తెరమీదకి తెచ్చేస్తోంది. దీంతో అలంకరణ ఖర్చు తగ్గుతోంది. పూలు లేకుండానే ఫొటోల్లో పూల అలంకరణ కనిపించేస్తుంది. త్రీడీ మాయతో కనువిందు చేస్తున్నాయి.అప్‌గ్రేడ్ అవుతున్నారు..నగరంలో ఒకే మోడల్ ఎక్కువ రోజులు వినియోగంలో ఉండదు. మారుతున్న కాలంతో పాటే ఇక్కడి ప్రజల అభిరుచులు మారుతున్నాయి. వాల్కి అతికించే ఇమేజ్‌ల నుంచి ప్రస్తుతం త్రీడీ టెక్నాలజీ వరకు ఎప్పటికప్పుడు అప్‌గ్రేడ్ అవుతున్నారు.– దీపక్, డిజైన్ వాల్స్, మియాపూర్ఇవి చదవండి: చాయ్ చమక్..! -
సెలబ్రిటీ మెహందీ ఆర్టిస్ట్ వీణా నగ్దా..ఒక్కో డిజైన్‌కి ఎంత ఛార్జ్ చేస్తారంటే..
పెళ్లిళ్లు, పండుగలు, ఇతర వేడుకల్లో కచ్చితంగా అమ్మాయిల చేతికి ఉండేది మెహిందీ. ఇది లేకుంటే పండుగే లేదన్నంతగా ప్రాముఖ్యత సంతరించుకుంది. కొందరూ మాత్రం ఈ రంగంలో మంచి అందె వేసిన చేయిలా నైపుణ్యం సంపాదిస్తున్నారు. సెలబ్రెటీ స్థాయి మెహిందీ డిజైనర్లుగా పేరు తెచ్చుకుంటున్నారు. అలాంటి క్రేజ్ సంపాదించుకున్నారు వీణ నగ్దా. ఆమె ముంబైలో ప్రముఖ మెహిందీ డిజైనర్లో ఒకరుగా పేరు ప్రఖ్యాతులు గాంచారుఆమె వేసే మెహందీలకు పెద్ద సంఖ్యలో బాలీవుడ్, టాలీవుడ్ హీరోయిన్లు అభిమానులు. తన సృజనాత్మకతో కూడిన కళా నైపుణ్యంతో వేలకొద్దీ అభిమానులను సంపాదించుకున్నారు వీణా. ఆమె వేసే మెహిందీ డిజైన్లు అన్ని చాలా క్లిష్టమైనవే. అదే ఆమె ప్రత్యేకత. మరొకరు అనుకరించడం కూడా కష్టమే. ప్రతీ డిజైన్‌ను విభిన్న కళానైపుణ్యంతో వేస్తారామె. అంతేగాదు ఇటీవల గుజరాత్‌లోని జామ్‌నగర్‌లో రిలయన్స్ దిగ్గజం ముఖేష్ అంబానీ చిన్న కుమారుడు అనంత్-రాధికల ప్రీ వివాహ వేడుకలో కూడా ఆమెనే మెహిందీ డిజైనర్. ముఖేష్, నీతా అంబానీలు ఆమెను పెళ్లికి ఆహ్వానించి మరీ వారి ఇంట జరిగే వివాహ వేడుకకు మెహందీ డిజైనర్‌గా పెట్టుకున్నారు. ఆ వేడుకకు హాజరైన అతిధులకు మెహందీలు పెట్టే బాధ్యత ఈమెదే. అయితే ఇలా డిజైన్ వేసేందుకు పెద్ద మొత్తంలో డబ్బులు ఛార్జ్ చేస్తారట. సాధారణంగా ఒక్కో డిజైన్‌కి చాలా డబ్బులు వెచ్చించాల్సి ఉంటుంది. సాధారణ మెహిందీ ప్రారంభ డిజైనే ఏకంగా రూ. 5,500 నుంచి మొదలవుతుందట. దీపిక పడుకోన్-రణవీర్ సింగ్, కృతి ఖర్బందా-పుల్కిత్ సామ్రాట్ వంటి ప్రముఖల వివాహాల్లో మెహిందీ డిజైనర్ వీణ నగ్దానే. ముంబైలోని ప్రతి ప్రముఖుడు ఇంట జరిగే వేడుకలో ఆమె కచ్చితంగా ఉంటారు. వీణ మెహిందీ డిజైన్లలోని మ్యాజిక్ అలాంటిది మరి. -
మనీష్ మల్హోత్రా : కళ్లు చెదిరే అల్టిమేట్ జ్యుయల్లరీ! (ఫొటోలు)
-
జూన్ 13 : స్పెషాల్టీ ఏంటో తెలిస్తే, వావ్..! అనాల్సిందే!
Sewing Machine Day 2024 జాతీయ కుట్టు మెషీన్ దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం జూన్ 13న జరుపుకుంటారు. ఏంటి ఇదొక డే కూడా ఉందా అని ఆశ్చర్యపోతున్నారా? ఉంది.. దీని కథా కమామిష్షు తెలియాలంటే.. ఈ స్టోరీ చదవాల్సిందే.ఆది మానవుడు ఆకులు, నార వస్త్రాలు కట్టుకుని తిరిగేవాడని చరిత్ర చెబుతోంది. పరిణామ క్రమంలో వస్త్రధారణలో అనేక పరిణామా లొచ్చినప్పటికీ, కుట్టుయంత్రాన్ని తయారు చేయడం విప్లవాత్మకమైన పరిణామమని చెప్పవచ్చు. వీటన్నింటికి మాతృక కుట్టుమెషీన్‌ను కనుగొనడమే. అలా 1790లో కుట్టు మెషీన్ ఆవిష్కరణ సందర్భాన్ని జాతీయ కుట్టు యంత్ర దినోత్సవంగా జరుపుతారు. ఆంగ్ల ఆవిష్కర్త థామస్ సెయింట్ దీనికి పేటెంట్ తీసుకున్నారు. కానీ థామస్ కుట్టు యంత్రం రూపకల్పన ముందుకు సాగలేదు. దీని తొలి నమూనా 1874లో తయారైంది. విలియం న్యూటన్ విల్సన్ అనే వ్యక్తి లండన్‌లోని పేటెంట్ కార్యాలయంలో సెయింట్ డ్రాయింగ్లను గుర్తించారు. ఈ డిజైన్‌కు కొన్ని సర్దుబాట్లు చేసి వర్కింగ్ మోడల్‌ను రూపొందించారు ఈ నమూనా ఇప్పుడు లండన్ సైన్స్ మ్యూజియంలో ప్రదర్శనకు ఉంది. అయితే 1800ల తరువాత కుట్టు యంత్రాలు విస్తృతంగా అందుబాటులోకి వచ్చాయి.ఎలియాస్ హోవే ,ఐజాక్ సింగర్ కుట్టు యంత్రాలను అభివృద్ధి చేసి ప్రాచుర్యంలోకి తెచ్చారు. ఆ తరువాత సామాన్య మానవుడికి కుట్టు మెషీన్లు అందుబాటులో వచ్చాయి. ఆ తరువాత అనేక కంపెనీలకు చెందిన, మెషీన్లు ఆధునిక హంగులతో అందుబాటులోకి వచ్చాయి. విభిన్న డిజైన్లతో ఫ్యాషన్ ప్రపంచం పరుగులు తీయడానికి, కుట్టుకళకు ఇంత ప్రాధాన్యత రావడానికి కారణమైన కుట్టు యంత్రాల ఆవిష్కారం, చరిత్ర గురించి తెలుసు కోవడం చాలా అవసరం. -
విజయవాడ : ఫ్యాషన్ షోలో మెరిసిన ముద్దుగుమ్మలు (ఫొటోలు)
-
కొంగే.. సింగారమాయెనా!
వస్త్రాలంకరణలో ప్రతీ అంశం అందంగా రూపుకట్టాల్సిందే అనే ఆలోచనల్లో నుంచి పుట్టుకు వచ్చిందే కొంగు డిజైన్. చీరకట్టులో కుచ్చిళ్లకు ఎంత ప్రాముఖ్యత ఉంటుందో పల్లూ డిజైనింగ్కీ అంతే ప్రత్యేకత ఉంటుంది. దారాల అల్లికలైనా.. అద్దాల అమరిక అయినా పూసల పనితనమైనా, ప్రింట్ల మెరుపు అయినా కొంగు కొత్తగా సింగారించుకుని వేడుకలలో బంగారంలా మెరిసి΄ోతుంది.రంగు రంగుల ఫ్యాబ్రిక్చీరలోని రంగులతోపోటీ పడుతూ ఉండేలా ఫ్యాబ్రిక్‌తో చేసిన టాజిల్స్ కొంగుకు ప్రధాన ఆకర్షణగా మారుతుంది.దారపు పోగులతో..ఊలు, సిల్క్, జరీ దారాలతో అల్లిన టాజిల్స్ కాటన్ చీరలకూ, పట్టు చీరల కొంగులకు ప్రత్యేక అందాన్ని తీసుకువస్తున్నాయి.పూసల కొంగు..చీర రంగు కాంబినేషన్లో పూసలతో కొంగును డిజైన్ చేస్తే ఆ ప్రత్యేకత గురించి చెప్పడానికి మాటలు చాలవు. అలా డిజైనర్లు తమదైన సృజనకు మెరుగుపెడుతున్నారు. వాటిని ధరించిన వారు వేడుకలలో హైలైట్‌గా నిలుస్తున్నారు.గవ్వలు, అద్దాలుగిరిజన అలంకరణను ఆధునికపు హంగుగా మార్చడానికి గవ్వలు, అద్దాలు, ఊలు దారాల డిజైన్లను కొంగుకు అందంగా సింగారిస్తున్నారు. ఇవి ఎక్కువగా కాటన్ శారీస్ అలంకరణలో చూడవచ్చు. క్యాజవల్ వేర్‌గా నప్పే చీరలు ఈ డిజైన్ వల్ల ప్రత్యేకంగా కనిపిస్తున్నాయి.కుచ్చుల కొంగుచందేరీ, నెటెడ్ మెటీరియల్‌తో చీరకు జత చేసిన కొంగు కుచ్చుల అమరికతో వెస్ట్రన్ ΄ార్టీ వేర్‌గా అలరిస్తుంది. అమ్మాయిలను అమితంగా ఈ తరహా డిజైన్స్ ఆకట్టుకుంటున్నాయి.రెడీమేడ్..సాదా సీదాగా కనిపించే చీర కొంగు డిజైన్‌ను మార్చాలనుకుంటే మార్కెట్లో రెడీమేడ్ పల్లూ డిజైన్స్ లభిస్తున్నాయి. హ్యాండ్ ఎంబ్రాయిడరీ, మగ్గం వర్క్, పూసలు, దారాల అల్లికలతో ఉన్న పల్లూ డిజైన్స్‌ని తెచ్చి చిన్న కుట్టుతో కొంగును కొత్తగా మెరిపించవచ్చు.ఇవి చదవండి: ‘దేశీ థ్రిల్’ మ్యూజిక్ బ్యాండ్‌లోని ఈ ముగ్గురి పాట.. వావ్ అనాల్సిందే..! -
లాక్మే ఫ్యాషన్ వీక్ 2024 : ప్రముఖ డిజైనర్లు, మోడల్స్ సందడి
ముంబైలోని బాంద్రా కుర్లా కాంప్లెక్స్ (BKC)లోని జియో వరల్డ్ కన్వెన్షన్‌లో ఐదు రోజుల లాక్మే ఫ్యాషన్ వీక్ 2024 అట్టహాసంగా ప్రారంభమైంది. ప్రముఖ భారతీయ డిజైనర్లు రాజేష్ ప్రతాప్ సింగ్, అనామికా ఖన్నా, JJV కపుర్తలా, అనుశ్రీ రెడ్డి, గౌరీ , నైనికా , శాంతను నిఖిల్ తమ డిజైన్లతో సందడి చేయనున్నారు. అకారో, గీషా డిజైన్స్, కల్కి ,IRTH వంటి స్వదేశీ బ్రాండ్లను కూడా ఇక్కడ చూడొచ్చు. మహాలక్ష్మి రేస్ కోర్స్ వంటి వివిధ ప్రదేశాలలో ఆఫ్-సైట్ కొన్ని షోలను కూడా ప్లాన్ చేశారు నిర్వాహకులు. మార్చి 13 నుంచి మొదలైన ఈ ఫ్యాషన్ వీక్ మార్చి 17వరకు మోడల్స్ పలు బ్రాండ్లను ప్రదర్శిస్తారు. -
ప్రాణ ప్రతిష్టలో ప్రత్యేక ఆకర్షణగా అలియా భట్ చీర..ఏకంగా..!
అయోధ్యలో 500 ఏళ్ల నిరీక్షణకు తెరతీస్తూ బాలరాముడి ప్రాణ ప్రతిష్ట ప్రధాన నరేంద్ర మోదీ చేతుల మీదుగా అంగరంగ వైభవంగా జరిగిన సంగతి తెలిసిందే. అయితే అయోధ్యలోని ఈ కార్యక్రమంలో ప్రముఖులు సెలబ్రెటీలు పెద్ద ఎత్తున తరలివచ్చి మరీ పాలు పంచుకున్నారు కూడా. ఈ వేడుకలో బాలీవుడ్ నటి అలియా భట్ నీలిరంగు మైసూర్ చీర తళక్కుమన్న సంగతి తెలిసిందే. ఆమె భర్త కూడా ఈ మహోత్సవంలో చక్కగా సంప్రదాయ దుస్తుల్లో కనిపించి సందడి చేశారు. అయితే అలియా కట్టుకున్న చీర ఇప్పుడూ ఓ సెన్సేషన్‌గా మారింది. నెట్టింట ఈ విషయం గురించే హాట్‌టాపిక్‌గా మాట్లాడుకుంటున్నారు. అందుకు కారణం ఆమె చీరపై రామాయణ ఇతీహసంలోని దృశ్యాలు చిత్రించడమే. ఇంత ప్రత్యేకతతో కూడిన చీరనా! ఆమె కట్టుకుంది? అని అందరూ ఆశ్చర్యపోతున్నారు!. పైగా ఆలియా సో గ్రేట్ అని పొగడ్తల జల్లు కురిపిస్తున్నారు అభిమానులు. అంతేగాదు అలియానే ఇన్‌స్ట్రాగ్రామ్ వేదికగా తాను ధరించిన ఆ చీర గురించి వివరించింది. అద్దం ముందు దిగిన సెల్ఫీ ఫోటోను జత చేసి మరీ ఆ చీర విశేషాలను పంచుకుంది. ఆ చీరపై రామాయణంలోని ముఖ్యమైన దృశ్యాలు రామసేతు, హనుమాన్, రాముడు శివ ధనుస్సును బద్దలు కొట్టడం, రాముడి వనవాసం, గంగానదిపై వంతెన, బంగారు జింక, సీతను అపహరించడం.. తదితర ఘట్టాలను చిత్రీకరించారు. అందుకు దాదాపు 100 గంటలకు పైగా సమయం తీసుకుందని చెప్పుకొచ్చింది. అయితే ఈ చీర పల్లు మొత్తం చేత్తో డిజైన్ చేసింది కావడం విశేషం. ఇక ఆమె ఈ కార్యక్రమంలో భర్త రణబీర్ కపూర్ తెల్లటి కర్తా పైజామా ధరించి ఒక తెల్లటి శాలువా కప్పుకున్నారు. కాగా, అలియా సంప్రదాయాన్ని గౌరవించేలా ఇలా రామాయణం ఇతివృత్తంతో కూడిన చీరను ధరించడంతో సోషల్ మీడియాలో నెటిజన్లు ఆమెపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. View this post on Instagram A post shared by Ami Patel (@stylebyami) (చదవండి: ప్రాణ ప్రతిష్ట వేళ సెలబ్రెటీలు ఎలాంటి కాస్ట్యూమ్స్ ధరించారంటే..!) -
పిచ్చెక్కిస్తున్న దీని డిజైన్..SUVలకు విపత్తుగా మారుతోంది..!
-
'స్పేస్ మీల్': వ్యోమగాముల కోసం ప్రత్యేక భోజనం!
అంతరిక్ష రహస్యాలను ఛేదించడానికి వ్యోమగాములు (అస్ట్రోనాట్స్) శ్రమిస్తుంటారు. ఇందుకోసం సుదీర్ఘకాలం గగనతలంలోనే ఉండాల్సి వస్తుంది. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం(ఐఎస్ఎస్), నాసా స్పేస్ షటిల్స్‌లో వ్యోమగాములు నెలల తరబడి గడపాల్సి ఉంటుంది. ప్రయోగాల్లో భాగంగా కొన్నిసార్లు సంవత్సరానికిపైగానే అంతరిక్షంలో ఉండిపోవాలి. పైగా భూమిపై గురుత్వాకర్షణ శక్తి ఉన్నట్లుగా అక్కడ ఎలాంటి గురుత్వాకర్షణ శక్తి ఉండదన్న సంగతి తెలిసిందే. ఇలా స్పేస్‌లో ఉండే వ్యోమగాములకు సరైన పోషకాలతో కూడిన ఆహారం ఇవ్వడం కష్టంగా ఉంది. దీనిపై శాస్త్రవేత్తలు పలుపరిశోధనలే చేశారు. ఆ సమస్యకు చెక్ పెడుతూ ఆ గురుత్వాకర్షణ శక్తికి అనుగుణంగా ఉండేలా మంచి ఆహారాన్ని తయారు చేశారు శాస్త్రవేత్తలు. ఆ ఆహారం ప్రత్యేకత ఏంటీ? తదితర విశేషాలు తెలుసుకుందాం!. స్పేస్ ట్రావెలర్స్ అంతరిక్షంలో అన్ని రోజులు ఉంటే వారి ఆరోగ్యంపై పలు ప్రభావాలు ఉంటాయని విన్నాం. అయితే ఇప్పటి వరకు వారికి సరైన ఆహారం అందించడంలో శాస్త్రవేత్తలు విఫలమవుతూ వస్తున్నారు. ఇంతవరకు వారికి ప్రిజర్వేటడ్ ప్యాక్ చేసిన ఆహారాలను మాత్రమే ఇస్తున్నారు. అయితే అవి స్పేస్‌లోకి వెళ్లాక చప్పగా అయిపోవడం జరగుతోంది. దీంతో ఈ వ్యోమగాములకు సరైన పోషకాలతో కూడిన ఆహారం అందక పలు ఆరోగ్య సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తోంది. అయితే ఆ సమస్యకు చెక్‌పెడుతూ ఏసీఎస్ ఫుడ్ సైన్స్ అండ్ టెక్నాలజీ "ఆప్టిమల్ స్పేస్ మీల్" అనే శాఖాహార సలాడ్ని కనిపెట్టింది. ఇది అక్కడ ఉండే వ్యోమగాములకు అన్ని రకాల పోషకాహారాన్ని అందించడంలో సహాయపడుతుంది. నిజానికి స్పేస్‌లో ఉండే వ్యోమగాములకు భూమిపై ఉండే మానువుల కంటే ఎక్కువ కేలరీలను బర్న్ చేస్తారు. జీరో మైక్రోగ్రావిటీలో ఎక్కువ సేపు గడుపుతారు కాబట్టి వారికి కాల్షియం వంటి అదనపు సూక్ష్మపోషకాలు అవసరం అవుతాయి. వారికీ ఈ ప్రత్యేకమైన ఫుడ్ ఆ లోటుని భర్తి చేస్తుందని నిపుణులు చెబుతున్నారు. దీర్ఘకాలం స్పేస్ మిషన్‌లో ఉండేవారికి మంచి ఆహారాన్ని అందించేలా నిపుణులు ప్రయత్నిస్తున్నారు. అందులో భాగంగానే ఈ భోజనాన్ని తయారు చేశారు. దీనిలో తాజా ఆకుకూరలకు ప్రాధాన్యత ఇచ్చారు. అలాగే వారికి అందించే శాకాహార పంటలను తక్కువ నీరు, తక్కువ ఎరువులతో పండించాలని అన్నారు. పరిశోధకులు ఈ "స్పేస్ మీల్"ని సోయాబీన్స్, గసగసాలు, బార్లీ, కాలే, వేరుశెనగ, చిలగడదుంప, పొద్దుతిరుగుడు విత్తనాలు వంటి వాటితో తయారు చేశారు. ఈ శాకాహార భోజనంతో వ్యోమగాములకు గరిష్ట పోషాకాలు అందడమే గాక సమర్థవంతమైన సమతుల్య ఆహారమని చెబుతున్నారు పరిశోధకులు. ఈ భోజనాన్ని భూమిపై ఉన్న వారికి ఇవ్వగా చక్కటి ఫలితం వచ్చిందని అన్నారు. అందువల్ల స్పేస్‌లో ఉండే వారికి ఇది మంచి మీల్ అని నమ్మకంగా చెప్పొచ్చు అని అన్నారు. (చదవండి: మసాలా దినుసులు ఘాటు పోకూడదంటే..ఇలా స్టోర్ చేయండి!) -
Ayodhya Ram Mandir: అయోధ్య ఆలయ నిర్మాణంలో హైదరాబాదీలు
తండ్రీ కొడుకుల ఆప్యాయతకు.. అన్నదమ్ముల అనుబంధానికి.. ఆలూమగల అనురాగానికి.. ధర్మానికి నిలువెత్తు ప్రతిరూపం శ్రీరామ చంద్రుడు. ఆ దైవాంశ సంభూతుడికి ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్యలో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న రామమందిర నిర్మాణ వైభవం, కళాత్మకత, నగిషిల రూపకల్పన తదితర అంశాలపై యావత్ దేశంతో పాప్రపంచమంతా చర్చించుకుంటోంది. అయోధ్య రామమందిరం ఈ నెల 22న అత్యంత వైభవోపేతంగా ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో ఆలయ నిర్మాణంలో భాగస్వాములయ్యారు కొందరు నగరవాసులు. ప్రధానంగా అయోధ్య రామమందిర ద్వారాల రూపకల్పన చేసే అరుదైన అవకాశం నగరంలోని బోయిన్‌పల్లికి చెందిన అనురాధ టింబర్స్కు దక్కింది. శ్రీరాముని పాదుకల తయారీ కూడా నగరం వేదికగానే జరగడం విశేషం. రామ మందిర అక్షింతలను ప్రతి ఇంటికీ చేర్చడం వంటి పలు కార్యక్రమాల్లోనూ నగరం తన ప్రత్యేకతను చాటుకుంది. అయోధ్య వేదికగా 1990, 1992లలో చేపట్టిన పరిక్రమలో సైతం ఇక్కడి నుంచి భారీ సంఖ్యలో కరసేవకులు పాల్గొన్నారు. ఆనాటి నుంచే కొనసాగుతున్న అయోధ్యతో సంబంధం ప్రస్తుత రామ మందిర నిర్మాణంలోనూ భాగ్యనగరం తన పాత్ర పోషించింది. ఆ విశేషాల సమాహారమే ఈ కథనం. గతంలోనే సుప్రసిద్ధ అనంత శేష శయన మహా విష్ణు కళాఖండాన్ని సృష్టించిన అనురాధ టింబర్స్ ఆధ్వర్యంలో అయోధ్య రామమందిర ద్వారాల రూపకల్పన చేపట్టారు. స్తపతి కుమారస్వామి రమేశ్ ఆధ్వర్యంలో 60 మంది కళాకారులు ఆరు నెలలుగా శ్రమిస్తూ అయోధ్య రామమందిర ద్వారాలను రూపొందిస్తున్నారు. గతంలో యాదాద్రి, రామేశ్వరం వంటి ఆలయాలకు ప్రధాన ద్వారాలను అనురాధ టింబర్స్ రూపొందించింది. ఇంతటి అరుదైన ఘనత సాధించిన అనురాధ టింబర్స్ నిర్వాహకులు శరత్‌బాబు, కిరణ్ కుమార్‌లను సాక్షాత్తూ రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ స్వయంగా వచ్చి అభినందించడం గమనార్హం. పరిక్రమ కోసం ప్రాణాలే పణంగా.. 1990లో అయోధ్యలో తలపెట్టిన మొదటి పరిక్రమలో ప్రాణాల్ని సైతం పణంగా పెట్టి పాల్గొన్నాం. దీని కోసం నగరం నుంచి ఆలె నరేంద్ర నేతృత్వంలో ప్రత్యేక బృందం పాల్గొంది. పరిక్రమ తేదీ కన్నా ముందే అయోధ్యకు చేరుకోవాలని రైలులో ప్రయాణిస్తున్న మమ్మల్ని మధ్యప్రదేశ్‌లో ఆపేశారు. అక్కడి నుంచి వారణాసికి మళ్లీ ప్రయాణించాం. కరసేవకుల సమాచారం ముందే తెలుసుకుని అక్కడ కూడా అడ్డుకోవడంతో నేపాల్ సరిహద్దుల్లోని అడవుల్లో తలదాచుకున్నాం. ఈ ప్రయాణంలో భాగంగా లాఠీచార్జ్‌లు, ఫైరింగ్‌లు, వాటర్ ఫైరింగ్‌లను ఎదుర్కొన్నాం. ఒకానొక సమయంలో అరెస్టు చేసి లక్నో జైలులో నిర్బంధించారు. అక్కడి నుంచి తప్పించుకున్న నన్ను మళ్లీ అరెస్టు చేసి వారణాసి నైనీ జైలులోనూ (సుభాష్ చంద్రబోస్‌ను ఉంచిన కారాగారం) నిర్బంధించారు. నేను 30 ఏళ్ల వయసులో మా పోరాటం ఇప్పుడు సఫలీకృతం కావడం మహదానందం. – నాయిని బుచ్చి రెడ్డి, అప్పటి కరసేవకుడు మాది సాంకేతిక సహకారం మాత్రమే.. రామాలయ ప్రధాన ద్వారాల రూపకల్పనలో తాము సాంకేతిక సహకారం మాత్రమే అందిస్తున్నాం. అయోధ్య ట్రస్టు మార్గదర్శకత్వంలో టాటా కన్సలి్టంగ్ ఇంజినీరింగ్, ఎల్అండ్టీ సంస్థల సమన్వయంతో కలపతో చేసిన తలుపుల పనుల్లో భాగస్వాములమయ్యాం. తమిళనాడులోని మహాబలిపురం ప్రాంతానికి చెందిన స్తపతి కుమార స్వామి రమేశ్ బృందం ఆధ్వర్యంలో ఆరు నెలలుగా అయోధ్య ఆలయ ప్రాంగణంలోనే తలుపుల తయారీ చేయిస్తున్నాం. తొలుత 18 ప్రధాన ద్వారాలకు తలుపులు తయారు చేశాం. అనంతరం మరో 100కు పైగా అంతర్గత ద్వారాలకూ తలుపులు రూపొందిస్తుం. – శరత్ బాబు, అనూరాధ టింబర్స్ నిర్వాహకులు రఘురాముడి పాదుకల తయారీలో.. ►సాధారణ ఇత్తడి బిందెలు తయారు చేసే పిట్లంపల్లి రామలింగాచారి నిబద్ధతతో కూడిన శిల్పిగా మారి అయోధ్య రామ మందిరంలో శ్రీరాముని పాదుకలను తయారు చేసే అవకాశాన్ని పొందారు. అయోద్య శ్రీరాముని పాదుకలు 12 కిలోల 600 గ్రాముల పంచలోహాలతో తీర్చిదిద్దారు. వాటిపై బంగారు తాపడం చేశారు. నిత్యం నిగనిగలాడేలా పాదుకలపై శంకు, చక్రం, శ్రీరాముని బాణం, దేవాలయంపై ఉండే జెండా వంటివి ఏర్పాటు చేసి ఎంతో ఆకర్షణీయంగా తీర్చిదిద్దారు. ఒక్కో పాదుక 6.3 కిలోలు ఉండేలా తయారు చేశారు. 12 తులాలకు పైగా బంగారు తాపడం చేశారు. వందేళ్లకు పైగా పాదుకలు చెక్కు చెదరకుండా తయారు చేయడంలో రామలింగాచారి సఫలీకృతుడయ్యారు. 1987లో బెంగళూరులోని రీజినల్ డిజైన్ అండ్ టెక్నికల్ డెవలప్మెంట్ సెంటర్లో రెండేళ్లు లోహ శిల్ప విద్యలో పట్టా అందుకున్న ఆయన.. 1993లో ఓల్డ్ బోయిన్పల్లి డివిజన్లోని హస్మత్‌పేటలో శ్రీ మది్వరాట్ కళా కుటీర్‌ను ఏర్పాటు చేసుకుని లోహ శిల్పాల తయారీలో నిమగ్నమయ్యారు. ► అద్భుతమైన కళా నైపుణ్యంతో దేవతా మూర్తులు, గాలి గోపురాలు, కంఠాభరణాలు, నాగాభరణాలు, మండపాల నిర్మాణాలు రూపొందించడంలో నిష్ణాతులుగా మారారు. రామలింగాచారి పనితనం తెలుసుకుని భాగ్యనగర సీతారామ సేవా ట్రస్ట్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు చర్ల శ్రీనివాస శాస్త్రి అయోధ్య రామాలయంలోని గుర్భగుడిలో ఏర్పాటు చేసే శ్రీరాముని పాదుకలను తయారీ పనులను ఆయనకు ప్రత్యేకంగా అప్పగించారు. 25 రోజుల పాటు నియమ నిష్టలతో ఎంతో శ్రమకోర్చి పాదుకలను తయారు చేశారు రామలింగాచారి. అయోధ్య శ్రీ రాముని పాదుకలతో వెలుగులోకి వచి్చన రామలింగాచారికి అమెరికాలో నిర్మిస్తున్న లక్ష్మీ నరసింహ స్వామి దేవాలయానికి మూల విరాట్లు, కలశాలు, మకర తోరణాలు, గాలిగోపురాలు వంటివి రూపొందించే అవకాశం వచి్చంది. విశ్వకర్మలకూ నంది అవార్డులివ్వాలి.. ఉగాదిని పురస్కరించుకుని సినిమా వాళ్లకు ఇస్తున్న నంది అవార్డుల మాదిరిగానే శిల్పాలను సృష్టిస్తున్న విశ్వకర్మలకు అవార్డులను అందిస్తే మరింత బాధ్యతగా శిల్పాలను సృష్టించగలుగుతారు. కళాకారుల శ్రమను గుర్తించి మరింత ప్రోత్సహించేలా ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలి. – రామలింగాచారి, లోహశిల్పి ఇదో మహదావకాశం.. చారిత్రక అయోధ్య రామాలయ ద్వారాల రూపకల్పన అవకాశం దక్కడాన్ని అదృష్టంగా భావిస్తున్నా. మహాబలిపురంలోని ప్రభుత్వ కళాశాలలో ఎనిమిదేళ్ల పాటు శిల్పశా్రస్తాన్ని నేర్చుకుని 2000 సంవత్సరంలో డిగ్రీ పొందా. 20 ఏళ్లుగా అనురాధ టింబర్స్తో కలిసి పనిచేస్తున్నా. 2005లో రామేశ్వరం దేవాలయ ద్వారాలు రూపొందించాం. 2008లో కాంచీపురం ఏకాంబేశ్వరన్ టెంపుల్ రథాన్ని తయారు చేశాం. 2015లో శ్రీరంగం దేవాలయంలో కలప పనులు చేశాం. 2019లో మలేసియాలోని మురుగన్ టెంపుల్ బంగారు రథం, 2020లో లండన్‌లోని ధనలక్ష్మి దేవాలయ బంగారు రథం, 2021లో జర్మనీలోని గణేశ్ దేవాలయం, యాదాద్రి లక్ష్మీ నరసింహ స్వామి ఆలయంలో కలప పనులు చేశాం. – స్తపతి కుమార స్వామి రమేశ్ -
యాపిల్‌కు మరో భారీ షాక్!
ప్రముఖ టెక్ దిగ్గజం యాపిల్‌కు మరో భారీ షాక్ తగిలింది. ఈ ఏడాదిలో ఇప్పటి వరకు డజనకు పైగా సీనియర్ ఉద్యోగులు ఆ సంస్థకు రాజీనామా చేశారు. తాజాగా, యాపిల్ సీనియర్ డిజైనర్ పీటర్ రస్సెల్ క్లార్క్ బయటకు వచ్చారు. ఆ సంస్థలో పనిచేస్తున్న సీనియర్ డిజైనర్లలో ఈయన ఒకరు. బ్లూమ్ బెర్గ్ నివేదిక ప్రకారం.. క్లార్క్ యాపిల్ కంపెనీలో ప్రముఖ డిజైనర్. ముఖ్యంగా యాపిల్ ప్రొడక్ట్‌లు ఐమాక్,ఐపాడ్ నానో,మాక్ బుక్ ప్రో, మాక్ బుక్ ఎయిర్ తో పాటు ఇతర ప్రొడక్ట్లలోని హార్డ్వేర్లను డిజైన్ చేయడంలో కీలక పాత్ర పోషించారు. అంతేకాదు యాపిల్ హెడ్ క్వార్టర్స్, ఇతర యాపిల్ రీటైల్ స్టోర్ల డిజైన్లలో పీటర్ రస్సెల్ క్లార్క్ భాగస్వామ్యం ఉంది. యాపిల్ కంపెనీలో సుమారు 1000కి పైగా పెటెంట్ రైట్స్ క్లార్క్ పేరుమీదే ఉన్నాయి. అలాంటి డిజైనర్ కుపెర్టినో దిగ్గజం కోల్పోవడం పెద్ద ఎదురు దెబ్బేనని టెక్నాలజీ నిపుణులు చెబుతున్నారు. ఇక, ఈ ఏడాది అక్టోబర్‌లో యాపిల్‌కు రిజైన్ చేసిన క్లార్క్ స్పేస్ టెక్నాలజీ కంపెనీ వాస్ట్లో చేరనున్నట్లు తెలుస్తోంది. ఆ కంపెనీ తయారు చేసే ప్రొడక్ట్‌లపై సలహాలు ఇచ్చేలా సలహాదారుగా బాధ్యతలు చేపట్టనున్నారు. క్లార్క్ మాత్రమే కాదు ప్యాషన్ కోసం యాపిల్ విడిచి పెట్టిన వారిలో జోనీ ఐవ్‌తో సహా అనేక ఇతర ఆపిల్ డిజైనర్లు 2019లో తన స్వంత డిజైన్ కంపెనీ లవ్ఫ్రమ్ని స్థాపించడానికి యాపిల్‌కి గుడ్‌బై చెప్పారు. ఐవ్ యాపిల్‌లో 1992 నుండి 2019 వరకు 27 సంవత్సరాలు పని చేశారు. 1990ల చివరిలో యాపిల్ ప్రొడక్ట్ డిజైన్ విభాగానికి సీనియర్ వైస్ ప్రెసిడెంట్‌గా పదోన్నతి పొందారు. ఆ తర్వాత 2015లో చీఫ్ డిజైన్ ఆఫీసర్‌గా బాధ్యతలు చేపట్టి జూలై 2019లో కంపెనీని విడిచిపెట్టారు. -
ఏడాది పీజీ కోర్సులు
సాక్షి, అమరావతి: దేశంలో తొలిసారిగా ఏడాది పీజీ కోర్సును పీజీ డిప్లొమా పేరుతో అందించేందుకు యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ ప్రతిపాదించింది. నూతన జాతీయ విద్యా విధానంలో భాగంగా పీజీ కోర్సుల కాలపరిమితి, క్రెడిట్స్, కరిక్యులమ్‌తో కూడిన కొత్త నిబంధనల ముసాయిదాను రూపొందించింది. ఇందులో పీజీ కోర్సులను మూడు విధాలుగా డిజైన్ చేసింది. ఏడాది, రెండేళ్ల పీజీ, సమీకృత ఐదేళ్ల పీజీ ప్రోగ్రామ్‌లను తీసుకొస్తోంది. ఆనర్స్–రీసెర్చ్ కాంపోనెంట్‌తో నాలుగేళ్ల బ్యాచిలర్ డిగ్రీ పూర్తి చేసిన విద్యార్థులు ఏడాది మాస్టర్స్ ప్రోగ్రామ్ చేయొచ్చు. మూడేళ్ల బ్యాచిలర్ డిగ్రీ చేసిన విద్యార్థులు రెండేళ్ల పీజీ ప్రోగ్రామ్‌ను కొనసాగించవచ్చు. ఇక్కడ పీజీలో రెండో సంవత్సరం పూర్తిగా పరిశోధనపై దృష్టి సారించేలా కరిక్యులమ్‌లో మార్పులు చేసింది. పీజీ మొదటి సంవత్సరం తర్వాత ప్రోగ్రామ్ నుంచి విద్యార్థులు వైదొలగాలి అనుకుంటే వారికి పీజీ డిప్లొమా అందిస్తుంది. ఇక సమీకృత ఐదేళ్ల బ్యాచిలర్, మాస్టర్స్ ప్రోగ్రామ్ పెట్టాలని యూడా యూజీసీ సూచించింది. నచ్చిన సబ్జెక్ట్‌లో పీజీ నాలుగేళ్ల యూజీ ప్రోగ్రామ్‌లో ఒక విద్యార్థి భౌతికశాస్త్రం మేజర్‌గా, ఆర్థిక శాస్త్రం మైనర్ సబ్జెక్టుగా తీసుకుంటే.. కొత్త విధానం ప్రకారం ఈ విద్యార్థి మేజర్, మైనర్లో దేనిలోనైనా పీజీలో చేరవచ్చు. మరోవైపు ఒకేసారి రెండు పీజీ కోర్సులు అభ్యసించే సౌలభ్యాన్ని కూడా యూజీసీ కలి్పస్తోంది. ఇందు కోసం ఆన్లైన్/ఆఫ్‌లైన్/దూరవిద్య లేదా ఆన్లైన్, ఆఫ్‌లైన్ మోడ్లతో ఏర్పడిన హైబ్రీడ్ విధానాల్లో చదువుకునేలా ప్రతిపాదించింది. మెషిన్ లెర్నింగ్, మల్టిడిసిప్లినరీ ఫీల్డ్ వంటి కోర్ ఏరియాలలో కృత్రిమ మేధ కాంబినేషన్లో వ్యవసాయం, వైద్యం, న్యాయ విద్యలో పోస్ట్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్‌లను అందించాలని సిఫార్సు చేసింది. ఇక స్టెమ్ సబ్జెక్టులు అభ్యసించిన విద్యార్థులు సైతం ఎంఈ, ఎంటెక్ వంటి సాంకేతిక డిగ్రీల్లో ‘ఏడాది పీజీ’లో చేరేందుకు అర్హులని ప్రకటించింది. ఈ అంశాలపై వివిధ వర్గాలు, పౌరుల నుంచి అభిప్రాయం సేకరిస్తున్నట్టు యూజీసీ తెలిపింది. -
వీల్‌ఛైర్ యూజర్లకు సరికొత్త కారు డిజైన్.. ఆనంద్ మహీంద్రా ట్విట్ వైరల్
వీల్‌ఛైర్ వినియోగదారులు కారును ఉపయోగించడం ఇబ్బందితో కూడుకుని ఉంటుంది. ప్రస్తుతం మార్కెట్లో ఉన్న కార్లు వారికోసం ప్రత్యేకంగా డిజైన్ చేయలేదు కాబట్టి.. మరొకరి సహాయం అవసరమవుతుంది. కానీ ప్రస్తుతం సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్ అవుతుంది. ఈ వీడియో వీల్ ఛైర్ వినియోగదారులు కారు ఉపయోగించే సమస్యలను పరిష్కరిస్తుంది. ఈ వీడియో వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్రాను అమితంగా ఆకర్షించింది. Super smart & super useful design. Would fill me with pride if our vehicles could offer these fitments. But it’s hard for an auto OEM engaged in mass production to do. Need a startup engaged in customisation. I would willingly invest in such a startup https://t.co/uoasAKjaZd — anand mahindra (@anandmahindra) November 10, 2023 "సూపర్ స్మార్ట్. ఉపయోగకరమైన డిజైన్. మా వాహనాలు ఈ ఫిట్మెంట్లను అందించగలిగితే నేను ఎంతో గర్వంగా భావిస్తాను. కానీ భారీ ఉత్పత్తిలో నిమగ్నమైన సంస్థలకు అలా చేయడం కష్టం. ఇందుకు స్టార్టప్ అవసరం. అలాంటి స్టార్టప్‌లకు నేను తప్పకుండా పెట్టుబడి పెడతాను." అని ఆనంద్ మహీంద్రా ఈ వీడియోను షేర్ చేశారు. ఆనంద్ మహీంద్రా షేర్ చేసిన ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. వీల్‌ఛైర్ వాడేవారికి కూడా కొత్త డిజైన్లను తీసుకురావాలనే ఆలోచనపై హర్షం వ్యక్తం చేశారు. వీడియోలో చూపిన కారు డిజైన్‌ను ప్రశంసించారు. అలాంటి స్టార్టప్‌లు ముందుకు రావాలని కోరారు. వీల్‌ఛైర్ వినియోగదారులు కూడా ఎవరి సహాయం లేకుండా కారులో ప్రయాణించాలని ఆకాంక్షించారు. ఇదీ చదవండి: ఇదేందయ్యా ఇది.. రోడ్డుపై వెళ్తున్న కారును ఢీకొన్న విమానం.. వీడియో వైరల్ -
కలల సౌధాన్ని డిజైన్ చేస్తాను!
‘ప్రతి ఇంటికీ ఒక వ్యక్తిత్వం ఉంటుంది.ఇంటి యజమానిప్రాధాన్యతలకు అనుగుణంగా ఆ ఇంటి డిజైనింగ్ ఉండాలి. వారి కలల సౌధాన్ని కళ్ల ముందు నిలపడానికి నేనెప్పుడూ సిద్ధంగా ఉంటాను’ అని తన గురించి, తన ప్రాజెక్ట్స్ గురించి వివరించారు ఇటీవల ముంబయ్ నుంచి హైదరాబాద్ వచ్చిన ప్రోఫెషనల్ ఇంటీరియర్ డిజైనర్ షబ్నమ్ గుప్త. 48 ఏళ్ల షబ్నమ్ గుప్త 16 ఏళ్ల వయసు నుంచే ఈ రంగంలోకి వచ్చానని వివరించింది. ఆమె డిజైన్స్ సెలబ్రిటీల ఇళ్లకు మాత్రమే పరిమితం కాలేదు. అపార్ట్మెంట్లు, ఫామ్‌హౌజ్‌లు, హాస్పిటల్స్ నుంచి మట్టితో కట్టిన చిన్న రూమ్‌లను కూడా తన విలక్షణమైన శైలితో ఆవిష్కరిస్తుంటారు. తనే ఇన్నేళ్ల ప్రయాణం గురించి షబ్నమ్ వివరిస్తూ.. ‘‘నా జీవితంలో అత్యంత ప్రభావాన్ని కలిగించే వ్యక్తులు ఎవరైనా ఉన్నారంటే అది మా అమ్మానాన్నలు, మా వారు. వాళ్లతో చేసే చర్చలు నాలో ఇంకా స్థిరత్వానికీ, ఎదుగుదలకూ తోడ్పడుతుంటాయి. ఎందుకంటే వాళ్లే నా వర్క్‌లో మొదటి అతిపెద్ద విమర్శకులు. దేనినీ త్వరగా మెచ్చుకోరు. వాళ్లను మెప్పించడం అంటే నేను సూపర్ సక్సెస్ అయినట్టు అనుకుంటాను. అంతగా నా వర్క్‌లో ఇన్వాల్వ్ అవుతాను. మొదటిసారి మా నాన్న ఇల్లు కట్టించినప్పుడు నేను చాలా ఆసక్తి కనబరిచాను. చాలా మార్పులు, చేర్పులు చేశాను. నాన్నగారు కూడా నా సూచనలను చాలా బాగా తీసుకున్నారు. అక్కడి నుంచి ఇంటీరియర్, ఆర్కిటెక్చర్ మీద ఇష్టం ఏర్పడింది. దీంతో ఇంటీరియర్ డిజైనింగ్‌లో డిప్లోమా పూర్తి చేశాను. ముంబయ్ ర హేజా స్కూల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ నుంచి కోర్స్ పూర్తి చేసుకున్నాక సొంతంగాప్రాక్టీస్ మొదలు పెట్టాను. దీనికి ముందు ప్రముఖ ఆర్కిటెక్ట్ తుషార్ దేశాయ్‌తో కలిసి పనిచేయడం ద్వారా డిజైనింగ్‌లో చాలా నైపుణ్యాలను నేర్చుకున్నాను. ఆ తర్వాత ఫిల్మ్ప్రోడక్షన్ హౌజ్‌లో ఒక చిన్న పనితో నా లైఫ్ స్టార్ట్ అయ్యింది. అక్కడ నుంచి నా సొంత లేబుల్ పెరుగుతూ వచ్చింది. నా ఖాతాలో ఆదిత్యా చోప్రా, రాణీ ముఖర్జీ, పరిణీతి చోప్రా.. వంటి చాలా మంది బాలీవుడ్ తారల ఇళ్లు, మీడియా హోజ్లు, హాస్పిటల్స్ డిజైన్ చేసినవి ఉన్నాయి. టీమ్ వర్క్.. డిజైనింగ్‌లో ఎప్పుడూ కొత్త కొత్త ఆవిష్కరణలకు స్పేస్ ఉంటుంది. ఇందులో ప్రకృతి, మన సంప్రదాయం, కళలు అన్నింటినుంచి ప్రేరణ పొందవచ్చు. ఈ డిజైనింగ్‌లో ప్రకృతితో మనకు ఒక అనుబంధం ఏర్పడిపోతుంది. ఏ ఒక్కరి జీవిత ప్రయాణం మరొకరితో పోల్చలేం. చాలామంది విజయాలకు వేర్వేరు అర్థాలు ఉంటాయి. మనం చేసే పనిలో సంతృప్తి పొందితే చాలు. మిగతా ట్యాగ్లు ఏవీ అక్కర్లేదు. వాటిని నేను సీరియస్‌గా తీసుకోను కూడా. ఇప్పటివరకు నా ప్రయాణం ప్రశాంతతను నేర్పింది. చాలా మందితో కలిసి టీమ్ వర్క్ చేయాల్సి ఉంటుంది. దీనివల్ల మానవ సంబంధాలను తెలుసుకునే వీలుంటుంది. మా టీమ్‌తో పనిచేసే సమయంలో చాలా జోవియల్‌గా ఉంటాను. ఎలా అంటే ఒక మానసిక వైద్యుడిలా. ఎప్పుడూ నవ్వుతూ, నవ్విస్తూ ఉండటంతో పనిప్రదేశంలో ఉల్లాసంగా ఉంటాం. పట్టణ, నగర వాసాల నుంచి, గ్రామీణ ఇండ్ల వరకు డిజైన్ చేసినవన్నీ నా జాబితాలో ఉన్నాయి. ఈ రంగంలో మన చేత వర్క్ చేయించుకునేవారితో నమ్మకమైన వాతావరణాన్ని సృష్టించుకోవడం ముఖ్యం. అలాగే, వ్యాపారులతో మంచి సంబంధాలు కలిగి ఉండాలి. ఇదే ఇన్నేళ్ల నా ప్రయాణంలో సాధించిన విజయం అనుకుంటాను. ప్రతిదీ సాధనే.. ఆర్కిటెక్చర్లో భాగంగా దేశమంతా తిరిగాను. ప్రముఖ ఆర్కిటెక్చురల్ప్రాధాన్యమున్న స్థలాలన్నీ సందర్శించాను. అవగాహన చేసుకున్నాను. విదేశాల్లోని కట్టడాలు, ఇంటీరియర్ వర్క్ చూస్తూ ప్రయాణించడంతో ప్రతిదానినీ అర్ధం చేసుకుంటూ, ఇంకాస్త మెరుగైన పనితనాన్ని నా వర్క్‌లో చూపించడం ఎప్పటికప్పుడూ జరుగుతూనే ఉంటుంది. ఏ ఒక్క రోజు ఇంకో రోజుతో పోల్చలేం. చేయాలనుకున్న పనుల జాబితాను టిక్ చేసుకుంటూ వెళ్లడమే. మొదట్లో గందరగోళంగా ఉండేది. తర్వాత ఏ రోజు పనులు ఆ రోజు చేయడం ఒక అలవాటుగా మారిపోయింది. నా జీవనశైలిలో నా మైండ్ స్పేస్‌ను అర్థం చేసుకోవడం చాలా సవాల్‌గా ఉండేది. జీవితంలో ఏదైనా రూపొందించాలనుకున్నప్పుడు అదొకప్రాక్టీస్గా ఉండాలి. క్లయింట్స్ ఇళ్లను డిజైన్ చేయడంలో నా స్కిల్‌ని మాత్రమే చూపించాలి. ఇదీ ఒక బాధ్యతాయుతమైన ఉద్యోగమే. ఇంటీరియర్ డిజైనర్‌గా, ఆర్కిటెక్ట్‌గా ఎక్కువ సమయం సిమెంట్, దుమ్ము కొట్టుకుపోయి పనిలో గడిచిపోతుంటుంది. అయినా నాకంటూ కొంత స్పేస్ ఉంచుకుంటాను. ప్రయాణాలు నాకు ఎప్పుడూ ఇష్టం. ఇది ఎల్లప్పుడూ నన్ను పునరుజ్జీవింపజేస్తుంది. చాలాసార్లు పని నుంచి రిలాక్స్ అవడానికి టూర్స్‌ని ఎంచుకుంటుంటాను. వందల ఇళ్లు డిజైన్ చేసి ఉంటాను. ఎన్నో అవార్డులు ఈ రంగంలో అందుకున్నాను. కానీ, నా ఇంట్లో ఏది ఎలా ఉండాలనే నియమం లేదు. అక్కడంతా నా పిల్లల ఇష్టమే. ఎందుకంటే వారి దగ్గర నేను తల్లిని మాత్రమే. భవిష్యత్తు తరాలకు.. దాదాపు ఇరవై ఏళ్ల క్రితం ది ఆరెంజ్ లేన్ ఆ తర్వాత పీకాక్ లైఫ్ పేరుతో ఇంటీరియర్ స్పేస్‌లను క్రియేట్ చేశాను. హైదరాబాద్‌లో కోషా పేరుతో వింటేజ్ స్టైల్ ఫర్నీచర్‌ను లాంచ్ చేశాను. ఇంటీరియర్ డిజైనింగ్‌లో వింటేజ్ స్టైల్ ఇప్పుడు బాగా ట్రెండ్‌లో ఉంది. దేశంలోని ఇతరప్రాంతాల నుంచి ముఖ్యంగా రాజస్థాన్, గుజరాత్‌లలోని అతిప్రాచీన కళా ఖండాలను సేకరించడం, వాటిని రీ మోడలింగ్ చేసి, నేటి తరానికి అందించడంలో నాటి కళను భవిష్యత్తు తరాలకు తీసుకెళుతున్నామనే సంతృప్తి కలుగుతుంది. ఇక నా వ్యక్తిగత విషయానికి వస్తే ప్రయాణాలు అంటే ఎంత ఇష్టమో వ్యక్తిగత అలంకరణ కూడా అంతే ఇష్టం. నా వ్యక్తిగత అలంకరణ కొంచెం బోహో స్టైల్లో ఉంటుంది. ఇది స్వేచ్ఛా, స్ఫూర్తిలకు ప్రతీకగా ఉంటుంది. ఎదుటివారు మనల్ని పరిశీలనగా గమనించేంత ప్రత్యేకంగా ఉంటాయి’ అని నవ్వుతూ వివరించారు షబ్నమ్. – నిర్మలారెడ్డి, ఫొటో: ఎస్.ఎస్.ఠాకూర్ -
2035 నాటికి ట్రిలియన్ డాలర్లు
న్యూఢిల్లీ: భారత ఆటోమొబైల్ రంగం 2035 నాటికి ఎగుమతి ఆధారిత ట్రిలియన్ డాలర్ పరిశ్రమగా ఎదిగే అవకాశం ఉందని ఆర్థర్ డి లిటిల్ నివేదిక పేర్కొంది. తయారీ, ఆవిష్కరణలు, సాంకేతికత తోడుగా పరిశ్రమ ఈ స్థాయికి చేరుకుంటుందని తెలిపింది. ‘భారత వాహన పరిశ్రమ అంతర్జాతీయ మార్కెట్లకు డిజైన్, అభివృద్ధి, ఉత్పత్తికి ఆకర్షణీయ ప్రపంచ కేంద్రంగా మారవచ్చు. దీనిని సాధించడానికి ఈ రంగంలోని కంపెనీలు ప్రపంచ తయారీకి అనుగుణంగా తమ సామర్థ్యాలను విశ్వసనీయ, పోటీతత్వంగా మెరుగుపర్చుకోవాలి. జోనల్ ఆర్కిటెక్చర్, అడ్వాన్స్డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్స్ వంటి కొత్త సాంకేతికతలకు అనుగుణంగా పరిష్కారాలను అందించడం ద్వారా ఆటోమోటివ్ సాఫ్ట్వేర్, ఇంజనీరింగ్ పరిశోధన, అభివృద్ధిలో భారత శక్తి సామర్థ్యాలు వృద్ధి చెందుతాయి. నిధులతో కూడిన స్టార్టప్ పర్యావరణ వ్యవస్థతో భారతదేశం వాహన రంగంలో నాయకత్వ స్థానంలో ఉండగల సామర్థ్యాన్ని కలిగి ఉంది’ అని వివరించింది. నాయకత్వ స్థానంగా..: దేశీ వాహన రంగంలో పెరుగుతున్న ఆవిష్కరణల వేగాన్ని, మారుతున్న సాంకేతికతలను సమర్థవంతంగా ఉపయోగించినట్లయితే భారతదేశాన్ని ప్రపంచ ఆటోమోటివ్ రంగంలో నాయకత్వ స్థానంగా మార్చవచ్చని నివేదిక తెలిపింది. ‘ప్రపంచవ్యాప్తంగా ఆటోమోటివ్ పరిశోధన, అభివృద్ధి, సాఫ్ట్వేర్ మార్కెట్ 2030 నాటికి మూడు రెట్లు వృద్ధి చెంది 400 బిలియన్ డాలర్లకు చేరుకుంటుందని అంచనా. భారతదేశం ప్రపంచ సాఫ్ట్వేర్ హబ్‌గా, ఆఫ్‌షోర్ గమ్యస్థానంగా తన స్థానాన్ని ఉపయోగించుకోవచ్చు. భారత వాహన పరిశ్రమ నిజమైన సామర్థ్యాన్ని సది్వనియోగం చేసుకోవడానికి ప్రభుత్వంతో సహా ముడిపడి ఉన్న భాగస్వాముల మధ్య బలమైన చర్చలు, సమిష్టి చర్యలు అవసరం’ అని నివేదిక వివరించింది. -
రీజెన్సీ సిరామిక్స్ పునరుద్ధరణ
సాక్షి ప్రతినిధి, కాకినాడ: కేంద్రపాలిత ప్రాంతమైన యానాంలోని రీజెన్సీ సిరామిక్స్ గురువారం పునఃప్రారంభమైంది. కార్మికుల వివాదాల నేపథ్యంలో దశాబ్దంన్నర క్రితం యానాం రీజెన్సీ లాకౌట్ ప్రకటించింది. అప్పటి నుంచి ఫ్యాక్టరీ పునరుద్ధరణకు చేస్తున్న ప్రయత్నాలు ఎట్టకేలకు కొలిక్కివచ్చాయి. ప్రయోగాత్మకంగా ఉత్పత్తి కూడా ప్రారంభమైంది. రీజెన్సీ సిరామిక్స్‌ను తిరిగి పూర్తిస్థాయిలో మార్కెట్లోకి తీసుకొచ్చేందుకు యాజమాన్యం ఏర్పాట్లు పూర్తిచేసింది. సంక్లిష్టమైన డిజైన్లకు మారుపేరుగా నిలిచిన రీజెన్సీ సిరామిక్స్ తొలిసారి రీజెన్సీ నేచురల్ టైల్స్‌ను చెన్నయ్‌లో విడుదల చేసింది. రూ.70 కోట్ల ప్రారంభ పెట్టుబడితో ఉత్పత్తిని ప్రారంభించింది. ఈ ఆర్థిక సంవత్సరం ముగిసేలోపు కంపెనీ నాలుగు టైల్స్ తయారీ లైన్లలో మొదటి దానిని ప్రారంభించేందుకు సిద్ధం చేసింది. కంపెనీ మొదటి లైన్ రోజుకు 7 వేల చదరపు మీటర్లను ఉత్పత్తి చేయనుంది. దీనిని రోజుకు 25 వేల చదరపు మీటర్ల సామర్థ్యానికి విస్తరించనున్నారు. అన్ని పరిమాణాలు, రకాలు, గ్లేజ్డ్ విట్రిఫైడ్ టైల్స్, ఫుల్ బాడీ విట్రిఫైడ్ టైల్స్, పాలి‹Ù్డ విట్రిఫైడ్ టైల్స్, డబుల్ చార్జ్డ్ టైల్స్, వాల్ టైల్స్, ఎక్స్టీరియర్ టైల్స్, స్టెప్స్, రైజర్లలో ఉత్పత్తి చేయడానికి నిర్ణయించారు. రీజెన్సీ ఉత్పత్తులను దేశంలోనే దక్షిణాది, తూర్పు ప్రాంతాలకు విస్తరించాలని నిర్ణయించారు. ఈ సందర్భంగా రీజన్సీ డైరెక్టర్ నరాల సత్యేంద్రప్రసాద్ ‘సాక్షి’తో మాట్లాడుతూ.. ఉమ్మడి తెలుగు రాష్ట్రాలతో పాటు తమిళనాడు, కేరళ, ఒడిశా రాష్ట్రాల్లో వ్యాపారాన్ని విస్తరించనున్నట్టు చెప్పారు. వచ్చే మూడేళ్లలో రూ.100 కోట్లు ఆదాయం లక్ష్యంగా ఉత్పత్తిపై దృష్టి పెట్టామన్నారు. రాజధాని నగరాలతోపాటు మిగిలిన నగరాల్లో షోరూంలు ఏర్పాటు చేయనున్నట్టు ఆయన పేర్కొన్నారు. యానాంతోపాటు ఆంధ్రప్రదేశ్‌లో ఆరి్థక వ్యవస్థ బలోపేతంలో రీజెన్సీ భాగస్వామ్యం వహిస్తుందని ఆయన చెప్పారు. -
పల్లెచిత్రాల 'తోట'! వైకుంఠం గీసిన చిత్రాలకు క్రేజీ..!!
కరీంనగర్: పల్లె జీవనం.. పడచుల కట్టుబొట్టు.. భారతీయ సంస్కృతి.. ఆయన చిత్రాలకు మూలాధారం. తోట వైకుంఠం కుంచె పడితే చిత్రాలకు జీవం వచ్చి, కాన్వాస్‌పై నాట్యం చేస్తాయి. రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం బూర్గుపల్లిలో జన్మించిన వైకుంఠం జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నాడు. ఏడేళ్ల క్రితం గీసిన చిత్రానికి ఇటీవల ముంబయిలోని ఆస్తాగురు యాక్షన్ హౌస్ నిర్వహించిన వేలంలో రూ.1,41,35,220 ధర పలకడం విశేషం. బూర్గుపల్లిలో విద్యాభ్యాసం.. బూర్గుపల్లిలో 1942లో జన్మించిన తోట వైకుంఠం స్వగ్రామంలోనే ప్రాథమిక విద్య పూర్తి చేశా రు. బోయినపల్లి, శాత్రాజ్పల్లి, వేములవాడ, సిరి సిల్లలో ఉన్నత విద్య చదివారు. హైదరాబాద్‌లోని కాలేజ్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్‌లో చిత్రలేఖనం పూర్తి చేశా రు. అనంతరం మహారాజ సయాజీరావు యూనివర్సిటీ ఆఫ్ బరోడాలో ప్రముఖ చిత్రకళా కారుడు సుబ్రమణియన్ దగ్గర శిష్యరికం చేశారు. రంగుల ఆయన ప్రత్యేకత.. డస్కీస్కిన్‌తో మహిళల చిత్రాలు గీయడం ఆయన ప్రత్యేకత. సాదాగా కనిపించే మహిళలు రూపం ఆయన చిత్రంగా మలిస్తే అందంగా కనిపిస్తారు. ఆయన గీసిన అందమైన మహిళల చిత్రాలను సిరిసిల్ల చీరెలుగా అభివర్ణిస్తారు. అమ్మ.. మహిళలే స్ఫూర్తి! చిత్రకారుడిగా గుర్తింపు పొందడానికి అమ్మ స్ఫూర్తి అని వైకుంఠం చెబుతుంటారు. చిన్నప్పుడు గ్రామంలో చిందు కళాకారులు నాటకాలు ప్రదర్శిస్తుంటే వారు వేసిన వేశాలకు తగినట్లుగా మేకప్ వేసి రంగులు దిద్దే అలవాటు ఉండేదని తెలిపారు. అలా చిన్నప్పటి నుంచే రంగులు, బొమ్మలు గీయడంపై అనురక్తి కల్గిందని చెబుతుంటారు. ఎరుపు, ఆకుపచ్చ, నీలం రంగులు తనకు ఇష్టమని.. తన చిత్రాలలోనూ ఎక్కువగా వాటినే వాడుతానని తెలిపారు. ఎన్నో అవార్డులు! భోపాల్‌లో రెండేళ్లకోసారి ఇచ్చే భారత్ భవన్ అవార్డుతోపాటు భారత ప్రభుత్వం అందించే జాతీయ అవార్డు, ఉమ్మడి రాష్ట్రంలో హంస అవార్డు అందుకున్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఉత్తమ చిత్రకళాకారుడిగా అవార్డు లభించింది. దాసి, మాభూమి చిత్రాలకు ఆర్ట్ డైరెక్టర్‌గా పనిశారు. దాసి చిత్రానికి ఉత్తమ ఆర్ట్ డైరెక్టర్‌గా జాతీయ అవార్డు అందుకున్నారు. వైకుంఠంపై పలు డాక్యుమెంటరీలు.. వైకుంఠంపై పలు డాక్యుమెంటరీలు వచ్చాయి. 2015లో కోల్‌కతాకు చెందిన పార్థూరాయ్ డాక్యుమెంటరీ నిర్మించారు. గ్రామాభివృద్ధికి విరాళాలు.. స్వగ్రామం బూర్గుపల్లిలో పాఠశాల అభివృద్ధికి రూ.40 వేలు విరాళంగా అందించారు. యువత చదువుకుంటేనే మంచి భవిష్యత్ ఉంటుందని తెలుపుతున్నారు. మాకు గర్వంగా ఉంది.. అంతర్జాతీయ చిత్రాకారుడిగా పేరు పొందిన తోట వైకుంఠం మా గ్రామస్తుడని చెప్పుకోవడం గర్వంగా ఉంది. ఆయనతో మా గ్రామానికి పేరు రావడం గొప్పగా భావిస్తున్నాం. ముంబయిలో జరిగిన వేలంలో ఆయన గీసిన చిత్రానికి కోటిన్నర పలకడం చాలా సంతోషంగా ఉంది. – కమటం అంజయ్య,మాజీ సర్పంచ్, బూర్గుపల్లి చిందు నాటకాలు ఇష్టపడేవారు.. వైకుంఠం సారు చిన్నప్పుడు మా గ్రామంలో చిందునాటకాలు వేసేవారు. పదేళ్ల కింద గ్రామానికి వచ్చినప్పుడు పాతతరం చిందు కళాకారులతో వేశాలు వేయించి డాక్యుమెంటరీ తీశారు. చిందుకళను ఇష్టపడేవారు. – గజ్జెల సాయిలు,చిందు కళాకారుడు గ్రామాభివృద్ధికి తోడ్పాటు.. తోట వైకుంఠం గ్రామంలో యువతకు స్ఫూర్తినిచ్చే వ్యక్తి. స్వగ్రామంలోని పాఠశాల అభివృద్ధికి గతంలో రూ.40 వేలు సాయం చేశారు. ఆయన గీసిన చిత్రాలతో మా ఊరికి పేరు రావడం గర్వంగా ఉంది. – పెరుక మహేశ్, యువకుడు -
భారత విద్యార్థులకు అమెరికా ప్రత్యేక కోర్సులు..
న్యూయార్క్: మన దేశంలో ప్రవేశపెట్టిన నూతన విద్యా విధానానికి అనుగుణంగా అమెరికా కూడా భారతీయ విద్యార్థులకు కొత్త ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్‌ను ప్రవేశపెట్టింది. ఏడాది పాటు ఉండే ప్రొఫెషనల్ మాస్టర్స్ డిగ్రీ కోర్సును అందుబాటులోకి తెచ్చింది. అమెరికన్ విశ్వవిద్యాలయాలలో పారిశ్రామిక స్పెషలైజేషన్‌తో విద్యను అభ్యసించనున్నారు. సైన్స్, టెక్నాలజీ, ఇంజినీరింగ్, మ్యాథ్స్ విభాగాల్లో ఈ కోర్సు ఉండనుంది. 2024 సెమిస్టర్ నుంచి ఈ కోర్సు అందుబాటులో ఉంటుందని సంబంధిత అధికారిక విభాగం వెల్లడించింది. కోర్సు పూర్తిచేసిన తర్వాత విద్యార్థులు వీసా నిబంధనలకు అనుగుణంగా మూడేళ్లపాటు అక్కడే ఉండే అవకాశం ఉంది. పనిలో అనుభవం తెచ్చుకోవడంతో పాటు స్టుడెంట్ లోన్స్ పూర్తి చేయడానికి వీలవుతుంది. అమెరికాకు చెందిన 20 యూనివర్సిటీలు 15 ఇండియన్ యూనివర్సిటీలు ఈ కోర్సుపై ఇప్పటికే చర్చలు ప్రారంభించాయి. భారతదేశం 2020లో కొత్త విద్యావిధానాన్ని తీసుకువచ్చింది. అందరికీ అందుబాటులో విద్య, భారత సంస్కృతి రక్షణ, గ్లోబర్ ఛాలెంజ్ వంటి అంశాలను పరిగణలోకి తీసుకుని విద్యా విధానాలను రూపొందించారు. ఇదీ చదవండి: Viral: సింగిల్‌గా ఉంటే.. చిరుతైనా గమ్మునుండాల్సిందే!లేదంటే.. -
ఎంబ్రాయిడరీ ఎంపవర్మెంట్
తోడా ఆదివాసీలు... నీలగిరుల్లో ఉంటారు. వారి జీవనం ప్రకృతి ఒడిలో ప్రకృతితో మమేకమై సాగుతుంది. వారి చేతిలో రూపుదిద్దుకున్న ఎంబ్రాయిడరీ డిజైన్లు కూడా వారు నివసిస్తున్న ప్రకృతి సౌందర్యాన్ని ప్రతిబింబిస్తాయి. పూలు, లతలు, పౌరాణిక గాథలు కుట్టులో రూపుదిద్దుకుంటాయి. తెల్లటి వస్త్రం, గోధుమ వర్ణంలోని వస్త్రం మీద నల్లటి దారాలతో ఈ ఎంబ్రాయిడరీ చేస్తారు. సాధారణంగా ఎంబ్రాయిడరీ చేస్తే ఒక వైపు చక్కటి డిజైన్ కనిపిస్తే వెనుక వైపు దారాల ముడులుంటాయి. తోడా ఆదివాసీలు చేసే ఎంబ్రాయిడరీలో రెండు వైపులా డిజైన్ అందంగా కనిపిస్తుంది. ఇలాంటి అందమైన పనితనం కొండలకే పరిమితమైపోతే ఎలాగ అనుకున్నారు షీలాపావెల్. నీలగిరుల్లో తోడా ఆదివాసీలు నివసించే కుగ్రామాలన్నింటిలో పర్యటించారామె. వారిని స్వయం సహాయక బృందంగా సంఘటితపరిచారు. ‘షాలోమ్ ఊటీ’ పేరుతో తోడా ఆదివాసీ మహిళలను ఒక వేదిక మీదకు తీసుకువచ్చారు షీలా పావెల్. ఇప్పుడు తోడా ఆదివాసీ మహిళలు వారానికి ఐదు వందల నుంచి ఐదు వేల రూపాయలు సంపాదించుకోగలుగుతున్నారు. ‘వారి చేతిలో ఉన్న కళ గొప్పతనం వారికి తెలియజేశాను, ఆ కళను ప్రపంచానికి పరిచయం చేశాను’ అన్నారు షీలా పావెల్. సాధికారత కుట్టారు షీలా పావెల్ వయసు 59. తమిళనాడులోని ఊటీలో నివసిస్తారు. ఆమె 2005లో షాలోమ్ ఊటీ స్వయం సహాయక బృందాన్నిప్రారంభించారు. అప్పుడు 250 మందితో మొదలైన బృందంలో ఇప్పుడు 150 మంది చురుగ్గా ఉన్నారు. అప్పటి సంగతులను తెలియచేస్తూ ‘‘తోడా ఆదివాసీ మహిళల చేతిలో ఏం నైపుణ్యం ఉందో తెలియదు. అందమైన ఎంబ్రాయిడరీతో చక్కటి శాలువాలు వాళ్ల చేతిలో రూపుదిద్దుకోవాల్సిందే. ఈ మహిళలు తాము ఎంబ్రాయిడరీ చేసిన శాలువాలను సమీపంలోని ఊటీ పట్టణానికి తెచ్చి అమ్ముకునేవారు. ఊటీలో దుకాణాల వాళ్లు తక్కువ ధరకు కొని వాటిని పర్యాటకులకు మంచి ధరకు అమ్ముకునేవారు. ఈ మహిళలకు మరొక ప్రపంచం తెలియకపోవడంతో ఆ వచ్చిన డబ్బుతో సంతృప్తి పడేవారు. వారిని సంఘంగా ఏర్పరిచి, వారు తయారు చేసిన శాలువాలు, కీ చైన్లు, మఫ్లర్లు, పర్సులు వంటి వాటిని తమ బృందం పేరుతో లేబుల్ అతికించి అమ్మడం మొదలు పెట్టారు. వ్యవస్థీకృతంగా లేని పనిని, కళ చేతిలో ఉన్న వారిని వ్యవస్థీకృతం చేయడమే నేను చేసింది. అప్పట్లో షాల్ కోసం వాళ్లు తీసుకునే క్లాత్కంటే కొంచెం మెరుగైన క్లాత్ కొని ఇవ్వడం, మార్కెటింగ్ మెళకువలు నేర్పించడం వంటివి చేశాను. గతంలో ఐదు వందలకు అమ్మిన శాలువాలను ఇప్పుడు వెయ్యి రూపాయలకు అమ్మగలుగు తున్నారు. నా కళ్లముందే వారి జీవన స్థాయులు పెరిగాయి. నేను కోరుకున్న లక్ష్యాలు రెండూ నెరవేరాయి. వీరి కళ విలువ వీరికి తెలిసింది, వీరి కళ గురించి బయటి ప్రపంచానికి తెలిసింది. క్రాఫ్ట్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాతో అనుసంధానం చేయగలిగాను. తోడా ఎంబ్రాయిడరీ వస్తువులు చెన్నై, బెంగళూరు, ముంబయి, హైదరాబాద్‌లో కూడా లభిస్తున్నాయిప్పుడు. కళ కొనసాగాలి ఈ కళ ఎదుర్కొంటున్న మరో చాలెంజ్ ఏమిటంటే... కొత్తతరం ఈ ఎంబ్రాయిడరీ నేర్చుకోవడం లేదు. చదువుకుని ఉద్యోగాలకు వెళ్లడం మంచి పరిణామమే. కానీ ఈ కళను కూడా నేర్చుకోవచ్చు కదా అనిపిస్తుంది. తోడా ఆదివాసీల జనాభా పదమూడు వందలుంటే అందులో ఏడు వందల వరకు మహిళలున్నారు. డెబ్బై ఏళ్ల వాళ్లతో కలుపుకుంటే ఈ ఎంబ్రాయిడరీ వచ్చిన వాళ్లు మూడు వందల లోపే ఉన్నారిప్పుడు. ఇతరులకు నేర్పించే ఆలోచనలో ఉన్నాను’’ అని తెలియ చేశారు షీలా పావెల్. -
చీర కట్టుతో మతి పోగొడుతున్న.. ఈ ముద్దుగుమ్మ ధరించిన చీర ఎంతంటే..
'మజిలీ’ తో మొదలుపెట్టిన దివ్యాన్ష కౌశిక్.. అనతికాలంలోనే ఎంతోమంది మదిని దోచి అంతులేని అభివనాన్ని సొంతం చేసుకుంది. తాను అనుకోకుండా నటిగా మారాను. లేకుంటే ఫ్యాషన్ జర్నలిస్ట్‌గా .. ఏదైనా ఫ్యాషన్ మ్యాగజైన్‌కి ఎడిటర్ని కావాలి అనే లక్ష్యంతో ఉండేదాన్ని అని చెబుతోంది దివ్యాన్ష. మరి ఆమె మదిని దోచిన ఫ్యాషన్ బ్రాండ్స్ ఏంటో చూద్దాం.. అనుకోకుండా నటిగా మారాను. లేకుంటే ఫ్యాషన్ జర్నలిస్ట్‌గా .. ఏదైనా ఫ్యాషన్ మ్యాగజైన్‌కి ఎడిటర్ని కావాలి అనే లక్ష్యంతో ఉండేదాన్ని. దిల్నాజ్.. ముంబైకి చెందిన దిల్నాజ్ కర్బరీ.. ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ తరుణ్ తహిలియానీ వద్ద దాదాపు పదిహేనేళ్ల పాటు కోచర్ డిజైన్ హెడ్‌గా పనిచేసింది. ఫ్యాషన్‌పై ప్రావీణ్యం, పట్టు రెండ ఉండటంతో 2009లో తన పేరు మీదనే ముంబైలో ‘దిల్నాజ్’ ఫ్యాషన్ హౌస్‌ని ప్రారంభించింది. వైబ్రెంట్ కలర్స్.. డిజైన్స్‌కి ఈ బ్రాండ్ పెట్టింది పేరు. గ్రాండ్ లుక్‌నిచ్చే దిల్నాజ్ బ్రాండ్ దుస్తులు సెలబ్రిటీలను సైతం మెప్పిస్తున్నాయి. ధర కాస్త ఎక్కువే! ఆన్‌లైన్‌లోనూ లభ్యం. ఇక దివ్వాన్ష కౌశిక్ కోసం దిల్నాజ్ డిజైన్ చేసిన చీర బ్రాండ్ ధర రూ. 59,900/- దివ్యాన్ష కౌశిక్జ్యూలరీ బ్రాండ్: జతిన్ మోర్ జ్యూయల్స్ ధర: ఆభరణాల డిజైన్, నాణ్యతపై ఆధారపడి ఉంటుంది. జతిన్ మోర్.. అతిప్రాచీన, ప్రసిద్ధ జ్యూలరీ బ్రాండ్స్‌లో ఒకటి జతిన్ మోర్ జ్యూయల్స్. 1891లో ఆనంద్ మోర్ ప్రారంభింన వ్యాపారాన్ని.. ప్రస్తుతం వారి నాలుగోతరం వారసుడు జతిన్ మోర్.. ‘జతిన్ మోర్ జ్యూయల్స్’ పేరుతో కొనసాగిస్తున్నాడు. సంస్కృతి, సంప్రదాయ, హస్తకళల సారాన్ని ఆధునిక డిజైన్స్‌లో వర్ణింనట్టుంటాయి ఈ ఆభరణాలు. అదే వీరి బ్రాండ్ వాల్య! ధర ఆభరణాల డిజైన్, నాణ్యతపై ఆధారపడి ఉంటుంది. పలు ప్రముఖ నగరాలతోపాటు ఆన్‌లైన్‌లోన లభ్యం. దివ్యాన్ష కౌశిక్ -దీపిక కొండి -
ఎంత ఆనందించానో మాటల్లో చెప్పలేను.. వీడియో షేర్ చేసిన ఉపాసన
ఈ ఏడాది మెగా ఫ్యామిలీకి బాగా కలిసి వచ్చినట్లు కనిపిస్తోంది. ఎందుకంటే ఈ ఏడాది జూన్‌లో ఉపాసన- రామ్ చరణ్ తల్లిదండ్రులైన సంగతి తెలిసిందే. పెళ్లయిన 11 ఏళ్ల తర్వాత మెగా ఇంట్లోకి వారసురాలు అడుగుపెట్టింది. ఈ సందర్భంగా మెగా ఫ్యాన్స్‌తో పాటు మెగా ఫ్యామిలీ సంబరాలు చేసుకున్నారు. ఇటీవలే మెగా వారసురాలి బారసాల కార్యక్రమం హైదరాబాద్‌లో ఘనంగా నిర్వహించారు. తన మనవరాలి పేరును మెగాస్టార్ చిరంజీవి అభిమానులతో పంచుకున్నారు. రామ్ చరణ్-ఉప్సీల బిడ్డకు క్లీంకార అనే పేరును పెట్టినట్లు వెల్లడించారు. (ఇది చదవండి: రామ్ చరణ్- ఉపాసన బిడ్డకు ఆ పేరు.. అసలు కారణం ఇదేనా?) అయితే ఉపాసన జూబ్లీహిల్స్‌లోని అపోలో ఆస్పత్రిలో బిడ్డకు జన్మనిచ్చిన సంగతి తెలిసిందే. అయితే తనకు పుట్టబోయే బిడ్డకోసం ముందుగానే గదిని ప్రత్యేకంగా డిజైన్ చేయించారు. గది వాతావరణం ప్రకృతి ఒడిలో ఉన్న ఫీలింగ్ కలిగేలా గోడలను అందంగా తీర్చిదిద్దారు. దీని కోసం ప్రత్యేక డిజైనర్లు పనిచేశారు. ఆస్పత్రిలో ఉన్నా కూడా ఇంట్లో ఉన్నట్లు ఫీలయ్యేలా ఉపాసన గదిని తీర్చిదిద్దారు. పుట్టిన బేబీ చూడగానే బొమ్మలు, పక్షులు, చెట్లు కనిపించేలా కర్టన్స్ డిజైన్ చేయించారు. ఫారెస్ట్‌ను తలపించేలా డిజైనర్స్ దీనిని తయారు చేశారు. వాటిని తన బిడ్డకు గదిలో కనిపించేలా ఏర్పాటు చేశారు. దీనికి సంబంధించిన వీడియోను ఉపాసన ట్విటర్ ద్వారా పంచుకున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. (ఇది చదవండి: అలాంటి ప్రపంచంలో బతుకుతున్నాం.. కల్యాణ్ దేవ్ పోస్ట్ వైరల్) ఉపాసన ట్వీట్లో రాస్తూ..'అమ్రాబాద్ ఫారెస్ట్, వేద వైద్యం ద్వారా ప్రేరణ పొందిన ఈ సుందరమైన ప్రదేశాలలో నేను జన్మనివ్వడం. నా క్లీంకారను పెంచడం ఎంత ఆనందించానో మీకు చెప్పలేను. ధన్యవాదములు పవిత్రా రాజారామ్.' అంటూ పోస్ట్ చేసింది. Can’t tell u how much I enjoyed giving birth & raising my klin Kaara in these lovely spaces inspired by the Amrabad Forest & Vedic healing. Thank you Pavitra Rajaram 🤗 pic.twitter.com/Yaki3DWiNL — Upasana Konidela (@upasanakonidela) July 14, 2023 -
డిజైన్‌కు తగ్గట్టుగానే పోలవరం గైడ్ బండ్ నిర్మాణం
సాక్షి, అమరావతి/పోలవరం రూరల్: కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ) ఆమోదించిన డిజైన్‌కు తగ్గట్టుగా, నిర్దేశించిన ప్రమాణాల మేరకు పోలవరం ప్రాజెక్టు గైడ్ బండ్‌ను నాణ్యంగా నిర్మించినట్లు కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ) నిపుణుల కమిటీ తేల్చింది. కానీ.. గైడ్ బండ్ కొంత భాగం కాస్త జారిందని, ఈ సమస్య ఎందుకు ఉత్పన్నమైందనే విషయంపై మేధోమథనం జరిపింది. మట్టి పరీక్షల నివేదికలను పరిశీలిం చింది. గైడ్ బండ్ జారిన ప్రాంతానికి తాత్కాలిక మరమ్మతులపై నాలుగు రోజుల్లోగా ప్రతిపాదన ఇస్తే.. దాన్ని సరిచూసి సీడబ్ల్యూసీకి నివేదిస్తామని పేర్కొంది. సీడబ్ల్యూసీ ఆమోదించిన డిజైన్ ప్రకారం తక్షణం మరమ్మతుల చేయాలని, ఆ తర్వాత గైడ్ బండ్‌ను పూర్తి స్థాయిలో పటిష్టం చేసే పనులు చేపట్టాలని రాష్ట్ర జలవనరుల శాఖ అధికారులకు సూచించింది. సీడబ్ల్యూసీ మాజీ చైర్మన్ ఏబీ పాండ్య నేతృత్వంలో సీడబ్ల్యూసీ డైరెక్టర్ ఎస్కే సిబాల్, సెంట్రల్ సాయిల్ అండ్ మెటీరియల్స్ రీసెర్చ్ స్టేషన్ (సీఎస్ఎంఆర్ఎస్) డైరెక్టర్ చిత్ర, పోలవరం ప్రాజెక్టు అథారిటీ (పీపీఏ) సీఈవో శివ్‌నందన్‌కుమార్ సభ్యులుగా సీడబ్ల్యూసీ ఏర్పాటు చేసిన నిపుణుల కమిటీ గురువారం పోలవరం ప్రాజెక్టు పనులను పరిశీలించింది. అనంతరం రాష్ట్ర జలవనరుల శాఖ ఈఎన్సీ సి.నారాయణరెడ్డి, పోలవరం సీఈ సుధాకర్‌బాబు, ఎస్ఈ నరసింహమూర్తి, కాంట్రాక్టు సంస్థ మేఘా ప్రతినిధులతో సమీక్ష సమావేశం నిర్వహించింది. స్పిల్ వే, గేట్లు, స్పిల్ చానల్ పనితీరుపై సంతృప్తి వ్యక్తంచేసింది. గైడ్ బండ్‌ను సమగ్రంగా పరిశీలించింది. పరిమితికి లోబడే ఎగువ కాఫర్ డ్యామ్ లీకేజీలు గతేడాది గోదావరికి భారీ స్థాయిలో వచ్చిన వరదలను దీటుగా ఎదుర్కోవడానికి రాష్ట్ర ప్రభుత్వం ఎగువ కాఫర్ డ్యామ్ ఎత్తును 44 మీటర్లకు పెంచింది. దీన్ని నిపుణుల కమిటీ పరిశీలించింది. ఎగువ కాఫర్ డ్యామ్‌లో లీకేజీలను రీచ్‌లవారీగా ఎప్పటికప్పుడు అధునాతన హైడాల్రిక్ డాప్లర్ టూల్‌తో కొలుస్తున్నామని రాష్ట్ర అధికారులు కమిటీకి వివరించారు. హైడ్రాలిక్ డాప్లర్ టూల్లో రికార్డయిన గణాంకాలను విశ్లేషించిన నిపుణుల కమిటీ.. ఎగువ కాఫర్ డ్యామ్‌లో లీకేజీలు పరిమితికి లోబడే ఉన్నాయని పేర్కొంది. వరదల్లో మరింత అప్రమత్తంగా ఉంటూ కాఫర్ డ్యామ్ భద్రతను పర్యవేక్షించాలని సూచించింది. యథాస్థితికి తెచ్చే పనులపై సంతృప్తి గత ఫిబ్రవరి 15 నాటికి 31.5 మీటర్ల ఎత్తుతో పూర్తి చేసిన దిగువ కాఫర్ డ్యామ్ నాణ్యతపై కమిటీ సంతృప్తి వ్యక్తం చేసింది. ఎగువ, దిగువ కాఫర్ డ్యామ్‌ల మధ్య ప్రధాన డ్యామ్ వద్ద వరద ఉధృతికి ఏర్పడిన అగాధాల పూడ్చివేత పనులను పరిశీలించింది. ఈ పనులు పూర్తయ్యాక డయాఫ్రం వాల్ దెబ్బతిన్న చోట్ల కొత్తగా డయాఫ్రం వాల్ వేసే పనులు చేపడతామని రాష్ట్ర అధికారులు వివరించారు. శుక్రవారం నిపుణుల కమిటీ మరో సారి రాష్ట్ర అధికారులతో సమావేశమై.. సాంకేతిక అంశాలపై చర్చించనుంది. క్షేత్ర స్థాయి పర్యటన.. అధికారుల సమీక్షలో వెల్లడైన అంశాల ఆధారంగా సీడబ్ల్యూసీకి నివేదిక ఇవ్వనుంది. -
భోగాపురం ఎయిర్ పోర్ట్ నమూనాను పరిశీలించిన సీఎం జగన్
-
4 డిజైన్లలో ఇంటర్ ఛేంజర్లు
సాక్షి, హైదరాబాద్ : రీజినల్ రింగురోడ్డులో నాలుగు రకాల డిజైన్లలో ఇంటర్ ఛేంజ్ స్ట్రక్చర్లు రాబోతున్నాయి. జాతీయ రహదారులు, ప్రధాన రాష్ట్ర రహదారులను రింగురోడ్డు క్రాస్ చేసే చోట్ల భారీ ఇంటర్ ఛేంజ్‌లను నిర్మించనున్న విషయం తెలిసిందే. రింగురోడ్డు ఉత్తర భాగంలో 11 ప్రాంతాల్లో ఇలాంటి కూడళ్లు ఉండనున్నాయి. రింగురోడ్డు మీదుగా వెళ్లే వాహనాలు, ఇతర రోడ్ల మీదుగా వెళ్లే వాహనాలు పరస్పరం అడ్డు రాకుండా వేటికవే రోడ్లు ఒకదానితో ఒకటి సంబంధం లేకుండా క్రాస్ అవుతాయి. ఒక రోడ్డు నుంచి మరో రోడ్డులోకి వాహనాలు మారేందుకు వీలుగా ఇంటర్‌ఛేంజ్ లూప్స్‌ను నిర్మిస్తారు. ఇప్పుడు ఈ స్ట్రక్చర్లకు సంబంధించి అధికారులు రూపొందించిన డిజైన్లు ఆసక్తి రేపుతున్నాయి. ఆయా క్రాసింగ్స్‌లో ఉండే ట్రాఫిక్ ఒత్తిడి, అనుసంధానమయ్యే రోడ్ల సంఖ్య ఆధారంగా లూప్స్ వైశాల్యం, సంఖ్య ఆధారపడి ఉంటాయి. ఇందుకోసం నాలుగు డిజైన్లను ఖరారు చేసి, ఆ ప్రాంతంలో ఉండే పరిస్థితికి తగ్గట్టుగా వాటిని ఎంపిక చేయబోతున్నారు. ట్రంపెట్ ఆకృతిలో లూప్ నిర్మాణం సాధారణంగా ప్రధాన రోడ్లను ఇతర రోడ్ల మీదుగా వచ్చే వాహనాలను అనుసంధానించేందుకు ట్రంపెట్ (సంగీత పరికరం) ఆకృతిలో లూప్ నిర్మిస్తారు. రోడ్ల సంఖ్య ఎక్కువగా ఉంటే రెండు ట్రంపెట్ల ఆకృతిలో నిర్మిస్తారు. క్లవర్ లీఫ్ (నాలుగు ఆకులతో కూడిన మొక్క భాగం) ఆకృతిలో కూడా విరివిగా నిర్మిస్తారు. హైదరాబాద్ ఔటర్ రింగురోడ్డులో ఈ రెండు ఆకృతుల్లో ఇంటర్‌ఛేంజెస్ ఉన్నాయి. ఇప్పుడు వీటితోపాటు డంబెల్ (వ్యాయామ ఉపకరణ) ఆకృతితోపాటు రౌండ్ ఎ»ౌట్ (పూర్తి వృత్తం)లో కూడా నిర్మించాలని నిర్ణయించారు. గిర్మాపూర్, చౌటుప్పల్ వద్ద డంబెల్ ఆకృతిలో నిర్మాణాలు నాగ్‌పూర్ జాతీయ రహదారి, రాజీవ్ రహదారుల మీద రెండు ప్రాంతాల్లో క్లవర్ లీఫ్ నమూనాను ఎంపిక చేశారు. శివంపేట, రాయగిరిల వద్ద డబుల్ ట్రంపెట్ డిజైన్‌ను ఎంపిక చేశారు. రీజినల్రింగ్రోడ్డు ప్రారంభ ప్రాంతమైన గిర్మాపూర్, ముగింపు ప్రాంతమైన చౌటుప్పల్‌తోపాటు జాతీయ రహదారి 161ఏ మీద డంబెల్ ఆకృతిలో నిర్మించాలని భావిస్తున్నారు. మరో మూడు చోట్ల రౌండ్ ఎ»ౌట్లను ఎంపిక చేశారు. మిగతావి పరిశీలనలో ఉన్నాయి. కొన్ని ప్రాంతాల్లో ఇంటర్ ఛేంజ్ స్ట్రక్చర్లకు భారీగా స్థలాన్ని సేకరించే విషయంలో స్థానికులతో వివాదాలు నెలకొన్న నేపథ్యంలో డిజైన్లలో కొన్ని మార్పుచేర్పులు జరిగే అవకాశం ఉంది. రీజినల్ రింగురోడ్డుకు సంబంధించి భూసేకరణలో భాగంగా కీలక 3డీ గెజిట్ నోటిఫికేషన్ల జారీ ప్రక్రియ ఆందోల్–జోగిపేట, యాదాద్రి భువనగిరి, చౌటుప్పల్.. ఈ మూడు కాలా అథారిటీలో పూర్తయిన విషయం తెలిసిందే. వీటి పరిధిలో త్వరలో టెండర్ల ప్రక్రియ కూడా మొదలుకానున్నందున ఇంటర్‌ఛేంజ్ స్ట్రక్చర్లపై త్వరలో నిర్ణయంతీసుకోనున్నారు. మిగతా కాలా అథారిటీల పరిధిలో 3డీ గెజిట్ నోటిఫికేషన్ జారీకి కొంత సమయం ఉన్నందున, మరో నెల రోజుల్లో ఆయా ప్రాంతాల్లోని స్ట్రక్చర్లను ఖరారు చేయనున్నారు. 120 ఎకరాల విస్తీర్ణంలో.. రీజినల్ రింగ్‌రోడ్డు ఉత్తర భాగంలో వాహనాల రద్దీ చాలా ఎక్కువగా ఉన్నందున ఈ ప్రాంతాల్లో నిర్మించే ఇంటర్ ఛేంజ్ నిర్మాణాలు ఒక్కోటి దాదాపు 120 ఎకరాల విస్తీర్ణంలో ఉండనున్నట్టు తెలిసింది. వాహనాలు ఇంటర్‌ఛేంజ్ లూప్స్ మీదుగా, వాటికి నిర్మించే ర్యాంప్స్ మీదుగా కూడా గంటకు 50 కి.మీ. మించిన వేగంతో వెళ్లేందుకు వీలుగా వీటిని విశాలంగా నిర్మించాలని నిర్ణయించారు. తొలుత 70 ఎకరాల విస్తీర్ణంలోనే నిర్మించాలని అనుకున్నా.. వాహనాల వేగం గంటకు 30 కి.మీ.లోపే నియంత్రించాల్సిన పరిస్థితి ఉండటంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. -
పూల సంతకం
ఏ కాలాన్నైనా బ్రైట్‌గా మార్చేసే గుణం పువ్వుల సొంతం. ఆ సౌందర్యాన్ని ధరించే దుస్తుల మీదకు తీసుకురావడం తరుణుల అభిమతం అందుకే జాతీయ అంతర్జాతీయ వేదికల మీద కూడా పువ్వుల ప్రింట్లు, డిజైన్లు అమితంగా ఆకట్టుకుంటుంటాయి. పెళ్లి, పుట్టిన రోజు వంటి వేడుకల్లోనే కాదు క్యాజువల్వేర్గానూ కట్టిపడేసే పూల డ్రెస్సులు ధరించడమంటే మేనిపైన పూల సంతకం చేసినట్టే. ఎంబ్రాయిడరీ పూలు చేతితో చేసిన ఎంబ్రాయిడరీ వర్క్‌లోనూ పువ్వులు, లతల అందం మన మదిని దోచేస్తూనే ఉంటుంది. ఎన్ని హంగులు దిద్దినా వాటినుంచి కొత్త స్ఫూర్తిని ΄పొందుతూనే ఉంటాం. అందుకే కొత్త డిజైన్లను సృష్టిస్తూనే ఉంటారు డిజైనర్లు. అప్లిక్ పూలు కావల్సిన పరిమాణంలో పువ్వులను ముందుగానే డిజైన్ చేసుకొని, ఎంపిక చేసుకున్న ఫ్యాబ్రిక్ మీద ఫ్యా చ్ వర్క్ చేస్తారు. ఈ పూల గుత్తులు డ్రెస్ అందాన్ని వెయ్యింతలుగా పెంచుతుంది. పువ్వుల ప్రింట్లు ఏ హంగులూ చేయలేం అనుకున్నవారు పువ్వుల ప్రింట్లు ఉన్న సిల్క్ లేదా బ్రొకేడ్, కాటన్ ఫ్యాబ్రిక్‌లో ఏదైనా ఎంచుకోవచ్చు. కాలానుగుణంగా ఫ్యాబ్రిక్ ఎంపికలో మార్పులు ఉండవచ్చు గానీ, పువ్వుల సొగసులో మార్పులు ఉండవని నిరూపిస్తుంటారు అతివలు. అందుకే కాబోలు పువ్వుల ప్రింట్లు ఉన్న ఫ్యాబ్రిక్ ఎన్నో రకాల స్టైల్స్‌లో డ్రెస్ డిజైనర్ల చేతిలో మారిపో తుంటుంది. -
గేమింగ్‌లో భారీ ఉద్యోగాలు
ముంబై: గేమింగ్ పరిశ్రమ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో కొత్తగా లక్ష మందికి (ప్రత్యక్షంగా, పరోక్షంగా) ఉపాధి కల్పించొచ్చని టీమ్‌లీజ్ డిజిటల్ తెలిపింది. ప్రోగ్రామింగ్, టెస్టింగ్, యానిమేషన్, డిజైన్ తదితర విభాగాల్లో ఈ ఉద్యోగాలు వస్తాయని పేర్కొంది. 20–30 శాతం మేర ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో వృద్ధిని సాధిస్తుందని అంచనా వేసింది. ‘గేమింగ్–రేపటి బ్లాక్ బస్టర్’పేరుతో టీమ్‌లీజ్ డిజిటల్ గురువారం ఒక నివేదికను విడుదల చేసింది. ఇందులోని వివరాల ప్రకారం.. గేమింగ్ పరిశ్రమ ప్రస్తుతం ప్రత్యక్షంగా 50వేల మందికి ఉపాధి కల్పిస్తోంది. ఇందులో 30 శాతం ఉద్యోగాలు ప్రోగ్రామర్లు, డెవలపర్ల రూపంలోనే ఉన్నాయి. వచ్చే ఏడాది కాలంలో ఈ రంగంలో గేమ్ డెవలపర్లు, యూనిటీ డెవలపర్లు, గేమ్స్ టెస్ట్ ఇంజనీర్లు, క్యూఏ హెడ్లు, యానిమేటర్లు, మోషన్ గ్రాఫిక్ డిజైనర్లు, వర్చువల్ రియాలిటీ డిజైనర్లు, వీఎఫ్ఎక్స్, కాన్సెప్ట్ ఆర్టిస్ట్‌లకు డిమాండ్ ఉంటుంది. అధిక వేతనం.. ఈ రంగంలో అత్యధికంగా గేమ్ ప్రొడ్యూసర్లకు రూ.10 లక్షల వార్షిక వేతనం ఉంటే.. గేమ్ డిజైనర్లకు 6.5 లక్షలు, సాఫ్ట్వేర్ ఇంజనీర్లు రూ.5.5 లక్షలు, గేమ్ డెవలపర్లు రూ.5.25 లక్షలు, క్వాలిటీ అష్యూరెన్స్ టెస్టర్లకు రూ.5.11 లక్షల చొప్పున వార్షిక ప్యాకేజీలున్నాయి. ‘‘గేమింగ్ పరిశ్రమ తదుపరి ఉదయించే రంగం. యూజర్ల సంఖ్య పెరుగుతుండడంతో ఈ రంగంలో ఉపాధి అవకాశాలు వెల్లువలా రానున్నాయి. తరచూ నియంత్రణపరమైన నిబంధనల మార్పు రూపంలో అడ్డంకులు ఎదురవుతున్నప్పటికీ.. గేమింగ్ పరిశ్రమ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో కొత్తగా లక్ష మందికి ఉపాధినిస్తుంది. 2026 నాటికి 2.5 రెట్లు వృద్ధి చెందుతుంది’’అని టీమ్‌లీజ్ డిజిటల్ సీఈవో సునీల్ చెమ్మన్‌కోటిల్ తెలిపారు. 2026 నాటికి గేమింగ్ పరిశ్రమ రూ.38,097 కోట్లకు చేరుతుందని టీమ్‌లీజ్ అంచనా వేసింది. ఆదాయం పరంగా భారత్ గేమింగ్ పరిశ్రమ అంతర్జాతీయంగా ఆరో స్థానంలో ఉంది. అంతర్జాతీయంగా ఈ విపణి విలువ రూ.17,24,800 కోట్లుగా ఉంది. -
యాపిల్‌కు షాక్.. కీలక ఎగ్జిక్యూటివ్ గుడ్‌బై
న్యూఢిల్లీ: దిగ్గజ సంస్థ యాపిల్‌కు కీలక ఎగ్జిక్యూటివ్ గుడ్ బై చెప్పారు. యాపిల్ ఇండస్ట్రియల్ డిజైన్ వైస్ ప్రెసిడెంట్, ఇవాన్స్ హాంకీ తన పదవికి రాజీనామా చేశారు. 2019 నుంచి ఆమె ఈ పదవిలో ఉన్నారు. మూడు సంవత్సరాల క్రితం మాజీ ఆపిల్ డిజైన్ చీఫ్ జోనీ ఐవ్ స్థానంలో హాంకీ బాధ్యతలు స్వీకరించారు. హాంకీ స్థానంలో ఎవర్ని నియమించిందీ యాపిల్ అధికారంగా ప్రకటించలేదు. అయితే కొత్త నియామకంగా జరిగేదాకా ఆమె తన పదవిలో కొనసాగ నున్నారు. కాగా ఐమాక్, ఐపాడ్ ఐఫోన్ల పరిచయం వెనుక ఉన్న కీలక వ్యక్తుల్లో ఒకరిగా జోనీ ఐవ్ గుర్తింపు తెచ్చుకున్నారు. యాపిల్ ఫౌండర్ స్టీవ్ జాబ్స్‌తో కలిసి విభిన్నమైన యాపిల్ ఉత్పత్తులకు నాంది పలికారు. అయితే తన సొంత స్వతంత్ర కంపెనీ స్థాపన నేపథ్యంలో యాపిల్ నుంచి ఆయన నిష్క్రమించడం అప్పట్లో వ్యాపార వర్గాల్లో చర్చకు దారి తీసింది. -
నిజామా? భూమ్మీద ఎక్కడి నుంచి ఎక్కడికైనా గంటలోనే...
ధ్వని వేగాన్ని మించిన వేగంతో ప్రయాణించే సూపర్సోనిక్ జెట్ విమానాలను తలదన్నే విమానాలేవీ ఇంతవరకు లేవు. అయితే, త్వరలోనే అలాంటి విమానం అందుబాటులోకి రానుందని అమెరికన్ ఏరోస్పేస్ స్టార్టప్ కంపెనీ ‘వీనస్ ఏరోస్పేస్’ సంస్థ చెబుతోంది. ఇటీవల ఈ సంస్థ ‘స్టార్ గేజర్’ పేరిట తన విమానం నమూనాను విడుదల చేసింది. భూమ్మీద ఎక్కడి నుంచి ఎక్కడికైనా గంట లోగానే చేరుకోగల హైపర్ సోనిక్ విమానానికి రూపకల్పన చేస్తున్నట్లు ‘వీనస్ ఏరోస్పేస్’ ప్రకటించింది. దీనికోసం అమెరికా ప్రభుత్వం 1 మిలియన్ డాలర్లు ఇవ్వగా, ప్రైవేటు పెట్టుబడిదారుల నుంచి 33 మిలియన్ డాలర్ల నిధులు సేకరించనున్నట్లు తెలిపింది. పన్నెండు మంది ప్రయాణించే వీలున్న ఈ విమానం లాస్ ఏంజెలెస్ నుంచి టోక్యోకు గంట లోపే చేరుకోగలదని ఈ సంస్థ ప్రతినిధులు చెబుతున్నారు. చదవండి👇 అత్యంత హాస్యభరితమైన జోక్ ఇది! అది ఏంటంటే? ఆ పూలను తాకితే చాలు.. ఓ అద్భుతాన్ని చూసిన ఫీలింగ్! -
చల్ల‘కుండ’.. ఆదివాసీల స్పెషల్..
చింతూరు(అల్లూరి సీతారామరాజు జిల్లా): ఇటీవల ఆంధ్రా, ఛత్తీస్‌గఢ్ సరిహద్దు గ్రామాల్లో నిర్వహించే వారపు సంతల్లో ఛత్తీస్‌గఢ్‌లో తయారైన చలువ కుండల విక్రయాలు జోరుగా సాగుతున్నాయి. వివిధ డిజైన్లలో ఎర్రగా కనిపించే ఈ కుండలు మార్కెట్లో కనువిందు చేస్తున్నాయి. ప్రత్యేకమైన మట్టితో తయారయ్యే ఈ కుండల్లో పోసిన నీరు ఫ్రిజ్‌లో పెట్టిన మాదిరిగా ఉండడంతో వీటి కొనుగోళ్లుకు ప్రజలు ఆసక్తి చూపిస్తున్నారు. మందంగా వుండే ఈ కుండలు ఎంతోకాలం మన్నడంతో పాటు నీటికి, వంటకు బాగా ఉపయోగ పడతాయని, అందుకే అధికశాతం వీటినే కొనుగోలు చేస్తామని వారు తెలిపారు. రూ.50 నుంచి రూ.700 వరకు ధర కలిగిన కుండలతో పాటు వివిధ రకాల బొమ్మలను కూడా సంతల్లో విక్రయిస్తున్నారు. చదవండి👉: అర్ధ శతాబ్దపు జ్ఞాపకం ప్రత్యేక మట్టితో తయారీ ఛత్తీస్‌గఢ్‌లోని సుక్మా జిల్లా కుకనార్‌లో ప్రత్యేకమైన మట్టితో ఈ కుండలను తయారు చేస్తామని తయారీదారుడు దసురాం తెలిపాడు. భూమి పైభాగంలో కేవలం రెండు అంగుళాల మేర లభించే ప్రత్యేకమైన మట్టిని ఈ కుండల తయారీకి వినియోగిస్తామని అతను తెలిపాడు. ఆ మట్టి జిగటగా ఉండడంతో పాటు గట్టిదనం కలిగి ఉంటుందని దీనివలన కుండలు అందంగా కనబడడంతో పాటు చాలాకాలం మన్నుతాయని తెలిపాడు. మట్టితో కుండలు తయారు చేసిన అనంతరం వాటికి ఎర్రరంగు అద్ది మార్కెట్లో విక్రయిస్తామని తెలిపాడు. తమ గ్రామంలో సుమారు వంద కుటుంబాలు కుండలు తయారు చేస్తున్నాయని, వాటిని ఛత్తీస్‌గఢ్‌లోని జగ్దల్పూర్, సుక్మాతో పాటు ఆంధ్రా సరిహద్దుల్లోని సంతలు, తెలంగాణలోని భద్రాచలం, పాల్వంచ, కొత్తగూడెం వంటి పట్టణాల్లో విక్రయిస్తామని అతను తెలిపాడు. -
కళలకు వారధి
ఆధునిక బ్రాండ్లు ఎన్ని వచ్చినా ప్రపంచం చూపు హస్త కళలవైపే అనేది నూటికి నూరు పాళ్లు వాస్తవం. ప్రాచీన కళను ఆధునిక కాలానికి తీసుకురావడానికి ఓ వారధిగా కృషి చేస్తున్నారు గుజరాత్ వాసి అయిన బృందాదత్. భారతీయ హస్త కళల సంప్రదాయాన్ని ప్రపంచానికి తెలిసేలా చేయడమే లక్ష్యంగా పనిచేస్తున్న ఈ కళావారధి తెలంగాణ క్రాఫ్ట్ కౌన్సిల్ నుంచి క్రాఫ్ట్ ప్రెన్యూర్ సన్మాన్ అవార్డు అందుకున్నారు. ఇటీవల నగరానికి వచ్చిన బృందా హస్తకళల గురించి ‘దేశంలో కళాకారులు ఏ మూలన ఉన్నా అక్కడ నేనుంటాను’ అని తెలిపారు. బృందాదత్ ఎంచుకున్న మార్గం గురించి మరింత వివరంగా.. భారతీయ హస్తకళల పట్ల అపారమైన గౌరవం, ఆధునిక భావాల అభిరుచితో భూత–భవిష్యత్తుల కలయికగా ‘మోరీ డైనమిక్ డిజైన్ స్టూడియో’ను గుజరాత్‌లోని గాం«దీనగర్‌లో 2019లో ప్రారంభించారు బృందాదత్. దేశం నలుమూలల నుండి క్రాఫ్ట్ కమ్యూనిటీలతో కలిసి పనిచేస్తూ, తన అనుభవాన్ని మెరుగుపరుచుకుంటూ కళ ఎప్పటికీ నిలిచేలా వినూత్న డిజైన్లను రూపొందిస్తున్నారు ఆమె. ఎంతో మంది గ్రామీణ మహిళలకు ఉపాధి అవకాశాలు కలి్పస్తున్నారు. హస్తకళా నైపుణ్యంలో మహిళలు నిరంతర సాధన అవసరం బృందాదత్ అహ్మదాబాద్ ఎన్ఐడి నుండి టెక్స్టైల్ డిజైన్‌లో గ్రాడ్యుయేషన్ చేశారు. తన చదువుకు సార్ధకత చేకూరే పనిని ఎంచుకోవాలనుకున్నారు. అందుకు తగినట్టుగా ఆమె దృష్టి గ్రామీణ భారతం వైపుగా కదలింది. భారతీయ మూలాల్లో ఎన్నో ప్రాచీన కళలున్నాయి. అవన్నీ అత్యంత సామాన్యులు అనదగిన వారి చేతిలోనే రూపుదిద్దుకున్నాయి. అలాంటివారిని తన డిజైన్ స్టూడియోలో ఒక సభ్యునిగా చేర్చుకుంటారు. ‘ప్రతి కళాకారుడూ తన కళలో పూర్తి హృదయాన్ని పెడతాడు. ఆ కళాకారుడు సృష్టించినదానిపట్ల అతనికే పూర్తి యాజమాన్య హక్కు, బాధ్యత ఉంటుంది. అప్పుడే ఆ కళ జీవిస్తుంది. హస్తకళలు పునరుద్ధరింపబడాలంటే ఇందులో నిరంతర సాధన చాలా అవసరం. ఆ దిశగానే నా ప్రయత్నాలు ఉంటున్నాయి. గ్రామాల్లోని మహిళల చేతిలో ఉన్న కళను మరికొందరికి పంచి, వాటి ద్వారా ఇంకొంత మంది కళాకారులను తయారుచేయాలన్నదే నా లక్ష్యం’ అంటారు ఈ డిజైనర్. ఇందులో భాగంగానే స్త్రీ, పురుషుల గార్మెంట్స్‌తో పాటు ఇంటీరియర్‌లో ఉపయోగించే వాల్ ఆర్ట్స్, కుషన్స్... వంటివెన్నో కళాత్మకంగా రూపొందిస్తున్నారు. కళాకారుల గొలుసు హస్తకళలను పునరుద్ధరించాలంటే అందుకు అత్యంత సమర్ధులైన బృందాన్ని ఏర్పాటుచేసుకోవడం ముఖ్యం. తమ ప్రయాణం విజయవంతంగా ముందుకు సాగడానికి రోజు రోజుకు పెరుగుతున్న కళాకారుల బృందమే అంటారీ యువ కళాకారిణి. ‘మా కళాకారులు సాంకేతిక పరిజ్ఞానాన్ని కూడా అందిపుచ్చుకుంటూ చరిత్రను ముందు తరాల వారికి మరింత వినూత్నంగా తీసుకువెళ్లడానికి కృషి చేస్తున్నారు. కళాకారుల కమ్యూనిటీల నైపుణ్యాలను పెంచడం ద్వారానే మా కళాకృతులను వృద్ధి చేస్తున్నాం. ఈ విధంగా భారతీయ గ్రామాలలోని నిపుణులైన కళాకారుల జీవనోపాధిని మెరుగుపరిచే గొలుసును సృష్టించడం మేం చేస్తున్న ప్రధానమైన పని. దానికి మా డిజైనర్ స్టూడియో ఒక కూడలిలాంటిది. మేం ఉపయోగించే ముడిసరుకంతా స్థానికంగానే లభిస్తుంది. సేంద్రీయ కాటన్‌తో రూపొందించిన ఫ్యాబ్రిక్ మాత్రమే కాదు, సహజ రంగులను డిజైన్లలో ఉపయోగిస్తాం. ఇందుకోసం గ్రామాల్లోని కళాకారులకు వర్క్‌షాప్‌లను నెలలో రెండు సార్లు నిర్వహిస్తున్నాం. కళాకారులందరికీ వారి పనికి తగిన వేతనాలు చెల్లిస్తాం’ అని తెలియజేస్తారీ యువ డిజైనర్. అప్‌సైకిల్.. రీసైకిల్.. మన దేశ గ్రామీణం అభివృద్ధి పయనంలో సాగాలంటే యువచైతన్యం మూలాల్లో దాగున్న కళలను వెలికి తీసుకురావాలనే ఆలోచనను అందరిలోనూ కలిగిస్తున్నారు బృంద. ‘మా స్టూడియోలో ఏదీ వృథాగా పోదు. ప్రతి చిన్న క్లాత్ ముక్కను కూడా ప్యాచ్‌వర్క్‌గా ఉపయోగిస్తాం. ఆంధ్రప్రదేశ్‌లోని కాళహస్తి, మచిలీపట్నం నుంచి తరతరాలుగా వస్తున్న కలంకారీ ఆర్ట్‌వర్క్‌ను తీసుకుంటున్నాం. బిహార్‌కి ప్రత్యేకమైన సుజ్ని అనే క్విల్ట్‌ల తయారీపై దృష్టి పెట్టాం. పాత క్లాత్‌లను కలిపి కుట్టే ఈ క్విల్ట్‌లు ఎంతో బాగుంటాయి. కచ్ ప్రాంతంలో ఉన్న కళాకృతులన్నీ మా డిజైన్స్‌లో ప్రతిఫలిస్తాయి. అంటే, అక్కడి కళామూలాలకు వెళ్లి, అక్కడి మహిళల హస్తకళను వృద్ధి చేసే పనిలో ఉంటున్నాం. ఇలా, దేశంలో ఏ ప్రాంతంలో ఏది ప్రత్యేకమైన ఆర్ట్ ఉందో తెలుసుకుంటూ, ఆ ప్రాంత కళాకారులతో మాట్లాడి వారి కళకు తగిన న్యాయం చేయడంపైనే దృష్టిపెడతాం’ అని తెలియజేస్తారు ఈ యువ కళావారధి. – నిర్మలారెడ్డి -
అరవింద డిజైన్ స్టూడియోను ప్రారంభించిన లావణ్య త్రిపాఠి (ఫొటోలు)
-
సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్న గొర్రెల కాపరి..
సాక్షి ముంబై: సాతారా జిల్లాకి చెందిన 60 ఏళ్ల వృద్ధుడైన ఓ గొర్రెల కాపరి చెప్పులు ఇప్పుడు వార్తల్లోకెక్కాయి. ఈయన కాళ్లకు వేసుకునే చెప్పులు ఎనిమిది కిలోల బరువుతోపాటు నాగుపాము పడగ రూపంలోని ప్రత్యేక డిజైన్‌లో, బంగారు రంగులో ఉండటంతో ఈ చెప్పులు అందరినీ ఆకట్టుకుంటున్నాయి. ఇలా అనేక ప్రత్యేకతలతో ఉన్న ఈ చెప్పులు రూ. 31 వేల విలువ ఉంటాయని ఆయన అంటున్నారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ పాదరక్షలు హల్చల్ చేస్తున్నాయి. సాతారా జిల్లా మాణ్ తాలూకాలోని జాంభుళణీ గ్రామంలో వృత్తి రీత్యా గొర్రెల కాపరి అయిన కెరాప్పా కోకరే ఈ చెప్పులు తయారు చేయించుకున్నారు. పొలాల్లో, కాలిబాటల్లో అత్యధిక సమయం గడిపే ఆయన వేషధారణ సైతం ప్రత్యేకంగా ఉంది. ధోతీ, చొక్కా, నెత్తిపై పసుపు రంగులో ఉండే పంచెతో కట్టిన తలపాగా (పగిడి)తోపాటు గ్రామీణ వస్త్రధారణతో ఆయన అందరినీ ఆకట్టుకుంటున్నారు. ముఖ్యంగా ఈ పరిసరాల్లో జరిగే ‘గాజీ’ నృత్య ప్రదర్శనలో కెరప్పా కోకరే ఈ చెప్పలు వేసుకుని చిందులు వేసి అందరినీ ఆకట్టుకుంటున్నారు. ఈ చెప్పులను ఆయన ప్రత్యేకంగా ఆక్లూజ్లో తయారు చేయించుకున్నారు. కెరప్పా కొకరే ధరించే ఈ చెప్పులలో 100 ఎల్ఈడీ లైట్లు, గోండాలు, 100 గజ్జెలు, నట్‌బోల్టులు, గాజు బిళ్లలు, బ్యాటరీ తదితరాలున్నాయి. చదవండి: ('ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ హత్యకు కుట్ర') ముఖ్యంగా బంగారు రంగులో ఉండే ఈ చెప్పులు, ఉదయం, రాత్రి సమయాల్లో వైవిధ్యంగా కనిపిస్తూ అందరినీ ప్రత్యేకంగా ఆకట్టుకుంటున్నాయి. ఈ చెప్పుల కారణంగా కోకరే కెరప్పా తన గ్రామంతోపాటు చుట్టుపక్కల గ్రామాల్లో కూడా చర్చల్లోకెక్కారు. అదేవిధంగా సోషల్ మీడియాలోనూ హల్చల్ చేస్తున్నారు. 15 ఏళ్ల వయసు నుంచే కోకరే కొరప్పాకు చెప్పులతోపాటు ప్రత్యేక వేషధారణ అంటే చాలా ఇష్టం. అందుకే ఆయన 60 ఏళ్ల వయసులో కూడా చెప్పులు, వేషధారణ అంతా ప్రత్యేకంగా ఉండేలా చూసుకుంటారు. స్వగ్రామంతోపాటు చుట్టుపక్కల గ్రామాల్లో జరిగే కార్యక్రమాలలో ఆయన ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నారు. ముఖ్యంగా గాజి నృత్య ప్రదర్శనలో తనదైన నృత్యరీతిలో అందరినీ ఆకట్టుకుంటారు. ముఖ్యంగా ఇప్పుడు ఎనిమిది కిలోల బరువుతో, రూ. 31 వేల విలువైన ప్రత్యేక పాదరక్షలతో ఓ సెలబ్రిటీ అయిపోయారు. -
ప్రేమించడానికి రోజుకో కారణం!
‘‘నిన్ను (శంతను హజారిక) ప్రేమించడానికి, గౌరవించడానికి నాకు రోజూ ఓ కొత్త కారణం దొరుకుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది’’ అని హీరోయిన్ శ్రుతీహాసన్ అన్నారు. శ్రుతి బాయ్‌ఫ్రెండ్ శంతను చిత్రకారుడు అనే సంగతి తెలిసిందే. తాజాగా శంతను కొన్ని ఆర్ట్స్‌ను డిజైన్ చేశారు. ఈ డిజైన్స్‌ను చూసి తెగ మురిసిపోతూ, శంతను గురించి సోషల్ మీడియాలో ఓ పోస్ట్ షేర్ చేశారు శ్రుతీహాసన్. ‘‘నిన్ను చూస్తుంటే చాలా గర్వంగా ఉంది. ఈ అద్భుత (ఆర్ట్ ఎగ్జిబిషన్) సాయంకాల సమయాల్లో నన్ను భాగస్వామిని చేసినందుకు నా మనసు ఆనందంతో పులకరించిపోతోంది’’ అన్నారు శ్రుతి. ఈ ఎగ్జిబిషన్లో శ్రుతీ తన మ్యూజికల్ టీమ్‌తో కలసి పాడారు. -
టాప్ టు బాటమ్; సేమ్.. సేమ్.. చమక్కులు
పువ్వుల నవ్వులు.. ప్లెయిన్ హంగులు కుచ్చుల చమక్కులు.. ఎంబ్రాయిడరీ మెరుపులు ఒకే రంగుతో ఆకట్టుకుంటే అది నేటి పార్టీవేర్ లెహంగా డ్రెస్ అవుతుంది. అంచుల రంగుతో ఓణీ.. అదే రంగుతో ఛోలీ అనే నిన్నటి కళ కు చుక్కను చుట్టి టాప్ టు బాటమ్ ఒకే కలర్.. ఒకే ప్రింట్.. ఒకే వర్క్... అంటూ లెహంగా డ్రెస్సులను కొత్త కళతో మెరిపిస్తున్నారు డిజైనర్లు. వేడుకులకు నిండైన కళను తీసుకువస్తున్నారు. చిన్ని చిన్ని మార్పులు ఒకే రంగుతో ప్లెయిన్ లెహంగా డ్రెస్ వెస్ట్రన్, గెట్ టు గెదర్ పార్టీలకు వన్నె తీసుకువస్తున్నాయి. ఇక ఒకే కలర్ లెహంగా, ఛోలీ, దుపట్టాపై కొన్ని ప్రింట్లు, మరికొన్ని ఎంబ్రాయిడరీ వర్క్‌తో చేసిన డిజైన్స్ వివాహ వేడుకలకు నిండుదనాన్ని తీసుకువస్తున్నాయి. వీటిలో ఫ్లోరల్ డిజైన్స్ నేటి మగువలను మరింతగా ఆకట్టుకుంటున్నాయి. (క్లిక్: మెడలో పర్సుల హారాలు.. భలే ఉన్నాయ్!) -
టైమ్‌కి టైమొచ్చింది
టైమ్ ఎంతయ్యిందో తెలియడానికి చేతికి గడియారం ధరిస్తాం. బెల్ట్, బ్రేస్లెట్, బ్యాంగిల్ రకరకాల రూపాల్లో గడియారాలు ఎంపిక చేసుకుని మురిసిపోతాం. కానీ, టైమ్‌తో నిమిత్తం లేకుండా టైమ్ సింబల్ ఉన్న ఆభరణాన్ని మెడలోనూ ధరిస్తే స్టయిలిష్ లుక్‌తో ఆకట్టుకోవడం ఖాయం అంటోంది ఈ ఫ్యాషన్ జ్యువెలరీ. పెయింటింగ్ జ్యువెలరీ చూశాం. ఫ్యాబ్రిక్ జ్యువెలరీ కనుక్కున్నాం. టెర్రకోట జ్యువెలరీ కొనుక్కున్నాం. థ్రెడ్ జ్యువెలరీ రంగులను హత్తుకున్నాం. న్యూ ఇయర్లోకి అడుగుపెడుతున్న శుభవేళ యాంటిక్ లుక్‌తో ఆకట్టుకునే టైమ్ జ్యువెలరీ అతివల అలంకరణలో బ్రైట్‌గా వెలగడానికి సిద్ధమయ్యింది. ఈ ఫ్యాషన్ జ్యువెలరీలో డిజైనర్ల సృజన చూస్తుంటే ఇక ‘టైమ్‌కి టైమొచ్చింది’ అని అనకుండా ఉండలేరు. (డ్రెస్ ఏదైనా వాటి మీదకు లాంగ్ ష్రగ్ ఒకటి ధరిస్తే చాలు!) -
టిపుల్ఐటీ హైదరాబాద్‌లో కొత్త కోర్సు ప్రారంభం
రాయదుర్గం(హైదరాబాద్): ట్రిపుల్ఐటీ హైదరాబాద్ ఓ కొత్త కోర్సుకు శ్రీకారం చుట్టింది. రెండేళ్ల కాలపరిమితితో కూడిన ప్రొడక్ట్ డిజైన్ అండ్ మేనేజ్మెంట్(పీడీఎం)లో ఎంటెక్ కోర్సులో ప్రవేశాలకు దరఖాస్తులు కోరుతోంది. టెక్నాలజీ, ప్రొడక్ట్స్, డిజైన్, ఇన్నోవేషన్, ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్‌లో అభ్యర్థులు అవగాహన సాధించేలా ఈ కోర్సును రూపొందించా రు. ప్రారంభ కెరీర్లో ఉన్న ఐటీ గ్రాడ్యుయే ట్లు, వర్కింగ్ ప్రొఫెషనల్స్ మెరుగైన అనుభవాన్ని సాధించేందుకు, కొత్త ఉత్పత్తులు, కొత్త స్టార్టప్‌లు ప్రారంభించేలా అభ్యర్థులను సన్నద్ధులను చేయడంలో ఈ కోర్సు దోహదపడుతుంది. ఈ కోర్సు ఐటీసీ ఉత్పత్తులపై ప్రత్యేక దృష్టితో సాంకేతికత, డిజైన్, నిర్వహణ అం శా ల్లో సమతుల్యత కలిగి ఉందని పీడీఎం ప్రోగ్రా మ్ హెడ్ ప్రొ. రఘురెడ్డి తెలిపారు. శీతా కాల ప్రవేశాల్లో భాగంగా ఈ కోర్సులో చేరడానికి నవంబర్ 10 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. -
చిరిగిన స్వెటర్.. లక్షపైనే.. స్పెషల్ ఏంటంటే
చలికాలం వస్తుంది కదా అని మార్కెట్లో స్వెటర్ కొనడానికి వెళ్తే.. అక్కడ ‘ఎలుకలు కొరికిన స్వెటర్... కుందేలు కొరికిన స్వెటర్..’ ఇలా చిరిగిన స్వెటర్లు అమ్మే దృశ్యాలను త్వరలోనే చూడబోతున్నాం. నిజం, ఈ మధ్యనే ప్రముఖ ఫ్యాషన్ బ్రాండ్ బాలెన్సియాగా ‘డిస్ట్రాయిడ్ క్రూనెక్’ పేరుతో కొత్తరకం స్వెటర్లను విడుదల చేసింది. వంద శాతం ఉన్నితో తయారు చేసిన వీటి డిజైన్, అచ్చం ఎలుకలు కొరికితే చిల్లులు పడిన స్వెటర్‌లాగే ఉంటుంది. మొదట చిరిగిన ప్యాంటుగా పేరు పొందిన టాన్ జీన్స్ ఫ్యాషన్‌ను కూడా ఇలాగే అన్నారు. ఇప్పుడు సామాన్యులు కూడా ఇష్టపడిమరీ ఆ ప్యాంట్లను కొంటున్నారు. మార్కెట్లో వచ్చేవి యువతకు నచ్చితే చాలు వాటి సేల్స్ అమాంతం పెరిగిపోతాయి. ఇక ఈ స్వెటర్లో ఆశ్చర్యపోయే మరో విషయం ఏంటంటే దీని ధర. మీరు కనుక దీన్ని కొనాలనుకుంటే ఈ స్వెటర్‌లాగే మీ జేబు, పర్స్కూ చిల్లు పడ్డం ఖాయం. ఎందుకంటే ఈ స్వెటర్ అక్షరాల 1,450 డాలర్లు అంటే మన కరెన్సీలో రూ.1,07,652 పలుకుతుంది మరి! చదవండి: ఇడ్లీ, దోశ పిండితో మొదలెట్టి.. వేల కోట్ల కంపెనీకి సీఈఓ -
పర్ఫెక్ట్ కాంబినేషన్.. కట్టిపడేస్తోన్న ప్రింటెడ్ లెహంగా
వేడుక ఏదైనా లెహంగా నేటికీ కొత్తగా మెరుస్తూనే ఉంది. అమ్మాయిల మనసు లెహంగా చుట్టూ అల్లుకుంటూనే ఉంది. ఎంబ్రాయిడరీతో మెరిపించినా, ప్యాచ్‌లు జత చేర్చినా పువ్వులు సింగారించినా, ప్రింట్లు సందడి చేసినా వెస్ట్రన్ టాప్ చేరాల్సిందే లెహంగా గ్రాండ్‌గా వెలిగిపోవాల్సిందే! మెహందీ వేడుకల్లో ఇండో వెస్ట్రన్ స్టైల్ యువతను బాగా ఆకట్టుకుంటుంది. అందుకే, ప్లెయిన్ బెల్ స్లీవ్స్ టాప్, ప్రింటెడ్ లెహంగా పర్ఫెక్ట్ కాంబినేషన్‌గా కట్టిపడేస్తోంది. ఫ్లోరల్: రంగురంగుల పువ్వులన్నీ లెహంగా డ్రెస్ మీద వచ్చి చేరినట్టు చేసిన డిజైన్ మెహిందీ వేడుకలకు మరిన్ని సొబగులను అద్దుతుతుంది. వేడుకను మరింత వైబ్రెంట్‌గా మార్చేస్తుంది. వెస్ట్రన్ కేప్‌కి ఇండియన్ స్టైల్ ఎబ్రాయిడరీతో ప్రింటెడ్ లెహంగాకు కొత్త రూపు తీసుకువచ్చి వేడుకలో హైలైట్‌గా వెలిగిపోవచ్చు అని చూపుతోంది ఈ డిజైన్. జాకెట్ స్టైల్ టాప్ కాంబినేషన్‌తో పూర్తిగా వెస్ట్రన్ లుక్ అనిపిస్తున్న లెహంగా డ్రెస్. సంప్రదాయ వేడుకలనూ స్టైలిష్ లుక్‌తో ఆకట్టుకునేలా చేస్తోంది. ఇండియన్ ఆర్కిటెక్చర్ థీమ్‌తో ఆకట్టుకునే డిజైన్స్ తీసుకువచ్చే పంజాబీ డిజైనర్ పరమ్సాహిబ్ రూపొందించిన లెహంగా. పూర్తి జరీ ఎంబ్రాయిడరీతో లెహంగా, వెస్ట్రన్ పెప్లమ్ టాప్‌తో జత చేసిన వేడుకలకు ఆకట్టుకునే లుక్ తీసుకువచ్చారు. -
ఈ పోస్టల్ స్టాంప్ డిజైన్ చేస్తే రూ.15 వేలు మీ సొంతం
మీకు ఫోటో డిజైనింగ్ విషయంలో నైపుణ్యం ఉందా? అయితే మీకు ఒక శుభవార్త. ప్రత్యేక పోస్టల్ స్టాంప్ రూపకల్పన చేసిన వారికి కేంద్ర ప్రభుత్వం రూ.15,000 వరకు నగదు బహుమతి అందించనుంది. "సైన్స్ అండ్ టెక్నాలజీలో భారతదేశం సాధించిన అతిపెద్ద విజయాలు ఏమిటి? వాటితో కూడిన ఒక పోస్టల్ స్టాంప్ డిజైన్ చేస్తే రూ.15,000 వరకు గెలుచుకునే అవకాశం ఉంది!" అని కేంద్రం ట్వీట్ చేసింది.(చదవండి: వర్క్ ఫ్రమ్ హోం: ఇదీ పరిస్థితి!) భారతదేశం 75వ స్వాతంత్ర్య దినోత్సవం జరుపుకున్న సందర్భంగా విజ్ఞాన్ ప్రసార్, డిపార్ట్ మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఆధ్వర్యంలో ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ లో భాగంగా పోస్టల్ స్టాంప్ డిజైన్ పోటీని ప్రకటించింది. కేంద్ర ప్రభుత్వ పోర్టల్ www.mygov.in ఓపెన్ చేసి మీ వివరాలు సమర్పించి లాగిన్ కావాల్సి ఉంటుంది. ఈ పోటీలో పాల్గొనడానికి చివరి తేదీ సెప్టెంబర్ 15, 2021 రాత్రి 11.45. మొదటి బహుమతి రూ.15,000, రెండో బహుమతి 10,000, మూడో బహుమతి 5,000, మూడు కన్సోలేషన్ ప్రైజ్ రూ.2,000. ఈ పోటీలో పాల్గొనడానికి ఇక్కడ క్లిక్ చేయండి. Calling creative minds to participate in the postal stamp design competition on the theme - "विज्ञान से विकास - प्रौद्योगिकी से प्रगति". Submit your entry today and stand a chance to win cash prizes of upto ₹15,000. Visit: https://t.co/8NZHsTJUi9 pic.twitter.com/fhF6y8oYvW — MyGovIndia (@mygovindia) August 24, 2021 -
పోలవరం పెండింగ్ డిజైన్లు కొలిక్కి
సాక్షి, అమరావతి: పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి ఇప్పటికీ పెండింగ్‌లో ఉన్న డిజైన్లు అన్నింటినీ డీడీఆర్పీ (డ్యామ్ డిజైన్ రివ్యూ ప్యానల్) కొలిక్కి తెచ్చింది. పూణేలో సీడబ్ల్యూపీఆర్ఎస్ (సెంట్రల్ వాటర్ అండ్ పవర్ రీసెర్చ్ స్టేషన్)లో 3–డీ పద్ధతిలో ఎకరం విస్తీర్ణంలో నిర్మించిన పోలవరం నమూనా ప్రాజెక్టు ద్వారా అధిక ఒత్తిడితో నీటిని పంపుతూ ప్రయోగాలు నిర్వహించినప్పుడు ఆ వరద చూపిన ప్రభావాలను పరిశీలించిన డీడీఆర్పీ సభ్యులు.. వాటిని శుక్రవారం క్షేత్రస్థాయిలో పోలవరం ప్రాజెక్టు పనులతో అన్వయించారు. తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో పీపీఏ (పోలవరం ప్రాజెక్టు అథారిటీ) సీఈఓ చంద్రశేఖర్ అయ్యర్, సభ్య కార్యదర్శి రంగారెడ్డి, జలవనరుల శాఖ కార్యదర్శి శ్యామలరావు, ఈఎన్సీ సి. నారాయణరెడ్డి, కాంట్రాక్టు సంస్థల ప్రతినిధులతో డీడీఆర్పీ చైర్మన్ ఏబీ పాండ్య శనివారం కూలంకషంగా సమీక్షించారు. గోదావరి నదీ ప్రవాహాన్ని స్పిల్ వే మీదుగా మళ్లించడానికి 600 మీటర్ల వెడల్పుతో అప్రోచ్ ఛానల్‌ను తవ్వేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. సీడబ్ల్యూపీఆర్ఎస్లో మరోసారి ప్రయోగాలు నిర్వహించాక అప్రోచ్ ఛానల్ గైడ్ బండ్ డిజైన్‌కు తుదిరూపు ఇస్తామన్నారు. ఈ సీజన్లో ఎగువ, దిగువ కాఫర్ డ్యామ్‌ల ఖాళీ ప్రదేశాలను భర్తీచేసి.. వరద ప్రవాహాన్ని స్పిల్ వే మీదుగా మళ్లించాలని పాండ్యా సూచించారు. స్పిల్ వే మీదుగా విడుదల చేసిన వరద నీటి ఉధృతి గోదావరి ఎడమ గట్టు (పురుషోత్తపట్నం గట్టు), కుడి గట్టు (పోలవరం గట్టు)పై చూపే ప్రభావం ఆధారంగా.. వాటిని పటిష్టం చేయడానికి చేపట్టాల్సిన పనులకు సంబంధించిన డిజైన్‌ను ఖరారు చేశారు. ఈ సీజన్లో పూర్తిచేయాల్సిన పనులకు ఏమాత్రం ఆటంకం కలగకుండా డిజైన్లను ఖరారు చేస్తేనే.. గడువులోగా ప్రాజెక్టును పూర్తిచేయడానికి అవకాశం ఉంటుందన్న జలవనరుల శాఖ కార్యదర్శి శ్యామలరావు, ఈఎన్సీ సి. నారాయణరెడ్డిల అభిప్రాయంతో డీడీఆర్పీ ఏకీభవించింది. పెండింగ్‌లో ఉన్న 29 డిజైన్లను మార్చి 15 నాటికి సీడబ్ల్యూసీతో ఆమోదింపజేసేలా ప్రత్యేక కార్యాచరణను రూపొందిస్తామని.. ఆ మేరకు డిజైన్లను ఖరారుచేయడం ద్వారా పనులకు ఆటంకం కలగకుండా చూస్తామని డీడీఆర్పీ చైర్మన్ ఏబీ పాండ్య హామీ ఇచ్చారు. కాగా, పోలవరం ప్రాజెక్టు రెండ్రోజుల పర్యటనను ముగించుకున్న పాండ్య, ఇతర సభ్యులు శనివారం రాత్రి రాజమహేంద్రవరం నుంచి ఢిల్లీకి వెళ్లారు. 2022 నాటికి పోలవరం పూర్తి : పాండ్యా ఆంధ్రప్రదేశ్‌కు జీవనాడి అయిన పోలవరం జాతీయ ప్రాజెక్టు పనులు 2022 నాటికి పూర్తవుతాయని డీడీఆర్పీ (డ్యామ్ డిజైన్ రివ్యూ ప్యానల్) చైర్మన్ ఏబీ పాండ్య చెప్పారు. ప్రాజెక్టు డిజైన్లకు సంబంధించిన అంశాలపై పీపీఏ చైర్మన్ చంద్రశేఖర్ అయ్యర్, రాష్ట్ర జలవరుల శాఖ కార్యదర్శి శ్యామలరావు, ఈఎన్సీ సి.నారాయణరెడ్డిలతో కలిసి శనివారం రాజమహేంద్రవరంలో ఆయన అధికారులు, కాంట్రాక్టు సంస్థల ప్రతినిధులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పోలవరం స్పిల్ వే నిర్మాణంలో కీలకమైన 192 గడ్డర్ల అమరిక నేటితో పూర్తయిందన్నారు. స్పిల్ వే బ్రిడ్జి 1,128 మీటర్లకుగానూ 1,105 మీటర్లు పూర్తయిందని చెప్పారు. పోలవరం ప్రాజెక్టుకు అమర్చుతున్న గేట్లు ప్రపంచంలోనే అతి పెద్దవని ఆయన వెల్లడించారు. స్పిల్ వేకు 48 గేట్లకుగానూ ఇప్పటికే 29 గేట్లను అమర్చారని పాండ్య చెప్పారు. గేట్లకు హైడ్రాలిక్ సిలిండర్లు, పవర్ ప్యాక్‌లు అమర్చే పనులు వేగంగా సాగుతున్నాయని.. షెడ్యూలు ప్రకారం పనులు సంతృప్తికరంగా జరుగుతున్నాయన్నారు. -
లేటెస్ట్ కలెక్షన్; ఈవిల్ ఐ బ్రేస్లెట్
దేశాల అంతరాలు లేకుండా చెడు దృష్టి పడకుండా అడ్డుకునేందుకు మనిషి ప్రాచీన కాలం నుంచి రకరకాల ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాడు. వాటిలో ముఖ్యమైనది పెద్ద నీలిరంగు కనుగుడ్డు ఆకారం. ఇది మనకి హాని జరగాలని కోరుకునేవారిపై చెడు ప్రభావాన్ని చూపుతుందనే నమ్మకంతో మార్కెట్లోకి వచ్చింది. అయితే, ప్రపంచవ్యాప్తంగా మాత్రం ఇదో ఆభరణంగా అందరినీ ఆకర్షించింది. ఇప్పుడు ఈ డిజైన్స్‌కి ఏమాత్రం కొదవలేదన్నట్టుగా ‘నీలికన్ను’ దర్జా పోతోంది. ఇతర ఆభరణాలను ఒక్క చూపుతో కట్టడి చేస్తూ ట్రెండ్‌లో ముందంజలో ఉంటోంది. అదృష్టానికి చిహ్నంగా మారిపోయింది. ఆభరణాల విభాగంలో ఈవిల్ ఐ బ్రేస్లెట్, లాకెట్, ఉంగరం, చెవి పోగుల్లో ఎక్కువగా దర్శనమిస్తోంది. వీటిలో పెద్ద, చిన్న పరిమాణంలో ఉన్నవి లభిస్తున్నాయి. ఇతర దేశాల నుంచి దిగుమతి అయ్యే ఫ్యాషన్ జ్యువెలరీలోనూ ఈవిల్ ఐ తన ప్రాధాన్యతను చాటుకుంటూనే ఉంది. ‘వినియోగదారులు వీటిని వ్యక్తిగత ఆభరణంగా ఎంపిక చేసుకుంటున్నారు’ అని ఆభరణాల నిపుణులు చెబుతున్న మాట. ఈవిల్ ఐ ఆభరణాన్ని తమ ఆత్మీయులకు మంచి జరగాలని కానుకగా కూడా ఇస్తున్నారు. -
డిజైన్ లైబ్రరీ ఎగ్జిబిషన్‌ను ప్రారంభించిన నటి మన్నారా చోప్రా
-
'స్మైల్' లుక్..
-
డిజైన్ లైబ్రరి షురూ..
-
వన్‌ప్లస్ 9ప్రో డిజైన్ ఫస్ట్ లుక్
భారత్‌లో చైనా మొబైల్ సంస్థల హవా కొనసాగుతుంది. గత నెలలో వన్‌ప్లస్ 8టీ స్మార్ట్ ఫోన్‌ని లాంచ్ చేసిందో లేదో అప్పుడే తర్వాత వన్‌ప్లస్ నుండి రాబోయే ఫ్లాగ్ షిప్ మొబైలుపై రూమర్లు వస్తున్నాయి. తాజాగా వన్‌ప్లస్ 9ప్రో డిజైన్‌కు సంబంధించి ఫస్ట్ లుక్ ఒకటి బయటకి వచ్చింది. ఈ ఫస్ట్ లుక్ ప్రకారం వన్‌ప్లస్ 9ప్రో యొక్క డిజైన్ వనిల్లా వెర్షన్ మాదిరిగానే ఉండనున్నట్లు తెలుస్తుంది. ఇందులో కర్వ్డ్ 6.7-అంగుళాల డిస్ప్లే, సెల్ఫీ కెమెరా కోసం ఒక పంచ్ హోల్ కటౌట్‌తో రానున్నట్లు సమాచారం. వాల్యూమ్ బటన్ ఫోన్ కి ఎడమ వైపున ఉండగా, పవర్ బటన్ కుడి వైపున ఉన్నాయి. వెనుకవైపు, నాలుగు కెమెరా లెన్స్‌లతో సమానమైన దీర్ఘచతురస్రాకార కెమెరా ప్యానెల్ ఉంది. వన్‌ప్లస్ 9 సిరీస్ ఫోన్లో 144 Hz రిఫ్రెష్ రేట్ డిస్ ప్లే, స్నాప్‌డ్రాగన్ 875 ప్రాసెసర్ వాడనున్నట్లు సమాచారం. గతంలో వచ్చిన సమాచారం ప్రకారం మార్చిలో కొత్త వన్‌ప్లస్ 9 సిరీస్ ఫోన్ తీసుకొస్తుందో లేదో చూడాలి. (చదవండి: ట్విటర్ ఫ్లీట్స్‌లో భారీ లోపం) -
భారీగా ఆలయ నిర్మాణం
అహ్మదాబాద్/అయోధ్య: శ్రీరాముని జన్మభూమి అయోధ్య సర్వాంగ సుందరంగా ముస్తాబవుతోంది. భక్తుల రామనామంతో పుర వీధులు ప్రతిధ్వనిస్తున్నాయి. మందిర నిర్మాణానికి 5వ తేదీన భూమిపూజ చేస్తున్న నేపథ్యంలో మందిరం డిజైన్ ఎలా ఉంటుందన్న ఆసక్తి భక్తుల్లో నెలకొంది. మొదట అనుకున్న దానికంటే రెట్టింపు సైజులో మందిరాన్ని నిర్మించడానికి సన్నాహాలు చేస్తున్నారు. నాగర శైలిలో మందిరం ఆకృతి ఉంటుంది. గత ఏడాది సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన తర్వాత ఆలయ ఆకృతిలో మార్పులు చేశామని, గతంలో కంటే భారీ నిర్మాణానికి సన్నాహాలు చేస్తున్నట్టు ఆలయాన్ని డిజైన్ చేసిన ఆర్కిటెక్ట్ చంద్రకాంత్ సోమ్‌పుర శుక్రవారం మీడియాకు వెల్లడించారు. ఆలయ శిఖరంతో పాటు రెండు గోపురాలు ఉండేలా గతంలో మందిరాన్ని డిజైన్ చేశామని ఇప్పుడు వాటి సంఖ్య అయిదుకి పెంచినట్లు ఆయన తెలిపారు. మూడేళ్లలో ఆలయ నిర్మాణం పూర్తవుతుందని చెప్పారు. 30 ఏళ్ల క్రితమే మందిరానికి ఆకృతి ఆలయాల నిర్మాణంలో గుజరాత్‌లోని అహ్మదాబాద్‌కు చెందిన సోమ్‌పుర వంశస్తులు ప్రఖ్యాతి వహించారు. ఒకప్పుడు సోమనాథ్, అక్షరధామ్ ఆలయంతో పాటు 200పైగా ఆలయాలకు వీరు డిజైన్ చేశారు. ఇప్పుడు ఆ వంశానికి చెందిన చంద్రకాంత్ సోమ్‌పుర (77) తన ఇద్దరు కుమారులతో కలిసి రామ మందిర నిర్మాణానికి డిజైన్ రూపొందించారు. 30 ఏళ్ల క్రితమే విశ్వహిందూ పరిషత్ నాయకుడు అశోక్ సింఘాల్ మందిరానికి డిజైన్ చేయాలని చెప్పినట్టుగా ఆయన వెల్లడించారు. ఆలయ విశిష్టతలు ► ఉత్తరాది ఆలయాల్లో కనిపించే నాగర శైలిలో మందిరం ఉంటుంది. గర్భగుడి అష్టభుజి ఆకృతిలో ఉంటుంది. ► మూడు అంతస్తుల్లో నిర్మించే రామ మందిరంలో అయిదు గోపురాలతో మండపాలు, శిఖరం ఉంటాయి. ► ఆలయం ఎత్తు 161 అడుగుల వరకు ఉంటుంది. ► 10 ఎకరాల స్థలంలో మందిరం, మిగతా 57 ఎకరాల్లో వివిధ సముదాయాలను నిర్మిస్తారు. ఢిల్లీలో భారీ తెరలు ఏర్పాటు సాక్షి, న్యూఢిల్లీ: అయోధ్యలో 5న జరిగే మందిరం భూమిపూజ కార్యక్రమాన్ని ప్రత్యక్షంగా తిలకించేందుకు ఢిల్లీ వ్యాప్తంగా భారీ స్క్రీన్లను ఏర్పాటు చేయనున్నట్లు ఢిల్లీ బీజేపీ అధ్యక్షుడు ఆదేశ్ కుమార్ గుప్తా చెప్పారు. అయోధ్యలో భూమి పూజ రోజు పంచేందుకు మిఠాయిలు సిద్ధంచేస్తున్న దృశ్యం -
హెయిర్‌స్టైల్‌ను కట్ చేసే రోబోట్ రూపకల్పన
-
ఐఫోన్ 12 డిజైన్‌లో పెను మార్పు!
సాక్షి, న్యూడిల్లీ : టెక్ దిగ్గజం ఆపిల్.. ఐఫోన్ 12 సిరీస్ డిజైన్‌లో పెను మార్పుకు శ్రీకారం చుట్టింది. మామూలుగా ఐఫోన్ 12 అంచులు గుండ్రంగా ఉండటం పరిపాటి. అయితే ఆ గుండ్రటి డిజైన్ స్థానంలో చదునైన అంచులను ప్రవేశపెట్టనుంది. ప్రస్తుతం కొత్త డిజైన్‌కు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. కొత్త సిరీస్ ఫోన్‌కు సంబంధించిన క్యాడ్ స్కెచెస్, మౌల్డ్స్ నెట్టించ చక్కర్లు కొడుతున్నాయి. ఆ ఫొటోలను నిశితంగా పరిశీలిస్తే వాటి అంచులు చదునుగా ఉండటం మనం గుర్తించవచ్చు. ఈ కొత్త డిజైన్ ఐపాడ్ ప్రో డిజైన్‌కు దగ్గరగా ఉందని కొందరు నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ( ‘ఆపిల్’లో లోపం కనిపెట్టి.. జాక్‌పాట్!) సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన ఐఫోన్ 12, ఐఫోన్ 12 ప్రో కొత్త మోడళ్లు అంతేకాకుండా మ్యాక్‌లను కూడా ఇదే డిజైన్‌తో రూపొందించే అవకాశం ఉందని భావిస్తున్నారు. డిజైన్ విషయాన్ని పక్కన పెడితే.. ఐఫోన్ 12 లైన్‌లోని నాలుగు మోడళ్లు మూడు వేరు వేరు స్ర్కీన్ సైజుల్లో అందుబాటులోకి రానున్నట్లు తెలుస్తోంది. యాపిల్ ఐఫోన్ 12.. 5.4, ఐఫోన్ 12 ప్రో, ఐఫోన్ 12 మ్యాక్స్ 6.1, ప్రీమియమ్ ఐఫోన్ 12 ప్రో మ్యాక్స్ 6.7 ఇంచుల డిస్ప్లేలతో లభించనున్నట్లు సమాచారం. -
అత్యవసరంలో 'ఆర్వీవరం'
‘‘అమ్మకి హెల్త్ బాగోలేదు. ఇంటి దగ్గర ఒంటరిగా వదిలి వచ్చాను. ఎలా ఉందో ఏమిటో...’’ ఇలా దిగులు పడే నగరవాసులు ఎందరో. పేరెంట్స్ మీద ఎంత ప్రేమాభిమానాలు ఉన్నా...పరుగుల ప్రపంచంలో...వారిని ఎల్లవేళలా కనిపెట్టుకుని ఉండడం కష్టమే. ఈ సమస్యలకు ఇప్పటికే మార్కెట్లో చలామణీలో ఉన్న పరిష్కారాలకు భిన్నంగా వినూత్న శైలి పరికరాన్ని అందుబాటులోకి తెచ్చారు నగరానికి చెందిన యువ బృందం. సాక్షి, సిటీబ్యూరో: టీవీ చూస్తూ ఇంట్లోనే కుప్పకూలిపోయిన మహిళ, బాత్రూమ్లో గుండెపోటు... ఇలాంటి వార్తలు, విషయాలు వింటూనే ఉన్నాం. ఒంటరి జీవితాలు పెరిగిపోతున్న నేటి రోజుల్లో ప్రాణాపాయం ఎటువైపు నుంచి ఎప్పుడు ముంచుకొస్తుందో తెలియని దుస్థితి. మరోవైపు వృద్ధుల పరిస్థితి మరింత దయనీయంగా మారింది. ‘‘ఉద్యోగ, వ్యాపారాల దృష్ట్యా తమ తల్లిదండ్రులకు పిల్లలు దూరంగా ఉంటున్నారు. అలా ఉన్న ప్రతి ఒక్కరికీ తమ తల్లిదండ్రుల ఆరోగ్యం, ఎమర్జన్సీ కేర్ గురించిన ఒత్తిడిì కి గురయ్యేవీరికి సీనియర్ సిటిజన్స్‌కు 24/7 వైద్యసేవలను అందించే మార్గం తెలిస్తే అంతకు మించిన ప్రశాంతత ఏదీ ఉండదు’’అని చెప్పారు నగరానికి చెందిన సుశాంత్‌రెడ్డి. తమ స్టార్టప్ ఆర్వీ (్చటఠిజీ.జీn)గురించిన విశేషాలు ఆయన మాటల్లోనే... పిచ్చాపాటినుంచి పుట్టినఆలోచన.. ముంబయ్‌లో ఐఐటీ చదివి సింగపూర్, అమెరికాలో ఎంబీఏ చేశాను. ఆ సమయంలో నా మిత్రులతో మాట్లాడేటప్పుడు తప్పనిసరిగా ఇండియాలో ఉన్న పేరెంట్స్ వైద్య సేవల గురించి ప్రస్తావన వచ్చేది. సాంకేతిక పరిజ్ఞానాన్ని అనుసంధానం చేసుకుంటూ వృద్ధులకు అత్యవసర వైద్య సేవలను అందించడం అనేది మన దేశంలో ఇంకా చాలా తక్కువ స్థాయిలోనే ఉంది. దీనిని దృష్టిలో పెట్టుకుని ఆధునిక టెక్నాలజీని సమర్థంగా వినియోగించడం ద్వారా పెద్దలకు అత్యంత వేగవంతమైన విశ్వసనీయమైన వైద్య సేవల్ని అందించాలని మిత్రుడు అవినాష్, డాక్టర్ చందనలతో కలిసి ఆర్వీ స్టార్టప్‌కు శ్రీకారం చుట్టాం. బటన్‌నొక్కితే చాలు... అర్వీ అనేది ఒక స్మార్ట్ మెడికల్ సిస్టమ్. ఇంట్లోని వాష్‌రూమ్, బెడ్రూమ్, హాల్, కిచెన్ పలు కీలక ప్రదేశాల్లో డివైజ్ అమరుస్తాం. ఈ పరికరానికి రెడ్, గ్రీన్ రంగుల్లో రెండె బటన్స్ ఉంటాయి. అత్యవసర సమయాల్లో డివైజ్ మీద ఉన్న రెడ్ బటన్‌ను నొక్కితే సైరన్ వస్తుంది. ఆటోమేటిగ్గా ఆర్వీ టీమ్ అప్రమత్తమవుతుంది. ఇరుగు పొరుగువారికి ఎస్సెమ్మెస్‌లు వెళతాయి. బాధితునికి, ఎమర్జన్సీ డాక్టర్‌కు మధ్య హాట్‌లైన్ ఏర్పాటవుతుంది. కనీసం నలుగురు కుటుంబ సభ్యుల ఫోన్ నెంబర్లు ఫీడ్ చేసి ఉంచుతాం కాబట్టి వారికి కాల్స్ వెళతాయి. అలాగే మా కాల్ సెంటర్‌కి కాల్ వస్తుంది. ఏ ప్లేస్‌లో ఎటువంటి స్థితిలో ఉండి బటన్ పుష్ చేశారో తెలిసిపోతుంది కాబట్టి దాని ప్రకారం ఎమర్జన్సీని అంచనా వేస్తాం. మా కాల్కి రెస్పాండ్ కాకపోయినా సరే జీపీఎస్ సాంకేతికత సహయంతో వారుండే ప్రదేశానికి అంబులెన్స్‌తో సహా చేరుకుంటాం. ఈ డివైజ్ 100 మీటర్ల వరకూ పనిచేస్తుంది. అలాగే నాన్ ఎమర్జన్సీ సమయంలో గ్రీన్ బటన్ ప్రెస్ చేస్తే మెడికల్ డెలివరీ, డాక్టర్ అపాయింట్ మెంట్, ఇంటి దగ్గరే హెల్త్ చెకప్స్ వంటి సేవలు లభిస్తాయి. ఒప్పందాలతో సేవల విస్తరణ.. ప్రస్తుతం ఆర్వీ సంస్థ 350 మంది డాక్టర్స్, నర్సింగ్ సిబ్బంది, అంబులెన్స్, ఫిజియోథెరఫి, ఫార్మసీ ఇలా అన్ని రకాల వైద్యసదుపాయాలతో ఒక నెట్వర్క్ని ఏర్పాటు చేసింది. మా కాల్ సెంటర్లలో కూడా ఫిజియోథెరపిస్ట్స, నర్సింగ్, డయాగ్నస్టిక్స్, ఫార్మసీ...బ్యాగ్రవుండ్ ఉన్నవారినే కాల్ సపోర్ట్‌కి తీసుకుంటున్నాం. ప్రస్తుతం వృద్ధుల అత్యవసర సేవల గురించి యాప్స్ అందుబాటులో ఉన్నప్పటికీ అవి ఉపయోగించడం అందరికీ రాకపోవచ్చు. కరీంనగర్, వరంగల్ వంటి ప్రాంతాల నుంచి . ఎన్ఆర్ఐలు ఎక్కువ ఉన్నారు అక్కడి నుంచి బాగా ఎంక్వయిరీలు వస్తున్నాయి. త్వరలో ఈ రెండు నగరాలకు విస్తరిస్తున్నాం. డిమెన్షియా వంటి సమస్యలున్న వృద్ధుల కోసం సెన్సర్లు డెవలప్ చేస్తున్నాం.. తద్వారా వీరు మతిమరపుతో జియో ఫెన్సింగ్ దాటి బయటకు వెళితే సంబంధీకులకు హెచ్చరికలు పంపుతాం. -
ముగ్గులు కట్టండి
గుమ్మం ముందు రంగవల్లిక సంప్రదాయ చీర కట్టుపైన మెరుస్తోంది. చీరకు అందాన్ని పెంచే జాకెట్టు పైన కొలువుదీరుతోంది. ఆ ముగ్గు ఈ ధనుర్మాసాన సరికొత్తగా ముస్తాబు అవుతోంది. ముంగిట ముగ్గుల అలంకరణే కాదు ముచ్చట గొలిపే ఆ ముగ్గు డిజైన్లతో ఉన్న చీరలను కట్టండి. ముగ్గులే కట్టారా అనిపించండి. ప్లెయిన్ కాటన్ చీర మీద ముగ్గుల ప్రింటు, ఆ చీరను కట్టుకున్నవారిని చూస్తే ముగ్గు కొత్త భాష్యం చెబుతున్నట్టుగా ఉంటుంది. ►తెలుగింటి ముగ్గు పట్టు చీర బ్లౌజ్‌కు ఎంబ్రాయిడరీగా అమరితే వేడుకలో ప్రత్యేకంగా ఆకట్టుకుంటుంది. ►కొత్తగా ముగ్గు డిజైన్ వేయించుకోవాలనుకునే ప్లెయిన్ చీర, బ్లౌజ్, డ్రెస్సులను ఎంచుకోవచ్చు. ఈ డిజైన్ బాగుండాలంటే చుక్కల ముగ్గునే ప్రింట్‌గా వేయించుకోవాలి. లేదా చేతి కుట్టుతో అందంగా రూపుకట్టాలి. అప్పుడే అల్లిక స్పష్టంగా తెలిసి అందంగా కనపడుతుంది. ముగ్గు డిజైన్ కావాలనుకుని సాధారణ డిజైన్ని ఎంచుకుంటే ఎలాంటి ప్రత్యేకతా ఉండదు ►చలికాలం తెలుగునాట ముగ్గుల కాలం కూడా కాబట్టి ఇప్పటికే ఇలాంటి డిజైన్స్‌తో ఉన్న చీరలను, డ్రెస్సులను ధరిస్తే సంప్రదాయానికి చిరునామాగా, కళగా కనపడతారు. -
ఆరోగ్యానికి వాక్‌వే!
మట్టిపై నడక, రోడ్డుపై నడక, బీచ్ ఇసుకలో నడక.. ఇలా ఎన్నో చూశాం. కానీ ఒకేసారి రాళ్లు, ఇసుక, ఒండ్రుమట్టిపై వాకింగ్ చేయడం చూశారా?. ఇకపై ఇలాంటి వాకింగ్‌కు వేదిక కానుంది ఇందిరాపార్కు. మామూలు నడకే కాదు.. ఓ థెరపీలా వాకింగ్ ఉండాలని ఇక్కడ ఏర్పాట్లు చేస్తున్నారు. ఫిజియోథెరపీ, ఆక్యుప్రెషర్ మాదిరిగా శరీరానికి సాంత్వన నిచ్చేలా ఈ ఏర్పాటు ఉంటుందని జీహెచ్ఎంసీ బయోడైవర్సిటీ అధికారులు చెబుతున్నారు. అందుకే దీనిని ‘థెరప్యూటిక్’గార్డెన్ అని కూడా వ్యవహరిస్తున్నారు. – సాక్షి, హైదరాబాద్ ఏర్పాటు చేస్తారిలా... ఈ పార్కులో కాఠిన్యం నుంచి సున్నితత్వం దిశగా ఎనిమిది వరుసలతో ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. ఒక వరుసలో 20 ఎంఎం కంకర, మరో వరుసలో 10 ఎంఎం కంకర.. ఇలా మొత్తం 8 వరుసల్లో గులకరాళ్లు, లావు ఇసుక, సన్నని ఇసుక, చెట్టు బెరడు, ఒండ్రుమట్టి, నీరు ఏర్పాటు చేస్తారు. వలయాకారంగా, జిగ్‌జాగ్‌గా, 8 ఆకారంలో నడిచే ఏర్పాట్లుంటాయని.. ఎన్ని విధాలుగా నడవొచ్చో, ఎలా నడిస్తే కలిగే మేలేంటో సైన్ బోర్డుల ద్వారా సూచిస్తామని జీహెచ్ఎంసీ బయోడైవర్సిటీ విభాగం అడిషనల్ కమిషనర్ కృష్ణ తెలిపారు. వలయాకారంలో నిర్మించే ఈ వాక్‌వేలో ఒకేసారి ఐదారుగురు నడిచేందుకు వీలుంటుందన్నారు. ప్రయోజనం ఇదీ... కాలికి ఎలాంటి ఆచ్ఛాదన లేకుండా ఒక వరుస నుంచి ఇంకో వరుసలోకి నడిస్తే ఆరోగ్య రీత్యా ప్రయోజనకరం. ఈ వాక్‌వేలో నడవడం వల్ల కఠినమైన ఉపరితలం నుంచి మృదువైన భాగానికి సాగే నడకతో రక్త ప్రసరణ మెరుగై కొత్త అనుభూతి కలుగుతుంది. ఆక్యుప్రెషర్, ఫిజియోథెరపీతో కలిగే ప్రయోజనల్లాగే దీంతో కూడా పలు ఆరోగ్య ప్రయోజనాలుంటాయి. నడిచే దూరం తక్కువే అయినా ఎక్కువ ప్రయోజనం కలుగుతుంది. ఆయా డైరెక్షన్లలో నడక ద్వారా ప్రకృతి వైద్యం అందుతుంది. షుగర్, బీపీ పెరగకుండా కూడా వీటి ద్వారా ప్రయోజనం ఉంటుంది. అంచనా వ్యయం రూ.15 లక్షలు.. ఈ గార్డెన్‌లోని వాక్‌వే చుట్టుపక్కల ఉండే ఖాళీ ప్రదేశంలో దాదాపు యాభై రకాల ఔషధ మొక్కలతోపాటు నవగ్రహాలు, వివిధ రాశులకు సంబంధించిన మొక్కలు కూడా నాటనున్నారు. దీని అంచనా వ్యయం రూ.15 లక్షలు. మరో రెండు నెలల్లో ఇది అందుబాటులోకి రానుందని కృష్ణ వివరించారు. -
హైదరాబాద్‌లో ఇంటెల్ డిజైన్ సెంటర్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: చిప్ తయారీ దిగ్గజం ఇంటెల్ ఇండియా... డిజైన్, ఇంజనీరింగ్ సెంటర్‌ను హైదరాబాద్‌లో ఏర్పాటు చేసింది. 3 లక్షల చదరపుటడుగుల విస్తీర్ణంలో 1,500 సీట్ల సామర్థ్యంతో దీనిని నెలకొల్పారు. తెలంగాణ రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి కె.తారక రామారావు సోమవారం ఈ కేంద్రాన్ని ప్రారంభించారు. ప్రస్తుతం ఇక్కడ 300 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. సిబ్బంది పరంగా కొత్త సెంటర్ ఏడాదిలో పూర్తి స్థాయి సామర్థ్యానికి చేరుకుంటుందని ఇంటెల్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ రాజా ఎం కోడూరి ఈ సందర్భంగా తెలిపారు. ఎక్సా స్కేల్ సూపర్ కంప్యూటర్ అభివృద్ధిలో హైదరాబాద్ కేంద్రం పాలు పంచుకుంటుందని కూడా వెల్లడించారు. ఈ సూపర్ కంప్యూటర్ యూఎస్‌లో 2021లో, భారత్‌లో 2022లో రూపుదిద్దుకుంటుందని పేర్కొన్నారు. మూడు లక్షల ఉద్యోగాలు.. వచ్చే నాలుగేళ్లలో ఎలక్ట్రానిక్స్ తయారీ రంగంలో తెలంగాణలో 3 లక్షల ఉద్యోగాలు కల్పించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు కేటీఆర్ తెలిపారు. ‘ఇప్పటికే ఈ రంగంలో 30,000 పైచిలుకు మందికి ఉద్యోగాలు లభించాయి. రూ.5,000 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. ఎలక్ట్రానిక్స్ తయారీ క్లస్టర్లు రెండూ నిండిపోయాయి. మరో భారీ తయారీ క్లస్టర్ కోసం కేంద్రాన్ని కోరాం. అక్కడి నుంచి సానుకూల స్పందన వస్తుందని ఆశిస్తున్నాం. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేస్తున్న టి– వర్క్స్ మూడు నాలుగు నెలల్లో ప్రారంభం కానుంది. ఇక్కడ ఎలక్ట్రానిక్స్ రంగ కంపెనీలు తమ ఆవిష్కరణల తాలూకు నమూనాలను రూపొందించుకోవచ్చు’ అని వివరించారు. -
డిజైన్ లోపమేనా?
సాక్షి, హైదరాబాద్: అతి వేగానికి మరో ప్రాణం బలైపోయింది. రూ.69.47 కోట్లతో నిర్మించిన బయో డైవర్సిటీ ఫ్లైఓవర్ ఈ నెల 4న ప్రారంభమైంది. తరువాత వారానికే ఇక్కడ సెల్ఫీలు దిగుతూ ఇద్దరు యువకులు మరణించారు. తాజాగా, శనివారం మధ్యాహ్నం ఫ్లైఓవర్ పై నుంచి కారు పల్టీలు కొడుతూ కిందపడిన ఘటనలో మరో మహిళ మృతి చెందింది. ఈ నేపథ్యంలో డిజైన్ లోపం వల్లే ప్రమాదాలు జరుగుతున్నాయని సిటిజెన్లు అభిప్రాయపడుతుండగా, ఇండియన్ రోడ్ కాంగ్రెస్ నిబంధనల మేరకు పక్కా డిజైన్‌తో దీన్ని నిర్మించామని జీహెచ్ఎంసీ చెబుతోంది. తొలి ప్రమాదం నేపథ్యంలో హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేశామని, నిర్ణీత ప్రమాణాల కంటే మరింత జాగ్రత్త చర్యలు తీసుకున్నామని చెబుతున్నా.. వాటిని ప్రజలకు చేరవేయడంలో ఇటు జీహెచ్ఎంసీ, అటు పోలీసు విభాగాలు విఫలమైనట్టు ప్రజలు భావిస్తున్నారు. ఎక్కితే.. రయ్యిన దూసుకుపోవడమే ఫ్లైఓవర్‌పై ప్రయాణ వేగం గంటకు 40 కిలోమీటర్లు కాగా, బోల్తాపడ్డ కారు ప్రమాద సమయంలో 105 కి.మీ. వేగంతో ప్రయాణిస్తూ సూపర్ ఎలివేషన్‌తో క్రాష్ బారియర్స్ ఉన్నా పైకెగిరి కిందపడింది. 80 కి.మీ.ల వేగంతో ఢీకొట్టినా తట్టుకునేలా క్రాష్ బారియర్స్ ఏర్పాటు చేశారు. సాధారణంగా క్రాష్ బారియర్స్‌ను ఢీకొంటే.. వాహనం తిరిగి వెనక్కి వస్తుంది. కానీ నియంత్రించలేని అతి వేగం వల్ల క్రాస్‌బారియర్స్ పైకెగిరి మరీ కారు కింద పడినట్లు ఇంజినీర్లు చెబుతున్నారు. నగరంలో నిర్మించిన ఫ్లైఓవర్లలో అత్యంత ఎత్తయిన ఈ ఫ్లైఓవర్ దిగువన మరో ఫ్లైఓవర్ పనులు జరుగుతున్నాయి. దీని పొడవు 990 మీటర్లు కాగా, దాదాపు 600 మీటర్ల దూరం వద్ద ఈ ఘటన జరిగింది. బయో డైవర్సిటీ జంక్షన్ వద్ద రద్దీ సమయంలో ప్రయాణించే వాహనాలు గంటకు 20 వేలు కాగా, ఫ్లైఓవర్‌పై 7 వేల వాహనాలు ప్రయాణిస్తున్నాయి. రాయదుర్గం వైపు నుంచి హైటెక్‌సిటీ, ఇనార్బిట్‌మాల్ వైపు వెళ్లేందుకు ఆటంకాల్లేకపోవడంతో ఫ్లైఓవర్ పై నుంచి రయ్యిన దూసుకుపోతున్నారు. వంతెన మధ్య భాగంలో దాదాపు 150 మీటర్ల మేర కర్వ్ ఉంది. వేగంగా వచ్చే వారు ఇక్కడ నియంత్రించుకోవాలన్నా సాధ్యం కావట్లేదు. హోరెత్తిన సోషల్ మీడియా.. ఫ్లైఓవర్ ప్రమాదంపై సీసీ టీవీలో నమోదైన దృశ్యాలు శనివారం రోజంతా వైరల్ అయ్యాయి. ఘటనపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ట్విట్టర్, ఇతర సామాజిక మాధ్యమాల వేదికగా ఎవరెలా స్పందించారంటే.. ఎన్ని ప్రమాణాలు పాటించినా, జాగ్రత్తలు తీసుకున్నా పౌరుల్లో మార్పు రానిదే ప్రమాదాలను అరికట్టలేం. ఫ్లైఓవర్ కట్టినంత సేపు పట్టలేదు.. మూసేయడానికి.. మలుపు వద్ద ప్రమాదకరంగా ఉందని కొద్ది రోజుల క్రితమే గుర్తించి ట్వీట్ చేశాం. వేగ పరిమితి సూచికలున్నా నిర్లక్ష్యంగా డ్రై వింగ్ చేసే వారికి భారీ పెనాల్టీలు వేయాలి. ఫ్లైఓవర్ ప్రారంభానికి తొందరపడి, ట్రయ ల్స్ వేయలేదు. శాస్త్రీయంగా పరీక్షించకుండా నే అందుబాటులోకి తెచ్చారు. ప్రమాదానికి వేగం కారణమైనా డిజైన్ లోపమూ ఉంది. అమాయక ప్రాణం బలైపోయింది: కేటీఆర్ ఫ్లైఓవర్ ప్రమాద ఘటనలో మహిళ మృతి చెందడంపై మునిసిపల్ మంత్రి కేటీఆర్ తీవ్ర వేదన వ్యక్తం చేశారు. ఘటనలో కారు 100 కేఎంపీహెచ్‌కు మించిన వేగంతో ప్రయాణిస్తూ ప్రమాదానికి కారణమైందని ట్వీట్ చేశారు. ‘ఏదేమైనా ఒక అమాయక ప్రాణం బలైపోవడం విషాదకరం. ఇలాంటి ప్రమాదాలు పునరావృతం కాకుండా, డిజైన్ లోటుపాట్లుంటే పరిశీలించి సరిచేస్తాం. ఫ్లైఓవర్‌ను మూసివేసి జీహెచ్ఎంసీ ఈఎన్సీ, సైబరాబాద్ సీపీ స్పీడ్ కంట్రోల్, సేఫ్టీ చర్యలు తీసుకోవాలి. స్వతంత్ర నిపుణుల కమిటీ సూచనల మేరకు సేఫ్టీ చర్య లు తీసుకోవాలి’ అని ఆ ట్వీట్లో సూచించారు. ఇదంత డీప్ కర్వ్ కూడా కాదు ఫ్లైఓవర్‌పై తొలి ప్రమాద ఘటన నేపథ్యంలో కర్వ్‌కు ముందు రెండుచోట్ల వేగ నియంత్రణకు రంబుల్ స్ట్రిప్‌లు ఏర్పాటు చేశాం. డిజైన్ లోపం లేదు. మరో ఆరేడు ప్రాంతాల్లో రంబుల్ స్ట్రిప్స్ వేయడమే కాక, మరింత జాగ్రత్త చర్యల్లో భాగంగా కర్వ్ ప్రాంతం మేర సాధారణ క్రాష్ బారియర్స్లో అదనంగా రోలర్స్ కూడా ఏర్పాటు చేస్తాం. తద్వారా ఏదైనా వాహనం ఢీకొంటే.. స్లిప్ అయి వెనక్కి మళ్లుతుంది. నిపుణుల సూచన మేరకు ఎన్ని జాగ్రత్తలు అవసరమో అన్నీ తీసుకుంటాం. గ్రేటర్‌లోని మిగతా ఫ్లైఓవర్లతో పోలిస్తే ఈ ఫ్లైఓవర్‌ది డీప్ కర్వ్ కూడా కాదు. నల్లగొండ క్రాస్‌రోడ్ ఫ్లైఓవర్ రేడియస్ 40 మీటర్లు, పంజగుట్టది 60– 65 మీ. కాగా, బయోడైవర్సిటీది 80–120 మీటర్లు. – శ్రీధర్, జీహెచ్ఎంసీ చీఫ్ ఇంజనీర్ స్వీయ క్రమశిక్షణ పాటించండి.. ఫ్లైఓవర్ ప్రమాదం నేపథ్యంలో వాహన చోదకులు ట్రాఫిక్ నిబంధనలతో పాటు స్వీయ క్రమశిక్షణ పాటించాలని కోరుతూ సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు కొన్ని సూచనలు చేశారు. పాదచారులు ఫ్లైఓవర్ పైకి వెళ్లద్దు. సెల్ఫీల కోసం ఎవరూ ఫ్లైఓవర్‌పై నిలబడవద్దు. గరిష్ట వేగం గంటకు 40 కి.మీ. మించరాదు. ఇందుకు ఎవరికి వారు స్వీయ నియంత్రణ పాటించాలి. రాయదుర్గం వైపు నుంచి హైటెక్ సిటీ వైపు వెళ్లే వారి కోసం ఒకే మార్గంలో నిర్మించిన ఈ ఫ్లైఓవర్‌పైకి రాయదుర్గం నుంచి గచ్చిబౌలి వైపు వెళ్లేవారు ఎక్కొద్దు. మలుపుల వద్ద ఓవర్టేక్ చేయకండి. లేన్ డిసిప్లిన్ పాటించండి. ఫ్లైఓవర్‌పై సీసీ కెమెరాలున్నాయి. 40 కి.మీ. మించి వేగంతో వెళ్తే కేసులు నమోదవుతాయి. -
పూచిన తామరలు
కలంకారితో అలంకరణ ఎప్పుడూ బాగుంటుంది. ఆ కలంకారి డిజైన్‌లో పూచిన తామరలు ఉంటే ఇంకా బాగుంటుంది. మరి అంచులు బెనారస్ పట్టుతో ముడిపడితే? ఇక్కడ ఉన్నట్టుగా ఉంటుంది. కొత్తలుక్కు కోసం ఈ తామర కలంకారిని ఉపయోగించి చూడండి. వికసించిన కమల సౌందర్యం సొంతం చేసుకోండి. కలంకారీ డిజైన్స్ ఎన్నో ఏళ్ల నుంచి వాడుకలో ఉన్నవే. వీటిని ఎంత కొత్తగా చూపిస్తున్నామన్నదే ముఖ్యం. సాధారణంగా కలంకారీ అనగానే నెమళ్లు, తీగలు, కొమ్మలు.. ఇవే కనిపిస్తుంటాయి. ఈ చీరలలో వివిధ రూపాలలో ఉండే తామరపువ్వు డిజైన్స్‌ను ఒక థీమ్‌గా తీసుకున్నాం. ఈ పెన్ కలంకారీలో వాడిన రంగులన్నీ నేచరుల్ కలర్స్ మాత్రమే. డల్ లుక్ రాకుండా ఉండటం కోసం బెనారస్ పట్టును అంచులుగా జత చేశాం. ఇవి ఏ ప్రత్యేక సందర్భాలలోనైనా అన్ని వయసుల వారు ధరించవచ్చు. ►కలంకారీ కళ తెలుగువారి సొంతం. అద్భుతమైన చేతిపనితనంతో దుస్తులను అందంగా తయారుచేస్తారు కళాకారులు. ప్లెయిన్ ప్యూర్ పట్టు చీర మీద రూపుదిద్దుకున్న పెన్ కలంకారీ డిజైన్లు వేడుకల సందర్భంలో ఓ అద్భుతమైన కళను తీసుకుస్తాయి. ఎక్కడ ఉన్నా ప్రత్యేకతను చాటుతాయి. ప్లెయిన్ పట్టుకు కలంకారీ డిజైన్‌ను వేయించుకున్నాక బామ్మల కాలం నాటి బెనారస్, కంచి పట్టు చీరల పెద్ద పెద్ద అంచులనూ బార్డర్స్గా వాడుకోవచ్చు. దీని వల్ల చీరకు, లెహంగా, దుపట్టా డిజైన్లకు మరింత గ్రాండ్ లుక్ వస్తుంది. ఏ వేడుకలోనైనా హైలైట్ అవుతుంది. ►జాతీయస్థాయిలో పెన్ కలంకారీకి డిజైన్స్‌కి గొప్ప పేరుంది. కలంకారీ డిజైనర్ పట్టు చీరలు ఏ వేడుకల్లో ధరించినా కళను, హుందాతనాన్ని, గొప్పదనాన్ని, మనదైన ఆత్మను ప్రతిఫలింపజేస్తుంది. ఎవర్‌గ్రీన్‌గా నిలిచే కలంకారీ డిజైనర్ చీరలను యువతరం వారి అభిరుచిమేరకు ఏ కాలమైన మరో ఎంపిక అవసరం లేకుండా ధరించవచ్చు. -
చిత్రమైన చీర
సాధారణంగా డిజైనర్లు సృష్టించిన దుస్తుల కలెక్షన్ చూడాలంటే బొటిక్స్‌కు వెళ్లాలి. లేదా ఫ్యాషన్ షో, ఎక్స్‌పోల్లోనో చూడాలి. కానీ ఆ‘కట్టుకునే’ అపురూప చిత్రాల చీరలు చూడాలంటే మాత్రం మ్యూజియమ్స్కి వెళ్లాల్సిందే. అంత మాత్రాన అవి ఎప్పటివో చరిత్ర తాలూకు అవశేషాలు కావు.. నేటి మన సిటీ డిజైనర్ఆవిష్కరించిన అద్భుతాలు. సాక్షి, సిటీబ్యూరో: చిత్రలేఖనంలో ప్రవేశమున్నవారికి మాత్రమే కాదు.. కళలపై కాసింత అవగాహన ఉన్నవారికి కూడా రాజా రవివర్మ అంటే పరిచయం అక్కర్లేని పేరు. రాజవంశీకుడిగానే కాదు తన చిత్రలేఖనా ప్రతిభతోనూ చరిత్ర కెక్కిన రవివర్మ చిత్రాలు మనదేశపు కళా సంపద. అలాంటి చిత్ర సంపదను ఆధునిక ఫ్యాషన్లకు ఆలంబనగా మార్చారు నగరానికి చెందిన డిజైనర్ గౌరంగ్ షా. ప్రస్తుతం ముంబైలోని నేషనల్ గ్యాలరీ ఆఫ్ మోడ్రన్ ఆర్ట్ (ఎన్జీఎంఏ)లో ఆయన తన చిత్రాల చీరలను ప్రదర్శిస్తున్నారు. అసాధ్యం నుంచి అద్భుతం ‘రవివర్మవి సహజమైన రంగులతో తీర్చిదిద్దిన అద్భుత చిత్రాలు. అవి రంగుల, భావాలు, వివరాల గల గొప్ప సమ్మేళనం. అంతగా వెలుగులోకి రాని రవివర్మ గీచిన అద్భుత పెయింటింగ్స్‌లో మహిళలు, దేవతలు, కథలు.. ఇలా మూడు విభాగాలుగా విభజించి 30 పెయింటింగ్స్‌ను ఎంచుకున్నాం. ఆరు నెలల కాలాన్ని పూర్తిగా పరిశోధనకే కేటాయించాం. తొలుత వీటి గురించి మాస్టర్ వీవర్స్‌తో చర్చించినప్పుడు వారు ఇది సాధ్యమా అన్నట్టు అనుమానం వ్యక్తపరిచారు. దీనికి తగ్గట్టే ఖాదీలో నేచురల్ డైలను ఉపయోగించి ఈ చీరలు నేయాల్సి ఉండడం కూడా మరో సవాలు. తొలి రెండు చీరల ప్రయోగం విఫలమైన తర్వాత మూడో చీరకు సక్సెస్ అయ్యాం. ప్రతి పెయింటింగ్‌కు ఒక కలర్ చార్ట్ క్రియేట్ చేయాల్సి వచ్చింది. ఆ చిత్రాల మీద ఉన్న అచ్చమైన రంగులను తలపించేందుకు మేం 600 షేడ్స్ సృష్టించాం’ అంటూ గౌరంగ్ తన కష్టాన్ని గుర్తు చేసుకున్నారు. ప్రపంచ వ్యాప్తంగా ప్రదర్శన ఎప్పటి నుంచో తన చీరలను మ్యూజియమ్స్‌లో చూడాలని అనుకుంటున్నానని, రెండేళ్ల పాటు సాగిన ఈ ప్రాజెక్ట్ తన కల సాకారం చేసిందని గౌరంగ్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కొన్ని చీరలపై చిత్రాలను సృష్టించేందుకు ఒక్కో చీరకు 3 నెలలు పడితే మరో చీరకు 10 నెలలు కూడా పట్టిందని వివరించారు. ప్రస్తుతం ముంబైలో జరుగుతున్న ఈ ‘చిత్ర’మైన చీర ప్రదర్శన నవంబర్ 15వ తేదీ వరకు కొనసాగుతుంది. తర్వాత ఢిల్లీకి చేరనుంది. అలా అలా ఈ చీరలను నగరంతో సహా ప్రపంచవ్యాప్తంగా ప్రదర్శించాక వీటిని ఆన్లైన్ ద్వారా వేలం వేయాలని గౌరంగ్ భావిస్తున్నారు. సిటీ ఆర్టిస్ట్‌తో మొదలు.. ప్రాచుర్యం పొందిన చిత్రాలను చీరలపై కొలువుదీర్చడం అనే ప్రక్రియలో గౌరంగ్‌కు తొలి స్ఫూర్తిని అందించింది కూడా నగరానికి చెందిన ప్రముఖ చిత్రకారుడే కావడం విశేషం. ‘2013లో సిటీకి చెందిన లక్ష్మణ్ ఏలె పెయింటింగ్స్‌ను చూసినప్పుడు చాలాబాగా నచ్చాయి. దాంతో ఆయన వేసిన ఆరు చిత్రాలను నా చీరల కలెక్షన్లో పునఃసృష్టించాను. ఆ చీరల ప్రదర్శనకు వచ్చినవారిలో ఒకరైన లావినా ఒక చీర కొనుగోలు చేయడంతో పాటు అప్పటి నుంచి ఆమె నాతో కలిసి ఓ గొప్ప ప్రాజెక్ట్ చేయాలని ఆసక్తి చూపేవారు. బెంగళూరులోని రాజా రవివర్మ హెరిటేజ్ ఫౌండేషన్ ప్రతినిధులను నాకు పరిచయం చేయడంతో మూడేళ్ల తర్వాత ఆమె ఆలోచన కార్యరూపం దాల్చింది’ అంటూ గౌరంగ్ చెప్పారు. అలా సిటికి చెందిన ప్రముఖ చిత్రకారుడు లక్ష్మణ్ ఏలె చిత్రాలను తన చీరల మీద ప్రతిష్టించడం ద్వారా సరికొత్త చిత్ర ట్రెండ్‌కి శ్రీకారం చుట్టిన గౌరంగ్ షా.. రాజా రవివర్మ చిత్రాలను ఒక్కో చీర పల్లూపై కొలువుదీర్చారు. గాంధీ జయంతి, రవివర్మ వర్ధంతి రెండూ అక్టోబరు 2నే కావడంతో ‘ఖాదీ ఏ కాన్వాస్’ పేరుతో ప్రదర్శనకి తెర తీశారు. -
చెవిన వేసుకోండి
ఇయర్ రింగ్స్ ఎప్పుడూ ట్రెండీలుక్‌నే ఇస్తాయి. మరీ ముఖ్యంగా చెవుల నుంచి భుజాల వరకు వేలాడే హ్యాంగింగ్స్‌ను చూస్తే ఎవరికైనా ఒకసారి పెట్టుకోవాలని మనసు పోతుంది. ఎవరైనా పెట్టుకున్నప్పుడు అవి బాగున్నాయని అలాంటివే కొంటే... అవి మన ముఖానికి నప్పకపోతే ఎలా? అందుకే మన ముఖాకృతిని బట్టి సెలెక్ట్ చేసుకోవాలి. ►ఓవల్ షేప్ ముఖానికి ఏ మోడల్ అయినా చక్కగా నప్పుతుంది. చెవులకు అంటినట్లుండే దిద్దుల నుంచి మీడియం సైజు లోలకుల వరకు అన్నీ బాగుంటాయి. ఇక భుజాలను తాకే హ్యాంగింగ్స్ అయితే చెప్పక్కరలేదు. ఎంతమందిలో ఉన్నా ప్రతి ఒక్కరి దృష్టి వాటి మీద, వాటిని అలంకరించుకున్న వాళ్ల మీద కొన్ని సెకన్లపాటు కేంద్రీకృతమవుతుంది. ఈ ఫేస్‌కట్‌కి మెటల్, బీడ్స్, స్టోన్స్ ఏవైనా నప్పుతాయి. ►స్క్వేర్ ముఖాకృతి ఉన్న వాళ్లు కొంచెం జాగ్రత్తగా ఎంచుకోవాలి. ముఖం ఆకారానికి పూర్తి విరుద్ధంగా ఉండాలి చెవి ఆభరణాలు. కొట్టొచ్చినట్లు కనిపించేవిగా కాకుండా పొందికగా ఉన్నట్లనించే మోడల్స్ తీసుకోవాలి. అందులో వాడిన బీడ్స్ రంగులు కూడా హుందాగా ఉండాలి. ►హార్ట్ షేప్ ముఖానికి చెవుల దగ్గర తక్కువగా ఉండి కింద వేళ్లాడే భాగం వెడల్పుగా ఉంటే ముఖం అందంగా కనిపిస్తుంది. దీనినే ట్రయాంగిల్ ఫేస్ అని కూడా అంటారు. నుదురు వెడల్పుగా ఉండి చెంపలు పలుచగా, కింది దవడలోపలికి, గడ్డం కొనదేలి ఉంటుంది. చెవుల నుంచి గడ్డం మధ్యలో ఉన్న గ్యాప్‌ని హ్యాంగింగ్స్ ద్వారా కవర్ చేయగలిగితే ఆ ఇయర్ రింగ్స్ వాళ్ల కోసమే డిజైన్ చేశారా అన్నట్లుంటుంది. ►రౌండ్ ముఖానికి ఇయర్ రింగ్స్ సైజు, పొడవు మీద దృష్టి కేంద్రీకరించాలి. మెడ పొడవును కూడా పరిగణనలోకి తీసుకోవాలి. పొడవు హ్యాంగింగ్స్ కాని మీడియం సైజు లేదా చెవిని అంటిపెట్టుకుని ఉంటే దిద్దులు ఏవైనా బావుంటాయి. వాటి డిజైన్‌లో రౌండ్ ఉండకూడదు, ఓవల్ షేప్ కాని, నలుచదరం లేదా ఒకదాని కింద మరొకటిగా వేలాడదీసినట్లు ఉండాలి. ఈ ముఖానికి బీడ్స్ కూడా అందం తెస్తాయి. -
డిస్నీ బ్యూటీ
మిక్కీమౌజ్, డోరెమాన్,టామ్ అండ్ జెర్రీ..డిస్నీ వరల్డ్ అంటేపిల్లలకు చెప్పలేనంత ఇష్టం.ఆ బొమ్మలున్న డ్రెస్సులు కూడాఅంతే ప్రత్యేకతను చూపుతున్నాయి.టీవీ కార్టూన్ షోలలో కనిపించే ఈ బొమ్మలకు ఓఅరుదైన గుర్తింపు కలిపిస్తున్నారు ఫ్యాషన్ డిజైనర్లు.కామిక్ బొమ్మల ప్రింట్లున్న చీరలుఅమ్మలే కాదు అమ్మాయిలూఇష్టపడి ఎంచుకుంటున్నారు.పార్టీలో ప్రత్యేకతనుచాటుతున్నారు. పువ్వుల రింగులు వేడుక ఏదైనా డ్రెస్ సెలక్షన్ తర్వాత ఆభరణాలు సింగారం మీదనే దృష్టి పెడతారు అతివలు. గ్రాండ్‌గా కనులకువిందు చేసే ఆభరణాల కోసం ఎంతమొత్తమైనా వెచ్చించడానికి సిద్ధంగా ఉంటారు. అయితే, ప్రస్తుత కాలం వేరు. పార్టీకి తగ్గట్టు డ్రెస్ ఉండాలి. ఆ డ్రెస్ మరింత అందంగా కనిపించడానికి తగిన ఆభరణాలు ఉండాలి. అందుకు ఈ పువ్వుల డిజైన్లు ఉన్న రింగులు ప్రత్యేక సింగారాన్ని తీసుకువస్తున్నాయి. సింపుల్‌గానూ, గ్రేస్‌గా ఉండే ఈ పువ్వుల డిజైన్ రింగులు సిల్వర్, స్టీల్ మెటల్‌తో తయరుచేసినవి మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. వందరూపాయల నుంచి లభించే ఈ డిజైనర్ రింగ్స్‌తో వేడుకలో మరింత ఆహ్లాదంగా, బ్యూటిఫుల్‌గా వెలిగిపోవచ్చు. ఇండియన్ డిజైనర్ సత్యపౌల్ సిల్క్ పై చేసే ప్రయోగాలు అన్నీ ఇన్ని కావు. సిల్క్, షిఫాన్, క్రేప్ చీరల మీద కామిక్ డిజైన్స్‌ను ప్రింట్లుగా వేసి ఓ ప్రత్యేకతను తీసుకువచ్చారు. ఆ డిజైన్స్‌ను పోలిన కామిక్ వరల్డ్ ప్రింటెడ్ శారీస్ గెట్ టు గెదర్ పార్టీలో ప్రత్యేకతను చాటుతున్నాయి. -
వరల్డ్ డిజైన్ షోకి సిటీ ఆతిథ్యం
సాక్షి,సిటీబ్యూరో: తొలిసారిగా నిర్వహిస్తున్న ప్రపంచ డిజైన్ అసెంబ్లీకి హైదరాబాద్ వేదిక కానుంది. అక్టోబర్ 11,12 తేదీల్లో సిటీ వేదికగా 31వ వరల్డ్ డిజైన్ అసెంబ్లీ(డబ్లూడీఏ) నిర్వహించనున్నారు. దీంతో పాటు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, ఇండియా డిజైన్ ఫోరం (ఐడీఎఫ్) సంయుక్తంగా నిర్వహిస్తున్న హైదరాబాద్ డిజైన్ వీక్(హెచ్డీడబ్లూ) కూడా ఇదే సమయంలో(అక్టోబర్ 9–13 తేదీలు) జరగనుంది. ఆటోడెస్క్ డిజైన్ నైట్, డబ్లూడీఏ ఎడ్యుకేషన్ ఫోరం, ఐడీఎఫ్ అవార్డ్స్, చౌమహల్లా ప్యాలెస్‌లో డిన్నర్, హైదరాబాద్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్ (హెచ్ఐసీసీ)లో హెచ్‌డీడబ్ల్యూ డిజైన్ కాన్ఫరెన్స్‌లో విద్యార్థులు, డిజైన్ ప్రొఫెషనల్స్‌తో ప్రత్యేక డిజైన్ ఎక్స్పో వంటి సరికొత్త సందడితో నగరం మెరవనుంది. అంతర్జాతీయ డిజైనర్ల రాక ఈ అంతర్జాతీయ ప్రదర్శనలో 150 మందికి పైగా భాగస్వాములు కానున్నారు. డబ్లూడీఓ, హెచ్డీడబ్లూ సభ్యులు భారతీయ డిజైన్లను ప్రదర్శించనున్నారు. ఈ కార్యక్రమంలో అక్టోబర్ 11, 12 తేదీల్లో జరిగే ‘డిజైన్ కాన్ఫరెన్స్’ ప్రత్యేకతను చాటనుంది. హెచ్ఐసీసీలో జరిగే ఈ కార్యక్రమంలో ప్రపంచ ప్రఖ్యాత డిజైనర్లు పాల్గొననున్నారు. మార్కస్ ఫెయిర్స్(డీజెన్), టిమ్ కోబె(ఐట్ ఇంక్.), క్రిస్టియానో సెకాటో (జాహా హదీద్ ఆర్కిటెక్టŠస్), జేన్ విథర్స్ (జేన్ విదర్స్ స్టూడియో), ఎమ్మా గ్రీర్ (కార్లో రాట్టి అస్సోసియేటి), ప్రతాప్ బోస్(టాటా మోటర్స్), రుచికా సచ్‌దేవా(బోడిస్), సందీప్ సంగరు(సంగరు డిజైన్ స్టూడియో), శివ్ నల్లపెరుమాళ్ వంటి ప్రముఖ డిజైనర్లు ఈ కార్యక్రమంలో పాలుపంచుకోనున్నారు. ఐక్యరాజ్యసమితి సుస్థిర అభివృద్ధి లక్ష్యాలను సాధించడానికి డిజైన్ రంగంలో ఉన్న అవకాశాలను వాడుకోవచ్చని హైదరాబాద్ వారు ఇచ్చిన ప్రెజెంటేషన్ డబ్లూడీఏ మెప్పు పొందింది. పేదరికం, కాలుష్యం, తరిగిపోతున్న సహజ వనరులు వంటి సమస్యలకు డిజైన్ ఇన్నోవేషన్ రంగం పరిష్కారాలు చూపించనుంది. ఇదో అద్భుత అవకాశం వరల్డ్ డిజైన్ అసెంబ్లీ(డబ్లూడీఏ)ని నిర్వహించేందుకు జరిగిన బిడ్‌ని హైదరాబాద్ చేజిక్కిచ్చుకుందని తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేష్ రంజన్ తెలిపారు. ఈ ఈవెంట్‌తో పాటు హైదరాబాద్ డిజైన్ వీక్ కూడా కలిసి నిర్వహించడం మరింత అద్భుతమైన అవకాశమన్నారు. -
భవిష్యత్తు డిజైనింగ్ రంగానిదే!
సాక్షి, హైదరాబాద్: రాబోయే రోజుల్లో డిజైనింగ్ రంగానికి ప్రాధాన్యం పెరగనుందని, ప్రతీ రంగంలోనూ డిజైనింగ్‌తో విప్లవాత్మక మార్పులు తీసుకురావొచ్చని ఐటీశాఖ ముఖ్యకార్యదర్శి జయేశ్ రంజన్ అన్నారు. సృజనాత్మకతకు పదును పెట్టేలా, యువతకు, విద్యార్థులకు అరుదైన, అద్భుత అవకాశాలు కల్పించే చక్కటి వేదికగా ఇది మారాలని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. వరల్డ్ డిజైన్ అసెంబ్లీ (డబ్ల్యూడీఏ) 31వ వేడుకలు హైదరాబాద్‌లో జరగనుండటం దేశానికే గర్వకారణమన్నారు. హైదరాబాద్ డిజైన్ వీక్ (హెచ్‌డీడబ్ల్యూ)లో భాగం గా అక్టోబరు 9 నుంచి 13 వరకు హ్యుమనైజింగ్ డిజైన్ పేరిట ఈ కార్యక్రమాన్ని నిర్వహించనుండటం పట్ల హర్షం వ్యక్తం చేశారు. ఇకనుంచి ఏటా హెచ్‌డీడబ్ల్యూ వేడుకలు నగరంలో జరుగుతాయన్నారు. హైదరాబాద్ డిజైన్ వీక్ ద్వారా విద్యార్థుల కు అపార అవకాశాలు కలుగుతున్నాయన్నారు. సృజనాత్మకతను ప్రోత్సహించేలా.. సృజనాత్మకతను ప్రోత్సహించేలా అక్టోబరు 9, 10వ తేదీల్లో నగరవ్యాప్తంగా పలు ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ కార్యక్రమాలు చేపడతామని జయేశ్ రంజన్ పేర్కొన్నారు. పతంగులు చేయడం, బొమ్మలు గీయడం, ఫొటోగ్రఫీ, ఆర్కిటెక్ట్, తదితర అంశాల్లో విద్యార్థులకు పోటీలు నిర్వహిస్తామన్నారు. అనంతరం హెచ్‌డీడబ్ల్యూ లోగోను, వెబ్‌సైట్‌ను ప్రారంభించారు. ఈ కార్యక్రమం ప్రారంభోత్సవంలో జయేశ్ రంజన్‌తో పాటు గ్రీన్‌గోల్డ్ కంపెనీ సీఈవో రాజీవ్ చిల్కా, అహ్మదాబాద్‌లోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజైన్ డైరెక్టర్ ప్రవీణ్ నహర్, రీసెర్చ్ అండ్ ఇన్నోవేషన్ సర్కిల్ ఆఫ్ హైదరాబాద్(రిచ్) డైరెక్టర్ జనరల్ అజిత్ రంగ్నేకర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాజీవ్ చిల్కా మాట్లాడుతూ..మనదేశానికి గుర్తింపు తీసుకొచ్చిన చోటా భీమ్ డిజైన్ కోసం తన బృందం చేసిన కృషిని వివరించారు. భవిష్యత్తులో వ్యవసాయం, రోడ్డు ప్రమాదాలు, రవాణా, పర్యావరణం, జనాభా, వసతులు తదితర రంగాల్లో డిజైనింగ్‌లతో ఎలాంటి అద్భుతాలు సృష్టించవచ్చో అజిత్ రంగ్నేకర్, ప్రవీణ్ నహార్ వివరించారు. -
వన వైభవం
కాలానుగుణంగా డ్రెస్సింగ్ కాదుకళాత్మకంగా ఉండాలి.కాలాన్ని తట్టుకునేలా.. కాలాన్ని మరిపించేలా..కంటికి, మేనికిహాయిగొలిపేలా ఉండాలి. గిరిపుత్రుల కళారూపాలు ఎప్పుడూ మనల్ని పచ్చటి వనాలకు చేరువ చేస్తూనే ఉంటాయి. ఆ కళారూపాలు చీరల మీద కొలువుదీరితే వాటిని కట్టుకున్నవారు ఎక్కడ ఉన్నా ప్రత్యేకంగా కనిపిస్తారు.చూసినవారు వన వైభవంముంగిట్లోకి వచ్చిందని ముచ్చటపడతారు. వేసవి కాలం కాటన్ చీరల ఎంపిక సహజం. అయితే, కాలానికి అనుగుణంగా అనే ఆలోచన మాత్రమే కాకుండా కట్టుకున్న చీరకో ప్రత్యేకత ఉండేలా.. ఆ ప్రత్యేకత వస్త్రవైభవాన్ని పెంచేలా చూసుకోవచ్చు. ►భూమి, నీరు, ఆకాశం, అగ్ని, వాయువు.. ఇలా పంచమహాభూతాల అంశాలను కొంగుల మీదుగా డిజైన్ చేసినవి ఎంచుకోవచ్చు ►పక్షులు, జంతువులు, గిరిజనుల శక్తిరూపాలూ ప్రత్యేకతను చూపుతాయి. ►చెట్టూ, చేమలు .. ప్రేమకావ్యాలను చిత్రించిన చీరలూ ఓ కొత్త భాష్యాన్ని చెబుతుంటాయి ►పసుపు, ఎరుపు, తెలుపు, నీలం రంగుల కాంబినేషన్లు ఆహ్లాదాన్ని పంచే అడవి పువ్వుల అందాలను అనుభూతిని తెస్తాయి ► రెండు రకాల సాదా రంగుల ఫ్యాబ్రిక్‌ను ఎంచుకుని, వాటిని జత చేసి మీకు మీరే డిజైనర్ అయిపోనూ వచ్చు. ఫ్యాషన్ రంగంలో భారతీయ మూలాలను పట్టుకునేలా డిజైనర్లు ఎప్పటి కప్పుడు ప్రత్యేక శ్రద్ధ చూపుతుంటారు. ఎక్కడ ఉన్నా, ఎందరిలో ఉన్నా మన జానపదుల కళారూపాలకు ఆ శక్తి ఉండటం వల్లే చీరలు కొత్త సింగారాలతో ఆకట్టుకుంటున్నాయి. కళారూపాలు మాత్రమే కాదు వనాలను తలపించే రంగుల కాంబినేషన్లు, ప్రింట్లతో ఆకట్టుకునే డిజైన్లు కనువిందు చేస్తున్నాయి. ►సహజసిద్ధమైన రంగులతో తీర్చిన డిజైన్లు లెనిన్, కాటన్ ఫ్యాబ్రిక్స్ మీదా అందంగా రూపుకడుతున్నాయి ►ప్యాచ్‌వర్క్ గిరి పుత్రికల ప్రత్యేక కళ. పూర్తిగా చేతితోనే తీర్చిన ఈ డిజైన్ ఫ్యాబ్రిక్ ఏ వేడుకలోనైనా ప్రత్యేకత చూపుతుంది ►కొంగుల అంచులను సైతం చిన్నపాటి అల్లికతో ట్రైబల్ కళను తీసుకురావచ్చు ►అడవి బిడ్డల నివాసాలు, వాటి ముంగిట ముగ్గులు, అక్కడి జీవన విధానం.. ప్రతీది చీర íసింగారాన్ని పెంచేదే. -
టోక్యో ఒలింపిక్స్ టార్చ్ ఆవిష్కరణ
టోక్యో: వచ్చే ఏడాది ఒలింపిక్స్‌కు ఆతిథ్యమిచ్చేందుకు సిద్ధమవుతున్న టోక్యో నగరంలో బుధవారం టార్చ్‌ను ఆవిష్కరించారు. ఐదు రేకులతో ఉండే చెర్రీ బ్లాసమ్ పువ్వు ఆకారం ఈ టార్చ్ పైభాగంలో కనిపిస్తుంది. బంగారు వర్ణంలో ఉన్న ఈ టార్చ్ పొడవు 28 అంగుళాలు, బరువు 1.2 కిలోలు. దీన్ని అల్యూమినియం లోహంతో తయారు చేశారు. 2011లో సంభవించిన భూకంపం, సునామీ బాధితుల కోసం తాత్కాలికంగా ఇళ్లను నిర్మిం చగా వచ్చిన వేస్టేజ్ అల్యూమినియం లోహం తో టార్చ్ రూపొందింది. టోక్యోలో ఈ టార్చ్ పరుగు పెట్టనున్న నేపథ్యంలో నగర వీధుల్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దనున్నారు. మార్చి 26న టార్చ్ రిలే మొదలవుతుంది. -
తీగ లాగితే ‘కిటికీ’
సాక్షి, హైదరాబాద్: ఇంటికి తలుపులు ఎంత అవసరమో కిటికీలూ అంతే. అయితే ఈ మధ్యకాలంలో చెక్కతోనో, స్టీల్‌తోనో తయారైన కిటికీలు కాకుండా విండో బ్లైండ్స్ ఏర్పాటు చేసుకుంటున్నారు. కార్పొరేట్ ఆఫీసులకు మాత్రమే పరిమితమైన ఈ కల్చర్ ఇప్పుడు నివాసాలకూ పాకింది. ఎన్నో వెరైటీలు, డిజైన్లు అందుబాటు ధరల్లోనే దొరుకుతుండటంతో సామాన్య, మధ్యతరగతి ప్రజలు కూడా వీటి వైపే ఆసక్తి చూపిస్తున్నారు. ►విండో బ్లైండ్స్ ఏర్పాటుతో గదికి అందం రావటమే కాదు సూర్యకాంతి, అతినీలలోహిత కిరణాలూ ఇంట్లోకి రావు. వీటికి పరదా అవసరం ఉండదు. లివింగ్ రూమ్‌తో పాటు బెడ్ రూములో అందమైన ప్రకృతి చిత్రాలు ఉన్న బ్లైండ్స్ను ఏర్పాటు చేసుకుంటే ఉదయం లేచి వాటిని చూస్తే మనస్సు ప్రశాతంగా ఉంటుంది. అంతేకాదు బయటి వారికి లోపల ఏముందో కనిపించదు. మనం బయట ఏం జరుగుతుందో చూడాలనుకుంటే బ్లైండ్స్కు ఉన్న తాడు లాగితే సరిపోతుంది. ఇందులో వర్టికల్, రోలర్, చిక్, ఉడెన్, ఫొటో, జీబ్రా వంటి ఎన్నో రకాలుంటాయి. ఠి చీర్ బ్లైండ్స్ సహజసిద్దమైన బొంగు కర్రలతో చేస్తారు. ఇవి తలుపు మాదిరిగా కనిపిస్తుంటాయి. ధర చ.అ.కు రూ.200–350 వరకు ఉంటుంది. ఠి వర్టికల్ బ్లైండ్స్ అన్ని సైజుల కిటికీలకు అనువుగా ఉంటుంది. ఓ పక్క ఉండే తాడు లాగితే రెండు పక్కలా డబుల్ డోర్ మాదిరిగా తెరుచుకుంటుంది. ధర చ.అ.కు రూ.90–150 వరకు ఉంటుంది. ఠి గాలి, వెలుతురు ధారాలంగా రావాలనుకునేవారు జీబ్రా బ్లైండ్స్ కరెక్ట్. చూడ్డానికి చిప్స్ మాదిరిగా ఉండే ఈ బ్లైండ్స్ పైనుంచి కిందికి తెరుచుకుంటాయి. ధర చ.అ.కు రూ.180–280 ఉంటుంది. ఠి రోలర్ బ్లైండ్స్ అచ్చం పరదా మాదిరిగా ఉంటుంది. తాడు లాగుతుంటే ముడుచుకుంటూ పైకి లేస్తుంది. ధర చ.అ.కు రూ.130–300 వరకు ఉంటుంది. -
హ్యాండ్ బ్యాగ్ నిండా డబ్బు! డబ్బు! డబ్బు!
‘నేను బిజినెస్ చేస్తాను’’ అంది రీతూ. కౌశిక్ ఆశ్చర్యంగా చూశాడు. ‘‘కుదురుతుందా!’’ అన్నాడు కౌశిక్.నిజానికైతే వాళ్లుంటున్న ప్రాంతాన్ని బట్టి, వాళ్లు పెట్టి పెరిగిన కుటుంబాల వాతావరణాన్ని బట్టి, అతడు ‘‘ఏం అక్కర్లేదు. ఇంట్లో పడుండు’’ అనే మాట అనాలి.హరియాణా.. మిగతా దేశానికి కొంచెం డిఫరెంట్. అక్కడి మగాళ్లు ‘మగపుట్టక పుట్టాం’ అన్నట్లు ఉంటారు. ఆడవాళ్లు ‘ఆడజన్మ’ అని సరిపెట్టుకునేలా ఉంటారు. రీతూ, కౌశిక్లది హరియాణాలోని సోనీపత్. గ్రామమే కానీ, మరీ పల్లెలా ఉంటుంది. కుదురుతుందా అన్నాక, ‘‘పల్లెలో ఏం బిజినెస్ నడుస్తుంది రీతు’’ అని నవ్వాడు కౌశిక్.రీతూకు హ్యాండ్‌బ్యాగులు డిజైన్ చెయ్యడం వచ్చు. ఎప్పుడో టెన్త్‌లో ఉండగా నేర్చుకుంది. ఊళ్లోకి ఎవరో వచ్చారు.. విద్య నేర్చుకుంటే ఉపాధి ఉంటుందని ఏవో రెండు మూడు పనులు ఊళ్లో ఆడవాళ్లకు నేర్పించి వెళ్లారు. నేర్చుకున్న వాళ్లలో రీతూ కూడా ఉంది. పదహారేళ్లకే పెళ్లి కావడంతో రీతూ లోపల ఆ విద్య అలా మెలకువగా ఉంది.ఇప్పుడు ఆమె వయసు 31. ఇద్దరు పిల్లలు. ఇప్పుడామె బిజినెస్ ఉమన్. నెలకు ఇంతని సంపాదిస్తోంది. ఎంత సంపాదిస్తోందో తర్వాత. సంపాదన ఎలా మొదలైందో తెలిస్తే భలే వింతగా ఉంటుంది. అమ్మాయిల్లోని ఆసక్తికి, నైపుణ్యానికి కాస్త హెల్పింగ్ హ్యాండ్ దొరికితే ఇట్టే అల్లుకునిపోతారని తెలిసి ముచ్చటేస్తుంది. ఈ ముచ్చటకేం గానీ.. రీతూ లైఫ్‌లో సెకండ్ ఇన్నింగ్స్ ఎలా మొదలైందో చూడండి. ‘‘నేను బిజినెస్ చేస్తాను’’ అని అడిగిందని కదా రీతూ గురించి మనం చెప్పుకున్నాం. ఇది ఐదేళ్ల నాటి సంగతి. ‘‘కుదురుతుందా’’ అని భర్త అడిగిన తర్వాత, ‘కుదుర్చుకుంటాను’’ అని చెప్పిన తర్వాత.. ఆమె హ్యాండ్‌బ్యాగ్‌ల డిజైనింగ్‌లు చెయ్యడం, వాటిని కుట్టి, ఫినిషింగ్ ఇవ్వడం మొదలుపెట్టింది. మొదటి కస్టమర్ ఒక పురుషుడు. ఎవరంటే.. ఆమె భర్తే. ‘‘రీతూ మేడమ్ ఎంతకు అమ్ముతారు?’’ అని సరదాగా అడిగాడు. తర్వాత వాళ్ల ఆఫీస్‌లోని వాళ్లకు చెప్పాడు. తర్వాత చుట్టుపక్కల వాళ్లకు తెలిసింది. వారిలో.. చదువుకున్న అమ్మాయిలు ఉంటారు కదా.. వారు రీతూకు గైడెన్స్ ఇచ్చారు. ‘‘అక్కా.. బాగుంది, అయితే డిగ్రీ చదివితే.. నీకు బాగా పనికొస్తుంది’ అని చెప్పారు. ‘‘డిగ్రీలో చేరేదా’’ అని భర్తను అడిగింది రీతూ... ‘బిజినెస్ చేసేదా?’ అని అడిగిన విధంగానే. ‘‘కష్టమవదు కదా..’’ అన్నాడు. నవ్వింది. అతడిని ఆఫీస్‌కి, పిల్లల్ని స్కూల్‌కి పంపి తనూ, ప్రైవేట్ కాలేజీలో డిగ్రీలో చేరింది. ఎంట్రన్స్ టెస్ట్ రాసి, నేరుగా డిగ్రీలో చేరి చదివింది. పాసైంది. 2016లో పట్టా చేతికొచ్చింది. ‘‘అక్కా.. ఇప్పుడు చూస్కో నీ బిజినెస్ ఎలా డెవలప్ అవుతుందో. ఫ్లిప్‌కార్ట్‌తో టై అప్ అవ్వు’’ అని సలహా ఇచ్చారు. అప్పట్నుంచీ రీతూ ప్రాడక్ట్ మొత్తం ఆన్లైన్ అమ్మకాలకే. ముఖ్యంగా ఫ్లిప్‌కార్ట్‌కి. మంచి డిజైన్లు, మంచి క్వాలిటీ ఉండడంతో రీతూ హ్యాండ్ బ్యాగులకు ఫ్లిప్‌కార్ట్‌లో గిరాకీ పెరిగింది. భర్త, చుట్టుపక్కల అమ్మాయిలు, చదివిన డిగ్రీ.. ఇవే కాదు ఫ్లిప్‌కార్ట్‌లోని ‘నైపుణ్యాల అభివృద్ధి విభాగం’ కూడా రీతూకు గైడెన్స్ ఇచ్చింది. ప్రస్తుతం ఆమె ఆదాయం.. (చెబితే బాగుంటుందా? మగవాళ్ల ఇన్కమ్ అడక్కూడదంటారు. ఆడవాళ్ల ఇన్‌కమ్‌ను మాత్రం మనం ఎందుకు చెప్పుకోవాలి? అయినా సరే.. చెప్పుకోవాల్సిందే.) ప్రస్తుతం ఆమె ఆదాయం నెలకు.. ఎనిమిది లక్షల రూపాయలు! ఎన్ని ఉద్యోగాలు, ఎన్ని జీతాలు కలిపితే ఇంత మొత్తం వస్తుంది! చిన్న టీమ్‌తో కలిసి పనిచేస్తోంది రీతూ. ఆమె పుట్టింటి పేరు రీతూపాల్. ఆ పేరుతోనే ‘రీతూపాల్ కలెక్షన్’తో తన బ్రాండ్‌కు ఒక ఇమేజ్ తెచ్చుకుంది. డబ్బు కాదు కానీ, ‘‘నా పేరు అందరూ చెప్పుకోవాలి’’ అని ఆమె ఆశ. అది పెద్ద ఆశేం కాదు. ఇప్పటికే రీతూపాల్ హ్యాండ్బ్యాగ్స్కి ఒక గుర్తింపు వచ్చింది. ఒక్కో బ్యాగ్ ధర.. ఫీచర్స్‌ని బట్టి 200 నుంచి 15 వందల రూపాయల వరకు ఉంటుంది. రెండేళ్ల క్రితం మొదటి నెలలో రీతూ సంపాదన 11 లక్షలు! ఆ లెక్క ఆమె చూసుకోలేదు. తర్వాతి నెల నుంచీ ఆమె చేతికొస్తున్న డబ్బు 7 నుంచి 8 లక్షల మధ్య నిలకడగా ఉండడం మొదలైంది. ఆ లెక్కా చూసుకోలేదు రీతూ. మరేం చూసుకుంటోంది. నెలకు కనీసం 20 లక్షలైనా సంపాదించాలని నవ్వుతూ అంటోంది.రీతూ.. బిజినెస్ ప్రయత్నాల్లో ఉందని తెలిసినప్పుడు బంధువులంతా ‘అవ్వ’ అంటూ బుగ్గలు నొక్కుకున్నారు. ఇప్పుడూ నొక్కుకుంటున్నారు.. ‘అవునా.. మన రీతూ అంత సంపాదిస్తోందా?’ అని. -
మడతపెట్టే డైనింగ్ టేబుల్
సాక్షి, హైదరాబాద్: డైనింగ్ టేబుల్ ఆకారం, నాణ్యతలో కాలానుగుణంగా అనేక మార్పులు చోటు చేసుకుంటున్నాయి. సౌకర్యంతో పాటూ ఇంటి అందాన్ని రెట్టింపు చేసే డైనింగ్ టేబుల్ డిజైన్స్‌కు వినియోగదారులు ప్రాధాన్యత ఇస్తున్నారు. దీంతో డిజైనర్లు ఆ తరహా టేబుల్స్‌ను రూపొందిస్తున్నారు. బాదంకాయ ఆకారంలో, వృత్తాకారంలో, దీర్ఘచతురస్రాకారంలో టేబుల్స్‌ను డిజైన్ చేస్తున్నారు. ప్రీమియం రకం డైనింగ్ టేబుల్స్ అయితే అవసరమైనప్పుడు డైనింగ్ టేబుల్లా వాడుకొని మిగిలిన సందర్భంలో మడతపెట్టి పక్కన పెట్టే విధంగా రూపొందిస్తున్నారు. మరికొన్ని రకాల టేబుల్స్ కింద పాత్రలు, ప్లేట్స్ పెట్టుకునే విధంగా అరలు కూడా ఉంటున్నాయి. ఎవరి కుటుంబ అవసరాలకు, అభిరుచులకు తగ్గట్టుగా వివిధ రకాల డైనింగ్ టేబుల్స్ మార్కెట్లో లభ్యమవుతున్నాయి. ►ఓపెన్ కిచెన్ ఉన్నప్పుడు హాల్లోనే ఒక పక్కన డైనింగ్ టేబుల్ ఏర్పాటు చేసుకోవచ్చు. హాల్ సైజ్‌కు అనుగుణంగా టేబుల్ సైజ్ ఉండేలా చూసుకుంటే మంచిది. ► టేబుల్ మరీ పెద్దగా ఉండటం వల్ల హాల్ లేదా వంటగది చిన్నగా లేదా ఇరుగ్గా కనిపిస్తుంది. ►పిల్లలు ఉన్న ఇంట్లో గ్లాస్ డైనింగ్ టేబుల్‌కు బదులుగా స్టోన్ ఫినిష్ ఉన్న టేబుల్‌ను లేదా ఉడెన్ టేబుల్‌ను ఎంచుకోవటం మంచిది. ►కిచెన్‌లో ఏమాత్రం అవకాశం ఉన్నా ఇద్దరు లేదా ఒక్కరు కూర్చొని తినేందుకు వీలుగా ఉండే పోర్టబుల్ బ్రేక్‌ఫాస్ట్ టేబుల్‌ను ఏర్పాటు చేసుకోవచ్చు. ►గ్లాస్ డైనింగ్ టేబుల్ ఉంటే.. దానికి ఉపయోగించిన వుడ్ మెటీరియల్స్ గోడల రంగులకు మ్యాచ్ అయ్యేలా చూసుకుంటే ఇంటి అందం రెట్టింపు అవుతుంది. -
రాసి మూసేసి!
సాక్షి, సిటీబ్యూరో: చారిత్రక మూసీ నది ప్రక్షాళన పనులు ఒక్క అడుగూ ముందుకు సాగడం లేదు. తొలివిడతలో ప్రతిపాదించిన పనులు కాగితాలకే పరిమితం అయ్యాయి. పురానాపూల్–చాదర్‌ఘాట్(3 కి.మీ) మార్గంలో సుందరీకరణ చేపడతామని చెప్పిన అధికారులు...చివరకు డిజైన్ల అంశాన్నే తేల్చలేకపోయారు. మూసీ చుట్టూ ఆకాశ మార్గాల నిర్మాణం, నది ప్రవాహ మార్గంలో తీరైన ఉద్యానవనాలు ఏర్పాటు తదితర బ్యూటిఫికేషన్ పనులు చేపట్టేందుకు వీలుగా పది స్వదేశీ, విదేశీ సంస్థలు ఆరునెలల క్రితమే అవసరమైన డిజైన్లను సమర్పించినప్పటికీ అడుగు ముందుకు పడడంలేదు. మూసీనది పడమర భాగంలో ఉన్న ఉస్మాన్‌సాగర్, హిమాయత్సాగర్లతోపాటు తూర్పున ఉన్న గౌరెల్లి (ఔటర్‌రింగ్‌రోడ్డు సమీపం)వరకు సుమారు 57.50 కి.మీ మార్గంలో సుందరీకరణ, పరిరక్షణ, అభివృద్ధి ప్రాజెక్టులను చేపట్టేందుకు మూసీ రివర్‌ఫ్రంట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అంతర్జాతీయ స్థాయి డిజైన్ సంస్థలను ఆహ్వానించిన విషయం విదితమే. ప్రపంచస్థాయి ప్రమాణాలు, వినూత్న విధానాల ద్వారా మూసీ సుందరీకరణ ప్రాజెక్టును చేపట్టాలని నిర్ణయించిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నప్పటికీ పనులు పట్టాలెక్కకపోవడం పట్ల నగరవాసులు, పర్యావరణ వాదులు తీవ్ర అసంతృప్తి వ్యక్తంచేస్తున్నారు. ఆచరణలో ఆమడదూరం... తీరైన పట్టణ ప్రణాళిక, సుందరీకరణ అంశాల్లో పేరొందిన ప్రతిష్టాత్మక సంస్థలు పురానాపూల్–చాదర్‌ఘాట్ మార్గంలో సుందరీకరణ పనులు చేపట్టేందుకు గాను మూసీ రివర్‌ఫ్రంట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ గతంలో డిజైన్ కాంపిటీషన్ నిర్వహించింది. దీంతో అంతర్జాతీయంగా పేరొందిన సంస్థలు తాము రూపొందించిన డిజైన్లను కార్పొరేషన్‌కు సమర్పించాయి. ఇందులో అత్యుత్తమ డిజైన్‌ను ఎంపిక చేయడంలో ఆరునెలలుగా మూసీ కార్పొరేషన్ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండడం గమనార్హం. ఘన చరిత్ర, సంస్కృతి ప్రతిబింబించేలా సుందరీకరించాల్సిందే.. మూసీ సుందరీకరణ పనుల్లో భాగంగా మూసీలో ఆవరణ వ్యవస్థను పరిరక్షించడం,హైదరాబాద్ నగర చరిత్ర,సంస్కృతిని ప్రతిబింబించేలా వివిధ అభివృద్ధి పనులకు తక్షణం శ్రీకారం చుట్టాల్సిన అవసరముందని పర్యావరణ వాదులు కోరుతున్నారు. ఇందుకోసం ‘ట్రాన్స్ఫార్మింగ్ హైదరాబాద్:మూసీ రివర్ రివిటలైజేషన్’ పేరుతో నిర్వహించిన డిజైన్ కాంపిటీషన్లో వివిధ సంస్థలు సమర్పించిన డిజైన్లలో అత్యుత్తమ డిజైన్‌ను ఎంపికచేయాలని సూచిస్తున్నారు. మూసీ సుందరీకరణ పనుల డిజైన్లు రూపొందించిన స్వదేశీ, విదేశీ కంపెనీలివే... 1.ట్యూరెన్స్కేప్, చైనా 2.ఎకో సిస్టం డిజైన్, యూఎస్ఏ 3.హెన్నింగ్ లార్సెన్, డెన్మార్క్ 4.వావ్ డిజైన్ స్టూడియో, సింగపూర్ 5.ఆరూప్ ఇంటర్నేషనల్ యూకె ఇండియా 6.స్పేస్ మ్యాటర్స్ అండ్ స్నోహెట,నార్వేఇండియా 7.సుర్భానా జురోంగ్ సింగపూర్ ఇండియా 8.హఫీజ్ కాంట్రాక్టర్, ముంబయి 9.హెచ్సీపీ డిజైన్, అహ్మదాబాద్ 10.అనగ్రామ్ ఆర్కిటెక్టŠస్, ఢిల్లీ నీరుగారుతోన్న లక్ష్యం.. ఇక అత్యుత్తమ డిజైన్‌ను ఎంపిక చేసి పురానాపూల్–చాదర్‌ఘాట్ మార్గంలో డిసెంబరు నెలలో సుందరీకరణ, తీరైన ల్యాండ్‌స్కేప్ గార్డెన్లు ఏర్పాటుచేసే పనులను ప్రారంభించాలని గతంలో లక్ష్యం నిర్దేశించారు. 2019 ఏప్రిల్ నాటికి ఈ పనులు పూర్తిచేసి ప్రజల సందర్శనకు వీలుగా ఏర్పాట్లు చేయాలనుకున్నప్పటికీ ఇప్పటికీ అడుగు ముందుకుపడడంలేదు. అధికారుల మాట ఇదీ.. మూసీ ప్రవాహ మార్గంలో 57.50 కి.మీ మార్గంలో ఈస్ట్‌వెస్ట్ కనెక్టివిటీ, సుందరీకరణ, పరిరక్షణ పనులను జనవరి 2019లో ప్రారంభించి రెండున్నరేళ్లలోగా పూర్తిచేసేందుకు ప్రణాళికలు సిద్ధంచేసినట్లు మున్సిపల్ పరిపాలన శాఖ అధికారులు తెలిపారు. కాగా మూసీ సుందరీకరణ, పరిరక్షణ చర్యల్లో భాగంగా నది ప్రవాహ మార్గంలో నదిలోకి ఘన,ద్రవ వ్యర్థాలు, మురుగునీరు చేరకుండా అవసరమైన చర్యలు తీసుకోవాలని జీహెచ్ఎంసీ, జలమండలి అధికారులకు ఆదేశాలిచ్చామన్నాయి. మూసీ కారిడార్ అభివృద్ధి పనులిలా.. ♦ పురానాపూల్–చాదర్‌ఘాట్ మార్గంలో 3 కి.మీ మార్గంలో మూసీ సుందరీకరణ, తీరైన ల్యాండ్ స్కేప్ గార్డెన్లను తీర్చిదిద్దడం. ♦ రివర్‌ఫ్రంట్ సుందరీకరణ పనుల్లో భాగంగా నగరంలో మూసీ ప్రవహిస్తున్న 57 కి.మీ మార్గంలో దశలవారీగా సుందరీకరణ పనులు చేపట్టడం. -
కూలింగ్ ఛాలెంజ్!
పిసరంత కరెంటుతో రాత్రంతా చల్లదనాన్ని ఇచ్చే ఏసీ ఉంటే ఎలా ఉంటుంది? ఇలాంటి అద్భుత ఆవిష్కరణతో... మన జేబులకు పడే నెలవారీ చిల్లులు తగ్గడం ఒక్కటే కాదు.. భూతాపోన్నతికి అడ్డుకట్ట వేయడమూ సాధ్యమవుతుంది. భూమ్మీద ఇప్పటికే కోటిన్నర ఏసీలు ఉండగా... 2050 నాటికి మరో 330 కోట్లు వచ్చి చేరతాయన్న అంచనాలు బలపడుతున్న తరుణంలో భారత ప్రభుత్వం ఓ వినూత్నమైన పోటీ ప్రకటించింది. ఎల్ఈడీల తరహాలో అతితక్కువ విద్యుత్తుతో పనిచేసే ఏసీలను డిజైన్ చేసి తయారు చేసిన వాళ్లకు ఏకంగా రూ.21 కోట్ల బహుమతి ప్రకటించింది. గ్లోబల్ కూలింగ్ ప్రైజ్ అనే పేరుతో ప్రకటించిన ఈ పోటీలో తయారయ్యే ఏసీ గరిష్టంగా 700 వాట్ల విద్యుత్తును మాత్రమే వాడుకోవాలి. అంతేకాకుండా ఒకవేళ నీటిని ఉపయోగించి చల్లదనాన్ని కలిగించే పక్షంలో అది రోజుకు 14 లీటర్లకు మించకూడదు. వచ్చే ఏడాది జూన్ వరకూ దరఖాస్తులు స్వీకరిస్తారు. ఆ తరువాత ఆగస్టులో పది మంది ఫైనలిస్టులను ఎంపిక చేసి వారికి రూ.14 కోట్లు అందించి నమూనాల తయారీకి పురమాయిస్తారు. 2020 నవంబరు, డిసెంబర్లలో పోటీ విజేతను ప్రకటిస్తారు. -
నేత కాంతులు
సౌందర్యానికి మించిన దీపం లేదు.అందమైన ఆహార్యానికి మించిన కళ లేదు.పండగ వేళ ఇంట్లో కాంతి పూలు పూయాలి.నేత వస్త్రాలతో వెలుగులు చిందించాలి.ఈ దీపావళిని చేనేతమయం చేయండి.అందంతో పాటు రక్షణ కూడా పొందండి. ►ఇక్కత్ కాటన్, ప్లెయిన్ కాటన్ ఆఫ్ అండ్ ఆఫ్ శారీగా డిజైన్ చేసుకోవచ్చు. దీనికి మోడ్రన్ లుక్ రావడానికి స్లీవ్‌లెస్ క్రాప్‌టాప్ ధరించాలి. ►బెంగాలీ కాటన్ శారీస్‌కు కడ్డీ బార్డర్స్ వస్తుంటాయి. ఇవి పండగ వేళ దీప కళతో పోటీ పడుతుంటాయి. ►కాటన్ సిల్క్ శారీ ఇది. ‘కాటన్ చీరలు ఎలా కట్టుకున్నా బొద్దుగా కనిపిస్తాం, కుచ్చిళ్లు సరిగ్గా ఉండవు’ అని పెదవి విరిచేవారికి కాటన్ సిల్క్ మిక్స్‌తో వచ్చిన చీరలు, డ్రెస్సులను ఎంపిక చేసుకోవచ్చు. ఆధునిక పద్ధతుల్లో కట్టుకుంటే స్టైలిష్‌గా కనిపిస్తారు. ►చీరకట్టుకోలేం అని డ్రెస్సుల వైపు చూసే నవతరం అమ్మాయిలు పండగ వేళ కళకళలాడుతూ ఉండాలంటే.. పాత పట్టు చీరను లాంగ్ గౌన్గానూ, ఫ్లోర్ లెంగ్త్ అనార్కలీగానూ మార్చేయవచ్చు. ఇలా అందంగా ధరించవచ్చు. ►టీనేజర్స్ ముచ్చటపడి కోరుకునే చీరకట్టు. కాటన్ శారీస్‌తో ఇలా మోడ్రన్ లుక్‌తో వెలిగిపోవచ్చు. ► బీజ్ కాటన్ చీరలు బూడిద, పసుపు రంగుల కాంబినేషన్‌తో ఉంటాయి. పండగకు కళను వెయ్యింతలు చేస్తాయి. ►ఖాదీ కాటన్ చీరలనువయోవృద్ధులు కట్టుకుంటారు అనిపెదవి విరిచే అమ్మాయిలు లేటెస్ట్ బ్లౌజ్ డిజైన్లతో ఇలాఆకర్షణీయంగా రెడీ అవ్వచ్చు. – కీర్తికా గుప్తా డిజైనర్ నిర్వహణ ఎన్.ఆర్. -
ఇద్దరి కోసం బుల్లి కరెంటు కారు
విద్యుత్తుతో నడిచే కార్లు మనకు కొత్త కాదుకానీ.. పైకప్పు లేకుండా కనిపిస్తున్న ఈ కారు మాత్రం భలే కొత్తగా కనిపిస్తోంది. మోటర్‌బైక్‌కు ఎక్కువ.. కారుకు తక్కువ అన్నట్టుగా ఇందులో రెండు సీట్లు మాత్రమే ఉంటాయి. చిన్నసైజు కారణంగా చిన్న చిన్న గల్లీల్లోనూ హాయిగా దూసుకెళ్లవచ్చు. పార్కింగ్‌కూ, అటు ఇటు తిప్పడానికి ఎలాంటి ఇబ్బందులు ఉండవన్నమాట. ఫర్ఈజ్ అనే సంస్థ డిజైన్ చేసి ఉత్పత్తి చేసింది. దీన్ని ఈ వారంలో జరగబోయే ప్యారిస్ మోటర్ షోలో తొలిసారి దీన్ని ప్రదర్శించనున్నారు. ఒకసారి ఛార్జ్ చేసుకుంటే దాదాపు 160 కిలోమీటర్ల దూరం ప్రయాణించగలిగే ఈకారులో 17.6 కిలోవాట్/గంటల బ్యాటరీ ప్యాక్ ఉంది. రెండు నుంచి ఆరు గంటల్లోపు పూర్తిగా ఛార్జ్ చేసుకోవచ్చు. -
వెండి పండగ
దసరా నవరాత్రులంటేనే దాండియా డ్యాన్సుల హంగామా!ఈ సంబరంలో ధరించే దుస్తులతో వెండి ఆభరణాల అందమూ పోటీపడుతుంది. వెన్నెలంతా ‘వెండి’గా మారిపండగ వేళ తనూ పాదం కలిపి మెరిసిపోతుంది. చీరకట్టుకు సింగారమై మురిసిపోతుంది... సిల్వర్ టిప్స్ ∙దేశీ స్టైల్లో ఒక తెల్లటి కుర్తా, కలర్‌ఫుల్ స్టోల్ వేసుకుని.. నలుపు, తెలుపులో ఉన్న వెండివి పెద్ద పెద్ద జూకాలు, గాజులు ధరిస్తే చాలు డ్రెస్కే అందం వస్తుంది. లేదంటే పొడవాటి లాకెట్ హారం వేసుకున్నా చాలు. ఫ్యామిలీ ఈవెంట్స్‌కి సరైన ఎంపిక ∙సిల్వర్ ఆభరణాలు యంగ్ ఎనర్జీని తీసుకువస్తాయి. వేడుకలో ఉల్లాసాన్ని పెంచుతాయి ∙చేతులకు పెద్ద పెద్ద వెండి కంకణాలు లేదంటే వేలికి పెద్ద ఉంగరం ధరించినా చాలు మీ స్టైల్లో గొప్ప మార్పు వచ్చేస్తుంది ∙కాళ్లకు వెండి పట్టీలు, మెట్టెల అందం సంప్రదాయ అతివలకు ఎన్నో ఏళ్లుగా పరిచయమే. ఈ లోహపు చల్లదనం అతివ చర్మానికి వెన్నెల చల్లదనాన్ని çపంచుతుంది. అందుకే మహిళలు వెండిని ధరించడానికి మక్కువ చూపుతారు. మిగతా లోహపు ఆభరణాలతో పోల్చితే వెండి ఆభరణం ధర దాదాపుగా అందరికీ అందుబాటులో ఉంటుంది. ఆర్టిఫిషయల్ జువెల్రీలా చర్మసమస్యలు లేకపోవడం కూడా ఈ లోహపు ఆభరణానికి ప్లస్ అవుతోంది ∙బాగున్నాయి కదా అని మరీ అతిగా అలంక రించుకుంటే వెండి ఎబ్బెట్టుగా ఉండచ్చు. స్ట్రీట్ స్టైల్ కాలేజీకి వెళ్లే అమ్మాయిలు ధరించే ఇండో–వెస్ట్రన్ స్టైల్ డ్రెస్సులకు బాగా నప్పే ఆక్సిడైజ్డ్ సిల్వర్ జువెల్రీ బాగా నప్పుతుంది. అలాగే ప్రయాణాలకూ ఇవి అనువైనవనే పేరు వచ్చింది. టూర్లకు వెళ్లినప్పుడు ఈ తరహా ఆభరణాలనూ కొనుగోలు చేస్తుంటారు. హ్యాండ్లూమ్స్ – సిల్వర్ మన దేశీయ చేనేతలకు వెస్ట్రన్ టచ్ ఇస్తే మోడ్రన్ స్టైల్‌తో వెలిగిపోవచ్చు అనేది నేటి మగువ ఆలోచన. ఆ థీమ్‌తోనే పెద్ద పెద్ద లాకెట్స్‌తో ఉన్న పొడవాటి హారాలు, మెడను అంటిపెట్టుకునే చోకర్స్, టెంపుల్ జువెల్రీ డిజైన్ చేస్తున్నారు. వెస్ట్రన్ డ్రెస్‌లకే కాదు సంప్రదాయ కుర్తీ, గాగ్రా–ఛోలీ, చీరల మీదకూ అందంగా నప్పుతున్నాయి. ఈ వెండి ఆభరణాలు డిజైన్‌ను బట్టి రూ.400/– నుంచి లభిస్తున్నాయి. వెండా, బంగారమా! అని పోటీ పడే రోజులు వచ్చేశాయి. ముదురు పసుపు చాయలో ఉండే బంగారానికి పూర్తి కాంట్రాస్ట్ కలర్ తెలుపులో వెండి ఆభరణాలు పాశ్చాత్య దుస్తుల మీదకే కాదు సంప్రదాయ చీరకట్టుకూ వైవిధ్యమైన కళను తెస్తున్నాయి. పండగల్లో బంగారంతో పోటీపడుతున్నాయి. కంచిపట్టు – సిల్వర్ కంచిపట్టు చీరల మీదకు బంగారు ఆభరణమే వాడాలనే కచ్చితమైన నిర్ణయం ఇప్పుడేమీ లేదు. ఎందుకంటే, ఫ్యాషన్ జువెల్రీ వరసన చేరినప్పటికీ సంప్రదాయ ఆభరణ డిజైన్లు వెండి లోహంతోనూ తయారుచేస్తున్నారు నిపుణులు. వీటిలో మామిడిపిందెలు, కాసుల హారాలు, గుట్టపూసలు, కెంపులు–పచ్చలు పొదిగిన పొడవాటి, పొట్టి నెక్లెస్‌ల అందం అబ్బురపరుస్తున్నాయి. ఇవి పట్టు చీరల మీదకు అందంగా నప్పుతున్నాయి. పండగలో ప్రత్యేక కళను నింపుతున్నాయి. తక్కువ ధరతో ఎక్కువ అందంగా వెలిగిపోవచ్చు. హ్యాండ్లూమ్ చీరల మీదకు వెండితో తయారుచేసిన బొహెమియన్ స్టైల్ డిజైనర్ హారాలు -
చేనేతకు కళబోత
మన చేనేతలకు ఓ ప్రత్యేకత ఉంది. అది పోచంపల్లి, గద్వాల, కంచిపట్టు, పటోలా.. వంటి చేనేత చీరలు ఎప్పుడు ఏ సందర్భానికైనా బాగా నప్పుతాయి. అయితే, వీటికి కాంబినేషన్‌గా బ్లౌజ్ ఎలా డిజైన్ చేయించుకోవాలనే టెన్షన్ అస్సలు అవసరం లేదు. ఎందుకంటే ఒక డిజైనర్ తెలుపు లేదా క్రీమ్ కలర్ బ్లౌజ్‌ని జత చేస్తే చాలు. ముచ్చటైన కళతో వెలిగిపోతారు. చాలా వరకు డిజైనర్ బ్లౌజ్‌ల జాబితాలో నలుపు, తెలుపు రంగు బ్లౌజులు ఎలాగూ ఉంటాయి. హ్యాండ్లూమ్ చీర కట్టుకోవాలనుకున్నప్పుడు ప్రత్యేకంగా కనిపించాలంటే మీదైన తెలుపు రంగు జాకెట్టును «ధరిస్తే చాలు. ►పోచంపల్లి ఇకత్ చీరకు వైట్ బ్లౌజ్ ►నారాయణపేట చీరకు లాంగ్ స్లీవ్స్ జాకెట్ ► కంచిపట్టు చీరకు మగ్గం వర్క్ చేసిన తెలుపు రంగు జాకెట్టు ► గద్వాల చీరకు తెలుపు రంగు బ్లౌజ్ n పటోలా కాటన్ లేదా పట్టు చీరకు వైట్‌కలర్ డిజైనర్ బ్లౌజ్ ► బెంగాలీ కాటన్ చీరకు వైట్ కలర్ క్రాప్‌టాప్. ఇలా అభిరుచికి తగ్గట్టు డిజైన్ చేసుకున్న వైట్ బ్లౌజ్‌ని ఏ చేనేత చీరకైనా ఇంపుగా నప్పుతుంది. చేనేతకు కళబోత అన్న కితాబునిస్తుంది. -
రాణించండి
వేడుకలలో స్పెషల్‌గా కనిపించాలంటేఏ డ్రెస్సయినా వేసుకోవచ్చు.కానీ, రాణిలా.. యువరాణిలా దర్జా చూపించాలంటే ఈ లాంగ్ జాకెట్స్తొడుక్కోక తప్పదు. వీటినే కేప్స్ అని కూడా అంటారు. నెట్టెడ్, బనారస్, పట్టు వస్త్రాలతోచేసే ఈ లాంగ్ జాకెట్స్ ఏ డ్రెస్ మీదైనాహొయలు చిందిస్తాయి. మిమ్మల్ని రాణించేలా చేస్తాయి. వివాహ వేడుకలకుసంప్రదాయ వేడుకలకు రొటీన్ అలంకరణ బోర్ కొట్టచ్చు. అదే పలాజో డ్రస్మీదకు డిజైనర్ కేప్ ధరిస్తే వచ్చే ప్రశంసలే వేరు. డిజైనర్ స్కర్ట్ పెళ్లి, పుట్టిన రోజు సంప్రదాయ వేడుకలకు సరిపోయేలా స్టైల్‌ని క్రియేట్ చేశారు ఇది. పట్టు లెహెంగా మీదకు క్రాప్‌టాప్‌ని జత చేస్తేనే ఓ ఆకర్షణ. అలాంటిది దానికి నప్పే కోటును జత చేస్తే..వేడుకంతా ఒకే చోట కొలువుదీరనట్టే. ఈవెంట్ కాలేజ్ ఈవెంట్స్, స్టేజ్ షోస్ వంటి ప్రత్యేక సందర్భాలకు నప్పే స్టైలిష్ లుక్‌ని ఒక లాంగ్ కోటుతో తీసుకురావచ్చు. లాంగ్ వెస్ట్రన్ గౌన్ మీదకు ఫ్లోర్ లెంగ్త్ ఫ్లోరల్ జాకెట్ ధరిస్తే చాలు మహారాణి కళతో వెలిగిపోతారు. క్యాజువల్ లుక్ కాటన్ కుర్తా లేదంటే టాప్, బాటమ్ వేసుకొని పైన ఓ కాటన్ కేప్ వేసుకుంటే చాలు దుపట్టా అవసరం లేకుండా సౌకర్యంగా అదే సమయంలో స్టైలిష్‌గా లుక్‌ని మార్చుకోవచ్చు. పట్టు కుర్తా – స్కర్ట్పెళ్లి, పుట్టిన రోజు సంప్రదాయ వేడుకలకు సరిపోయేలా స్టైల్‌ని ఎప్పుడూ కొత్తగా క్రియేట్ చేస్తుంటారు డిజైనర్లు. పట్టు లెహెంగా, క్రాప్‌టాప్ వేసుకొని, దానికి నప్పే కోటును జత చేస్తే.. వేడుకలో ఎక్కడ ఉన్నా ప్రత్యేకంగా కనిపిస్తారు. జీన్స్‌తో జోడీ ఈ కాంబినేషన్‌కి మరో కట్ అవసరం లేదనుకుంటారు ఎవరైనా! కానీ, ఇప్పుడా మాటా కోటుతో మూలనపడింది. ఎందుకంటే ప్యాంట్ షర్ట్ లేదా ట్యూనిక్‌కి కోటు కూడా జత చేరి కొత్త హంగుతో చూపురుల మతులను పోగొడుతుంది. సాయంకాలం పార్టీలకు చెదురుముదురుగా పడే జల్లులు, సాయంకాలం కొద్దిపాటి చల్లదనం, రాబోయే చలికాలానికి ఇంకాస్త వెచ్చదనం.. ఇలా కాలానికి వెచ్చని స్నేహాన్ని పంచే లాంగ్ జాకెట్ పార్టీకి ఎనలేని హుషారునిస్తోంది. ఇండో వెస్ట్రన్ స్టైల్ మిక్స్ అండ్ మ్యాచ్ అయి గెట్ టుగెదర్ పార్టీలకు ఉల్లాసాన్ని ఇస్తోంది. ∙ఇది ఇండో వెస్ట్రన్లుక్ కాబట్టి ఇతరత్రా ఆభరణాల అలంకరణలు అక్కర్లేదు. ∙కోటు లేదా ఇన్నర్కుర్తా ప్లెయిన్‌గా ఉంటే సిల్వర్ జువెల్రీ ధరిస్తే స్టైలిష్‌గా కనిపిస్తారు. ∙కేశాలంకరణకు ప్రత్యేక శ్రద్ద అవసరం లేదు. నిగనిగల కురులను పొడవుగా లేదా పొట్టిగా ఒదిలేసినా అలలుగా ఎగిసిపడుతున్న జుట్టు ఈ తరహా డ్రెస్‌కు బాగా నప్పుతుంది. ∙ప్యాంట్– షర్ట్, పలాజో లాంటివి అయితే మీడియమ్ లేదా పెన్సిల్ హీల్ని వాడచ్చు. మిగతా కాంబినేష్కి ప్లాట్ చెప్పల్ లేదా శాండిల్స్‌ను ఉపయోగించవచ్చు. ∙ఈ తరహా డ్రెస్‌కి మేకప్ హంగామా కూడా పెద్దగా అవసరం పడదు. నేచురల్‌గా ఉండటానికే ఎక్కువ ప్రాముఖ్యత ఇవ్వాలి. ∙కోటు డిజైన్లలో పాదాలను తాకేలా ఉన్నా, మోకాలు వరకే సరిపుచ్చినా భిన్నమైన స్టైల్‌తో మెరిసిపోవాల్సిందే! ధరించిన డ్రెస్‌కి జాకెట్ తెచ్చే సౌకర్యవంతమైన లుక్ ఇప్పుడు అమ్మాయిలకు ఆప్తురాలైంది. ∙ పాశ్చాత్య దేశాలలో వెచ్చదనానికి వేసుకునే ఈ లాంగ్ కోట్ ఇప్పుడు కొన్ని మార్పులతో స్టైలిష్ వేర్‌గా ఇండియాలో గ్రాండ్‌గా అడుగుపెట్టింది. అన్ని వయసుల వారు ఈ కేప్‌కి హార్ట్‌ఫుల్‌గా వెల్కమ్ చెప్పడమే కాకుండా, అన్ని హంగులు అద్ది హుందాగా ధరిస్తున్నారు. నిర్వహణ: ఎన్.ఆర్. -
త్రీ ఫోర్త్ శారీ
హాఫ్ శారీ కాదు...ఫుల్ శారీ కాదు... ఇది త్రీ ఫోర్త్ శారీ! లంగా ఓణీ కాంబినేషన్‌ని హాఫ్ శారీ అని ముచ్చటగా పిలుస్తాం. చీర కట్టును ఫుల్ శారీ అని హుందాగా చెబుతాం. ఈ రెండింటి నడుమ ఇప్పుడు మరో స్టైల్ వచ్చింది. అదే త్రీ ఫోర్త్ శారీ! పొడవాటి లెహంగా లేదా పొట్టి స్కర్ట్ ధరించి దాని మీద అదే కాంబినేషన్ లేదా కాంట్రాస్ట్ చీరను మోకాలు కింది వరకు లెహెంగా కనిపించేలా కట్టాలి. ఇది కాటన్ కాంట్రాస్ట్ కాంబినేషన్లో హైలైట్ అయిన స్టైల్. ఇతరత్రా అలంకరణలు అవసరం లేదు. కావాలనుకుంటే ఫంకీ ఫ్యాషన్ జువెల్రీని అలంకరించుకోవచ్చు. – నిఖిత, డిజైనర్,ఇన్స్టిట్యూటో డిజైన్ ఇన్నోవేషన్ -
పూసా వసూల్
తెల్లని ముత్యాలుఒక్కొక్కటి ఒక్కో తీరుగుట్టపూసలని వాటికి పేరుఒక్కో పూస చేర్చిఒద్దికగా అల్లితేఆ పూస గుచ్చిన అందాన్నిచూసినవారు ఒళ్లంతా కళ్లు చేసుకోవాల్సిందే! వేడుక ఏదైనా పూసలు మేనును మెరిపించాల్సిందే!ప్రతి పూసా చూపులలెక్కలు వసూల్ చేయాల్సిందే! గుట్ట పూసల హారాలు పట్టు చీరల మీదకు ఎంత అందంగా ఉంటున్నాయో తెలిసిందే కదా! పెళ్లి, పండగ సంప్రదాయ వేడుకల్లో గుట్టపూసల ఆభరణాల ధరించడం ఇప్పుడు ట్రెండ్ అయ్యింది. అయితే, వీటి ఖరీదు ఎక్కువే! గుట్టపూసల ఆభరణాన్ని భర్తీ చేయడానికా అన్నట్టుగా ఇప్పుడు మగ్గం వర్క్‌లో గుట్టపూసలతో చేసిన ఎంబ్రాయిడరీ బ్లౌజ్‌లు అమితంగా ఆకట్టుకుంటున్నాయి. ఒకే పరిమాణంలో కాకుండా ఇష్టం వచ్చిన తీరులో ఉండే గుట్టపూసల(ముత్యాలు)ని హారంగా చేసి, అతివ మెడను అందంగా అలంకరించారు ఆభరణాల నిపుణులు. అదే థీమ్‌ని తెల్లని పూసలతో పట్టుచీర జాకెట్ల మీద ముచ్చట గొలుపుతున్నారు ఎంబ్రాయిడరీ డిజైనర్లు. ఈ డిజైన్‌లో ఎన్ని పూసలు ఎక్కువ వాడితే అంత ఖరీదు అని గుర్తించాలి. సింపుల్ లేదా గ్రాండ్ డిజైన్ అనేది బడ్జెట్ చీర హంగును బట్టి డిసైడ్ చేసుకోవచ్చు. ఎంత చిన్న డిజైన్ అయినా గుట్టపూసల డిజైన్ వేడుకలో హైలైట్‌గా నిలుస్తుంది. కుందన్స్‌తో కనువిందు ఎరుపు, పసుపు, పచ్చ కుందన్స్‌తో మరింత అందంగా దోస్తీ కడుతున్నాయి తెల్లని పూసలు. వీటికి జరీ జిలుగులు కూడా తోడై కొత్త సింగారాలతో వయ్యారాలు పోతున్నాయి. పట్టు చీర అంచు మీద నాటి రోజుల్లో పట్టుచీరలోనే వచ్చే కాంబినేషన్ బ్లౌజ్‌ను డిజైన్ చేయించుకునేవారు. ఆ స్టైల్ పాత బడి మూలన పడింది. అయితే, ఇటీవల మళ్లీ ఈ తరహా స్టైల్ వెలుగులోకి వచ్చింది. పట్టు చీర అంచు ఉండే పొడవు చేతులకు గుట్టపూసలతో చేసిన డిజైన్ అదనపు హంగులతో ఆకట్టుకుంటుంది. దీంతో ఓల్డ్ అని మూలన పడేసిన స్టైల్ ఇప్పుడు ‘వావ్’ అనిపిస్తోంది. కాసుల కాంబినేషన్ లక్ష్మీ కాసులతో డిజైన్ చేసిన మగ్గం వర్క్‌లు తెలిసినవే! ఇప్పుడు అందంగా ఉండే గుట్టపూసల డిజైన్‌కి అదనంగా కాసులను కూడా వాడి మరింత ఆకర్షణీయంగా డిజైన్ చేస్తున్నారు. ముదురు రంగులు ముదురు ఎరుపు, నీలం, పచ్చ, గులాబీ రంగు పట్టు ఫ్యాబ్రిక్‌లు పూసల డిజైన్‌కి బాగా నప్పుతాయి. తెల్లటి ముత్యాలు, పూసలను ఈ డిజైన్ ఔట్‌లెట్‌గా వాడుతారు. ముదురు రంగు ఫ్యాబ్రిక్ అయితే తెల్లటి పూసల హంగులు మరింత బాగా కనిపిస్తాయి. నిర్వహణ - ఎన్.ఆర్. -
చేతి కుచ్చులు
బుట్ట చేతులు... పొడవు చేతులు... పొట్టి చేతులు...అందమైన పట్టు చీరకు కుచ్చు చేతులు ఇప్పుడు సరిజోడి. పాశ్చాత్య కుచ్చులు చీరలో ఉండే అదనపు క్లాత్‌తో బ్లౌజ్ డిజైన్ చేయించుకోవడం అందరూ చేసే పనే. అయితే, ఆ బ్లౌజ్‌కి చేతుల చివరలో కుచ్చులు జత చేస్తే.. అసలైన ఆకర్షణ. ఈ వెస్ట్రన్ స్టైల్ మన సంప్రదాయ వస్త్రధారణలో అందంగా మెరుస్తున్నాయి. ప్లెయిన్ బ్లౌజ్‌కి కుచ్చుల హంగామా! చీరకి కాంట్రాస్ట్ కలర్ బ్లౌజ్ డిజైన్ చేయించుకొని, చీర అంచును జాకెట్ చేతుల చివరలో కుచ్చులుగా అమర్చితే మరింత అకర్షణీయంగా మారడమే కాదు ఆధునికంగానూ కితాబులు అందుకుంటుంది. పొడవాటి ఇండొ వెస్ట్రన్ సంప్రదాయ జరీ జిలుగుల పట్టు చీరకు ఇండో వెస్ట్రన్ లుక్ తీసుకురావడానికి, అమ్మాయిల మది గెలుచుకోవడానికి అంతటా పోటీ ఉంటోంది. అందుకు బ్లౌజ్ స్లీవ్స్‌కి మోచేతుల వద్ద కుచ్చులు ప్రధాన ఆకర్షణగా మారి ట్రెండ్‌లో నిలిచాయి. ఫ్యాషన్‌గా ఉండాలంటే ఎప్పుడూ కొత్తదనాన్ని ఆహ్వానించాలి. దాంట్లో పాత కాలం నాటి పోకడలూ తరచూ రిపీట్ అవుతుంటాయి. వాటిలో రఫెల్ అంటే కుచ్చుల డిజైన్ ఒకటి. 18, 19వ శతాబ్దిలో బుట్ట చేతుల జాకెట్లు ఆకట్టుకునేవి. ఆ తర్వాత లెహంగాలు, డ్రెస్సులు కుచ్చులతో మెరిసాయి. చీరలు సైతం అంచుల్లో కుచ్చులతో వెలిగిపోయాయి. ఇప్పుడు ఈ రాయల్ డిజైన్ చీరకట్టు బ్లౌజ్‌లకూ స్టైలిష్‌గా అమరింది. ఇది చాలా సింపుల్ ట్రెండ్‌గా చెప్పుకోవచ్చు. పట్టు చీర అంటే గ్రాండ్‌గా ఉంటుంది. అందుకని ఇంకా గ్రాండ్‌గా ఉండే డిజైన్స్ అక్కర్లేదని చాలా మంది భావన. కానీ, ఇతర అలంకరణలు పెద్దగా అవసరం లేని స్టైల్ కావాలంటే మాత్రం ఇలా కుచ్చుల చేతులున్న బ్లౌజ్‌ను ధరిస్తే చాలు. -
లక్ష్మీ కాసుల గలగలలు
ప్రతీ ఏటా కాసు శ్రావణమాసం వ్రతానికి ప్రతియేటా లక్ష్మీ కాసును కొనడం ఆనవాయితీగా ఉంటుంది చాలామందికి. ఈ కాసులు కొన్ని పోగయ్యాక వాటితో సింపుల్ డిజైన్స్ చేయించుకోవచ్చు. ఇవి ప్లెయిన్ శారీస్, అనార్కలీ వంటి వాటి మీదకూ ధరించవచ్చు. మామిడి కాసులు మామిడి పిందెల రూపంలో ఉండే కాసులను కూడా ఇప్పుడు తయారు చేస్తున్నారు. వీటిని మ్యాంగోమాల అంటారు. మన సంప్రదాయ వేడుకల్లో మామిడితో ఉన్న అనుబంధం వర్ణించలేనిది. అందుకే మామిడి పిందెల డిజైన్లు గల జరీ చీరలు, ఆభరణాలు ఎప్పుడూ గ్రాండ్‌గా ఉంటాయి. కనీసం 25 పైసలంత సైజ్‌లో ఉండే కాసులతో తయారయ్యే మాల 30 నుంచి 300గ్రాముల దాకా బరువు ఉంటున్నాయి. డైమండ్స్‌కు కాసుల జత కాసు హారానికి ఫ్లాట్ డైమండ్స్, సింగిల్ కట్ డైమండ్స్, కెంపులు, పచ్చలు, ముత్యాలతోనూ... ఇలా కంటెంపరరీగా డిజైన్ చేయించుకోవచ్చు. జూకాలు, గాజులు కూడా కాసులతో చేయించుకుంటే పట్టు చీరల మీదకు ఈ డిజైన్ ఆభరణాలు బాగా నప్పుతాయి. శ్రావణమాసం వ్రతాలు, వివాహ వేడుకలకు పట్టు చీరల మీదకు కాంబినేషన్‌గా ఎంత హెవీగా ఆభరణాలు వేసుకున్నా అందంగానే ఉంటుంది. వాటిలో బామ్మల కాలం నాటి లక్ష్మీ కాసుల మాలలు/హారాలు మాత్రం ఎప్పుడూ సవ్వడి చేస్తూనే ఉన్నాయి. అందుకే కాసుల పేరు అనేది ఆధునిక మహిళల మెడలోనూ గలగల మంటోంది. -
వరాల పట్టు
వరమహాలక్ష్మికి ఇంపైన పట్టుశ్రీ మహాలక్ష్మికి సొంపైన పట్టుకమలాయతాక్షికి కోమలమైన పట్టు శ్రావణలక్ష్మికి సొగసైన పట్టుఏ పట్టు కట్టినా కోరినన్ని వరాలు ఆ ఇంట కురిసినట్టే! లైట్ వెయిట్ రంగుల హంగులు, పువ్వుల డిజైన్లు లేదంటే ప్లెయిన్‌గా అలరించే ప్రత్యేకత లైట్‌వెయిట్ పట్టు చీరల ప్రత్యేకత. వీటికి మోడర్న్ టచ్ ఇవ్వాలంటే ప్లెయిన్, కాంట్రాస్ట్ బ్లౌజ్ లేదంటే స్లీవ్‌లెస్ బ్లౌజ్ సరైన ఎంపిక అవుతంది. ఈ తరం మగువ కోరుకునే కాంబినేషన్ కట్టు. ఇది. పొడవాటి గౌన్కూ జోడీ దుపట్టా పట్టు పండగ వేళ పసుపు, పచ్చ, ఎరుపు కాంతిమంతమైన రంగులు ముంగిళ్లను కళకళలాడేలా చేస్తాయి. అందుకే ఆ హంగులు నింపుకున్న పట్టు డ్రెస్సులు పండగ అందాన్ని Ðð య్యింతలు చేస్తాయి. పొడవాటి పటోలా గౌన్ మీదకు పట్టు దుపట్టా ఓ ప్రధాన ఆకర్షణ. లెహంగాతో పట్టు జత కట్టు ప్లెయిన్ కుచ్చుల లెహంగా మీదకు పట్టు ఓణీ ధరిస్తే ఓ కళ. లేదంటే ప్లెయిన్ పట్టు లెహంగా మీద ఎంబ్రాయిడరీ చేస్తే మరో ఆకర్షణీయమైన కళ. అనార్కలీకి తోడు పటోలా పట్టు ప్లెయిన్ లాంగ్ అనార్కలీకి మెరుపు తీసుకురావాలంటే పువ్వుల ప్రింట్లు ఉన్న పట్టు దుపట్టా లేదంటే ఇక్కత్, పటోలా పట్టును ఎంపికచేసుకుంటే ప్రత్యేకంగా కనిపిస్తారు. పట్టు చీర మగ్గం వర్క్ పెద్దంచు అవీ యాంటిక్ లుక్‌తో ఆకట్టుకునే పట్టు చీరలు ఇప్పటి ట్రెండ్. వీటికి డిజైనర్ బ్లౌజ్‌ను జత చేర్చితే గ్రాండ్ లుక్ వచ్చేస్తుంది. పండగ వేళ పట్టు ఎప్పుడూ ఎవర్గ్రీన్ కాన్సెప్టే. శ్రావణ మాసాన వరలక్ష్మీ వ్రతాలు, నోములు, పెళ్ళిళ్లు, గృహప్రవేశాలు.. ప్రతీది సంబరమే! ప్రతీది సంప్రదాయమే. పువ్వులు–పండ్లు, మామిడితోరణాలు, పసుపు–కుంకుమలతో పాటు పట్టు ఆభరణమై ఎన్నో విధాల జత కట్టచ్చు. పట్టు చీర కడితే చాలు అనుకునే రోజులు కావివి. పట్టును దేనితో జత కట్టవచ్చు అని ఆలోచించే రోజులు. అందుకు డిజైనర్లు సైతం తమ పనితనానికి మెరుగులు పెడుతుంటారు. పట్టును ఎలా ధరించినా కళ ఉట్టిపడుతుంది. కుర్తా, అనార్కలీ, పొడవాటి గౌను మీద పట్టు దుపట్టా, లెహెంగా మీదకు పట్టు ఓణీ జత చేసినా చాలు పండగ కళ వెయ్యింతలు అవుతుంది. - నిర్వహణ ఎన్.ఆర్. -
గోండుకు బ్రాండింగ్
చేనేత వస్త్రాలు ఆయా ప్రాంతాలను ప్రతిబింబిస్తాయి. అక్కడి సంస్కృతులను ప్రపంచానికి పరిచయం చేస్తాయి. అందుకే ప్రాచీన కాలం నుంచీ వస్తున్న డిజైన్లతోనే నేటికీ వస్త్రాలు నేస్తుంటారు చేనేత కళాకారులు. ఈ క్రమంలో వాటిని మరింతగా ఆధునీకరించి, కొత్త కొత్త డిజైన్లతో నేటి తరానికి చేరవేయడం కోసం దేశమంతా పర్యటిస్తూ అక్కడి వారితో మమేకం అవుతున్నారు హైదరాబాద్‌కు చెందిన యువ సృజనశీలి అఖిల నూకల. చేనేతల్లో ప్రస్తుతం అందరూ కలంకారి వైపు మొగ్గు చూపుతున్నారు. అంటే సంప్రదాయానికి పెద్ద పీట వేస్తున్నారు. కాబట్టి కలంకారిలోనే మొదట ప్రయోగాలు చేయాలనుకున్నారు అఖిల. అందుకోసం తెలంగాణ, మహారాష్ట్రలోని గోండు తెగకు చెందిన ప్రాంతాల్లో పర్యటించారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న గోండు విద్యార్థులతో కలిసి పనిచేశారు. అలాగే అస్సాంలోని బక్సార్ జిల్లా బరామా ప్రాంతంలో చాలా రోజులు ఉన్నారు. ఎక్కడికి వెళ్లినా అక్కడి గిరిజన జాతుల వారితో సన్నిహితంగా మెలిగి, వారికి సంబంధించిన సాంస్కృతిక అంశాలను తెలుసుకుని, అందుకు అనుగుణంగా వస్త్రాల మీద డిజైన్లు రూపొందించడాన్ని లక్ష్యంగా చేసుకున్న అఖిల.. హైదరాబాద్ భవాన్స్ వివేకానంద కాలేజీలో బి.ఎస్.సి. చదివారు. అస్సాంలో డిజైనింగ్ ఎస్.బి.ఐ ‘యూత్ ఫర్ ఇండియా’లో సభ్యురాలిగా ఉన్న 21 ఏళ్ల అఖిల, 2017 నుంచి అస్సామీ చేనేత వస్త్రాలను విస్తృతంగా ప్రాచుర్యం కల్పించే పనిలో ఉన్నారు. ఇంతకుముందే వేరొకరు ఈ ప్రయత్నానికి శ్రీకారం చుట్టి మధ్యలోనే విరమించుకున్నారంటే.. అదంత సులువైన పనేమీ కాదని అర్థమౌతోంది. ప్రస్తుతం అఖిల తన ఈ ప్రణాళికకు మరో రెండు మాసాల్లో అనుకున్న ఫలితాలు వస్తాయని ఆశిస్తున్నారు. చేనేత మగ్గాల మీద నేస్తున్న చీరలకు ఆర్డర్లు సంపాదించి, వాటిని తన సృజనాత్మకతతో అస్సాంలో డిజైన్ చేయించి, వాటిని దేశవ్యాప్తంగా అందరికీ అందేలా చేయడమే అఖిల ముఖ్యోద్దేశం. చెప్పి చేయించుకోవాలి ‘‘వస్త్రాలు నేయడం వారి వృత్తి మాత్రమే కాదు, వారి జీవన విధానం కూడా. వారు నేసిన వస్త్రాలే వారి జీవనాధారం. ఆ వస్త్రాల నుంచే వారికి ఆదాయం రావాలి’’ అంటారు అఖిల తరచు తను పర్యటించే అస్సామీ ప్రాంతాల వారిని ఉద్దేశించి. అక్కడి వారికి వ్యవసాయ భూమి, పశుసంపద రెండూ ఉంటాయి. వారిలో చేనేత కార్మికులు వస్త్రాలు నేయడం కంటె, కుటుంబ బాధ్యతల కోసం ఎక్కువ సమయం గడపవలసి వస్తోంది, అందువల్ల అనుకున్న సమయానికి ఆర్డరు ఇచ్చిన వారికి వస్త్రాలు అందించలేకపోతున్నారు. దీనిని గ్రహించిన అఖిల, అక్కడి చేనేత కార్మికులను పని దిశగా మళ్లిస్తూ, సకాలంలో ఆర్డర్లు పూర్తి చేయించేందుకు కృషి చేస్తున్నారు. తరచు ప్రయాణాలు అఖిల తనొక్కరే ఈ పని చేస్తున్నా.. హ్యాండ్స్ ఆఫ్ ఇండియా, వృందావన్, బీడ్ సోషల్ ఎంటర్ప్రైజ్ (బెంగళూరు) వారితో భాగస్వామి అయ్యారు. ఇందుకోసం ఆమె గువహాటికి అనేకసార్లు ప్రయాణించవలసి వస్తోంది. ఈ పని పెద్ద కష్టం కాకపోవచ్చు కాని, భాష సమస్యను తనింకా దాటవలసి ఉందని నవ్వుతూ అంటారు అఖిల. ‘‘కొందరైనా హిందీ అర్థం చేసుకోగలుగుతున్నారు, ఇందుకు సంతోషంగా ఉంది’’ అని చెబుతున్న అఖిల, ఇతర స్థానిక భాషలు నేర్చుకోవడానికి కూడా ప్రయత్నిస్తున్నారు. – రోహిణి -
గుట్ట పూసలు
గుట్టపూసలు అంటే ముత్యాలు. అయితే, మనకు తెలిసినవి గుండ్రని ఆకారంలో ఉండే ముత్యాలు. గుట్టపూసలు అనబడే ఈ ముత్యాలు అన్నీ ఒకే ఆకారంలో ఉండవు. పైగా చిన్న చిన్న పూసలుగా ఉంటాయి. బామ్మలకాలంలో ఇవి బాగా ఫేమస్. సంప్రదాయ దుస్తుల మీదకు బాగా నప్పుతాయి. మరుగునపడిన ఈ స్టైల్ మళ్లీ వెలుగులోకి వచ్చింది. వివాహ వేడుకలలో పట్టుచీరల మీదకు ఈ పూసలతో డిజైన్ చేసిన బంగారు ఆభరణాలను ధరిస్తే∙ఆకర్షణీయంగా కనిపిస్తారు. రూబీ, ఎమరాల్డ్, ఫ్లాట్ డైమండ్స్‌కి కూడా గుట్టపూసలతో అల్లిక ఉంటుంది.ఈ పూసలను కృత్రిమ పద్ధతులలోనూ తయారుచేస్తున్నారు. దీని వల్ల ఖర్చు తగ్గుతుంది. ∙మెడను పట్టి ఉంచే చోకర్స్తో పాటు పొడవైన హారాల వరకు గుట్టపూసలతో డిజైన్ చేయించుకోవచ్చు. ∙పొడవాటి హారాలను నడుముకు వడ్డాణంలా కూడా వాడచ్చు. గుట్టపూసల రంగు మారకుండా ఉండాలంటే వెల్వెట్ క్లాత్‌లో కాకుండా ప్లాస్టిక్ జిప్‌లాక్ కవర్లో భద్రపరుచుకోవడం మేలు. చాలా మంది వెల్వెట్ క్లాత్ ఉన్న జువెల్రీ బాక్స్‌లలో ఆభరణాలను భద్రపరుస్తుంటారు. వీటిలో బాక్టీరియా ఫామ్ అయ్యి, ఆభరణం నల్లబడే అవకాశం ఉంది. శ్వేతారెడ్డి ,ఆభరణాల నిపుణురాలు -
కుచ్చు కుచ్చు కూనమ్మా!
మహిళల పాశ్చాత్య దుస్తుల్లో బాగా పాపులర్ అయిన డిజైన్ ‘కుచ్చులు’. స్కర్ట్స్, బ్లౌజ్‌లు, గౌన్లు... వీటిలో చాలారకాల ‘కుచ్చులు’ మనం గమనించవచ్చు. కుచ్చుల గౌన్లలో మెరిసిపోయే కుందనపు బొమ్మలు అని మనం చిన్నారులను చూసీ అనుకుంటూ ఉంటాం. ఈ ‘కుచ్చుల’ అందాన్ని గౌన్లకే కాకుండా మన సంప్రదాయ చీరలకు జత చేసి ఒక వినూత్న కళను తీసుకువచ్చారు డిజైనర్లు. దీంతో ఇవి మోడ్రన్ కాలాన్ని మరింత అద్భుతంగా మార్చేశాయి. ప్రస్తుతం ఫ్యాషన్ ప్రపంచంలో రెట్రో స్టైల్ తెగ హడావిడి చేస్తోంది. అయినా కొన్ని ఆధునిక మెరుపులు సందడి చేస్తూనే ఉన్నాయి. వాటిలో కుచ్చులు అనబడే ఫ్రిల్ శారీ స్టైల్ ఒకటి. ∙చీరను కుచ్చిళ్లు పెట్టి కట్టుకుంటాం. అయితే కుచ్చిళ్ల ప్యాటర్న్‌ని ముందే కుట్టి చీరకు జత చేసి, కట్టుకుంటే విభిన్నమైన అందం సొంతం అవుతుంది.∙జార్జెట్, షిఫాన్, సిల్క్, నెటెడ్ చీరలకే కాదు కాటన్ చీరలకూ ఫ్రిల్స్ జత చేసి కొత్త లుక్‌ని తీసుకురావచ్చు. ∙నవతరం అమ్మాయిలే కాదు, నేటి తరం అమ్మలు కూడా వీటిని కట్టుకోవడం ఫ్యాషన్ అయ్యింది.∙ఈ స్టైల్‌కి శారీకి పూర్తి కాంట్రాస్ట్ కలర్ బ్లౌజ్‌ని ఎంచుకోవాలి. ప్లెయిన్, కొద్దిపాటి ఎంబ్రాయిడరీ బ్లౌజులు బాగా నప్పుతాయి. చీరకు కుచ్చులు ఎంపిక చేసుకునేటప్పుడు కాంట్రాస్ట్, సెల్ఫ్.. ఏ రంగు నప్పుతుందో ఫ్యాబ్రిక్‌ని బట్టి ఎంపిక చేసుకోవాలి. ఫ్రిల్స్ శారీకి రంగుల హంగులు ఎన్నయినా జత చేసుకోవచ్చు. ప్రింట్ శారీ అయితే ప్లెయిన్ కుచ్చుల ప్యాటర్న్‌ని, అదే ప్లెయిన్శారీ అయితే ప్రింటెడ్ కుచ్చులనూ ఎంచుకోవచ్చు.కుచ్చుల ప్యాటర్న్‌ని ముందే కుట్టి, దానిని చీరకు మరో కుట్టుతో ప్యాచ్ చేయాలి. ఫ్రిల్ శారీకి కుచ్చులే అలంకరణ కాబట్టి ఆభరణాలంటూ ఇతర అలంకరణల హంగులు అవసరం లేదు. ఎంత సింపుల్‌గా ఉంటే అంత బ్రైట్‌గా కనిపిస్తారు. సంప్రదాయ వివాహాది వేడుకలకన్నా కాక్టెయిల్ పార్టీస్‌కి బాగా నప్పే ఫ్యుజన్ లుక్ ఇది. – నిఖిత, డిజైనర్, ఇన్స్టిట్యూటో డిజైన్ ఇన్నోవేషన్ -
పువ్వుల వాన
పువ్వుల కాలం వసంతంపువ్వుల ప్రింట్ల కాలం వానకాలమే!అమ్మాయిల వ్యక్తిత్వాన్ని వికసించేలాంటి బోల్డ్ ప్రింట్స్‌తో ఇదిగో పూలవాన. ఇప్పుడంతా రెట్రో అదేనండి పాత తరం స్టైల్ తెగ హుషారెత్తిస్తుంది. ఫ్యాషన్ వేదికల మీదా, వివాహవేడుకలోనూ, సాయంకాలం పార్టీలోనూ అంతటా తానై చూపులను దోచేస్తుంది. ఇది మోడ్రన్ డ్రెస్సుల విషయంలోనే కాదు చీరకట్టులోనూ రెట్రో తెగ ఆకట్టుకుంటోంది.’’’ముఖ్యంగా పువ్వుల ప్రింట్లు వాటిని బంధిస్తున్నట్టుగా పెద్ద పెద్ద అంచుల బార్డర్లతో ఈ వింటేజ్ స్టైల్ చూపు తిప్పుకోనివ్వడం లేదు.’’’పువ్వుల డిజైన్లు, పెద్ద అంచులకు కాంట్రాస్ట్ బ్లౌజ్ జత చేయడమూ ఫ్యాషనే! కాస్త పాతతరం ‘కళ’, ఇంకాస్త ఆధునికపు అలలు చేరి మరింత శోభాయమానంగా కనువిందుచేస్తున్నాయి. ’’’ అలంకరణలోనూ పాత కళను తీసుకురావడం ఇప్పుడు ఆధునిక వనితల అసలు సిసలైన స్టైల్‌గా మారింది. జూకా జాకెట్ జూకాలు చెవులకు పెట్టుకుంటారు. అవి పెద్ద పెద్ద బుట్టలు కావచ్చు, వేలాడే హ్యాంగింగ్స్అవ్వచ్చు. అవే జూకాలు జాకెట్ మీద ఇంపుగా నిలబడితే అది కాస్తా జూకా స్టైల్ అవుతోంది. జూకానే తగిలిస్తే జాకెట్ వెనకాల ముడివేసే హ్యాంగింగ్స్ ప్లేస్‌లో ముచ్చటైన డిజైనర్ జూకాను తగిలిస్తే ఎంత అందంగా ఉంటుందో.. మీ వెనుక అతుక్కుపోయే చూపులు ఇట్టే చెప్పేస్తాయి. మగ్గం వర్క్ జూకా అచ్చు చెవి జూకాను పోలి ఉండే డిజైన్ జాకెట్ మీద జరీ తీగలతో మగ్గం మీద నేసి, కుందన్స్, ముత్యాలు పొందిగ్గా అమర్చితే ఎంతందమో చెప్పగలమా! ప్యాచ్ వర్క్ జూకా ఎక్కువ ఖర్చు లేకుండా జూకాను పోలి ఉండే డిజైనర్ ప్యాచ్‌ని జాకెట్ మీద గ్లూతో అతికించవచ్చు. లేదంటే సూది, దారంతో కుట్టేయవచ్చు. కర్టెసి: భార్గవి కూనమ్ ఫ్యాషన్ డిజైనర్ -
పదములే చాలవు... భామా!
ఇండోవెస్ట్రన్ అయినాఇంటింటి వేడుకైనా తల నుండి పాదం వరకు ఒకే కాంబినేషఒకే థీమ్ ఆభరణాలు అలంకరణలో చేరితే ఆ రూపాన్ని వర్ణించడానికి పదములే చాలవు సాయంకాలం షికారుకు వెళ్లాలన్నా, సంప్రదాయ వేడుకైనా ఆభరణాలు ధరించే దుస్తులకు సరిపోయేలా ఉన్నాయో లేవో సరి చూసుకోవడం అనేది తెలిసిందే. అయితే, ఇప్పుడు ఆభరణాలతో పాటు ఇతర అలంకరణ వస్తువులన్నీ ఒకే థీమ్‌తో ఉండేలా జాగ్రత్త తీసుకునే టైమ్ వచ్చేసింది. అదే ఇప్పుడు ట్రెండ్ అయ్యింది. పాపిట బిళ్ల నుంచి పాదం వరకు ముత్యాలు, రత్నాలు, కుందన్స్, పూసలు.. ఆభరణమేదైనా పాపిట్లో అలంకరించిన నగమాదిరే పాదరక్షల డిజైన్ కూడా ఉండాలి. అదెలా?! అనే వారికి ఇప్పుడీ డిజైన్లు అందుబాటులోకి వచ్చేశాయి. చెవి జూకాలు – చెప్పుల డిజైన్ ఒకేలా ఉంటే అదీ ఓ స్టైల్. కాలి పట్టీల రాళ్ల డిజైన్‌తో పోటీ పడే షూ ఉంటే ఆ కాలి అందం ఎన్నింతలు పెరుగునో అని మగువలు మురిసిపోవచ్చు. చేతి గాజులు – కాలి చెప్పుల డిజైన్‌తో జత కలిస్తే ధరించే దుస్తుల అందం రెట్టింపు అవకుండా ఉంటుందా! అనుకున్నారేమో అందమైన కాంబినేషన్‌గా జత కట్టేశారు. మెడలో హారం రంగు కాలి చెప్పుల రంగు ఒకేలా కాంతులీనుతుంటే! ఆ చెప్పుల మీదుగా పారాడే చీర అంచు డిజైన్ వాటితో పోటీపడుతుంటే నిలువెత్తు అందం నడిచివచ్చినట్టే! ముక్కుబేసరి పెట్టుకుంటేనే ముఖకాంతి పండువెన్నెల పోటీపడుతుంది. ఇక బేసరితో పోటీ పడేలా చెప్పుల జత కూడా తోడైతే మేలి ముసుగులో వధువు మెరిసిపోకుండా ఉండగలదా అనేది డిజైనర్స్ చెబుతున్న మాట. ఇన్ని డిజైనర్ అలంకరణతో పాటు వీటితో జత కలిసే హ్యాండ్ బ్యాగ్ లేదా క్లచ్ మరో అదనపు ఆకర్షణను నింపుతుంది. అలంకరణ వస్తువులన్నీ మ్యాచ్ చేయాలంటే అందుకే సమయం పడుతుంది. పైగా అన్నీ ఒకేలా దొరుకుతాయన్న గ్యారంటీ ఉండదు. ఇలా అన్నీ ఒకే థీమ్‌తో లభించే ఆభరణాలు, అలంకరణ వస్తువుల డిజైన్, నాణ్యతలను బట్టి ధరలు ఉన్నాయి.వెస్ట్రన్స్టైల్ నుంచి మన సంప్రదాయ దుస్తులకూ ఈ ట్రెండ్ అనుకరణ వచ్చింది. డ్రెస్‌లో ఒక ముఖ్యమైన డిజైన్ ప్యాటర్న్ తీసుకొని దానికి తగ్గట్టుగా చెప్పులు, బ్యాగ్, బ్యాంగిల్.. ఇలా అన్నీ ఒక సెట్‌లా ఉండేలా డిజైన్ చేస్తున్నారు. ఈ మోడల్ సెట్స్ యువతరాన్ని బాగా ఆకట్టుకుంటున్నాయి. మ్యాచింగ్ కోసం ఎక్కువ పాట్లు అవసరం లేని ఈ కొనుగోళ్లు ఆన్లైన్ మార్కెట్లోనూ అందుబాటులోకి వచ్చాయి. -
పెప్ కాలమ్
పెప్లమ్ ఇప్పుడు ట్రెండ్‌లో ఉంది.. ధోతీ ప్యాంట్ అందుకు తోడైంది. రెండూ కలిస్తే దేశీయానికి విదేశీయం జతపడినట్టు. తూర్పు–పశ్చిమాలు కలిసి కూర్చిన ఈ అందమైన డ్రెస్‌కు మీరే డిజైనర్! డిజైనర్ గార్మెంట్స్ కొనుగోలులో ఒక సులువు ఉంటుంది. వెంటనే నచ్చిన డ్రెస్‌ను తీసేసుకోవచ్చు. కానీ, కొలతల్లో తేడాలు తప్పవు. మళ్లీ వాటిని సరిదిద్దుకునే సమస్యలూ తప్పవూ. పైగా చాలా వరకు ఖర్చు ఎక్కువ అవుతుంటుంది. డిజైనర్ డ్రెస్‌ని మనమే సొంతంగా డిజైన్ చేసుకోవచ్చు. అదీ తక్కువ ఖర్చుతో.. ఎలా అంటే.. ∙ఒక పార్టీ డ్రెస్‌ను ఎంచుకునేటప్పుడు అదీ కాస్త మన సంప్రదాయ టచ్ ఉన్నది డిజైన్ చేసుకోవాలంటే ఇండోవెస్ట్రన్ స్టైల్ తీసుకోవాలి. అది కూడా వేడుక, సందర్భమూ బట్టి ఎంపిక అయితే మరీ మంచిది. ∙డ్రెస్‌ల ఎంపికలో ప్రధాన పాత్ర రంగులది. ఇవే వేడుకలో ప్రత్యేకతను నింపుతాయి. ధోతీ ప్యాంట్ లేదా పటియాలా సల్వార్ ధోతీ లేదా పటియాలా సల్వార్ మన దేశీయ సంప్రదాయ డ్రెస్. ఇది ఓల్డ్ ట్రెండ్. అయితే దీనికి కొంచెం వెస్ట్రన్ టచ్ ఇస్తే.. ఎప్పటికీ ఎవర్గ్రీన్ డ్రెస్. కొన్ని డ్రెస్ డిజైనింగ్స్కి ఎప్పుడూ ‘పాత’ లుక్ రాదు. ఇది సౌకర్యంగా ఉండటమే కాదు రాయల్ డ్రెస్‌గా కితాబులు అందుకుంది. ఈ కాలానికి అనువైన డ్రెస్ కూడా! నడుము దగ్గర కుచ్చులు పెడితే ధోతీ కట్టు మాదిరి లుక్ అద్భుతంగా కనిపిస్తుంది. దీనికి పెప్లమ్ టాప్‌ని జత చేస్తే ఇండోవెస్ట్రన్ లుక్ వచ్చేస్తుంది.కావాలనుకుంటే దీనికి దుపట్టా కూడా జత చేసుకోవచ్చు. ∙పెప్లమ్ టాప్ అంచు (బార్డర్) తీసేస్తే క్యాజువల్ వేర్‌గానూ ధరించవచ్చు. రంగులు పార్టీవేర్‌కి పెప్లమ్ టాప్‌కి అంచుగా జరీ బార్డన్ని జత చేయచ్చు. లేదా ఒకే రంగుతో బ్లౌజ్‌ని, ధోతీ ప్యాంట్‌ను డిజైన్ చేసుకోవాలంటే డ్రెస్‌లో ఏదో ఒక తేడాను చూపించాలి. ఉదా: జరీ ఎంబ్రాయిడరీ బార్డర్ లేదా కోల్డ్ షోల్డర్తో ఆ తేడా తీసుకురావచ్చు. షేడెడ్ కలర్ కాంబినేషన్ క్లాత్‌తో ధోతీ లేదా పటియాలను డిజైన్ చేసుకుంటే మరింత బాగుంటుంది. దుపట్టా తప్పనిసరి అనుకుంటే పటియాల రంగులో లేదా టాప్ అండ్ బాటమ్‌కి పూర్తి కాంట్రాస్ట్ది ఎంచుకోవాలి. ఫ్యాబ్రిక్ ఎంపిక ∙చాలా ఖరీదైన ఫ్యాబ్రిక్స్ నుంచి ధర తక్కువ గల ఫ్యాబ్రిక్స్ వరకు మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. మీ బడ్జెట్లో ఏ ఫ్యాబ్రిక్ సూట్ అవుతుందో అది ఎంచుకోవాలి. పెప్లమ్ టాప్‌కి రా సిల్క్, కాజు సిల్క్, కాటన్ సిల్క్, పేపర్ సిల్క్, టఫేరా సిల్క్.. వంటి ఫ్యాబ్రిక్స్ బాగా నప్పుతాయి. సిల్క్ కాకుండా వేరే ఫ్యాబ్రిక్ తీసుకోవాలనుకుంటే మొదటి ఎంపిక ‘వెల్వెట్’కి వెళ్లడం మంచిది. వెల్వెట్ ఫ్యాబ్రిక్‌తో పెప్లమ్ డిజైన్ చేస్తే రాయల్ లుక్‌తో టాప్ గ్రాండ్‌గా కనిపిస్తుంది.టాప్‌కి కాంట్రాస్ట్ కలర్లో ఉన్న ఫ్యాబ్రిక్ ఏది రిచ్‌గా ఉంటే అది పటియాల లేదా ధోతీకి ఎంచుకోవచ్చు. అయితే చాలా వరకు షేడెడ్ కలర్స్, కొంత లేత రంగులు ఎంచుకోవడం మంచిది. ఫాలింగ్ ఫ్యాబ్రిక్‌ని ఎంచుకుంటే కుచ్చులు చక్కగా కనిపిస్తాయి. ఉదాహరణకు: క్రేప్, కొన్ని రకాల సిల్క్స్, శాటిన్, చిఫాన్, జార్జెట్, సింథటిక్ ఫ్యాబ్రిక్స్ బాగా నప్పుతాయి. బార్డర్స్‌లో సీక్వెన్స్, జరీ, బీడ్స్, మిర్రర్స్వి ఎంచుకోవచ్చు. మీదైన ముద్ర వేయాలంటే మాత్రం ప్లెయిన్ ఫ్యాబ్రిక్ మీద హ్యాండ్ ఎంబ్రాయిడరీ చేసుకోవచ్చు. ఫ్యాబ్రిక్ కొలత పెప్లమ్ టాప్‌కి ఫ్యాబ్రిక్ 3 మీటర్లు. బాటమ్‌కి : 4 మీటర్లు అంచు జత చేయాలంటే : 2 –3 మీటర్లు పడుతుంది. ఇతర అలంకరణలు ప్లెయిన్ పెప్లమ్ టాప్‌కి అదనపు హంగులు చేర్చాలంటే ఎంబ్రాయిడరీనే చేయనక్కర్లేదు. ఖర్చు తగ్గించుకోవాలంటే డిజైనర్ బటన్స్‌ని అమర్చినా క్లాసిక్ లుక్ వస్తుంది.ఈ డ్రెస్ వేసుకున్నప్పుడు హై హీల్స్ వేసుకుంటే లుక్ మరింత ఆకర్షణీయంగా కనిపిస్తుంది.ఒక సన్నని బెల్ట్ ఉన్న హ్యాండ్ బ్యాగ్ భుజానికి వేసుకున్నా, డిజైనర్ క్లచ్ చేత పట్టుకున్నా బాగుంటుంది. – రూపేశ్ గుప్తా, ఇన్స్టిట్యూట్ డిజైన్ ఇన్నోవేషన్, హైదరాబాద్ పెప్లమ్ టాప్ మేకింగ్ బ్లౌజ్ భాగాన్ని కుట్టాక దానికి కుచ్చులను జత చేయాలి. ఇందుకు తగినంత ఫ్యాబ్రిక్ తీసుకొని మడత వేసి వృత్తాకారం వచ్చేలా కట్ చేసుకోవాలి. ‘పెప్’ భాగం పొడవుగా ఉండాలో, తక్కువగా ఉండాలో మీ ఆసక్తి బట్టి డిజైన్ చేసుకోవచ్చు. అంచు భాగాన్ని సన్నని అంచుగా మడిచి కుట్టేయాలి. పై భాగాన్ని బ్లౌజ్ పార్ట్‌కి జత చేసి, కుట్టాలి. బ్యాగ్ పాత పడిపోయిందా! లేదంటే రొటీన్‌గా ఉండే బ్యాగ్‌ను కొత్తగా మార్చేయాలా! మీ మొదటి సంపాదనతో కొనుక్కున్న బ్యాగ్‌ను జ్ఞాపకంగా దాచేసుకున్నా, ఎవరైనా కానుకగా ఇచ్చినా, ఖరీదు ఎక్కువైనా, చిన్న చిన్న లోపాలున్నా.. ఇలా కొన్ని బ్యాగ్‌లను బయట పడేయలేం. అలాంటి బ్యాగులను కొత్తగా మార్చుకొని ఎంచక్కా వాడుకోవాలంటే.. ఈ టెక్నిక్ రెడీగా ఉంది. ఉదా: 1 డిజైన్ చేయాలనుకున్న బ్యాగ్, లేసులు, తెల్లని పూసలు లేదా ముత్యాలు, కుందన్స్, చమ్కీ, గ్లూ వంటివి సేకరించండి. లెదర్, జూట్ బ్యాగ్‌లకు ఇలాంటివి కుట్టాలంటే సూది దారం కూడా రెడీగా పెట్టుకోండి 2 గ్లూ సాయంతో లేసును బ్యాగ్ లేదా క్లచ్‌కి అతికించండి. అదనపు భాగాన్ని కత్తిరించేయండి 3 పూర్తి లేసు చక్కగా అమరేలా జాగ్రత్త తీసుకోండి 4 ఆ లేసు మీదుగా ముత్యాలు లేదా పూసలు, 5చమ్కీలు అతికించండి. బ్యాగ్/క్లచ్ రెడీ. నోట్: 6,7 బ్యాగుల్లా క్లాత్, జ్యూట్, లెదర్ బ్యాగ్‌లైతే సూదితో జాగ్రత్తగా కుట్టేయాలి. లేదంటే గ్లూతో అతికించాలి. మీ బ్యాగ్ లేదా క్లచ్ అత్యంత సుందరంగా పార్టీవేర్‌కి నప్పేలా మారిపోతుంది. 39 అంగుళాల ధోతీ ప్యాంట్‌కు 1 మూడు మీటర్ల ఫ్యాబ్రిక్ తీసుకోవాలి. నాలుగువైపుల సమభాగాలుగా ఉండాలి. అఆఇఈ మార్క్ చేయాలి. 2 ఆ నుంచి ఇ వరకు మడవాలి. అప్పుడు అఇఈ అవుతుంది. 3 ఈ నుంచి అ కోణానికి ఫ్యాబ్రిక్ మడత తీసుకోవాలి. మరో కోణానికి ఉ మార్క్ చేయాలి. అఉఇ వస్తుంది. 4 అఉఇ లో ఉ వద్ద 10 అంగుళాల పొడవు, 2 అంగుళాల వెడల్పు తీసుకొని కట్ చేయాలి. అ నుంచి ఇ వరకు 36 అంగుళాల కొలత తీసుకొని అ భాగంలో కట్ చేయాలి. 5 ముందు భాగాన్ని మడవాలి. 6 వెనుక భాగం ముందు భాగం మీదకు వచ్చేలా కలిపి జత చేయాలి. 7 5 అంగుళాల వెడల్పు 20 అంగుళాల పొడవు ఉన్న బెల్ట్ భాగాన్ని జత చేయాలి. నోట్: శరీర ఆకృతిని బట్టి కొలతలు తీసుకోవాలి. -
గోళ్లు కుట్టించుకుంటారా?
మీరు కరెక్ట్‌గానే చదివారు! గోళ్లు కుట్టించుకుంటారా అని!? ‘దిమాగ్ గిట్ల కరాబయ్యిందా ఏంటి? అసలూ.. ఎవరైనా గోళ్లు కుట్టించుకుంటారా?’ అంటూ కోపం తెచ్చుకోవద్దండి!! ఇది నెయిల్ ఆర్ట్‌లో లేటెస్ట్ ట్రెండ్! చెవులు, ముక్కు కుట్టించుకున్నట్లే.. గోళ్లు కుట్టించుకుని (హోల్ పెట్టించుకుని).. ఇదిగో ఈ చిత్రంలో ఉన్నట్లుగా మెరిపించుకోవచ్చు. గోళ్లతోనే డిస్కో డాన్స్ చేయించొచ్చు. నిజానికి ఈ రోజుల్లో నెయిల్ ఆర్ట్‌కి ఫాలోవర్స్ చాలా ఎక్కువ. గోళ్లను పొడవుగా పెంచుకుని.. కొమ్మలు రెమ్మలు, పక్షులు, చేపలు ఇలా ఎన్నో అద్భుతాలను నెయిల్ ఆర్ట్లుగా డిజైన్ చేసుకోవడం... ఆ ఆర్ట్‌కు అక్కడక్కడా మెరుపుకోసం కుందమ్స్ అతికించుకోవడం ఎప్పటి నుంచో నడుస్తున్న ట్రెండ్. కానీ ఇప్పుడు ట్రెండ్ మారింది. నాజూగ్గా, పొడవుగా పెరిగిన గోళ్లను మెరిసే స్టడ్స్‌తో మరింత మెరిపించుకోవడమే ఇప్పటి ట్రెండ్. అందుకే మరి, నాజూకైన గోళ్లకు మెరుపుల స్టడ్స్ పెట్టుకుని కిరాక్ బాట పడుతోంది ఊత్. Eunkyung అనే దక్షిణ కొరియా యువ కళాకారిణి పరిచయం చేసిన ‘లెడ్ డిస్కో నెయిల్’ ఇప్పుడు మనదేశంలోనూ చాలామందిని ఆకట్టుకుంటోంది. ఈ స్టడ్స్‌ని అన్ని నెయిల్స్‌కి అటాచ్ చేసుకుని చీకట్లో ‘బూమ్ బూమ్ షకలక’ అంటూ.. డిస్కో లైట్స్ మాదిరిగా తళుక్కుమనిపించొచ్చు. ఇంతకీ ఈ మెరుపుకు కారణం ఏంటంటే.. విద్యుత్ దీపంలో ఉపయోగించే లెడ్ను స్టడ్స్‌లో వాడటంతో పాటు అది వెలిగేందుకు చిన్న బ్యాటరీ కూడా గోరు వెనుక భాగంలో అటాచ్ చెయ్యడం వల్ల చీకట్లో మెరుస్తుంది. – సంహిత -
స్లిట్ స్టైల్‌తో చింపెయ్!
ఏదైనా పని గొప్పగా చేస్తే చింపేశారు అంటారు. వేసుకునే దుస్తులు కూడా అంతే గొప్పగా ఉంటే చింపేశారు.. అనరా! ఈ స్లిట్ ఫ్యాషన్ వేసెయ్.. చింపెయ్! ‘డ్రెస్ చాలా ట్రెడిషనల్‌గా ఉంది... కాస్త స్టైలిష్ లుక్ ఇస్తే బాగుండు ఎలా..’ అనుకుంటున్నారా! చాలా సింపుల్. ఇలా ఒక స్లిట్ ఇచ్చి చూడండి. నేటి తరానికి బాగా నప్పే ఈ డిజైన్ సమ్మర్లో సౌకర్యంగానూ ఉంటుంది. సంప్రదాయ టాప్‌కి స్టైలిష్ స్లిట్ పెళ్లికి వెళ్లాలంటే సంప్రదాయ దుస్తులు ముఖ్యంగా లెహంగా ధరించాల్సిందే అని పెద్దవాళ్లు పట్టు బడితే మీ స్టైల్‌కి ఒక అదనపు హంగును ఎలా చేర్చాలా అని పెద్దగా ప్రయాసపడనక్కర్లేదు. టాప్‌గా ధరించే ట్రెడిషనల్ కుర్తీ, ట్యునిక్ వంటి వాటికి ఇలా స్లిట్స్ ఇస్తే చాలు. మీ వార్డ్‌రోబ్‌లో ట్రెడిషనల్ స్లిట్ టాప్ ఒకటి చేర్చండి. అది బెనారస్ లేదా జరీ వర్క్‌తో ఉన్నది ఏదైనా ఎంచుకోండి. అయితే, టాప్–బాటమ్ ఎప్పుడూ కాంట్రాస్ట్ ఉండేలా జాగ్రత్తపడండి. దేశీయ పట్టుకు వెస్ట్రన్ స్లిట్ బెనారస్, కంజీవరం వంటి పట్టు ఫ్యాబ్రిక్‌ను కూడా ఆధునికపు హంగులతో కొత్త లుక్ తీసుకురావచ్చు. లాంగ్ స్లిట్ కుర్తీకి బాటమ్ పార్ట్ జత చేయడంతో ట్రెడిషనల్ లుక్ వచ్చింది. ఓవరాల్‌గా చూస్తే పూర్తి వెస్ట్రన్ లాంగ్ గౌన్లా, దేశీయ పట్టు ఫ్యాబ్రిక్ అవడంతో సంప్రదాయపు సొబగులతో ఆకట్టుకుంటుంది. సమ్మర్‌కి సరికొత్త స్లిట్ వేసవి కాలం సౌకర్యంగా లేని దుస్తులు ధరిస్తే చికాకు మరీ ఎక్కువ అవుతుంది. గెట్ టు గెదర్ వంటి పార్టీలకు స్టైలిష్‌గా అదే టైమ్‌లో కంఫర్ట్ అనిపించే డ్రెస్‌లో వెళ్లాలంటే ఇలాంటి స్పెషల్ స్లిట్ డ్రెస్ ఎంచుకుంటే చాలు. బాటమ్‌గా జీన్స్.. టాప్‌గా స్లిట్ లాంగ్ కుర్తీ ధరించండి. వేదికల మీద వెలిగిపోయే స్లిట్ పెద్ద పెద్ద ఈవెంట్స్‌కి ఇలాంటి ఇండో వెస్ట్రన్ డ్రెస్‌లు బాగా నప్పుతాయి. స్కర్ట్ మోడల్ని తలపించే ఫ్రిల్స్ బాటమ్ టాప్‌కి జత చేశారు. లాంగ్ స్లీవ్స్ ట్యూనిక్‌కి ముందు భాగంలో స్లిట్ ఇవ్వడంతో కుచ్చుల భాగం ఆకర్షణీయంగా కనిపిస్తుంది. పూర్తి డ్రెస్ ఆధునికపు హంగులతో ఆకట్టుకుంటుంది. సౌకర్యవంతమైన స్లిట్ క్యాజువల్ లుక్‌తో సౌకర్యంగా అనిపించే ఇలాంటి డ్రెస్సులు వేసవికి ప్రత్యేకతను తీసుకువస్తాయి. టు పీస్ ఫ్రాక్ను ఎంచుకోవాలి. టాప్ పీస్‌కి కుచ్చులున్న ముందు భాగంలో స్లిట్ ఇవ్వాలి. రెండు ఫ్లోరల్ ప్రింట్స్ అయినా కాంట్రాస్ట్ కాంబినేషన్స్ అవడంతో లుక్ స్టైలిష్‌గా మారిపోతుంది. ఇలా మీరూ ప్రయత్నించవచ్చు. అది సంప్రదాయ దుస్తులైనా, వెస్ట్రన్ డ్రెస్ ఏదైనా స్లిట్ ఉంటే స్టైలిష్‌గా వెలిగిపోవచ్చు. -
కట్‌చేస్తే!
పెళ్ళిళ్లకి చీరలు కట్టుకోవడం ఒకప్పటి సీను. కట్ చేస్తే.. ఇప్పుడు ఓణీయే అదిరిపోయే సీను. పెళ్ళిళ్ల సీజన్లో పట్టు చీరలతో హాఫ్‌శారీస్, లాంగ్ గౌన్లు.. డిజైన్ చేయవచ్చు. కట్ చేయండి.. కట్టేయండి... వెలిగిపోండి. పెద్ద పెద్ద అంచులు,, చిన్న చిన్న బుటీలు, అందమైన జరీ పువ్వులు పట్టు చీరకు అందాన్ని తీసుకువస్తాయి. చీరను అమ్మాయికి లంగాఓణీగా సింగారించాలంటే ఇలా అందంగా రూపుకట్టేయవచ్చు. కొంగు భాగాన్ని బ్లౌజ్‌గా, చీర భాగాన్ని లెహంగా ను డిజైన్ చేసుకోవచ్చు. వేరే కాంబినేషన్ ఓణీని తీసుకోవచ్చు. పట్టు ఓణీలు కూడా ఇప్పుడు లభిస్తున్నాయి. చీరను లంగా బ్లౌజ్గానే కాదు అనార్కలీ డ్రెస్ లేదంటే లాంగ్ గౌన్గానూ రూపుదిద్దుకోవచ్చు. ఇవి సంప్రదాయ వేడుకులకు స్టైలిష్‌గానూ, ఆధునికంగానూ కొత్తగా కనువిందు చేస్తున్నాయి. పట్టు చీరలే కాకుండా మనవైన చేనేత చీరలను కూడా ఇందుకు ఉపయోగించవచ్చు. ఈ తరహా డ్రెస్సింగ్ ఫ్యాషన్ వేదికల మీద హల్ చేస్తున్నాయి. ప్లెయిన్ పట్టు లేదా రాసిల్క్ మెటీరియల్ తీసుకొని దానికి చీర అంచులు జత చేయాలి. అలాగే బ్లౌజ్ పార్ట్‌ని కూడా తీర్చిదిద్దాలి. బ్లౌజ్ పార్ట్‌ని క్రాప్‌టాప్‌గా డిజైన్ చేసి, మిగతా చీర భాగాన్ని ఓణీగా తీసుకోవచ్చు. ఈ డిజై స్టైల్స్‌ని నేటి తరం అమ్మాయిలే కాదు అమ్మలూ ధరించవచ్చు. లెహంగా పార్ట్‌కి కావల్సిన పట్టు మెటీరియల్ కూడా మార్కెట్లో లభిస్తుంది. అయితే, బ్లౌజ్ పార్ట్‌కి సరైన కాంబినేషన్ దొరక్క ఎంబ్రాయిడరీ చేసిన బ్లౌజ్‌లు వేస్తుం టారు. దీంతో లుక్ ప్రత్యేకత కనిపించదు. ఇందుకు లెహంగా, బ్లౌజ్ పార్ట్‌ని పట్టు, ఉప్పాడ, జరీ చీరలను వాడకం మొదలైంది. ఇవి సంప్రదాయ వేడకులకు తీరైన అందాన్ని తీసుకువస్తున్నాయి. -
‘భద్రాద్రి’కి తుదిరూపు!
భద్రాచలం: భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామి ఆలయాభివృద్ధికి ప్రభుత్వం చేస్తున్న కసరత్తు తుదిదశకు చేరుకుంది. శ్రీరాముడు జన్మించిన విళంబినామ సంవత్సరం వచ్చే మార్చిలో నిర్వహించే శ్రీరామనవమికి ఎంతో ప్రత్యేకత ఉన్న దృష్ట్యా అదే రోజున భద్రాద్రి క్షేత్ర అభివృద్ధికి శంకుస్థాపన చేసేలా ఏర్పాట్లు జరుగుతున్నాయి. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కూడా ప్రత్యేక శ్రద్ధ చూపిస్తున్నారు. చినజీయర్ సూచనలతో దేవాదాయశాఖ రూపశిల్పి ఆనందసాయి నేతృత్వంలో ఇప్పటికే మూడు నమూనాలను సిద్ధం చేశారు. ఆ నమూనాలను త్వరలోనే రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ముందుకు తీసుకెళ్లనున్నారు. సీఎం ఆమోదంతో వచ్చే నెలలో పనులు ప్రారంభించే అవకాశం ఉండడంతో ఆలయ అధికారులు తీవ్రంగా కసరత్తు చేస్తున్నారు. 65 ఎకరాల్లో ఆలయాభివృద్ధి భద్రాచలం ఆలయాభివృద్ధికి 65 ఎకరాల భూమి అవసరం ఉంటుందని జిల్లా అధికారులు ప్రాథమికంగా నివేదించారు. రామాలయం చుట్టూ 28 ఎకరాలు, అదే విధంగా కల్యాణ మండపం, దీనికి ఆనుకుని ఉన్న ఖాళీ స్థలాలు ఇలా మిగతా 37 ఎకరాలను రెండు చోట్ల సేకరించేలా నివేదికలో చూపించారు. రామదాసు కాలంలో నిర్మించిన గర్భగుడిని అలాగే ఉంచి, చుట్టూ రెండు ప్రాకారాలను శిల్పికళా శోభితంగా నిర్మించాలని డిజైన్‌లో పేర్కొన్నారు. నిత్య కల్యాణ మండపం, స్వామి వారి తిరువీధి సేవ కోసం మాడవీధులతో పాటు, భక్తులు ఆలయం చుట్టూ తిరిగేలా మరో దారిని కూడా ఏర్పాటు చేయాలని, ఆలయం నలువైపుల నుంచి స్వామి వారి దర్శనం చేసుకునేలా ద్వారాల నిర్మాణం చేపట్టాలని నిర్ణయించారు. వేయికాళ్ల మండపం వేయికాళ్ల (శిల్పాలతో చెక్కిన వేయి ఫిల్లర్లు కలిగిన)మండప నిర్మాణానికి డిజైన్‌లో ప్రాధాన్యం కల్పించారు. శ్రీరామనవమి నాడు శ్రీసీతారాముల వారికి పెళ్లి వేడుక జరిగే కల్యాణ మండపం, దీనికి ఆనుకొని ఉన్న స్థలంలో వేయి కాళ్ల మండపాన్ని నిర్మించాలని నిర్ణయించారు. వేయికాళ్ల మండపం అంతర్భాగంలోనే కల్యాణ మండపం కూడా ఉండేలా డిజైన్ తీర్చిదిద్దారు. ప్రస్తుతం అందుబాటులో కల్యాణ మండపంలో మొత్తంగా 35 వేల మంది శ్రీరామనవమి రోజున స్వామి వారి పెళ్లి వేడుకను ప్రత్యక్ష్యంగా తిలకిస్తున్నారు. భవిష్యత్‌లో 80 వేల మంది మండపంలో కూర్చొనేవిధంగా డిజైన్ తయారు చేశారు. 108 అడుగుల ఆంజనేయ స్వామి విగ్రహం గోదావరి తీరంలో 108 అడుగుల ఎత్తైన అభయాంజనేయస్వామి వారి విగ్రహాన్ని నిర్మించేలా డిజైన్‌లో పొందుపరిచారు. రామాలయం నుంచి నేరుగా గోదావరి తీరం వరకూ నేరుగా వెళ్లేందుకు రహదారి నిర్మాణం చేపట్టనున్నారు. నిర్వాసితులకు పునరావాసం ఎక్కడ? ఆలయాభివృద్ధిలో భాగంగా రామాలయం చుట్టూ ఉన్న వందకు పైగా ఇళ్లను కూల్చివేయాల్సి వస్తోంది. ఈ లెక్కన రామాలయం వెనుక ఉన్న జీయర్ మఠం నుంచి గోదావరి కరకట్ట వరకూ చుట్టు పక్కల ఇళ్లవారిని వేరే చోటకు తరలించాల్సి ఉంటుంది. భద్రాచలంలో ప్రభుత్వ స్థలం లేకపోవటంతో వీరికి ఎక్కడ పునరావాసం కల్పిస్తారనేది చర్చనీయాంశమైంది. పట్టణానికి ఆనుకొని ఉన్న పురుషోత్తపట్నంలో ఆలయానికి సంబంధించిన వెయ్యి ఎకరాలకు పైగా భూములు ఉన్నాయి. ఇవి రాష్ట్ర విభజనతో ఏపీలోని తూర్పుగోదావరి జిల్లా పరిధిలోకి వెళ్లిపోయాయి. దీంతో వీరికి అక్కడ పునరావాసం కల్పించటం వల్ల వారిని వేరే రాష్ట్రంలోకి పంపించినట్లౌతుంది. ఇది పెద్ద సమస్యగా మారనుంది. ఈ ప్రాంత వాసుల డిమాండ్ మేరకు భద్రాచలానికి సమీపంలో ఉన్న ఐదు పంచాయతీలు తిరిగి తెలంగాణకు వస్తేనే ఇటువంటి సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. ప్రభుత్వం ఆ దిశగా ఆలోచన చేసే క్రమంలోనే ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడిని శ్రీరామ నవమికి ఆహ్వానించేలా ఆలోచన చేస్తుందనే ప్రచారం ఉంది. అంతా సిద్ధం చేశాం ఆలయాభివృద్ధికి ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉంది. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు దీనిపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. అన్నీ అనుకున్నట్లుగా జరిగితే శ్రీరామనవమికి శంకుస్థాపన జరిగే అవకాశం ఉంది. ఆ దిశగానే దేవాదాయశాఖ ఉన్నతాధికారుల అనుమతితో ఏర్పాట్లు చేస్తున్నాం. మరోవైపు శ్రీరామనవమి ఉత్సవాలకు కూడా ఏర్పాట్లు చేస్తున్నాం. ప్రభాకర శ్రీనివాస్, దేవస్థానం ఈఓ -
తెలంగాణలో నూతన పంచాయతీ రూపకల్పన పక్రియ
-
బాహుభళీ!
భళి భళి భళిరా భళీ! బంగారు బాహు భళీ!! జాకెట్లకు వచ్చిందండి.. కనకంతో కళా కేళీ! పెళ్ళికూతురే కాదు పెళ్లికి హాజరయ్యే వారూ వినూత్న బ్లౌజ్ డిజైన్లతో మండపాలకు కళ తీసుకువస్తున్నారు. ఆభరణాలను ధరించడంతో పాటు బ్లౌజ్‌నే ఆభరణంగా మార్చేస్తున్నారు. గ్రాండ్‌గా ఉండే ఈ కళ ఇప్పుడు సంప్రదాయ ఎంబ్రాయిడరీ డిజైన్లలో పెద్ద పీట వేస్తున్నాయి. కాసులపేరు మెడనిండుగా బంగారు కాసులతో చేసిన హారం వేసుకుంటు చూసే కళ్ళన్నీ కుళ్లుకోవాల్సిందే! మెడలోనే కాసుల పేరు వేసుకుంటే ఎలా? చేతులకు, వీపు భాగాన కాసులు మెరిసిపోవాలి. ముత్యాలతో కలిసి దోస్తీ చేయాలి. డిజైన్ని బట్టి కాసుల సంఖ్యను ఎంచుకోవాలి. చుట్టూతా కుందన్స్, జర్దోసీతో అలంకరించాలి. ఖరీదును బట్టి అచ్చమైన బంగారపు కాసులను కూడా బ్లౌజ్ డిజైన్‌కి ఎంచుకోవచ్చు. పూసల హారాలు ఇతర బంగారు హారాలు అక్కర్లేదు. ఎంబ్రాయిడరీ వర్క్‌లే నెక్లెసులు అవుతున్నాయి. అదీ బోట్‌నెక్ బ్లౌజ్‌కి స్వరోస్కి, జర్దోసీ మగ్గం వర్క్‌లు కొత్త కొత్త సొగసులను అద్ది చూపరుల మతులను పోగొడుతున్నారు డిజైనర్లు. జువెల్రీ ఎంబ్రాయిడరీ వర్క్‌లో కుందన్స్, పూసలు ప్రధానంగా ఉంటున్నాయి. కనక మహాలక్ష్మి నిన్నా మొన్నటి వరకు టెంపుల్ జువెల్రీలో అష్టలక్ష్ముల మూర్తులు దర్శనమిచ్చేవి. నేడు బ్లౌజ్ చేతుల మీదా, వీపు మీదా లక్ష్మీదేవి మూర్తిని పెట్టి, చుట్టూతా పొందికైన డిజైన్‌తో కళ్లకు నిండుతనాన్ని తీసుకువస్తున్నారు. ఎంత గ్రాండ్‌గా ఉంటే అంత బాగు అన్నట్టుగా పెళ్లికి అష్టలక్ష్ములు నడిచి వచ్చినట్టు బ్లౌజ్‌ని అలంకరించేస్తున్నారు. ముఖ్యంగా ఈ డిజైన్ చేతుల మీద కొలువుదీరుతుంది. నెల వంకలు అమ్మాయిలే నేలమీద నడిచే చంద్రవంకలు. అలాంటి వారి బ్లౌజ్‌ల మీద నెలవంక చుక్కల సంఖ్యను మించిపోయేలా చేరిపోతే ఎంత అందం. ఆ అందాన్ని పోలి ఉండేలా ఆభరణాల ఎంపికతో బ్లౌజ్ మీద ఇలా సింగారించుకోవచ్చు. ఖరీదును బట్టి ఈ జువెల్రీ డిజైన్లను రూపొందించుకోవచ్చు. అవి అచ్చమైన బంగారమా, ఇమిటేషన్ జువెల్రీతోనా అనేది మీ ఇష్టం. నిర్వహణ: ఎన్.ఆర్ -
పైకప్పు అదిరింది!
సాక్షి, హైదరాబాద్: డ్యూప్లెక్స్, ఫ్లాట్లలో పడక గదులకు ఫాల్స్ సీలింగ్ అధికమవుతోంది. ఇది మీ అభిరుచులకు అద్దం పట్టాలంటే మాత్రం సీలింగ్ డిజైన్‌తో పాటూ సరైన వర్ణాల్ని ఎంచుకోవాలి. ఫాల్స్ సీలింగ్ ప్రధాన ఉద్దేశం.. గదిలో ఆహ్లాదభరిత వాతావరణాన్ని ఏర్పరడడం, అలసిన మనసు, శరీరానికి స్వాంతన చేకూర్చడమే! సరైన రంగుల కలయికతో ఆశించిన రూపాన్ని ఆవిష్కరించుకోవచ్చు. దీంతో మనసుకు ఆకట్టుకునే సీలింగ్‌ను ఏర్పాటు చేసుకోవడమే కాకుండా పైకప్పు విశాలంగా ఉన్న భావన కలుగుతుంది. పైకప్పును మృదువైన వర్ణాలు వేస్తే ఆ రూపం ఆనందమయం అవుతుంది. ♦ మిగతా గదులతో పోలిస్తే పడక గది సీలింగ్‌నే ఎక్కువ సేపు చూస్తాం. కాబట్టి, వర్ణాల ఎంపికలో కూడా విజ్ఞత పాటించాలి. సాదాసీదా రంగులు కాకుండా నేటి పోకడలకు అద్దం పట్టేవి ఎంచుకోవాలి. ఇది మీ మనసులోని భావాలకు ప్రతీకగా నిలవాలి. ♦ మధ్యస్తం, డార్క్ బ్రౌన్ వర్ణాలు పడక గదికి చక్కగా నప్పుతాయి. ఎందుకంటే ఈ వర్ణాలు ఉత్సాహపరిచే విధంగా, స్వభావానికి అనుకూలంగా ఉంటాయి. బిగీస్, బ్రౌన్స్, టాన్స్ వాడండి. ఇవి పుడమి రూపాన్ని తలపిస్తాయి. కొండలు, రాళ్లు, మట్టి రూపాల్ని ప్రతిబింబిస్తాయి. ♦ ఆకుపచ్చ, బ్రౌన్ మిశ్రమం పడకగదిని అద్భుతంగా మారుస్తుంది. గదిలో ఆత్మీయత భావనను కలిగిస్తుంది. ఆకుపచ్చలో సరైన షేడ్లను ఎంచుకోవాలి. ఎందుకంటే కొన్ని షేడ్లు వర్ణస్థాయిని తక్కువ చేస్తాయి. వర్ణాల ఎంపికలో.. ♦ గోడ రంగుతో పోల్చుకుంటే సీలింగ్‌కు వేసే వర్ణం తేలికగా ఉండాలి. అప్పుడే పైకప్పు తక్కువ ఎత్తులో ఉందనిపిస్తూ విశాలంగా ఉన్న భావన కలుగుతుంది. ముదురు షేడ్లను ఎంచుకుంటే పైకప్పు ఎత్తులో ఉన్న భావన కలుగుతుంది. ♦ తాజాదనం ఉట్టిపడుతున్న లుక్ రావాలంటే.. మోనో క్రోమోటిక్ థీమ్‌ను ఎంచుకోవాలి. రెండు, మూడు రంగులు కలిసినవి ఎంచుకుంటే మాత్రం అది పడకగది గోడలకు వేసిన రంగు కంటే తేలికగా ఉండేలా చూసుకోవాలి. అప్పుడే సీలింగ్ ప్రశాతం భావనను కలిగిస్తుంది. ♦ పైకప్పునకు తెలుపు రంగు కూడా వేసుకోవచ్చు. కానీ, సంప్రదాయ పద్ధతి. నేటి పోకడలకు అద్దం పట్టదని గుర్తుంచుకోండి. గోడల రంగుకు, సీలింగ్‌కు ఒకే రకమైనవి కాకుండా వేర్వేరు వర్ణాల్ని కూడా వేసుకోవచ్చు. దగ్గరదగ్గర రంగులు కాకుండా చూడగానే ఇట్టే కన్పించాలి. అంటే లేత గులాబీ, లేత ఎరుపు వర్ణాలాంటివన్నమాట. -
అందరికీ ఇళ్ల పథకం కోసం డిజైన్లను సిద్ధం చేయాలి
కాకినాడ సిటీ: జిల్లాలో ప్రధానమంత్రి ఆవాస్ యోజన ఎన్టీఆర్ నగర్ పథకం కింద ఎనిమిది పురపాలక సంఘాల్లో నిర్మించే అందరికీ ఇళ్ల పథకం గృహాల కోసం లేఅవుట్, గృహ నిర్మాణ డిజైన్లు సిద్ధం చేయాలని కలెక్టర్ కార్తికేయ మిశ్రా ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్లో అందరికీ ఇళ్ల పథకం అమలును ఏపిటెడ్కో, మున్సిపల్ కమిషనర్లు, తహశీల్దార్లతో సమీక్షించారు. సంక్షేమ శాఖలపై... జిల్లాలోని అన్ని బీసీ సంక్షేమ వసతి గృహాల్లో బయో మెట్రిక్ హాజరు విధానాన్ని అమలు పర్చాలని ఆదేశించారు. శుక్రవారం కలెక్టర్ తన చాంబర్లో బీసీ సంక్షేమం, బీసీ కార్పొరేషన్ అధికారులతో సమావేశమై వెనుకబడిన తరగతుల విద్య, ఉపాధి కోసం అమలు చేస్తున్న కార్యక్రమాల ప్రగతిని సమీక్షించారు. సూక్ష్మ, సాగు వ్యవస్థల ఏర్పాటు ముమ్మరం... జిల్లాలో ఈ నెలాఖరు నాటికి 4 వేల హెక్టార్లలో మైక్రో ఇరిగేషన్ వసతుల విస్తరణకు లబ్ధిదార రైతుల బయోమెట్రిక్ రిజిస్ట్రేషన్ పూర్తి చేసి, సూక్ష్మ, సాగు వ్యవస్థల ఏర్పాటు ముమ్మరం చేయాలని ఆదేశించారు. శుక్రవారం కలెక్టర్ చాంబర్లో మైక్రో ఇరిగేషన్వసతుల విస్తరణపై ఏపీఏఐపీ, ఉద్యానశాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. -
భలెహెంగా!
చినుకుదారాలు నేలను చేరితేనే ప్రకృతి పచ్చకోకను కట్టుకుంటుంది. ఆషాఢం నడుము బిగిస్తేనే... శ్రావణం కొత్తగా ముస్తాబవుతుంది.వేడుకలు వెయ్యింతలై వెలగాలంటే నట్టింట లెహెంగాల అందం భలేగా రూపుకట్టాల్సిందే! ► లేత గులాబీ రంగుకి పసుపుదనం తోడైతే.. ఆ కాంబినేషన్ చూడటానికి రెండు కళ్లు సరిపోవేమో అనిపిస్తుంది. సంప్రదాయ వేడుకకు నిండుతాన్ని మోసుకొస్తుంది. ► బంగారు రంగుకు ఎంబ్రాయిడరీ సొగసును చేర్చితే ఆ‘కట్టు’కునే లెహంగా రూపు ‘వహ్వా’ అనిపిస్తుంది. లాంగ్ అనార్కలీ.. లెహెంగాను తలపిస్తుంది. రెండు రంగుల ఫ్యాబ్రిక్ ఎంచుకుంటే ప్రత్యేకంగా ఉంటుంది. ► హై వెయిస్ట్ లెహెంగా శరీర సౌష్టవాన్ని మరింత అందంగా చూపుతుంది. అందుకే లెహంగా కట్కు తప్పనిసరి ప్రాధాన్యం ఇవ్వాలి. ► లెహంగాకు కుచ్చుల హంగులు జత చేర్చితే.. కొత్తరూపుతో చూసేవారి మతులను పోగొడుతుంది. ఫైన్ టస్సర్తో డిజైన్ చేసిన లెహెంగాలు వేదికలైనా, వేడుకలైనా హైలైట్‌గా వెలిగిపోవాల్సిందే! ► కురుల చివరల నుంచి నేల వరకు గులాబీ అందం అలలుగా జాలువారుతుంటే చూపుల మెరుపులు అతుక్కుపోయి అల్లికలుగా రూపుకడుతుంది. భళేగా ఉంది కదూ! అనకుండా ఉండదు ప్రతి మనసు. లెహెంగా ఎంపికకు పది సూచనలు... 1. లెహెంగాకు రంగుల కాంబినేషన్ ముఖ్యం. ఆ తర్వాత మెటీరియల్ ఎంపిక. ఆసక్తులను బట్టి ఫ్యాబ్రిక్ ఎంచుకున్నప్పటికీ లెహెంగాకు టస్సర్ సిల్క్, రాసిల్క్ గ్రాండ్ లుక్‌నిస్తాయి. 2. సంగీత్, రిసెప్షన్, పూజలు.. ఇలా సందర్భాన్ని బట్టి రంగుల ఎంపిక ఉండాలి. రాత్రి వేడుకలైతే కాంతివంతమైనవి, పూర్తిగా ఒకే రంగు లెహంగాను ఎంచుకోవాలి. 3. పొడవు, పొట్టి, లావు, సన్నం.. ఇలా శరీర కొలతలను బట్టి లెహెంగా కట్ ఉండాలి. హై వెయిస్ట్ కట్ లెహంగాలు బాగా నప్పుతాయి. 4. బ్లౌజ్‌కి సెలబ్రిటీలైతే బ్రాడ్ నెక్ డిజైన్స్ ఎంచుకుంటారు. ఎవరికి వారు వారి స్కిన్ కలర్, ఎత్తును బట్టి బ్లౌ్లజ్ డిజైన్ చేయించుకోవడం మంచిది. 5. సంప్రదాయ పండగల విషయానికి వస్తే... పసుపు, పచ్చ, మెరూన్ కలర్స్ బాగా నప్పుతాయి. 6. సిల్క్ మెటీరియల్ మాత్రమే కాకుండా మన ప్రాంతీయ ఖాదీ, కాటన్ మెటీరియల్‌తో కూడా లెహంగాలను డిజైన్ చేసుకోవచ్చు. 7. ముందు... రంగుల కాంబినేషన్లను స్కెచ్ వేసుకొని చూసుకోవచ్చు. 8. ఎంబ్రాయిడరీ కూడా మరీ గాఢీగా కాకుండా సింపుల్‌గా ఉండేలా చూసుకోవాలి. 9. హైట్ తక్కువగా ఉన్నవారు అంచులు చిన్నగా ఉన్నవి ఎంచుకోవాలి. 10. హై వెయిస్ట్ లెహెంగాలు ధరిస్తే పొడవుగా కనిపిస్తారు. - దివ్యారెడ్డి, ఫ్యాషన్ డిజైనర్, బంజారాహిల్స్, హైదరాబాద్ -
గర్వంగా గౌను
గౌను మనది కాదు... మనదైపోయింది... ప్రపంచంలో గౌన్లు ధరించిన మహిళలు గద్దెనెక్కి కూర్చున్నారు... శాసించారు. రాణించారు. మహారాణులనిపించుకున్నారు. ‘వలెంటినో గరవాని’ డిజైన్ చేసిన గౌన్లకి ఆడంబరాల వెలుగు ఎంతుంటుందో వాటిని ధరిస్తే గర్వంగా తలెత్తుకునే హంగూ అంతలా ఉంటుంది. మెత్తటి సిల్క్ లేదంటే పువ్వులా ఆకర్షించే షిఫాన్ అదీ కాదంటే మృదువుగా మనసును తట్టే లేస్.. ఫ్యాబ్రిక్ వాలెంటినో చేతిలో పడిందంటే అది అమ్మాయి మేనిపై కొత్తగా హొయలు పోవాల్సిందే! అంత అందంగా ఉంటాయి కాబట్టి ప్రపంచంలోనే ప్రసిద్ధి చెందిన పదిమంది ఫ్యాషన్ డిజైనర్లలో ఒకరిగా నిలబెట్టింది. పేరు ‘వలెంటినో గరవాని.’ ఇటలీ ఫ్యాషన్ డిజైనర్. పెరిగింది, చదివింది మాత్రం ఫ్యాషన్ ప్రపంచానికి పుట్టినిల్లు అయిన ప్యారిస్‌లో. డిజైన్లలో విభిన్నతను మాత్రమే కాదు అందాన్నీ చూడాలని కోరుకునే సృజన వలెంటినోది. సొంతగడ్డకు వచ్చి తన పేరుతోనే ఫ్యాషన్ హౌజ్‌ను ఏర్పాటు చేసుకున్నాడు. అయినా, ప్యారిస్, లండన్, న్యూయార్క్ వంటి మహానగరాలలో ఫ్యాషన్ షోలలో హైలైట్‌గా నిలిచాడు. అప్పటి వరకు ఆధునికపు మోజులో కొట్టుకుపోతున్న డిజైన్స్‌లో స్త్రీని స్త్రీగా చూపించడంలో సక్సెస్ అయ్యాడు. దీంతో ప్రపంచ ఫ్యాషన్ స్టైలిస్ట్‌లు వలెంటినో డిజైన్స్‌కి దాసోహం అన్నారు. అందుకే అత్యంత ప్రఖ్యాతి చెందిన బ్రాండ్లలో ‘వలెంటినో’ ఒకటిగా చేరింది. వలెంటినో డిజైన్లు రొమాంటిక్‌గా నిలవడం స్పెషల్ బ్రాండ్ అయ్యింది. మెత్తని లేసులు, ఖరీదైన షిఫాన్స్, మృదువైన సిల్క్, శాటిన్ క్లాత్‌లపై తన సృజనాత్మకత విరివిగా చూపించాడు. ఆధునిక మహిళ ఎంత అందంగా ఉండాలో చూపించాడు. చాలామంది డిజైనర్లు వలెంటినోను అనుకరించారు. ఇలాంటి డిజైన్లు రూపుకట్టడానికి ప్రపంచవ్యాప్త పోటీ ఎప్పుడూ ఉంటుంది. అది హాలీవుడ్ అయినా మన బాలీవుడ్ టు టాలీవుడ్ అయినా వలెంటినో డిజైన్ డ్రెస్ ధరిస్తే అందంగా వెలిగిపోవడం ఖాయం అనుకుంటారు. విల్లులా, పువ్వులా, ముడతలుగా, లేస్‌గా, ఎంబ్రాయిడరీగా.. నాణ్యమైన ఫ్యాబ్రిక్‌తో వలెంటినో స్టైల్‌గా ఇలా హొయలు పోతుంది. ఎన్నెన్నో గౌన్లు ►ట్రాపికల్ డ్రీమ్, ఈవెనింగ్ స్పెషల్, క్రేప్ మినీ, లేస్ మిడ్, తుల్, ఎంబ్రాయిడరీ, ఫ్లోరల్ ప్రింట్, హాఫ్ షోల్డర్.. ఇలా గౌన్లలో వేటికది భిన్నం. మిక్స్ అండ్ మ్యాచ్ చేయడంలో వలెంటినో గరవాని శైలి ఘనం. ►క్లాత్‌లోనే కాదు ప్రింట్ల ఎంపికలోనూ గరవాని òస్టైల్ భిన్నంగా ఉంటుంది. ధరించేవారిని న్యూలుక్‌తో చూపుతుంది. ►కాన్వాస్‌పై ఆయిల్ పెయింటింగ్ ఎలా కళ్లకు కడుతుందో గరవాని గౌన్లను చూస్తే ఆ అనుభూతి కలుగుతుంది. వేడుకలలో ప్రత్యేకంగా నిలుస్తుంది. ఇతర డిజైన్లూ ఫేమస్! గౌన్లు మాత్రమే కాదు వలెంటినో గరవాని హౌజ్‌లో మరెన్నో డిజైన్స్ ఫ్యాషన్ ప్రియులను ఆకట్టుకుంటున్నాయి. వాటిలో... ట్రౌజర్స్: పలాజో, క్రాప్డ్ వైడ్ లెగ్, వెక్చర్డ్ వైడ్ లెగ్,ఫ్లేయిర్డ్, హై వెయిస్టెడ్ పలాజో ప్యాంట్స్.. గరవాని ఎంచుకునే ప్రింట్లు క్లాత్‌లు, ఫ్లోయింగ్ కట్.. మనవారూ అనుకరించేలా ఉంటుంది. జాకెట్స్: గౌన్లు, స్కర్టులే కాదు మిలటరీ జాకెట్స్, బాంబర్ జాకెట్స్, ఫర్ జిలెట్, బైకర్ జాకెట్, లేస్ ప్యానెల్ కేప్, ఆప్లిక్ డెనిమ్ జాకెట్.. వంటివీ వాలెంటినో స్పెషల్ బ్రాండ్లు అనిపించాయి. డెనిమ్ ప్యాంట్స్: బాయ్‌ఫ్రెండ్, స్లిమ్ ఫిట్, ప్యాచ్‌వర్క్, స్కిన్నీ, క్రాప్డ్, బీడెడ్ వైడ్ లెగ్, స్ట్రెయిట్ లెగ్.. ఇలా జీన్స్‌లో వలెంటినో రెడ్ లేబుల్ వార్డ్‌రోబ్‌లో చేర్చుకుంటే ఎప్పటికీ ఎవర్గ్రీన్ కట్ అని ఒప్పుకు తీరుతారు. ► రెడ్ కార్పెట్ గౌన్‌గా వలెంటినో గరవాని డ్రెస్‌కి ప్రపంపచవ్యాప్త పేరుంది. గ్లామరస్‌గా చూపించే స్టైల్ కావడంతో తారలు ముచ్చటపడి ఎంచుకునే డ్రెస్‌లలో గరవాని డిజైన్ తప్పక ఉంటుంది. - వలెంటినో గరవాని -
క్లెయిన్ కట్
ఫ్యాషన్ ఫ్యూజన్ ప్రపంచ ఫ్యాషన్ పరిచయం ఎక్కడైనా... ఎప్పుడైనా! ఎనీవేర్... ఎనీటైమ్!! కాల్విన్ క్లెయిన్ డిజైన్ చేసిన డ్రెస్సులు ఏ సందర్భానికైనా సూపర్‌గా సూటవుతాయి. అంత గొప్పగా ఉంటాయంటే దానికి కారణం... కట్ అంత క్లీన్‌గా ఉంటుందని! అందుకే క్లెయిన్ కట్ ప్రపంచంలో ఎంతో మంది డిజైన్లని కట్ చేసి పారేసింది. అతని డిజైనరీ దుస్తులు యవ్వనానికి కొత్త ఉత్సాహాన్ని అద్దుతాయి. సౌకర్యంలో సరికావు ఏ డిజైన్సూ అనిపిస్తాయి. విలాసవంతుల వార్డ్‌రోబ్‌లో ఎనీవేర్ ఎనీటైమ్ అంటూ హŸయలు పోతుంటాయి. ఈ బ్రాండెడ్ దుస్తుల రూపకర్త పేరు కాల్విన్ క్లెయిన్. అమెరికాలో పుట్టి, అక్కడే పెరిగిన క్లెయిన్ ఆ ఊరు ఈ ఊరు అనే తేడా లేకుండా ప్రపంచంలో ఏ మూలనైనా తన బ్రాండెడ్ దుస్తులతో బాజా మోగిస్తుంటాడు. ఏడు పదుల వయసు దాటిన ఈ కంఫర్ట్ కింగ్ హైస్కూల్ స్థాయిలోనే ఫ్యాషన్ డిజైనింగ్‌లో మెలకువలు తెలుసుకొని ఆ తర్వాత దీంట్లోనే డిగ్రీ పట్టా పొందాడు. ‘కాల్విన్ క్లెయిన్ ఇంక్’ పేరుతో న్యూయార్క్‌లో 1968లో తన బాల్యమిత్రుడితో కలిసి కంపెనీ ప్రారంభించాడు. అప్పట్లో ముందుగా పెర్ఫ్యూమ్స్, గడియారాలు, ఫ్యాషన్ ఆభరణాలు తయారుచేసేవాడట. తర్వాత్తర్వాత దుస్తుల మీదా తన మార్క్ కత్తెరను వేశాడు. జీన్స్ లైన్ ఎంతటి ఘనమైన డిజైన్స్కైనా నలుగురి దృష్టీ పడాలంటే వేదిక ఫ్యాషన్ షోయే! క్లెయిన్ కట్స్కి న్యూయార్క్ ఎలైట్ ఫ్యాషన్ షో రెడ్‌కార్పెట్ పరిచింది. మొదటిసారి తనదైన ‘జీన్స్ లై¯Œ ’ని లాంచ్ చేశాడు క్లెయిన్. అంతే, అప్పటి వరకు జీన్స్‌లో అగ్రగామిగా ఉండే సంస్థలన్నీ ఒక్కసారిగా కంగుతిన్నాయి. ‘ఏంటీ కట్’ అంటూ విస్తుపోయాయి. అతివలు ‘స్టైలిష్, కంఫర్ట్’ అంటూ క్లెయిన్ జీన్స్ కట్‌కి కితాబులిచ్చేశారు. దీంతో ప్రతియేటా ఫ్యాషన్ ఇండస్ట్రీ న్యూయార్క్ సిటీ ఫ్యాషన్ వీక్‌లో పాల్గొనేందుకు ఆహ్వానించింది. జీన్స్ నుంచి మిడ్ ఫ్రాక్స్, లాంగ్ ఫ్రాక్స్, అండర్‌వేర్స్... ఇది అది అని తేడా లేకుండా అమ్మాయిల లుక్స్ అదిరిపోయేలా డ్రెస్ డిజైన్స్ ఎన్నో సృష్టించి ‘వహ్వా!’ అనిపించాడు. పదేళ్లలోనే అంతర్జాతీయ బెస్ట్ డ్రెస్డ్ జాబితాలో నిలిచాడు. ఆ తర్వాత వెనక్కి తిరిగి చూసుకోలేదు. ఎంతో మంది కలలు కనే అమెరికా ఫ్యాషన్ డిజైనింగ్ కౌన్సిల్ ఇచ్చే అవార్డును 1983లో అందుకున్నాడు. హాలీవుడ్ టు టాలీవుడ్ మోడల్స్, సెలబ్రిటీస్ ధరించే లేడీస్, మెన్స్ వేర్లో క్లెయిన్ డెనిమ్, అండర్వేర్ గార్మెంట్స్ తప్పనిసరిగా ఉంటాయి. హాలీవుడ్ నటి ఏంజిలినా జోలీ, జెన్నిఫర్ లారెన్స్, డయాన్ కృగరే... వంటి నటీమణులతో పాటు రాజకీయ ప్రముఖులూ క్లెయిన్ డ్రెస్సులో మెరిసేవారే. అమెరికా ప్రెసిడెంట్ భార్య మెలానియా ట్రంప్ ఇటీవల జర్మనీలో క్లెయిన్ డ్రెస్ ధరించి అందరినీ ఆకట్టుకున్నారు. ఇక అమెరికన్ టెలివిజన్‌లోని అన్ని ఫేమస్ సీరీస్‌లలోనూ క్లెయిన్ డ్రెస్‌లే ప్రముఖంగా నిలుస్తున్నాయి. మన దగ్గర బాలీవుడ్ నటీమణులు సైతం కంఫర్ట్, స్టైల్ క్లెయిన్ డ్రెస్‌తోనే సాధ్యం అంటారు. వివిధ దేశాలు, ప్రాంతాల నుంచి వలస వచ్చి స్థిరపడిన చిన్న చిన్న కమ్యూనిటీల డ్రెస్సింగ్ మూలాలను పట్టుకుంటారు క్లెయిన్. వాటినే సింపుల్‌గా తన కట్స్ ద్వారా పరిచయం చేస్తారు. క్లెయిన్ జీన్స్ క్లెయిన్ జీన్స్‌లో బూట్ లెగ్ స్టైల్ ఉంటుంది. దీంతో ఇది క్యాజువల్ వేర్‌గానూ, పార్టీవేర్‌గానూ ఏ సమయంలోనైనా ధరించే వీలుంటుంది. సౌకర్యంతో పాటు గ్లామరస్ లుక్‌తో అట్రాక్ట్ చేయడంతో ప్రపంచ మహిళ తన వార్డ్‌రోబ్‌లో క్లెయిన్ జీన్స్ తప్పక ఉండాలనుకుంటుంది. హాలీవుడ్‌తో పాటు మన బాలీవుడ్, టాలీవుడ్ తారలు, ఇతర ప్రాంతీయ సినిమా సెలబ్రిటీలూ క్లెయిన్ జీన్స్‌కి ఓటేస్తుంటారు. ప్రింటెడ్ డ్రెస్ ఇటీవల న్యూయార్క్‌లో జరిగిన ఫ్యాషన్ షోలో ప్రింటెడ్ డ్రెస్సులను విడుదల చేశాడు క్లెయిన్. తేలికగా ఉండే ఫ్యాబ్రిక్, ఫ్లాట్ కట్‌తో ఉండే ఈ డిజైనరీ డ్రెస్సులకు ఫ్యాషన్ వరల్డ్ వార్మ్వెల్కమ్ చెప్పింది. టాప్ టు బాటమ్ ఒకేలా ఉండే ప్రింటెడ్ మినీ గౌన్లు కలర్ఫుల్గా ఉంటే, టాప్స్, బ్లౌజ్‌లు ఫన్ని సృష్టిస్తాయి. దీంతో ముఖ్యంగా ఈ డిజైన్స్ యువతను ఆకర్షిస్తున్నాయి. చేతితో కుట్టిన ఎంబ్రాయిరీ, ఇతర అంశాలూ ఈ బ్లౌజ్‌లలో కనిపిస్తాయి. లో దుస్తుల హవా! జీన్స్, షర్ట్స్, గౌన్స్, బ్లేజర్స్‌తో పాటు క్లెయిన్ లోదుస్తులు ఫ్యాషన్ ప్రపంచానికి సుపరిచితమే. సరైన దృష్టి పెడితే ఈ వరల్డ్ క్లాస్ ఫ్యాషన్ డిజైనర్ క్లెయిన్ డ్రెస్ డిజైన్ స్టైల్‌ని మనమూ పట్టుకోవచ్చు. ►ప్లెయిన్ ఫ్యాబ్రిక్‌తో డిజైన్ చేసిన మిడ్ ఫ్రాక్ ఇది. భుజం నుంచి వంపు భాగం తీసుకొని, దానికి ఫ్రిల్స్ జత చేయడంతో ఫ్రాక్ లుక్ మారింది. ►అమెరికన్ స్టైల్‌కి ఇండియన్ ధోతీ కట్. భారతీయ డ్రెస్సింగ్ మూలాలను పట్టుకుని, రూపొందిం చిన న్యూ స్టైల్. ►హాలీవుడ్– బాలీవుడ్– టాలీవుడ్.. సరిహద్దుల్లేని క్లెయిన్ స్టైల్ జీన్స్, సింపుల్ టాప్ ఎవర్గ్రీన్ స్టైల్! తారల అభిమాన బ్రాండ్! ►స్ట్రైప్స్ మ్యాక్సీ డ్రెస్ ఇది. వెస్ట్రన్ పార్టీలకు సరైన ఎంపిక. క్యాజువల్ వేర్‌గానూ టీనేజర్స్ కోరుకునే డ్రెస్. ► మల్టీకలర్స్, ఫ్లోయింగ్ కట్ క్లెయిమ్ మ్యాక్సీ డ్రెస్‌కు వన్నె తెచ్చాయి. రేయాన్ బెల్ట్ అట్రాక్షన్‌ని పెంచింది. ►క్ లెయిన్ సృష్టి రెడ్ కార్పెట్ పై హŸయలు పోతుంది. గ్రీన్ కలర్ లేస్, రత్నాలు పొదిగిన లాంగ్ ప్రోమ్ డ్రెస్ ఇది. ఒకే రంగు ఫ్యాబ్రిక్‌తో చేసే ఇలాంటి మ్యాజిక్లెన్నో క్లెయిమ్ ఖాతాలో ఉన్నాయి. ► తేలికైన ప్రింటెడ్ ఫ్యాబ్రిక్‌తో క్లెయిన్ మ్యాజిక్ చేస్తాడు. అవి ఏ కాలానికైనా నప్పుతాయి. ► క్లెయిన్ ప్యాడెడ్ స్లీవ్‌లెస్ జాకెట్ స్టైల్ అమ్మాయిల రఫ్ అండ్ టఫ్ డేరింగ్ లుక్‌ని కళ్లకు కడుతుంది. ►క్యాజువల్ డ్రెస్సింగ్‌లో కంఫర్ట్ లుక్. డెనిమ్ జీన్స్, పింక్ స్లీవ్‌లెస్ టీ షర్ట్. నేటితరం కంఫర్ట్, స్టైల్ ఐకాన్. రెడీ టు వేర్! కాల్విన్ క్లెయిన్ డిజైన్స్‌లో అమెరికన్ స్టైల్ కనిపించినా ప్రపంచంలోని హాట్, యంగ్ బాడీస్‌కి నప్పేలా డిజైనింగ్ ఉండటం విశేషం. క్లెయిన్ డిజైన్స్ మార్కెట్లోకి రావడంతోనే ఎన్నో వేల కంపెనీ లు వెనకడుగువేశాయి. ‘సాహో..’ అంటూ క్లెయిన్ బ్రాండ్‌కు సాగిలపడ్డాయి. ప్లెయిన్ డ్రెస్‌లోనే సింపుల్ కట్‌తో ఒక క్లాసిక్ టచ్‌ని, మోడ్రన్ ఫిట్‌ని తీసుకువస్తారు క్లెయిన్. అందుకే, ఏ కాలమైనా, ఏ సమయమైనా, ఏ సందర్భమైనా క్లెయిన్ డ్రెస్సులు ‘రెడీ టువేర్’ అన్నట్టుగా ఉంటాయి. నిర్వహణ: ఎన్.ఆర్ -
చీర కొంగున చూపుల తోరణం
న్యూలుక్ ⇒పట్టుచీర కొంగు చివరలో సిల్కు దారాలను తీసి ముడులు వేయడం గురించి తెలిసిందే! ఆ ముడులకే కొన్ని అందమైన పూసలు గుచ్చితే ఒక అందం. ⇒చీర రంగు కాంబినేషన్ సిల్క్ దారాలను, పూసలను ఉపయోగించి అల్లిన తర్వాత దానిని కొంగు చివరన జత చేయచేయవచ్చు. ⇒జుంకాలు, గాజులు సిల్కుదారాలతో అందంగా రూపొందిస్తున్నారు. వీటి డిజైన్లనే పోలి ఉండేలా చీర కొంగున దారాల అల్లిక చేయాలి. గాజులు, హారాలు, జుంకాలు, చీర కొంగున... ఒకే విధమైన డిజైన్ ఉండటంతో వేడుకలో ఓ ప్రత్యేకతను సంతరించుకుంటుంది ∙ముందుగా చీర కొంగును కుట్టేసి ఆ తర్వాత విడిగా సిల్క్ దారాల కుచ్చులను కొంగుకు ముడి వేస్తే చాలు... ఇలా అందమైన తోరణం రూపుకడుతుంది. ⇒డిజైన్లను రూపొందించుకోవడానికి సమయం లేనివారు మార్కెట్లో ఉన్న రకరకాల మోడల్స్‌లో నచ్చినదాన్ని ఎంపిక చేసుకోవచ్చు. వీటిని తెచ్చి, జత చేయడమే! ∙పట్టు చీరలతో పాటు ప్లెయిన్ సిల్క్ చీరలు, దుపట్టాల కొంగులను కూడా ఇలాగే అందంగా ముస్తాబు చేయవచ్చు. ముత్యాలు, రతనాలు, జరీ జిలుగులతో తోరణం కడితే... చూడ్డానికి రెండు కళ్లూ సరిపోవు. ఆ‘కళ్ల’ను చీరకొంగున కట్టేయాలంటే ఎన్నో సొబగులను కలిపి కుట్టాలి. అప్పుడే చీర అందం కొంగొత్త సింగారాలతో ముస్తాబవుతుంది. -
షూ ధర రూ. 17 లక్షలు!
దుబాయ్: ఈ ఫోటోలో కనిపిస్తున్న బూట్లను బంగారంతో తయారు చేశారు. బంగారంతో షూ అంటే ఏదో పూతపూశారనుకోకండి. 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారంతో తయారు చేసిన ప్రపంచంలోనే మొదటి షూ గా ఇవి రికార్డులకెక్కాయి. వీటి ధర రూ. 17 లక్షలు. ఒక్కో దానిలో 230 గ్రాముల బంగారంతో పాటు.. త్రీడీ ఫూట్ స్కానర్స్‌ను వాడటం వీటి ప్రత్యేకత. ఇటలీకి చెందిన షూ తయారీదారుడు ఆంటోనియో వీట్రి వీటిని రూపొందించారు. సంపన్న అరబ్ షేక్‌లను ఆకట్టుకునేలా బ్లూ, బ్లాక్ వేరియంట్లలో వీటిని డిజైన్ చేశారు. ఇందులో వాడిన బంగారాన్ని ఏదో అలంకారం కోసం కాకుండా బూట్లలో అంతర్భాగంగా వాడినట్లు వీట్రీ తెలిపారు. షూ వాడటానికి సౌకర్యవంతంగా ఉండేలా బంగారు తీగలను లెదర్లోకి చొప్పించి వీటిని అల్లారు. కఠినమైన బంగారాన్ని సౌకర్యవంతంగా ఉండేలా షూలో కూర్చడం అనేది సవాల్‌తో కూడుకున్నది అని వీట్రి వెల్లడించారు. గల్ఫ్ ఫ్యాషన్ మార్కెట్.. యూఏఈ, సౌదీ అరేబియా, ఖతార్ లాంటి దేశాల్లో ఈ ఇటాలియన్ తయారీదారుడికి మంచి డిమాండ్ ఉంది. -
టీ షర్ట్‌కి కొత్తరూపు
న్యూలుక్ ఈ కాలపు అమ్మాయిల వార్డ్‌రోబ్‌లో లెక్కకుమించి టీషర్ట్లు.వాటిలో ఎన్నో మోడల్స్! వాటిలో కొన్ని కొటేషన్లతో అదరగొట్టేవి, ఇంకొన్ని రంగు డిజైన్లతో ఆకట్టుకునేవి, మరికొన్ని ప్లెయిన్‌గా మనసుకు హత్తుకునేవి. వీటికి కొన్ని హంగులు చేర్చితే... ‘కొత్త డిజైన్ టీ షర్ట్ ఎక్కడకొన్నావ్?’ అనే ప్రశ్న మిమ్మల్ని పలకరించాల్సిందే! ముందుగా కాలర్ లేని ప్లెయిన్ టీ షర్ట్‌ని ఎంచుకోవాలి. దానికి అదే రంగు బనియన్ క్లాత్‌ని ఎంచుకోవాలి. ఫొటోలో చూపిన విధంగా చిన్న చిన్న డిజైన్ ముక్కలుగా కట్ చేయాలి. వాటిని ప్లెయిన్ టీ షర్ట్‌కి ఛాతీ భాగంలో కుట్టాలి. దీంతో కొత్త టీ షర్ట్ రెడీ అవుతుంది. కాంట్రాస్ట్ బనియన్ క్లాత్ ఎంచుకోవాలి. పువ్వు డిజైన్‌కి అనుకూలంగా చిన్న చిన్న ముక్కలు కట్ చేయాలి. వాటిని టీ షర్ట్‌కి ఛాతీ భాగంలో పువ్వు డిజైన్ వచ్చేలా మిషన్ మీద కుట్టేయాలి. అక్కడక్కడా తెల్లని లేదా రంగు పూసలను కుడితే ఇలా చూడముచ్చటైన టీ షర్ట్ మీదవుతుంది. టీ షర్ట్‌కి టాప్ భాగం అంటే చేతులు, నెక్ భాగాన్ని కత్తిరించాలి. ఈ ప్లేస్‌లో ఎంపిక చేసుకున్న లేస్‌ను కుట్టాలి. మరో ముచ్చటైన టీ షర్ట్ సిద్ధం అవుతుంది. -
వెబ్ సేవలకు ‘వన్‌స్టాప్’
• డిజైన్, మార్కెటింగ్, టెక్నికల్ రైటింగ్, కన్సల్టెన్సీ సేవలన్నీ • రూ.10 వేలతో మొదలై 5 కోట్ల టర్నోవర్‌కు చేరిన ఇనోవీస్ • దేశ, విదేశాల్లోని 365 కంపెనీలకు సేవలు • 3 నెలల్లో వర్సిటీల్లో ఇంక్యుబేషన్ సెంటర్ల ఏర్పాటు • ‘స్టార్టప్ డైరీ’తో సంస్థ ఫౌండర్ నాగేంద్ర బొమ్మసాని హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: అమీర్‌పేట్‌లోని ఓ చిన్న గదిలో రూ.10 వేల పెట్టుబడితో మొదలైన కంపెనీ.. ఇప్పుడు దేశ, విదేశాల్లోని బడా సంస్థలకు సేవలందిస్తోంది. విద్య, వైద్యం, వ్యాపారం, స్థిరాస్తి రంగాల్లో... ప్రతి మూడు కంపెనీల్లో ఒకదానికైనా టెక్నాలజీ లేదా అప్లికేషన్ అభివృద్ధి చేసిన కంపెనీల్లో ‘ఇనోవీస్’ ఉంటుందంటే అతిశయోక్తి కాదేమో!! చదువుకునే వయసులోనే తాను పనిచేసిన కంపెనీని కొని... ఆ అనుభవాన్నే ఇనోవీస్కు పునాది చేసిన సంస్థ వ్యవస్థాపకుడు నాగేంద్ర బొమ్మసాని...కేంద్ర ప్రభుత్వ ఉద్యోగ రతన్ అవార్డునూ అందుకోవటమే కాదు, తన సంస్థను గూగుల్‌కు సంబంధించి అత్యుత్తమ సర్వీస్ ప్రొవైడర్లలో ఒకటిగా మార్చారు. సంస్థ ప్రారంభం, సేవలు, విస్తరణ ప్రణాళికలు ఆయన మాటల్లోనే... మాది ఖమ్మం జిల్లా పాల్వంచ. డిగ్రీ చదువుతూ సాఫ్ట్వేర్ కోర్సుల్లో శిక్షణ ఇచ్చేవాణ్ణి. కొన్నాళ్లకు ఆ ఇనిస్టిట్యూట్ అమ్మకానికొస్తే కొనేశా. అదే నా కెరీర్‌కు టర్నింగ్ పాయింట్. ఎందుకంటే చదువుతూ పార్ట్ టైం జాబ్ చేయటం, అలా ఉద్యోగం చేసిన కంపెనీనే కొని స్థానికంగా నంబర్–1గా తీర్చిదిద్దటం... ఇవి నాపై నాకు నమ్మకాన్ని పెంచాయి. ఆరేళ్ల కిందట ఇనోవీస్.కామ్‌ను ప్రారంభించా. వెబ్ డిజైన్ నుంచి డెవలప్మెంట్, డిజిటల్ మార్కెటింగ్, టెక్నికల్ రైటింగ్, స్టార్టప్ కన్సల్టింగ్, మొబైల్ అప్లికేషన్స్... అన్ని రకాల టెక్నాలజీ సేవలందించడం మా ప్రత్యేకత. టెక్నాలజీ మేగజైన్ ‘సీఐఓ’... ఇనోవీస్ను 20 ఉత్తమ గూగుల్ సర్వీస్ ప్రొవైడర్లలో ఒకటిగా పేర్కొంది. దేశ, విదేశీ కంపెనీలకు సేవలు.. దేశ, విదేశాల్లోని విద్య, వైద్యం, వ్యాపారం, మీడియా, స్థిరాస్తి సంస్థలకు వెబ్సైట్లు, అప్లికేషన్స్, యాప్స్ అభివృద్ధి చేశాం. ఐటీ కంపెనీలకు కంటెంట్ విశ్లేషణ, ఆసుపత్రులకు ఆన్లైన్ కన్సల్టేషన్, విద్యా సంస్థలకు ఇంటర్నెట్, స్టూడెంట్ ఎవల్యూషన్ సిస్టమ్స్ సేవలందించాం. మీడియా సంస్థలకు బిజినెస్ పోర్టల్స్‌ను అభివృద్ధి చేసిచ్చాం. ప్రస్తుతం 365కు పైగా సంస్థలు మా క్లయింట్లుగా ఉన్నాయి. వీటిలో తెలుగు రాష్ట్రాల నుంచే 300 కంపెనీలుంటాయి. అమెరికా, దుబాయ్, శ్రీలంకల్లోనూ మాకు క్లయింట్లున్నారు. వైట్ లేబులింగ్ సర్వీసెస్ కింద హైదరాబాద్‌లోని దాదాపు అన్ని కంపెనీలకూ టెక్నాలజీ సేవలందించింది ఇనోవీసే. అప్లికేషన్ డెవలప్మెంట్ ప్రారంభ ధర రూ.2.5 లక్షలుగా ఉంది. 3 నెలల్లో ఇంక్యుబేషన్ సెంటర్ల ఏర్పాటు.. బడా కంపెనీలతో పాటు స్టార్టప్‌లకూ సేవలందించాలని నిర్ణయించాం. అందుకే స్టార్టప్ కన్సల్టెన్సీని ప్రారంభించాం. స్టార్టప్స్‌కు వెబ్సైట్ అభివృద్ధి నుంచి మార్కెటింగ్, విస్తరణ, బ్రేక్ ఈవెన్ వంటి అన్ని విభాగాల్లోనూ సేవలందిస్తున్నాం. తెలంగాణ, ఏపీల్లోని విశ్వ విద్యాలయాల్లో ఇంక్యుబేషన్ సెంటర్లను ఏర్పాటు చేస్తున్నాం. దీన్ని నాగార్జున యూనివర్సిటీతో ప్రారంభిస్తున్నాం. వచ్చే 3 నెలల్లో మరో 3 వర్సిటీల్లో సెంటర్లను ఏర్పాటు చేస్తాం. రూ.5 కోట్ల టర్నోవర్ లక్ష్యం.. ప్రస్తుతం సంస్థలో ప్రత్యక్షంగా 36 మంది ఉద్యోగులున్నారు. వెబ్ అప్లికేషన్ సర్వీసు విభాగాన్ని హైదరాబాద్‌కు పరిమితి చేసి.. సపోర్ట్ ఎండింగ్ సర్వీసెస్‌ను దేశవ్యాప్తంగా విస్తరించాలని నిర్ణయించాం. బెంగళూరుతో ప్రారంభించి 3 నెలల్లో ఇతర రాష్ట్రాల్లో ప్రారంభిస్తాం. గతేడాది రూ.3.8 కోట్ల టర్నోవర్ సాధించాం. ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.5 కోట్ల టర్నోవర్‌ను లక్ష్యించాం. అద్భుతమైన స్టార్టప్‌ల గురించి అందరికీ తెలియజేయాలనుకుంటే startups@sakshi.com కు మెయిల్ చేయండి... -
పాతపట్టు కొత్తకట్టు
► పాతకాలం నాటి డిజైన్లే కొత్త పట్టు చీరలకు నిండుతనాన్ని తెస్తున్నాయి. అందమైన కనికట్టు చేసేస్తున్నాయి. ►చీర బంగారం లాంటిది ఎంత పాతదైనా! ఎంతో విలువ తెస్తుంది నాయినమ్మ, అమ్మమ్మ ప్రేమలా!! మనవరాళ్లూ గెట్ రెడీ! పెళ్ళిళ్ల సీజన్లో మీ తడాఖా చూపించండి పాత పట్టుతో కొత్తకట్టు కట్టండి. ఆ కట్టుకోండి. ►సాదా సీదా రంగులతోనే అందమైన మాయాజాలం. అంచెలంచెలుగా అంచులు అవుతున్నాయి చీరకట్టుకు నజరానాలు. ►వెడల్పాటి అంచులే కాదు నిలువెత్తు చెక్స్తోనూ చీరలు చూపులను చెక్కేస్తున్నాయి . కొత్త సింగారాలను అద్దేస్తున్నాయి. ►చీర అంచు ఎంత వెడల్పుగా ఉంటే వేడుక అంత వైభవంగా మారుతుంది. నేటి వనితల మేనికి వన్నెలు అద్దే ఘనత పట్టుదే అవుతుంది. ► హాయి గొలిపే రంగులు.. వెడల్పాటి అంచులు, అంచుల్లో జరీ చేసే జిలుగులు. వేడుకలో ప్రత్యేకతను చాటడానికి సిద్ధం అంటున్నాయి. -
సిల్క్ గాజులు
ఆభరణం దారాలతో బట్టలు కుట్టవచ్చు, పూసలు గుచ్చవచ్చు. అంతేనా.. ఇలా అందమైన గాజులను, హారాలను, చెవి లోలాకులనూ సులువుగా తయారుచేసుకోవచ్చు. సంప్రదాయ వస్త్రాలంకరణలో ఈ ఆభరణాలను ధరించవచ్చు. డ్రెస్‌కు తగిన మ్యాచింగ్ సిల్క్ దారాలను ఎంచుకోవాలి. గట్టి అట్టముక్క లేదా ప్లాస్టిక్, మెటల్ గాజును ఇందుకు ఉపయోగించాలి. గ్లూతో పాటు ఎంపిక చేసుకున్న పూసలు, స్టోన్స్ తీసుకోవాలి. ఒక చెక్కకు ముందుగా దారాన్ని వరుసలుగా చుట్టాలి. తర్వాత దారాలను తీసి, చివరలను గ్లూతో అతికించాలి. ఒకవైపు దారంతో గాజుకు చుట్టాలి. ఎక్కడా దారం పైకి రాకుండా నీటుగా ఉండేలా చూసుకోవాలి. చివరలను గ్లూతో అతికించేయాలి. ఎంచుకున్న డిజైన్ స్టోన్ పీస్‌ని తీసుకొని, గాజుపై గ్లూ రాసి అతికించాలి. తగినంత తీసుకొని, మిగతాది కట్ చేసి పూర్తిగా అతికించాలి. అందమైన సిల్క్ దారాల గాజులు సిద్ధం. ఇలాగే చెవిరింగులు, హారాలు తయారుచేసుకోవచ్చు. ఉమ వనస్థలిపురం హైదరాబాద్ -
పాత నోట్ల డిజైన్లతో కొత్త పర్సులు
మాచర్ల : రద్దు చేసిన పాత నోట్ల నమూనాలో పర్సులు తయారు చేస్తున్నారు. అంబేద్కర్ సెంటర్, రైల్వేష్టేషన్ రోడ్, బస్టాండ్ సెంటర్, రింగ్‌రోడ్డు ప్రాంతాల్లో కేవలం రూ. 20 కే డిజైన్ పర్సులు అమ్ముతున్నారు. -
గుడి కట్టు పండగ పట్టు
పసుపు, పచ్చ, ఎరుపు, నీలం, గంధం, గులాబీ... గుడి ద్వారానికి ఈ అన్ని రంగులూ అద్దినట్టు అనిపిస్తున్నాయి. ఈ చీరల్లో... మన బంగారు తల్లులు గుడిలో అడుగుపెడితేనే పండుగలా అనిపిస్తుంది. ఈ పండుగ సీజన్లో గుడికట్టు... పండగ పట్టు. ► రాణీ పింక్ కలర్ పట్టుచీరకు బంగారు జరీ వెలుగు... వేడుకకు వెయ్యింతల కళను మోసుకొస్తుంది. ► నీలం, వంగపండు, జరీ కాంబినే షన్తో నేసిన పట్టు చీర కడితే నవ్వులతో పండుగ కళ నట్టింటికి విచ్చేసినట్టే! ► జరీ మామిడి పిందెల డిజైన్, సియాన్గ్రీన్ కలర్ కలనేతలో ఓ ఆకర్షణ. పట్టు చీరకు పూర్తి కాంట్రాస్ట్ డిజైన్ బ్లౌజ్ పండుగ రోజుకు సిసలైన కాంబినేషన్. ► గడపకు కుంకుమ బొట్టు... మేనికి ఎరుపు రంగు పట్టు చీర పండుగ కళను వెయ్యింతలు చేస్తుంది. ► చీరంత అంచు అయితే సింగారం బంగారమే! ► మిసిమి మేని ఛాయతో పోటీపడే పసుపువన్నె పట్టు చీర ఆధునికపు సింగారాలను అలవోకగా అద్దుతుంది. ► అలల అలల జరీ కలబోత. నీలం రంగు జిలుగుల పట్టుచీర కడితే ఆకాశం నడిచి వచ్చినట్టే! ► నారింజ రంగు పట్టుచీరకు ముదురు నీలం రంగు అంచు, అందులో దాగున్న జరీ జిలుగుల వెలుగులు మేనిపై అమరితే రత్నాలు రాశులుగా పోసినట్టే! -
వారే...వ్వాల్
ఇంటిప్స్ వర్క్ ఏరియా, పిల్లలు ఆడుకునే ప్లేస్, చదువుకునే స్థలం ఏదైనా ఒకే గదిలో రకరకాల మూడ్స్‌ని క్రియేట్ చేయాలంటే మంచి ఛాయిస్ వాల్‌పేపర్స్. గోడకు వేసిన రంగును మార్చేయడం వీలు కావట్లేదు అనుకుంటే సింపుల్‌గా నచ్చిన వాల్పేపర్ని తెచ్చి అతికిస్తే సరి. లివింగ్ రూమ్, డైనింగ్ హాల్, బెడ్రూమ్... ప్రతి గదీ ఓ కొత్తగా కనిపించాలంటే డిజైన్‌లో, ప్యాట్రన్‌లో, రంగులో విభిన్న తరహాలలో ఉన్న వాల్పేపర్స్ని ఎంచుకోవాలి. సీజన్‌కు తగ్గ వాల్‌పేపర్స్ కంటికి, మనసుకు ఆహ్లాదాన్ని ఇస్తాయి. వాల్‌పేపర్స్‌పై పడిన మరకలు పోగొట్టడం చాలా సులువు. గోరువెచ్చని నీటిలో డిటర్జంట్ పౌడర్ వేసి స్పాంజితో అద్ది తుడవాలి. ఆ తర్వాత మెత్తని వస్త్రంతో తుడిస్తే, డల్ అయిన వాల్‌పేపర్స్ కొత్త కళతో మెరిసిపోతాయి.ఇద్దరు పిల్లలున్న ఇంట్లో చెరో గదిని కేటాయించడం వీలు కాకపోతే పార్టిషన్ చేసి వారికి నచ్చిన వాల్‌పేపర్‌తో కవర్ చేయడం సులువైన కిటుకు. కిచెన్, బాత్రూమ్స్ నీరు, చెమ్మ ఎక్కువగా తగిలే చోట్లు. అందుకని ఈ గదులలో వాల్పేపర్స్ని వాడకపోవడమే మంచిది. -
శాలువాను తొడుక్కోండి!
చలికాలంలో భుజాల మీదుగా ఒంటికి హత్తుకుపోయిన శాలువా వెచ్చదనంతో హాయినిస్తుంది. ఏక వస్త్రంగా ఉండే శాలువాను వీలైతే దుపట్టాలా వాడుకోవచ్చు, కప్పుకోవచ్చు. కానీ తొడుక్కోవడం ఏంటి అనుకుంటున్నారా? అయితే చదవండి... ఇక్కడ ఫొటోలో చూపినట్టుగా మార్చేస్తే కోటులా ధరించవచ్చు. శాలువాలా కప్పుకోవచ్చు. గౌనులా డిజైన్ చేసుకోవచ్చు. ఇంకా రకరకాల టాప్స్లాగా డిజైన్ చేసుకోవచ్చు. శాలువాను మధ్యకు మడిచి, చేతుల భాగం మడిచి కుడితే ఇలా ధరించవచ్చు.శాలువాను భుజాల మీదుగా కప్పుకుంటే అంచుభాగం ముందుకు వచ్చేలా సర్ది, నడుము భాగాన సన్నని బెల్ట్ పెడితే, అధునికంగా మారిపోతుంది. శాలువాకి లాంగ్ స్లీవ్స్ జత చేస్తే ఓవర్ కోట్లా ధరించవచ్చు. మందంగా ఉండే చీరను రెండు మడతలుగా వేసి, కుడితే డిజైనరీ శాలువా సిద్ధం. శాలువా మెటీరియల్‌తో గౌను, కుర్తీ, వంటివీ డిజైన్ చేసుకోవచ్చు. స్టైల్‌కీ, కంఫర్ట్కీ బోలెడంత అవకాశం ఉండే శాలువాతో ఇలా ఎన్నో డిజైన్స్ మీరూ తయారుచేయవచ్చు. -
ప్లెయిన్ షర్ట్‌కి పచ్చబొట్టు!
సాదా షర్ట్, లేదంటే ఏదైనా టాప్ మీదకు నచ్చిన చిత్రం డిజైన్‌గా వేయాలంటే మీరు చిత్రకారులే కానక్కర్లేదు. బ్లీచ్‌ను స్ప్రే చేస్తే చాలు. ఇది ఎలాంటిదంటే ఒంటి మీద పచ్చబొట్టు (టాటూ) వేసినట్టుగా దుస్తులపై డిజైన్స్ వేయడం అన్నమాట. అయితే, ఈ డిజైన్స్ కేవలం కాటన్ దుస్తుల మీద మాత్రమే వేయగలం.5-6 నిమిషాల తర్వాత బ్లీచ్ స్ప్రే చేసిన షర్ట్‌ని చల్లని నీటిలో ముంచాలి. రెండు మూడు సార్లు నీళ్లలో తీసి, ఆరేయాలి. మీరు కోరుకున్న డిజైన్‌తో షర్ట్ కొత్తగా మెరిసిపోతుంది. కావల్సినవి: ప్లెయిన్ కాటన్ షర్ట్, లేదంటే టీ షర్ట్ బాగా జల్లించిన బ్లీచ్ పౌడర్. (బ్లీచ్కి దుస్తుల రంగును పోగొట్టే గుణం ఉంటుంది. బ్లీచ్‌ని నీళ్లలో కలిపి స్ప్రే బాటిల్లో పోసి ఉపయోగించవచ్చు. పౌడర్ని మాత్రమే కూడా వాడవచ్చు.) ఎంచుకున్న చిత్రం బ్లాటింగ్ పేపర్ కార్డ్బోర్డ్ (షర్ట్ వెనుక భాగాన బ్లీచ్ పడకుండా జాగ్రత్త తీసుకోవాలి. ఇందుకు షర్ట్ లోపలి వైపు ఒక కార్డ్‌బోర్డ్‌ను అమర్చాలి. బ్లీచ్ ఎక్కువ స్ప్రే చేసినా, కార్డ్బోర్డ్ పీల్చేసుకుంటుంది.) చేతులకు గ్లౌజ్ వేసుకుంటే బ్లీచ్లోని రసాయనాలకు చర్మం దెబ్బతినకుండా ఉంటుంది. ఎంచుకున్న చిత్రం పైన మైనపు కాగితాన్ని (బ్లాటింగ్ పేపర్) ఉంచాలి. పైన కొద్దిగా అదిమి, పేపర్ కదలకుండా జాగ్రత్తపడాలి. తర్వాత కింద కనిపిస్తున్న డిజైన్‌ను బట్టి, అంత మేరకు పై పేపర్‌ను కత్తిరించాలి. ఈ డిజైన్ పేపర్‌ను షర్ట్ మీద అతికించాలి. మెత్తని గుడ్డను ఉండలా చుట్టి, బ్లీచ్ పౌడర్‌ను అద్దుకుంటూ డిజైన్ ఉన్న బ్లాటింగ్ పేపర్ చుట్టూ డస్టింగ్ చేయాలి. -
గాలి పందిరి... గమ్మత్తు లోగిలి...
ఇంట్లో ఓ ఫంక్షన్ ఉందంటే ఒకటో రెండో షామియానాలు వేయించాలి కదా... కానీ అదేం అంత సులభం కాదు. టెంట్‌హౌస్‌కు చెప్తే వాళ్లు వెంటనే వచ్చేస్తారన్న గ్యారంటీ లేదు. గడియకోసారి ఫోన్ చేయాలి... వాళ్లు వచ్చి షామియానాలు వేయడానికి నానా అవస్థలు పడాలి. పైగా... గాలి కొడితే అవి కూలి పోకుండా హైరానా పడాలి. ఈ న్యూసెన్స్ లేకుండా ఉంటే బాగుండు అనుకుంటున్నారా? అయితే పక్కనున్న ఫొటో చూడండి. ఇవి కూడా షామియానాలే. కాకపోతే గాలి షామియానాలు. అత్యంత పలుచనైన, దృఢమైన ప్లాస్టిక్‌తో తయారు చేశారు వీటిని. స్పెయిన్‌కు చెందిన ఆర్కిటెక్చర్ సంస్థ డోసిస్ వీటి రూపకర్త. చిన్న చిన్న మోటార్లతో నిమిషాల వ్యవధిలో గాలి నింపితే ఫొటోల్లో ఉన్నట్టుగా తయారవుతాయి. 4300 చదరపు అడుగుల విశాలమైన, ఎనిమిది అడుగుల ఎత్తై ఫంక్షన్ హాల్‌గా మారిపోతాయి. మొత్తం ఒకే హాల్లా కాకుండా అక్కడక్కడా ప్రత్యేకమైన గదులు కూడా ఉండటం వీటిలోని విశేషం. ఈ మధ్యనే ఈ వినూత్న షామియానాను లండన్‌లోని ఓ విశాలమైన పార్క్‌లో ‘షఫల్’ అనే స్వచ్ఛంద సంస్థ నిర్వహించిన కార్యక్రమానికి వినియోగించారు. చిన్న స్క్రీన్లపై సినిమాలు ప్రదర్శించడంతోపాటు కొన్ని వర్క్‌షాప్‌లు, సైన్స్ ప్రయోగాలు కూడా నిర్వహించారు. పైకప్పు ఉండటం వల్ల వానొస్తుందన్న భయం లేదు. గాలి వేగం ఎక్కువైతే అందుకు తగ్గట్టుగా ఈ షామియానా తన షేపును మార్చుకుంటుంటే తప్ప కూలిపోయి రభస సృష్టించదు. బాగుంది కదూ ఈ గాలి షామియానా... టెక్నాలజీ నజరానా. -
వీబీఆర్‌కు ముప్పు లేదు
వెలుగోడు: వెలుగోడు బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ డిజైన్ ప్రకారమే నీటిని నిల్వ చేస్తున్నట్లు తెలుగు గంగ ఎస్ఈ చంద్రశేఖర్ తెలిపారు. రిజర్వాయర్‌కు ఎలాంటి ముప్పు లేదని, ప్రజలు భయాందోళన చెందాల్సిన అవసరం లేదని చెప్పారు. శనివారం ఎస్ఈ చంద్రశేఖర్ వీబీఆర్‌ను సందర్శించారు. హెడ్ రెగ్యులేటర్, స్పీల్ వే, వన్ ఆర్, వన్ ఎల్ తూములను పరిశీలించారు. అనంతరం స్థానిక గంగ అతిథి గృహంలో విలేకరులతో మాట్లాడారు. పది రోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా వీబీఆర్‌కు నీరు చేరుతోందన్నారు. పాత డిజైన్ ప్రకారమే నీటిని నిల్వ చేస్తున్నామని, ప్రస్తుతం 15.5 టీఎంసీల నీరు నిల్వ ఉందన్నారు. స్పీల్ వే, హెడ్ రెగ్యులేటర్, కట్ట వెంట సిబ్బంది నిత్యం పర్యవేక్షిస్తున్నారని, డే అండ్ నై పెట్రోలింగ్ ఏర్పాటు చేశామని తెలిపారు. కట్ట పటిష్టంగా ఉన్నట్లు చెప్పిన ఎస్ఈ.. రోజు మార్చి రోజు నీటి నిల్వలు పెంచుతున్నామన్నారు. ఆయన వెంట ఈఈ పుల్లారావు, డీఈలు విజయానంద్, ప్రతాప్, జేఈలు, సిబ్బంది ఉన్నారు. -
కర్నూలు ఉపాధ్యాయునికి జాతీయ అవార్డు
కర్నూలు(కొండారెడ్డి ఫోర్టు): జార్ఖండ్‌లోని ఇండియన్ సైన్స్ అండ్ మ్యాథమాటిక్స్ అందజేసే డాక్టర్ అదినాథ్ లహరి మెమోరియల్ జాతీయ పురస్కారానికి జిల్లా ఉపాధ్యాయుడు కే.విజయకుమార్ ఎంపికయ్యారు. ఈయన ప్రస్తుతం కర్నూలు ఎస్ఆర్సీసీ ఉన్నత పాఠశాలలో సైన్స్ టీచర్‌గా పనిచేస్తున్నారు. ప్రత్నామ్నాయ బోధనోపకరణాల రూపకల్పన, రెడ్ రిబ్బన్‌క్లబ్, నేషనల్ గ్రీన్ కోర్, చెకుముకి సైన్స్ క్లబ్, పర్యావరణంపై ప్రజలు, విద్యార్థులకు అవగాహన కల్పించడంతోపాటు రాష్ట్ర, జాతీయ సెమినార్లలో పాల్గొనడంతో విజయకుమార్‌ను జాతీయ అవార్డు వరించింది. ఈ నెల 25న జార్ఖండ్‌లోని వైద్యనాథ్‌లో కేంద్ర, శాస్త్ర సాంకేతిక, గనుల శాఖమంత్రి హర్షవర్దన్ చేతుల మీదుగా ఆయన అవార్డు అందుకోనున్నారు. -
నూతన ఆవిష్కరణల బ్రాండ్‌గా సైయంట్
♦ 2020 నాటికి 3 రెట్ల ఆదాయం.. ♦ 18,000లకు ఉద్యోగుల సంఖ్య ♦ సైయంట్ ఫౌండర్ మోహన్ రెడ్డి హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: అంతర్జాతీయంగా నూతన ఆవిష్కరణల బ్రాండ్‌గా నిలవాలని సైయంట్ లక్ష్యంగా చేసుకుంది. వచ్చే ఐదేళ్లలో డిజైన్, బిల్డ్, మెయింటెయిన్ వ్యూహాన్ని అమలు చేయనున్నట్టు సంస్థ వ్యవస్థాపకులు బీవీఆర్ మోహన్‌రెడ్డి తెలిపారు. కంపెనీ ఇటీవలే 25 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా గురువారమిక్కడ మీడియాతో మాట్లాడారు. 1991లో జియోస్పటికల్ సర్వీసులతో ప్రారంభమై విభిన్న విభాగాలకు విస్తరించామన్నారు. 21 దేశాలు, 38 కేంద్రాలతో మొత్తం 13,200 మంది ఉద్యోగులతో కార్యకలాపాలు సాగిస్తున్నట్టు వివరించారు. మార్కెట్ క్యాప్ రూ.5,000 కోట్లకు ఎగసిందన్నారు. 1997లో రూ.10,000 పెట్టుబడి పెట్టిన ఇన్వెస్టర్‌కు 300 రెట్ల ఆదాయం వచ్చిందని గుర్తు చేశారు. రెండేళ్లలో బిలియన్ డాలర్.. గత ఆర్థిక సంవత్సరంలో సైయంట్ రూ.3,100 కోట్ల టర్నోవర్ సాధించింది. 2020 నాటికి ఆదాయం మూడు రెట్లకు చేరుతుందని అంచనా వేస్తున్నట్టు సైయంట్ ఎండీ కృష్ణ బోధనపు తెలిపారు. రెండేళ్లలో 1 బిలియన్ డాలర్ కంపెనీగా ఎదుగుతామని ధీమా వ్యక్తం చేశారు. ఏరోస్పేస్, డిఫెన్స్, కమ్యూనికేషన్స్ రంగాలు రానున్న రోజుల్లో మెరుగ్గా ఉంటాయని అన్నారు. ఈ రంగాలపై ఫోకస్ చేస్తామని చెప్పారు. కంపెనీల కొనుగోళ్లు ఉంటాయని అన్నారు. తాము సేవలందిస్తున్న రంగాల్లోని స్టార్టప్స్‌లో పెట్టుబడి చేస్తామని పేర్కొన్నారు. ఉద్యోగుల సంఖ్య వచ్చే ఐదేళ్లలో మొత్తం 18,000లు దాటొచ్చని అంచనాగా చెప్పారు. గతేడాది మాదిరిగానే ప్రస్తుత ఏడాది నియామకాలు 1,000 దాకా ఉండొచ్చని అన్నారు. -
ఖాదీ నాదీ
దేశం నాది జెండా నాది స్వేచ్ఛా నాది బాపూ ఇజం నాది నేసిన దేశభక్తి నాది నేతన్న క్షేమం నాది ఖాదీ నీదీ.. నాదీ... ► షార్ట్ ఖాదీ ఫ్రాక్‌లో సింపుల్ అండ్ స్టైలిష్ లుక్‌తో నటి కాజల్ అగర్వాల్ ►పార్టీవేర్‌గా మది దోచుకుంటున్న ఖాదీ ఫ్లెయిర్ కాలర్‌నెక్ గౌన్ ధరించిన నటి రాశీ ఖన్నా ► సింగిల్ కలర్ ఖాదీ ఫ్యాబ్రిక్‌తో డిజైన్ చేసిన డ్రెస్. స్టైలిష్ లుక్‌తో అట్రాక్ట్ చేస్తున్న నటి రకుల్ ప్రీత్‌సింగ్ ►ఆరెంజ్ కలర్ మ్యాక్సీ డ్రెస్‌కి డిజైనర్ ఖాదీ లాంగ్ ఓవర్‌కోట్ ప్రత్యేక ఆకర్షణను తీసుకువచ్చింది. టు కలర్స్ స్పెషల్ డ్రెస్‌లో నటి రెజీనా! ► ఖాదీ ఫ్లోర్‌లెంగ్త్ అనార్కలీ ధరించి ట్రెడిషనల్ లుక్‌తో వెలిగిపో తున్న నటి లావణ్యా త్రిపాఠీ -
పుష్కరఘాట్లను ఆలయాలుగా తీర్చిదిద్దాలి
నాగార్జునసాగర్ పుష్కరఘాట్లను ఆలయాలుగా తీర్చిదిద్దాలని దేవాదాయ,ధర్మాదాయశాఖామంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. మంగళవారం నాగార్జునసాగర్‌లోని Mýృష్ణానదితీరం,జలాశయతీరంలో నిర్మిస్తున్న పుష్కరఘాట్లను ఎమ్మెల్సీ పల్లారాజేశ్వర్‌రెడ్డి,పార్లమెంట్ సభ్యుడు గుత్తాసుఖేందర్‌రెడ్డి,యడవెల్లి విజయేందర్‌రెడ్డి,జిల్లాపరిషత్ వైస్‌చైర్మన్ కర్నాటి లింగారెడ్డి,నియోజకవర్గం ఇన్చార్జి నోములనర్సింహయ్య, అధికారులతో కలిసి పరిశీలించారు. అనంతరం అధికారులు,కాంట్రాక్టర్లతో మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రంలో తొలిసారిగా జరిగే కృష్ణాపుష్కరాలను ప్రతిష్టాత్మకంగా పండుగలా నిర్వహించేందుకు Mýృషిచేయాలన్నారు. భక్తులు పుష్కరఘాట్‌ను పవిత్రస్థలంగా దేవాలయంతో సమానంగా గుర్తించి ఆచారసంప్రదాయాలతో స్నానం చేసేలా తీర్చిదిద్దాలని కాంట్రాక్టర్లకు అధికారులకు సూచించారు. ఘాట్ల సమీపంలో ఎక్కడ కూడా చెత్తచెదారం ఉండకుండా కంపచెట్లను , పిచ్చి గడ్డిమొక్కలను తొలగించాలన్నారు. నిత్యం ఫైరింజన్‌తో ఘాట్లను రాత్రివేళ శుభ్రం చేసేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. పుష్కరాల సమయంలో నిత్యం12 రోజులు అధికారులు లేదా ఈప్రాంత నాయకులు బాధ్యతగా Mýృష్ణమ్మకు హారతి ఇవ్వాలని సూచించారు. హైదరాబాద్ నుంచి వచ్చే భక్తులంతా నాగార్జునసాగర్‌కే వస్తారని తెలిపారు. శివాలయంఘాట్ డ్యాం దిగువన నదీతీరంలో ఉండటంతో భక్తుల తాకిడి బాగుంటుందని తెలిపారు. భక్తులుస్నానాల నీటికి ఇబ్బందులు పడాల్సిన అవసరం లేదన్నారు. గోదావరి పుష్కరాల అనుభవంతో అంతకన్నా మిన్నగా భక్తులకు సకలసౌకర్యాలు కల్పిస్తున్నట్లు వివరించారు. ఈయన వెంట పెద్దవూర ఎంపీపీ వస్త్రపురిమళ్లిక ,టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు కర్ణబ్రహ్మానందరెడ్డి,రవినాయక్,సాగర్‌డ్యాం ఎస్ఈ రమేశ్,ఘాట్ల ఇన్చార్జీ జెడ్పీ సీఈఓ మహేందర్‌రెడ్డి తదితరులు ఉన్నారు. శివాలయంలో పూజలు చేసిన మంత్రి ఘాట్ వద్ద ఉన్న శివాలయంలో మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి,గుత్తాసుఖూందర్రెడ్డి కర్నాటి లింగారెడ్డి బ్రహ్మానందరెడ్డి, మళ్లిక తదితరులతో కలిసి పూజలు చేశారు. సుదాకరశాస్త్రి గోత్రనామాలతో అర్చన చేశారు. మంత్రి అంతకు ముందే Mýృష్ణానదిలోని నీటిని తలమీద చల్లుకుని వచ్చారు. -
భవనాల ననూనాను ఇచ్చిన మలేషియా సంస్థ
-
రెండు షర్ట్లు ఒక డిజైన్
న్యూలుక్ షార్ట్ స్లీవ్స్, లాంగ్ స్లీవ్స్, కాలర్ నెక్, రౌండ్ నెక్.. ఇలా టీ షర్ట్స్ అన్నీ ఇంచుమించు ఈ రెండు డిజైన్లలోనే కనిపిస్తాయి. వాటినే తరచూ ధరించాలంటే విసుగ్గా అనిపిస్తుంటుంది. ఒక ఆలోచన చేస్తే.. ఒక టీషర్ట్, మరో షర్ట్‌ని కలిపితే ఆకర్షణీయమైన డిజైనరీ డ్రెస్ మీ ముందుంటుంది.ప్లెయిన్ లాంగ్ స్లీవ్స్ టీ షర్ట్ ఒకటి తీసుకోవాలి. చిన్న చిన్న ప్రింట్లు, చెక్స్ ఉన్నవి కూడా బాగుంటాయి. మరో ప్లెయిన్ లేదా చెక్స్ షర్ట్ తీసుకోవాలి. షర్ట్ కాలర్ బాగం 5 ఇంచుల వెడల్పు ఉండేలా బటన్స్ భాగమంతా కట్ చేయాలి. అలాగే హ్యాండ్ కఫ్స్ కూడా! టీ షర్ట్ మధ్య భాగం నెక్ నుంచి కిందవరకు కట్ చేయాలి. కట్ చేసిన షర్ట్ భాగాన్ని టీ షర్ట్‌కు జత చేసి కుట్టాలి.షోల్డర్ కఫ్స్, హ్యాండ్ కఫ్స్ కూడా జత చేయాలి.దీంతో టీ షర్ట్ ఒక కొత్త మోడల్లో కనువిందు చేస్తుంటుంది. ఇన్నర్‌గా ట్యునిక్ ధరించి, ఆ పైన టీ షర్ట్‌తో ఇలా డిజైన్ చేసిన ఓపెన్ షర్ట్‌ని ధరించవచ్చు. స్టైల్‌గా మెరిసిపోవచ్చు.మిగిలిన షర్ట్ క్లాత్‌తో ఏం చేయవచ్చో మీ మెదడుకు పని చెప్పండి. -
దెబ్బకు ఠా దొంగల ముఠా
సిటీలోని వినోద కేంద్రాలు విచిత్రాలను చూపిస్తున్నాయి. రొటీన్ వర్క్‌కు బై చెప్పి ప్రొటీన్ లాంటి ఎంటర్టైన్మెంట్ను కోరుకుంటున్న కార్పొరేట్ ఉద్యోగులే లక్ష్యంగా ఏర్పాటవుతున్న వినోద కేంద్రాలు.. వైవిధ్య లోతుల్ని తవ్వి తీస్తున్నాయి. పబ్, క్లబ్, కాఫీ షాప్స్, స్పోర్ట్స్ ఎరీనాలు.. ఇవన్నీ బోర్ కొట్టేశాయంటున్న యువత కోసం అరుదైన ఆటల కేంద్రాలు ఆవిర్భవిస్తున్నాయి. రియాలిటీ షోలను తలదన్నే రీతిలో గేమ్‌లను డిజైన్ చేసి యువ సందడికి వేదికలవుతున్నాయి. ట్రెజర్ గేమ్.. ఒక సంపన్నుడు 1950లో తమ పూర్వీకుల సమాధితో పాటు నేలమట్టం అయిన నిధిని తిరిగి పొందాలని ఆశిస్తాడు. దీని కోసం కొందరిని నియమించుకొని వారిని టైమ్ మెషిన్ మీద కొన్ని దశాబ్దాల వెనుకకు పంపించేందుకు ప్రయత్నిస్తాడు. అయితే మెషిన్ పొరపాటు వల్ల అది వారిని సమాధి నేలమట్టం అవడానికి కేవలం గంట ముందుకు మాత్రమే పంపుతుంది. దీంతో వాళ్లు కేవలం 60 నిమిషాల్లో నిధిని కనిపెట్టడంతో పాటు కుప్పకూలనున్న సమాధి నుంచి బయటపడాల్సి వస్తుంది. అప్పుడు మొదలువుతుంది ఆట.. రంజుగా. నిజాం ఆభరణాల చోరీకి... సిటీలోని సాలార్జంగ్ మ్యూజియంలోని నిజాం నగల తాత్కాలిక ప్రదర్శన నుంచి అత్యంత ఆకర్షణీయమైన, విలువైన 250 క్యారట్ల నిజామీ డైమండ్‌ని దొంగిలించేందుకు స్కెచ్ వేస్తుందో ముఠా. కేవలం గంట వ్యవధిలో దీన్ని దొంగలించి, సెక్యూరిటీ గార్డ్స్‌కి చిక్కకుండా చాకచక్యంగా తప్పించుకోవడానికి ముఠాలోని కొందరు సిద్ధమవుతారు. అందాల నటికి ఆపదొస్తే.. ఒక టాలీవుడ్ నటి జీవితం చిక్కుల్లో పడుతుంది. నటికి ఆపద కల్పించాలనే ఉద్దేశంతో ఆమె నటిస్తున్న షూటింగ్ సెట్లో సైతం ప్రమాదకరమైన సంఘటనలు జరుగుతుంటాయి. తనకు మరో గంటలో ఏమైనా జరగొచ్చనే హెచ్చరికల నేపథ్యంలో సినిమా షూటింగ్‌కు అంతరాయం కలుగకూడదని అనుకుంటారు నిర్మాత, దర్శకులు. గంట వ్యవధిలో నటికి కీడు తలపెట్టిన వారిని పట్టుకోవాలని సిటీకి చెందిన టాప్ డిటెక్టివ్‌లను పురమాయిస్తారు. ఈ వినోద క్రీడల్లో నిధిని అన్వేషించే వాళ్లు, ఆభరణాల దొంగలు, డిటెక్టివ్లు.. వీరంతా ఆటగాళ్లే. ఇలాంటి ఆటలు ఆడేందుకు వీరికి ‘ది ఎస్కేప్ హంట్ ఎక్స్పీరియన్స్ హైదరాబాద్’ లాంటి విచిత్రమైన వినోద వేదికలు అందుబాటులోకి వచ్చాయి. ఈ ఎస్కేప్ హంట్ దాదాపు 4,500 చదరపు అడుగుల విస్తీర్ణంలో గేమ్‌కి ఒకటి చొప్పున రూమ్స్ ఉన్నాయి. వినోదం.. విశేషం స్నేహితులు, కుటుంబాలతో కలిసి వెళ్లి ఆడుకునేందుకు వీలుగా ఈ గేమ్ సెంటర్లలో ప్యాకేజీలు ఆఫర్ చేస్తున్నారు. కార్పొరేట్ టీమ్ బిల్డింగ్ ఈవెంట్స్, క్రిటికల్ థింకింగ్, అబ్జర్వేషన్ వంటి స్కిల్స్ పెరిగేందుకు ఇవి ఉపకరిస్తున్నాయని అంటున్నారు నిర్వాహకులు ఆదిత్య, సనా. ‘బ్యాంకాక్, థాయ్‌ల్యాండ్‌లలో పెరిగాను. ఆస్ట్రేలియా నుంచి కొన్నేళ్ల క్రితమే నగరానికి తిరిగి వచ్చాను. ఇక్కడ వినోద వేదికలున్నా మరిన్ని విశేషాలకు అవకాశం ఉందని అర్థమైంది. బ్యాంకాక్‌లో ఆడిన అనుభవమే ఇక్కడ ప్రారంభించేందుకు కారణమైంది. సిటీలో ఇదే ఫస్ట్ ఎస్కేప్ రూమ్ గేమ్. దేశంలోనే రెండోది. ఇందులో 60 నిమిషాల ఆట, 30 నిమిషాలు రిలాక్స్ అవడం ఉంటాయి. ఇక్కడ ఫైవ్‌స్టార్ లాంజ్‌లో అవసరమైన రీఫ్రెష్‌మెంట్స్ ఉంటాయి. అలాగే స్పెషల్ కాస్ట్యూమ్స్ ధరించి ఫొటోలు దిగేందుకు వీలుగా ఫొటో వాల్స్ ఉన్నాయ’ని చెప్పారు సనా. -
రైల్వేల్లో కొత్త తరహా టాయిలెట్లు
రైళ్లలో ఉపయోగించేందుకు వీలుగా నీళ్ల అవసరం లేని టాయిలెట్లను తయారుచేసిన ఓ ఫ్యాకల్టీకి రైల్వేశాఖ నిర్వహించిన పోటీలో రెండో ప్రైజ్ దక్కింది. మణిపాల్ యూనివర్సిటీలో ఫ్యాకల్టీ ఆఫ్ ఆర్కిటెక్చర్(ఎఫ్ఓఏ) పదో సెమిస్టర్ చేస్తున్న వినోద్ అంథోని థామస్ ఇండియన్ రైల్వేల కోసం ప్రత్యేకంగా ఈ టాయిలెట్‌ను రూపొందించారు. రీసెర్చ్ డిజైన్స్ అండ్ స్టాండర్డ్స్ ఆర్గనైజేషన్ (ఆర్డీఎస్ఓ) నిర్వహించిన ఈ పోటీలో.. నీటి అవసరం లేకుండా వాడుకోవడానికి వీలయ్యే టాయిలెట్స్ డిజైన్ చేయాలని ప్రకటనలో కోరారు. ప్రస్తుతం రైల్వేల్లో టాయిలెట్ల నిర్వహణ, ట్రాక్‌లను శుభ్రంచేయడం పెద్ద సమస్యగా తయారయ్యాయి. వీటిని అధిగమించేందుకు, పర్యావరణానికి హాని కలుగని పద్దతుల్లో టాయిలెట్‌ను డిజైన్ చేసినట్లు వినోద్ తెలిపారు. ప్రస్తుతం రైల్వేల్లో అమల్లో ఉన్న టాయిలెట్ల వ్యవస్థకు ఒక కన్వేయర్‌ను ఉపయోగించి మానవ వ్యర్ధాలను బిన్‌కు తరలించవచ్చని మణిపాల్ యూనివర్సిటీ ఓ ప్రకటనలో పేర్కొంది. బిన్ వినియోగం వల్ల వ్యర్ధాలను లోపలికి పంపడానికి నీటిని ఎక్కువగా ఖర్చుచేయాల్సిన పని ఉండదని, డీ కంపోజింగ్ కు బిన్లో ప్రత్యేక వ్యవస్థ ఉంటుందని వివరించింది. స్వచ్ఛ భారత్ అభియాన్ కింద ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఇచ్చిన పిలుపుతో ఈ పోటీని ప్రారంభించారు. మే నెలలో ఈ పోటీకి ఎంట్రీలను స్వీకరించగా.. రైల్వే, ఇండస్ట్రీ, పరిశోధన రంగాలకు చెందిన నిపుణులు వినోద్, రాహుల్, సౌరభ్ హాన్స్ లతో కూడిన బృందం తయారుచేసిన టాయిలెట్ కు రెండో స్థానాన్ని ఇచ్చారు. ఇందుకుగాను ప్రైజ్ మనీ కింద ఈ ముగ్గురికి రూ.75,000 దక్కాయి. -
అపురూపాయల్
రంగులకు ప్రాణం పోస్తే... విహంగాలవుతాయి. హంగులకు ఫ్యాషన్ లుక్ ఇస్తే... లెహంగాలవుతాయి.ప్రింట్లను కట్ చేస్తే... ‘ఫుల్ లెంగ్త్’లు అవుతాయి. తారల్ని తీరుగా దిద్దితే... ట్రెడిషన్‌కి బొట్టూ కాటుక అవుతాయి. పాయల్ సింఘాల్ డిజైన్ చేస్తే అంతే మరి! డ్రెస్.. రాయల్‌గా ఉంటుంది. లాయల్‌గా ఉంటుంది.అపురూపంగానూ ఉంటుంది. ‘యువరాణీవారొస్తున్నారహో... తప్పుకోండి’ అంటుంది. పదిహేనేళ్లకే ఫ్యాషన్ డిజైనింగ్‌లో అవార్డులు సొంతం చేసుకుంది. పదిహేనేళ్లకే ర్యాంప్ షోలో ఐశ్వర్యారాయ్‌తో పాటు ప్రముఖ తారలను తన డిజైనరీ దుస్తుల ద్వారా మెరిపించింది. పదిహేనేళ్ల్ల తన సృజనాత్మక ప్రపంచంలో ఎన్నో కొత్త వాణిజ్యసముదాయాలను నెలకొల్పి మహిళా వ్యాపారవేత్తగానూ నిరూపించుకున్న ఆమే పాయల్ సింఘాల్. ముంబయ్ ఫ్యాషన్ డిజైనర్ అయిన పాయల్ ఆన్లైన్ స్టోర్‌లోనూ తనదైన ముద్ర వేసింది. మూడు పదులు దాటిన పాయల్ ఈ రంగంలో ఎదగాలనుకునేవారికి కొన్ని సూచనలు చేస్తున్నారు. ‘మిగతా డిజైనర్ల డిజైన్స్ నుంచి కొత్తదనం నేర్చుకోవడం వరకు మంచిదే. కానీ, ఈ రంగంలో ఎదగాలంటే తమను తామూ మెరుగు పెట్టుకొని, ఎప్పటికప్పుడు దుస్తులలో కొత్తదనం చూపించాల్సిందే’ అంటున్నారు. -
త్వరలో తెలంగాణ ఎన్నారై పాలసీ
రూపకల్పనకు మంత్రి కేటీఆర్ ఆదేశం సాక్షి, హైదరాబాద్: ఉపాధి కోసం రాష్ట్రం నుంచి గల్ఫ్ దేశాలకు వలస వెళ్తున్న యువత సంక్షేమం కోసం తెలంగాణ ఎన్నారై పాలసీని రూపొందించాలని ఐటీ, మున్సిపల్, ఎన్నారై వ్యవహారాల శాఖ మంత్రి కె.తారకరామారావు అధికారులను ఆదేశించారు. ఇందుకు ఇతర రాష్ట్రాల్లో అమ లుచేస్తున్న పాలసీలను అధ్యయనం చేయాలన్నారు. కేరళ, పంజాబ్‌లలో ఉన్న ఎన్నారై పాలసీలను పరిశీలించిన కేటీఆర్... అందులోని ప్రధానాంశాలను తెలంగాణ పాలసీలో స్వీకరించేందుకు ఉన్న అవకాశాలను పరిశీలి స్తున్నామన్నారు. జిల్లాల నుంచి గల్ఫ్‌కు వలస వెళ్లే యువతకు మరిన్ని సౌకర్యాలు కల్పించే దిశగా పాలసీ ఉంటుందన్నారు. వారంలో ఎన్నారై సంఘాలు, గల్ఫ్ దేశాల్లో ఎన్నారైల సంక్షేమం కోసం పనిచేస్తున్న స్వచ్ఛంద సంస్థలతో మంత్రి సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశానికి హాజరు కావాలని కార్మిక, ఇతర శాఖల అధికారులను కేటీఆర్ ఆదేశించారని శనివారం ఆయన కార్యాలయం ప్రకటనలో తెలిపింది. విదేశాల్లో ప్రమాదాలకు గురైన వారికి, మరణించిన వారికి అందాల్సిన సాయంపై ఈ భేటీలో చర్చించనున్నారు. దీంతోపాటు ఎన్నారైల నుంచి వచ్చే పెట్టుబడులు, ఇతర సహాయ సహకారాలను స్వీకరించేందుకు ఓ వ్యవస్థను సైతం ఈ పాలసీ ద్వారా ఏర్పాటు చేస్తామన్నారు. ఎన్నారైల సంక్షేమం కోసం దేశ విదేశాల్లో పనిచేస్తున్న సంస్థల నుంచి సలహాలు, సూచనలు స్వీకరిస్తామన్నారు. ముసాయిదా పాలసీ సిద్ధమయ్యాక సీఎం సూచనలతో సాధ్యమైనంత త్వరగా తుది పాలసీని ప్రకటిస్తామన్నారు. నేడు నగరానికి: అమెరికా పర్యటన ముగించుకున్న కేటీఆర్ ఆదివారం నగరానికి వస్తున్నారు. తెల్లవారుజాము 3 గంటలకు ఆయన శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకొంటారని మంత్రి కార్యాలయం శని వారం తెలిపింది. -
న్యూ లుక్ తో అదరగొట్టనున్న యాపిల్ స్టోర్లు
శాన్ ఫ్రాన్సిస్కో : ఐ ఫోన్ ప్రేమికులను ఆకట్టుకునే దిశగా యాపిల్ తన స్టోర్ల కోసం ఒక కొత్త స్టైలిష్ ప్రొడక్ట్ ను పరిచయం చేస్తోంది. తన విక్రయ సంస్థలకు కొత్త రూపును అందించడానికి ఈ స్టైలిస్ ప్రొడక్ట్ ను తీసుకొచ్చినట్టు చెబుతోంది. ప్రపంచవ్యాప్తంగా 480 స్టోర్లు ఉన్న ఐఫోన్ తయారీదారి యాపిల్, శాన్ ప్రాన్సిస్కో నగరంలోని స్టోర్ ను న్యూ లుక్ అద్దడం కోసమే ఈ స్టైలిస్ తో రీడిజైన్ చేసిందట. ఈ రీ డిజైన్ స్టోర్ ను శనివారం నుంచి ప్రజలకు అందుబాటులో తేనున్నట్టు కంపెనీ వెల్లడించింది. మొత్తం గాజు, మెటల్, చెక్కతో అందంగా దీన్ని రీ డిజైన్ చేశారట.ఈ ప్రత్యేకతలతోనే భవిష్యత్తులో ప్రారంభించబోయే తమ కొత్త స్టోర్లు కూడా ఉంటాయని యాపిల్ ప్రతినిధులు శాన్ ప్రాన్సిస్కో ఈవెంట్ చెప్పారు. కాగా యాపిల్ మొదటిసారి ఐఫోన్ అమ్మకాలను, రెవెన్యూలను కోల్పోయింది. ఈ నేపథ్యంలో తన కొత్తదనంతో మళ్లీ మార్కెట్లను ఆకట్టుకోవాలని యాపిల్ ప్రయత్నిస్తోంది. సిలికాన్ వ్యాలీలో వచ్చే ఏడాది యాపిల్ ప్రారంభించబోయే కొత్త ప్రధాన కార్యాలయాన్ని ఈ ఫీచర్లతోనే రూపొందించనున్నట్టు తెలుస్తోంది. -
పట్టు కట్టు
కంచి పట్టుచీర కట్టుకున్నప్పుడు... మెరుపు జరీతో మేనిని చుట్టుకున్నప్పుడు కళ్లు రంజించేలా కంజీవరం శారీ చేసే, మ్యాజిక్కు మంత్రముగ్ధులైపోవాల్సిందే. కట్టుకుంటే మాగ్నిఫిసెంట్! ఆకట్టుకోవడంలో మ్యాగ్నెట్!! ఇంతకు మంచి ఏదైనా చెప్పాలా... కంచి కథే వేరు... ఆ పట్టు కనికట్టే వేరు! రాణీ పింక్ చీరకు బంగారు రంగు పెద్ద అంచు ప్రధాన ఆకర్షణ. చీరంతా బంగారు వర్ణపు చెక్స్ రావడంతో అద్భుతంగా మెరిసిపోతుంది. సింపుల్ డిజైన్ అనిపిస్తూ గ్రాండ్‌గా లుక్‌తో వెలిగిపోతున్న పల్లూ ఈ చీరకు అదనపు హంగుగా చేరింది. మస్టర్డ్, పచ్చ రంగులతో చూపు తిప్పుకోనివ్వని విధంగా ఉన్న ఈ పట్టుచీర కట్టుకుంటే మాటల్లో చెప్పలేని సౌందర్యంతో మెరిసిపోవాల్సిందే! రెండు రంగుల అంచులు, మామిడిపిందెల సెల్ఫ్ డిజైన్, చిన్న చిన్న బుటా ఈ చీర వైభవాన్ని వెయ్యింతలు చేస్తున్నాయి. వివాహ వేడుకలకు కళను తీసుకువచ్చేవి పట్టుచీరల రెపరెపలే! బంగారు రంగులో మెరిసిపోతున్న పెద్ద అంచు ముదురు ఎరుపు రంగు కంజీవరం పట్టుచీర పెళ్లికి ఎప్పుడూ ప్రత్యేక ఆకర్షణే. చీరంతా బంగారు జరీ బుటీ, అంచు మీద సంప్రదాయ డిజైన్ చూపరుల కళ్లను కట్టిపడేస్తాయి. కలల్లో సాక్షాత్కరించిన మహాలక్ష్మి కళ్లముందు కనిపిస్తే మన ఇంటి అమ్మాయిగా ఇలా రూపుకడుతుంది. బంగారు, పచ్చ రంగు అంచులతో గంధం రంగు పట్టుచీర.. దానిపైన మెజెంటా రంగు పువ్వుల సెల్ఫ్ డిజైన్... వర్ణించనలవి కాని సౌందర్యం వివాహవేడుకలో ప్రత్యేకం. -
అమాత్యుడి గుప్పెట్లో ఇంక్యుబేషన్
రూ.67.7 కోట్ల {పాజెక్టుపై కన్ను అస్మదీయ సంస్థకు కాంట్రాక్టు కట్టబెట్టే ఎత్తుగడ డిజైన్‌పై కొర్రీలతో అడ్డుపుల్ల విశాఖపట్నం: కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ ‘సాఫ్ట్వేర్ టెక్నాలజీస్ పార్క్స్ ఆఫ్ ఇండియా (ఎస్టీపీఐ)’ విశాఖలో ఇంక్యుబేషన్ సెంటర్ నిర్మించేందుకు మూడేళ్ల క్రితం ముందుకువచ్చింది. అప్పట్లోనే కేంద్రం రూ.16 కోట్లు విడుదల చేసింది. కానీ అప్పటి కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రభుత్వంలో జిల్లాలో చక్రం తిప్పిన ఓ నేత ఈ ప్రాజెక్టు అంతా తన కనుసన్నల్లోనే సాగాలని పట్టుబట్టారు. అందుకు ఎస్టీపీఐ సమ్మతించకపోవడంతో ఆ ప్రాజెక్టు మూడేళ్లపాటు మూలనపడిపోయింది. ఏడాది క్రితం ఇంక్యుబేషన్ సెంటర్ నిర్మాణం అంశాన్ని ఎస్టీపీఐ మరోసారి రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చింది. ఎస్టీపీఐ, వుడా సంయుక్తంగా రూ.62.70 కోట్లతో ఆ ప్రాజెక్టు చేపట్టాలని నిర్ణయించారు. తన వాటాగా రూ.16.70 కోట్ల విలువైన స్థలాన్ని ఇచ్చేందుకు వుడా సమ్మతించింది. ఎస్టీపీఐ రూ.44 కోట్లతో ఇంక్యుబేషన్ సెంటర్ నిర్మిస్తుంది. ఇటీవల కేంద్ర ఐటీ శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ పర్యటన సందర్భంగా ఎస్టీపీఐ, వుడా ఎంవోయూ కుదుర్చుకున్నాయి. 8 ఫ్లోర్లతో 62 వేల చ.అడుగుల వైశాల్యంతో కనీసం 50 ఐటీ యూనిట్లు నెలకొల్పే సామర్థ్యంతో నిర్మించేందుకు డిజైన్‌ను రూపొందించారు. ఈ ప్రాజెక్టు పూర్తయితే కనీసం 2,500మంది ఐటీ నిపుణులకు ఉపాధి అవకాశాలు లభిస్తాయని భావించారు. ఏటా రూ.300 కోట్ల విలువైన ఐటీ ఎగుమతులు సాధించవచ్చని అంచనా వేశారు. 18 నెలల్లో ప్రాజెక్టు పూర్తి చేయాలని భావించారు. అందుకు త్వరలో టెండర్లు పిలవడానికి సంసిద్ధమయ్యారు. అమాత్యుడి అడ్డుచక్రం ఇంతటి విలువైన ప్రాజెక్టు పూర్తిగా ఎస్టీపీఐ పర్యవేక్షణలోనే సాగడం జిల్లాకు చెందిన ఓ అమాత్యుడికి ఏ మాత్రం రుచించలేదు. ఆ భారీ కాంట్రాక్టును తమ అస్మదీయ సంస్థకు ఏకపక్షంగా కట్టబెట్టాలన్నది ఆయన ఉద్దేశం. ఆ తరువాత సబ్ కాంట్రాక్టు ఇచ్చేసి చేతులు దులిపేసుకోవాలన్నది పన్నాగం. తమ అస్మదీయ సంస్థకు అనుకూలంగా ఉండేలా టెండరు నిబంధనలు రూపొందించాలని భావించారు. కొన్నిరోజుల క్రితం వుడా అధికారులను పిలిపించి ప్రాజెక్టు డిజైన్‌పై అభ్యంతరాలు వ్యక్తం చేశారు. ఆ డిజైన్ పట్ల సీఎం కార్యాలయం అసంతృప్తి వ్యక్తం చేసిందని చెప్పారు. కాబట్టి మరో డిజైన్‌ను రూపొందించి తన వద్దకు తీసుకురావాలని ఆదేశించారు. వాస్తవానికి ఆ డిజైన్ పట్ల సీఎం కార్యాలయ ఉన్నతాధికారి సంతృప్తి వ్యక్తం చేసినట్లు ఎస్టీపీఐ వర్గాలు చెబుతున్నాయి. వారు ఆమోదించిన తరువాతే టెండర్ల ప్రక్రియకు సన్నాహాలు చేపట్టామని తెలిపాయి. కానీ అమాత్యుడు ఆ డిజైన్‌ను సీఎం కార్యాలయం తిరస్కరించినట్లు చెబుతుండటంపై ఎస్టీపీఐ వర్గాలు సందేహం వ్యక్తం చేస్తున్నాయి. అమాత్యుడి అభ్యంతరాల వెనుక ఇతరత్రా కారణాలు ఉన్నాయన్నది స్పష్టమవుతోంది. డిజైన్‌పై అభ్యంతరాల నెపంతో మొత్తం టెండర్ల ప్రక్రియను అడ్డుకోవాలన్నది ఆయన వ్యూహం. టెండరు నిబంధనలు తమ అస్మదీయ సంస్థకు అనుకూలంగా రూపొందించేవరకు ఈ వ్యవహారాన్ని ఆయన ముందుకు సాగనివ్వరని స్పష్టమవుతోంది. కాగా తమ నిబంధనల మేరకే వ్యవహరిస్తామని, రాష్ట్ర ప్రభుత్వ ఒత్తిడికి తలొగ్గేది లేదని ఎస్టీపీఐ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. అమాత్యుడి కమీషన్ల వ్యవహారంతో విలువైన ప్రాజెక్టు మరోసారి పెండింగులో పడిపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎస్టీపీఐ ఇంక్యుబేషన్ సెంటర్... రూ.67.70 కోట్ల ప్రాజెక్టు... 2,500 ఐటీ ఉద్యోగాలు లక్ష్యం... రూ.300 కోట్ల ఐటీ ఎగుమతుల అంచనా... అయితే... నా కేంటి?...‘నా సంగతి’ తేలేవరకు పనులు మొదలు పెట్టొద్దు. అసలు మీ డిజైనే బాగా లేదు. కొత్త డిజైన్‌తో రండి... ఇదీ ఓ అమాత్యుడి హుకుం... విశాఖను ఐటీ హబ్‌గా చేస్తామంటున్న ప్రభుత్వ పెద్దలు ఆచరణలోకి వచ్చేసరికి అమ్యామ్యాలకే పెద్దపీట వేస్తున్నారు. కేంద్రం నిధులిస్తామని చెబుతున్నా రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు మాత్రం కమీషన్ల కోసం కక్కుర్తిపడుతూ మోకాలడ్డుతున్నారు. ఎస్టీపీఐ, వుడా సంయుక్తంగా నిర్మించతలపెట్టిన ఇంక్యుబేషన్ సెంటర్ ప్రాజెక్టే అందుకు తాజా తార్కాణం. -
స్టైల్ సందడి
గలగల గోదావరికి చీరకడితే... కుదురు గోదావరి అవుతుంది! నింగి విహంగానికి చీరకడితే... హరివిల్లై ఒద్దికగా వాలుతుంది! చీరంటేనే.. పద్ధతీ, పెద్దరికం. మరి ఈ ‘స్టైల్’ ఏమిటి? ‘సందడి’ ఏమిటి?! గౌరాంగ్ షా క్రియేట్ చేశారు. కుదురైన స్టైల్... పెళ్లి సందడికి ఒదిగేలా! పసుపు రంగు అంచు, బూడిదరంగు టై అండ్ డై ఇకత్ కంజీవరం చీరలో సినీ నటి కాజల్ అగర్వాల్. ఈ చీరను సంప్రదాయ కొరవాయి, కంచిపురం, ఇకత్ చేనేత కళలను ఇనుమడింపజేసి డిజైన్ చేశారు.మరుగునపడిపోయిన కళను వెలికితీసే బాధ్యతను తలకెత్తుకున్నట్టు కనిపిస్తాయి గౌరాంగ్ షా డిజైన్లను పరిశీలిస్తే. ఎక్కడ ఉన్నా కళ్లను కట్టిపడేసే రంగులు, సంప్రదాయ చేనేత హంగులు, వాటిలోనే అల్లుకుపోయే డిజైన్లు చూపుతిప్పుకోనివ్వవు. భారతీయ సంప్రదాయ కళకు ప్రాణం పోసే గౌరంగ్ షా కంజీవరం, ఇకత్ వంటి చేనేతలకు జమదాని కళతో కనువిందు చేసేలా తీర్చిదిద్దడంలో సిద్ధహస్తులు. గౌరంగ్ షా డిజైన్ శారీస్‌ను చూస్తే ఒక అద్భుతమైన పెయింటింగ్ కాన్సెప్ట్ మన కళ్లకు కడుతుంది. భారతీయ హస్తకళలలో ప్రముఖంగా నిలిచే బెంగాలీయుల కాంతా వర్క్, హైదరాబాదీల జర్దోసీ పనితనం, హుబ్లీ వారి కసుటి, రాజస్థాన్ మరోది, లక్నో చికంకారి, కశ్మీర్ కశిదకారి, కచ్ బంధని-పార్శి, ముంబయ్ గర వర్క్స్ ప్రధానంగా కనిపిస్తాయి. తెలుగు నేల నుంచి అంతర్జాతీయ వేదికల వరకు ఎదిగిన ఫ్యాషన్ డిజైనర్ గౌరాంగ్ షా! సమకాలీన రంగులతో డిజైన్ చేసిన డబుల్ ఇక్కత్ చీరలు ఇవి. వీటికి జమదాని బ్లౌజ్‌లను జత చేశారు.ఇండిగో ఖాదీ చేనేత శారీ ఇది. పూర్తి జమదాని కళానైపుణ్యాన్ని మేళవించి ఈ చీరను రూపొందించారు. నెమలిపింఛం రంగు, జరీ పనితనంతో నేసిన ఈ సంప్రదాయ కంజీవరం చీరలో సినీ నటి తాప్సీ. లైన్ ఆఫ్ కింగ్ కాన్సెప్ట్‌తో తీసుకువచ్చిన ఈ చీరలో ఎవరైనా మహారాణి కళతో వెలిగిపోవాల్సిందే!గౌరాంగ్ షా డిజైన్ చేసిన కాంతులీనే పైథాని పట్టు చీరను ధరించిన బాలీవుడ్ నటి విద్యాబాలన్. -
నాసా రోబోకు చేతులు కావాలి ..
వాషింగ్టన్ : అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్ఎస్)లో గస్తీ తిరిగేందుకు తయారు చేసిన రోబోకు చేతులు రూపొందించేందుకు మంచి డిజైన్ సూచించాలని అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా కోరింది. ఆస్ట్రోబీ అనే ఈ రోబోను మరింత సమర్థంగా మార్చాలని నాసా యోచిస్తోంది. ఇందులో భాగంగా దానికి అమర్చాల్సిన చేయికి సంబంధించి సరికొత్త డిజైన్‌తో పాటు, సమర్థంగా పనిచేసేలా సూచనలు చేయాలని ప్రజలను కోరింది. ఔత్సాహికుల నుంచి దరఖాస్తుల స్వీకరణ జనవరి 14 నుంచే ప్రారంభించింది. 2006 నుంచి ఐఎస్ఎస్లో పనిచేస్తున్న మూడు రోబోల (స్పియర్స్) స్థానంలో ఈ రోబోను 2017 నాటికి ప్రవేశపెట్టనున్నారు. -
శారీ పోయి గౌను వచ్చే!
రీయూజ్ ‘చీర రంగు బాగుంది.. కానీ డిజైన్ నచ్చలేదు.’ ‘ఈ చీర కట్టి కట్టి బోర్ కొట్టి పక్కన పెట్టేశాను.’ ‘చీర పాడైనా అంచులు, పల్లూ సూపర్బ్‌గా ఉన్నాయి.తీసేయాలనిపించడం లేదు.’ ‘ఈ చీర కట్టుకుంటే నాయనమ్మలా ఉన్నావు అంటున్నారు... ’ చీరల గురించి ఈ తరహా కామెంట్స్ చాలా మంది ఇల్లాళ్ల నోట వింటూ ఉంటాం. ఇలాంటి ఇబ్బంది ఉంటే మీ శారీకో కొత్త రూపు ఇవ్వవచ్చు. మీ అమ్మాయి మోడ్రన్ స్టైల్‌కి అనువుగా పాత చీరలను ఇలా కొత్తగా మార్చేయవచ్చు. నేటి యూత్‌ని మీ సరికొత్త సృజనతో సర్ప్రైజ్ చేయచ్చు. ఇలా చేయండి ఆరు గ జాల చీరలో కావల్సిన భాగాన్ని ఎంచుకోండి. మ్యాక్సీ డిజైన్ చేయాలా.. స్కర్ట్ కుట్టించాలా అనేది తేల్చుకోండి. పల్లూని, అంచులను వేరు చేసి స్కర్ట్ లేదా గౌనులకు అంచులుగా జత చేయండి. పట్టు చీరతో డిజైన్ చేసిన మిడ్ స్కర్ట్‌కి మోడ్రన్ టాప్ వేస్తే అల్ట్రామోడ్రన్ లుక్‌తో పార్టీలోనూ అదరగొట్టేస్తారు. చీర అంచులను గౌన్‌కి నెక్ డిజైన్‌గా, బెల్ట్‌గా,... రకరకాల ప్యాటర్న్స్ తీసుకుంటే వాటిల్లో మీ అమ్మాయిలు బుట్టబొమ్మల్లా మెరిసిపోతారు. -
సబ్యసాచీరలు
సబ్యసాచి దుప్పటి చుట్టినా అందంగానే ఉంటుంది. ఇక చీర చుడితే...ఆయన డిజైన్ చేసిన చీరలకు విదేశాలలోనూ మాంచి గిరాకీ ఉంటుంది. ‘ఏమిటయ్యా నీ మ్యాజిక్’ అని అడిగితే.... చీరల్ని చీరల్లా కాకుండా సబ్యసా‘చీర’ల్లా చూడమంటున్నాడు. ఆ గొప్పతనమేంటో మీరూ చూడండి. మీ చీరలకూ ఆ కొత్త కళను తీసుకురండి. నిలయ పేరుతో సబ్యసాచి రూపొందించిన డిజైనరీ శారీ ఇది. ఎరుపు రంగు బెనారస్ పట్టుకు అదనంగా అమర్చిన ఎంబ్రాయిడరీ అంచు... దానికి తగ్గ అలంకరణ ఈ చీర అందాన్ని వెయ్యింతలు చేసింది. పువ్వుల ప్రింట్ల క్రేప్ శారీకి ఎంబ్రాయిడరీ అంచు, మోడ్రన్ బ్లౌజ్‌తో తీర్చిదిద్దిన హంగులు కిందటేడాది కాన్స్ అంతర్జాతీయ సినిమా ఉత్సవంలో హైలైట్‌గా నిలిచాయి. కథ చెబుతున్నంత అందంగా! ఇండియన్ ఫ్యాషన్ రంగానికి రాచకళను తీసుకువచ్చిన ప్రసిద్ధ డిజైనర్ సబ్యసాచి ముఖర్జి. రంగులు, హంగులతో దుస్తులకు అతనో అద్భుతమైన కళను తీసుకువస్తారు. వాటిని అలంకరించుకున్న అతివలు రాచఠీవితో వేదికలపైన అడుగులు కదుపుతారు. తన ప్రతీ డ్రెస్ డిజైన్ ఒక కథ చెబుతున్నట్టు, ఓ అందమైన కవిత అల్లుతున్నట్టు మనసులను హత్తుకుపోతుంది. ఇండియన్ ప్యాషన్ డిజైన్ కౌన్సిల్లో ముఖ్య సభ్యుడుగా కొనసాగుతున్న ‘సబ్యసాచి’ లేబుల్ డిజైన్స్ అంటే బాలీవుడ్ తారలు పోటీపడతారు. సబ్యసాచి డిజైన్స్ రూపకల్పనను పరిశీలిస్తే అత్యంత సాదాగా అనిపిస్తూనే ఒక అద్భుతమైన తత్త్వాన్ని మన కళ్లకు కడతాయి. ప్రాచీనసౌరభాలు వెదజల్లుతుతుంటాయి. ప్రాంతీయ పట్టణమైన కలకత్తా సాంస్కృతిక సంప్రదాయాల నుంచి స్ఫూర్తిపొందిన సబ్యసాచి ఆ వైభవాన్ని తన మేథాశక్తితో దుస్తుల మీద రూపొందిస్తుంటారు. అపూర్వమైన అల్లికతో కూడిన ఫ్యాబ్రిక్స్, ప్యాచ్ వర్క్స్, ఇతర అలంకారాలను సబ్యసాచి డ్రెస్ డిజైన్స్‌లో చూస్తాం. వెలకట్టలేని ఇతని డిజైన్స్ వేల రూపాయల నుంచి లక్షల్లో ధరపలుకుతున్నాయి. ఈ వైభవాన్ని కొద్దిపాటి మార్పులతో మీ చీరలకూ అద్దవచ్చు. -
రాష్ట్రపతి భవన్‌లా.. అసెంబ్లీ
డిజైన్ల కోసం అంతర్జాతీయ ఆర్కిటెక్ట్‌ల మధ్య పోటీ వాటిలో ఒకటి ఆర్కిటెక్ట్‌ల జ్యూరీ ఎంపిక చేస్తుంది ‘సాక్షి’తో సీఆర్డీఏ కమిషనర్ శ్రీకాంత్ వెల్లడి విజయవాడ బ్యూరో : ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్ స్థాయిలో అమరావతిలో నిర్మించే అసెంబ్లీ భవనాన్ని డిజైన్ చేయాలని ప్రఖ్యాత ఆర్కిటెక్ట్‌లను కోరామని సీఆర్డీఏ కమిషనర్ ఎన్.శ్రీకాంత్ చెప్పారు. ఈ డిజైన్ల కోసం ప్రపంచంలోని మూడు అత్యుత్తమ ఆర్కిటెక్ట్ బృందాల మధ్య పోటీ పెట్టినట్లు తెలిపారు. బుధవారం ఆయన ‘సాక్షి’తో మాట్లాడుతూ రాజధాని నగరంలో నిర్మించే ప్రభుత్వ భవనాల సముదాయంలో అసెంబ్లీ, హైకోర్టు ప్రపంచ స్థాయిలో ఉండాలని ప్రభుత్వం భావిస్తోందని చెప్పారు. అందుకు తగ్గట్టుగా ఆ భవనాలను డిజైన్ చేసేందుకు కొద్దిరోజులుగా కసరత్తు చేసి ప్రపంచంలోని ఐదు అత్యుత్తమ ఆర్కిటెక్ట్ సంస్థలను గుర్తించామన్నారు. అందులో మూడింటిని పరిగణనలోకి తీసుకున్నట్టు చెప్పారు. నార్మన్ పోస్టర్, పాస్టర్ ప్లస్ పార్టన్స్, రోజర్ స్టర్క్ హార్పర్ ప్లస్ సంస్థలు అత్యుత్తమ ఆర్కిటెక్ట్ సంస్థలు కావడంతో వాటికి ఈ రెండు భవనాల డిజైన్లను తయారు చేయాలని సూచించామని తెలిపారు. సంస్కృతి, చరిత్ర, ఆధునికత ఉట్టిపడేలా... అమరావతి సంస్కృతి, చరిత్ర, ఆధునికత ఉట్టిపడేలా డిజైన్లు తయారు చేయాలని పలు కొలమానాలు ఇచ్చామని, ఈ నెలాఖరులోపు ఈ సంస్థలు వాటిని ఇవ్వాల్సి ఉంటుందని శ్రీకాంత్ వివరించారు. ఈ మూడు సంస్థల మధ్య డిజైన్ల రూపకల్పనలో పోటీ పెట్టామని, ఉత్తమ డిజైన్‌ను రూపొందించిన సంస్థను ముగ్గురు సభ్యుల ఆర్కిటెక్ట్‌ల జ్యూరీ ఎంపిక చేస్తుందని తెలిపారు. ఈ జ్యూరీలోనూ దేశ, విదేశాల్లోని ప్రఖ్యాత ఆర్కిటెక్ట్‌లు ఉన్నారని చెప్పారు. డిజైన్ ఎంపిక చేయడానికీ పలు ప్రమాణాలను నిర్దేశించామన్నారు. పోటీ పడే మూడు సంస్థలకు అద్భుతమైన ట్రాక్ రికార్డ్ ఉందన్నారు. జర్మన్ పార్లమెంటు భవనం, స్పెయిన్‌లోని బిల్‌బావొలో ఉన్న గెగెన్‌హీమ్ మ్యూజియాన్ని ఈ సంస్థలు డిజైన్ చేశాయని తెలిపారు. గెగెన్‌హీమ్ మ్యూజియం ఏర్పాటు తర్వాత బిల్బావొ అంతర్జాతీయ పర్యాటక కేంద్రంగా మారిందన్నారు. ఎంపికైన ప్రతిపాదిత డిజైన్‌ను ప్రభుత్వం ఆమోదించిన తర్వాత దాని పూర్తి డిజైన్‌ను రూపొందించేందుకు సంబంధిత సంస్థకు 12 నెలల సమయం పడుతుందన్నారు. ఇది అతి తక్కువ సమయమని చెప్పారు. ప్రభుత్వ భవనాల సముదాయంలోని మిగిలిన సచివాలయం, రాజ్‌భవన్ ఇతర కట్టడాల డిజైన్ల తయారీ బాధ్యతను దేశంలోని ప్రముఖ ఆర్కిటెక్ట్‌లకు అప్పగిస్తామన్నారు. రెండు వారాల్లో తుది మాస్టర్‌ప్లాన్ సిద్ధ.... రాజధాని తుది మాస్టర్‌ప్లాన్ రెండు వారాల్లో సిద్ధమవుతుందని కమిషనర్ తెలిపారు. సింగపూర్ ప్రభుత్వ సంస్థల ప్లాన్‌లో స్థానిక పరిస్థితులు, ఇతర అంశాల ఆధారంగా మార్పులు, చేర్పులు జరుగుతున్నాయని చెప్పారు. తుది ప్లాన్‌ను ప్రభుత్వం ఆమోదించిన తర్వాత దానిపై 30 రోజులపాటు ప్రజాభిప్రాయం సేకరిస్తామన్నారు. దాన్నిబట్టి తుది మాస్టర్‌ప్లాన్ నోటిఫికేషన్ విడుదల చేస్తామని చెప్పారు. దీని తర్వాత మౌలిక సదుపాయాల మాస్టర్‌ప్లాన్‌ను తయారు చేయాల్సి ఉందన్నారు. రాజధానిలోని అన్ని అవసరాలకు సంబంధించిన ఈ ప్లాన్‌ను కూడా విదేశీ సంస్థలకు అప్పగిస్తామని, దీన్ని తయారు చేసే యంత్రాంగం, ఇంజనీర్లు మన దగ్గర లేరని తెలిపారు. ఇది కూడా పూర్తయిన తర్వాత రాజధాని ప్రాజెక్టు అభివృద్ధి మ్యాప్ పూర్తిస్థాయిలో తయారైనట్లని వివరించారు. ఈ రెండూ పూర్తయిన తర్వాత రాజధాని నిర్మాణ పనులు ప్రారంభమయ్యే అవకాశం ఉందన్నారు. రాజధానిలో రైతులకిచ్చే ప్లాట్ల సైజుపై ఇంకా నిర్ణయం జరగలేదని తెలిపారు. -
కార్తీకం కట్టు
కార్తీకంలో చీకటిని చీల్చడానికి దీపాలు వెలుగులు విరజిమ్ముతుంటాయి. ఆ వెలుతురులో చలి ముసుగేసుకుంటుంది. పెళ్లి వేడుకలు కూడా ఈ కాలంలో ఎక్కువే. డిజైనర్ దుస్తులు సరే, చలిని తట్టుకోవాలంటే ఎలా? వాటి మీద స్వెటర్ వేసుకోవాలా! అనేవారికి మహత్తరమైన ఆలోచనలతో ప్రసిద్ధ డిజైనర్స్ కొత్త కొత్త మోడల్స్‌ను మన ముందుకు తీసుకువస్తున్నారు. ఆ కొత్త డిజైనర్ దుస్తుల్లో మెరిసిపోండి. చలిని దూరంగా తరిమేయండి. వెచ్చగా వివాహ వేడకల్లో దీపాకాంతిలా వెలిగిపోండి. చలికాలం పెళ్లి వేడుకలు ఓ రమణీయకాంతిని కళ్లకు కడతాయి. దీపాల వెలుగుల్లో ఎంతో అందంగా మెరిసిపోవచ్చు అతివలంతా ముచ్చటపడిపోతుంటారు. అయితే వారి ఆనందాన్ని తగ్గించడానికా అన్నట్టు చలి వణికించేస్తుంటుంది. శాలూవాతో అందమైన డ్రెస్సులను కప్పేయకుండా డ్రెస్సులనే చలిని తరిమేసేలా డిజైన్ చేస్తే... చలికే వణుకుపుట్టడం ఖాయం. బ్రైట్ కలర్స్ చలికాలం మూడ్స్ కాస్త డల్‌గా ఉంటాయి. హుషారు తెప్పించాలంటే మాంచి కలర్‌ఫుల్ దుస్తులను ఎంపిక చేసుకోవాలి. పసుపు, ఎరుపు, పచ్చ, నీలం.. కాంతివంతమైన రంగులను ఎంచుకోవాలి. వేసవి కాలం హెవీ ఎంబ్రాయిడరీ దుస్తులను ధరించి సౌకర్యంగా ఉండలేరు. కానీ, చలికాలం ఎంత హెవీ ఎంబ్రాయిడరీ దుస్తులైనా అట్రాక్ట్ చేస్తూనే ఉంటాయి. లాంగ్ స్లీవ్స్ - హై నెక్స్... శారీ, అనార్కలీ సూట్, లెహంగా... సంప్రదాయ దుస్తులు ఏవైనా ఫుల్ స్లీవ్స్ ఈ కాలానికి మంచి ఎంపిక. ఇది ప్రస్తుత ట్రెండ్. భారతీయ ప్రసిద్ధ ఫ్యాషన్ డిజైనర్ సబ్యసాచి ముఖర్జీ, రోహిత్‌బాల్, మనీష్‌మల్హోత్రా... వింటర్ బ్రైడల్ వెడ్డింగ్ దుస్తులకు ఎక్కువగా ఫుల్ ఎంబ్రాయిడరీ స్లీవ్స్, అందంగా అలంకరించిన హై నెక్ డిజైన్స్‌పై ప్రధాన దృష్టి ఉంచుతారు. బెనారస్ టు వెల్వెట్స్... లెహంగాలకే కాదు బ్లౌజ్‌లకూ చలికాలం వెల్వెట్ మంచి ఎంపిక. చలికి వెచ్చదనాన్ని ఇచ్చే వెల్వెట్ క్లాత్ మీద చేసిన జరీ ఎంబ్రాయిడరీ వర్క్ చూపు తిప్పుకోనివ్వదు. లెహంగా, శారీ.. రెండింటిపైనా ఈ తరహా బ్లౌజ్‌లను వాడచ్చు. సెలబ్రిటీల శారీస్, వెడ్డింగ్ డ్రెస్ ఫొటోగ్రఫీని చూస్తే ఈ విషయం మీకే స్పష్టం అవుతుంది. పొరలు పొరలుగా... చలిని అందంగా తిప్పికొట్టాలంటే చక్కని ఐడియా లేయర్ దుస్తులఎంపిక. అమెరికాలో చలిని తట్టుకోవడానికి స్వెటర్, జాకెట్, షాల్, స్క్రార్ప్.. ఇలా ఒకదానిమీద ఒకటి ఎలా ధరిస్తారో.. ఇదే థీమ్‌తో మీ వెడ్డింగ్ వేర్‌ను డిజైన్ చేయించుకోవచ్చు. బాలీవుడ్ తారల వెడ్డింగ్ డ్రెస్, వింటర్ ఫ్యాషన్ షోలను చూస్తే మీకే అర్థమవుతుంది. పొరలు పొరలుగా ఉండేలా పట్టు, బెనారస్, వెల్వెట్, నెటెడ్, షిఫాన్... మిక్సింగ్‌లతో లెహంగాలను, అనార్కలీలను రూపుకట్టవచ్చు. షార్ట్ లెంగ్త్ ఫుల్లీ ఎంబ్రాయిడరీ జాకెట్ వేసుకొని, దాని మీద మరో లాంగ్ లెంగ్త్ జాకెట్ ధరిస్తే స్టైల్‌గా మెరిసిపోవచ్చు. వింటర్లో వెచ్చగా ఉండచ్చు. ఇతర అలంకరణలోనూ... వివాహ వేడుకల్లో ఇతర అలంకరణ వస్తువుల్లోనూ ఎంబ్రాయిడరీ ప్రధాన ఆకర్షణగా నిలుస్తోంది. ఇవి మార్కెట్లో ఆకర్షణీయమైన డిజైన్లలో లభిస్తున్నాయి. అలాగే క్లచ్‌లు ధరించిన దుస్తుల డిజైన్లకు, రంగులకు సరిపోయేవి ఎంపిక చేసుకోవాలి. - ఎన్.ఆర్ -
పిల్లల కోసం ప్రత్యేకం
హైదరాబాద్: చిన్నారుల కోసం ప్రత్యేకమైన గది ఉంటేనే ‘మా ఇల్లు అందమైన హరివిల్లు’ అని పాడుకోవచ్చు. చిన్నారుల ఆలోచనలు, ఆసక్తిలను గమనించిన నేటితరం తల్లిదండ్రులు పిల్లల కంటూ ప్రత్యేకమైన గదిని కేటాయిస్తున్నారు. అంతేకాదు ఆ గదిలో చిన్నారుల సృజనాత్మక శక్తిని మేల్కొలిపే విధంగా, వారిలో ఉత్సాహాన్ని, ఉల్లాసాన్ని కలిగించేలా తీర్చిదిద్దుతున్నారు. చిన్నారుల గది డిజైన్‌లో తీసుకోవాల్సిన జాగ్రత్తలివే.. చిన్నారులు గదిలో ఆడడం, చదవడం, నిద్రపోవడం లాంటివి చేస్తారు. అదే వాళ్ల ప్రపంచం. వారిని ఆకట్టుకునేలా ముదురు రంగులు వాడటమే కాకుండా గోడల మీద రకరకాల డిజైన్లు వేయడం, ఒకే గోడ మీద రెండు రంగులు వేయడం చేయవచ్చు. పిల్లల గదుల్లో రంగులు, అలంకరణ వారికి ఆహ్లాదం కలిగించేలా ఉండాలి. గదంతా కార్టూన్లతో నింపకుండా ఒకే గోడకు మాత్రమే కార్టూన్లకు కేటాయిస్తే సరిపోతుంది. చిన్నారుల కోసం ఫర్నిచర్, మంచం లాంటివి కొనేప్పుడు అందంతో పాటు పిల్లల భద్రత, సౌకర్యాలకు కూడా ప్రాధాన్యమివ్వాలి. మంచంపై బెడ్ మరీ గట్టిగా ఉండకుండా చూసుకోవాలి. కొద్దిగా మెత్తగా ఉంటే పిల్లలు ఇష్టంగా ఎక్కువసేపు నిద్రపోవడానికి అవకాశం ఉంటుంది. పిల్లల పుస్తకాల కోసం ప్రత్యేకంగా ఒక స్థలాన్ని కేటాయించి, చక్కటి ఆల్మరాను పెట్టించడం మంచిది. పిల్లలను ఆకట్టుకోవడంలో రంగులు ప్రధాన పాత్ర పోషిస్తాయి. మానసిక శాస్త్రవేత్తల అంచనాల ప్రకారం చిన్న పిల్లలు ఎరుపు, నీలం, పసుపు రంగులను ఇష్టపడతారు. ఇవి కాకుండా ఆకుపచ్చ, పర్పుల్‌లు కూడా ఓకే. ఇక వయొలెట్, పింక్‌లు కూడా పర్వాలేదు. అన్నింటికన్నా ముఖ్యం మీ చిన్నారి ఏ రంగుని ఇష్టపడుతున్నాడు అనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. మొత్తం అంతా ఒకే రంగు కాకుండా గదిలో వేర్వేరు చోట్ల వేర్వేరు రంగులను నింపడం ద్వారా అందాన్ని తేవచ్చు. స పిల్లలకు ఇష్టమైన కార్టూన్ క్యారెక్టర్లను గోడలపై చిత్రించడం ద్వారా వారికి ఆనందాన్ని కలుగచేయవచ్చు. రాత్రిళ్లు నిద్రపోయే ముందు లైట్స్ ఆఫ్ చేస్తే పిల్లలు కొత్తల్లో భయపడే అవకాశం ఉంది. సీలింగ్‌కు చీకట్లో కూడా మెరిసే విధంగా ఉండే మెటాలిక్ రంగులు లేదా స్టెన్సిల్‌తో పెయింటింగ్‌లు వేస్తే చీకట్లో కూడా హాయిగా నిద్రపోతారు. పిల్లల గదిలో కంటికి శ్రమ కలిగించని ఫ్లోరోసెంట్ బల్బులను వాడాలి. లైటింగ్ స్టాండ్లు కూడా వంకీలు లేదా ఇతర డిజైన్లతో ఉంటే పిల్లలను ఆకట్టుకుంటాయి. అయితే కంటిపై ఎలాంటి ప్రభావం చూపకుండా, చదువుకొనేటప్పుడు ఇబ్బంది కలగకుండా ఉండే విధంగా చూసుకోవాలి. -
అభిమానికి నాగార్జున గిఫ్ట్
ఎంతో కష్టపడి తన కోసం ఒక డిస్ప్లే పిక్చర్ (డీపీ)ని తయారుచేసిన అభిమానికి సీనియర్ హీరో అక్కినేని నాగార్జున ఓ అద్భుతమైన గిఫ్ట్ ఇచ్చాడు. అభిమాని రూపొందించిన ఫొటోనే తన ట్విట్టర్ ఖాతా ప్రొఫైల్ పిక్చర్‌గా మార్చి ఆ అభిమానిని సంతోషపెట్టాడు. అంతేకాదు.. అదే విషయాన్ని తన ట్వీట్లో కూడా పేర్కొన్నాడు. ఈ డీపీలో నాగార్జున నటించి చిత్రాల్లో ఆయన వేసిన వివిధ పాత్రల ఫొటోలు అన్ని ఒకే దగ్గర వచ్చేలా ఆ అభిమాని తీర్చిదిద్దాడు. సెపియా కలర్లో డాటెడ్ ఫొటోలతో చేసిన ఆ ఫొటో.. నాగార్జునను ఎంతగానో ఆకట్టుకుంది. అభిమానులు ఎంతో సమయం కేటాయించి ఇంతమంచి డిజైన్ని రూపొందించినందుకు కృతజ్ఞతలు అంటూ నాగార్జున ట్వీట్ చేశారు. ప్రస్తుతం నాగార్జున నటిస్తున్న 'సోగ్గాడే చిన్నినాయన' చిత్రం నిర్మాణదశలో ఉంది. ఈ చిత్రంలో నాగార్జున మేనకోడలిగా బుల్లితెర యాంకర్ అనసూయ నటిస్తున్న విషయం తెలిసిందే. మరోవైపు మెగా స్టార్ చిరంజీవికి 60 వ జన్మదినోత్సవ సందర్భంగా ట్విట్టర్ ద్వారా నాగార్జున తన శుభాకాంక్షలు తెలిపారు. ఆయన జీవితం సంతోషం ఉండాలని ఆకాంక్షించారు. Thank you my fans for taking the time out to design this DP. pic.twitter.com/jIRU43M3gN — Nagarjuna Akkineni (@iamnagarjuna) August 22, 2015 -
చేవేళ్ల ప్రాజెక్టు డిజైన్ మార్చితే సహించం
-
’ప్రాణహిత డిజైన్ మార్పును వ్యతిరేకిస్తున్నాం’
-
ప్లెయిన్ పవర్
సండే టు మండే... వారమేదైనా.. పెళ్లి.. పుట్టినరోజు.. గెట్ టు గెదర్.. పార్టీ ఏదైనా.. మొఘల్ రాచరికపు హంగులు అడుగడుగునా కనువిందు చేస్తూ కాలాలకు అతీతంగా ఇంకా ఇంకా అందంగా ముస్తాబు అవుతూనే ఉంది అనార్కలి. అతివల హృదయాలను దోచుకుంటూనే ఉంది అనార్కలి. కంటికి ఆహ్లాదాన్ని పంచే లేలేత రంగుల అనార్కలి వేసవి కాలపు వేడుకలకు ఓ ప్రత్యేక ఆకర్షణ. పాల తరగలాంటి మేని సౌందర్యాన్ని మరింత ఇనుమడింపజేసేవి లేలేత రంగులు. గాడీగా డిజైన్ లేకుండా అందాన్ని రెట్టింపు చేస్తూ వేడుకలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచే ఈ అనార్కలి డ్రెస్సులు అతివల పవర్‌ని హుందాగా చూపుతాయి. అనార్కలి డ్రెస్ డిజైన్ చేయడానికి ముందు కొన్ని జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలంటున్నారు డిజైనర్లు. అవి... డ్రెస్ స్టైల్, డిజైన్, కలర్, ఫ్యాబ్రిక్, ఆకర్షణీయమైన ఎంబ్రాయిడరీ. ముందుగా ఈ ఐదింటిని దృష్టిలో పెట్టుకోవాలి. శాటిన్, షిఫాన్, నెట్, క్రేప్స్, జార్జెట్స్, సిల్క్, బ్రొకేడ్.. ఈ ఫ్యాబ్రిక్ అనార్కలి సూట్స్ మిగతా వాటితో పోల్చితే మరింత ఆకర్షణీయంగా ఉంటాయి. ‘గ’ నెక్ అనార్కలి సూట్స్ సాధారణ ఎత్తు గలవారికి బాగా నప్పుతాయి. పొడువుగా ఉన్నవారు ఏ తరహా నెక్ స్టైల్ అయినా వేసుకోవచ్చు. హైట్ తక్కువ ఉన్నవారు ఎక్కువ ఫ్రిల్స్ (కలీ) లేని అనార్కలిని ఎంచుకోవాలి. నడుము కింది భాగం మరీ ఎక్కువ కుచ్చులతో ఉంటే, లావుగా కనిపించే అవకాశాలు ఎక్కువ. పొడవుగా ఉండేవాళ్లు ‘నీ లెంగ్త్’ అనార్కలీలకు దూరంగా ఉండాలి. మోకాలికి రెండు అంచుల కిందకు టాప్ వేసుకొని, హై హీల్స్ ధరిస్తే స్టైల్‌గా కనిపిస్తారు. అనార్కలీనే పెద్ద అలంకరణ. అందుకని వీటి మీదకు చేసుకునే అలంకరణ మరీ ఎక్కువ గాడీగా ఉండకూడదు. సంప్రదాయ తరహాకు చెందిన చెవి లోలాకులు లేదా జూకాలు ధరిస్తే చాలు అలంకరణ పూర్తయినట్టే. వివాహ వేడుకలకు ధరించే అనార్కలిని బ్రొకేడ్‌తో తీర్చిదిద్ది నెక్ విశాలంగా తీసుకుంటే మంచిది. ప్రశాంతంగా అనిపించే లేత రంగులు, లైట్ ఎంబ్రాయిడరీ సాధారణ వేడుకలకు బాగా నప్పుతాయి. - షబ్నంషిక్కా, ఫ్యాషన్ డిజైనర్ జరీ, సీక్వెన్స్, లేస్లతో అధికంగా ఎంబ్రాయిడరీ చేసిన పెళ్లికూతుళ్లు ఎంచుకోవాలి. క్యాజువల్‌గా అనార్కలి ధరించాలనుకునేవారు ఎలాంటి జరీ వర్క్ లేనివి ఎంచుకోవాలి. అయితే థ్రెడ్ వర్క్ ఎప్పుడూ సరైన ఎంపిక. -
పోలా.. అదిరిపోలా..!
హైదరాబాద్: ఇలాంటి టెన్నిస్ కోర్టు మీరెక్కడైనా చూశారా? సముద్ర గర్భంలో పైన చేపలు తిరుగుతుంటే.. కిందన క్రీడాకారులు టెన్నిస్ ఆడుతుంటే.. చూడ్డానికి బాగుంటుంది కదూ.. ఇదే ఆలోచన పోలండ్‌కు చెందిన డిజైనర్ కొటాలాకు వచ్చినట్లుంది. దీంతో దుబాయ్ సముద్రగర్భంలో నిర్మించేందుకు వీలుగా ఈ టెన్నిస్ కోర్టు డిజైన్‌ను రూపొందించాడు. తన కలను సాకారం చేసుకునేందుకు పెట్టుబడి పెట్టేవారి కోసం ఎదురుచూస్తున్నాడు. చూడ్డానికి బాగానే ఉంది కానీ.. దీనికి చాలా ఖర్చవుతుందని, భారీ చేపలు వంటివి తిరగడం వల్ల క్రీడాకారుల ఏకాగ్రత దెబ్బతింటుందని నిపుణులు చెబుతున్నారు. -
'తోడు' దొంగ!
పట్టిసీమలో 11 మీటర్ల మట్టం వద్ద నీటిని తోడేలా డిజైన్ జీవోలో మాత్రం గోదావరిలో కనీస మట్టం 14 మీటర్లు ఉన్నప్పుడే తోడాలని ఉత్తర్వులు 'సీడీవో'కు చేరిన '11 మీటర్ల' డిజైన్.. నేడో రేపో ఆమోదం! హైదరాబాద్: ‘గోదావరి నదిలో నీటి మట్టం 12.5 మీటర్లు ఉన్నప్పుడు నీటిని లిఫ్ట్ చేయడానికి పట్టిసీమ లిఫ్ట్‌ను డిజైన్ చేశారు. కానీ నీటిని తోడేందుకు ఉపయోగించే 'ఫుట్ వాల్వ్'ను మాత్రం 11 మీటర్ల వద్ద ఏర్పాటు చేస్తున్నారు. అంటే.. గోదావరి 11 మీటర్ల వద్ద ప్రవహిస్తున్నప్పుడు కూడా నీటిని తోడడానికి ఆస్కారం ఉంటుంది. ఈ 'డిజైన్'ను కాంట్రాక్టర్ 'సెంట్రల్ డిజైన్స్ ఆర్గనైజేషన్'(సీడీవో)కు పంపారు. సీడీవో ఆమోదించాక డిజైన్‌కు అనుగుణంగా కాంట్రాక్టర్ నిర్మాణ పనులు ప్రారంభిస్తారు. నేడో రేపో 11 మీటర్ల డిజైన్‌కు సీడీవో ఆమోదముద్ర వేయనున్నట్లు సమాచారం. గోదావరి డెల్టాకు నష్టం ఎలా? ధవళేశ్వరం బ్యారేజ్ నుంచి తూర్పు, మధ్య, పశ్చిమ డెల్టాకు నీరందించేవి మూడు ప్రధాన కాల్వలున్నాయి. బ్యారేజ్ జలాశయం లెవల్ 13.67 మీటర్లు. మూడు కాల్వలకు జోరుగా నీరందించాలంటే(ఫుల్ సప్లై లెవల్) గోదావరిలో 14 మీటర్ల వద్ద ప్రవాహం ఉండాలి. అంత కన్నా తక్కువగా ఉంటే మూడు ప్రధాన కాల్వలకు వేగంగా నీరు పారదు. గోదావరిలో వరదలు ఉండే 40 నుంచి 60 రోజుల మధ్య కాలంలో మాత్రం ఫుల్ సప్లై లెవల్‌కు ఇబ్బంది ఉండదు. మిగతా రోజుల్లో సమస్య ఉంటుంది. ధవళేశ్వరం ఎగువన పట్టిసీమ వద్ద నిర్మిస్తున్న లిఫ్ట్ ‘ఫుట్ వాల్వ్’ 11 మీటర్ల వద్ద ఉంటుంది. 11 మీటర్ల మట్టం వద్ద 8,500 క్యూసెక్కుల సామర్థ్యంలో నీటిని తోడితే ఫుల్ సప్లై లెవల్‌కు విఘాతం కలుగుతుంది. ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద ‘ఫుల్ సప్లై లెవల్’ ఉండే రోజులు తగ్గిపోతే.. గోదావరి డెల్టాకు నీరందక పంటలు ఎండిపోతాయి. గోదావరిలో 11 మీటర్ల నీటిమట్టం వద్ద నుంచే నీటిని లిఫ్ట్ చేస్తే వేగంగా ప్రవాహం లేకుంటే జలాశయం ఖాళీ అవుతుంది. డిజైన్ 14 మీటర్లకు మారుస్తామని చెప్పి నెల పట్టిసీమ లిఫ్ట్ డిజైన్‌ను 14 మీటర్లకు మారుస్తామని గత మార్చి 29న ప్రాజెక్టుకు సీఎం చంద్రబాబు శంకుస్థాపన చేసిన సందర్భంగా ప్రభుత్వం పేర్కొంది. అయితే నెల రోజులు గడిచినా డిజైన్‌ను మారుస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇవ్వలేదు. మరోవైపు ‘డిజైన్’కు ఆమోదం తెలపాల్సిన ‘సీడీవో’కు కూడా ఈ విషయాన్ని చెప్పలేదు. డిజైన్‌ను 14 మీటర్లకు మారిస్తే లిఫ్ట్ నిర్మాణ వ్యయం కనీసం రూ. 25 కోట్లు తగ్గుతుందని అధికారులు చెబుతున్నారు. లిఫ్ట్ నిర్వహణకు అవసరమైన విద్యుత్ వినియోగం కూడా తగ్గుతుంది. కానీ ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా ‘14 మీటర్ల’ విషయాన్ని పక్కన పెడుతోంది. -
సర్కారులోనూ వ్యతిరేకత
-
పాత డిజైనే ప్రాణ‘హితం’!
రాష్ట్ర ప్రభుత్వానికి రిటైర్డ్ ఇంజనీర్ల బృందం సూచన {పాజెక్టుపై రూపొందించిన నివేదికలో వెల్లడి మహారాష్ట్ర కోరినట్లు మీటర్ ఎత్తు తగ్గించి తుమ్మిడిహెట్టి నుంచే నీటి మళ్లింపు చేయాలని సూచన 20-30 టీఎంసీలు తగ్గితే.. వేమనపల్లి వద్ద బ్యారేజీ నిర్మించి వాడుకోవచ్చని ప్రతిపాదన ఇలాచేస్తేనే ఇప్పటిదాకా జరిగిన పనులు వృథా కావని హితవు హైదరాబాద్: ప్రతిష్టాత్మక ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టును పాత డిజైనే శ్రేయస్కరమని గోదావరి ప్రాజెక్టుల పరిశీలనకు ప్రభుత్వం నియమించిన రిటైర్డ్ ఇంజనీర్ల బృందం తేల్చింది. కావాలంటే మహారాష్ట్ర కోరుతున్నట్లుగా తుమ్మిడిహెట్టి బ్యారేజీ ఎత్తును ఒక మీటరు మేర తగ్గించి.. నీటిని మళ్లించుకోవడమే మేలని స్పష్టం చేసింది. ఎత్తు తగ్గింపుతో నిర్ణీత స్థాయిలో నీటిని తీసుకోలేకపోతే... మిగ తా నీటిని ప్రాణహితకు దిగువన ఉన్న వేమనపల్లి వద్ద బ్యారేజీ నిర్మించి మళ్లించుకోవచ్చని సూచించింది. ఇలాచేస్తే ఇప్పటివరకు జరిగిన దాదాపు రూ. 4 వేల కోట్ల విలువైన పనులు వృథా కావని రిటైర్డ్ ఇంజనీర్ల బృందం తమ నివేదికలో తేల్చిచెప్పినట్లు సమాచారం. ఘనమైన ప్రాజెక్టు.. గోదావరి నది నుంచి 160 టీఎంసీల నీటిని మళ్లించి.. సుమారు 16 లక్షల ఎకరాలకు సాగునీటిని అందించడంతో పాటు పథకం పొడవునా గ్రామాలకు, రాజధానికి తాగునీరు అందించడం కోసం రూ. 38,500 కోట్ల అంచనా వ్యయంతో ‘ప్రాణహిత-చేవెళ్ల’ భారీ ప్రాజెక్టును చేపట్టారు. ఈ ప్రాజెక్టులో భాగంగా ఆదిలాబాద్ జిల్లా తుమ్మిడిహెట్టి వద్ద 152 మీటర్ల ఎత్తుతో బ్యారేజీ నిర్మించి.. అక్కడి నుంచి ఎల్లంపల్లికి, మిడ్‌మానేరుకు నీటిని మళ్లించి, ఆ తర్వాత హైదరాబాద్ మీదుగా చేవెళ్ల వరకూ నీటిని తరలించనున్నారు. అయితే తుమ్మిడిహెట్టి బ్యారేజీతో తమ ప్రాంతంలో ముంపు ఎక్కువగా ఉంటుందని, ఎత్తు తగ్గించాలని మహారాష్ట్ర కోరడంతో... ప్రాజెక్టు డిజైన్‌ను మార్చాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులోభాగంగా తుమ్మిడిహెట్టి వద్ద నుంచి కాకుండా.. 110 కిలోమీటర్ల దిగువన ఉన్న కాళేశ్వరం సమీపంలోని మేటిగడ్డ వద్ద నీటిని మళ్లించాలనే ప్రతిపాదన తెరపైకి వచ్చింది. ఈ డిజైన్ మార్పుపై అధ్యయనం చేసే పనిని వ్యాప్కోస్ సంస్థకు అప్పగించింది. ఇక మరోవైపు గోదావరిలో లభ్యత నీటిని పూర్తిస్థాయిలో వినియోగించుకునేందుకు వీలుగా అదనపు బ్యారేజీల నిర్మాణం, ప్రాజెక్టుల పరిధిలో చేయాల్సిన రీ డిజైనింగ్ తదితర అంశాల పరిశీలన కోసం రాష్ట్ర ప్రభుత్వం ఏడుగురు రిటైర్డ్ ఇంజనీర్లతో ఒక బృందాన్ని ఏర్పాటు చేసింది. ఇటీవలే ఈ బృందం సభ్యులు అనంతరాములు, వెంకట్రామారావు, చంద్రమౌళి, దామోదర్‌రెడ్డి, శ్యాంప్రసాద్‌రెడ్డి, సాంబయ్య, జగదీశ్వర్ ప్రభుత్వ అధికారులతో కలిసి ప్రాణహిత ప్రాజెక్టు పనులను పరిశీలించారు. దీనిపై తమ ప్రతిపాద నలు, సూచనలతో కూడిన 14 పేజీల నివేదికను గురువారం నీటి పారుదల శాఖ ఉన్నతాధికారులకు అందజేశారు. పాత డిజైన్‌కే మొగ్గు! దుమ్ముగూడెం నుంచి ప్రాణహిత వరకు ఎక్కడెక్కడ అదనపు బ్యారేజీల నిర్మాణం చేపట్టాలనే దానిపై తమ 14 పేజీల నివేదికలో స్పష్టంగా వివరించిన కమిటీ... చివరి రెండు పేజీల్లో మాత్రం ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టు అంశాన్ని ప్రస్తావించింది. కొత్త ప్రతిపాదన అయిన కాళేశ్వరం వద్ద నీటి మళ్లింపునకు పూనుకుంటే.. విద్యుత్ అవసరం మరో 400 మెగావాట్ల మేర పెరుగుతుందని స్పష్టం చేసినట్లు సమాచారం. అంతేగాకుండా ఇప్పటివరకు బ్యారేజీ 152 మీటర్ల ఎత్తును పరిగణనలోకి తీసుకుని జరిగిన రూ. నాలుగు వేల కోట్ల విలువైన కాలువల పనుల భవితవ్యం ప్రశ్నార్థకంగా మారుతుందని అభిప్రాయపడినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో మహారాష్ట్ర కోరుతున్నట్లుగా బ్యారేజీ ఎత్తును ఒక మీటరు తగ్గించి, 151 మీటర్ల ఎత్తుకు మహారాష్ట్రను ఒప్పించాలని రిటైర్డ్ ఇంజనీర్ల బృందం సూచించింది. ఎత్తు తగ్గింపు వల్ల నిర్ణీత 160 టీఎంసీల నీటి మళ్లింపు సాధ్యంకాకుంటే... 130 టీఎంసీల వరకు తరలించి, మరో 30 టీఎంసీలను బ్యారేజీకి 70 కిలోమీటర్ల దిగువన ఉన్న వేమనపల్లి వద్ద మళ్లించవచ్చని తెలిపింది. దీనికోసం వేమనపల్లి వద్ద మరో బ్యారేజీ నిర్మాణం చేపట్టాలని పేర్కొంది. ఇలా చేస్తే ఎల్లంపల్లి తర్వాతి మూడు ప్యాకేజీలు యథావిధిగా ఉంటాయని బృందం పేర్కొన్నట్లుగా తెలిసింది. వ్యాప్కోస్ నివేదిక వచ్చాకే.. ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టు రీడిజైన్ బాధ్యతలను ప్రస్తుతం వ్యాప్కోస్‌కు అప్పగించినందున.. రిటైర్డ్ ఇంజనీర్ల బృందం నివేదికపై ప్రభుత్వం వెంటనే ఏ నిర్ణయానికీ రాలేదని నీటి పారుదల శాఖ వర్గాలు పేర్కొంటున్నాయి. వ్యాప్కోస్ నివేదిక అందాక.. రెండు నివేదికలను పరిశీలించి ప్రాజెక్టుపై ముందుకెళ్లే అవకాశం ఉందని తెలిపాయి. -
దుర్గగుడి వద్ద ఫ్లైఓవర్‌కు అంతా ఓకే..
అనుమతులొచ్చేశాయ్.. రెండో డిజైన్ వైపే మొగ్గు భవానీపురం లారీస్టాండ్ నుంచి రాజీవ్‌గాంధీ పార్కు వరకు.. రూ.250 కోట్లతో నిర్మాణం ఎంపీ కేశినేని నాని ప్రకటన ప్రతిపాదించిన రెండో డిజైన్ మేరకు 4.8 కిలోమీటర్ల మేర ఫ్లైఓవర్ నిర్మాణం ఉంటుందని, భవానీపురం లారీస్టాండ్ వద్ద ప్రారంభమై కార్పొరేషన్ కార్యాలయం, రాజీవ్‌గాంధీ పార్కు సమీపం వరకు డిజైన్ చేశామని నాని మంగళవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో స్పష్టం చేశారు. రైల్వేబ్రిడ్జి, రైల్వే అనుమతులకు కూడా ఎటువంటి ఆటంకాలు లేవని పేర్కొన్నారు. రాజీవ్‌గాంధీ పార్కు నుంచి కనకదుర్గ వారధి వరకు డబుల్ లైన్ రోడ్డు నిర్మాణం చేపట్టడం వల్ల దుర్గగుడి వద్ద ట్రాఫిక్ సమస్యకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని నాని వివరించారు. ఫ్లైఓవర్ నిర్మాణానికి సంబంధించిన గెజిట్ పత్రం కేంద్రం నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి ఫిబ్రవరి 17వ తేదీనే వచ్చిందని తెలిపారు. దీంతో సంబంధిత జాతీయ రహదారి శాఖ చీఫ్ ఇంజినీర్, నేషనల్ హైవే అథారిటీ వారికి రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఆదేశాలు అందాయని పేర్కొన్నారు. అలాగే, ఈనెల 30వ తేదీన ఆర్ అండ్ బీ (హైదరాబాద్) చీఫ్ ఇంజినీర్ నుంచి ఆర్ అండ్ బీ ఎన్‌హెచ్ విజయవాడ సర్కిల్ ఎస్ఈకి, నేషనల్ హైవే అథారిటీ విజయవాడ వారికి ఫ్లైఓవర్ పనులకు సంబంధించిన ఇన్వెంటరీ వివరాలను పంపించమని ఉత్తర్వులు జారీచేస్తూ జాతీయ రహదారి విభాగం చీఫ్ ఇంజినీర్ ఆదేశించారని తెలిపారు. త్వరలోనే ఫ్లైఓవర్ నిర్మాణ పనులను ప్రారంభించి నగర ప్రజల చిరకాల కోరిక తీర్చుతామని నాని హామీ ఇచ్చారు. సాయిల్ టెస్ట్ తరువాతే శంకుస్థాపన ఫ్లైఓవర్ నిర్మాణ పనులను ఆర్ అండ్ బీ విభాగమే చేపట్టాలని కేంద్రం నిర్ణయించింది. నిర్మాణం, డబుల్ లేన్‌కు అయ్యే సుమారు రూ.250 కోట్ల అంచనా వ్యయాన్ని మాత్రం కేంద్రమే భరించనుంది. ప్రస్తుతం అనుమతులు మంజూరైన రెండో డిజైన్‌కు సంబంధించి డీపీఆర్‌కు టెండర్లు పిలుస్తున్నారు. అది పూర్తి కాగానే, ఇంజినీర్లు సాయిల్ టెస్ట్ చేసిన మీదట ఫ్లైఓవర్ నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నట్లు సమాచారం. -
సిక్స్టీస్ సింగారం
ఇంతకాలం కాంట్రాస్ట్ కలర్స్ (భిన్నమైన రంగులు) ఇంపుగా అనిపించేవి. దీంతో ఇవే మన దక్షిణ భారతీయ ఫ్యాషన్లలో హల్చల్ చేశాయి. ఇప్పుడిక చాలా క్లోజ్డ్ కలర్స్(దగ్గరగా ఉండేవి) అంటే ఉదాహరణకు ఎరుపులో మరికొన్ని షేడ్స్‌ను తీసుకోవచ్చు. ఎరుపు, నారింజ, ముదురు ఎరుపు.. ఇలా తీసుకుంటూ వాటికి బంగారు జరీ పెద్ద అంచులను జత చేర్చి దుస్తులను డిజైన్ చేయడం వల్ల ఒక క్లాసిక్ లుక్ వస్తుంది. ఇక్కడ ఫొటోలలో ఉన్న లెహంగాలు, బ్లౌజ్‌లు.. రాజా రవివర్మ పెయింటింగ్స్‌ను స్ఫూర్తిగా తీసుకొని డిజైన్ చేసినవి. పట్టు ఫ్యాబ్రిక్ ఎప్పుడూ తన హుందాతనాన్ని, ప్రాభవాన్నీ కోల్పోదు. తరతరాల సంప్రదాయ కట్టుగా ఈ డిజైన్స్‌ని ముందుతరానికీ పరిచయం చేయవచ్చు. సెల్ఫ్ ఎంబ్రాయిడరీ పట్టు చీరలపైన అదే రంగుతో పెద్ద పెద్ద మోటిఫ్స్ సెల్ఫ్ (బూటా) ఎంబ్రాయిడరీ ఈ తరహా లుక్‌కి బాగా నప్పుతాయి. ఏ రంగు ఫాబ్రిక్ తీసుకున్నా దానికి పెద్ద పెద్ద జరీ అంచులను జతగా చేస్తే రిచ్ లుక్ వస్తుంది. పూలకు బదులుగా ముత్యాలు జుట్టు స్ట్రెయిటనింగ్ చేయించుకొని వదిలేయడం ఇన్నాళ్లూ ఓ స్టైల్‌గా నడిచింది. 1960-1970ల కాలంలో వాణిశ్రీ, సావిత్రి, జయలలితల కొప్పులు చాలా ప్రాచుర్యం పొందాయి. అలాంటి హెయిర్ స్టైల్‌నే ఇప్పుడూ అనుకరిస్తున్నారు. అలాగే పొడవాటి జడలు, ఫిష్ కట్ హెయిర్ స్టైల్ ఆకర్షణీయంగా మారుతున్నాయి. అయితే జడలు, కొప్పులలో పువ్వులు కాకుండా ముత్యాల దండ అమర్చడంతో చూడటానికి మరింత ఆకర్షణీయంగా ఉంటుంది. చేతికి కడియం, మట్టిగాజులు ఉండీ లేనట్టుగా చిన్న బొట్టు, అస్సలు లేకపోవడం వంటివి ఇన్నాళ్లూ చూశాం. ఇప్పుడు నుదుటన పెద్ద బొట్టు, చెవులకు పెద్ద పెద్ద బంగారు బుట్టలు; మెడలో పొడవాటి హారాలు కాకుండా మెడను పట్టి ఉంచే అచ్చమైన బంగారు నెక్లెస్ ... ఈ తరహా దుస్తుల మీదకు బాగా నప్పుతాయి. ఇన్నాళ్లూ మల్టీకలర్లో ఉండే గాజులు, చమక్కుమనిపించే రాళ్ల గాజులు వేసుకునేవారు. ఇప్పుడు ప్లెయిన్‌గా ఉండే మట్టిగాజులు, చేతికి (భుజానికి కిందుగా) నాజూకుగా అనిపించే పట్టీ కాకండా యాంటిక్ లుక్‌తో ఉండే కడియాన్ని అమర్చుకుంటే రవివర్మ తీర్చిదిద్దిన అందమైన చిత్రరాజంగా మీరే వేడుకలో హైలైట్‌గా నిలుస్తారు. - భార్గవి కూనమ్, ఫ్యాషన్ డిజైనర్