Living Room
-
తక్కువ బడ్జెట్లో ఇంటి అలంకరణ.. వావ్ అనాల్సిందే!
పండగను ప్రత్యేకంగా జరుపుకోవాలనే తపన అందరిలోనూ ఉంటుంది. అందుకు తగినట్టుగా ఇంటి అలంకరణను ఎంచుకుంటారు. అయితే, పండగ కళ అందరికన్నా బాగా కనపడాలని కోరుకునేవారికి డెకార్ నిపుణులు ఈ సూచనలు చేస్తున్నారు. ఫ్యాబ్రిక్‌తో డిజైన్.. కర్టెన్లు, చీరలు, దుపట్టాలు లేదా ఏదైనా ఫాబ్రిక్‌ని ఉపయోగించి మీ లివింగ్‌రూమ్‌ని అందంగా మార్చుకోవచ్చు. ఇందుకు పండగ థీమ్‌తో బాగా సరియే డిజైన్ లేదా ప్రింట్‌ని ఎంచుకోవాలి. రంగవల్లికలైనా, ఇంటి అలంకరణలో డిజైన్ని మెరుగుపరచడానికైనా పువ్వులు, లైటింగ్ ఎంపికలు, బెలూన్ లను వాడచ్చు. గాలిపటం గాలిపటాలు ఎగురవేసిన జ్ఞాపకాలు మీలో ఉండే ఉంటాయి. అయితే, గాలిపటాలు ఎగురవేయడాన్ని మీ ఇంటి వెలుపలికి ఎందుకు పరిమితం చేయాలి? ఈసారి ఇంటిని పండగ కళ నింపేలా ఒక వాల్ని పతంగులతో అలంకరించండి. ఆకులతో.. భోగి, సంక్రాంతి శ్రేయస్సుకు వేడుకలు. అందుకే ప్రధాన రంగు ఆకుపచ్చ తప్పక ఉంటుంది. మామిడి ఆకులు పొంగల్ వేడుకలలో అత్యంత ముఖ్యమైన అంశాలలో ఒకటి. వీటిని మీ ద్వారం వద్ద వేలాడదీయచ్చు. మామిడి ఆకులు శుభప్రదానికి, సంతోషానికి సూచికలు. పర్యావరణ అనుకూలమైనవి. మామిడి ఆకులు, ఇతర పువ్వులతో కలిపి చేసే అలంకరణ కూడా చూడముచ్చటగా ఉంటుంది. వెదురు బుట్టలు కొన్నిరకాల చిన్న చిన్న బుట్టలను ఎంపిక చేసుకోవాలి. వాటి చివర్లను పువ్వులు లేదా ఇతర టాసిల్స్తో జత చేయాలి. వాటిని గొడుగులా ఔట్ డోర్ లేదా బాల్కనీ ఏరియాలో వేలాడదీయవచ్చు. తక్కువ బడ్జెట్ అలంకరణకు తక్కువ బడ్జెట్లో పర్యావరణకు అనుకూలమైనవి, తిరిగి భద్రపరుచుకునేవి ఎంపిక చేసుకుంటే పండగ సంబరం మరింత పెరుగుతుంది. ఇందుకు ఖరీదైన వస్తువులను కొనడం అవసరం లేదు. ప్రాథమిక అలంకరణలపై దృష్టి పెడితే చాలు. వాటిలో... స్కాచ్ టేప్, సేఫ్టీ పిన్స్ లేదా అతికించడానికి గ్లూ, కట్టర్ లేదా కత్తెర వంటివి సిద్ధం చేసుకోవాలి. ప్రతి ప్రయత్నమూ మిమ్మల్ని విసిగిస్తే సింపుల్‌గా బెలూన్లను ఎంపిక చేసుకోవచ్చు. వీటి నిర్వహణ కూడా పెద్ద కష్టం కాదు. రంగు రంగుల బెలూన్లు రెండు మూడు కలిపి, గుచ్చంలా వాల్కి ఒక్కో చోట అతికించవచ్చు. లేదా హ్యాంగ్ చేయవచ్చు. ప్రతి పూజలో పువ్వులు ముఖ్యమైన భాగం. కాబట్టి, మీ ఇంటికి కొన్ని తాజాపూలను ముందుగానే కొనుగోలు చేయండి. పూలతో ఎన్ని అలంకరణలైనా చేయచ్చు. పండుగలలో ఏదైనా తీపిని తినడం మంచి శకునంగా భావిస్తారు. అలాగే, స్వయంగా చేసినవైనా, కొనుగోలు చేసినవైనా కొన్ని రకాల తీపి పదార్థాలను అందుబాటులో ఉంచాలి. పండగ సమయాల్లో ప్రకాశంతమైన రంగు దుస్తులు బాగుంటాయి. వాటిలో మంచి పచ్చ, పసుపు, మెరూన్, పింక్.. ఎంచుకోవాలి. (క్లిక్ చేయండి: పండగ రోజు ట్రెడిషనల్ లుక్ కోసం ఇలా చేయండి..) -
Interior Decoration: తక్కువ ఖర్చుతో అదిరిపోయే లుక్.. పచ్చని టీపాయ్!
పచ్చదనం చూస్తే మనసు పరవశించకుండా ఉండదు. కాంక్రీట్ అరణ్యంలో బాల్కనీలను హరిత హారాలుగా మార్చి పచ్చని ముచ్చట తీర్చుకుంటూంటారు. అయితే, లివింగ్ రూమ్‌లోనూ పచ్చదనాన్ని ఆస్వాదించవచ్చు. అదీ గ్లాస్ టీపాయ్తో. అలా లివింగ్ రూమ్‌లోకి తొంగి చూసే ఆ కొత్త అందం గురించి.. గ్లాస్ టాప్ .. ఇండోర్ ప్లాంట్స్: గ్లాస్ టాప్ సెంటర్ టేబుల్స్ కొన్ని నగిషీలు అద్దుకుంటూ.. ఇంకొన్ని వంకీలతో వయ్యారాలు పోతూ ఆకట్టుకుంటూంటాయి. వాటికి పచ్చదానాన్నీ అద్దితే..!? ఇంటికి వచ్చిన అతిథులు పచ్చికలో టీ, కాఫీలను ఆస్వాదిస్తున్న అనుభూతిని సొంతం చేసుకోరూ! అందుకే టేబుల్ గ్లాస్ టాప్ కింది భాగంలో ఇండోర్ ప్లాంట్స్‌ను పెంచేలా సెట్ చేసుకుంటే సరి! ప్రకృతి దృశ్యాల సోయగం: ప్రకృతి పరచిన పచ్చిక బయళ్ల పచ్చని తివాచీని డ్రాయింగ్ రూమ్ నడుమ పరవాలనుకుంటే నేచురల్ గ్రాస్‌తో సెంటర్ టేబుల్‌ను అలంకరించుకోవాలి. ఈ అలంకరణకు సంబంధించిన ఆన్లైన్ క్లాసులూ నెట్టింట కొలువుదీరి ఉన్నాయి. రంగు రంగుల మొక్కలు: ఇండోర్ ప్లాంట్స్‌లో చాలా వరకు చిట్టి చిట్టి మొక్కలను ఎంపిక చేసుకుంటే మంచిది. వాటిల్లో మళ్లీ పసుపు, పచ్చ, లేత గులాబీ రంగు మొక్కలను పెట్టుకుంటే ఆ అందం.. గ్లాస్ నుంచి బయటకు మరింత శోభాయమానంగా కనువిందు చేస్తుంది. కృత్రిమ పూల సొగసు: రంగురంగుల పూల సొగసుకు సిట్టింగ్ ఏరియాలోనూ సీట్ ఆఫర్ చేయాలనుకుంటే ఆర్టిఫిషియల్ మొక్కలను గ్లాస్ సెంటర్ టేబుల్ లోపల అలంకరించవచ్చు. ఇందుకోసం రంగులు, పువ్వులు, డిజైనర్ మొక్కలను... అభిరుచి మేరకు ఎంపిక చేసుకోవచ్చు. ఇలా తక్కువ ఖర్చుతో సెంటర్ టేబుళ్లను పచ్చగా మార్చి ..ఇల్లంతా పాజిటివ్ ఎనర్జీని నింపొచ్చు.. అతిథుల ప్రశంసలనూ పొందొచ్చు! -
ఆకాశంలో లివింగ్ రూమ్
విమానాల్లో బిజినెస్ క్లాస్ అంటేనే కాస్త పర్సనల్ స్పేస్ ఎక్కువగా ఉంటుంది. ఇబ్బంది లేకుండా, సౌకర్యవంతంగా, ప్రశాంతంగా ప్రయాణించేలా సీట్లు, ఇతర సౌకర్యాలుంటాయి. కానీ అచ్చం ఇంట్లో లివింగ్ రూమ్‌లోనే ఉన్నామా అనిపించేలా క్యాబిన్ డిజైన్ చేస్తే! టీవీ, కర్టెన్లు, కార్పెట్లు, ఇతరత్రా ప్రత్యేక సౌకర్యాలుంటే! ఇలాంటి అద్భుతమైన క్యాబిన్లను సియాటెల్‌కు చెందిన డిజైన్ కంపెనీ టియాగ్యు, టెస్లా, ఒక్లహోమాకు చెందిన ఎయిరోస్పేస్ కంపెనీ నోర్డామ్ కలిసి రూపొందించాయి. ఈ డిజైన్‌కు‘ఎలివేట్’ అని పేరు పెట్టాయి. దీనికి సంబంధించిన ఫొటోలను తాజాగా విడుదల చేశాయి. జర్మనీలోని హాంబర్గ్‌లో ఈ ఏడాది జూన్‌లో జరిగే ఎయిర్‌క్రాఫ్ట్ ఇంటీరియర్స్ ఎక్స్‌పోలో ఈ డిజైన్లను ప్రదర్శించనున్నాయి. తక్కువలో ఎక్కువగా.. అద్భుతమైన వాల్ అటాచ్మెంట్స్, పెద్ద బెడ్ సైజు, లివింగ్ స్పేస్, వస్తువులు పెట్టుకునేందుకు స్థలం లాంటివి ప్రతి ప్రయాణికుడికి ఉండేలా డిజైన్ చేయడం ఇదే తొలిసారని ‘ఎలివేట్’ డిజైనర్లు తెలిపారు. ఈ ఇంటీరియర్‌కు విమానంలో ఎక్కువ స్థలం అవసరం ఏమీ ఉండదని, సీట్లు తగ్గించుకోవాల్సిన అవసరమూ రాదని చెప్పారు. పైగా డిజైన్‌లో వాడినవన్నీ తక్కువ బరువున్నవేనని వివరించారు. దీని వల్ల విమానంపై భారంపడదని, ఎక్కువ ఇంధనం ఖర్చవదని తెలిపారు. చిన్న విమానాల్లో కూడా ఎలివేట్ క్యాబిన్లను సులువుగా ఏర్పాటు చేసుకోవచ్చన్నారు. అందమైన క్యాబిన్లతో ప్రయాణికులకు అద్భుతమైన అనుభూతిని అందించడానికి.. ఎక్కువ స్థలం ఉండేలా, సౌకర్యవంతంగా అనిపించేలా, ప్రైవసీ ఉండేలా ఎలివేట్‌ను డిజైన్ చేశామని చెప్పారు. – సాక్షి సెంట్రల్ డెస్క్ -
సర్దుబాటుతో.. విశాలంగా!
ఇంట్లో స్థలాన్ని ఎలాగూ పెంచలేం. అలాగనీ అవసరాలకు తగ్గ ఫర్నిచర్‌ను సమకూర్చుకోకుండా ఉండలేం కదా? ఉన్నంతలో స్థలాన్ని సద్వినియోగం చేసుకోవడమే ఇందుకు పరిష్కారం. దాని కోసం కొన్ని చిట్కాలు పాటిస్తే చాలు.. తలుపు తీయగానే పెద్దపెద్ద వస్తువులు కన్పిస్తే.. మీ ఇల్లు చిన్నదిగా కన్పిస్తుంది. లివింగ్ రూమ్ ప్రవేశ ద్వారం ముందు పెద్ద మొత్తంలో ఫర్నిచర్ ఉండకుండా చూసుకోవాలి. ⇒ లివింగ్ రూమ్‌కు ఉన్న ద్వారాల మధ్య తిరగడానికి ఎలాంటి అవాంతరాలు లేకుండా చూసుకోండి. అంటే.. మధ్యలో కుర్చీలు ఉంటే వాటి చుట్టూ తిరిగి వెళ్లడం లాంటివి అన్నమాట. ⇒ సోఫాలు, కుర్చీలన్నింటినీ ఒకే వరుసలో, గోడకు పక్కన ఏర్పాటు చేయకండి. సీట్లు ఒకదానికొకటి ఎదురెదురుగా, కనీసం నాలుగు నుంచి పది అడుగుల దూరంతో ఉంటే బావుంటుంది. ⇒ బరువుగా ఉండే ఫర్నిచర్ మొత్తాన్ని గదిలో ఒకే వైపు పెట్టొద్దు. ఇలా చేస్తే సీటింగ్ ఏర్పాటులో సమతుల్యత దెబ్బతింటుంది. ⇒ కాఫీ టేబుల్, సెంటర్ టేబుల్ వాడకం లివింగ్ రూమ్‌లో సాధారణమే. మ్యాగజైన్లు, వార్తా పత్రికలు పెట్టుకునేందుకు వీలుగా వీటికోసం ప్రత్యేకంగా షెల్ఫ్ ఉండే టేబుళ్లను ఎంచుకోండి. లివింగ్‌రూమ్‌లో ఉపయోగించే టేబుళ్లు ఒకదాంట్లో మరొకటి అమరిపోయే విధంగా ఉంటే మంచిది. ⇒ గదిని పెద్దదిగా కన్పించేలా చేయడంలో అద్దాన్ని మించిన సాధనం మరోటి లేదు. వెనకవైపు పచ్చని మొక్కలున్న కిటికీకి ఎదురుగా అద్దం అమరిస్తే.. ఇంటి వెలుపల ఉన్న ఆహ్లాదభరిత వాతావరణాన్ని లోపలికి తీసుకువస్తున్న భావన కలుగుతుంది. ⇒ టేబుల్ కింద ఖాళీ స్థలాన్ని అలా వదిలేయకుండా.. షెల్ఫ్ ఏర్పాటు చేసుకుంటే, ఏవైనా పెట్టుకోవడానికి అక్కరకొస్తుంది. అవి బయటకు కన్పించకుండా పైన ఓ టేబుల్ క్లాత్ వేయండి. ⇒ గది చిన్నదిగా ఉంటే పార్టిషన్ జోలికి వెళ్లకండి. ఇలా చేస్తే మరింత చిన్నదిగా కన్పిస్తుంది. ⇒ లివింగ్ రూమ్‌లో మడిచిపెట్టడానికి అనువుగా ఉండే కుర్చీలు, టేబుళ్లు, సోఫాకమ్ బెడ్, బీన్ బ్యాగ్‌లు వంటి ఫర్నిచర్ నప్పుతాయి. -
వారే...వ్వాల్
ఇంటిప్స్ వర్క్ ఏరియా, పిల్లలు ఆడుకునే ప్లేస్, చదువుకునే స్థలం ఏదైనా ఒకే గదిలో రకరకాల మూడ్స్‌ని క్రియేట్ చేయాలంటే మంచి ఛాయిస్ వాల్‌పేపర్స్. గోడకు వేసిన రంగును మార్చేయడం వీలు కావట్లేదు అనుకుంటే సింపుల్‌గా నచ్చిన వాల్పేపర్ని తెచ్చి అతికిస్తే సరి. లివింగ్ రూమ్, డైనింగ్ హాల్, బెడ్రూమ్... ప్రతి గదీ ఓ కొత్తగా కనిపించాలంటే డిజైన్‌లో, ప్యాట్రన్‌లో, రంగులో విభిన్న తరహాలలో ఉన్న వాల్పేపర్స్ని ఎంచుకోవాలి. సీజన్‌కు తగ్గ వాల్‌పేపర్స్ కంటికి, మనసుకు ఆహ్లాదాన్ని ఇస్తాయి. వాల్‌పేపర్స్‌పై పడిన మరకలు పోగొట్టడం చాలా సులువు. గోరువెచ్చని నీటిలో డిటర్జంట్ పౌడర్ వేసి స్పాంజితో అద్ది తుడవాలి. ఆ తర్వాత మెత్తని వస్త్రంతో తుడిస్తే, డల్ అయిన వాల్‌పేపర్స్ కొత్త కళతో మెరిసిపోతాయి.ఇద్దరు పిల్లలున్న ఇంట్లో చెరో గదిని కేటాయించడం వీలు కాకపోతే పార్టిషన్ చేసి వారికి నచ్చిన వాల్‌పేపర్‌తో కవర్ చేయడం సులువైన కిటుకు. కిచెన్, బాత్రూమ్స్ నీరు, చెమ్మ ఎక్కువగా తగిలే చోట్లు. అందుకని ఈ గదులలో వాల్పేపర్స్ని వాడకపోవడమే మంచిది. -
ఉన్నంతలో ఉన్నతంగా..
స్థిరాస్తులకు సంబంధించి మీ సందేహాలు మాకు రాయండి. సాక్షి, హైదరాబాద్ : ఇంట్లో స్థలాన్ని ఎలాగూ పెంచలేం. అలాగనీ అవసరాలకు తగ్గ ఫర్నీచర్‌ను సమకూర్చుకోకుండా ఉండలేం కదా? ఉన్నంతలో స్థలాన్ని సద్వినియోగం చేసుకోవడమే ఇందుకు పరిష్కారం. దాని కోసం కొన్ని చిట్కాలు పాటిస్తే చాలని నిపుణులు సూచిస్తున్నారు. ► తలుపు తీయగానే పెద్దపెద్ద వస్తువులు కన్పిస్తే.. మీ ఇల్లు చిన్నదిగా కన్పిస్తుంది. లివింగ్ రూమ్ ప్రవేశ ద్వారం ముందు పెద్ద మొత్తంలో ఫర్నిచర్ ఉండకుండా చూసుకోవాలి. ► లివింగ్ రూమ్‌కు ఉన్న ద్వారాల మధ్య తిరగడానికి ఎలాంటి అవాంతరాలు లేకుండా చూసుకోండి. అంటే.. మధ్యలో కుర్చీలు ఉంటే వాటి చుట్టూ తిరిగి వెళ్లడం లాంటివి అన్నమాట. ► సోఫాలు, కుర్చీలన్నింటినీ ఒకే వరుసలో, గోడకు పక్కన ఏర్పాటు చేయకండి. సీట్లు ఒకదానికోటి ఎదురెదురుగా, కనీసం నాలుగు నుంచి పది అడుగుల దూరంతో ఉంటే బావుంటుంది. ► బరువుగా ఉండే ఫర్నిచర్ మొత్తాన్ని గదిలో ఒకే వైపు పెట్టొద్దు. ఇలా చేస్తే సీటింగ్ ఏర్పాటులో సమతుల్యత దెబ్బతింటుంది. ► కాఫీ టేబుల్, సెంటర్ టేబుల్ వాడకం లివింగ్ రూమ్‌లో సాధారణమే. మ్యాగజైన్లు, వార్త పత్రికలు పెట్టుకునేందుకు వీలుగా వీటికోసం ప్రత్యేకంగా షెల్ఫ్ ఉండే టేబుళ్లను ఎంచుకోండి. లివింగ్‌రూమ్‌లో ఉపయోగించే టేబుళ్లు ఒకదాంట్లో మరోటి అమరిపోయే విధంగా ఉంటే మంచిది. ► గదిని పెద్దదిగా కన్పించేలా చేయడంలో అద్దాన్ని మించిన సాధనం మరోటి లేదు. వెనకవైపు పచ్చని మొక్కలున్న కిటికీకి ఎదురుగా అద్దం అమరిస్తే.. ఇంటి వెలుపల ఉన్న ఆహ్లాదభరిత వాతావరణాన్ని లోపలికి తీసుకువస్తున్న భావన కలుగుతుంది. ► టేబుల్ కింద ఖాళీ స్థలాన్ని అలా వదిలేయకుండా.. షెల్ఫ్ ఏర్పాటు చేసుకుంటే, ఏవైనా పెట్టుకోవడానికి అక్కరకొస్తుంది. అవి బయటకు కన్పించకుండా పైన ఓ టేబుల్ క్లాత్ వేయండి. ► గది చిన్నదిగా ఉంటే పార్టిషన్ జోలికి వెళ్లకండి. ఇలా చేస్తే మరింత చిన్నదిగా కన్పిస్తుంది. -
సర్దుబాటుతో విశాలంగా
సాక్షి, హైదరాబాద్: ఇంట్లో స్థలాన్ని ఎలాగూ పెంచలేం. అలాగనీ అవసరాలకు తగ్గ ఫర్నీచర్‌ను సమకూర్చుకోకుండా ఉండలేం కదా? ఉన్నంతలో స్థలాన్ని సద్వినియోగం చేసుకోవడమే ఇందుకు పరిష్కారం. దాని కోసం కొన్ని చిట్కాలు పాటిస్తే చాలు... తలుపు తీయగానే పెద్దపెద్ద వస్తువులు కన్పిస్తే.. మీ ఇల్లు చిన్నదిగా కన్పిస్తుంది. లివింగ్ రూమ్ ప్రవేశ ద్వారం ముందు పెద్ద మొత్తంలో ఫర్నిచర్ ఉండకుండా చూసుకోవాలి. లివింగ్ రూమ్‌కు ఉన్న ద్వారాల మధ్య తిరగడానికి ఎలాంటి అవాంతరాలు లేకుండా చూసుకోండి. అంటే.. మధ్యలో కుర్చీలు ఉంటే వాటి చుట్టూ తిరిగి వెళ్లడం లాంటివి అన్నమాట. సోఫాలు, కుర్చీలన్నింటినీ ఒకే వరుసలో, గోడకు పక్కన ఏర్పాటు చేయకండి. సీట్లు ఒకదానికోటి ఎదురెదురుగా, కనీసం నాలుగు నుంచి పది అడుగుల దూరంతో ఉంటే బావుంటుంది. బరువుగా ఉండే ఫర్నిచర్ మొత్తాన్ని గదిలో ఒకే వైపు పెట్టొద్దు. ఇలా చేస్తే సీటింగ్ ఏర్పాటులో సమతుల్యత దెబ్బతింటుంది. కాఫీ టేబుల్, సెంటర్ టేబుల్ వాడకం లివింగ్ రూమ్‌లో సాధారణమే. మ్యాగజైన్లు, వార్తా పత్రికలు పెట్టుకునేందుకు వీలుగా వీటికోసం ప్రత్యేకంగా షెల్ఫ్ ఉండే టేబుళ్లను ఎంచుకోండి. లివింగ్‌రూమ్‌లో ఉపయోగించే టేబుళ్లు ఒకదాంట్లో మరోటి అమరిపోయే విధంగా ఉంటే మంచిది. గదిని పెద్దదిగా కన్పించేలా చేయడంలో అద్దాన్ని మించిన సాధనం మరోటి లేదు. వెనకవైపు పచ్చని మొక్కలున్న కిటికీకి ఎదురుగా అద్దం అమరిస్తే.. ఇంటి వెలుపుల ఉన్న ఆహ్లాదభరిత వాతావరణాన్ని లోపలికి తీసుకువస్తున్న భావన కలుగుతుంది. టేబుల్ కింద ఖాళీ స్థలాన్ని అలా వదిలేయకుండా.. షెల్ఫ్ ఏర్పాటు చేసుకుంటే, ఏవైనా పెట్టుకోవడానికి అక్కరకొస్తుంది. అవి బయటకు కన్పించకుండా పైన ఓ టేబుల్ క్లాత్ వేయండి. గది చిన్నదిగా ఉంటే పార్టిషన్ జోలికి వెళ్లకండి. ఇలా చేస్తే మరింత చిన్నదిగా కన్పిస్తుంది. లివింగ్ రూమ్‌లో మడిచిపెట్టడానికి అనువుగా ఉండే కుర్చీలు, టేబుళ్లు, సోఫాకమ్ బెడ్, బీన్ బ్యాగ్‌లు వంటి ఫర్నిచర్ నప్పుతాయి.