Bamboo basket.
-
కేన్ క్రాఫ్ట్! ఆకట్టుకునే ఆకృతులు.. పర్యావరణ స్నేహితులు!
సాక్షి, సిటీబ్యూరో: నడిరోడ్డుపైన కొలువుదీరిన ఉత్పత్తులు చేతి వృత్తుల నైపుణ్యానికి అద్దం పడుతున్నాయి. కాదేదీ సృజనకు అనర్హం అన్నట్టు వెదురు, కేన్లను ఉపయోగించి వివిధ రకాల ఆకృతుల్లో ఉత్పత్తులను తీర్చిదిద్దుతున్నారు. ఈ ఉత్పత్తులు అందానికీ, వైవిధ్యానికి పట్టం గడుతున్నాయి. ఖరీదైన మాల్స్‌లో మాత్రమే కాదు కచ్చా రోడ్లపై కూడా షాపింగ్ ప్రియుల్ని కట్టిపడేస్తున్నాయి. ముఖ్యంగా వెదురు, కేన్‌తో తయారు చేసిన బుట్టలు, బ్యాగ్‌లు, ఇతర ఉత్పత్తులు నగరవాసుల మది దోచుకుంటున్నాయి. తయారీ నైపుణ్యంతో పాటు అందుబాటు ధరల్లో ఉండటంతో వీటి విక్రయాలు జోరుగా సాగుతున్నాయి.రూ.200 నుంచి రూ.25 వేల వరకూ..ఒకొక్కటీ సుమారుగా రూ.200 నుంచి గరిష్టంగా రూ.25 వేల వరకూ ఉంటాయని తయారీదారులు చెబుతున్నారు. ఎన్ని మార్కెట్లు ఉన్నా మా వినియోగదారులు మాకున్నారంటున్నారు. చేసే పనిలో నైపుణ్యం ఉండాలే గాని ప్లాస్టిక్, ఫ్యాబ్రిక్, ఫైబర్, వంటివి ఎన్ని మోడల్స్ వచి్చనా సంప్రదాయ కళలకు ప్రజాదరణ ఉంటుందని ప్రత్యక్షంగా తెలుసుకోవచ్చు.ఇదే జీవనాధారం.. పశ్చిమగోదావరి జిల్లా నుంచి హైదరాబాద్ వచి్చన ఓ కుటుంబం సంప్రదాయ హస్తకళనే జీవనాధారంగా చేసుకుంది. రామానాయుడు స్టూడియో నుంచి కిందికి వెళ్లే రోడ్డులో ఫుట్‌పాత్‌పై ఈ ఉత్పత్తులు మన ముందే తయారు చేసి విక్రయిస్తున్నారు. పూలు, పండ్లు, ఇతర పూజా సామాగ్రి తీసుకెళ్లేందుకు వినియోగించే బుట్టల నుంచి గార్డెన్లో విద్యుత్తులైట్లు అమర్చుకునేందుకు వివిధ ఆకృతుల్లో బుట్టలు, లాంతరు లైట్లు, తయారుచేస్తున్నారు. లాంతరు లైట్లు, మూత ఉన్న బుట్టలు, గంపలు, పెద్దపెద్ద హాల్స్‌లో అలంకరణ కోసం పెట్టుకునే పలు రకాల వస్తువులను అక్కడికక్కడే తయారుచేసి అందిస్తున్నారు. వీటిని విభిన్నమైన రంగులతో అందంగా తీర్చిదిద్దుతున్నారు.పర్యావరణ హితం కోసం.. వెదురుతో పర్యావరణ హితమైన వస్తువులను తయారు చేస్తున్నాం. మా కుటుంబానికి వంశపారంపర్యంగా వస్తున్న కళ ఇది. మాకు ఇదే జీవనాధారం. వివిధ ఆకృతుల్లో అందంగా, ఆకట్టుకునే వస్తువులను తీర్చిదిద్దుతున్నాం. వస్తువు తయారీకి ఉపయోగించిన ముడిసరుకును బట్టి దాని ధర నిర్ణయిస్తాం. పెద్దగా ఆశలు పెట్టుకోవడం లేదు. కూలి గిట్టుబాటు అయితే చాలనుకుంటాం. ఫలితంగా అందరికీ అందుబాటైన ధరలోనే వస్తువులు లభిస్తాయి. రోజు పదుల సంఖ్యలో వస్తువులు అమ్మకాలు జరుగుతున్నాయి. – రమేష్, తయారీదారుడు, జూబ్లిహిల్స్ -
తక్కువ బడ్జెట్లో ఇంటి అలంకరణ.. వావ్ అనాల్సిందే!
పండగను ప్రత్యేకంగా జరుపుకోవాలనే తపన అందరిలోనూ ఉంటుంది. అందుకు తగినట్టుగా ఇంటి అలంకరణను ఎంచుకుంటారు. అయితే, పండగ కళ అందరికన్నా బాగా కనపడాలని కోరుకునేవారికి డెకార్ నిపుణులు ఈ సూచనలు చేస్తున్నారు. ఫ్యాబ్రిక్‌తో డిజైన్.. కర్టెన్లు, చీరలు, దుపట్టాలు లేదా ఏదైనా ఫాబ్రిక్‌ని ఉపయోగించి మీ లివింగ్‌రూమ్‌ని అందంగా మార్చుకోవచ్చు. ఇందుకు పండగ థీమ్‌తో బాగా సరియే డిజైన్ లేదా ప్రింట్‌ని ఎంచుకోవాలి. రంగవల్లికలైనా, ఇంటి అలంకరణలో డిజైన్ని మెరుగుపరచడానికైనా పువ్వులు, లైటింగ్ ఎంపికలు, బెలూన్ లను వాడచ్చు. గాలిపటం గాలిపటాలు ఎగురవేసిన జ్ఞాపకాలు మీలో ఉండే ఉంటాయి. అయితే, గాలిపటాలు ఎగురవేయడాన్ని మీ ఇంటి వెలుపలికి ఎందుకు పరిమితం చేయాలి? ఈసారి ఇంటిని పండగ కళ నింపేలా ఒక వాల్ని పతంగులతో అలంకరించండి. ఆకులతో.. భోగి, సంక్రాంతి శ్రేయస్సుకు వేడుకలు. అందుకే ప్రధాన రంగు ఆకుపచ్చ తప్పక ఉంటుంది. మామిడి ఆకులు పొంగల్ వేడుకలలో అత్యంత ముఖ్యమైన అంశాలలో ఒకటి. వీటిని మీ ద్వారం వద్ద వేలాడదీయచ్చు. మామిడి ఆకులు శుభప్రదానికి, సంతోషానికి సూచికలు. పర్యావరణ అనుకూలమైనవి. మామిడి ఆకులు, ఇతర పువ్వులతో కలిపి చేసే అలంకరణ కూడా చూడముచ్చటగా ఉంటుంది. వెదురు బుట్టలు కొన్నిరకాల చిన్న చిన్న బుట్టలను ఎంపిక చేసుకోవాలి. వాటి చివర్లను పువ్వులు లేదా ఇతర టాసిల్స్తో జత చేయాలి. వాటిని గొడుగులా ఔట్ డోర్ లేదా బాల్కనీ ఏరియాలో వేలాడదీయవచ్చు. తక్కువ బడ్జెట్ అలంకరణకు తక్కువ బడ్జెట్లో పర్యావరణకు అనుకూలమైనవి, తిరిగి భద్రపరుచుకునేవి ఎంపిక చేసుకుంటే పండగ సంబరం మరింత పెరుగుతుంది. ఇందుకు ఖరీదైన వస్తువులను కొనడం అవసరం లేదు. ప్రాథమిక అలంకరణలపై దృష్టి పెడితే చాలు. వాటిలో... స్కాచ్ టేప్, సేఫ్టీ పిన్స్ లేదా అతికించడానికి గ్లూ, కట్టర్ లేదా కత్తెర వంటివి సిద్ధం చేసుకోవాలి. ప్రతి ప్రయత్నమూ మిమ్మల్ని విసిగిస్తే సింపుల్‌గా బెలూన్లను ఎంపిక చేసుకోవచ్చు. వీటి నిర్వహణ కూడా పెద్ద కష్టం కాదు. రంగు రంగుల బెలూన్లు రెండు మూడు కలిపి, గుచ్చంలా వాల్కి ఒక్కో చోట అతికించవచ్చు. లేదా హ్యాంగ్ చేయవచ్చు. ప్రతి పూజలో పువ్వులు ముఖ్యమైన భాగం. కాబట్టి, మీ ఇంటికి కొన్ని తాజాపూలను ముందుగానే కొనుగోలు చేయండి. పూలతో ఎన్ని అలంకరణలైనా చేయచ్చు. పండుగలలో ఏదైనా తీపిని తినడం మంచి శకునంగా భావిస్తారు. అలాగే, స్వయంగా చేసినవైనా, కొనుగోలు చేసినవైనా కొన్ని రకాల తీపి పదార్థాలను అందుబాటులో ఉంచాలి. పండగ సమయాల్లో ప్రకాశంతమైన రంగు దుస్తులు బాగుంటాయి. వాటిలో మంచి పచ్చ, పసుపు, మెరూన్, పింక్.. ఎంచుకోవాలి. (క్లిక్ చేయండి: పండగ రోజు ట్రెడిషనల్ లుక్ కోసం ఇలా చేయండి..) -
Interior Decor: చేటలో ప్లాంట్.. బాల్కనీకి పల్లె సొగసు.. వెదురు అందం!
సహజంగా దొరికేవన్నీ ఆరోగ్యాన్ని, అందాన్ని ఇనుమడింపజేసేవే.. ఒంటికైనా.. ఇంటికైనా! ఆ జాబితాలోనిదే వెదురు కూడా. ఇప్పుడు గృహాలంకరణలో భాగమై ఇంటి అందాన్ని పెంచుతోంది. ఎలాగో చూద్దాం.. బాల్కనీకి పల్లె సొగసు ఆత్మీయులు.. సన్నిహితులు ఎవరైనా ఈ వేసవి సీజన్లో మామిడి పండ్లనో.. లేక ఈ కాలంలో దొరికే ఇంకే పళ్లనో వెదురు బుట్టలో పెట్టి కానుకగా పంపింస్తుంటారు కదా! ఖాళీ అయిన ఆ బుట్టను మూలన పడేయకుండా ఇలా వాల్ డెకార్‌కి వాడుకోవచ్చు. బాల్కనీలోకి పల్లె ఇంటి ఆవరణను తీసుకురావచ్చు. చేటలో ప్లాంట్ ప్లాస్టిక్ చేటలతో గడిపేస్తున్న కాలం ఇది. వెదురుతో అల్లిన చేట నిరుపయోగంగా కనిపిస్తుంటే ఇదిగో ఇలా ఓ మొక్కతో దాన్ని గోడ మీదకు చేర్చండి. ఆ గోడకు క్లాసీ లుక్‌నే కాదు.. ఇంటికొచ్చే అతిథులకూ మీ రిచ్ టేస్ట్‌ను చూపిస్తుంది. వేస్ట్ బుట్ట బెస్ట్ విడిచిన బట్టలు వేయడానికి, ఇంట్లో చెత్తను గుమ్మరించడానికి ప్లాస్టిక్ బాస్కెట్లనే ఎక్కువగా ఉపయోగిస్తున్న ఉన్నాం. అవి విరిగినా, రంగు వెలసినా స్క్రాప్ షాప్‌కి వెళ్లిపోతుంటాయి. అలా వేస్ట్ అనుకున్న ప్లాస్టిక్, ఐరన్ బాస్కెట్లను నార తాడుతో చుట్టి, లేదా గ్లూతో అతికించి అలంకరణ వస్తువుగా మార్చేసుకోవచ్చు. వీటిలో ఇండోర్‌ప్లాంట్స్ పెడితే నిండే పచ్చదనం.. ఇంటిని చల్లగా ఆహ్లాదకరంగా ఉంచుతుంది. అంటే వేస్ట్‌ను కూడా బెస్ట్‌గా మార్చి వ్యర్థాలు పెరగకుండా ప్రకృతిని కాపాడవచ్చన్నమాట. కాదేదీ అలంకరణకు అనర్హం అన్నట్టుగా ఇలా ఈ వెదురు బుట్టలు, చేటలతో ఇంటికి ప్రకృతిని ఆహ్వానించ వచ్చు.. పచ్చదనాన్ని పదిలం చేసుకోవచ్చు. లేదంటే రంగుల కళతోనూ వెలుగులు నింపచ్చు. చదవండి: Miniature Garden: టీ కప్పులో వనాలు పెంచండిలా! -
వెదురు బుట్ట.. దాహం తీరుస్తుంది!
ప్రపంచవ్యాప్తంగా గుక్కెడు నీళ్లు అందనివారు.. 76 కోట్ల మంది! కలుషిత నీరు తాగుతూ రోజూ 1,400 మంది పసిపిల్లలు చనిపోతున్నారు! ఈ ఆధునిక యుగంలోనూ ఇంత దారుణమా? హైటెక్ పద్ధతులతో ఈ సమస్యను పరిష్కరించవచ్చు కదా? అనుకుంటున్నారా? అయితే అందుకు హైటెక్ పద్ధతులూ అవసరం లేదు.. ఓ వెదురు బుట్ట.. కొంచెం ప్లాస్టిక్ ముక్క ఉంటే చాలు.. రోజూ కనీసం వంద లీటర్ల స్వచ్ఛమైన తాగునీటిని అందించవచ్చంటున్నారు డిజైనర్ అర్టూరూ విట్టోరి! 30 అడుగుల ఎత్తుతో ఓ వెదురు బుట్టను నిర్మించి దాని లోపలి భాగంలో నైలాన్, పాలీప్రొపెలీన్ ప్లాస్టిక్ తెరను ఏర్పాటు చేస్తే చాలు.. గాలిలో ఉండే తేమనే నీటిబొట్లుగా మారి కింద ఉన్న పాత్రలోకి చేరతాయని ఆయ న చెబుతున్నారు. చల్లటి నీళ్లు ఉన్న గాజు గ్లాస్‌కు బయటిభాగంలో నీటి బిందువులు ఏర్పడినట్లు అన్నమాట. ‘వర్కా వాటర్ టవర్స్’ అని పేరు పెట్టిన ఈ నీటి సేకరణ బుట్టలను ఆఫ్రికాలోని వర్కా వృక్షాల స్ఫూర్తితో తాను డిజైన్ చేశానని విట్టోరి తెలిపారు. ఇథియోపియా వంటి దేశాల్లో మంచినీటి కోసం నానా కష్టాలూ పడుతున్నారని, మహిళలు మైళ్లకొద్దీ నడిచి వెళ్లినా గుక్కెడు నీరు దొరకని పరిస్థితులున్నాయని విట్టోరి ఆవేదనతో చెబుతారు. ఈ ప్రాంతాల్లో నేల మొత్తం రాతిపొరలతో ఉండటం, భూగర్భ జలాలు 1,500 అడుగుల లోతులో ఉండటం వల్ల బోరుబావులు వేయడమూ కష్టమేనని, అందుకే తాను వర్కా వాటర్ టవర్స్‌ను రూపొందించానని వివరించారు. ఒక్కో టవర్ నిర్మాణానికి రూ.30 వేల వరకూ ఖర్చవుతుందని, వచ్చే ఏడాదే ఇథియోపియాలో రెండు వర్కా టవర్లు ఏర్పాటు చేస్తానని అంటున్నారు విట్టోరి!