తక్కువ బడ్జెట్‌లో ఇంటి అలంకరణ.. వావ్‌ అనాల్సిందే! | Sankranti 2023: Home and Living Room Decoration For Festivals | Sakshi
Sakshi News home page

తక్కువ బడ్జెట్‌లో ఇంటి అలంకరణ.. వావ్‌ అనాల్సిందే!

Published Mon, Jan 16 2023 3:58 PM | Last Updated on Mon, Jan 16 2023 3:58 PM

Sankranti 2023: Home and Living Room Decoration For Festivals - Sakshi

పండగను ప్రత్యేకంగా జరుపుకోవాలనే తపన అందరిలోనూ ఉంటుంది. అందుకు తగినట్టుగా ఇంటి అలంకరణను ఎంచుకుంటారు. అయితే, పండగ కళ అందరికన్నా బాగా కనపడాలని కోరుకునేవారికి డెకార్‌ నిపుణులు ఈ సూచనలు చేస్తున్నారు. 


ఫ్యాబ్రిక్‌తో డిజైన్‌.. 

కర్టెన్లు, చీరలు, దుపట్టాలు లేదా ఏదైనా ఫాబ్రిక్‌ని ఉపయోగించి మీ లివింగ్‌రూమ్‌ని అందంగా మార్చుకోవచ్చు. ఇందుకు పండగ థీమ్‌తో బాగా సరియే డిజైన్‌ లేదా ప్రింట్‌ని ఎంచుకోవాలి. రంగవల్లికలైనా, ఇంటి అలంకరణలో డిజైన్‌ని మెరుగుపరచడానికైనా పువ్వులు, లైటింగ్‌ ఎంపికలు, బెలూన్‌ లను వాడచ్చు. 

గాలిపటం
గాలిపటాలు ఎగురవేసిన జ్ఞాపకాలు మీలో ఉండే ఉంటాయి. అయితే, గాలిపటాలు ఎగురవేయడాన్ని మీ ఇంటి వెలుపలికి ఎందుకు పరిమితం చేయాలి? ఈసారి ఇంటిని పండగ కళ నింపేలా ఒక వాల్‌ని పతంగులతో అలంకరించండి. 


ఆకులతో..

భోగి, సంక్రాంతి శ్రేయస్సుకు వేడుకలు. అందుకే ప్రధాన రంగు ఆకుపచ్చ తప్పక ఉంటుంది. మామిడి ఆకులు పొంగల్‌ వేడుకలలో అత్యంత ముఖ్యమైన అంశాలలో ఒకటి. వీటిని మీ ద్వారం వద్ద వేలాడదీయచ్చు. మామిడి ఆకులు శుభప్రదానికి, సంతోషానికి సూచికలు. పర్యావరణ అనుకూలమైనవి. మామిడి ఆకులు, ఇతర పువ్వులతో కలిపి చేసే అలంకరణ కూడా చూడముచ్చటగా ఉంటుంది. 

వెదురు బుట్టలు
కొన్నిరకాల చిన్న చిన్న బుట్టలను ఎంపిక చేసుకోవాలి. వాటి చివర్లను పువ్వులు లేదా ఇతర టాసిల్స్‌తో జత చేయాలి. వాటిని గొడుగులా ఔట్‌ డోర్‌ లేదా బాల్కనీ ఏరియాలో వేలాడదీయవచ్చు.  


తక్కువ బడ్జెట్‌

అలంకరణకు తక్కువ బడ్జెట్‌లో పర్యావరణకు అనుకూలమైనవి, తిరిగి భద్రపరుచుకునేవి ఎంపిక చేసుకుంటే పండగ సంబరం మరింత పెరుగుతుంది. ఇందుకు ఖరీదైన వస్తువులను కొనడం అవసరం లేదు. ప్రాథమిక అలంకరణలపై దృష్టి పెడితే చాలు. వాటిలో... 

స్కాచ్‌ టేప్, సేఫ్టీ పిన్స్‌ లేదా అతికించడానికి గ్లూ, కట్టర్‌ లేదా కత్తెర వంటివి సిద్ధం చేసుకోవాలి. 

ప్రతి ప్రయత్నమూ మిమ్మల్ని విసిగిస్తే సింపుల్‌గా బెలూన్లను ఎంపిక చేసుకోవచ్చు. వీటి నిర్వహణ కూడా పెద్ద కష్టం కాదు. రంగు రంగుల బెలూన్లు రెండు మూడు కలిపి, గుచ్చంలా వాల్‌కి ఒక్కో చోట అతికించవచ్చు. లేదా హ్యాంగ్‌ చేయవచ్చు.  

ప్రతి పూజలో పువ్వులు ముఖ్యమైన భాగం. కాబట్టి, మీ ఇంటికి కొన్ని తాజాపూలను ముందుగానే కొనుగోలు చేయండి. పూలతో ఎన్ని అలంకరణలైనా చేయచ్చు. 

పండుగలలో ఏదైనా తీపిని తినడం మంచి శకునంగా భావిస్తారు. అలాగే, స్వయంగా చేసినవైనా, కొనుగోలు చేసినవైనా కొన్ని రకాల తీపి పదార్థాలను అందుబాటులో ఉంచాలి. 

పండగ సమయాల్లో ప్రకాశంతమైన రంగు దుస్తులు బాగుంటాయి. వాటిలో మంచి పచ్చ, పసుపు, మెరూన్, పింక్‌.. ఎంచుకోవాలి. (క్లిక్ చేయండి: పండగ రోజు ట్రెడిషనల్‌ లుక్‌ కోసం ఇలా చేయండి..)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement