వారే...వ్వాల్
ఇంటిప్స్
వర్క్ ఏరియా, పిల్లలు ఆడుకునే ప్లేస్, చదువుకునే స్థలం ఏదైనా ఒకే గదిలో రకరకాల మూడ్స్‌ని క్రియేట్ చేయాలంటే మంచి ఛాయిస్ వాల్‌పేపర్స్. గోడకు వేసిన రంగును మార్చేయడం వీలు కావట్లేదు అనుకుంటే సింపుల్‌గా నచ్చిన వాల్‌పేపర్‌ని తెచ్చి అతికిస్తే సరి. లివింగ్ రూమ్, డైనింగ్ హాల్, బెడ్‌రూమ్... ప్రతి గదీ ఓ కొత్తగా కనిపించాలంటే డిజైన్‌లో, ప్యాట్రన్‌లో, రంగులో విభిన్న తరహాలలో ఉన్న వాల్‌పేపర్స్‌ని ఎంచుకోవాలి. సీజన్‌కు తగ్గ వాల్‌పేపర్స్ కంటికి, మనసుకు ఆహ్లాదాన్ని ఇస్తాయి. వాల్‌పేపర్స్‌పై పడిన మరకలు పోగొట్టడం చాలా సులువు. గోరువెచ్చని నీటిలో డిటర్జంట్ పౌడర్ వేసి స్పాంజితో అద్ది తుడవాలి. ఆ తర్వాత మెత్తని వస్త్రంతో తుడిస్తే, డల్ అయిన వాల్‌పేపర్స్ కొత్త కళతో మెరిసిపోతాయి.ఇద్దరు పిల్లలున్న ఇంట్లో చెరో గదిని కేటాయించడం వీలు కాకపోతే పార్టిషన్ చేసి వారికి నచ్చిన వాల్‌పేపర్‌తో కవర్ చేయడం సులువైన కిటుకు. కిచెన్, బాత్రూమ్స్ నీరు, చెమ్మ ఎక్కువగా తగిలే చోట్లు. అందుకని ఈ గదులలో వాల్‌పేపర్స్‌ని వాడకపోవడమే మంచిది.